
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ జరగ్గా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన చరణ్.. మే 10న విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్)
కొన్నాళ్ల క్రితం మ్యూజియం నిర్వహకులు స్వయంగా హైదరాబాద్ వచ్చి చరణ్ కొలతలు తీసుకుని వెళ్లారు. మైనపు విగ్రహంలో చరణ్ తోపాటు అతడి పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. అలానే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం. తద్వారా చరణ్ అరుదైన ఘనత సాధించాడు.
గతంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ లో, అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని.. మేడమ్ టుస్సాడ్స్ దుబాయి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఈ గౌరవం దక్కింది. చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఇది థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?)