బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసింది. ఆ తర్వాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పాప్ సింగర్ నిక్ కచేరీని పెళ్లి చేసుకొని హలీవుడ్‌లో అడుగుపెట్టేసింది. ఇప్పుడు అక్కడ వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీ అయింది. తాజాగా ఈ బ్యూటీ కూతురుతో కలిసి లండన్‌లోని ఎరీనాలో తన భర్త నిర్వహించిన కచేరికి వెళ్లింది. ఆ వేదికపైనే ప్రియాంక మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ వేదికపైకి రావడంతో ఆనందంతో ఆనాటి రోజులను గుర్తు చేసుకుంది.
(చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన శ్రద్ధా ఆర్య.. పోస్ట్ వైరల్!)
‘నా జీవితంలో ఈ వేదికను, 2000వ సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో ఈ వేదికను మిలీనియం డోమ్ అని పిలిచేవారు. నాకు 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నాను. టైటిల్ గెలిచేందుకు చాలా కష్టపడ్డాను. ఆ ఏడాది నవంబర్ 30వ తేదిని ఎప్పటికీ మర్చిపోలేను. మంచి డ్రెస్, హీల్స్ ధరించి స్టేజీపైకి వచ్చాను. అందరిని చూసి భయంతో నాకు చెమటలు పట్టాయి. టెన్షన్ తట్టుకోలేకపోయాను. శరీరంలోని ప్రతి నరం వణుకుతోంది. మరోవైపు నేను ధరించిన దుస్తులు అసౌకర్యంగా ఉన్నాయి.
(చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆ ఊరిలో దాక్కున్న జానీ)
అవి ఎక్కడ జారిపోతాయోనని భయమేసింది. అందుకే వాటిని పట్టుకొని అందరికి నమస్తే చేశాను. గూగుల్‌లో ఆ ఫోటోలు చూస్తే.. నేను కృతజ్ఞతతో నమస్కారం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే.. నా దుస్తులు జారిపోకుండా కాపాడుకోవడం కోసం నేను అలా నమస్కరించాను. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ వేదికపైకి నా కూతురుతో కలిసి రావడం ఆనందంగా ఉంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment