Priyanka Chopra
-
రెడ్ శారీలో విష్ణు ప్రియ.. యానిమల్ బ్యూటీ ప్యాషన్ లుక్!
బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ జ్యోతి పూర్వాజ్...రెడ్ శారీలో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..భర్త నిక్ జోనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా చిల్..యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఫ్యాషన్ లుక్..ప్రకృతి పచ్చదనాన్ని ఆస్వాదిస్తోన్న బిగ్‌బాస్ ముద్దుగుమ్మ అశ్విని శ్రీ.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
రాజమౌళి, ప్రియాంక చోప్రా ప్రత్యేక లేఖ విడుదల..
-
కొరాపుట్‌లో SSMB29.. మహేష్‌బాబుతో ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు (ఫోటోలు)
-
'ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యా'.. మహిళపై ప్రియాంక చోప్రా ప్రశంసలు
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ మూవీతో బిజీగా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తి కావడంతో ప్యాకప్ చెప్పేశారు. దీంతో చిత్రబృందంతో పాటు ప్రియాంక చోప్రా ముంబయికి ప్రయాణమైంది. అయితే తాజాగా ఇవాళ షూటింగ్ లోకేషన్ నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా దారిలో ప్రకృతి అందాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అందులో ప్రియాంక చోప్రా ఓ వీడియోను కూడా పంచుకుంది. ఓ మహిళను చూసి తాను ఇన్స్పైర్ అయ్యానని తెలిపింది. ఆమె తనలో స్ఫూర్తి నింపిందని కొనియాడింది. అందుకే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవాలనిపించిందని తెలిపింది.(ఇది చదవండి: SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్)వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను ఇలా తరచుగా చేయను. కానీ ఈరోజు ఎందుకో నాకు చాలా స్ఫూర్తినిచ్చే సంఘటన ఎదురైంది. నేను ముంబయికి వెళ్లేక్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తున్నా. వైజాగ్ ట్రాఫిక్‌లో ఓ మహిళ జామపండ్లు అమ్ముతుండటం చూశాను. నాకు కచ్చా (పచ్చి) జామపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెంటనే ఆమెను ఆపి మీ జామపండ్లన్నింటికీ ఖరీదు ఎంత? అని అడిగాను. ఆమె 150 రూపాయలు అని చెప్పింది. నేను తనకు 200 రూపాయల నోటు ఇచ్చా. కానీ ఆమె నాకు చిల్లర ఇవ్వడానికి ప్రయత్నించింది. వద్దు.. దయచేసి మీరే ఉంచుకోండి అని తనతో అన్నా. ఎందుకంటే జీవనోపాధి కోసం ఆమె జామపండ్లు అమ్మింది. కానీ ట్రాఫిక్‌లో గ్రీన్ సిగ్నల్ పడేలోపే ఆమె తిరిగి వచ్చి నాకు మరో రెండు జామపండ్లు ఇచ్చింది. అంటే ఆ మహిళ నా నుంచి ఎలాంటి దాతృత్వాన్ని కోరుకోలేదు. ఆమె తీరు నిజంగా నన్ను కదిలించింది' అని పంచుకుంది.ఈ వీడియోతో పాటు ఎస్ఎస్ఎంబీ29 సెట్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇది 2019 లో విడుదలైంది. ఇటీవల సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్
గత కొన్నిరోజులు ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న మహేశ్ బాబు-రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయింది. ఈ క్రమంలో పలువురు అధికారులు, అభిమానులు టీమ్ ని కలవగా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాజమౌళి థ్యాంక్యూ నోట్ కూడా రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)మహేశ్ బాబు హీరోగా రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే హైదరాబాద్ లో షూటింగ్ మొదలుపెట్టారు కానీ ప్రకటించలేదు. ఒడిశాలోని కోరాపుట్ కొండలపై మహేశ్-పృథ్వీరాజ్-ప్రియాంక చోప్రా(Priyanka Chopra) తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా ఆ మధ్య లీకైంది.అలా వార్తల్లో నిలిచిన SSMB 29 ఇప్పుడు ఒడిశా షెడ్యూల్ ముగించుకుంది. ఈ మేరకు కోరాపుట్ హాస్పిటాలిటీకి రాజమౌళి ధన్యవాదాలు చెప్పాడు. మరిన్ని అడ్వెంచర్స్ చేసేందుకు మళ్లీ ఇక్కడికి వస్తానని అన్నాడు. దిగువన రాజమౌళి, ప్రియాంక చోప్రా సంతకాలు చేసిన ఓ నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అలానే సెట్ లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?) -
చిల్లిగవ్వ లేదు.. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పని చేశాం: హీరోయిన్
మన కలలను సాకారం చేసుకోవాలంటే.. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను భరించిన వాళ్లే. లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఎన్నో అవస్థలతో పాటు అవమానాలను ఎదుర్కొన్నవాళ్లే. అందుకు నటి దియా మీర్జా( Dia Mirza ) కూడా అతీతం కాదు. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన దియా.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందట. మోడల్‌గా రాణించేందుకు చాలా కష్టాలను భరించాల్సి వచ్చిందట. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా..చాలీ చాలని డబ్బులతోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.‘మోడలింగ్‌లోకి వెళ్తానని చెబితే ..ఫ్యామిలీ నుంచి అంతగా సపోర్ట్ అందలేదు. అయినా కూడా నా లక్ష్యం వైపే అడుగులు వేశాను. 2000లో నాతో పాటు ప్రియాంక చోప్రా(priyanka chopra), లారా దత్తా(Lara Dutta) మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాం. ప్రియాంకకు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండేది. లారాకు, నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ఉండేవాళ్లు కాదు. ముంబైలో లారా ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండేది. నేను ముంబై వెళ్లిన ప్రతిసారి ఆమె ఇంట్లోనే ఉండేదాన్ని. డబ్బులు ఉండేవి కాదు. ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఖరీదైన దుస్తులు కొనేవాళ్లం కానీ..తినడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. ఆకలి తీర్చుకోవడం కోసం నూడుల్స్ తినేవాళ్లం. మా పరిస్థితి తలుచుకొని మేమే నవ్వుకునేవాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా..తినేది మాత్రం నూడుల్స్’ అని అనుకునేవాళ్లం’ అని దియా నాటి దీన కథను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది.కాగా, 2000లో జరిగిన మిస్ ఇండియా పోటిల్లో లారా దత్తా విజేతగా నిలవగా.. ఫస్ట్ రన్నరప్‌గా ప్రియాంక, సెకండ్ రన్నరప్‌గా దియా మీర్జా నిలిచారు. 2001లో ‘రెహ్నా హై తేరే దిల్ మే’మూవీతో దియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. ఇక 2021 లో విడుదలైన ‘ వైల్డ్ డాగ్’ అనే తెలుగు సినిమాలో కూడా ఈమె నటించారు. నటిగా, మోడల్‌గా, సమాజ సేవకురాలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమెకు 2012లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ ‘గ్రీన్ అవార్డు’ లభించింది. -
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
ఒక ప్రొడక్టును సృష్టించడం కంటే.. దాని మార్కెటింగ్ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో.. సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగేవారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా #SSMB29 లీక్‌లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.సినిమా మేకింగ్‌లో రాజమౌళి(Rajamouli)ది ఢిపరెంట్ స్కూల్. హీరోలతో సహా ప్రతీ టెక్నీషియన్‌కు కార్పొరేట్ కల్చర్ తరహాలో ఐడీ కార్డు జారీ చేస్తుంటారు. సెట్స్‌కి మొబైల్స్ తేవడం బ్యాన్.. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతుంటారు. ఇలా.. ఒక సినిమా షూటింగ్ విషయంలో ఇంత జాగ్రత్తలు పాటిస్తుంటాడు దర్శకుధీరుడు. అంతెందుకు ఓ సినిమా మేకింగ్‌నే(RRR) ఏకంగా ఒక డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్ బాబుతో తీస్తున్న చిత్రం విషయంలో ఎక్కడ పారపాటు.. కాదు పొరపాట్లు జరుగుతున్నాయి?.సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరో. మళయాళ స్టార్ హీరో ఫృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్ర. ఏకంగా.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్. ఇంకా ఊహించని సర్ప్రైజ్లు ఎన్నెన్నో ఉండొచ్చు. అలాంటిది పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇలాంటి లీక్‌లతో అవన్నీ బయటకు వచ్చేయవా?..ఎక్కడో ఒడిషాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగులలో షూటింగ్ జరుపుకుంటోంది SSMB20 చిత్రం. తొలుత అక్కడి పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానెల్స్‌లో సెట్స్‌ను లాంగ్‌షాట్స్‌లో లైవ్ చూపించేశాయి. ఆ మరుసటి రోజే.. మహేష్ బాబు పాల్గొన్న షూటింగ్ సీన్.. అదీ చాలా క్లోజప్ షాట్లో బయటకు రావడం ఎంబీఫ్యాన్స్‌నే కాదు.. యావత్ చలనచిత్ర పరిశ్రమేనే షాక్‌కు గురి చేసింది . దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు చిత్ర యూనిట్ తరఫు నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది.ఆర్ఆర్ఆర్ తరహాలోనే.. మహేష్ బాబు సినిమాకు సైతం సెట్స్‌కు ఫోన్లు తేవడం నిషేధించారు. అయినప్పటికీ ఆ సీన్‌ను ఎవరు.. ఎలా షూట్ చేశారు?. అదీ అది అంత దగ్గరగా ఉండి మరీ?. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్‌లకు బయటి వాళ్లను అనుమతించరు. షూటింగ్ కోసం తెచ్చే జూనియర్ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంటాయి. అలాంటప్పుడు లీకులకు అవకాశం ఎక్కడిది?. పనిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్ బ్రేక్ చేసిందెవరు?. కొంపదీసి.. ఇది కావాలని చేసిన లీక్ కాదు కదా! అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అయితే..సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతేగానీ ఇంత చెత్తగా మాత్రం ఉండదు!. సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతతో మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు చేయిస్తాడనే విమర్శ కూడా జక్కన్న మీద ఉంది కదా. అలాంటప్పుడు భారీ బడ్జెట్‌తో.. అదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇలా ఎందుకు జరగనిస్తాడు?. ఏది ఏమైనా రాజమౌళి-మహేష్ బాబు సినిమా నుంచి.. అదీ షూటింగ్ మొదలైన తొలినాళ్లలోనే ఇలాంటి లీకులు కావడంతో.. వాట్ ద F*** అని ఒక్కసారిగా అనుకుంది టీఎఫ్ఐ అంతా. ఇంత చర్చ నడుస్తుండడంతో.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాలి మరి!.ఇదీ చదవండి: రాజమౌళికి బిగ్ షాక్.. మహేష్ బాబు వీడియో బయటకు! -
మన దేశంలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా
పేరుకే హిందీ నటి గానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఓవైపు మూవీ చేస్తూనే మరోవైపు ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేస్తోంది. రీసెంట్ గా అలా కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు ఇండెక్స్ ట్యాప్ తెలిపింది.ముంబైలోని అంధేరిలో ఉన్న ఒబెరాయ్ స్క్రై గార్డెన్ లో ప్రియాంకకు నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటినే ఏకంగా రూ.16.17 కోట్లకు విక్రయించింది. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్, 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్ విక్రయించిన వాటిలో ఉన్నాయి.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))గతంలోనూ ప్రియాంక.. మన దేశంలోని ఆస్తుల్ని విక్రయించింది. 2021లో వెర్సోవాలోని రెండు ఇళ్లను, 2023లో లోఖండ్ వాలాలోని రెండు పెంట్ హౌసులని అమ్మేసింది. ప్రస్తుతం ఈమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ లో సొంత భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం కూతురు, భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్ లో ఉంటోంది.ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. కొన్నాళ్ల క్రితం 'సిటాడెల్' అమెరికన్ వెర్షన్ లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం రాజమౌళి మూవీలో ప్రతినాయక పాత్రలో నటిస్తోందని సమాచారం. దీని షూటింగ్ ఇప్పుడు ఒడిశాలో జరుగుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
విజయ్‌తో సినిమా.. నా కూతురు అసలు ఒప్పుకోలేదు: స్టార్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల తన సోదరుడి పెళ్లిలో మెరిసిన ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో నటించనుంది. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కించబోతున్న ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక కనిపించనుంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ విచ్చేసిన ముద్దుగుమ్మ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించింది. ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసమే భాగ్యనగరానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి.అయితే ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మధు చోప్రా తన కూతురి సినీ కెరీర్ గురించి మాట్లాడింది. గతంలో దళపతి విజయ్ సరసన ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. విజయ్‌కు జంటగా తమిజాన్ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ప్రియాంక చోప్రా నో చెప్పిందని ఆమె తెలిపింది. అయితే మూవీ మేకర్స్ నా భర్తను కలిసి మాట్లాడారని వెల్లడించారు. దీంతో ఆయన మాట కాదనలేక ప్రియాంక నటించిందని అసలు విషయం చెప్పింది మధు చోప్రా.మధు చోప్రా తమిజన్ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ప్రియాంక మొదట ఆ ప్రాజెక్ట్‌కి నో చెప్పింది. కానీ వారు ప్రియాంక సోదరుడిని కలిశారు. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి మాట్లాడారు. కేవలం రెండు నెలల పాటు వేసవి సెలవుల్లో మా మూవీ షూట్‌కు సమయవివ్వండి అని అడిగారు. వారి మాట కాదనలేక ప్రియాంక చోప్రా ఫాదర్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి మాట కోసం ప్రియాంక చోప్రా నటించింది" అని తెలిపింది.విజయ్ అంటే ప్రియాంకకు చాలా గౌరవం ఉందని మధు చోప్రా తెలిపింది. విజయ్ చాలా ఓపికతో ప్రియాంకకు సెట్స్‌లో సాయం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రభుదేవా బ్రదర్ రాజు సుందరం కొరియోగ్రాఫీలో స్టెప్పులు చాలా కఠినంగా ఉన్నాయి.. విజయ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్.. అతనితో ప్రియాంక డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడిందని పేర్కొంది. అలాగే కొత్త భాష నేర్చుకోవడం, డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడంలో విజయ్ సాయం సాయం చేశాడని మధు చోప్రా గుర్తు చేసుకుంది. ఇకపోతే ప్రియాంక చోప్రా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హెడ్స్ ఆఫ్ స్టేట్‌లోనూ కనిపించనుంది. -
నా కూతుర్ని షూటింగ్‌కు పంపిస్తా.. ఏదైనా జరిగితే మాత్రం?: మహేష్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ ప్రియాంక నటిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి అందాల సుందరి కిరీటం అందుకున్నవారిలో ప్రియాంక చోప్రా స్థాయిలో తారా పధానికి చేరుకున్నవారు లేరనే చెప్పాలి. ఇంతింతై ఎదిగిన ఆమె విజయాల వెనుక ఆమె కష్టం ఎంత ఉందో...ఆమె తల్లి మధు చోప్రా కష్టం కూడా అంతే ఉందని అంటుంటారు బాలీవుడ్ జనాలు.సినిమా రంగంలో ప్రియాంక అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆమెని అనుక్షణం కంటికి రెప్పలా కాచుకున్నారు ఆమె తల్లి మధుచోప్రా. అందంతో పాటు ప్రతిభ కూడా ఉన్న తన కూతురు టాప్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు. మధ్యలో కొందరి వల్ల ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైనప్పుడు కూడా కూతురికి అండా దండా తానై ప్రియాంక కృంగిపోకుండా వెన్నంటి ఉన్నారు. సినీ హీరోయిన్లను వారి తల్లులు నీడలా అనుసరించడం కొత్త విషయం కాకపోయినా... ప్రియాంక తల్లి మధుచోప్రా.. అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించారు. తన కష్టం ఫలించి అంతర్జాతీయ స్థాయిలో తన కూతురు పేరు తెచ్చుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవడంతో మధు చోప్రా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.ఈ నేపధ్యంలో ఇటీవల పలు ఇంటర్వ్యూల సందర్భంగా ప్రియాంక సినిమా కెరీర్ గురించి మధుచోప్రా పంచుకున్నారు. అదే సమయంలో దోస్తానీ (ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం) దర్శకుడు తరుణ్ మన్షుఖానీ అప్పట్లో ఎలా ప్రవర్శించారో కూడా గుర్తు చేసుకున్నారు. దోస్తానా చిత్రంలో ప్రియాంక తరుణ్‌తో కలిసి పనిచేసినప్పుడు కొన్ని కారణాల వల్ల వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని మధు చోప్రా చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఒక రోజు ప్రియాంక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిందని, జ్వరంతో వణికిపోయిందని గుర్తుచేసుకున్నారు. తాను ఆమెకు మందులు ఇచ్చానని, అయితే మాత్రలు వేసుకున్న తర్వాత సినిమా షూటింగ్‌కు వెళదామని ప్రియాంక ప్రయత్నించగా తాను వారించానని చెప్పారు. కాస్త సమయం తీసుకో అని చెప్పానని, గంట తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో ప్రియాంక సూచనల మేరకు తాను దర్శకుడు తరుణ్‌కి ఫోన్ చేశానని వెల్లడించారు. తరుణ్‌కి ఫోన్ చేసి ప్రియాంకకు హై టెంపరేచర్ ఉన్నందున ఆ రోజు షూటింగ్‌కు రావడం కుదరదని చెప్పగా, ‘‘ మీ అమ్మాయి ఎంత సౌకర్యంగా ఉందో చెప్పండి’’ అని తరుణ్ వ్యంగ్యంగా బదులిచ్చాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు తనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చిందని దాంతో తాను అతనికి చాలా పరుషంగా మాట్లాడానని వెల్లడించారు. ‘‘ఆమె మీ షూటింగ్ సెట్లో చనిపోవాలని మీరు కోరుకుంటే, సరే... నేను ఆమెను పంపుతాను. కానీ ఆమెకు ఏదైనా జరిగితే, దానికి మీరే బాధ్యులవుతారు’’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించానన్నారు. ఇదంతా గుర్తు చేసుకున్న మధుచోప్రా... అయితే అదంతా గతమని తరుణ్, తాను ఇప్పుడు మంచి స్నేహితులమని, ఇప్పటికీ తాను తరుణ్‌ని కలిసినప్పుడల్లా అప్పటి నా కోపాన్ని గుర్తు చేస్తూ తనను ఆటపట్టిస్తుంటాడంటూ మధుచోప్రా చెప్పారు. -
మహేష్, ప్రియాంక చోప్రా పై పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరణ?
-
ఈ గుండు పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్‌గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్‌గా మారింది.ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్‌బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.ఇదీ చదవండి :బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!పసుపుతో అలెర్జీ వస్తుందా? పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్‌కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది. -
ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)
-
సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా.. కూతురిని ఎలా రెడీ చేసిందో చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక చోప్రా సోదరుడి హల్దీ వేడుక (ఫోటోలు)
-
మహేశ్ మూవీలో విలన్?
మహేశ్‌బాబు మూవీలో విలన్‌గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రా హైదరాబాద్ రావడం, కొన్ని రోజులు ఇక్కడే ఉండటం వంటి అంశాలు ఈ మూవీలో ఆమె భాగమయ్యారనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇటీవల మహేశ్–ప్రియాంక పాల్గొనగా హైదరాబాద్‌లో షూట్ జరిగింది. ఇది టెస్ట్ షూట్ అని, కాదు రెగ్యులర్ షూట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
సోదరుడికి పెళ్లి కూతురిని వెతికి పెట్టిన ప్రియాంక చోప్రా.. అదేలాగంటే?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటి వాడు కానున్నారు. తన ప్రియురాలైన నీలం ఉపాధ్యాయను ఆయన పెళ్లాడనున్నారు. ఈ పెళ్లి కోసమే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఇండియా చేరుకుంది. తాజాగా సోదరుడి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య నీలం ఉపాధ్యాయను ఓ డేటింగ్ యాప్‌లో కలిశాడని వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసిందని తెలిపింది. అయితే ఆ డేటింగ్లో యాప్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టడం మరో విశేషం. అంతేకాదు ఆమె యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.ఈ విషయంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "మేము యూఎస్‌కు చెందిన డేటింగ్ యాప్‌ను ఇండియాకు కూడా తీసుకొచ్చాం. నా సోదరుడు తన కాబోయే భార్యను మా యాప్ ద్వారానే కలిశాడు. అతనికి సరైన జోడీ దొరకడంతో నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అ తాను ఎప్పుడూ డేటింగ్ యాప్‌ను ఉపయోగించలేదని తెలిపింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కలవాలని అనుకున్నా. ఆ విధంగా నేను ఈ తరానికి చెందిన వ్యక్తిలా అనిపించకపోవచ్చు.' అని అన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రియాంక చోప్రా..ప్రియాంక తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను ట్విటర్ ద్వారా కలుసుకుంది. ప్రియాంకకు మొదట నిక్ జోనాస్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనం కలవాలని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రియాంకకు సందేశం పంపించాడు. దీంతో ఒక రోజు తర్వాత ప్రియాంక స్పందించడంతో.. ఆ తర్వాత ఇద్దరూ ఆస్కార్ వేడుక తర్వాత ఓ పార్టీలో కలుసుకున్నారు. 2017లో ఇద్దరూ కలిసి మెట్ గాలాకు హాజరయ్యారు. అనంతరం 2018 ఏడాది చివర్లో ఇండియాలోనే వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
దీపిక రికార్డ్ బద్దలు కొట్టిన ప్రియాంక?
-
ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను
‘‘నేను 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే సినిమా రంగంలోని వారు ఎలా ఉంటారనే విషయం అప్పటికి నాకు తెలియదు. ఓ దర్శకుడు నా కాస్ట్యూమ్స్ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలకి బాధపడి, డిప్రెషన్లోకి వెళ్లాను’’ అని హీరోయిన్ ప్రియాంకా చోప్రా అన్నారు. ఇటీవల జరిగిన ఓ సమ్మిట్‌లో ΄పాల్గొన్న ప్రియాంకా చోప్రా కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘటనల గురించి మాట్లాడారు. ‘‘ఓ సినిమా షూటింగ్ కోసం సెట్‌కి వెళ్లాను.నాకు ఎలాంటి దుస్తులు కావాలో నా కాస్ట్యూమ్ డిజైనర్‌కు చెప్పండి అని డైరెక్టర్‌తో అన్నాను. నా ముందే నా కాస్ట్యూమ్ డిజైనర్‌కి ఫోన్ చేసిన ఆయన... ‘కథానాయిక లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. అందుకే ప్రియాంక దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.. తన లోదుస్తులు కనిపించాలి’ అంటూ పలుమార్లు ఆ పదాన్ని ఉపయోగించాడు.ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా, బాధగా అనిపించింది. దీంతో నేను డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆ డైరెక్టర్ నన్ను చిన్నచూపు చూస్తే ఆ సినిమా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత ఆ మూవీ చేయలేదు. ఇన్నేళ్ల నా కెరీర్లో ఇప్పటివరకు కూడా ఆ దర్శకుడితో పని చేయలేదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. -
19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్
సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఇండస్ట్రీలోకి వస్తారు. అవకాశాల కోసం ఎదురు చూసి..చాన్స్ వచ్చినప్పుడే తమను తాము నిరూపించుకుంటారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించి వచ్చినవాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు అయితే చాలా ‘ఇబ్బందులను’ ఎదుర్కొవాల్సి వస్తోంది. అవకాశాల పేరుతో మోసం చేసేవాళ్లు కొంతమంది అయితే.. అవకాశం ఇచ్చి అవమానించే వారు మరికొంతమంది. ఇలాంటి వాళ్లను తట్టుకొనే ఈ స్థాయికి వచ్చానని అంటోంది గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, 19 ఏళ్ల వయసులోనే ఓ డైరెక్టర్ తన గురించి చెడుగా ప్రవర్తించాడని, ఆయన అన్న మాటలకు డిప్రెషన్లోకి వెళ్లాని చెప్పింది. నీచంగా మాట్లాడాడుతాజాగా జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో ప్రియాంక పాల్గొని కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. ‘19 ఏళ్ల వయసులో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పటికే చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓ సినిమా కోసం సెట్లోకి వెళ్లాను. దర్శకుడిని కలిసి ఇప్పుడు నాకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి మా కాస్ట్యూమ్ డిజైనర్‌కి చెప్పండి’ అని అడిగాను. అతను నా ముందే స్టైలిస్ట్ ఫోన్ చేసి నీచంగా మాట్లాడాడు.అలాంటి దుస్తులే వేసుకోవాలిఆ డైరెక్టర్ నా స్టైలిస్ట్‌కి ఫోన్ చేసి.. ‘హీరోయిన్ లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. కాబట్టి ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి. తన లోదుస్తులు కనిపించాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ పదే పదే ఆ పదాన్నే ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పడు నీచంగా అనిపించిది. చాలా బాధ కలిగింది. డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి అతడు నన్ను అంత చిన్నచూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేను అని చెప్పేశాను. ఆ మరుసటి రోజే వెళ్లి నేను ఈ సినిమా చేయలేనని చెప్పాను. ఇప్పటికీ ఆ దర్శకుడితో నేను కలిసి పని చేయలేదు. నన్ను ఎలా చూపించుకోవాలని అనేది నా ఛాయిస్. దృష్టికోణం అనేది నిజం. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.మహేశ్‌కి జోడీగాబాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంక..పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి తన మకాంని మార్చింది. 'క్వాంటికో' టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి అక్కడ అగ్ర హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈ గ్లోబల్ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ కాదా..!
-
ప్రియాంక చోప్రా..రెమ్యునరేషన్ ఇన్నికోట్ల..!
-
ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ 'అనూజ' చిత్రం
ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తాను నిర్మాతగా తెరకెక్కించిన 'అనూజ' (Anuja) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ జే గ్రేవ్స్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవిత గమనాన్ని మార్చే సినిమాగా అనూజ అందరినీ మెప్పిస్తుందని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులో తాను భాగమయ్యినందుకు గర్వపడుతున్నాని ఆమె తెలిపింది.ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో అనూజ చోటు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అనూజ చిత్రం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం తప్పకుండా అవార్డ్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు.బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. మన దేశం నుంచి రేసులో అనూజ చిత్రం ఉండటం విశేషం. -
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్‌బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్‌కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక
మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.మహేశ్‌బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్‌ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్‌కు కామెంట్ బాక్స్‌లో మహేశ్‌బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్‌లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్‌పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రాహీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్‌కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
ఆస్కార్ నామినేషన్స్‌లో ప్రియాంక చోప్రా చిత్రం.. ఏ విభాగంలో అంటే?
ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చిత్రం స్థానం దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో అనూజ చిత్రం పోటీ పడుతోంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు. దీంతో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. కాగా.. ప్రియాంక చోప్రా నిర్మాతగా తెరకెక్కించిన అనూజ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కంగువా, ది గోట్ లైఫ్ చిత్రాలకు నిరాశ.. Short on time, big on talent, here are this year's nominees for Live Action Short Film. #Oscars pic.twitter.com/Wx0TZIpUen— The Academy (@TheAcademy) January 23, 2025 -
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
రామ్ చరణ్ భార్యకు ప్రియాంక చోప్రా ధన్యవాదాలు.. ఎందుకంటే?
ప్రముఖ చిలుకూరి బాలాజీ అలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. శ్రీ బాలాజీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అంతే కాకుండా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దీంతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పని చేయనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా?మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు గతంలో తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
SSMB29 కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ప్రియాంక చోప్రా...!
-
లాస్ ఏంజెల్స్ టు హైదరాబాద్
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అందులో విషయం ఏముందీ అనుకోవచ్చు. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడ్డారు ప్రియాంక. ఇప్పుడు ఇలా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ఆమె భాగ్యనగరానికి చేరుకున్నారని టాక్. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని భోగట్టా. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. -
నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను...మీరే అసలైన హీరోలు: ప్రియాంక
అమెరికాలోని లాస్ ఏంజలెస్ కార్చిచ్చు( Los Angeles Wildfire ) సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ బూడిద పాలయ్యాయి. మంటలు ఇంకా చల్లారలేదు. ఎటు చూసినా విధ్వంసమే. లాస్ ఏంజెలెస్‌లోనే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra ) నివాసముంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్చిచ్చు సంక్షోభంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మంటలకు ఆహుతైన భవనాలను, అడవి ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.‘హృదయం భారంగా ఉంది. నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటాను. స్నేహితులు, సహచరులు ఎంతోమంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ మంటల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారు. మీరే నిజమైన హీరోలు’ అని ప్రియాంక రాసుకొచ్చింది.ఇంటితో సహా సర్వం కోల్పోయిన వారికి అంత అండగా ఉండాలని, విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి మకాంబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని హాలీవుక్కి మకాం మార్చింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. ‘సిటాడెల్ సీజన్– 1’వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె ప్రస్తుతం సీజన్ 2లో బిజీగా ఉన్నారు.రాజమౌళీ- మహేశ్ సినిమాలో హీరోయిన్గా ప్రియాంకమహేశ్బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా ప్రియాంకా చోప్రా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. 2002లో తమిళ చిత్రం ‘తమిళన్’ హీరోయిన్గా పరిచమైన ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయింది. రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
బికినీలో ప్రియాంక చోప్రా.. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మహేశ్‌బాబు - రాజమౌళి సినిమాలో స్టార్ హీరోయిన్
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.గ్లోబల్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
'ప్రియాంక.. నీ భర్తను అదుపులో పెట్టుకో!' నిక్‌పై...
సెలబ్రిటీలు చేసే కామెంట్లు, వేసే ట్వీట్లు ఏమాత్రం నచ్చకపోయినా నెటిజన్లు సోషల్ మీడియాలో రుసరుసలాడుతారు. అలా సింగర్ నిక్ జోనస్ వేసిన ట్వీట్ చూసి నెట్టింట విరుచుకుపడుతున్నారు. నీ భర్తను అదుపులో పెట్టుకో అంటూ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వార్నింగ్ ఇస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?ఎలన్ మస్క్ రాజకీయాల్లో అడుగుపెట్టి తన కంపెనీ టెస్లా పేరును తనే చేతులారా నాశనం చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ జరిగిందేంటో తెలుసా? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత టెస్లా లాభాలు పుంజుకున్నాయి అని టెస్లా ఓనర్స్ సిలికాన్ వాలీ అకౌంట్ నుంచి డిసెంబర్ 17న ఓ ట్వీట్ వేశారు. దీనికి మస్క్.. అవును, నిజమేనంటూ స్పందించాడు.నీ భర్తను అదుపులో పెట్టుకోఇది చూసిన నిక్ జోనస్.. 3000వ సంవత్సరం వరకు మమ్మల్ని మీరే నడిపించాలి అని రాసుకొచ్చాడు. ఇది కొందరికి మింగుడుపడలేదు. ట్రంప్‌కు సపోర్ట్ చేస్తున్నారా? ప్రియాంక.. దయచేసి నీ భర్తను కాస్త అదుపులో పెట్టుకో, ఏంటి? ప్రపంచ కుబేరుడు మస్క్‌కు మద్దతిస్తున్నావా? ప్రియాంక.. మరింత ఆలస్యం కాకముందే నీ భర్త చేతిలోని ఫోన్ తీసేసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Take us to the Year 3000. https://t.co/vk0sdBhrXS pic.twitter.com/CSG7ItCmES— Nick Jonas (@nickjonas) December 17, 2024చదవండి: Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది! -
రాజమౌళి-మహేశ్ మూవీలో ఇంటర్నేషనల్ బ్యూటీ!
బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, హీరో మహేశ్‌బాబుకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. అయితే ‘సిటాడెల్ సీజన్– 1’లో నటించిన ఆమె సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇక అబ్దుల్ మాజిద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళన్’ (2002) మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియాంక చోప్రా తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించకుండా కేవలం బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అయితే రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. ఒకవేళ ఆమె మహేశ్‌బాబు–రాజమౌళి కాంబో చిత్రంలో నటిస్తారన్న వార్త నిజమైతే అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. -
జలకన్యలా బిగ్‌బాస్ బ్యూటీ.. అందాలు ఆరబోస్తున్న అశ్విని శ్రీ!
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ హోయలు..రెడ్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి పోజులు..జూబ్లీహిల్స్ ఆలయంలో క్లీంకార పూజలు..శారీలో బుల్లితెర నటి విష్ణుప్రియ అందాలు..దుబాయ్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా సందడి.. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Rajitha Chowdary (@artist_rajitha) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by House Of Neeta Lulla (@houseofneetalulla) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
అమ్మా.. నేనూ నీతో వచ్చేస్తా...
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, వాళ్ల చిన్ననాటి సంగతులు తలచుకుని తల్లిదండ్రులు మురిసిపోతుండటం మామూలే. అయితే వారి హృదయాన్ని మెలిపెట్టి పశ్చాత్తానికి లోను చేసే జ్ఞాపకాలూ కొన్ని ఉంటాయి. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రాను ఇప్పటికీ బాధిస్తూ, కన్నీళ్లు పెట్టించే అలాంటి ఒక జ్ఞాపకం.. కూతురి చదువు విషయంలో తానెంతో కటువుగా ప్రవర్తించటం! ప్రియాంకను ఏడేళ్ల వయసులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు మధు చోప్రా‘‘నేను మంచి తల్లిని కాదేమో నాకు తెలీదు. ‘వద్దమ్మా.. ప్లీజ్..’ అని ఎంత వేడుకుంటున్నా వినకుండా నేను ప్రియాంకను బలవంతంగా బోర్డింగ్ స్కూల్లో చేర్పించాను. ప్రతి శనివారం సాయంత్రం నా డ్యూటీ అయిపోయాక ట్రెయిన్ ఎక్కి ప్రియాంకను చూడ్డానికి బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లే దాన్ని. ప్రియాంక అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. తను ఆ వాతావరణంలో ఇమడలేక పోయింది. ‘‘అమ్మా.. నేనూ నీతో ఇంటికి వచ్చేస్తా..’’ అని నన్ను చుట్టుకుపోయి ఏడ్చేది. ఆ ఏడుపు ఇప్పుడు గుర్తొస్తే నాకూ కన్నీళ్లొచ్చేస్తాయి. ‘లేదు, నువ్విక్కడ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది’ అని చెప్పేదాన్ని. తనకేమీ అర్థమయ్యేది కాదు. తన కోసం నేను ఆదివారం కూడా అక్కడే ఉండిపోయేదాన్ని. అది చూసి ప్రియాంక టీచర్ ఒకరోజు నాతో ‘మీరిక ఇక్కడికి రావటం ఆపేయండి’ అని గట్టిగా చెప్పేశారు..‘ అని ‘సమ్‌థింగ్ బిగ్గర్ టాక్ షో’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు మధు చోప్రా.ప్రియాంక తండ్రి అశోక్ చోప్రాకు ప్రియాంకను బోర్డింగ్ స్కూల్లో చేర్పించటం అస్సలు ఇష్టం లేదు. అయితే మధు చోప్రా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. కొంతకాలం ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు కూడా. (ఇప్పుడు ఆయన లేరు). ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ – ‘‘ప్రియాంక తెలివైన అమ్మాయి. ఆ తెలివికి పదును పెట్టించకపోతే తల్లిగా నా బాధ్యతను సరిగా నెరవేర్చినట్లు కాదు అనిపించింది. అందుకే లక్నోలోని లా మార్టినియర్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలనుకున్నాను. అందులో సీటు కోసం ప్రియాంక చేత ఎంట్రెన్స్ టెస్టు కూడా రాయించాను. తను చక్కగా రాసింది. అడ్మిషన్ వచ్చేసింది. ఆ విషయాన్ని నా భర్తకు చెబితే ఆయన నాపై ఇంతెత్తున లేచారు. ‘ఇదే నీ నిర్ణయం అయితే, వచ్చే ఫలితానికి కూడా నువ్వే బాధ్యురాలివి’ అని అన్నారు. ఏమైతేనేం చివరికి అంతా బాగానే జరిగింది. ప్రియాంక తన కాళ్లపై తను నిలబడింది’’ అని ΄ాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు మధు చోప్రా.పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు వారిని దూరంగా ఉంచవలసి వచ్చినందుకు బాధపడటం సహజమే. అయితే పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే యజ్ఞంలో ఆ బాధ ఒక ఆవగింజంత మాత్రమే. -
పెయింటింగ్‌తో దేవర భామ.. గోవాలో బిజీగా ఊర్వశి రౌతేలా!
జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రాపెయింటింగ్తో దేవర భామ జాన్వీ కపూర్...గోవాలో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా..చీరకట్టులో ఇస్మార్ట్ బ్యూటీ కావ్యథాపర్..తన ఫ్రెండ్స్‌తో లైగర్ భామ అనన్యపాండే చిల్.. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
నాజూగ్గా ప్రియాంక చోప్రా, స్టైయిలిష్ లుకికి ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
-
తారలు మెరిసే... ఫ్యాన్స్ మురిసే...
ప్రియాంకా చో్ప్రా, సమంత ఒకే వేదికపై మెరిశారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, చిరు నవ్వులు చిందిస్తూ వీరు ఫొటోలకు ΄ోజులివ్వగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారి ఫ్యాన్స్ ఆనందంతో మురిసి΄ోతున్నారు. ఇంతకీ సమంత, ప్రియాంకా చో్ప్రా ఎక్కడ కలిశారనే విషయానికి వస్తే... వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో రూ΄÷ందిన స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మాధ్యమంలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచవ్యాప్త సినీ తారలతో ΄ాటు సమంత, ప్రియాంకా చో్ప్రాలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఇక రిచర్డ్ మాడెన్, ప్రియాంకా చో్ప్రా లీడ్ రోల్స్‌లో దర్శక ద్వయం న్యూటన్ థామస్– జెస్సికా రూ΄÷ందించిన అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రూ΄÷ందింది. అమెరికన్ ‘సిటాడెల్’ తొలి సీజన్ 2023 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘సిటాడెల్’కు సెకండ్ సీజన్ కూడా రూ΄÷ందుతోందని, ఈ సీజన్లో కూడా ప్రియాంకా చో్ప్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. -
ఆ రోజు కృతజ్ఞతతో కాదు..భయంతో నమస్తే చెప్పా: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసింది. ఆ తర్వాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పాప్ సింగర్ నిక్ కచేరీని పెళ్లి చేసుకొని హలీవుడ్లో అడుగుపెట్టేసింది. ఇప్పుడు అక్కడ వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీ అయింది. తాజాగా ఈ బ్యూటీ కూతురుతో కలిసి లండన్‌లోని ఎరీనాలో తన భర్త నిర్వహించిన కచేరికి వెళ్లింది. ఆ వేదికపైనే ప్రియాంక మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ వేదికపైకి రావడంతో ఆనందంతో ఆనాటి రోజులను గుర్తు చేసుకుంది.(చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన శ్రద్ధా ఆర్య.. పోస్ట్ వైరల్!)‘నా జీవితంలో ఈ వేదికను, 2000వ సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో ఈ వేదికను మిలీనియం డోమ్ అని పిలిచేవారు. నాకు 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నాను. టైటిల్ గెలిచేందుకు చాలా కష్టపడ్డాను. ఆ ఏడాది నవంబర్ 30వ తేదిని ఎప్పటికీ మర్చిపోలేను. మంచి డ్రెస్, హీల్స్ ధరించి స్టేజీపైకి వచ్చాను. అందరిని చూసి భయంతో నాకు చెమటలు పట్టాయి. టెన్షన్ తట్టుకోలేకపోయాను. శరీరంలోని ప్రతి నరం వణుకుతోంది. మరోవైపు నేను ధరించిన దుస్తులు అసౌకర్యంగా ఉన్నాయి. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆ ఊరిలో దాక్కున్న జానీ)అవి ఎక్కడ జారిపోతాయోనని భయమేసింది. అందుకే వాటిని పట్టుకొని అందరికి నమస్తే చేశాను. గూగుల్‌లో ఆ ఫోటోలు చూస్తే.. నేను కృతజ్ఞతతో నమస్కారం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే.. నా దుస్తులు జారిపోకుండా కాపాడుకోవడం కోసం నేను అలా నమస్కరించాను. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ వేదికపైకి నా కూతురుతో కలిసి రావడం ఆనందంగా ఉంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. -
మత్తెక్కించేలా మాళవిక మోహనన్.. భర్తతో ప్రియాంక చోప్రా!
భర్తకి ముద్దులిచ్చేస్తున్న ప్రియాంక చోప్రాఇంకా పెళ్లి మూడ్‌లోనే హీరోయిన్ మేఘా ఆకాశ్విచిత్రమైన డ్రస్సులో జిగేలుమంటున్న జాక్వెలిన్బబ్లీ బ్యూటీ నిత్యా మేనన్ బ్లాక్ అండ్ వైడ్ పోజులుమేకప్ వీడియో పోస్ట్ చేసిన 'గుంటూరు కారం' మీనాక్షి చౌదరిమాళవిక మోహనన్ గ్లామర్ ట్రీట్.. చూపు తిప్పుకోలేం!మెరుపుల ఔట్ఫిట్లో శ్రియ.. ఇంత అందమేంటి బాబాయ్ View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Noorin Shereef (@noorin_shereef_) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ashrita Shetty (@ashritashetty_) View this post on Instagram A post shared by Raadhya (@raadhya33) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
సింపుల్‌గా స్టార్ హీరోయిన్ తమ్ముడి నిశ్చితార్థం
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఈమె తమ్ముడి నిశ్చితార్థం ఎలాంటి హడావుడి లేకుండా జరిగిపోయింది. ముంబయిలో శుక్రవారం ఈ వేడుక జరగ్గా.. సోమవారం కాబోయే వధూవరులతో పాటు ప్రియాంక చోప్రా బయటపెట్టింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి)ప్రియాంక చోప్రా సోదరుడి పేరు సిద్ధార్థ్ చోప్రా.. 2019 మార్చిలోనే ఇషితా కుమార్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. పెళ్లి జరగలేదు. ఇప్పుడు అదే సిద్ధార్థ్‌కి నీలమ్ ఉపాధ్యాయ అనే అమ్మాయితో హస్తకర్ వేడుక జరిగింది. ఉత్తరాది సంప్రదాయంలో ఉంగరాలు మార్చుకునే వేడుకని ఇలా పిలుస్తారు.ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం ఈ నిశ్చితార్థం జరిగింది. అప్పుడే న్యూస్ వచ్చింది. తాజాగా సదరు ఫొటోలు బయటపెట్టడంతో ఎంగేజ్మెంట్ నిజమని తేలింది. ప్రియాంక చోప్రా కూడా కాబోయే వధూవరుల్ని ఆశీర్వదిస్తూ పోస్ట్ పెట్టింది. అలానే ఈ ఫొటోల్లో చోప్రా కజిన్స్ అందరూ కనిపించారు. నటి మన్నారా చోప్రా కూడా ఉంది. ఎందుకో పరిణీతి చోప్రా మాత్రం కనిపించలేదు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
సెలబ్రిటీలు ఇష్టపడే ఫేషియల్ మాస్క్...ఎన్ని ప్రయోజాలో తెలుసా..!
బాలీవుడ్ నటి ప్రయాంక చోప్రా దగ్గర నుంచి పలువురు ప్రముఖ సెలబ్రిటీలంతా ఇష్టపడే షేషియల్ రోజ్ గోల్డ్ ఫేషియల్. మూడు పదులు వయసు దాటిని యవ్వనపు కాంతితో మేను ప్రకాశవంతంగా ఉంటుంది. ముడతలు లేని చక్కటి చర్మం, వృద్ధాప్య లక్షణాలు దాచేసి గ్లామరస్ కనిపించేలా చేస్తుంది. బహుశా అందువల్లే ఇంతలా సెలబ్రిటీలు ఈ ఫేషియల్‌ని లైక్ చేస్తున్నారు. ఈ ఫేషియల్‌తో ఎన్ని లాభాలో చూద్దామా..!చాలామంది సెలబ్రిటీలు గ్లామరస్ ఇచ్చే ప్రాముఖ్యత అంత ఇంత కాదు. అందుకోసం ఎంత డభైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు కూడా. వాళ్లంతా రోజ్ గోల్డ్ ఫేస్ మాస్క్కి ప్రాధాన్యత ఇస్తారు. రోజ్ గోల్డ్ ఆయిల్‌తో చేసిన రోజ్ గోల్డ్ ఆయిల్ ఫేషియల్ మాస్క్ వారి చర్మ సంరక్షణకు ఎంతలా ఉపయోగపడుతుందో వింటే ఆశ్చర్యపోతారు. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే పర్యవారణానికి ప్రభావితం కాకుండా ఉండేలా యాంటీ-ఆక్సిడెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉపయోగించే బంగారు పదార్దాలు లేదా అందులో ఉండే బంగారు రేణువులు చర్మంపై వచ్చే గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సీ, బొటానికల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.ఇక రోజ్ గోల్డ్ ఆయిల్.. చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మాయిశ్చరైజర్‌గా పనిచేయడం నుంచి మేకప్‌కి సిద్దమయ్యేలా అందంగా మారుస్తుంది. ముఖ్యంగా పెదాలను హైడ్రేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కంటి కింద పొడి ప్రాంతాల్లో అప్లై చేస్తే మృదువుగా కనిపిస్తాయి. దేనితో తయారు చేస్తారంటే..గుమ్మడికాయ గింజల నూన, ఇతర నూనెలతో కలిసి ఉంటుంది. గుమ్మడికాయ గింజల నూనె కణజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తుంది. తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, యవ్వన రూపాన్ని ప్రోత్సహిస్తుంది.ఇందులో జింక్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి చర్మాన్ని దృఢంగా, బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ నూనె దాని ప్రత్యేకమైన ఫార్ములా కారణంగా జిడ్డుగల చర్మానికి అనుకూలంగా ఉంటుంది.ప్రధాన పదార్థాలు బంగారు రేకులు, రోజ్‌షిప్ సీడ్ ఆయిల్..బంగారు రేకులు కొల్లాజెన్ క్షీణతను నెమ్మదిస్తాయి. చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. మేని ఛాయను కాంతివంతం చేయడమే గాక దృఢంగా ఉంచేలా కణాలను ప్రేరేపిస్తాయి. రోజ్‌షిప్ సీడ్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గానూ, టిష్యూ రీజెనరేటర్గా పనిచేస్తుంది. వాపును తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రక్తప్రసరణలో మంచిగా ఉంటుంది. అలాగే రోజ్‌గోల్డ్ ఆయిల్ మాస్క్లోనారింజ తొక్కలు ఉంటాయి.ఇవి చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. పైగా చర్మాన్ని బిగుతుగా చేసి మెరిసేలా చేస్తుంది. ప్రయోజనాలుఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను, తేమను అందిస్తుంది.అన్ని రకాల చర్మాలకు తగినదిఇది కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం, ఫైన్ లైన్లు, హైపర్పిగ్మెంటేషన్ను తగ్గించడం వంటివి చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే గాక యవ్వన రూపాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.రోజ్ ఆయిల్ ఫేషియల్, షీట్ మాస్క్ లేదా మరేదైనా వారికి చర్మ అలెర్జీలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తి గత చర్మ నిపుణుడి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించటం మంచిది.(చదవండి: ఒక హంతకుడి బాధితులు!) -
ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్ డిజైనింగ్, అధునాతన ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’ అని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనిత ఓస్వాల్ తెలిపారు. దశాబ్దాల కాలం నుంచే ఇక్కడి రిచ్ కల్చర్ ప్రసిద్ధి చెందిందని, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ సౌందర్య వాణిజ్య రంగానికి కూడా కేంద్రంగా రాజసాన్ని నిలుపుకుంటుందని ఓస్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌కు జ్వువెల్లరీ డిజైన్ చేస్తున్న సమయంలో పలుమార్లు దక్షిణాది సౌందర్య సొగసుల పైన చర్చించిన సందర్భాలూ ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు. అనిత ఓస్వాల్ డిజైన్ చేసిన బంగారు, వజ్రాభరణాలను నగరంలోని రూం 9 పాప్ అప్ వేదికగా ‘ఝౌహరి’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. తనతో పాటు కవిత కోపార్కర్ ఆధ్వర్యంలోని అత్యంత విలువైన ప్రతా పైథానీ, బనారస్ శారీస్నూ ప్రదర్శిస్తున్న ’ఝౌహరి’ని ప్రముఖ సామాజిక వేత్త శ్రీదేవి చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓస్వాల్ నగరంలోని ఫ్యాషన్ హంగులను, బాలీవుడ్ తారల అభిరుచులను పంచుకున్నారు.హైదరాబాద్.. డ్రీమ్ ప్రాజెక్ట్..విలాసవంతమైన జీవితాల్లో ఆభరణాలు, జీవన శైలి ప్రధానమైన అంశాలని ఓస్వాల్ వివరించారు. 25 ఏళ్లుగా బాలీవుడ్ తారలకు జువెల్లరీ డిజైన్స్ రూపొందిస్తున్నానని, కానీ హైదరాబాద్ వేదికగా తన డిజైన్స్ ప్రదర్శించడం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పెట్టుకున్నానని అన్నారు. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కిరన్ ఖేర్, సోనాక్షి సిన్హా, సంజయ్ లీలా భన్సాలీ వంటి స్టార్స్‌కు డిజైనర్‌గా చేశాను. ఐశ్వర్యరాయ్ భారతీయ సంస్కృతిలోని ఆభరణాల సౌందర్య వైభవాన్ని మరింత ఉన్నతంగా గ్లోబల్ వేదికపైన ప్రదర్శించడానికి ఇష్టపడేదని ఆమె అన్నారు.ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయి డిజైనింగ్‌ను అందిపుచ్చుకోవడంలో ఆసక్తిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్‌ను అనుకరిస్తూ, సృష్టిస్తూ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలిచే హైదరాబాద్ ఫ్యాషన్ ఔత్సాహికులను కలవడం, వారి అభిరుచులను మరింతగా గమనించడం సంతోషాన్నిచ్చింది. సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకురాలు డా.మాధవి నేతృత్వంలో రిచ్ లైఫ్‌ను ప్రతిబింబించే కవిత కోపార్కర్ ప్రతా పైథానీ, బనారస్ డిజైన్లతో రూం 9 పాప్ అప్‌లో... 3 రోజుల పాటు నగర ఫ్యాషన్ ప్రేమికులకు మరో ప్రపంచాన్ని చేరువ చేయనుందని ఆమె తెలిపారు.ఇవి చదవండి: An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం! -
Priyanka Chopra : సినీ స్టార్‌తో భోజనం..
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మన అనే భావనను పెంపొందించే లక్ష్యంతో ఓ ప్రచార కార్యక్రమం చేపట్టినట్టు ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని కోసం మన దేశానికి చెందిన గ్లోబల్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్‌ను ప్రచారంలో భాగం చేశామని, ‘సినీ స్టార్‌తో భోజనం’ అంటూ, స్వదేశీ రుచులను గుర్తు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన మిచెలిన్–స్టార్ రెస్టారెంట్ ఎగ్జిక్యూటీవ్ చెఫ్, సిద్ అహుజా కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారన్నారు. -
ఆ హీరోయిన్‌కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. కానీ అందరిలాగే కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడింది. కొన్ని సినిమాలు చేతిదాకా వచ్చి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టపడి ఎదుగుతుంటే చూసి ఓర్వలేనివారు ఆమెకు యాక్టింగ్ రాదని, లుక్స్ బాగోవని విషప్రచారం చేసేవారు.అడిగి మరీ..ఈ విషయాన్ని దర్శకుడు గుడ్డు ధనోవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'సన్నీ డియోల్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా 2002-2003 మధ్యలో ఓ సినిమా తీశాను. అప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్ జరిపాం. ప్రియాంకకు యాక్టింగ్ అంతగా రాకపోయేది. ఇప్పుడీ సీన్ ఎలా చేయాలి? ఈ సన్నివేశం గురించి కాస్త వివరించరా? అని అడిగి మరీ తెలుసుకుని నటించేది. యాక్టింగ్ రాదన్నారునేర్చుకోవాలన్న తపన తనలో కనిపించేది. తన పాత్రను పర్ఫెక్ట్గా చేయాలని భావించేది. అలాగే అందంగా కూడా ఉండేది. ఓ షెడ్యూల్ పూర్తయ్యాక ప్రియాంక గురించి ముంబైలోని కొందరు నెగెటివ్‌గా చెప్పడం మొదలుపెట్టారు. స్క్రీన్‌పై తను అంత అందంగా కనిపించదని, యాక్టింగే రాదని, టైం వేస్ట్ చేసుకోవద్దని, కావాలంటే ఇప్పటివరకు షూట్ చేసిన భాగాన్ని ఓసారి చూసుకోమని సలహాలు ఇచ్చారు. ఆమెకు ఫిదా అయ్యాంసరేనని చెప్పి సన్నీ డియోల్, నేను రషెస్ చూశాం. వాళ్లు చెప్పినట్లుగా ఏమీ అనిపించలేదు. దీంతో ఈ సినిమా తనతోనే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాం. తన అంకితభావానికి, నటనకు మేము ఫిదా అయ్యాం. తప్పకుండా తను ఏదో ఒకరోజు గొప్ప స్థానానికి వెళ్తుందని భావించాం. చాలా త్వరగానే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. తన వెడ్డింగ్ రిసెప్షన్‌కు సైతం నన్ను ఆహ్వానించింది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. కాగా గుడ్డు ధనోవా డైరెక్షన్లో ప్రియాంక చోప్రా.. బిగ్ బ్రదర్, కిస్మత్ అనే సినిమాలు చేసింది.చదవండి: ‘గురువాయూర్ అంబలనడియాల్’ మూవీ రివ్యూ -
స్టయిల్ బై అమీ..
ఈశా అంబానీ రిలయన్స్ వారసురాలిగానే కాదు.. స్టయిల్ ఐకాన్‌గానూ ప్రసిద్ధురాలే! ఆమెకు ఆ స్టయిల్ని దిద్ది.. ఆమె ఐకానిక్ లుక్స్‌కి కారణమైన వ్యక్తి అమీ పటేల్! ఒక్క ఈశాకే కాదు ఎంతోమంది బాలీవుడ్ సెలబ్స్‌కి స్టయిల్ని సెట్ చేసిన ఈమె గురించి కొన్ని వివరాలు..ఫ్యాషన్ ప్రపంచంలో అమీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుకొని కాదు అనుకోకుండానే ఈ రంగంలోకి వచ్చింది. అమీ సొంతూరు ముంబై. అక్కడే పెరిగింది. అక్కడి సుప్రసిద్ధ సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో ఫైన్ ఆర్ట్స్ (పోర్ట్రెయిట్స్)లో మాస్టర్స్ చేసింది డిస్టింక్షన్‌తో.ఫ్యాషన్ రంగంలో ఆమె జర్నీ ఎల్ ఇండియాలో ఆర్ట్ డైరెక్టర్‌గా మొదలై లోఫిసియల్ ఇండియాలో ఫ్యాషన్ డైరెక్టర్, హార్పర్స్ బాజార్లో క్రియేటివ్ డైరెక్టర్ హోదా దాకా సాగింది. ఫ్యాషన్ మ్యాగజీన్స్‌లో పనిచేస్తున్నప్పుడే బాలీవుడ్లో అవకాశం వచ్చింది కాస్ట్యూమ్ డిజైనర్‌గా. కంటిన్యూ అయింది. ఆ పరిచయాలు, ఆమె పనితీరు‡ఆమెను సెలబ్రిటీ స్టయిలింగ్కి ఇన్వైట్ చేశాయి. అలా అమీ స్టయిలింగ్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ స్టార్ ప్రియంకా చోప్రా. ఆమెను పెళ్లి కూతురిగా ముస్తాబుచేసింది అమీనే.ప్రియంకా పెళ్లిలో ఆమెను చూసినవారంతా అమీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఊహించని ఆ అవకాశం.. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందుకే సొంతంగా స్టయిలింగ్ ఫర్మ్ని స్టార్ట్ చేసింది ‘స్టయిల్ బై అమీ( ్టy ్ఛbyఅఝజీ)’ పేరుతో. బాలీవుడ్‌కి అమీ స్టయిల్ ఆఫ్ వర్క్ కొత్త కాదు.. పైగా ప్రియంకా చోప్రా స్టయిలింగ్‌తో ది బెస్ట్ స్టయిలిస్ట్గానూ ప్రూవ్ చేసుకుంది. సెలబ్రిటీల వర్క్ కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్తో ‘స్టయిల్ బై అమీ’ బిజీ అయిపోయింది. ఆలియా భట్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, రకుల్‌ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, శోభితా ధూళిపాళ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంబానీ లేడీస్.. ఈశా అండ్ నీతా అంబానీలతో కనిపిస్తుంది అమీ సెలబ్రిటీ స్టయిలింగ్ లిస్ట్!‘ప్రతి ప్రొఫెషన్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టే సెలబ్రిటీ స్టయిలింగ్ కెరీర్లోనూ ఉంటాయి. కాబట్టి చాలెంజింగ్‌గా ఉండాలి. స్టయిలింగ్కి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటూ లేదు. దీనికి స్టయిలిస్ట్ దగ్గర ట్రైనింగ్‌ని మించిన చదువులేదు. కష్టపడి పనిచేసే తత్వం, సహనం, సామర్థ్యం అదనపు అర్హతలు. మంచి ట్రైనింగ్‌తో పాటు ఈ మూడూ ఉంటే ఈ కెరీర్లో అందలం ఎక్కొచ్చు. ఫ్యాషన్‌కి సంబంధించి ఇప్పుడు జెండర్ బారియర్స్ లేవు. అబ్బాయిలు స్కర్ట్స్ వేసుకుంటున్నారు.. అమ్మాయిలు లుంగీ, టీ షర్ట్‌ని ఇష్టపడుతున్నారు. సో కాస్ట్యూమ్స్‌కి లింగ భేదాల్లేకుండా పోయాయి. నిన్ను నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడమనే అర్థంలోకి మారిపోయింది ఫ్యాషన్."వర్ధమాన స్టయిలిస్ట్‌లు ఈ మార్పును దృష్టిలో పెట్టుకోవాలి. సెలబ్రిటీ స్టయిలింగ్ అంటే గ్లామరస్ జాబ్ కాదని గుర్తుంచుకోవాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి.. దానికి మ్యాచింగ్ యాక్ససరీస్ ఏంటీ.. హెయిర్ స్టయిల్ ఎలా ఉండాలని డిక్టేట్ చేయడం కాదు స్టయిలింగ్ అంటే! సెలబ్రిటీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని.. ఆ పర్సనాలిటీకి తగినట్లుగా వాళ్లను తీర్చిదిద్దే క్లిష్టమైన పని అది. ఈ క్రమంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సెలబ్రిటీ అభాసుపాలై.. వాళ్ల రెప్యుటేషనే పడిపోవచ్చు. అందుకే దీన్ని ఆషామాషీగా చూడొద్దు!’ అని ఔత్సాహిక స్టయిలిస్ట్లకు సలహా ఇస్తోంది" – అమీ పటేల్. -
బరాత్‌లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..!
అంబానీ ఇంట పెళ్లి ధూంధాంగా జరిగింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం విచ్చేసి అనంత్ అంబానీ- రాధిక మర్చంట్లను దీవించారు. నిండు నూరేళ్లు కలిసుండమని ఆశీర్వదించారు. సినిమా తారలే కాకుండా వ్యాపార, రాజకీయ ప్రముఖులు సైతం పెళ్లికి విచ్చేశారు. ఇకపోతే శుక్రవారం జరిగిన బరాత్‌లో సినిమా స్టార్స్ డ్యాన్స్‌తో హోరెత్తించారు.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తుంటే ఆమె భర్త నిక్ జోనస్ తనతో పాటు కాలు కదిపాడు. కానీ అంతలోనే నిక్‌ను వెనక్కు నెట్టిందో హీరోయిన్. లైగర్ బ్యూటీ అనన్య పాండే నిక్‌ను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి ప్రియాంకతో డ్యాన్స్ చేసింది. దీంతో నిక్ బిత్తరపోయాడు. విషయం అర్థం చేసుకున్న హీరో రణ్వీర్ సింగ్.. అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో.. నిక్ ఎక్స్ప్రెషన్స్ చూశారా?, బరాత్ అంటే అంతే మరి.. నలుగురిని తోసి అయినా సరే.. ముందుకొచ్చి మరీ డ్యాన్స్ చేయాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, రాశీ ఖన్నా, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్.. ఇలా తారలంందరూ బరాత్‌లో సరదాగా చిందేశారు. Ananya is literally representing Nick jiju hatiye 😭#PriyankaChopra #AnanyaPandey pic.twitter.com/ADWSMkEIr7— 𝒫𝓇𝒾𝓎𝒶🌸🤍 (@DewaniMastanii) July 13, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
గాయాలు తప్పవు
‘‘వృత్తిపరమైన గాయాలను తప్పించుకోలేం. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు గాయాలు తప్పవు’’ అంటున్నారు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’లో నటిస్తున్నారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ మూవీ షూటింగ్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆరంభమైంది.ఈ చిత్రం కోసం ప్రియాంకా చోప్రా పాల్గొనగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆమె పెదవి, ముక్కు, మెడకు గాయాలు అయ్యాయి. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ప్రోఫెషనల్ లైఫ్‌లో జరిగే ప్రమాదాలు’ అంటూ వీడియో పోస్ట్ చేశారు ప్రియాంక. ఇక గాయాలు కాగానే షూటింగ్ ఆపేసి, ఆమెను సిడ్నీలోని ఆస్పత్రికి తీసుకెళ్లిందట యూనిట్. అక్కడ చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకుంటున్నారట ప్రియాంకా చోప్రా. -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు వీరే (ఫొటోలు)
-
షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరోయిన్
సినిమా షూటింగ్లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్ అయిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..‘వృత్తి జీవితంలో ప్రమాదాలు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ‘స్టంట్’ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. (చదవండి: అనుష్కకు అరుదైన వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!)‘ది బ్లఫ్’లో ప్రియాంక చోప్రా యాక్షన్ రోల్ ప్లే చేస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్లో ప్రమాదాలు జరగడం ప్రియాంకకు కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల షూటింగ్ సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు పెదవి చివర చిన్న గాయంతో పాటు మెడపై గాటు పడింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త’ మేడం అంటూ అమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.(చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)సినిమాల విషయాలకొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియాంకా చోప్రా.. 2018లో అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్‌కి మార్చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. చివరగా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. -
ఇక ఆరంభం
ఆస్ట్రేలియాలో సముద్రపు దొంగగా మారిపోయారు ప్రియాంకా చోప్రా. న్యూజిల్యాండ్ యాక్టర్ కర్ల్ అర్బన్, ప్రియాంకా చోప్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హాలీవుడ్ ఫిల్మ్ ‘ది బ్లఫ్’. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్–జో బల్లారిని ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఆరంభం అయ్యాయని తెలియజేస్తూ, తన ఇన్‌స్టా స్టేటస్‌లో ‘ఇట్ బిగిన్స్’ అంటూ ‘ది బ్లఫ్’ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్లు ఓ పేజీని షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. ఈ చిత్రంలో కానర్ అనే పాత్రలో కర్ల్, ఎర్సెల్ అనే పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలోనే ఉన్నారు ప్రియాంకా చోప్రా.ఇక 19వ శతాబ్దంలో ఎర్సెల్ అనే ఓ సముద్రపు దొంగ జీవితం నేపథ్యంతో ‘ది బ్లఫ్’ సినిమా కథనం సాగుతుంది. కొన్ని కారణాల వల్ల ఎర్సెల్ అనే యువతి సముద్రపు దొంగతనాలు మానేసి, సాధారణ జీవితం గడుపుతుంటుంది. కానీ ఎర్సెల్ సముద్రపు దొంగగా ఉన్న సమయంలో చేసిన పనులు, ఆమె ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? ఆ సమస్యల నుంచి ఎర్సెల్ ఎలా బయటపడింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది బ్లఫ్’ కథనం సాగుతుందని హాలీవుడ్ టాక్. ఇక ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్లో నటించిన మరో హాలీవుడ్ ఫిల్మ్ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తర్వాత ప్రియాంక చోప్రా సినిమాల్లో అడుగుపెట్టింది. దళపతి విజయ్ 'తమిళన్' చిత్రంతో వెండితెరపై కథానాయికగా మెరిసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న కోరిక, ఇష్టం ప్రియాంకకు అస్సలు ఉండేది కాదని చెప్తోంది ఆమె తల్లి మధు చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రియాంక ఎన్నడూ అనుకోలేదు. ఆమెకు తొలిసారి సౌత్ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. ఛాన్స్ మిస్ చేసుకోవద్దని..ఆ విషయం తనకు చెప్తే ఏడ్చేసింది. నేను సినిమాలు చేయనని కన్నీళ్లు పెట్టుకుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పాను. అలా తమిళన్ చిత్రానికి సంతకం చేసింది. షూటింగ్ చేస్తుండేకొద్దీ తనకు యాక్టింగ్ మీద ఆసక్తి, ఇష్టం ఏర్పడింది. భాష రాకపోయినా ఎంజాయ్ చేసింది. చిత్రయూనిట్ కూడా తనను ఎంతో బాగా చూసుకుంది. హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనొక జెంటిల్మెన్. ఈ మూవీలో రాజు సుందరం కొరియోగ్రాఫర్. డ్యాన్స్ రాదుప్రియాంకకు పెద్దగా డ్యాన్స్ రాదు. విజయ్‌తో స్టెప్పులేసేందుకు చాలా కష్టపడింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొరియోగ్రాఫర్‌తో కలిసి ప్రాక్టీస్ చేసేది. ఇష్టంగా పని నేర్చుకుంది. ఆ వాతావరణం నచ్చడంతో సినిమాను కెరీర్‌గా ఎంచుకుంది అని తెలిపింది. తమిళ్లో ఒకే ఒక్క సినిమా చేసిన ప్రియాంక చోప్రా తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. అనంతరం హాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది.చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్ ఆంటోని -
ప్రియాంక భర్త డైరెక్ట్‌గా నన్నే అడిగాడు: హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఓ కూతురు కూడా జన్మించారు.అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా స్పందించారు. ఈ జంట మధ్య పదేళ్ల వయసు తేడా ఉండడంతో ఎలాంటి ప్రభావం ఉందన్న విషయంపై ఆమె మాట్లాడారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు వయసు అనేది పెద్ద మ్యాటర్ కాదని ఆమె అన్నారు.మధు చోప్రా మాట్లాడుతూ.."ప్రియాంక, నిక్ మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అబ్బాయి మంచివాడు. ఒకరినొకరు బాగా చూసుకుంటారు. నేను వారి గురించి చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలు వారి వయసు పట్ల ఏమైనా మాట్లాడతారు. కానీ అవేమీ నేను పట్టించుకోను. నిక్ ఇండియాకు వచ్చి ప్రియాంక లేనప్పుడు నన్ను లంచ్‌కి తీసుకెళ్లాడు. ప్రియాంక కోసం ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారని నిక్ నన్ను అడిగాడు. అన్ని లక్షణాలను అతనికి వివరించా. నా మాటలు విని నేను ఆ వ్యక్తిని కాగలనా? అని డైరెక్ట్‌గా అడిగాడు. ప్రియాంకను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని మాటిస్తున్నా అని చెప్పాడు. అతని మాటలకు నేను ఆశ్చర్యపోయా. కానీ వెంటనే ఓకే చెప్పాను' అని వివరించారు.కాగా.. ప్రియాంక, నిక్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వారు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022లో కుమార్తె జన్మించింది. వీరి మధ్య పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. -
నాతో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఒప్పుకోలేదు: హీరో
మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా ఉన్నారు. రజనీశ్ దుగ్గల్ ఇదే కోవలోకి వస్తాడు. మిస్టర్ ఇండియా, మిస్టర్ ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలుచుకున్న ఇతడు 1920 హారర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. నిజానికి దీని కంటే ముందు అతడికి యాకీన్ (2005) సినిమా ఆఫర్ వచ్చిందట! అయితే తనతో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అస్సలు ఒప్పుకోలేదంటున్నాడు రజనీష్. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.మూడు సినిమాలకు సంతకంరజనీష్ మాట్లాడుతూ.. 'యాకీన్ సినిమా కోసం ఫస్ట్ నన్నే హీరోగా అనుకున్నారు. ఆ ప్రాజెక్టుకు సంతకం కూడా చేశాను. ఆ చిత్రం కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టాను. డైరెక్టర్ గిరీశ్ ధమిజ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. పైగా వాళ్లు ఒకేసారి నాతో మూడు సినిమాలకు సంతకం చేయించుకున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఉన్న సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. నన్ను జుహులోని ఓ పెంట్‌హౌస్‌లో ఉంచారు. ఒక కారు, డ్రైవర్‌ను ఇచ్చారు. ఒక్క ఫోన్ చేస్తే నాకు గదిలోకి ఫుడ్ తీసుకొచ్చేవాళ్లు. సడన్‌గా ఫోన్ చేసి..దాదాపు రెండున్నర నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాను. కేవలం సినిమా కోసం బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్‌లో కనిపించడం కూడా మానేశాను. సడన్‌గా ఒక రోజు రాత్రి నిర్మాత సుజిత్ కుమార్ ఫోన్ చేసి తన ఆఫీస్‌కు రమ్మన్నారు. ప్రియాంక ఎంత పెద్ద హీరోయినో తెలుసు కదా.. తనకు ఆల్రెడీ చాలా డబ్బు ఇచ్చేశాం. కానీ ఆమె కొత్త వ్యక్తితో పని చేయనంటోంది అన్నాడు. అప్పుడు నాకేమనిపించిందంటే.. నాకోసం అంత ఖర్చు పెట్టారు కాబట్టి హీరోయిన్ను మారిస్తే అయిపోతుందిగా అనుకున్నాను.నాతో సినిమా చేయనందిఅప్పుడు సినిమా బిజినెస్ గురించి నాకంత అవగాహన లేదు. ప్రియాంక నాతో సినిమా చేయనందని చెప్పారు.. నాకు తెలిసి మాత్రం తన మేనేజర్ లేదా ఆమె చుట్టుపక్కల ఉన్నవారు ఈ మాట చెప్పించారనిపించింది. ఆమెను తప్పు పట్టడం లేదు కానీ నేను సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు తను చేయగలడు, తనతో నటించడానికి నాకే అభ్యంతరమూ లేదు అని చెప్పి ఉంటే బాగుండేది' అని రజనీష్ అభిప్రాయపడ్డాడు.చదవండి: ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్ -
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా రూ. 300 కోట్ల డైమండ్ నెక్లెస్..
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పలు ఫ్యాషన్ వేడుకలకు తన డిజైనర్‌వేర్ డ్రెస్‌లతో మిస్మరైజ్ చేస్తుంది. అలానే రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరికొత్త హెయిర్ స్టైల్‌తో ప్రియాంక ప్రేక్షకులను అలరించింది. పైగా ఆ హెయిర్ స్టైల్‌కి తగ్గట్టు నలుపు, తెలపు కాంబినేషన్ గౌను, అందుకు తగ్గట్టు డైమండ్ నెక్లస్‌ని ధరించి అత్యద్భుతంగా కనిపించింది. నెక్కు కోట్లు ఖరీదు చేసే 200 క్యారెట డెమండ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బల్గేరి అటెర్నె బ్రాండ్‌కి చెందిన ఈ నెక్లెస్ అత్యంత లగ్జరియస్ జ్యువెలరీ. ఈ మేరకు ఈ విషయాన్ని బల్గారీ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫ్యాషన్, పాప్ సంస్కృతిని ఫాలో అయ్యే ఇన్‌స్టాగ్రామర్ డైట్ సబ్యా కూడా ఈ నెక్లెస్ మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నెక్లెస్ రూపొందిచడానికి దాదాపు 2,800 గంటలు శ్రమతో కూడిన నైపుణ్యం అవసమరమని, ఇది చాలా కఠినమైన వజ్రమని తెలిపారు. దీన్ని 140 క్యారెట్ల ఏడు పియర్ ఆకారపు చుక్కలుగా రూపొందించడానికే ఇంత సమయం తీసుకుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బ్రాండ్ చరిత్రలో ఇది అత్యద్భుతమైన నెక్లెస్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో ప్రియాంక ధరించిన కళ్లమిరుమిట్లు గొలిపే డైమండ్ నెక్లెస్ తోపాటు ఆమె కొత్త హెయిర్ స్టైల్ హైలెట్‌గా నిలిచింది. ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ. 300 కోట్ల పైనే ఉంటుందని సమాచారం.ఇక కనుబొమ్మలకు మెరిసే గోల్డెన్ ఐ షాడో, కనురెప్పలపై మస్కరా, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్, చెంపలపై గులాబీ రంగు బ్లష్ వంటివి హైలెట్‌గా నిలిచాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) (చదవండి: కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!) -
Women of My Billion: కలిసి నడిచే గొంతులు
కన్యాకుమారి నుంచి శ్రీ నగర్ వరకూ 260 రోజుల పాటు 3,800 కిలోమీటర్లు దేశమంతా నడిచింది సృష్టి బక్షి. ఎందుకు? స్త్రీలపై జరిగే దురాగతాలపై చైతన్యం కలిగించడానికే కాదు స్త్రీల శక్తియుక్తులను వారికి గుర్తు చేయడానికి. ఆ సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. నటి ప్రియాంకా చోప్రా నిర్మాత.తాను నడిచి చేరుకున్న ఊరిలో ఏదైనా స్కూల్లోగాని, పబ్లిక్ హాల్లో కాని మహిళలను పోగు చేస్తుంది సృష్టి బక్షి. ‘అందరూ కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి’ అంటుంది. ‘ఇప్పుడు మీ కళ్ల ఎదురుగా మీ 11 ఏళ్ల వయసున్న మీ రూపాన్ని గుర్తు చేసుకోండి. ఆ 11 ఏళ్ల అమ్మాయిలో ఉండే విశ్వాసం, ఆనందం ఎన్ని విధాలుగా ధ్వంసమైందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ అమ్మాయికి సారీ చెప్పండి. ఎందుకంటే ఆ విధ్వంసమంతా మీ అనుమతితోనే జరిగింది’ అంటుంది. చాలామంది ఆ మాటలకు ఏడుస్తారు. గడిచివచ్చిన జీవితాన్ని తలుచుకుని బాధలో మునిగిపోతారు. అప్పుడు సృష్టి బక్షి ఒక బోర్డు మీద స్త్రీ శరీర నిర్మాణం గీచి ‘ఇదిగో ఈ అవయవాల రీత్యా మీరు మగవారి కంటే భిన్నంగా పుట్టారు. ప్రకృతి ఈ అవయవాలను మీకు ఇస్తే సమాజం అదుపు, ఆంక్షలు, వివక్ష, కుటుంబ హింస, ఆర్థిక బానిసత్వం, ఇంటి పని... ఇన్ని ఇచ్చింది. మనం ఎందుకు మగవారితో సమానం కాము?’ అని ప్రశ్నిస్తుంది.మార్పు కోసంసృష్టి బక్షిది ముంబై. ఆమె హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంది. హాంగ్‌కాంగ్‌లో మార్కెటింగ్‌లో పెద్ద సంస్థల్లో పని చేసింది. తండ్రి ఆర్మీలో పని చేయడం వల్ల ఆమెకు దేశం పట్ల ఒక ఉద్వేగం ఉండేది. అయితే తాను ప్రేమించే దేశంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను చూసి చలించి పోయేది. ‘2017లో హాంకాంగ్‌లో సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళుతున్నప్పుడు నా ఫోన్లో ఇండియాలో తల్లీ కూతుళ్లపై తండ్రి ఎదుటే అత్యాచారం చేసి చంపేశారన్న వార్త చదివాను. చాలా నిస్పృహ కలిగింది. నాలాంటి వాళ్లు సౌకర్యంగా పడక్కుర్చీలో కూచుని చింతించడం సరికాదని రంగంలో దిగాలని అనుకున్నాను. అలా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇండియా వచ్చి దేశంలోని స్త్రీలందరితో మాట్లాడాలని 2018 మే నెలలో పాదయాత్ర ప్రారంభించాను’ అని చెప్పింది సృష్టి.రోజూ వేలాది మంది‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో సృష్టి బక్షి మే 2018లో కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర రికార్డు అయ్యేలా టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. 260 రోజుల పాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్రకు కోటి రూపాయలు ఖర్చవుతాయి. 50 లక్షలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోగు చేసింది. ‘ఈ యాత్రలో స్త్రీల కలలు, ఆకాంక్షలు, వారి హక్కులు, సంఘర్షణలు. విజయాలు వినదలుచుకున్నాను. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నా సుదీర్ఘ యాత్రలో మన దేశంలో వరకట్నం ఇంకా పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. వరకట్నం స్త్రీలను మానసికంగా పురుషులతో సమానం అనుకోనివ్వడం లేదు. స్త్రీలను అసభ్యంగా తాకడం, హింసించడం, అణిచి పెట్టడం కొనసాగుతూనే ఉంది. ఒక దశలో నేను యాత్ర చేయలేననుకున్నాను. కాని ఆ మరుసటి రోజు నా మీటింగ్‌కు హాజరైన ఒక ఆశా వర్కర్– ‘‘రాత్రి నన్ను నా భర్త కొట్టాడు. నీ మాటలు విన్నాక ఇక ఇలాంటిది జరగనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. నేను నా భర్తను నిలువరించడానికి నలుగురి సాయం తీసుకుంటాను’’ అని చెప్పింది. నా యాత్ర వల్ల జరుగుతున్న మేలు అర్థమయ్యాక కొనసాగాను’ అని తెలిపింది సృష్టి.డాక్యుమెంటరీ విడుదలసృష్టి చేసిన యాత్ర అంతా ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందింది. మే 3 నుంచి అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ మీద మంచి రివ్యూలు వస్తున్నాయి. ‘ఎందరో స్త్రీలు. వారి జీవితానుభవాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. వారు సమస్యలు వారి తెచ్చుకున్నవి కాదు. వారికి తెచ్చిపెట్టినవి. అందుకే నటి ప్రియాంకా చోప్రా నా డాక్యుమెంటరీని చూసి తాను నిర్మాతగా మారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా ఆమెకు స్త్రీల సాధికారత, ఆత్మగౌరవం గురించి అక్కర ఉంది. జెండర్ ఈక్వాలిటీ గురించి స్త్రీ, పురుషుల్లో చైతన్యం రావడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు’ అని తెలిపింది సృష్టి బక్షి. -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్‌ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
స్టార్ హీరోయిన్ తమ్ముడి నిశ్చితార్థం..ఈమె మూడో అమ్మాయి (ఫొటోలు)
-
నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆమెనే: యానిమల్ బ్యూటీ కామెంట్స్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్తో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో కనిపించి మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3 చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించింది. త్రిప్తి మాట్లాడుతూ..' మరో దేశానికి వెళ్లి కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం ఉండాలి. ప్రియాంకకు ధైర్యంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. హాలీవుడ్‌కు వెళ్లి సక్సెస్‌ను సాధించింది. ఆమె నాలాంటి వారికి స్ఫూర్తి. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ప్రియాంక మూవీ బర్ఫీ మొదటిసారి చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్‌కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రతోనే మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని అన్నారు. ప్రియాంక తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని త్రిప్తి కొనియాడారు. -
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
కాస్ట్లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?
మొన్నీమధ్యే అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ లాంటి టెక్ దిగ్గజాలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే వీళ్లందరూ వేసుకున్న డ్రస్సులు, ఆభరణాలు-వాటి ధరలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాయి. ఇప్పుడు అదే అంబానీ మరో ఈవెంట్ చేశారు. ఇందులో మిగతా వాళ్ల సంగతేమో గానీ ప్రియాంక చోప్రా.. అత్యంత ఖరీదైన నెక్లెస్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?) సౌత్ సినిమాలతో మొదలుపెట్టి హిందీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. పాప్ సింగర్ నిక్ జొనాస్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది. అప్పుడప్పుడు మన దేశంలో కనిపించే ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్లోనే ఒకటి రెండు ప్రాజెక్టులు చేస్తూ మళ్లీ ఇక్కడ బిజీ అవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అంబానీ ఇంట జరిగిన హోలీ ఈవెంట్ లో తళుక్కున మెరిసింది. తేల గులాబీ రంగు డ్రస్సులో అందాల విందు చేసిన ప్రియాంక చోప్రా.. ఓ ఖరీదైన నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఆభరణం గురించి ఆరా తీయగా.. అత్యంత అరుదైన వజ్రాలు పొదిగిన బెవల్గారీ కంపెనీకి చెందినది అని తెలిసింది. అలానే దీని ధర ఏకంగా రూ.9.18 కోట్ల వరకు ఉందని టాక్. నెక్లెస్ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ రేటు చూసి నెటిజన్లకి మైండ్ బ్లాక్ అయిపోతోంది. (ఇదీ చదవండి: ఎస్పీ చరణ్‌తో వివాదం.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!) I need those pictures 🔥🔥#PriyankaChopra pic.twitter.com/rFeiCGt0db — NP LEGΛCY 🇨🇴 | Loving MMCJ ❤🍼 (@np_legacy) March 16, 2024 -
ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇటీవల యంగ్ ఆశిష్ రెడ్డి,పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా సైతం వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 12 తన ప్రియుడితో ఏడడుగులు నడవనుంది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్?.. పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ భామ మీరా చోప్రా తెలుగువారికి కూడా సుపరిచితమే. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సోదరి అయిన మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీరా చోప్రా ప్రకటించింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఈనెల 12 గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఈ జంట ఒక్కటవ్వనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంతం వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మీరా ఫ్యామిలీ ఏర్పాట్లలో బిజీగా మారిపోయింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఆ పోరాటం నా మనసును కదిలించింది
ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’కు ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందంటున్నారు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. భారతదేశంలో జన్మించి కెనడాలో పెరిగిన నిషా పహుజా ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. జార్ఖండ్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘టు కిల్ ఏ టైగర్’ తీశారు నిషా. కుమార్తెకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటూ ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో కథాంశం ఉంటుంది. తాజాగా ‘టు కిల్ ఏ టైగర్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అలాగే ‘టు కిల్ ఏ టైగర్’కు ప్రియాంకా చోప్రా, దేవ్ పటేల్‌తో పాటు మరికొంతమంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ప్రియాంకా చోప్రా స్పందించారు. ‘‘టు కిల్ ఏ టైగర్’ను తొలిసారిగా నేను 2012లో చూశాను. తన కూతురికి న్యాయం జరగడం కోసం ఓ తండ్రి చేసే పోరాటం నా మనసును కదిలించింది. నేనూ జార్ఖండ్‌లోనే జన్మించాను. ఓ తండ్రికి కూతుర్ని కూడా. ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేషన్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరిగే 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’ అవార్డు గెలుస్తుందా? వేచి చూడాలి. -
‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా 21 ఏళ్ల వయసులోని తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వయసులో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అరిజోనా (యూఎస్) కు చెందిన 43 ఏళ్ల డామిన్ రఫ్ ఈ ట్రెండ్‌కు కారణం. మెక్సికోలో జరిగిన తన 21 వ బర్త్‌డే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.ఈ ఫోటో ‘ఇంతింతై... అంతంతై’ చివరికి వైరల్ ట్రెండ్‌గా మారింది. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కాజల్‌లు కూడా ఈ వైరల్ ట్రెండ్‌లో భాగం అయ్యారు. కరీనా కపూర్ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘అశోక’ సినిమాలో షారుఖ్‌ఖాన్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘ఫీలింగ్ 21 దిస్ మార్నింగ్’ అనే కాప్షన్ ఇచ్చింది. మరో ఫోటోకు ‘21’ అని కాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ ఇమోజీ జోడించింది. ప్రియాంక చోప్రా మోడలింగ్ రోజుల నాటి ఫోటోలను షేర్ చేసి ‘లెర్న్ ఏ లాట్ సిన్స్ దెన్’ అని కాప్షన్ ఇచ్చింది. బైక్‌పై కూర్చున్న తన ఫోటో షేర్ చేస్తూ ‘ఉయ్ డిడ్ వెల్. ప్యాట్ ఆన్ ది బ్యాక్ ఫర్ ది యంగర్ మీ’ అని కాప్షన్ ఇచ్చింది కాజల్. -
కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నిక్-ప్రియాంక (ఫొటోలు)
-
అవును నిజమే.. పెళ్లి చేసుకుంటున్నా: బంగారం మూవీ హీరోయిన్
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటికే ప్రముఖ హీరోలు వివాహాబంధంతో ఒక్కటవ్వగా.. బాలీవుడ్లో పలువురు తారలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో నటి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ప్రస్తుతం సఫేద్ అనే చిత్రంలో నటిస్తోన్న బాలీవుడ్ నటి మీరా చోప్రా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భామ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. మీరా చోప్రా మాట్లాడుతూ.. 'అవును నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నా. 2024 ఫిబ్రవరి నెలాఖరున నా పెళ్లి జరగనుంది. ఇప్పటికే నా కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. నా పెళ్లివేడుక రాజస్థాన్‌లో గ్రాండ్‌గానే జరగనుంది. మా పెళ్లి వేడుకకు 150 మంది అతిథులు హాజరవుతారని' అని మీరా వెల్లడించింది. అయితే పెళ్లి తర్వాత స్నేహితులు, బాలీవుడ్ తారల కోసం ముంబైలో రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. కానీ తనకు కాబోయే భర్త వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా మీరా ఒక మిస్టరీ మ్యాన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్యార్ వాలా క్రిస్మస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె పెళ్లి గురించి చర్చ మొదలైంది. అయితే మీరా చోప్రా.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ అవుతారు. కాగా.. మీరా చోప్రా 2016లో '1920: లండన్'చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సరసన బంగారం చిత్రంలో నటించింది. ప్రస్తుతం మీరా సఫేద్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సినిమా ఛాన్సుల కోసం వేడుకుంటున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు మీరా చోప్రా సోదరి అవుతుంది. టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రాబోతుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం పోరాడి విసిగిపోయానని ఆమె చెప్పింది. 'నేను సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి చాలా విసిగిపోయాను. నేను ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయాను. అయినా వాటంన్నింటి అదిగమించి ముందుకు సాగాలని ఉంది. దయచేసి నాకు సినిమా అవకాశాలు ఇవ్వండి. బహిరంగంగానే అడుగుతున్నాను... దయచేసి నాకు కాల్ చేయండి. నాకు మంచి పాత్రలు ఇవ్వండి. నేను నిజంగా మంచి నటిని అని అనుకుంటున్నాను. సెక్షన్ 375 అయిపోయాక మీరా చోప్రా కమ్ బ్యాక్ అన్నారు. అందులో నా నటన చూసి ఎందరో ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా చాలా అవకాశాలు వస్తాయిని పలు కథనాలు రాశారు.. కానీ అలాంటిదేమీ జరగలేదు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్లానో నాకు తెలియదు. నేను నిజంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది. మీరా చోప్రా నటించిన సఫేద్ చిత్రంలో ఆమె విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో అయినా మరిన్నీ అవకాశాలు వస్తాయిని ఆమె ఆసిస్తుంది. సఫేద్ డిసెంబర్ 29న రాబోతున్న లింగమార్పిడి, వితంతువుల మధ్య జరిగే అనూహ్యమైన ప్రేమకథ. గతంలో ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని చెప్పి విమర్శలు ఎదుర్కొందీ భామ. తర్వాత క్షమాపణ చెప్పడంతో ఆ గొడవకు ఫుల్ స్టాప్ పడింది. -
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా.. కారణం ఇదేనా?
ఒకప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక చోప్రా.. పెళ్లి తర్వాత ఇప్పుడు హాలీవుడ్లో బిజీ అయింది. 2018లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌తో పెళ్లి జరిగిన తర్వాత ప్రియాంక తన మకాంను లాస్ ఏంజిల్స్‌కి మార్చింది. ప్రస్తుతం అక్కడే భర్త నిక్, కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి ఉంటోంది. అయితే ఎప్పుటికైనా తిరిగి ఇండియాకు వస్తుందని భావించారు ఆమె ఫ్యాన్స్. కానీ ఆమె మాత్రం భారత్‌తో సంబంధాలు తెచ్చుకొని.. లాస్ ఏంజిల్స్‌లోనే శాశ్వతంగా నివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇండియాలోని తన తన ఆస్తులన్నింటిని వరుసబెట్టి అమ్ముతోంది. ఆ మధ్య లోఖండ్‌వాలాలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని రూ. 7 కోట్లకు అమ్మేసింది. తాజాగా ముంబైలోని అంధేరి శివారులో ఉన్న అపార్ట్‌మెంట్‌ను కూడా అమ్మకానికి పెట్టేసినట్లు తెలుస్తోంది. భారీ ధరకు కొనుగోలు చేసిన డైరెక్టర్ ప్రియాంక చోప్రాకు చెందిన అపార్ట్‌మెంట్‌ని బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అభిషేక్ చౌబే భారీ ధరకు కొనుగోలు చేశారట. అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లను దాదాపు రూ. 6 కోట్లు చెల్లించారట. ఈ విక్రయాలకు సబంధించిన పనులను ప్రియాంక తల్లి మధు చోప్రా చూసుకున్నారట. ఈ ఏడాది అక్టోబర్ 23, 25 తేదీల్లో వీటికి సంబందించిన లావాదేవీలు జరిగినట్టు సమాచారం. అయితే వీటికి సబంధించి మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా 36 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. భారత్‌కు దూరమేనా? బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత హాలీవుడ్‌కి చెక్కేసింది ప్రియాంక్. అక్కడే నిక్ జోనస్‌తో ప్రేమలో పడి..పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా లాస్ ఏంజిల్స్‌లోనే నివాసం ఉంటోంది. అయితే ఎప్పటికైనా తిరిగి ముంబై వస్తారని ఆమె అభిమానులు ఆశించారు. కానీ ప్రియాంక ఇక్కడి ఆస్తులను వరుసబెట్టి అమ్మకానికి పెడుతోంది. దీన్ని బట్టి చూస్తే... ప్రియాంక ఇండియాతో సంబంధాలు తెచ్చుకుని.. అక్కడే ఫిక్స్ అయిపోయేలా ఉంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. హెడ్స్ ఆఫ్ స్టేట్ తో పాటు పలు వెబ్‌సీరీస్‌ల్లోనూ నటిస్తోంది. -
ప్రియాంక చోప్రా సినిమాలో నటించాడు.. ఇప్పటికీ పండ్లు అమ్ముతూ!
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కలల ప్రపంచం. సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంతో మంది వేచి చూస్తుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఇండస్ట్రీలో తన టాలెంట్‌లో ముందుకు దూసుకుపోతుంటారు. అలా స్టార్స్ పక్కన నటించడమంటే ఇక వాళ్ల కెరీర్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ కొందరు మాత్రం స్టార్స్ సినిమాల్లో అవకాశాలొచ్చినా.. తమ వృత్తిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి వ్యక్తే ఈ సోలంకి దివాకర్. బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సోలంకి తన వృత్తిలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్, ది వైట్ టైగర్, సోంచిరియా లాంటి చిత్రాలలో సోలంకి దివాకర్ నటించారు. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన పండ్ల వ్యాపారంలోనే కొనసాగుతున్నారు. అతను సినిమాల్లోకి రాకముందు వృత్తి రీత్యా పండ్ల వ్యాపారి. ఢిల్లీలో 10 సంవత్సరాలుగా పండ్లు విక్రయిస్తున్నారు. నటనపై ఇష్టం ఉన్న సోలంకి సినిమాల్లోకి వచ్చాడు. అయితే లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేసినట్లు వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సోలంకి మాట్లాడుతూ..'నటన అంటే నాకు మొదటి నుంచే ప్రేమ. నా స్వస్థలమైన అచ్నేరా (ఉత్తరప్రదేశ్‌లోని) థియేటర్లో విరామ సమయంలో పాపడ్ అమ్ముతు ఉండేవాన్ని. అప్పుడే నటన పట్ల మక్కువ పెంచుకున్నా. ఈరోజు నేను సినిమాల్లో నటించి సరిపడా డబ్బు సంపాదించలేకపోయాను. నా కుటుంబాన్ని పోషించడానికి పండ్లు అమ్ముతున్నాను. సినిమాల్లో నాకు తగినంత జీతం వస్తే పండ్లు అమ్మను. అవకాశం దొరికితే 1000 సినిమాల్లో నటించాలనుకుంటున్నా. కానీ నాకు తరచుగా పాత్రలు రావడం లేదు. దీంతో వేరే మార్గం లేనందున నేను పండ్లు అమ్మవలసి వస్తోంది' అని అన్నారు. -
సినిమాలతో బిజీ.. కుటుంబాన్నే పట్టించుకోలేదు: స్టార్ హీరోయిన్
సెలబ్రిటీ స్టేటస్ అంత ఈజీగా వచ్చేది కాదు. దానికోసం తారలు ఎంతో కష్టపడతారు. పగలూ రాత్రి తేడా లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటారు. కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్లకుండా సెట్స్‌లోనే ఉండిపోతారు. మరికొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఎక్కడో షూటింగ్‌కు వెళ్లాల్సి వస్తుంది. వరుసపెట్టి ప్రాజెక్టులకు సైన్ చేసినవారైతే గడియారంతో పోటీ పడుతూ మరీ పని చేస్తుంటారు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి మనసారా మాట్లాడే సమయాన్ని కోల్పోతారు. ఎన్ని మిస్సయ్యానో నాకే గుర్తులేదు తాను కూడా ఒకానొక సమయంలో సినిమాల గురించే ఆలోచిస్తూ ఫ్యామిలీని పట్టించుకోవడమే మానేశానంటోంది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మా అమ్మ పుట్టినరోజులు నేను ఎన్ని మిస్సయ్యానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు తనకు ఫోన్ చేయకుండా ఊరుకున్నానో లెక్కే లేదు. ఎన్నిసార్లు దీపావళి పండగను మిస్సయ్యానో నాకే తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను విదేశాల్లో షూటింగ్లో ఉండేదాన్ని. ఎప్పుడూ సినిమా సినిమా అంటూ వీటన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయాను. జీవితం చాలా చిన్నది కానీ మా నాన్న చనిపోయాక నాకు అన్నీ అర్థమయ్యాయి. తనతో కలిసి ఎన్నటికీ దీపావళి పండుగ జరుపుకోలేనని బాధపడ్డాను. నాన్న అనారోగ్యానికి గురైనప్పుడే నాలో చలనం మొదలైంది. జీవితం చాలా చిన్నది.. మనం పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టి చిన్నచిన్నవాటి కోసం ఎక్కువ ఆలోచిస్తుంటాం, కంగారుపడుతుంటాం. మనకు నిజంగా ఏది ముఖ్యమో వాటి గురించి ఆలోచిస్తే జీవితం ఎంతో బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా క్యాన్సర్‌తో పోరాడుతూ 2013లో ప్రాణాలు విడిచారు. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్ -
Priyanka Chopra-Nick Jonas: చూడముచ్చటగా ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ (ఫొటోలు)
-
'నువ్వే నా జీవితంలో గొప్ప ఆనందం'.. ప్రియాంక ఎమోషనల్ పోస్ట్!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది తన భార్య, బేబీతో కలిసి ఇండియాకు కూడా వచ్చాడు. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. తాజాగా నిక్ బర్త్ డే సందర్భంగా ప్రియాంక విష్ చేసింది. భర్తకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. జోనాస్ తన జీవితంలో దొరికిన గొప్ప ఆనందం అని తెలిపింది. నిక్‌తో పాటు తన కుమార్తె మాల్టీ మేరీ ఫోటోను కూడా జతచేసింది. (ఇది చదవండి: ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్! ) ఇన్‌స్టాలో ప్రియాంక రాస్తూ.. 'నీ పుట్టిన రోజు జరుపుకోవడం నా జీవితంలో చాలా సంతోషమైంది. నాకు సాధ్యం కానీ మార్గంలో నడిపించారు. నీ ప్రపంచంలో నన్ను నీలా ప్రేమించేవారు లేరు. ఐ లవ్ యూ బర్త్ డే గాయ్. నీ కలలన్నీ భవిష్యత్తులో నిజమవ్వాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే బేబీ.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ప్రియాంక అభిమానులు సైతం నిక్ జోనాస్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక షేర్ చేసిన ఫోటోల్లో నిక్ గోల్ఫ్ ఆడుతున్న ఫోటో, తన కూతురు మాల్టీ పాలు తాగిస్తున్న అందమైన ఫోటోలు ఉన్నాయి. కాగా.. ప్రియాంక, నిక్ 2018లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ, ముంబ రెండు రిసెప్షన్స్ కూడా నిర్వహించారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా మాల్టీ మేరీని స్వాగతించారు. (ఇది చదవండి: సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్‌తో ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్‌లను దక్కించుకుంది. -
'అబ్బో ఎంత ప్రేమో'.. వేదికపైనే ముద్దులు పెట్టిన ప్రియాంక!
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఫ్యాన్స్ అత్యంత ఇష్టపడే సెలబ్రిటీ జంటలలో ఒకరు. ఆమె భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో నిక్ జోనాస్ ప్రదర్శన ఇస్తున్నారు. తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి ఈవెంట్లో పాల్గొన్నారు. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) తాజాగా ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. వేదికపై భర్తను ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ సందడి చేసింది. యాంకీ స్టేడియంలో ఒక సంగీత కచేరీలో ప్రియాంక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో వేదిక పక్కనే ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే సంగీత కచేరీకి హాజరైన ప్రియాంక తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. కాగా.. 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీకి స్వాగతం పలికారు. ప్రియాంక.. జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే! ) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. గతంలో ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు తమ కూతురితో తొలిసారి ఇండియా వచ్చారు నిక్, ప్రియాంక చోప్రా. (ఇది చదవండి: చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలీదు: ఆర్జీవీ) అయితే తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ సంగీత కచేరిలో పాల్గొన్నారు. అతని సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి శనివారం జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చారు. అయితే ఆ వేదికపై నిక్ జోనాస్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. నిక్ జోనాస్ ఎంతో ఉత్సాహంగా పాట పాడుతున్న సమయంలో వేదికపైకి మహిళల లో దుస్తులను విసిరేశారు. ఇది చూసిన నిక్ జోనాస్ అవేమీ పట్టించుకోకుండా పాట పాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ ఆర్టిస్ట్‌ను ఇలా అవమానించడం ఏంటని నిలదీస్తున్నారు. విశేషమేమిటంటే ఈ సంఘటన జరిగినప్పటికీ కచేరీ సజావుగా కొనసాగింది. కాగా.. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో ఇటీవల జరిగిన జోనాస్ బ్రదర్స్ కచేరీలో ఈ సంఘటన జరిగింది. ఊహించని సంఘటనతో ఈ కచేరీని కొద్దిసేపు నిలిపేసి మళ్లీ కొనసాగించారు. అయితే ప్రదర్శనను కొనసాగించడాన్ని చూసి నిక్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి చర్యలు కళాకారుల గౌరవాన్ని దెబ్బతీస్తాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల పట్ల గౌరవప్రదంగా ప్రవర్తించాలని అంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివీ సింగర్స్ సవాలుగా మారాయని.. అభిమానుల తీరు తీవ్ర అంతరాయం కలిగించేలా ఉందని అంటున్నారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
షారుక్ లేనిదే 'డాన్' లేదు.. ఇప్పుడేమో ఏకంగా!
‘మా డాన్ షారుక్ ఖాన్... వేరే ఎవర్నీ ఊహించలేం’ అంటూ మంగళవారం పలువురు షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అబిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. ‘డాన్, డాన్ 2’ తర్వాత రానున్న ‘డాన్ 3’లో షారుక్ నటించరన్న వార్త గుప్పుమనడంతో ‘‘షారుక్ ప్లేస్‌లో వేరే డాన్ని చూడలేం’’ అంటున్నారు ఫ్యాన్స్. మంగళవారం ఫర్హాన్ అక్తర్ చెప్పీ చెప్పనట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌తో ‘డాన్ 3’ అంశం పై చర్చ ఊపందుకుంది. ఆ వివరాల్లోకి వెళదాం.. హిందీ తెరపై డాన్ అంటే అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. ఆయన టైటిల్ రోల్లో రూపొందిన ‘డాన్’ (1978) సూపర్ డూపర్ హిట్టయింది. చంద్ర బారోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అయిన బడ్జెట్ దాదాపు రూ 70 లక్షలు. కానీ వసూళ్లు రూ. 7 కోట్లు. అంటే.. పదింతల లాభం. డాన్‌గా అమితాబ్ యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదే సినిమా తెలుగు రీమేక్ ‘యుగంధర్’ (1979)లో ఎన్టీఆర్, తమిళ రీమేక్ ‘బిల్లా’లో రజనీకాంత్ నటించారు. దక్షిణాదిన కూడా ఈ డాన్ సూపర్ హిట్. ది చేజ్ బిగిన్స్ ఎగైన్ అమితాబ్ బచ్చన్ డాన్ క్యారెక్టర్ అద్భుతంగా చేయడంతో ఇక డాన్ క్యారెక్టర్ అంటే ఆయనే అని ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ ప్రేక్షకులు. అలాంటి తరుణంలో ‘నేను ఉన్నాను’ అంటూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత షారుక్ ఖాన్ డాన్‌గా తెరపైకి వచ్చారు. షారుక్ డాన్ రోల్లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) రూపొందింది. అమితాబ్ ‘డాన్’కి రీ బూట్ వెర్షన్‌లా ఫర్హాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 30 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయించారు. ఇక అమితాబ్ తర్వాతి తరంలో డాన్ అంటే షారుక్ అనేలా కింగ్ ఖాన్ అద్భుతంగా నటించారు. షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘డాన్’ దాదాపు రూ. 105 కోట్ల వసూళ్లు రాబట్టి, సంచలన విజయం సాధించింది. ది కింగ్ ఈజ్ బ్యాక్ సిల్వర్ స్క్రీన్‌పై ఒక పాత్ర హిట్టయితే ఆ క్యారెక్టర్ని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అమితాబ్ ‘డాన్’ తర్వాత మళ్లీ డాన్ క్యారెక్టర్ని చూడాలనుకున్నారు. షారుక్ ‘డాన్’గా వచ్చి, అలరించారు. ఈ హిట్ డాన్ని అలా వదిలేస్తే ఎలా? మళ్లీ ఈ పాత్ర చేయాలని షారుక్ అనుకున్నారు. డాన్ కోసం కథలు తయారు చేయించాలని ఫర్హాన్ కూడా ఫిక్స్ అయ్యారు. అలా ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ సెకండ్ వెర్షన్ ఆరంభించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ విడుదలైన ఐదేళ్లకు ‘డాన్ 2’ (2011)ని వెండితెరపైకి వదిలారు. ఇందులోనూ షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’కి రెండింతల బడ్జెట్.. అంటే దాదాపు రూ. 80 కోట్లతో రూ΄పొందించారు. సుమారు రూ. 200 కోట్ల వసూళ్లతో రీబూట్ వెర్షన్లో వచ్చిన ఈ రెండో ‘డాన్’ కూడా ఘనవిజయం సాధించింది. ఫస్ట్ వెర్షన్‌కి ఫర్హాన్ దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించారు. రెండో వెర్షన్‌కి కూడా ఫర్హాన్ ఈ రెండు బాధ్యతలు చేపట్టగా, షారుక్ నటించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘డాన్ 3’లో రణ్వీర్ సింగ్? ప్రేక్షకులు, షారుక్ అభిమానులు డాన్ క్యారెక్టర్ని మరచిపోలేదు. షారుక్ కూడా డాన్ పాత్రతో అనుబంధం పెంచుకున్నారు. ఫర్హాన్‌కి కూడా ఆ పాత్ర అంటే మక్కువ. అందుకే 2011లో ‘డాన్ 2’ని రిలీజ్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకూ ‘డాన్ 3’ గురించి ఏదో సందర్భంలో ఇద్దరూ మాట్లాడుతూ వచ్చారు. ‘డాన్ 3’ కచ్చితంగా ఉంటుందని ఫర్హాన్ చెప్పుకుంటూ వచ్చారు. త్వరలో మూడో వెర్షన్‌కి శ్రీకారం జరిగే అవకాశం ఉందని మంగళవారం ఫర్హాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో స్పష్టం చేస్తోంది. ఆ వీడియోలో ‘3’ అంకె కనిపించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డాన్’ థీమ్ మ్యూజిక్ వినబడుతోంది. అలాగే కొత్త శకం ఆరంభం కాబోతోంది అని ఉంది. సో... ‘డాన్ 3’ రానుందని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఫర్హాన్ నటీనటులను ప్రకటించలేదు. దాంతో ఒకవేళ షారుక్ ఖాన్ అని ఫిక్స్ అయ్యుంటే.. ప్రకటించి ఉండేవారు కదా అనే చర్చ మొదలైంది. అలాగే కొత్త డాన్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తారనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. సో.. థర్డ్ వెర్షన్లో నటించబోయేది రణ్‌వీరే అని షారుక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. పైగా ‘కొత్త శకం ఆరంభం కాబోతోంది’ అన్నారు కాబట్టి హీరోని మార్చే ఆలోచనలో ఫర్హాన్ ఉన్నారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ ఫర్హాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేస్తే షారుక్ చేయాలి.. లేదా ఈ సిరీస్‌కి ఫుల్స్టాప్ పడాలన్నట్లుగా స్పందిస్తున్నారు. మరోవైపు రణ్వీర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. షారుక్ మళ్లీ డాన్‌గా కనిపిస్తారా లేక రణ్వీర్ తెర మీదకు వస్తారా? ఒకవేళ రణ్వీర్ వస్తే.. అప్పట్లో అమితాబ్‌కి దీటుగా నటించి, డాన్‌గా భేష్ అని షారుక్ అనిపించుకున్నట్లే రణ్వీర్ కూడా ప్రేక్షకుల మెప్పు ΄పొందగలుగుతారా? వేచి చూడాల్సిందే. -
బాల్యంలో బంకర్లో జీవనం.. ఈ స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఊయలలో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. చారడేసి కళ్లతో గుర్రుగా చూస్తున్న ఈమె బాలీవుడ్లో బోలెడన్ని సినిమాలు చేసింది. రామ్‌చరణ్‌తో కలిసి తెలుగులోనూ ఓ సినిమా చేసింది. కానీ ఆ సినిమా ఇక్కడ హిట్ కాకపోవడం, పెద్ద పేరు తీసుకురాకపోవడంతో బాలీవుడ్లోనే సెటిలైంది. అక్కడ రాజకీయాలు తట్టుకోలేక హాలీవుడ్‌కు మకాం మార్చింది. ఈ బ్యూటీ ఎవరో ఈపాటికే గుర్తుపట్టి ఉంటారు. ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా. బాత్రూమ్లో భోజనం మంగళవారం(జూలై 18) ప్రియాంక చోప్రా బర్త్‌డే. 1982లో జార్ఖండ్ జంషెడ్‌పూర్‌లో జన్మించిన ఆమె తాజాగా 41వ పడిలోకి అడుగుపెట్టింది. 13 ఏళ్ల వయసులో చదువుకోవడానికి అమెరికా వెళ్లిన ఆమెకు అక్కడ జాతి వివక్ష ఎదురైంది. ఆడిపాడుకునే వయసులో స్నేహితులెవరూ లేరు. నువ్వెక్కడిదానివి? అన్నట్లుగా విసురుచూపులు.. ఇవి తట్టుకోలేక, ఎవరితోనూ కలవలేక బాత్రూమ్కు వెళ్లి గబాగబా లంచ్ చేసేది. తల్లిదండ్రులు ఆర్మీలో ప్రియాంక తల్లిదండ్రులు మధు- అశోక్ చోప్రా.. ఇద్దరూ ఆర్మీ వైద్యులు. ప్రియాంకకు 4 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రికి లేహ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. లేహ్‌లో ప్రియాంక కుటుంబం బంకర్లో నివసించేది. వీళ్లు ఆర్మీ ఉద్యోగులు కావడంతో తరచూ ప్రదేశాలు మారుతూ ఉండేవారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చిన ప్రియాంక కట్టుబొట్టులోనూ మార్పు గమనించాడు ఆమె తండ్రి. తను అంత మోడ్రన్‌గా మారడం అశోక్ చోప్రాకు ఏమాత్రం నచ్చలేదు. వెంటపడ్డ అబ్బాయి.. కానీ ప్రియాంకకే నిబంధనలు ఓసారి ఒక అబ్బాయి తన వెంటపడి ఇంటిదాకా వెంబడిచడంతో ప్రియాంక భయపడిపోయింది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ఇలా జరిగినందుకు అశోక్ చోప్రా.. తన కూతుర్నే తిట్టాడు. ఆమె బెడ్రూమ్ కిటికీలకు జాలి కొట్టించాడు. తన జీన్స్, వెస్టర్న్ డ్రెస్సులు ఏవీ లేకుండా చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని కూడా నిషేధించాడు. ఇంట్లో కూడా సల్వార్ డ్రెస్సులే వేసుకోవాలని షరతు పెట్టాడు. ఈ విషయాలన్నీ ప్రియాంక ఓ షోలో బయటపెట్టింది. ఈ సంఘటనలేవీ ప్రియాంక ప్రతిభకు అడ్డు రాలేదు. 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్‌గా కిరీటం అందుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మూడు చోట్ల సర్జరీ చేసుకోవచ్చుగా అలా అని తన బాలీవుడ్ ఎంట్రీ అంత సులువుగా ఏం జరగలేదు. దర్శకనిర్మాతలు చెత్త సలహాలిచ్చేవారు. సినిమాల్లోకి వచ్చేముందు ఓ డైరెక్టర్ తనను మూడు సర్జరీలు చేయించుకోమన్నాడట. ఛాతీ, బ్యాక్, దవడ సర్జరీ చేసుకోమని సలహా ఇచ్చాడని ప్రియాంక తన ఆత్మకథ అన్ఫినిష్డ్లో రాసుకొచ్చింది. ఈ సూచనలు తిరస్కరించి.. చివరకు ఎలాగోలా తన ప్రతిభను నిరూపించుకుని వెండితెరపై స్టార్ హీరోయిన్గా మెరిసింది. తర్వాత హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది బ్యూటీ. ఈమె తెలుగులో రామ్‌చరణ్‌తో కలిసి తుపాకీ (హిందీలో జంజీర్) సినిమా చేసిన సంగతి తెలిసిందే! చదవండి: బోల్డ్ సీన్స్‌తో ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన హీరోయిన్ -
Priyanka Chopra 41st Birthday : టాప్ కలెక్షన్స్ మూవీలు (ఫొటోలు)
-
అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు
Bollywood highest tax-paying female actress: బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు హీరోలతో ధీటుగా తమ యాక్టింగ్ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే హీరోలతో పోలిస్తే రెమ్యనరేషన్ విషయంలో మాత్రం వివక్ష తప్పడం లేదు. అయితే నటనతో పాటు ఎండార్స్మెంట్స్, యాడ్స్ ద్వారా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్ ఎవరో తెలుసా? 500 కోట్లు నికర విలువ దీపికా పడుకోన్ బాలీవుడ్ విమెన్ సెలబ్రిటీలలో టాప్ టాక్స్పేయర్గా నిలుస్తోంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) బాలీవుడ్ సెలబ్రిటీలు, సినిమాలు చేయడంతో పాటు, విభిన్న వ్యాపారాలలో కూడా నిమగ్నమై భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్న నేపథ్యంలో దేశంలో అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో ఉంటున్నారు హీరోయిన్లు. ఇందులో తోటివారిలో ప్రత్యేకంగా నిలుస్తోంది దీపికా పడుకోన్. దీపికా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించిందట. ఇదే పరపరంలో తరువాత సంవత్సరాల్లో కొనసాగుతోందని బహుళ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే గత ఏడాది అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ దీపికా పదుకోన్. దీపికా పదుకోన్ సంపాదన సంవత్సరానికి రూ. 40 కోట్లు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేస్తోంది. ఇక ఎండార్స్మెంట్ల కోసం 7-10 కోట్లు వసూలు చేస్తుందట. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, దీపిక ప్రధాన ఆదాయ వనరు ఎండార్స్మెంట్లు. 2019లో 48 కోట్లు సంపాదించింది. పద్మావతి మూవీకోసం ఏకంగా రూ. 12 కోట్లు వసూలు చేసిందని బీటౌన్ టాక్. అంతేకాడదు అదే ఏడాది రోహిత్ శర్మ, అజయ్ దేవగన్, రజనీకాంత్ వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి అత్యధిక నికర విలువ కలిగిన టాప్ 10 భారతీయ సెలబ్రిటీలలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. (డాలరు Vs ఫెడ్: మరి బంగారం, వెండి ధరలు? ఇపుడు కొనడం మంచిదేనా?) ఈ రేంజ్లో టాక్స్ కంటిన వారిలో దీపికానే టాప్. గతంలో ఈ ప్లేస్‌లో కత్రినా కైఫ్ ఉంది.2013-2014 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్లకు పైగా పన్నులు చెల్లించింది. రూ.10 కోట్ల మార్కుకు చేరుకోనప్పటికీ ఇక ఈలిస్ట్లోఆ లియా భట్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఏడాది 5-6 కోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు సమాచారం. భారతీయ మహిళా సెలబ్రిటీలలో ధనవంతులైన హీరోయిన్లల లిస్ట్‌లో దీపికా రెండో స్థానంలో ఉంది. ప్రియాంక చోప్రా జోనాస్ నెట్‌వర్త్ 620 కోట్లు. కరీన్ కపూర్ ఖాన్, దాదాపు రూ. 485 కోట్లు, -
వరుసగా సినిమాల నుంచి తప్పుకుంటున్న టాప్ హీరోయిన్స్.. అసలేంటీ కథ!
ఒక్క ఛాన్స్ వచ్చేవరకే ఎవరైనా ఆ చాన్స్ కోసం కష్టపడాలి. ఆ ఒక్క చాన్స్ బంపర్ చాన్స్ అయితే ఆ తర్వాతి చాన్సులు అవే వస్తాయి. ఇందుకు ఓ ఉదాహరణ పూజా హెగ్డే, రష్మికా మందన్నా. స్టార్ హీరోయిన్లుగా ఈ ఇద్దరూ తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు. చివరికి ఈ ఇద్దరూ డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమాలు వదులుకునేంత బిజీ. అటు హిందీకి వెళితే ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ కూడా ఈ మధ్య ఒక సినిమా వదులుకున్నారు. ‘నో డేట్స్.. ఐ వాన్న వాకౌట్’ అంటూ ఈ నలుగురూ వదులుకున్న చిత్రాల గురించి, పూజ–రష్మిక వాకౌట్ చేయడం వల్ల ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి దర్శక–నిర్మాతలు పరిశీలిస్తున్న హీరోయిన్ గురించి తెలుసుకుందాం. గుంటూరు కారం మిస్ ‘ఒక లైలా కోసం’తో (2014) తొలిసారి తెలుగు తెరపై మెరిశారు పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇక్కడ ఫుల్ బిజీ. అటు తమిళ, హిందీ నుంచి అవకాశాలు దక్కించుకున్నారు. ఇలా బిజీగా ఉన్న పూజ ఇటీవల డేట్స్ సర్దుబాటు చేయలేక ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకున్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది పేర్కొన్న విషయం తెలిసిందే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు పూజ. ‘గుంటూరు కారం’ నుంచి వాకౌట్ చేయకపోయి ఉంటే ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడో సినిమా అయ్యుండేది. అలాగే ‘మహర్షి’ వంటి హిట్ తర్వాత మహేశ్‌బాబు–పూజ కాంబోలో రెండో సినిమా అయ్యుండేది. అయితే ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నప్పటికీ సూర్యదేవర నాగవంశితో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించే చాన్స్ ఉందట. సాయిధరమ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి పూజని హీరోయిన్గా తీసుకోవాలని నాగవంశి, సాయి సౌజన్య అనుకున్నారట. పూజని సంప్రదించారని సమాచారం. అయితే ఇంకా ఆమె కథ వినలేదట. నితిన్ సినిమా మిస్ ‘ఛలో’తో తెలుగుకి పరిచయమయ్యారు రష్మికా మందన్నా. ఈ సినిమాలో సింపుల్ గాళ్‌గా ఎంట్రీ ఇచ్చి, స్టార్‌గా ఎదిగారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’తో పాటు మరో తెలుగు సినిమా, హిందీ చిత్రాలతో రష్మిక ఫుల్ బిజీ. అందుకే నితిన్ సరసన ఒప్పుకున్న చిత్రానికి కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారట. నిజానికి ‘భీష్మ’ సినిమాతో నితిన్–రష్మిక హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఒకవేళ రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చేయగలిగితే మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేది. తెలుగులో రష్మిక ఎంట్రీ ఫిల్మ్ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తొలి హిట్ ఇచ్చిన దర్శకుడితో ‘భీష్మ’ వంటి రెండో హిట్ కూడా అందుకున్నారు రష్మిక. సో... వెంకీ కుడుములతో మూడో సినిమాని రష్మిక మిస్ అయ్యారు. రీప్లేస్ చేసేది ఎవరు? బాలీవుడ్లో ఈ మధ్య ప్రకటించిన చిత్రాల్లో ‘జీ లే జరా’ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి కారణం ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కావడం, చిత్రదర్శకుడు ఫర్హాన్ అక్తర్ కథానాయికలుగా ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్లను ఎన్నుకోవడం. అయితే హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వల్ల ఈ చిత్రాన్ని 2024లో ఆరంభించాలని ఫర్హాన్‌ని ప్రియాంక కోరారట. ఫర్హాన్ ఓకే చెప్పారని టాక్. ఈలోపు కత్రినా వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంతో ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేనన్నారట. కాగా ‘సిటాడెల్ 2’ స్టార్ట్ అయ్యే చాన్స్ ఉన్నందున టోటల్‌గా ఈ సినిమా నుంచి వాకౌట్ చేయాలని ప్రియాంక నిర్ణయించుకున్నారట. కత్రినా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఒకరు వదులుకున్న చాన్స్ ఆటోమేటిక్‌గా వేరొకరికి దక్కడం సహజం. అలా ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం శ్రీలీలకి, మీనాక్షీ చౌదరికి ప్లస్ అయింది. ముందు ఈ చిత్రంలో శ్రీలీలను రెండో హీరోయిన్గా అనుకున్నారు. కానీ పూజ తప్పుకోవడంతో ఆమె మెయిన్ హీరోయిన్ అయ్యారు. శ్రీలీల స్థానంలోకి మీనాక్షీ చౌదరి వచ్చారు. అలాగే నితిన్ సినిమా నుంచి రష్మికా మందన్నా తప్పుకోవడంతో ఆ చాన్స్ కూడా శ్రీలీలకే వెళ్లనుందని టాలీవుడ్ టాక్. అటు హిందీ ‘జీ లే జరా’ విషయానికొస్తే.. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ తప్పుకోవాలనుకోవడంతో అనుష్కా శర్మ, కియారా అద్వానీ వంటి నాయికల పేర్లను పరిశీలిస్తున్నారట ఫర్హాన్ అక్తర్. -
ఒక్క వెబ్ సిరీస్.. రూ.2000 కోట్లు వృథా!
సినిమా చూడాలంటే ఒకప్పుడు థియేటర్ లోనే... ఏదేమైనా ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓటీటీ సంస్థలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో స్టార్స్‌ని తీసుకొచ్చి భారీ బడ్జెట్స్ పెడుతున్నాయి. వందల కోట్ల లాభాలు దక్కించుకోవాలని చూస్తున్నాయి. కట్ చేస్తే ఘోరమైన నష్టాలు చూస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటోంది. స్వయంగా ఆ సంస్థ సీఈఓ ఈ విషయాన్ని బయటపెట్టారు. 'సిటాడెల్' ఫ్లాప్ ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఖరీదైన వెబ్ సిరీసుల్లో 'సిటాడెల్' ఒకటి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మన దేశంలోనూ రిలీజైంది. చాలామందికి నచ్చే యాక్షన్ తరహా స్టోరీతోనే తీశారు. కానీ పెద్దగా ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఈ సిరీస్ కోసం దాదాపు 250 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.2000 కోట్లు. ఇప్పుడు అదంతా వృథా అయినట్లే! ఈ సిరీస్ మీద ప్రైమ్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అవన్నీ కూడా గంగలో కలిసిపోయినట్లే. (ఇదీ చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) సమంత కూడా ప్రియాంక చోప్రాతో తీసిన 'సిటాడెల్'.. ఇండియన్ వెర్షన్‌ని హీరోయిన్ సమంతతో తీశారు. 'ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. సమంతతో పాటు వరుణ్ ధావన్ లీడ్ రోల్ చేశాడు. దీని షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఒరిజినల్ సిరీస్ మన దగ్గర ఆడలేదు. సమంత 'సిటాడెల్' హిట్ అయితే అమెజాన్‌కు కొంతైనా లాభాలు వస్తాయి. లేదంటే కష్టమే! ఉద్యోగులకు మూడింది 'సిటాడెల్' సిరీస్‌తో పాటు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన డైసీ జోన్స్ అండ్ ది సిక్స్, ది పవర్, డెడ్ రింగర్స్, ది ఫెరిఫెరల్ లాంటి షోలు కూడా ఫెయిలయ్యాయి. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కోసమైతే ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. కానీ అది కూడా నిరాశపరిచింది. ఈ పరిణామాలన్నీ సీరియస్ గా తీసుకున్న అమెజాన్.. ఇలా ఫెయిలైన సిరీస్‌లను కొనసాగించడం ఆపాలని నిర్ణయించుకుంది. దీనికి బాధ్యులైన ఉద్యోగులని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒక్కసారి దెబ్బ తగిలితే గానీ నొప్పి తెలిసి రాదు! (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) -
ఇండియన్ సినిమాలపై చీప్ కామెంట్ చేసిన ప్రియాంక
దక్షిణాది చిత్రంతో కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ గ్లోబల్ నటిగా ప్రియాంక చోప్రా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో పాటు పలు విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..) అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో 2016లో జరిగిన ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రియాంక హాజరయింది. అక్కడ ఒక అంతర్జాతీయ మీడియాకు చెందిన యాంకర్ భారతీయ సినిమాలపై తన అభిప్రాయం చెప్పాలంటూ కోరింది. దీంతో తముడుకోకుండా వెంటనే భారతీయ సినిమాలన్ని ‘హిప్స్ అండ్ బి**బిస్’ గురించే ఉంటాయి. ఒక రకంగా వాటిని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తే చాలు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. అయితే, అది పాత వీడియో అయినప్పటికీ ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్ సిరీస్ 'సిటడెల్' విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ప్రియాంక పేరు ట్రెండింగ్ అయింది. ప్రియాంక తీరుపై సోషల్ మీడియాలో ఒకరు ఇలా రియాక్ట్ అయ్యారు 'భారత చలనచిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ వేదికపై ఇలా చీప్‌గా మాట్లాడటం చాలా బాధించిందని తెలుపుతూ అమెను ఇండియన్ సినిమాల్లో బ్యాన్ చేయాలి.' అని కోరాడు. మరోక వ్యక్తి ఇలా అన్నాడు, 'నేను అమెరికన్‌ని.. ఆమెకు అమెరికన్ల నుంచి ప్రజాదరణ లేదు.. నిక్ జోనస్ భార్య అని చెప్పడం తప్ప ప్రియాంక గురించి ఎవరూ ఇక్కడ మాట్లాడటం నేను వినలేదు.' అని తెలిపాడు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) -
వాళ్లకు కావాల్సిన వారికే అవకాశాలు: తాప్సీ
సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఎప్పటికపుడు వైరల్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్లో ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఇక్కడ తను అనుకున్నంతగా సక్సస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చేసి తక్కువ సమయంలోనే క్లిక్ అయింది. అయితే తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో అవి తెగ వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌పై పలు ఆరోపణలు చేసింది. అవి నిజమే అంటూ తాప్సీ కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి; Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) బాలీవుడ్లో ఒక సినిమా కోసం ఎవరిని తీసుకోవాలనేది కొంతమంది ప్రముఖ నటీనటులు డిసైడ్ చేస్తారని తాప్సీ చెప్పుకొచ్చింది. వారికి నచ్చకపోతే టాలెంట్ ఉన్నా పక్కన పెట్టేస్తారు. ఒక్కోసారి క్యారెక్టర్‌కు సూట్ అయ్యేవాళ్లను కూడా తీసుకోరు. కానీ వారికి కావాల్సిన వ్యక్తులను మాత్రం తీసుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీ వాళ్లను కూడా రిఫర్ చేస్తారు. హిందీలో ఫేవరిటిజం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అవకాశాల కోసం తిరగడం అనవసరం అని తాప్సీ తెలిపింది. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) -
స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు చెక్కేసిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లికి ముందే అండాలను భద్రపరుచుకుంది. అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడిన ఆమె గతేడాది సరోగసి ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన గారాలపట్టికి ముద్దుగా మాల్తీ మేరీ అని పేరు పెట్టుకుంది. మాల్తీ క్యూట్ ఫోటోలు, ఆమె ఆడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరలవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. ఈ సందర్భంగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రియాంక ముద్దుల తనయ మాల్తీ ఓ బ్యాగుతో ఆడుకుంటున్న ఫోటో జనాలను బాగా ఆకర్షిస్తోంది. సరదాగా ఆ బ్యాగు ధర ఎంతుంటుందని నెట్టింట ఆరా తీసిన నెటిజన్లు దాని ధర తెలిసి ఉలిక్కిపడుతున్నారు. అవును మరి, ఆ బ్యాగు వందల్లోనూ, వేలల్లోనూ లేదు. ఏకంగా లక్షలు పలుకుతోంది. గ్రీన్ కలర్లో ఉన్న ఈ బ్యాగు ధర అక్షరాలా రెండు లక్షల 45 వేలని తెలుస్తోంది. బల్గరీ సెర్పంటి ఫరెవర్ క్రాస్బడీ రకానికి చెందిన ఈ కాస్ట్లీ బ్యాగు ధర అభిమానులు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. 'భారీగా సంపాదిస్తుంది కనుకే అంతలా ఖర్చు పెడుతోంది', 'రెండున్నర లక్షలు వృధా చేసింది', 'ఈ డబ్బుతో పేదింట పెళ్లి అయిపోతుంది', 'ఈ సెలబ్రిటీలంతా అధిక ధర ఉన్న బ్రాండెడ్ వస్తువులనే వాడతారు, కొందరికి అవి గిఫ్టుగా కూడా వస్తుంటాయి. అంతమాత్రానికి మనం ఇంతలా ఆశ్చర్యపోవడం అవసరం అంటారా?' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! -
అదిరిపోయిన ప్రశాంత్ నీల్ ప్లానింగ్?
-
మొదట్లో చాలా భయపడేదాన్ని: ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో భయపడినట్లు తెలిపింది. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. '20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకునేదాన్ని. మానసికంగా ఇబ్బందులు పడ్డా. ఏదైనా సినిమా ఫెయిలైనా.. ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధపడేదాన్ని. నేను చూసిన బిగ్గెస్ట్ స్టార్స్‌తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక ఓ కూతురు కూడా జన్మించింది. తన ముద్దుల కూతురికి మేరీ మాల్టా అని పేరు పెట్టింది. (ఇది చదవండి: పొలిటీషియన్‌ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!) -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా: స్టార్ హీరోయిన్ కామెంట్స్
నటి శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తనకు అనిపించింది బయటకు చెప్పే బోల్డ్ అండ్ బ్యూటీ ఈమె. స్వయంకృషితో ఎదిగిన నటి శ్రుతిహాసన్. నిజ జీవితంలోనూ ఆమె ఒక సంచలనమే. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ వారసురాలైనా.. ఆయన పేరు ఏ విధంగానూ వాడుకోవడానికి ఇష్టపడని నటి. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అయితే తన తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తను మాత్రం వారి నుంచి ఎలాంటి ఆర్థికసాయాన్ని ఇప్పటి వరకు కోరలేదని బహిరంగంగానే చెప్పింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రుతిహాసన్.. ఇటీవల తెలుగులో నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. ఇకపోతే హీరో హీరోయిన్ల పారితోషికం విషయంలో సమానత్వం కోసం కొందరు హీరోయిన్లు బహిరంగంగానే తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. హీరోలకు తామేమి తక్కువ కాదని చిత్ర విజయాల విషయంలో తమ భాగం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నటి శ్రుతిహాసన్ కూడా పేర్కొనడం విశేషం. (ఇది చదవండి: నటుడి రెండో పెళ్లి.. మొదటి భార్య పోస్టులు వైరల్..) ఆ మధ్య ప్రియాంక చోప్రా తన కెరీర్లో 20 ఏళ్ల తర్వాత హీరోకు సమానంగా తమ పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన నటి శ్రుతిహాసన్ హీరోయిన్లకు హీరోలకు సమానంగా ఇవ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్లో హీరోకు సమానంగా అందుకున్నారని.. ఇక్కడ కూడా ఆ రోజు రావాలని తాను ఎదురుచూస్తున్నానని పేర్కొంది. -
ఆ డైరెక్టర్ లోదుస్తులు చూపించమన్నాడు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు) అయితే ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది. 2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది. (ఇది చదవండి: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి) -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను: శ్రుతీహాసన్
‘‘ఓ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ సమానమైన పారితోషికాన్ని అందుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం 76వ కాన్స్ చలన చిత్రోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు శ్రుతీహాసన్. ఈ సందర్భంగా ‘హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకోవడానికి నాకు రెండు దశాబ్దాలు పట్టింది’’ అన్న ప్రియాంకా చోప్రా మాటలపై మీ స్పందన ఏంటి? అన్న ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. ఈ విషయంపై శ్రుతీహాసన్ స్పందిస్తూ– ‘‘ప్రియాంకా చోప్రా అద్భుతం సాధించారు (హాలీవుడ్లో హీరోకి సమానంగా పా రితోషికం అందుకున్న విషయాన్ని ఉద్దేశించి). మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం అనే అంశం గురించి కనీసం చర్చ కూడా లేదు. కానీ హీరోలతో పాటుగా హీరోయిన్లకి కూడా సమాన వేతనం లభించే రోజు రావాలని ఎదురు చూస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘గతంలో నేను కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పా ల్గొన్నాను. ఈసారి నేను నటించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసం కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నాను. విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్న కాన్స్ వేడుకల్లో దేశం తరఫున నేను ఓ ప్రతినిధిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోల సరసన మెప్పించింది. అప్పట్లో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్న బాలీవుడ్ భామ ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సిటాడెల్ ప్రమోషన్లలో పాల్గొన్న ప్రియాంక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శృంగారం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్య్వూలో ఫస్ట్ డేట్లోనే మీరు శృంగారానికి ఒప్పుకుంటారా అని ప్రశ్నించగా.. షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఒప్పుకుంటానని తెలిపింది. దీనివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుందని. భవిష్యత్‌లో మనతో ఎలా ఉంటాడో అనే విషయాలు తెలుస్తాయంటూ మనసులోని భావాలను బయటపెట్టింది. (ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!) పెళ్లికి ముందు ప్రియాంక చోప్రా చాలా మందితో డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవలేదని తెలిపింది. దీంతో రిలేషన్షిప్స్ వెంట వెంటనే మారాయని వెల్లడించింది. ఇండస్ట్రీలోని గొప్ప వ్యక్తులతో డేటింగ్ చేశానని పేర్కొంది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనస్‌తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెద్దలను ఒప్పించి 2018లో పెళ్లి చేసుకుంది. ప్రియాంక చోప్రా గతేడాది సరోగసి విధానంలో ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. ఇటీవలే తన బిడ్డతో కలిసి ఇండియాలో కూడా పర్యటించింది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో చాలా బోల్డ్‌గా కనిపించింది. శృంగార సన్నివేశాల్లో నటించేటపుడు కాస్త ఇబ్బంది పడినట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!) -
'ఆర్ఆర్ఆర్' చూసేంత టైం నాకు లేదు: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా సత్తా చాటుతుంది. హాలీవుడ్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆర్ఆర్ఆర్ సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూశారా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. లేదు నాకు అంత సమయం లేదు. నేను సినిమాలు చూడను. కానీ టీవీ షోలు చూస్తుంటా అంటూ బదులిచ్చింది ప్రియాంక. కాగా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యూఎస్ వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీంకు ప్రియాంక చోప్రానే స్వయంగా ఆతిథ్యం ఇచ్చింది. అలాంటిది సినిమా చూడలేదని చెప్పడం గమనార్హం.కాగా ఆస్కార్ సాధించిన ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించి.. సినిమా చూసేంత సమయం తనకు లేదని ప్రియాంక చెప్పడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్ అయ్యిండి, ఇన్ని అవార్డులు సాధించిన సినిమాను చూసేందుకు రోజులో కనీసం 3గంటలు కూడా సమయం లేదా అంటూ ప్రియాంక తీరును విమర్శిస్తున్నారు. -
నేను డేటింగ్ చేసింది వీళ్లతోనే... ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
-
పెళ్లికి ముందు నాకు, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు ఉన్నాయి: హీరోయిన్
ప్రేమ, పెళ్లి రెండూ ఒకటి కావు. అందరూ ప్రేమిస్తారు, కానీ కొందరే దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లి సక్సెస్ అవుతారు. మరికొందరు తొలిచూపులోనే ప్రేమించినవాడిని కాకుండా మలి చూపులో లవ్వాడిన వ్యక్తితోనే ఏడడుగులు వేస్తారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అదే కోవలోకి చెందుతుంది. బాలీవుడ్లో ఆమె ఎంతోమందితో ప్రేమాయణం సాగించింది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఏం తక్కువ తినలేదు. ఆమె తన జీవితంలోకి వచ్చేముందు ఎందరితోనో డేటింగ్ చేశాడు. తాజాగా ఈ విషయాల గురించి ప్రియాంక చోప్రా.. అలెక్స్ కూపర్ 'కాల్ హర్ డాడీ' పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడింది. 'నేను నిక్ జోనస్‌ను కలవడానికి ముందు కొందరిని ప్రేమించాను. ఒకరితో బ్రేకప్ అవగానే మరొకరిని ప్రేమించేదాన్ని. ఒక బంధానికి, మరొక బంధానికి మధ్య పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు. నటిగా ఎంతో బిజీగా ఉండేదాన్ని. ఈ క్రమంలో నాతో పని చేసినవారితో డేటింగ్ చేసేదాన్ని. కొందరితో బంధాలు విషాదంగా ముగిసిపోయాయి. కానీ నేను డేటింగ్ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరి బ్రేకప్ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి చాలా టైం తీసుకున్నా. ఎందుకు? నా ప్రేమలన్నీ విఫలమయ్యాయని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత నిక్ జోనస్‌ను కలిశాను. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్ తీసుకున్నాడు. అతడు కూడా నా కంటే ముందు చాలామందిని ప్రేమించాడు. కానీ అతడి గతం కన్నా తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమనుకున్నాను. అయిపోయినదాన్ని తవ్వడం అనవసరం అనిపించింది. తనతో జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను' అని చెప్పుకొచ్చింది ప్రియాంక. కాగా నిక్ జోనస్ గతంలో మిలీ సైరస్, సెలీనా గోమెజ్, ఒలీవియా కుల్పో, లిలీ కొల్లిన్స్, కెండల్ జెన్నర్, కేట్ హడ్సన్.. ఇలా పలువురితో ప్రేమాయణం నడిపాడు. ఇకపోతే నిక్, ప్రియాంకలు కొంతకాలం పాటు డేటింగ్ చేశాక 2018లో రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మాల్తీ అనే గారాలపట్టి ఉంది. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం -
ముక్కు సర్జరీ వికటించింది.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధన్యత ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెరపై మరింత అందంగా కనిపించేందుకు హీరో,హీరోయిన్లు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. జిమ్‌లో గంటలకొద్దీ వర్కవుట్స్, స్క్రిక్ట్ డైట్..ఇలా ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఏకంగా సర్జీరల బాట కూడా పట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, బోలెడంత మంది హీరోయిన్లు కృత్రిమ పద్దతులను ఉపయోగించి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వారిలో కొందరు సర్జరీ తర్వాత మరింత అందంగా తయారైతే, మరికొందరికి ఆ సర్జరీలు వికటించి ఉన్న అందం పోగోట్టుకున్నారు. గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే ముక్కు సర్జరీ మాత్రం వికటించి డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే ఒప్పుకుంది. ఇటీవల ఓ షోకు హాజరైన ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ''ఇది జరిగి సుమారు 20ఏళ్లవుతుంది. ఒకానొక సమయంలో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. జలుబు కూడా చాలాకాలం వరకు తగ్గలేదు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే నాసికా కుహరంలో పాలిప్‌ను తొలగించాలని సిఫార్సు చేశారు. అయితే అనుకోకుండా ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో నా ముఖం అంతా మారిపోయింది. అప్పటికే నేను కొన్ని సినిమాలు సైన్ చేశాను. కానీ నా ముఖంలో సర్జరీ తాలూకూ మార్పులు స్పష్టంగా తెలిసిపోయి కాస్త అందవిహీనంగా తయారయ్యాను. దీంతో నన్ను 3 సినిమాల్లో తీసేశారు. అంతేకాకుండా ఓ సినిమాలో హీరోయిన్ రోల్‌కు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాల్సి వచ్చింది. ఇలా చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ పోతున్న సమయంలో చాలా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కెరీర్ ముగుస్తుందని చాలా బాధపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. ముక్కును కరెక్ట్ చేసుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకోమని నన్ను ప్రోత్సహించారు. అలా మళ్లీ ఆ సర్జరీతో కాన్ఫిడెన్స్ వచ్చింది'' అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. -
రాత్రి ఓ యువకుడు ఏకంగా బాల్కనీలోకి దూకేశాడు: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. (ఇది చదవండి: Priyanka Chopra: భారత్‌కు ప్రియాంక చోప్రా.. అలా తొలిసారిగా టూర్!) అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియాంక తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా తనని క్రమశిక్షణగా వ్యవహరించమన్నారని తెలిపింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. ప్రియాంక మాట్లాడుతూ.. 'చదువు కోసం 12 ఏళ్ల వయసులోనే యూఎస్ వెళ్లా. అక్కడి కల్చర్ నాకు అలవాటైంది. అక్కడి వాతావరణానికి నా జుట్టు మొత్తం రాలిపోయింది. నా ఫేస్ అంద విహీనంగా మారిపోయింది. నాలుగేళ్ల తరువాత ఇండియాకు తిరిగి వచ్చా. ఇంటికి తిరిగొచ్చాక మేం ఉండే టౌన్లోనే ఓ స్కూల్లో చేరా. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కొంతమంది అబ్బాయిలు నా వెంటపడుతూ మా ఇంటి వరకు వచ్చేవారు.' అంటూ చెప్పుకొచ్చింది. ఒక రోజు రాత్రి జరిగిన భయంకరమైన సంఘటనను ప్రియాంక వివరించింది. (ఇది చదవండి: మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) ప్రియాంక వివరిస్తూ.. 'ఒక రోజు రాత్రి ఓ అబ్బాయి మా బాల్కనీలోకి దూకాడు. అది చూసి నేను అరుస్తూ నాన్న దగ్గరకి పరిగెత్తా. దీంతో నాన్న నా గది కిటికీనీ పూర్తిగా క్లోజ్ చేశాడు. అంతేకాకుండా నాకు కొన్ని కండీషన్స్ పెట్టారు. యూఎస్లాగా ఇక్కడ ఉంటానంటే కుదరదు. ఇక్కడ జీన్స్‌లను వేసుకోకూడదు. చాలా క్రమశిక్షణతో మెలగాలి. ఇక అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా తోడుగా ఒక వ్యక్తిని పంపించేవారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. మా ఫాదర్ అలా ఎందుకు చేశారో ఇప్పుడర్థమైంది. ఆయనను కోల్పోవటం దురదృష్టకరం.' అని తెలిపింది. కాగా.. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. త్వరలో ఆమె లవ్ ఎగైన్, జీ లే జరాలో కనిపించనుంది. -
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు)
-
మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!
న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. మెట్‌గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్లో తళుక్కు మనగా, తొలిసారిగా భర్తతలో కలిసి సందడి చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్‌వైట్ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్‌కు సిరీస్ సిటాడెల్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రిలయన్స్అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్‌బెల్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) Her $25 million @Bulgariofficial necklace is going to be auctioned off after #MetGala @priyankachopra pic.twitter.com/LK0otVUHea — SAMBIT ⚡ (@GirlDontYell) May 2, 2023 -
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు)
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు -
Priyanka Chopra: సిటాడెల్ ప్రమోషన్స్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా (ఫొటోలు)
ప్రి -
అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లి, అక్కడ జోరుగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన నేను హాలీవుడ్లో కొత్త నటిలా కెరీర్ ఆరంభించినప్పుడు ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆడిషన్స్ ఇవ్వడం తప్పని అనడంలేదు. ఎందుకంటే ఆడిషన్స్ అనేవి మన ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. ఇండస్ట్రీలో ఉన్న కనెక్షన్స్తో కాదు. ఆడిషన్స్‌లో గెలిచి, చాన్స్ తెచ్చుకోవడం అప్పట్లో న్యూ కమర్గా హాలీవుడ్లో నాకో మంచి అనుభూతి. అయితే ఇప్పుడు ‘సిటాడెల్’కి ఆడిషన్స్ ఇవ్వ కుండానే సెలక్ట్ అయ్యాను. అంతగా నా ప్రతిభని నిరూపించుకున్నాను. ఇప్పుడు పోస్టర్స్‌లో నాకూ సమభాగం దక్కుతోంది. అలాగే, మేల్ స్టార్స్‌కి ఈక్వల్‌గా పారితోషికం తీసుకుంటున్నా. హాలీవుడ్‌కి వెళ్లిన పదేళ్లకు నేను సాధించుకున్న ఘనత ఇది’’ అన్నారు. ఇంకా భారతీయ తారల గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియన్ స్టార్స్ ఉంటున్నారు. తెర పైనే కాదు.. తెరవెనక కూడా ప్రతిభను చాటుకుంటున్నారు. వాళ్లందరూ హాలీవుడ్‌కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనవాళ్లకి అంత ప్రతిభ ఉంది’’ అన్నారు. -
రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!
ప్రియాంక చోప్రా బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో బిజీగా ఉన్నారు. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా లండన్‌లో నిర్వహించిన సిటాడెల్ ప్రీమియర్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం తన భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి రోమ్ వేకేషన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో రోమ్ వీధుల్లో నడుస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఆ వీడియోలో ప్రియాంక, నిక్ జోనాస్ లిప్ కిస్ చేస్తూ కనిపించారు. అక్కడే ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీరి కూతురికి మాల్టీ మేరీ అని పేటు పెట్టారు. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
రిచర్డ్‌తో బోల్డ్ సీన్స్.. బాడీ పార్ట్స్ అన్ని చేతులతో కప్పేసుకున్నాం: ప్రియాంక
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్ హీరో రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘సీటాడెల్’. రస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ స్పై థ్రిల్లర్ ఈ నెల 28నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్లో ప్రియాంకను అర్థనగ్నంగా చూపించారు. అంతేకాదు రిచర్డ్‌తో కలిసి బెడ్ రూమ్ సీన్స్ కూడా ఉన్నాయట. ఈ బోల్డ్ సీన్స్ చిత్రీకరణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఒకరికొకరు ఎలా సహకరించుకున్నారో తాజాగా ప్రియాంక చోప్రా వెల్లడించింది. (చదవండి: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ సంచనల వ్యాఖ్యలు.. నెటిజన్స్ ఫైర్) ‘సిటాడెల్ వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించాను. అలాంటి సన్నివేశాలు చిత్రీకరించిన సమయంలో ఇద్దరం ఒకరికొకరం మద్దతుగా నిలిచాం. కొన్ని అసౌకర్యమైన యాంగిల్స్‌లో నటించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీలయ్యాం. కెమెరాలో మా బాడీ పార్ట్స్ స్పష్టంగా కనిపించకుండా చేతులతో కప్పి ఉంచుకునేవాళ్లం. రిచర్డ్ కూడా ఇక్కడ చేయి పెట్టుకో..అక్కడ కప్పేసేయ్ అని గైడ్ చేసేశాడు. ఇద్దరం ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్నిహితంగా ఉండే సీన్స్‌ని పూర్తిం చేశాం’అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్-డీకే దర్శక ద్వయం ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తుంది. ఇండియన్ వెర్షన్లో ప్రియాంక పోషించిన పాత్రలో సమంత నటిస్తోంది. ప్రియాంక మాదిరే సమంత కూడా అంతే బోల్డ్‌గా నటిస్తుందా లేదా డోస్‌ని తగ్గించి చూపిస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. -
మరోసారి బోల్డ్‌గా సమంత.. అలాంటి సీన్లలో నటిస్తుందా?
సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్‌లో రాజీగా డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుంది.అయితే సామ్ నటనపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తే.. మరికొంతమంది విమర్శలు చేశారు. మరీ బోల్డ్‌గా నటించిందని ట్రోల్ చేశారు. కానీ చివరకు ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కొట్టి సామ్‌ని పాన్ ఇండియా హీరోయిన్గా చేసింది. ఇక ఇప్పుడు అంతకు మించిన బోల్డ్ సీన్లలో నటించానికి సామ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘సీటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ ను తెరకెక్కించిన రాజ్-డీకే దర్శక ద్వయం ఈ సిరీస్ ఇండియా వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఫ్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో సమంతను మరింత బోల్డ్‌గా చూపించారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ విడుదలైంది. ఇంగ్లిష్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్లో హాట్ బెడ్ రూమ్ సీన్లను కూడా చూపించారు. ప్రియాంకను అర్థనగ్నంగా చూపించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక కూడా తాను ఈ సిరీస్‌లో బోల్డ్‌గా నటించానని చెప్పుకొచ్చింది. అయితే ఇండియన్ వెర్షన్లో ప్రియాంక పోషించిన పాత్రలో సమంత నటిస్తోంది. సో.. ప్రియాంక మాదిరే సమంత కూడా అంతే బోల్డ్‌గా నటిస్తుందా లేదా డోస్‌ని తగ్గించి చూపిస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వెంకటేశ్, రానా నటించిన ‘రానా నాయుడు’ బూతు సిరీస్‌గా పేరు తెచ్చుకుంది. విమర్శలు రావడంతో తెలుగు డబ్బింగ్‌ని తొలిగించారు. మరి సీటాడెల్‌లో సమంత బోల్డ్‌గా కనిపిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. -
ప్రియాంక చోప్రా లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
సిటాడెల్ కోసం ఫ్యామిలీతో ముంబై వచ్చిన ప్రియాంక చోప్రా
-
పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి షాకిచ్చింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలోని రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వచ్చానని చెప్పింది. దీంతో ప్రియాంక ప్రస్తుతం ఇండిస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: 1997లో ప్రారంభమైన కమల్ చిత్రం షూటింగ్.. 26 ఏళ్ల తర్వాత సెట్‌పైకి! అలాగే అదే ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయం గురించి షాకింగ్ విషయం చెప్పింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నానంది. కాగా ప్రియాంక సరోగసికి వెళ్లడంపై ఆమెకు ప్రశ్న ఎదురవగా అసలు విషయం వెల్లడించింది. ‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయంతో వారితో గడపడానికే ఇష్టపడతాను. అందుకే పెళ్లికి ముందే నా అండాలను దాచిపెట్టాను. అప్పట్లో నేను ఎవరితో పిల్లలను కనాలనుకున్నానో ఆ వ్యక్తిని కలవలేకపోయాను. అందుకే అండాలను దాచుకోమ్మని మా అమ్మ మధు చోప్రా (గైనకాలజిస్ట్) సలహా ఇచ్చారు. చదవండి: రానా నాయుడు వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం! అమ్మ సలహా మేరకు 30 ఏళ్ల వయసులోనే నా అండాలను దాచిపెట్టుకున్నాను. అలా చేయడం వల్ల నాకు చాలా స్వేచ్చగా అనిపించింది. ఆ స్వేచ్చతోనే నా కెరీర్లో ముందుకు వెళ్లాను. అనుకున్నది సాధించగలిగాను. నా లక్ష్యాలను చేరుకోగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా తనకు పిల్లలను కనాలనే ఆశ ఉండేదని, కానీ తన భర్త నిక్ జోనస్ వయసు తక్కువ ఉండుటంతో తనకి అప్పుడే పిల్లలను కనే ఇష్టం ఉందో? లేదో? అనే అనుమానం ఉండేదని పేర్కొంది. ఆ కారణం చేతనే పెళ్లికి ముందు నిక్‌తో డేటింగ్‌కి కూడా ఒప్పుకోలేదంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. -
'ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ మూవీ'.. ప్రియాంక చోప్రాపై ట్రోలింగ్
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్‌కు నామినేట్ అయినప్పటి నుంచి అవార్డు అందుకునేవరకు చిత్రయూనిట్‌కు సపోర్ట్‌గా నిలబడింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చినప్పుడు ఇండియన్ సినిమా మరో మెట్టు ఎక్కిందని సంబరపడిపోయింది. రామ్‌చరణ్, ఉపాసనలకు లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో పార్టీ కూడా ఇచ్చింది. ఇంత చేసిన ప్రియాంక తాజా ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ను తమిళ మూవీగా పేర్కొంటూ ట్రోలింగ్ బారిన పడింది. తాజాగా ప్రియాంక చోప్రా ఓ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇక్కడ బాలీవుడ్ సినిమాల గురించి ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడగ్గా వాటికి తీరికగా సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమ కొందరి చేతుల్లోనే ఏకీకృతమైందన్న విషయం వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలావరకు మారాయి అని చెప్పుకొచ్చింది. ఇంతలో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రస్తావించడంతో మధ్యలో కలగజేసుకున్న ప్రియాంక.. అది బాలీవుడ్ చిత్రం కాదని, ఒక తమిళ సినిమా అని అభివర్ణించింది. 'ఆర్ఆర్ఆర్ ఒక గ్రేట్, బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. అది మనందరికీ అవెంజర్స్ మూవీవంటిది' అని పేర్కొంది. ఇది విన్న జనాలు.. 'మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్ను బాలీవుడ్ మూవీ అన్నారు, ఇప్పుడేమో తమిళ చిత్రం అంటున్నారు... తెలుగు చిత్రమని ఇంకెప్పుడు గుర్తిస్తారు?', 'ఏంటి ప్రియాంక.. ఆఖరికి నువ్వు కూడానా? ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలిగా', 'మీరు మా మనోభావాలు దెబ్బ తీశారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడు: కంగన సంచలన ఆరోపణలు
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌పై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసింది. హీరోయిన్ ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడని, అందుకే ఆమె బాలీవుడ్‌ను వదిలి వెళ్లిందని చెప్పింది. తాను బాలీవుడ్‌కు దూరం కావడంపై తాజాగా ప్రియాంక చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. ఓ అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకనే హాలీవుడ్‌కి వచ్చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీనిపై కంగనా ట్విటర్ వేదికగా స్పందించింది. ‘బాలీవుడ్లో కొందరు గ్యాంగ్‌గా మారి ప్రియాంకను అవమానించారు. స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లిపోయేలా చేశారు. కరణ్ జోహార్ ఆమెను బ్యాన్ చేశారనే విషయం అందరికి తెలుసు. షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక ఫ్రెండ్షిప్ చేయడం కరణ్‌కు నచ్చలేదు. అందుకే ఆమెను దూరం పెట్టాడు. ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేసినందుకు కరణ్ బాధ్యత వహించాలి. అమితాబ్, షారుఖ్ వంటి వారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు’అని కంగనా వరుస ట్వీట్స్ చేసింది. This is what @priyankachopra has to say about bollywood, people ganged up on her, bullied her and chased her out of film industry” a self made woman was made to leave India. Everyone knows Karan Johar had banned her (1/2) https://t.co/PwrIm0nni5 — Kangana Ranaut (@KanganaTeam) March 28, 2023 -
సినిమా రాజకీయాలను తట్టుకోలేక పోయాను
హిందీ పరిశ్రమలో కొందరు చేసిన రాజకీయాలను తట్టుకోలేకపో యానని, అందుకే ఇటీవల హిందీ చిత్రాల సంఖ్య తగ్గించాననీ అంటున్నారు ప్రియాంకా చోప్రా . నటిగా ఇరవై సంత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్లో ఓ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు తాను షిఫ్ట్ కావడం గురించి ప్రియాంకా చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు నన్ను ఒక మూలకు నెట్టివేయడానికి ప్రయత్నించారు. నాకు అవకాశాలు రాకుండా చేయడానికి ఓ గ్రూప్ ఏర్పాటైందని నాకు అర్థమైంది. ఈ క్రమంలో నాకు కొందరితో విభేదాలు తలెత్తాయి. ఈ పొలిటికల్ గేమ్స్ ఆడటం నావల్ల కాదనిపించింది. ఇక లాభం లేదని నేను బాలీవుడ్‌కు బిగ్ బ్రేక్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పటి నా మేనేజర్ అంజులా ఆచార్య ఓ మ్యూజిక్‌లో నన్ను చూసి మ్యూజిక్ ప్రపంచంలో నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఓకే చెప్పి, యూఎస్ వెళ్లాను. అలా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లగలిగాను. కొత్త అవకాశాలు కూడా వచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా . ఇక హాలీవుడ్లో ‘క్వాంటికో’, ‘బేవాచ్’ వంటి ప్రాజెక్ట్స్ చేశారు ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్, ఇంగ్లిష్ చిత్రం ‘లవ్ ఎగైన్’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అలాగే హిందీలో ‘జీలే జరా’ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు కంగనా స్పందిస్తూ.. ‘‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ ప్రియాంకా చోప్రా ను ఇండియా నుంచి అమెరికాకు పంపేసింది. ఇందుకు కారణం దర్శక–నిర్మాత కరణ్ జోహార్’’ అని ఆరోపిస్తూ ట్వీట్స్ చేశారు. -
ఇది కదా సక్సెస్ అంటే.. 10 ఏళ్ల క్రితం నానామాటలు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా
చిరుత సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు రామ్‌చరణ్. మగధీర సినిమాతో స్టార్‌గా మారిపోయాడు. కానీ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఈక్రమంలో జంజీర్(తెలుగులో తూఫాన్)తో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇందులో చరణ్ ఏసీపీ విజయ్ ఖన్నాగా నటించగా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అతడితో జోడీ కట్టింది. ఈ సినిమా 2013లో రిలీజవగా చాలామంది నానారకాలుగా విమర్శించారు. అసలిది సినిమాయేనా? రామ్‌చరణ్‌కు యాక్టింగ్ వచ్చా? అతడి ముఖంలో సరిగా ఎక్స్ప్రెషన్స్ కనిపించడమే లేదు అంటూ విమర్శించారు. తీవ్రమైన నెగెటివిటీ ఎదుర్కొన్న చరణ్ తర్వాత హిందీలో మరే సినిమా చేయలేదు. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే రామ్‌చరణ్‌ను ఆరాధిస్తున్నారు అక్కడి జనం. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటవిశ్వరూపం చూసి అల్లాడిపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్‌గా కనిపించినా చాలంటూ మన తెలుగు హీరో వెంటపడుతున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ 'కిసీకా భాయ్ కిసీకా జాన్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించేందుకు ఒప్పుకున్నాడు చరణ్. ఇకపోతే ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే కదా! దీంతో ఈ సినిమా కోసం నిన్న మొన్నటి వరకు అమెరికాలో ప్రమోషన్లు చేసిన హీరో ఇప్పుడు ప్రీఆస్కార్ పార్టీలో పాల్గొన్నాడు. ఈ పార్టీకి ప్రియాంక చోప్రా హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా ప్రియాంకతో కలిసి ఫోటోలు దిగారు చరణ్ దంపతులు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్క ప్రియాంకతోనే కాదు, హాలీవుడ్ డైరెక్టర్ జేజే అబ్రమ్స్తో దిగిన ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఇది చూసి.. ఒకప్పుడు చరణ్‌కు నటన రాదని తిట్టినవారే ఇప్పుడు పొగడ్తలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ప్రియాంక చోప్రా పార్టీలో సందడి చేసిన రాహుల్ సిప్లిగంజ్
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ హంగామానే కనిపిస్తుంది. ఈనెల 12న జరగనున్న ఆస్కార్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంతార్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ పాట ఆస్కార్ పురస్కారానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. తెలుగు వారితో పాటు భారతీయులంతా ఈసారి మనకు ఆస్కార్ కశ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ టీం అమెరికాకు పయనమయ్యారు. ఆస్కార్ 95వ అకాడమీ వేడుకల్లో రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ నాటునాటు సాంగ్ లైవ్ ఫర్మార్మెన్స్ ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే వీరు కూడా యూఎస్‌లో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ప్రియాంక చోప్రా నిర్వహించిన ప్రీ ఆస్కార్ పార్టీకి రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యాడు. ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ మీ పార్టీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రియాంక చోప్రాజీ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
అందంగా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్!
టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, అందం కూడా కావాలి. నటిగా, హీరోయిన్గా ఎదగాలంటే కాస్తోకూస్తో అందం, ఆకర్షణ ఉండాలి. ఇందుకోసం సెలబ్రిటీలు డైట్, ఎక్సర్సైజ్, యోగాలంటూ నానాతంటాలు పడతారు. కానీ కొంతమంది ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఆ జాబితాలో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఆత్మకథ 'అన్ఫినిష్డ్'లో రాసుకొచ్చింది. 'డాక్టర్ నా ముక్కును సర్జరీ చేసే క్రమంలో కాస్త పట్టు కోల్పోయాడు. దీంతో నా ముక్కు ఆకారమే మారిపోయింది. బ్యాండేజీ తొలగించగానే నా ముక్కు చూసి అమ్మ, నేను భయపడిపోయాము. అది వంకరగా మారిపోయి నా ముఖమే మరోలా కనిపించింది. అసలు నేను నేనులానే లేను. అద్దంలో చూసుకున్నప్పుడు వేరే ఎవరో నన్ను చూస్తున్నట్లుండేది. నిస్సహాయురాలిగా ఉండిపోయాను. నా ఆత్మగౌరవం మంటగలిసిపోయినట్లైంది. తిరిగి కోలుకుంటాననుకోలేదు' అని రాసుకొచ్చింది. కాగా ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేదని, ఈ క్రమంలోనే తను సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. అయితే సర్జరీ సక్సెస్ కాకపోవడంతో అందవిహీనంగా మారిన ముక్కును తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు మళ్లీ సర్జరీలు చేయించుకోలేక తప్పలేదట! -
ప్రియాంక చోప్రా ఇలా ఉంటే మరి సామ్ ఎలా ఉండబోతుందో!
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈమె నటించిన లేటెస్ట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్. రుస్సో బ్రదర్స్ ఏజీబీఓ సంస్థ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ భారీ యాక్షన్ సన్నివేశాలతో, స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. నటి ప్రియాంకా చోప్రాతో పాటు స్టాన్లీ మూసీ, లెస్లీమాన్వల్లే, రిచర్డ్ మాడాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గ్రేమ్యాన్ చిత్రం తర్వాత రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఇది. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. ఏప్రిల్ 28వ తేదీన 2 ఎపిసోడ్లను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత వరుసగా 26వ తేదీ వరకు వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. 240కు పైగా దేశాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తున్నామంది. కాగా, ఫస్ట్ లుక్ పోస్టర్లో నటి ప్రియాంకా చోప్రా గన్ పట్టుకొని ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లు ఉంది. ఈ సిటాడాల్ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో నటి సమంత.. ప్రియాంక చోప్రా పాత్రలో నటిస్తుండడం గమనార్హం. ఇక ప్రియాంక ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు సామ్ ఇలాంటి రోల్ చేస్తుందా? తన లుక్ ఎలా ఉండబోతుందో అని కామెంట్లు చేస్తున్నారు. do you C what’s hiding in front of your eyes? the first look at @CitadelOnPrime starring @_richardmadden, @priyankachopra, Stanley Tucci, and Lesley Manville#CitadelOnPrime, Apr 28 pic.twitter.com/baT5fgKFm8 — prime video IN (@PrimeVideoIN) February 27, 2023 pic.twitter.com/F5JSWjHRLs — prime video IN (@PrimeVideoIN) February 27, 2023 -
ప్రియాంక చోప్రా కూతురు మాల్తీని చూశారా? ఫొటోలు వైరల్
-
తొలిసారిగా కూతురి ఫోటోలు రివీల్ చేసిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతుర్ని పరిచయం చేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే కూతురు మాల్తీ మేరీని మాత్రం ఇంతవరకు ఎక్కడా రివీల్ చేయలేదు. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. అయితే రీసెంట్గా జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీతో కలిసి వేడుకలకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక ఒళ్లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న మాల్తీ వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉంది. కాగా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక బిడ్డను కన్నారు. అయితే అప్పటినుంచి ఇంతవరకు పాప ముఖాన్ని చూపించలేదు. కానీ తొలిసారిగా మాల్తీ ఫేస్‌ను రివీల్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
నా బిడ్డ బతుకుతుందనుకోలేదు.. సరోగసి సీక్రెట్స్ వివరించిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతురు మాల్తీ జననం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోగసి విధానం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది. ''మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె నా చేయికంటే చాలా చిన్నగా ఉంది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమెను ఇంటెన్సివ్ కేర్ విభాగంలో డాక్టర్ల పర్యవేక్షనలో ఉంచాం. ఇంక్యుబేటర్‌లో కూతురిని చూస్తూ నేను, నిక్ చాలా మదనపడ్డాం. ఆ సమయంలోఘెంతో మంది డాక్టర్లు, నర్సులను కలిశాను. నిజానికి వాళ్లు దేవుని ప్రతిరూపాలు.. సాక్షాత్తు దేవుడిలానే పిల్లలకు ప్రాణాలు పోస్తున్నారు. నా కూతురు బతికి బయటపడుతుందని కూడా అనుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసిని ఎంచుకున్నాం. కానీ నేనేదో అందం తగ్గుతుందని సరోగసిని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధనపించింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తాలూకు ప్రభావం నా బిడ్డపై పడకూడదని నిర్ణయించుకున్నా. అందుకే తన ఫోటోలు కూడా రివీల్ చేయడం లేదు. ఇక సరోగసీ అంద ఈజీ కాదు. దీనికోసం సుమారు ఆరునెలల పాటు నేను, నా భర్త చాలా వెతికాం. చివరకి ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా కూతురికి నాతో పాటు ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతేడాది జనవరిలో నిక్-ప్రియాంక దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. -
మహారాణిలా ప్రియ, వయ్యారాలు పోతున్న ఐశ్వర్య
► సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో కీర్తి సురేశ్ ► చీరలో వావ్ అనిపిస్తున్న కశ్మీరా పరదేశి ► చిన్నారులతో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న మిథిలా పాల్కర్ ► వయ్యారాలు పోతున్న ఐశ్వర్య మీనన్ View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kashmira Pardeshi (@kashmiraofficial) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా?.. కో-కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు
Miss World 2000: గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రాపై మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మిస్ వరల్డ్ 2000 పోటీలో రిగ్గింగ్ చేసి ప్రియాంక గెలిచిందంటూ ఆమె షాకింగ్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా ఇటీవల జరిగిన యూఎస్ఏ 2022(Miss USA 2022) పోటీల్లో రిగ్గింగ్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోటీలో టెక్సాస్‌కు చెందిన రాబోన్ గాబ్రియేల్ కిరీటం గెలుచుకుంది. చీటింగ్ చేసి ఆమె గెలిచిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందిస్తూ లీలానీ ఓ యూట్యూబ్ వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిస్ యూఎస్ఏ 2022 పోటీల్లో నిజంగానే రిగ్గింగ్ జరిగిందని, చీటింగ్ చేసి గాబ్రియేల్ని గెలిపించారని వ్యాఖ్యానించింది. అనంతరం ‘మిస్ వరల్డ్ 2000 పోటీలలో కూడా రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని గెలిపించారు. మిస్ వరల్డ్ 1999లో ఇండియా నుంచి యుక్తాముఖి గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2000 సంవత్సరంలో కూడా ఇండియా నుంచి ప్రియాంక చోప్రానే గెలిచింది. అప్పడు నేను కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాను. ఇలాంటి వాటిల్లో స్పాన్సర్స్ ఎవర్ని గెలిపించమంటే వారినే గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ వరల్డ్ 2000కి జీ టీవీ స్పాన్సర్. ఇది ఇండియాకి చెందినది. అందుకే భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రాని గెలిపించారు. ఆ పోటీల్లో జరిగిన స్విమ్ సూట్ కాంపిటేషన్‌లో అందరూ బికినీలు వేసుకుంటే.. ప్రియాంక మాత్రం వేరే స్విమ్ సూట్ వేసుకుంది. అయినా న్యాయనిర్ణేతలు ఆమెను క్వాలిఫై చేశారు. అప్పుడే అనుమానం వచ్చింది’ అని పేర్కొంది. అలాగే ఈ పోటీలో ప్రియాంకను ప్రత్యేకంగా చూసేవారు. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్ ఈ పోటీల్లో పాల్గొన్న అందరికి జాసన్ వు డిజైనర్‌గా వ్యవహరించాడు. మా అందరికి ఒకే రకమైన ఫ్రాక్స్ డిజైన్ చేశాడు. కానీ ప్రియాంకకు మాత్రం స్పెషల్‌గా డిజైన్ చేశాడు. ఇక 1999లోనే యుక్తాముఖి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. అలాగే 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్ నిలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ గెలుచుకుంది. ఇలా చాలా అంశాల్లో ప్రియాంక చోప్రాని పైకి తీసుకొచ్చి తనని మిస్ వరల్డ్ చేశారు’ అంటూ బార్బడోస్ పేర్కొంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో సెటిలైన ఆమె దాదాపు మూడేళ్ల ఇండియాకు వచ్చారు. సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రియాంకకు అభిమానులు ఫ్లకార్డులు, బొకేలతో స్వాగతం పలికారు. ఆమె వెంట భర్త నిక్ జోనస్, కూతురు కూడా ఉన్నారు. కాగా సరోగసి పద్ధతిలో ప్రియాంక, నిక్ దంపతులు ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన తర్వాత ప్రియాంక భారత్‌కు రావడం ఇదే మొదటి సారి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. #PriyankaChopra spotted at Mumbai airport 🔥💃📷 @viralbhayani77 pic.twitter.com/FPLmDzwoLq — Viral Bhayani (@viralbhayani77) November 1, 2022 -
న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు.. ప్రియాంకా చోప్రా హర్షం
లాస్ఏంజెలెస్: న్యూయార్క్‌లోని పాఠశాలలకు దీపావళి పండుగ రోజును సెలవుగా ప్రకటించడంపై బాలీవుడ్ నటి, నిర్మాత ప్రియాంకా చోప్రా జొనాస్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని పబ్లిక్ స్కూళ్లకు 2023 నుంచి దీపావళి రోజున సెలవు ఉంటుందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ గురువారం ప్రకటించడంపై శనివారం రాత్రి ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తన చిన్నతనంలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్కూలుకు వెళ్లినప్పటి రోజులను గుర్తుకు వచ్చి ఏడ్చేశానని పేర్కొన్నారు. న్యూయార్క్ నగరంలో భారత సంతతికి చెందిన సుమారు 2 లక్షల మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులున్నారు. వీరంతా దీపావళి పండుగను జరుపుకుంటారని, అందుకే సెలవుగా ప్రకటించాలని నిర్ణయించామని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం లాస్ఎంజెలెస్లో నివాసం ఉంటున్నారు. -
ప్రపంచ దేశాల ఐక్యతతోనే అది సాధ్యం: ప్రియాంక
ఐక్యరాజ్యసమితి: ‘‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజం ప్రతి వ్యక్తి హక్కు. ప్రపంచ దేశాల ఐకమత్యంతోనే ఇది సాకారమవుతుంది’’ అని నటి, దర్శకురాలు ప్రియాంకా చోప్రా జోనాస్ అన్నారు. ప్రపంచదేశాలు సంఘీభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఇందుకు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ అయిన చోప్రా ఎస్‌డీజీపై మంగళవారం జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రమాదం ముంగిట ప్రపంచం ప్రపంచ దేశాల మధ్య విభేదాలు భద్రతా మండలి వంటి కీలక అంతర్జాతీయ వ్యవస్థలను బలహీనపరుస్తున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచం ప్రమాదం అంచున ఉందన్నారు. అంతర్జాతీయ సహకారం లేకుండా మనుగడ సాగించలేమని గుర్తు చేశారు. ప్రపంచం ముంగిట ఉన్న సవాళ్లను సహకారం, చర్చల ద్వారా మాత్రమే ఎదుర్కోగలమని తెలిపారు. -
కారు ప్రమాదం.. ప్రముఖ నటికి తీవ్ర గాయాలు
Priyanka Chopra Co-Star Anne Heche Critically Injured In Car Crash: ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే తీవ్ర గాయాలపాలయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసింది. ఈ క్రమంలోనే ఓ ఇంటిని ఢీ కొట్టగా, కారు క్రాష్ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఈలోపే ఆమెకు కాలిన గాయాలయ్యాయని లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతినిధి బ్రియాన్ హంఫ్రీ ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు. ఆమె కారు క్రాష్‌కు గురైనప్పుడు స్థానికులు అక్కడ ఉండటం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అన్నే హెచే పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది. స్ట్రేచర్‌పై ఉన్న అన్నే స్పృహలోకి వచ్చినట్లు, శ్వాస తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా అన్నే హెచే అనెదర్ వరల్డ్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటితోపాటు డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్ సెవెన్ నైట్స్, వాగ్ ది డాగ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్' సాంగ్ బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే! -
ప్రియాంక ఫొటోను ఏకంగా వీపుపై టాటూ వేసుకున్న సింగర్
సినీ సెలబ్రెటీలకు వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమకు ఇష్టమైన నటీనటులపై ఫ్యాన్స్ వివిధ రకాలుగా అభిమానం చూపిస్తుంటారు. వారి పేర్లను పెట్టుకోవడం, వారి ఫొటోలను ఇంట్లో పెట్టుకుని మురిసిపోతుంటారు. మరికొందరైతే ఏకంగా వారి పేర్లను టాటూ వేసుకుంటారు. సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్ల పేర్లను పచ్చబొట్టు వేయించుకున్న సందర్భాలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ వారికి సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో సైతం ఫ్యాన్స్ ఉంటారు. చదవండి: ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్ చేస్తోంది.. నీతూ కపూర్‌పై ట్రోలింగ్ గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సాధారణ ప్రజల్లోనే కాదు సెలబ్రిటీల్లో సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమెరికాకు చెందిన ఓ సింగర్ ప్రియాంకకు వీరాభిమాని. తాజాగా అతడు ప్రియాంకపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. సింగర్, ర్యాపర్ ఆకాశ్ ఆహుజా ఆమె ముఖ చిత్రాన్ని టాటూగా వేసుకున్నాడు. ఇప్పటికే ప్రియాంక పేరును తన వీపుపై పచ్చబొట్టు వేసుకున్న ఆకాశ్ అక్కడితో ఆగకుండా ఇటీవల తన ఫోటోను సైతం వేయించుకోవడం విశేషం. చదవండి: ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించాలా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆకాశ్ తన వీపు పూర్తి భాగంలో ప్రియాంక ముఖచిత్రాన్ని టాటూ వేసుకుంటున్నాడు. దానికి పైన ప్రియాంక అనే పేరు కూడా రాసి ఉంది. ఇదిలా ఉంటే ‘ప్రియాంక..’ అంటూ ఆకాశ్ ఇటీవల పాడిన పాటను తన ఫేవరెట్ హీరోయిన్‌కే అంకితమిచ్చాడు. ఇప్పుడు అదే పాట ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పిచ్చి ముదిరిందని కొందరు ఆకాశ్‌పై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Akash Ahuja (@akashlife) -
అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తుంది. 2018లో నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక ఇటీవలె సరోగసి ద్వారా తల్లైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోనే సెటిల్ అయిన ప్రియాంక తాజాగా తన బయోగ్రఫీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'ఓరోజు ఇంట్లో చిన్న పాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే అమ్మ ఆ పాపను ఊయలలో వేసి ఆడిస్తుంది. ఎవరు అని అడగ్గా హాస్పిటల్ బయట కారు పార్కింగ్‌లో పాపను ఎవరో వదిలి వెళ్లారని, అక్కడ ఏడుస్తూ ఉండటంతో ఇంటికి తీసుకొచ్చానని అమ్మ నాకు చెప్పింది. వర్షం కురుస్తున్న సమయంలో చిన్న పాపను అలా వదిలేసి వెళ్లడం నాకు చాలా బాధనిపించింది. దీంతో ఆ పాపను దత్తత తీసుకొని నా దగ్గరే ఉంచుకుంటానని పట్టుబట్టగా అమ్మ అభ్యంతరం చెప్పింది. సంతానం లేని దంపతులకు పాపను ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు అమ్మ పేర్కొంది. ఆరోజు జన్మాష్టమి. అదేరోజు వర్షంలోనే వాహనం నడుపుకుంటూ సంతానం లేని దంపతులకు పాపును ఇచ్చేసింది అమ్మ. ఆ సమయంలో వాళ్ల సంతోషం ,ఆనాటి సంఘటనల్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ ప్రియాంక రాసుకొచ్చింది. -
ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
Keanu Reeves The Matrix Resurrections OTT Release Date Is Here: హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ చిత్రం 'ది మ్యాట్రిక్స్'. స్కై-ఫై, యాక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత వచ్చిన చిత్రాలు కూడా అంతే ఆదరణ పొందాయి. ఈ మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. ఇందులో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్తోపాటు గ్లోబల్ స్టార్ ప్రియాకం చోప్రా ప్రధాన పాత్రల్లో అలరించారు. ఈ సినిమా డిసెంబర్ 22, 2021న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6 నుంచి భారతదేశంలో ప్రసారం కానుంది. లానా వాచోస్కీ దర్శకత్వ వహించిన ఈ మూవీ మే 6 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. లానా వాచోస్కీ తన సోదరి లిల్లీ వాచోవస్కీతో కలిసి ఈ ఫ్రాంచైజీలో ఇంతకుముందు వచ్చిన 'ది మ్యాట్రిక్స్' (1999), 'ది మ్యాట్రిక్స్: రీలోడెడ్' (2003), 'ది మ్యాట్రిక్స్: రివల్యూషన్స్' (2003) సినిమాలను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ 'ది మ్యాట్రిక్స్'.. కారణం ? choose your pill 💊#TheMatrixResurrectionOnPrime, May 12 in English, Hindi, Tamil, Telugu, Malayalam and Kannada pic.twitter.com/PGQTNRdKVs — amazon prime video IN (@PrimeVideoIN) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రియాంక చోప్రా గారాల పట్టి పేరు ఏంటో తెలుసా?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ దంపతులు ఇటీవల సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 2018, డిసెంబర్లో వివాహం చేసుకున్న ఈ జంట.. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరిలో సరోగసి ద్వారా తల్లిదండ్రులైయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బిడ్డకు సంబంధించిన ఫోటోలను కానీ, పేరుని కానీ బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా ప్రియాంక, నిక్‌లు తమ బిడ్డకు పేరు పెట్టినట్లు తెలుస్తోంది. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం చేశారట. మాల్టీ అంటే సంస్కృతంలో సువాసన కలిగిన పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక తల్లి మధుమాల్టీ నుంచి మాల్టీ అని తీసుకున్నారట. ఇక మేరీ అంటే నక్షత్రం అని అర్థం. అలాగే జోనస్ తల్లి పేరు కూడా కలుస్తుంది. ఇక చివరిగా తన పేరు, భర్త పేరు వచ్చేలా చోప్రా జోనస్ పెట్టారట. బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ప్రియాంక కూతురు అమెరికాలోని శాండియాగోలో 2022, జనవరి 15న ఉదయం 8 గంటలకు జన్మించినట్లు ఉంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. ఇటీవల హాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. టీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో నటిస్తోంది. (చదవండి: బిడ్డ పుట్టాక కాజల్ ఫస్ట్ పోస్ట్, ఇదేమీ ఆకర్షణీయంగా ఉండదంటూ!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1131264712.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాలీవుడ్లో మ్యారెజ్ ట్రెండ్.. పర్సనల్ లైఫ్‌పై ఫోకస్
ఒకప్పుడు హీరోయిన్‌కు మ్యారేజ్ అంటే, కెరీర్ ముగిసినట్లే లెక్క. కానీ ఈ తరం బాలీవుడ్ హీరోయిన్స్ తీరు వేరు. కెరీర్‌ని పక్కన పెట్టి మరీ, పర్సనల్ లైఫ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కెరీర్ కోసం మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేయడం ఈ జనరేషన్ హీరోయిన్స్ కు నచ్చడం లేదు. అందుకే స్టార్ డమ్ కోసం పరుగులు తీయకుండా మ్యారేజ్ లైఫ్ కోసం పోటీ పడుతున్నారు.ఎంత వేగంగా ప్రేమ చిగురిస్తోందో అంతే వేగంగా ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్తోంది. కరీనా కపూర్, అనుష్క శర్మా, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, కత్రీనా, ఆలియా భట్ వీరందరూ బాలీవుడ్ లీడింగ్ లేడీస్. స్టార్ హీరోస్ కు పర్ఫెక్ట్ జోడీస్.కాని కెరీర్ మధ్యలో ఎప్పుడైతే ప్రేమ పుట్టుకొస్తుందో ఆ వెంటనే వీరి మూడ్ మారిపోతోంది. పెళ్లి వైపు వీరి ఆలోచనలు సాగిపోతున్నాయి. ఒకరు తర్వాత ఒకరు పెళ్లిల్లు చేసుకుంటూ అత్తారింటికి వెళ్లేందుకు పోటీపడుతున్నారు. రీజన్ ఏదైనా సరే స్టార్ హీరోయిన్స్ మ్యారేజ్ ట్రెండ్ మాత్రం బాలీవుడ్ ను కొత్తగా చూపిస్తోంది. హిందీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: త్వరలో పెళ్లి చేసుకోనున్న కేఎల్ రాహుల్-అతియా శెట్టి !) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1131264712.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Says They Are Failures Of Bollywood Stars: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశంపైనైనా తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా, ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె కూడా పలు విమర్శలపాలైంది. ఎలాంటి సంకోచం లేకుండా తనకు అనిపించింది చెప్పడంతో అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ. కంగనా ప్రస్తుతం కాంట్రవర్సీ రియాలిటీ షో లాకప్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ స్టార్స్ ఫెయిల్యూర్ అంటూ షాకింగ్‌కు గురిచేసింది. క్రమక్రమంగా 'లాకప్' షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవలే ఈ షో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో కంగనా రనౌత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంతోషంతోనే దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ను ఉద్దేశిస్తూ 'నువ్ ఏడిచే రోజు వచ్చేసింది' అంటూ షాకింగ్ కామెంట్ చేసిన కంగనా తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. 'బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్వీర్ సింగ్ వంటి చాలామంది తారలు నటనలో విజయవంతమయ్యారు. కానీ హోస్ట్‌గా వ్యవహరించడంలో మాత్రం పూర్తిగా ఫెయిలయ్యారు. వారంతా ఫెయిల్యూర్ హోస్ట్స్. ఒక అమితాబ్ బచ్చన్ జీ, సల్మాన్ ఖాన్ జీ, కంగనా రనౌత్ మాత్రమే హోస్ట్‌గా కూడా సక్సెస్ అయ్యారు. ఇలా సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది.' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కంగనా. అంతేకాకుండా 'అసూయ పడే ఈ సినిమా మాఫియా నన్ను, నా షోను అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. కానీ అదివారివల్ల కాదు. ఎందుకంటే నన్ను, నా షోను నేను రక్షించుకుంటాను. అలాగే నేను ఇతరులకోసం నిలబడితేనే నాకోసం నేను నిలబడగలను. ఈతరం జనరేషన్లో హోస్ట్‌గా నేను మాత్రమే విజయవంతం కావడం అద్భుతంగా ( చాలా సంతోషంగా) ఉంది.' అని చెప్పుకొచ్చింది ఈ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్. ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఈ పోస్ట్‌పైనా ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్ -
ఫేవరెట్ కారును అమ్మేసిన ప్రియాంక చోప్రా, ఎందుకంటే?
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇటీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ప్రియాంక తన ఫేవరెట్ కార్లలో ఒకటైన రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారును అమ్మేసిందంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారును ఆమె ఎందుకు అమ్మసిందంటారా? నిక్ జోనస్‌ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక అమెరికాలోనే సెటిలైపోయింది. దీంతో ఇక్కడ గ్యారేజ్‌లో తన కారు చాలాకాలంగా ఖాళీగా ఉంటోందని భావించి దాన్ని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తకు అమ్మేసినట్లు తెలిస్తోంది. ఇంతకీ ఈ కారు ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా రెండున్నర కోట్లు. ఈ రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారు కొన్న తొలి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రానే కావడం విశేషం. చదవండి: ఇంటికి దూరం కానున్న సమంత! -
'గంగూభాయ్ కథియావాడి'ని వదిలేసుకున్న హీరోయిన్లు వీళ్లే!
పాన్ ఇండియా యాక్టర్ కావాలనే కలకు అప్పుడే పునాదులు వేసుకుంటోంది ఆలియా భట్. శ్రీదేవిలా ప్రతి భాషలోనూ స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్న ఆలియా నటించిన తాజా చిత్రం గంగూభాయ్ కథియావాడి. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. సౌత్‌లో గంగూభాయ్ హడావుడి పెద్దగా కనిపించకపోయినా బాలీవుడ్లో మాత్రం బాగానే సక్సెస్ అయింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.57 కోట్ల దాకా వసూలు చేసింది. కుర్ర హీరోయిన్ మాఫియా క్వీన్‌గా నటించగలదా? అన్న అనుమానాలను సైతం పటాపంచలు చేస్తూ అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నిజానికి గంగూభాయ్ పాత్ర కోసం ముందుగా ఆలియాను అనుకోలేదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. ఈ సినిమాను ముందుగా ముగ్గురు హీరోయిన్లు వదిలేసుకున్నారట! దీపికా పదుకొనేతో తీద్దామనుకుంటే అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టుల్లో ఉండటంతో నో చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రాను సంప్రదిద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ఈ స్టోరీకి మిమ్మల్ని అనుకుంటున్నారట అని ఓ మీడియా ఛానల్ అడగ్గా.. నా దగ్గరకు ఎవరూ ఆ స్టోరీతో రాలేదు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి హిందీ సినిమాలను అంగీకరించలేను అని తేల్చి చెప్పేసింది. ఈ ఇంటర్వ్యూ చూశాక ఆమె దగ్గరకు వెళ్లకుండానే డ్రాప్ అయ్యారట నిర్మాతలు. రాణీ ముఖర్జీకి ఈ పాత్ర పర్ఫెక్ట్గా ఉంటుందని ఆమెను సంప్రదించారట. ఆమె గతంలో సంజయ్ లీలా సినిమాల్లోనూ నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయనని తేల్చేసిందట. అలా చివరగా ఈ అవకాశం ఆలియాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం, గంగూభాయ్‌గా ఆలియా అదరగొట్టేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం రఫ్ఫాడించగలనని నిరూపించుకుంది. -
హరహర మహాదేవ్.. శివుడికి ప్రియాంక-నిక్ జోనాస్ దంపతుల పూజలు
Priyanka Chopra Nick Jonas Celebrate Mahashivratri In Los Angeles: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగి తనదైన ముద్ర వేసుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా భారతీయ మూలాలను, భారతదేశ సంస్కృతిని, తన అస్థిత్వాన్ని మరిచిపోనని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే లాస్ ఏంజిల్స్‌లోని తమ ఇంట్లో పరమశివున్ని కొలిచింది ప్రియాంక-నిక్ జోనాస్ జంట. ఇండియాలో ఘనంగా జరుపుకునే పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. మార్చి 1 మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి పూజ చేశారు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది ప్రియాంక చోప్రా. తన ఇన్‌స్టా స్టోరీలో 'మహా శివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్. శివరాత్రి జరుపుకుంటున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ' అంటూ శివుడి విగ్రహానికి పూజ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ప్రియాంక గులాబీ రంగు గల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, తెల్లటి కుర్తా పైజామాలో నిక్ జోనాస్ కనిపించాడు. ప్రియాంక కజిన్ దివ్య జ్యోతి కూడా ఈ వేడుకల్లో పాల్గోంది. -
నా పేరు గూగుల్ చేస్కో: కమెడియన్‌కు స్టార్ హీరోయిన్ కౌంటర్!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఈ మధ్య తరచూ చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య ఆస్కార్ నామినేషన్లను ప్రకటించే అర్హత ప్రియాంక దంపతులకు లేదని ఓ సినీ ప్రముఖుడు బాహాటంగానే విమర్శించగా తాజాగా ఓ కమెడియన్ ప్రియాంకను రచయిత దీపక్ చోప్రా కూతురిగా సంబోధించింది. ఒక రెస్టారెంట్లో నిక్ దంపతులను కలిసిన రోజీయో డానెల్.. ప్రియాంకను దీపక్ చోప్రా కూతురిగా పొరపాటుపడింది. అయితే అది తప్పని తెలుసుకున్న ఆమె వెంటనే ప్రియాంకకు సారీ చెప్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. కాకపోతే ఇందులో కూడా ఫలానా వ్యక్తి భార్య అంటూ తన గురించి ప్రస్తావించడం ప్రియాంకకు ఏమాత్రం నచ్చలేదు. 'మీరు పబ్లిక్‌గా సారీ చెప్పాలనుకున్నప్పుడు నేనెవరో, నా వివరాలేంటో గూగుల్ చేసి తెలుసుకుంటే బాగుండేది. అంతేతప్ప చోప్రా భార్య, సమ్‌థింగ్ చోప్రా అని అనడం కరెక్ట్ కాదు. ఇంతకుముందే చెప్పాను.. చోప్రా అని పేరున్న అందరూ దీపక్ చోప్రా బంధువులైపోరు, స్మిత్ అని పేరున్నంత మాత్రాన విల్ స్మిత్‌కు సన్నిహితులవలేరు అని!' అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. View this post on Instagram A post shared by Rosie O’Donnell (@rosie) View this post on Instagram A post shared by Rosie O’Donnell (@rosie) -
క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రియాంక చోప్రా.. అతడితో స్క్రీన్ షేర్
Priyanka Chopra to star opposite Marvel fame Anthony Mackie: గ్లోబల్ స్టార్ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ వరుస సినిమా అవకాశాలతో మరింత జోరు చూపిస్తోంది. ఇటీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌తో బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రియాంక మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్‌లో నటించిన యాక్టర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అతనెవరో కాదు యాంట్ మ్యాన్, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్ వంటి హిట్ చిత్రాలతో పాటు ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న ఆంథోనీ మాకీ. ఇతనితో కలిసి ఎండింగ్ థింగ్స్‌లో నటించనుంది ప్రియాంక. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన యాక్షన్ కామెడీ మూవీ 'ట్రూ లైస్' తరహాలో ఉండనున్న ఈ చిత్రానికి కెవిన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేర సామ్రాజ్యం నుంచి బయట పడాలనుకునే ఓ మహిళా కథలా ఉండనుందని సమాచారం. -
తల్లయ్యాక ప్రియాంక షేర్ చేసిన ఫస్ట్ ఫొటో ఇదే!
Priyanka Chopra Shares First Photo As Mother: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత హాలీవుడ్లో అడుగు పెట్టి అందరి మన్ననలు పొందుతోంది. పలు చిత్రాల్లో నటించి హాలీవుడ్లో సైతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇటీవలే సరోగసి పద్ధతి ద్వారా జనవరి 22న ప్రియాంక, నిక్ జోనాస్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ప్రియాంక తల్లి అయిన తర్వాత తన మొదటి పోస్ట్‌ను షేర్ చేసింది. మిర్రర్ సెల్ఫీ తీసుకున్న పిక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. అది సన్ కిస్డ్ ఫొటోలా అందంగా ఉంది. కొంచెం మేకప్, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో కార్ రైడ్ చేస్తూ ఈ ఫొటో దిగింది. ఈ పిక్కు 'కాంతి సరిగ్గా అనిపిస్తుంది' అని క్యాప్షన్ రాసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు మమ్మీ అని పిలవడం దగ్గర్నుంచి ప్రియాంక అందాన్ని వర్ణించడం వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరు మాత్రం మీ బిడ్డను ఎప్పుడు చూపిస్తారని అడుగుతున్నారు. పోస్ట్‌ను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సుమారు 8 లక్షల లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
పిల్లల కోసం ప్రియాంక రూ.149 కోట్లతో ఇల్లు!
గ్లోబల్ స్టార్ కపుల్ ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ ఇటీవలే సరోగసి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! అయితే ఈ జంట తమ పిల్లల కోసం ఇప్పటికే ఓ ఖరీదైన ఇంటిని సిద్ధం చేశారట. ఈ మేరకు హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పిల్లలను దృష్టిలో పెట్టుకుని సుమారు మూడేళ్ల క్రితమే రూ.149 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిని సొంతం చేసుకున్నారట. ఈ విషయాన్ని పీపుల్స్ మ్యాగజైన్ ఒక ప్రత్యేక కథనంలో ప్రచురించింది. కాగా నిక్యాంక 2018లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. ఆ మరుసటి ఏడాది అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యారు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారికోసం అక్కడ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దాని ఖరీదు 20 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.149 కోట్లు అని తెలుస్తోంది. ఆ ఇంటికోసం దంపతులు మూడు నెలలపాటు శ్రమించి అన్నీ తమకు నచ్చేలా అమర్చుకున్నారట. తమ పిల్లలతో గడిపే ప్రతి క్షణం మధుర జ్ఞాపకంగా నిలవాలన్నది వారి కోరిక అని, అందుకే ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. -
మొదటిసారి తల్లైన ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైంది. సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..' అని రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు, అభిమానులు ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఉమైద్ భవన్ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. సరోగసి ద్వారా తల్లైన హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
మంగళసూత్రం గురించి తెలిపిన ప్రియాంక.. అది ప్రత్యేకమైన క్షణం
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత హాలీవుడ్లో అడుగు పెట్టి అందరి మన్ననలు పొందుతోంది. పలు చిత్రాల్లో నటించి హాలీవుడ్లో సైతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అయితే తాను ఎక్కడికెళ్లినా, ఎంత ఎత్తుకి ఎదిగినా తనతోపాటే ఇండియా, భారతదేశ సంస్కృతి ఉంటుందని ఇటీవల చెప్పుకొచ్చింది ప్రియాంక. తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఏ ఒక్కరూ తక్కువ చేయకుండా ఎప్పటికప్పుడూ ఎదుగుతూ ముందుకు సాగుతోంది. (చదవండి: ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. 30కిపైగా) అయితే తాజాగా ప్రియాంక తాను మొదటి సారి మంగళ సూత్రం ధరించినప్పుడు కలిగిన అనుభూతిని చెప్పుకొచ్చింది. ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళసూత్రం విలువ గురించి తెలిపింది. 'నేను మంగళ సూత్రం మొదటి సారి ధరించడం నాకు గుర్తుంది. ఎందుకంటే దాని విలువ ఏంటో, దాని అర్థం ఏంటో చెబుతూ నన్ను పెంచారు. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఒక ఆధునిక మహిళగా, దాని ధరించడం వల్ల వచ్చే పరిణామాలను కూడా నేను అర్థం చేసుకున్నాను. మంగళ సూత్రాన్ని నల్లని పూసలతో చేసేవారు. చెడును దూరం చేసి, మిమ్మల్ని రక్షించడానికి నలుపు చిహ్నంగా ఉంటుంది. మంగళ సూత్రం ధరించడం నాకు ఇష్టమా కాదా, అది పితృస్వామ్య వ్యవస్థకి నిదర్శనమా అనేది నాకు తెలియదు. ఈ వాదనలో నేను మధ్యలో ఉంటాను. సాంప్రదాయాన్ని గౌరవించి కొనసాగించండి. అలాగే మీరు ఎవరో, మీకు ఏం కావాలో తెలుసుకోండి. అందుకోసం నిలబడండి.' అంటూ తన మదిలోని భావాలను తెలిపింది ప్రియాంక. (చదవండి: ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. తొలి భారతీయ నటిగా
Priyanka Chopra Feature Across Over 30 International Magazine Covers: గ్లోబల్ స్టార్ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటినుంచి భారతదేశం పేరును మరింత ఎత్తుకి తీసుకెళ్లింది. తాను ఎక్కడికి వెళ్లినా తనతోపాటే ఇండియా ఉంటుందని ప్రియాంక చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరూ తక్కువ చేయకుండా ఉన్నతంగా ఎదుగుతూవస్తోంది. తాజాగా ప్రియాంక అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకూ ఆమె ముఖ చిత్రాన్ని 30కిపైగా అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ ఫొటోలపై ప్రచురించారు. ఇలా గ్లోబల్ మ్యాగజైన్ కవర్లలో ఇన్నిసార్లు కనిపించిన తొలి భారతీయ నటిగా ప్రియాంక (Priyanka Chopra Becomes The First Indian Actor) గుర్తింపు పొందింది. ఇటీవల వానిటీ ఫెయిర్ అనే అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పై దేశీ బ్యూటీ ఫొటోను పబ్లిష్ చేశారు. 'హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న గ్లోబల్ స్టార్, స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టడంతోపాటు నిక్ జోనాస్‌తో కలిసి స్థిరపడింది.' అనే శీర్షికతో వానిటీ ఫెయిర్ కవర్ పేజీపై ప్రియాంక ఫొటోను ప్రింట్ చేశారు. ఇలా సంవత్సరాలుగా అనేక గ్లోబల్ మ్యాగజైన్ల కవర్ ఫొటోలపై తళుక్కుమన్న ప్రియాంక భౌగోళిక సరిహద్దులు దాటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దీంతో గ్లోబల్ స్టార్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్‌గా ప్రియాంక పేరు గడించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) ఇదీ చదవండి: ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే -
వెడ్డింగ్ యానివర్సరి, భర్త విషయంలో ప్రియాంక కీలక నిర్ణయం..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నుంచి విడిపోనుందా? అంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటికి ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చి రూమార్లకు ఫుల్స్టాప్ పెట్టింది ప్రియాంక. దీంతో వారి విడాకులపై వస్తున్న వరుస పుకార్లకు చెక్ పడింది. నిన్న (డిసెంబర్ 1న) ఈ గ్లోబల్ కపుల్ తమ మూడవ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక-నిక్ జోనస్‌లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి: కూకట్పల్లి మాల్లో సల్మాన్ సందడి, వీడియో వైరల్ ఇదిలా ఉంటే తమ వెడ్డింగ్ యానివర్సరి సందర్భంగా ఈ జంటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్లో సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక తన భర్త నిక్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుందట. త్వరలోనే నిక్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. కాగా నిక్ సైతం తనకు ఇండియన్ సినిమాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. కాగా నిక్‌ను త్వరలోనే బాలీవుడ్ హీరోగా లేదా సింగర్‌గా పరిచయం చేసేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: సంప్రదాయ వివాహానికి ముందు..రిజిస్టర్ మ్యారేజ్ ఇందుకోసం బాలీవుడ్ దర్శక-నిర్మాతలతో ప్రియాంక చర్చలు జరుపుతోందని వినికిడి. మరి భర్త విషయంలో ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్న గ్లోబల్ స్టార్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. గతంలో నిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే తను బాలీవుడ్ మ్యూజిక్కు బాగా దగ్గరయ్యానని, తరచూ హిందీ పాటలు వింటానని చెప్పాడు. అవి తనకు బాగా నచ్చాయని, ఇండియన్ సినిమాలు, సంగీతాన్ని తనకు పరిచయం చేసిన ప్రియాంకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఇక హిందీ చిత్రం పరిశ్రమకు కూడా తాను బాగా దగ్గరయ్యానని, బాలీవుడ్లో తనకు మంచి స్నేహితులు ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని అంతేగాక వారి ఇంట్లో ఏ వేడుక జరిగిన హిందీ పాటలు పెడతామని, అవి డ్యాన్స్ చేయించేంత జోష్ ఆ మ్యూజిక్‌లో ఉంటుందన్నాడు. ఇక తమ వెడ్డింగ్‌లో ఎక్కువగా బాలీవుడ్ సంగీతమే ప్లే చేశారని, అప్పుడు వాటికి తాను ఫిదా అయ్యానంటూ నిక్ జోనస్ చెప్పుకొచ్చాడు. మరొపక్క హాలీవుడ్ సినిమాలకు వరుసగా సంతకం చేస్తూ ప్రియాంక ప్రస్తుతం బాలీవుడ్‌ను పక్కన పెట్టింది. ఈ క్రమంలో తాను బాలీవుడ్‌కు దూరంగా కాకుండా తన నిక్‌ను హిందీ సినిమాలకు పరిచయం చేయాలనుకుంటున్నట్లు ప్రియాంక సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ప్రియాంక దంపతులు క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. -
The Fashion Awards 2021 : ఫ్యాషన్ సొగసులకు పట్టం
-
ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్
Priyanka Chopra-Nick Jonas Respond On Their Divorce Rumours With Instagram Post: సోషల్ మీడియా ఖాతాల నుంచి గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఇంటి పేరు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా జోనస్ అని ఉండే తన ప్రోఫైల్ నేమ్‌లో ప్రియాంక చోప్రా అని మాత్రమే ఉంచి చోప్రా, జోనస్ పేరు తీసేసింది. అది చూసి అందరూ షాకయ్యారు. దీని అర్థం ఏంటి త్వరలోనే ఈ స్టార్ కపుల్స్ విడిపోనున్నారా? విడాకులకు ఇది సంకేతమా? అంటూ మూడు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్? అచ్చం ఇలానే ఇటీవల విడిపోయిన టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత మధ్య జరగడంతో ఈ రూమర్లకు బీజం పడింది. అయితే ఈ వార్తలపై ఇప్పటికే ప్రియాంక తల్లి మధు చోప్ర స్పందిస్తూ ఖండించింది. ఇక ప్రియాంక సైతం ఓ వీడియో షేర్ చేసి వారి విడాకులపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇవ్వకనే ఇచ్చింది. అయినా నిక్-ప్రియాంక విడాకులు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో తాజాగా ఈ జంట ఈ పుకార్లపై స్పందించింది. చదవండి: ఇన్‌స్టాలో భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రూమార్లకు చెక్ పెట్టారు. ఈ ఫొటోను నిక్ షేర్ చేస్తూ.. ‘అందరికి థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు! ప్రియాంక మీకు కూడా కృతజ్ఞతలు’ అంటూ ఫొటో షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసి గ్లోబల్ కపుల్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ‘వారు విడిపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నమాట’ అంటూ క్లారిటీ ఇచ్చిన నిక్కు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? దీంతో ‘మీరు ఎపుడు ఇలాగే హ్యాపీ ఉండాలి’, ‘క్యూట్ కపుల్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్రియాంక కూడా అదే ఫొటోను షేర్ చేస్తూ ‘చాలా కృతజ్ఞతతో ఉన్నాను(ఫ్యామిలీ, ఫ్రెండ్స్). లవ్ నిక్ జోనస్. థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది. చూస్తుంటే ఈ జంట తమ విడాకులపై వస్తున్న రూమార్లకు ఈ ఫొటోతో ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. కాగా నిక్-ప్రియాంక 2018 డిసెంబర్ 1న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్?
Samantha Comments On Priyanka Chopra Video: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వీరి విడాకులపైనే తెగ చర్చ జరుగుతోంది. దీంతో చై-సామ్‌ల విడాకుల మ్యాటర్ కూడా తెరపై వచ్చింది. సామ్ మాదిరిగానే ప్రియాంక నిక్ ఇంటి పేరు తీసేసింది. దీంతో ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించగా ఈ రూమార్లకు ఫుల్స్టాప్ పెడుతూ ప్రియాంక ఓ వీడియో వదిలిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట! ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ.. నిక్ జోనస్, జోనస్ బ్రదర్స్ కంటే తనకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారంటూ వారిని ఆటపట్టించింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్ బ్రదర్స్‌తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే దీనిపై సమంత స్పందించింది. అమేజింగ్ అని క్యాప్షన్స్ ఇస్తూ ప్రియాంక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ వార్తల్లోకి ఎక్కింది. చదవండి: సమంతపై నెటిజన్ల ఫైర్ తన మాజీ భర్త నాగచైతన్య బర్త్‌డేకు విషెస్ చెప్పని సమంత తన పెంపుడు కుక్క హాష్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీ నింపేయడంతో పాటు ప్రియాంక వీడియోకు ప్రత్యేకంగా కామెంట్ చేయడం ఆసక్తి నెలకొంది. ఇక చై-సామ్ మాదిరిగా గ్లోబల్ కపుల్ కూడా విడాకులకు సిద్దమవుతున్నారా? అంటూ వారిపై రూమార్స్ రాగా వాటికి ప్రియాంక సమాధానం చెప్పకనే చెబుతూ ఫుల్స్టాప్ పెట్టింది. ఈ క్రమంలో ప్రియాంక వీడియో సామ్ అమెజింగ్ అని కామెంట్ పెట్టడం, దానిని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఆసక్తిగా మారింది. దీని వెనక సామ్ అంతర్యం ఏంటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: మరో వ్యక్తితో ఎఫైర్.. అందుకే విడిపోయాం : హీరో షాకింగ్ కామెంట్స్ కాగా ఈ వీడియోలో ప్రియాంక 'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ్లు చిన్నవాడు నిక్. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్‌టాక్ ఎలా ఉపయోగించాలో నిక్ నేర్పితే, సక్సెస్ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్‌పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర్తిగా మార్చేశాడు. జొనాస్ బ్రదర్స్‌కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్ బ్రదర్స్‌ను రోస్ట్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట!
Because of This Reason Priyanka Chopra Delete Her Husband Nick Jonas Name: సోషల్ మీడియా ఖాతాల నుంచి గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఇంటి పేరు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా జోనస్ అని ఉండే తన ప్రోఫైల్ నేమ్‌లో ప్రియాంక అని మాత్రమే ఉంచి చోప్రా, జోనస్ పేర్లు తీసేసింది. అది చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. అచ్చం ఇలాంటి సంఘటనే టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత మధ్యలో జరగడంతో అందరూ ప్రియాంక-నిక్ కూడా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా? అనే ఊహాగానాలే రెకిత్తించారు. దీంతో ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తల్లో నిజం లేదని, ప్రియాంక-నిక్‌లు చాలా సంతోషంగా ఉన్నారంటూ స్పష్టం చేసింది. చదవండి: నిక్ జొనాస్‌పై ప్రియాంక వీడియో.. రూమర్స్‌కు చెక్ అలాగే ప్రియాంక సైతం ఓ వీడియో షేర్ చేయడంతో పాటు భర్త షేర్ చేసిన వీడియోకు కామెంట్ పెట్టి రూమార్లకు చెక్ పెట్టింది. మరి అలాంటప్పుడు తన పేరు పక్కన నిక్ ఇంటి పేరు ఎందుకు తొలగించినట్లు అనే ప్రశ్నలు లెవనెత్తుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో పలువురు దీనికి కారణం ఇదేనంటూ చెప్పుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమరాలజీని మంది నమ్ముతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక తన భర్త ఇంటి పేరు తొలగించిందని చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన చోప్రా, జోనాస్ అనే పదాలు కలిసి రావని, వాటిని తీసేస్తే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం లైఫ్ బాగుంటుందట. అందుకే ఆ రెండు పదాలను తొలగించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ అంతేగాక కావాలనే ప్రియాంక పేర్లు తొలగించిందని, ఇది ఓ ఛాలెంజ్‌లో భాగమని మరికొందరూ చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కానీ ప్రియాంక ఆ పేర్లు తొలగించడం వెనక ఏదో కారణం ఉండి ఉంటుందంటున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాంటే దానికి అసలు కారణం స్వయంగా ప్రియాంక చెప్పేవరకు వేచి చూడాల్సిందే. ఇటీవల నిక్-ప్రియాంక సొంత ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి వేడుకలను ఈ జంట సంతోషంగా వారి కొత్త ఇంటిలో జరుపుకున్నారు. అంతేగాక ఎప్పటి లాగే సోషల్ మీడియోలో కూడా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు. ఇవన్ని చూస్తుంటే వారి దాంపత్య జీవితం సాఫీగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి..