గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. తాజాగా అబుదాబిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్‌లో విగ్రహాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమ్ కూడా మైనపు విగ్రహంలో కనిపించనుంది. క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఇలా పెట్‌తో ఉన్న వారిలో రెండో వ్యక్తిగా చెర్రీ ఘనత సాధించారు. కాగా.. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కాజోల్, కరణ్ జోహార్‌ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి.
ఈ అరుదైన గౌరవం దక్కటం పట్ల రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. లెజెండరీ నటుల విగ్రహాల పక్కన ఉండేలా గౌరవం దక్కుతుందని కలలోనూ ఊహించలేదన్నారు. సినిమాపై నాకున్న ప్యాషన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ అవకాశమిచ్చిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులకు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ సినిమా స్టార్స్‌ను మేడమ్ టుస్సాడ్స్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని మ్యూజియం ప్రతినిధులు వెల్లడించారు.
Hello Everyone 👋🏻 Iam RAM CHARAN Iam Very Honoured to Joins @MadameTussauds Family!!!!@AlwaysRamCharan Wax Statue to be unveiled at #MadameTussauds this Summer 2025 ⏳🌟😉🤩#GameChanger #RamCharan 🦁👑🔥 pic.twitter.com/dApCKhmUPi
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 22, 2024
Comments
Please login to add a commentAdd a comment