Mehendi
-
హీరోయిన్ సోనాక్షిపెళ్లికి రెడీ,మెహెందీ ఫోటోలు వైరల్
-
అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అరచేతి అందం
మెహెందీ కోన్స్‌తో అరచేత అందమైన డిజైన్లు తీర్చిదిద్దుకోవాలని ముచ్చటపడు తుంటారు అతివలు. కానీ, చర్మ సమస్యలు వస్తాయేమో అనే భయం. అలాంటి భయాలేవీ లేకుండా ఇంట్లోనే కోన్ని తయారుచేసుకోవచ్చు. తయారీ స్టెప్ :1 పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి, బాగా కలపాలి. స్టెప్ :2 కొద్దిగా నీళ్లతో చిక్కటి మిశ్రమం అయ్యేవరకు కలపాలి. స్టెప్ :3 హెæన్నా ఉన్న గిన్నెను ప్లాస్టిక్ షీట్‌తో పూర్తిగా మూసి, 15 నిమిషాలసేపు ఆ గిన్నెను పక్కన పెట్టేయాలి. స్టెప్ :4 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే మిశ్రమం మృదువుగా తయారవుతుంది. దీంట్లో మరికొద్దిగా నీళ్లు, ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. తర్వాత మళ్ళీ ప్టాస్టిక్ షీట్‌తో కవర్ చేసి, ఈసారి గంటసేపు వదిలేయాలి. పంచదార కరిగి మిశ్రమం చిక్కబడుతుంటుంది. స్టెప్ :5 ప్లాస్టిక్ షీట్ తీసేసి, మిశ్రమాన్ని మళ్లీ ఒకసారి కలపాలి. మిశ్రమంలో ఎక్కడా పొడి తాలూకు గడ్డలు లేకుండా మృదువుగా అవుతుంది. స్టెప్ :6 ప్లాస్టిక్ షీట్‌తో కోన్స్ తయారుచేసుకోవాలి. నోట్: హ్యాండ్ రోల్డ్ ఎమ్టీ కోన్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. స్టెప్ :7 కోన్‌లో ముప్పావు భాగం వరకు హెన్నా మిశ్రమం నింపి, టేప్‌తో మూసేయాలి. తర్వాత నచ్చిన డిజైన్ తీర్చిదిద్దుకోవాలి. ఈ పదార్థాలు అవసరం.. ∙హెన్నా పొడి – 100 గ్రాములు ∙ఆర్గానిక్ గోరింటాకు పొడి (హెర్బల్ స్టోర్స్‌లో లభిస్తుంది) ∙డిస్టిల్డ్ ఎసెన్షియల్ ఆయిల్ – 30 ఎం.ఎల్ (హెన్నా ముదురు రంగులో తేలాలంటే టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్, ఇలాచీ పొడులు కూడా కలుపుతుంటారు) ∙మంచినీళ్లు ∙పంచదార – 3 టేబుల్ స్పూన్లు (హెన్నా మిశ్రమం గట్టిగా అవడానికి) -
మరో పెద్దింటి పెళ్లి
దాంపత్య జీవితానికి బందీ కాబోతున్న పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను ఆశీర్వదించేందుకు రాంచీ జైల్లో బందీగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పెరోల్‌పై విడుదల అయ్యారు. పెళ్లి జరిగే మే 12వ తేదీకి అటు ఇటు కలిపి ఐదురోజుల పాటు ఆయన స్వేచ్ఛా వాయువులు పీలుస్తారు. అయితే జైలు నుంచి లభించిన తాత్కాలిక విముక్తి కారణంగా అది ఆయనకు లభించిన స్వేచ్ఛ కాదు. ఎంతకీ పెళ్లి కాని కొడుకులపై చింతతో బెంగపెట్టుకున్న లాలూకి.. ఎట్టకేలకు పెద్ద కొడుకు ఒకింటివాడు కాబోతుండటంతో ఆ బెంగ నుంచి లభించిన స్వేచ్ఛ అది! పెళ్లి కూతురు పేరు ఐశ్వర్యారాయ్! తేజ్‌ప్రతాప్‌కీ, ఐశ్వర్యకు గత నెల 18న పట్నాలోని మౌర్య హోటల్లో ఎంగేజ్మెంట్ అయింది. ఎవరీ ఐశ్వర్య! ఐశ్వర్య బిహార్ మాజీ ముఖ్యమంతి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు. 1970 ఫిబ్రవరి 16 నుంచి డిసెంబర్ 22 వరకు ఆయన బిహార్ సీఎంగా ఉన్నారు. ఐశ్వర్య తండ్రి చంద్రికా ప్రసాద్ రాయ్ బిహార్ మంత్రిగా పనిచేశారు. విశేషం ఏంటంటే.. ఇంతవరకు ఆయన తన కూతురి పెళ్లిని నిర్ధారించకపోవడం! ఐశ్వర్య ముద్దు పేరు ఝిప్సీ. వయసు 25. ముగ్గురు పిల్లల్లో ఆమే పెద్ద. చెల్లెలు ఆయుషి, తమ్ముడు అపూర్వ, అమ్మ, నాన్న.. ఇదీ ఆమె ఫ్యామిలీ. ఐశ్వర్య పట్నాలోని నోటర్ డేమ్ అకాడమీలో చదివారు. ఢిల్లీ యూనివర్శిటీ మిరిండా హౌస్ నుంచి చరిత్రలో పట్టభద్రులయ్యారు. అమిటీ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఎ. చేశారు. లాలూ ఇంట్లో 2014 తర్వాత ఇంకో పెళ్లి జరగలేదు. ఆ ఏడాది ఆఖరి కూతురు రాజ్యలక్ష్మి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి ఇద్దరు కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్విల పెళ్లి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా తగిన వధువు దొరకకో, ఈ అన్నదమ్ములు తగిన వరులు కాదనో.. పెళ్లి ఘడియలు రాలేదు. తేజస్వికి పెళ్లి సంబంధాలు పుష్కలంగా వస్తున్నప్పటికీ, అన్నయ్య పెళ్లయ్యాకే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చోవడంతో అతడి పెళ్లి కూడా అలస్యం అవుతూ వచ్చింది. లాలూ దంపతులకు 9 మంది సంతానం. అందరికన్నా పెద్దవాడు ఇప్పుడు పెళ్లవుతున్న పిల్లవాడు. రెండో సంతానం తేజస్వి. మూడు మిసా భారతి. నాలుగు రోహిణి. ఐదు చందన. ఆరు రాగిణి. ఏడు హేమ. ఎనిమిది అనుష్క. తొమ్మిది రాజ్యలక్ష్మి. మొత్తం ఏడుగురు కూతుళ్లకూ పెళ్లిళ్లయిపోయాయి. ఇక మిగిలింది ఈ ఇద్దరు అబ్బాయిలు. వీళ్ల కోసం గతంలో లాలూ భార్య రబ్రీదేవి స్వయంవరం కూడా జరిపించారు. అయితే వచ్చే కోడళ్లకు ఆమె కొన్ని ‘సంప్రదాయ నిబంధనలు’ విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. పెద్దల్ని గౌరవించడం; అణకువగా, ఒద్దికగా ఉండటం; సినిమాలు, షాపింగులకు దూరంగా ఉండటం.. ఇంకా ఇలాంటివేవో ఆ నిబంధనల్లో ఉన్నాయి! ఇప్పుడీ కొత్త కోడలు అత్తకు నచ్చిన ఉత్తమురాలు అనే అనుకోవాలి. ఎందుకంటే.. రబ్రీ ఎస్ అన్నాకే.. ఎంగేజ్మెంట్ అయింది. అయితే పెళ్లికి మాత్రం ఐశ్వర్య తండ్రి మనస్ఫూర్తిగా ‘ఎస్’ అన్నట్లు ఇప్పటికైతే ఒక్క వార్తా రాలేదు! -
అరచేతిలో అందాల పంట
‘గోరింటా పూసింది కొమ్మాలేకుండా..మురిపాల అరచేత మొగ్గాతొడిగింది...’వంటి పాటలు వినగానే..ఎర్రగా పండిన చేతులతో సందడి చేసే యువతులు, మహిళలే గుర్తుకొస్తారు. మిగతా కాలాల్లో ఏమో కానీ ఆషాఢ మాసంలో మాత్రం గోరింటాకు పెట్టుకోవాల్సిందే.æ సాయంత్రం వేళ సామూహికంగా కూర్చుని అరచేతులకు గోరింటా పెట్టుకుంటున్న మహిళలు మనకు ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటారు. –విశాఖ–కల్చరల్ ఆషాఢంతో అనుబంధం తెలుగునాట ఆషాఢ మాసానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చెమటలు కక్కించిన గ్రీష్మం వెనక్కి తగ్గగా, వరుణుడి కటాక్షంతో పుడిమి తల్లి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. చిరుజల్లులకు తనువు, మనసు పులకరిస్తుండగా..ఆత్మీయ బంధాల వైపు అందరి ప్రాణం లాగుతుంది. దీంతో కొత్తగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిన కూతుళ్లను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకొస్తారు. ఇంకేముందు ఆ వెంటనే కొత్తగా చిగురించిన గోరింటాకు చేతులకు పెట్టుకుని ఆ కూతురు మురిసిపోతుంటే తల్లిదండ్రులు పడే ఆనందం అంతా ఇంతా కాదు. అందుబాటులో కోన్లు గోరింటాకు కోసం వెతకకుండా రెడీమేడ్ కోన్లు కూడా సిటీలో లభిస్తున్నాయి.అలాగే ఆషాఢంలో వినియోగదారులు ఆకట్టుకునేందుకు సీఎంఆర్ వంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు కొత్తగా పెళై ్లన యువతులను గుర్తించి చక్కటి డిజైన్లతో మెహందీ పెడుతున్నారు. శాస్త్రియ ఆధారాలు గోరింటాకు పెట్టుకోవాల్సిన కారణాలు, పెట్టకుంటే కలిగే లాభాలపై శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వర్షకాలం, ఆషాఢం కలిసే వస్తాయి. దీంతో బురదలో ఎక్కువగా తిరిగే వారితోపాటు పొలాల్లో నాట్లు వేసే మహిళల పాదాలు దెబ్బతింటాయి. ఇళ్లలో ఉండే మహిళల పాదాలు కూడా నీటిలో నానుతాయి. ఈ మేరకు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటే దానిలోని ఔషధ గుణాల వల్ల బాధతీవ్రత తగ్గుతుంది. నీటి తడికి చెడిపోతాయనే కారణంతో చేతులకు కూడా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల్లో గోరింటాకు పెట్టే అరచేతులు, పాదాలు బాగా పండాలని మహిళలు, యువతలు కోరుకుంటారు. ఏమంటే భాద్రపద శుద్ధ తదియ రోజున సాక్షాత్తు పార్వతీదేవి మగువలకు ప్రసాదించిన అయిదోతనం సంపూర్ణమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక పెళ్లికాని యువతుల చేతులు గోరింటాకు మందార వర్ణంలో పండితే మంచి మొగుడొస్తాడనే పెద్దల చమత్కరిస్తుంటారు. పాఠశాలల్లో పోటీలు భారతీయ సంస్క తికి భావితరాలకు అందించేందుకు ముగ్గులు పోటీలను ఎన్నో సంస్థలు కొంత కాలంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కొన్ని కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థునులకు మెహందీ పోటీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలే మిత్రమండలి, సజన వంటి కొన్ని సంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు మెహందీ పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశాయి. ఆషాఢంలో రెండుసార్లు గోరింటాకు పెట్టుకుంటే చేతులు అందంగా కనిపించడమే కాదు ఆరోగ్యానికి మంచిది. అందుకే నేను ఆషాఢం ప్రారంభంతో పాటు చివరలో రెండుసార్లు పెట్టుకుంటా. కొత్తగా పెళ్లయి తల్లిగారి ఇంటికొచ్చిన వారు తప్పక పెట్టుకోవాలని పెద్దలు చెప్పేవారు. –సుచిత్ర, విశాలాక్షినగర్ -
మెహెందీ కోన్ ఇలా!
బ్యూటిప్స్ మార్కెట్లో తెచ్చి, వాడే కోన్లలో రసాయనాలు హానికరంగా ఉండవచ్చు. అవి చర్మానికి సరిపడక అలెర్జీలకు కారణం అవచ్చు. అలాంటి సమస్య రాకుండా ఇంట్లోనే మెహెందీ కోన్ తయారుచేసుకోవచ్చు.కప్పు గోరింటాకు(మెహెందీ)పొడి (4 కోన్స్ తయారుచేసుకోవచ్చు), నైలాన్ వస్త్రంతో కనీసం రెండు మూడు సార్లు వడ కట్టాలి. అర కప్పు నీటిలో టీ స్పూన్ తేయాకును కలిపి మరిగించాలి. నాలుగు రేకల చింతపండు, టీ స్పూన్ పంచదార కప్పు నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఇవి అందుబాటులో లేకపోతే... మరిగించిన కాఫీ నీళ్లు, లవంగాలు మరిగించిన నీళ్లు, నిమ్మరసం వాడచ్చు. అలాగే, ఎండబెట్టిన నిమ్మ చెక్కలను మరిగించిన నీరు, వెనిగర్/ఆమ్ల రసం(అసిడిక్ లిక్విడ్) అన్నింటినీ కలిపి 10 నిమిషాలు ఉంచి, వడకట్టాలి. ఈ నీటిలో కప్పు గోరింటాకు పొడి, పది చుక్కల యూకలిప్టస్ ఆయిల్, అంతే మోహిందీ ఆయిల్ కలపాలి. బాగా కలిపి ఈ మిశ్రమాన్ని గంటసేపు ఉంచాలి. మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని కోన్ షేపులో చేసి, దాంట్లో మెహెందీ మిశ్రమాన్ని నింపాలి. 24 గంటలలోపు ఈ మిశ్రమాన్ని డిజైన్లుగా వేసుకోవాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్‌లో పెడితే, 2-3 వారాల వరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచి ఉపయోగించవచ్చు. మెహెందీ చల్లగా ఉంటే సరైన ఫలితం రాదు. ఎర్రై డిజైన్.. డిజైన్ పొడిబారాక నిమ్మరసం, పంచదార కలిపిన రసంలో దూది ఉండను ముంచి, అద్దాలి. దీంతో డిజైన్ మరింత ఎరుపు రంగులోకి మారుతుంది. డిజైన్ పొడిబారాక వెంటనే నీళ్లతో కడిగేయకుండా బ్రష్‌తో శుభ్రపరచాలి. ఆలివ్/కొబ్బరి/నువ్వుల నూనెను రంగుపై అద్ది, మృదువుగా రాయాలి. ఇది చర్మానికి, డిజైన్‌కి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా హెన్నా వల్ల తలెత్తే చిన్న చిన్న చర్మ సమస్యలు తగ్గుతాయి.