![Priyanka Chopra attended her brother Siddharth mehendi with Daughter](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/p.jpg.webp?itok=SRWBkUAz)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.
మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment