నటితో ప్రియాంక చోప్రా తమ్ముడి డేటింగ్‌! | Neelam Upadhyay Birthday Wish For Siddharth Chopra Love Your Nights In | Sakshi
Sakshi News home page

నీకు వేరే చాయిస్‌ లేదు సిద్ధార్థ్‌‌‌ చోప్రా: నటి

Published Tue, Jul 14 2020 9:22 PM | Last Updated on Tue, Jul 14 2020 9:41 PM

Neelam Upadhyay Birthday Wish For Siddharth Chopra Love Your Nights In - Sakshi

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్‌ చోప్రా గత కొంతకాలంగా నటి నీలం ఉపాధ్యాయతో డేటింగ్‌ చేస్తున్నట్లు బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ నీలం సిద్ధార్థ్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆదివారం అతడి పుట్టినరోజు సందర్భంగా.. ‘‘నీకు నేనెంతో కృతజ్ఞురాలినై ఉంటాను. కలిసి లేస్‌ తింటూ, నాకు నచ్చిన, అంతగా క్వాలిటీ లేని షోలను చూస్తూ(ఎందుకంటే నీకు వేరే చాయిస్‌ ఉండదు గనుక) గడిపిన ఆ రాత్రులు నాకెంతో ఇష్టం. అంతేగాకుండా నీతో కలిసి భోజనం చేయడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం కూడా చాలా ఇష్టం. నాలో దాగున్న పరిపూర్ణ వ్యక్తిని వెలికితీసేందుకు నువ్వు చేసే ప్రయత్నాలు, ఎల్లవేళలా నన్ను ప్రోత్సహించే నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు లభించిన వరం. హ్యాపీ బర్త్‌డే సిద్ధార్థ్‌ చోప్రా’’ అంటూ అతడిపై ప్రేమను చాటుకున్నారు. (భర్త రాజీవ్‌ వ్యాఖ్యలను ఖండించిన నటి)

ఈ క్రమంలో.. ‘‘మీరిద్దరు చాలా బాగున్నారు. అయితే తొందరగా పెళ్లి చేసుకోండి. లేదంటే అతడి మనసు మారిపోవచ్చు. ఎందుకంటే అతడు అంతగా నమ్మదగిన వాడు కాదు’’ అంటూ నెటిజన్లు నీలంను హెచ్చరిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సిద్ధార్థ్‌ కొంతకాలం కిందట తన స్నేహితురాలు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కొన్నిరోజుల ముందే ఆమెకు బ్రేకప్‌ చెప్పి.. పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత నీలంతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. గణేశ్‌ చతుర్థి, హోలి వంటి పండుగ సమయాల్లో చోప్రా కుటుంబ సభ్యులతో కలిసి నీలం ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చినప్పటికీ.. వీరి బంధం గురించి చోప్రా కుటుంబ సభ్యులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కాగా నీలం మిస్టర్‌ 7 అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అల్లరి నరేశ్‌ యాక్షన్‌ 3డీ మూవీలో నటించడంతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ కనిపించారు.(అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement