Madame Tussauds
-
గ్లోబల్ స్టార్ అరుదైన ఘనత.. ఆ దిగ్గజాల పక్కన ఛాన్స్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. తాజాగా అబుదాబిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు.వచ్చే ఏడాది సమ్మర్లో విగ్రహాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమ్ కూడా మైనపు విగ్రహంలో కనిపించనుంది. క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఇలా పెట్‌తో ఉన్న వారిలో రెండో వ్యక్తిగా చెర్రీ ఘనత సాధించారు. కాగా.. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కాజోల్, కరణ్ జోహార్ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి.ఈ అరుదైన గౌరవం దక్కటం పట్ల రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. లెజెండరీ నటుల విగ్రహాల పక్కన ఉండేలా గౌరవం దక్కుతుందని కలలోనూ ఊహించలేదన్నారు. సినిమాపై నాకున్న ప్యాషన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ అవకాశమిచ్చిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులకు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ సినిమా స్టార్స్‌ను మేడమ్ టుస్సాడ్స్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని మ్యూజియం ప్రతినిధులు వెల్లడించారు.Hello Everyone 👋🏻 Iam RAM CHARAN Iam Very Honoured to Joins @MadameTussauds Family!!!!@AlwaysRamCharan Wax Statue to be unveiled at #MadameTussauds this Summer 2025 ⏳🌟😉🤩#GameChanger #RamCharan 🦁👑🔥 pic.twitter.com/dApCKhmUPi— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 22, 2024 -
‘నీ యవ్వ తగ్గేదే లే..’.. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం (ఫొటోలు)
-
మేడమ్ టుస్సాడ్స్‌లో రణ్వీర్ సింగ్ మైనపు బొమ్మలు.. ఆవిష్కరించిన హీరో (ఫోటోలు)
-
లండన్‌లో నిరసనలు...కింగ్ చార్లెస్ ముఖంపై కేక్ విసిరి...
లండన్‌లో ఆయిల్ స్టాప్ అంటూ నిరసనలు వెలువెత్తాయి. ఈ నిరసనల నేపథ్యంలోనే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లోని కింగ్ చార్లెస్ 3 మైనపు విగ్రహాన్ని ఇద్దరు వాతావరణ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం లండన్ ప్రభుత్వం కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లు అనుమతివ్వడంపై పలు ప్రాంతాల్లో వాతావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఇద్దరు వాతావరణ కార్యకర్తలు తాము ధరించిన నల్లని చొక్కాలను తీసేసి ...జస్ట్ స్టాప్ ఆయిల్ అని రాసి ఉన్న టీ షర్ట్‌లను ధరించి కింగ్ చార్లెస్ మైనపు విగ్రహం ముంఖంపై చాక్లెట్ కేక్ విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతేగాదు ఆ నిరసకారులు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ....ప్రభుత్వం ఆదేశించిన అన్ని కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు దీంతో ఈ ఘటనపై స్పందించిన మెట్రోపాలిటన్ పోలీసులు నిరసకారులు నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇటీవల గత కొద్ది రోజులుగా లండన్‌లో పలు చోట్ల ఈ జస్ట్ స్టాప్ ఆయిల్ నిరసనలు అధికమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. 🎂 BREAKING: JUST STOP OIL CAKES THE KING 🎂 👑 Two supporters of Just Stop Oil have covered a Madame Tussauds waxwork model of King Charles III with chocolate cake, demanding that the Government halts all new oil and gas licences and consents.#FreeLouis #FreeJosh #A22Network pic.twitter.com/p0DJ8v3XVB — Just Stop Oil ⚖️💀🛢 (@JustStop_Oil) October 24, 2022 (చదవండి: అమెరికా వైట్‌హౌస్‌లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్) -
మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం
లండన్: నిండా వివాదాల్లో మునిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ పక్ష నేత పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో అవమానం ఎదురైంది. బ్లాక్‌పూల్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్నిప్రభుత్వ కార్యాలయం జాబ్ సెంటర్ ముందుకు తరలించారు. జాబ్ సెంటర్ ముందు రోడ్డుపై విగ్రహం ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. Blackpool Madame Tussauds have put Boris Johnson’s waxwork outside of the job centre and I can’t stop laughing pic.twitter.com/U6VToQSjo9 — Charlotte (@charlotteclaber) July 7, 2022 నీలిరంగు టైతో కూడిన సూట్లో నడుముపై చేతులు ఉంచి నవ్వుతున్న జాన్సన్ విగ్రహాన్ని రూపొందించింది మేడమ్ టుస్సాడ్స్. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని తరలించటం చర్చనీయాంశంగా మారింది. జాబ్‌సెంటర్ ముందు రోడ్డుపై కనిపిస్తున్న జాన్సన్ విగ్రహం కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఈ అంశంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. మేడమ్ టుస్సాడ్స్ ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. 'బోరిస్ ఎక్స్ బ్లాక్పూల్' అంటూ నోట్ రాసుకొచ్చింది. బోరిస్ జాన్సన్ మైనపు విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. లాన్స్ లైవ్ నివేదిక ప్రకారం.. విగ్రహం తయారు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. సుమారు 20 మంది కళాకారులు కొన్ని వందల గంటలు శ్రమించి విగ్రహానికి రూపునిచ్చారు. -
మేడమ్ తుస్సాడ్స్ లో శ్రీదేవి మైనపు విగ్రహం ఏర్పాటు
-
హైదరాబాద్‌లో మహేష్ మైనపు బొమ్మ
ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారి ఆధ్వరంలో మహేష్‌బాబు మైనపు బొమ్మను మార్చి 25న హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ అభిమాన హీరోని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, ఫోటోలు పంచుకునే అవకాశం లభిస్తోంది. ఆ తర్వాత మహేష్ మైనపు ప్రతిమ మేడం టుస్సాడ్స్ సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగే ఐఫా ఉత్సవాల్లో భాగం కానుంది. తెలుగు సినిమాలో అత్యంత విజయవంతమైన నటులు, హీరోల్లో ఒకరైన మహేష్ ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన 'మేడం టుస్సాడ్స్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 23 శాఖల్లో అంతర్జాతీయ ప్రముఖుల మైనపు ప్రతిమలు తయారు చేసి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు వారి అభిమాన ప్రముఖుల్ని కలిసే అనుభూతిని ఇస్తోంది. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు తన ప్రతిమని ఆవిష్కరిస్తున్న సందర్భంగా మహేష్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఈ గౌరవానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిమ తయారు చేయడానికి కావాల్సిన కొలతలు, ఇతర వివరాలు తీసుకోవడానికి నాలుగు గంటలు పట్టిందని తెలిపారు. అభిమానుల లాగానే, తాను కూడా మేడం టుస్సాడ్స్ వారు తయారు చేస్తున్న తన మైనపు బొమ్మని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రతిమలు తయారు చేయడంలో సిద్ధహస్తులైన మేడం టుస్సాడ్స్ వారి నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు ని కలిసి 200 కి పైగా కొలతల్ని, అన్ని వివరాలని సేకరించారు. అచ్చం మహేష్ ని పోలి ఉండేలా బొమ్మని తయారు చేయడానికి జుట్టు, కళ్ళ రంగు వంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ప్రతిమని తయారు చేయడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. భారతదేశం నలుమూలల నుండి టూరిస్టులు మా శాఖని సందర్శిస్తుంటారు. భారతీయ సినీ ప్రముఖుల్ని వారికి అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం అన్నారు. -
మహేశ్ మైనపు విగ్రహం ; ఫొటో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి కొద్ది మంది హీరోలు మాత్రమే ఈ ఘనత దక్కించుకున్నారు. తెలుగులో ఈ గౌరవం అందుకున్న రెండో హీరోగా మహేశ్ నిలిచారు. అంతకు ముందు ప్రభాస్ విగ్రహాన్ని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మక మ్యూజియంలో తమ అభిమాన హీరో విగ్రహం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. నిర్మాణంలో ఉన్న మహేశ్ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటో విడుదల అయింది. కొద్ది గంటల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ శిల్పి ఇవాన్ రీస్ మహేశ్ విగ్రహాన్ని తయారుచేస్తున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటుంది. అతి త్వరలోనే మహేశ్ మైనపు విగ్రహం మ్యూజియంలో కొలువుదీరనుంది. కాగా, ప్రస్తుతం మహేశ్.. వంశీ పైడిపల్లి చిత్రంలో నటిస్తున్నారు. -
మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌దేవ్ విగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ విగ్రహం త్వరలో మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు కానుంది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రామ్‌దేవ్ నుంచి నిపుణులైన కళాకారులు 200 కు పైగా నిర్దిష్ట కొలతలు తీసుకోవడంతోపాటు పలు ఫొటోలను తీసుకున్నారు. ‘వృక్షాసన’ యోగా భంగిమలో రామ్‌దేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహానికి తన కాషాయ వస్త్రం, ఓ జత చెప్పులను రామ్‌దేవ్ అందజేయనున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో ఉన్న ఇతర ప్రముఖుల విగ్రహాలతోపాటు రామ్‌దేవ్ ప్రతిమను ఉంచనున్నారు. వీక్షకులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారు కూడా వృక్షాసన భంగిమలో యోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబా రామ్‌దేవ్ విగ్రహాన్ని లండన్‌లో కూడా ప్రదర్శనకు ఉంచనున్నారని పతంజలి సంస్థ అధికార ప్రతినిధి ఎస్కే తిజరవాలా తెలిపారు. -
దెబ్బతిన్న కోహ్లి మైనపు విగ్రహం
ఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు విగ్రహం దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మైనపు విగ్రహం కాస్త దెబ్బ తింది. కోహ్లి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో మైనపు విగ్రహం కుడి చెవి పైభాగం పాక్షికంగా దెబ్బతింది. దీన్ని గమనించిన మ్యూజియం నిర్వాహకులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. విగ్రహపు చెవి భాగానికి సంబంధించిన కొలతలను నిపుణులకు పంపించారు. త్వరలోనే కోహ్లి విగ్రహానికి మళ్లీ యధారూపం తీసుకు రానున్నారు. దెబ్బతిన్న కోహ్లిమైనపు విగ్రహం ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన మూడో భారత క్రికెటర్ విగ్రహం కోహ్లిది. అంతకుముందు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. -
కోహ్లి మైనపు విగ్రహాన్ని చూశారా?
న్యూఢిల్లీ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ నిర్వాహకులు బుధవారం ఆవిష్కరించారు. దీంతో ఇప్పటికే ఈ మ్యూజియంలో కొలువైన టీమిండియా దిగ్గజాలు కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్ల సరసన తాజాగా కోహ్లి చేరాడు. ఈ సందర్భంగా కోహ్లి మేడమ్ టుస్సాడ్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘నా మైనపు విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కష్టపడ్డ మీకు మనస్పూర్తిగా నా అభినందనలు. నాకు జీవితాంతం గుర్తుండే అనుభూతినిచ్చిన మేడమ్ టుస్సాడ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నా జీవితంలో మరిచిపోలేని విషయం ఇది. ప్రస్తుతం అభిమానుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా.’’ అని కోహ్లి పేర్కొన్నట్లు మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కోహ్లి ఆటతీరుకు ఫిదా అయిన ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ నిర్వాహకులు గత నెల 200 కొలతలు తీసుకుని ఢిల్లీ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఆవిష్కరించారు. తనతో సెల్ఫీలు దిగేవారు ఢిల్లీకి రావాలని కోహ్లి మంగళవారం ట్విటర్లో స్పందించిన విషయం తెలిసిందే. -
కోహ్లితో సెల్ఫీ.. ఛలో ఢిల్లీ
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీకి అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. తనదైన బ్యాటింగ్ శైలితో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోహ్లి అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తనతో సెల్ఫీ దిగాలనుకునేవారిని ఢిల్లీకి రమ్ముంటున్నాడు కోహ్లి. విషయం ఏమిటంటే.. కొద్ది రోజుల క్రితం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని మ్యూజియంలో పెట్టేందుకు కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మ్యూజియంలో పెట్టేందుకు కోహ్లి విగ్రహం సిద్ధమైందట. రేపు (బుధవారం) ఆ మ్యూజియంలో కోహ్లి మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కోహ్లినే స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నాతో సెల్ఫీలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి. జూన్ 6 నుంచి నేను మీకు అక్కడ అందుబాటులో ఉంటాను. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే అభిమానులు మాత్రం తమకు కోహ్లితోనే సెల్ఫీలు కావాలని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మ్యూజియంలో టీమిండియా దిగ్గజాలు కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌లతో ఫుట్ బాల్ దిగ్గజాలు మెస్సీ, డెవిడ్ బెక్కమ్ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి. Come 6th of June, let’s play statue! 😉 Excited to be at #MadameTussauds 😃#TussaudsDelhi@MadameTussauds@tussaudsdelhi pic.twitter.com/074c3lQF0o — Virat Kohli (@imVkohli) 5 June 2018 -
మైఖేల్ జాక్సనా.. మంగళ్ పాండేనా?
లుథియానా : పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా తయారయ్యింది పంజాబ్‌కు చెందిన చంద్రశేఖర్ ప్రభాకర్ పరిస్థితి. ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను సందర్శించాలని చాలా మంది ఔత్సాహికులు కోరుకుంటారు. ప్రభాకర్ కూడా ఆ కోవక చెందిన వారే. టుస్సాడ్స్ మ్యూజియం చూడగానే ఆయన కూడా అలాంటి మ్యూజియం ప్రారంభించాలని ఆరాటపడ్డారు. అందుకే 2005లో లుథియానాలో ప్రభాకర్ మైనపు విగ్రహాల మ్యూజియం ప్రారంభించారు. అబ్దుల్ కలామ్, మదర్ థెరిసా, సచిన్ టెండూల్కర్, బరాక్ ఒబామా, మైఖేల్ జాక్సన్ వంటి 52 మంది ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ మ్యూజియాన్ని చూసిన సందర్శకులు ట్విటర్ వేదికగా ఆయనపై జోకులు పేలుస్తున్నారు. సెలబ్రిటీల అసలు రూపానికీ, వారి విగ్రహాలకు అసలేమైనా పొంతన ఉందా అంటూ ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారు. ‘మదర్ థెరిసా విగ్రహం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్లా ఉంది’అని, ‘అబ్దుల్ కలాం హిల్లరీ క్లింటన్‌లా మారిపోయారని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే.. శశిథరూర్ అభిమాని కలాం విగ్రహాన్ని అలా మలచడంలో తప్పు లేదంటూ’ మరొకరు సెటైర్ వేశారు. ‘మ్యూజియం గనుక విగ్రహాలను చూసి ఆ సెలబ్రిటీ ఎవరో చెప్పాలనే పోటీ పెడితే ఒక్కరు కూడా గెలవలేరంటూ’ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. విమర్శలపై స్పందించిన చంద్రశేఖర్.. ‘టుస్సాడ్స్ మ్యూజియంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. వారు సెలబ్రిటీలను సంప్రదించి కొలతలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మేం సింగిల్ డైమెన్షన్ ఆధారంగా విగ్రహాలు రూపొందిస్తున్నాము. ఇది సవాలుతో కూడుకున్న పని. మ్యూజియం నెలకొల్పి నా వంతుగా ఏదైనా చేయాలనుకున్నాను. ప్రస్తుతం అదే చేస్తున్నాను అంటూ’ వివరణ ఇచ్చారు. Snapchat pictures iOS vs Android pic.twitter.com/FTcKaKJNyY — Pakchikpak Raja Babu (@HaramiParindey) April 2, 2018 Mother Teresa with APJ Hillary Kalamton pic.twitter.com/knAmQ0DRdC — Divya (@divya_16_) April 2, 2018 When you have to make a wax statue of Dr Kalam but you are a Shashi Tharoor fan. pic.twitter.com/Un2pXa52xy — Sand-d Singh (@Sand_In_Deed) April 2, 2018 The wax museum should start this contest. No one will get it right pic.twitter.com/0MFM15mWjw — P.R. (@pr_akash_raj) April 2, 2018 Rajnath Singh in drag 😁 pic.twitter.com/h6sE5EBJ3c — Amlan عملان अम्लान Dutta (@orphean_warbler) April 1, 2018 I have so many questions about the wax museum in the last RT! Why is Obama blonde? Why does Sachin look like an extra from 'Bhabhiji Ghar Par Hai' Why make Kalam a white lady? 😂 pic.twitter.com/Y1bOIdsMHD — Sahil Rizwan (@SahilRiz) April 2, 2018 -
కోహ్లికి అరుదైన గౌరవం!
-
కోహ్లికి అరుదైన గౌరవం!
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ప్రపంచ అత్యద్భుత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన కోహ్లి మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మ ఢిల్లీ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో ఈ గౌరవం పొందిన క్రీడా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీల సరసన కోహ్లి చేరాడు. ఇప్పటికే లండన్ నుంచి వచ్చిన టుస్సాడ్ మ్యూజియం కళాకారులు కోహ్లి కొలతలు తీసుకున్నారు. ఇక టుస్సాడ్ మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాటు చేయడంపై కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. ‘మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాటు చేయడం అత్యంత గౌరవంగా భావిస్తున్నా. ఓపికతో నా కొలతలు తీసుకొని నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తున్న టుస్సాడ్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలని’ కోహ్లి పేర్కొన్నాడు. 2006 దేశవాళి క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి 2008 అండర్-19 వరల్డ్‌కప్ అందించి సీనియర్ జట్టులోకి వచ్చాడు. అనతి కాలంలోనే ప్రపంచ రికార్డులన్ని తిరగ రాస్తూ ప్రపంచ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సాధించాడు. ఇప్పటికే అర్జున అవార్డ్, ఐసీసీ వరల్డ్ క్రికెటర్, మూడు సార్లు బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులందుకున్న కోహ్లికి భారత ప్రభుత్వం నుంచి గౌరవ పద్మశ్రీ పురుస్కారం కూడా లభించింది. ఇక ప్రతిష్టాత్మక లండన్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం వివిధ దేశాల్లో 21 బ్రాంచిలు ఏర్పాటు చేసింది. దీని బ్రాంచి ఢిల్లీలో కూడా ఉంది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రముఖ, హాలీవుడ్, బాలీవుడ్ నటులు, ప్రఖ్యాత ఆటగాళ్లు, రాజకీయ వేత్తల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. -
కట్టప్పకు అరుదైన గౌరవం
సాక్షి, సినిమా : బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్రకు దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. మాషిష్మతి రాజ్యానికి, సింహాసనానికి.. నమ్మిన బంటుగా ఉండే పాత్రలో నటుడు సత్యరాజ్ మెప్పించగా.. దర్శకధీరుడు రాజమౌళి ఆ పాత్రను అద్భుతంగా తీర్చి దిద్దడంతో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఆ కట్టప్ప అలియాస్ సత్యరాజ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్ప మైనం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో కట్టప్ప రూపంలో ఉన్న సత్యరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా, సత్యరాజ్ తనయుడు శిబి సత్యారాజ్ కూడా ధృవీకరించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే... మేడమ్ టుస్సాడ్‌లో విగ్రహ ఏర్పాటు గౌరవం అందుకున్న తొలి తమిళ నటుడు సత్యరాజ్ కావటం. అంతకు ముందు బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ విగ్రహాన్ని కూడా బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పిన విషయం తెలిసిందే. Really proud to read this!😊🙏🏻 #Kattappa #Baahubali https://t.co/M61ZcN8OLU — Sibi (Sathya)raj (@Sibi_Sathyaraj) 11 March 2018 -
టుస్సాడ్స్ మ్యూజియంలో మధుబాల
బాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరోయిన్ కి అరుదైన గుర్తింపు లభించింది. ప్యార్ కియాతో డర్నా క్యా అంటూ భారతీయ సినీ జనాల మన్ననలు పొందిన బాలీవుడ్ అనార్కలీ.. మధుభాల. 50కి పైగా చిత్రాలలో నటించిన ఈ అందాల తార తన 36వ ఏట 1969 లో కన్నుమూశారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మధుబాల మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. మధుబాల సోదరి మధుర్ బ్రిజి భూషన్ ఆద్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. అనార్కలీ రూపంలో మధుబాల మైనపు విగ్రహాన్ని రూపొందించారు. మధుబాల విగ్రహం ఏర్పాటు చేయటం గౌరవంగా భావిస్తున్నామని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. ఢిల్లీలోని మ్యూజియంలో తన సోదరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మధుర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మధుర్ బ్రిజి భూషన్ అక్కతో ఎక్కువ రోజులు గడిపే అవకాశం నాకు దొరికినందుకు సంతోషం గా ఉందన్నారు. డిసెంబర్ లో మ్యూజియాన్ని తెరవనున్నారు. 1952లో ఓ ప్రముఖ అమెరికా మ్యాగజైన్ మధుబాల ఫోటోని కవర్ పేజీపై ప్రచురించడంతో అంతర్జాతీయంగా ఆమె పాపులర్ అయ్యింది. -
ఇట్స్ సాహో టైమ్
ప్రభాస్ ఇప్పుడు ఫుల్ కూల్‌గా ఉన్నారు. దాదాపు నెల రోజులుగా యూఎస్‌లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేశారు. కొత్త ఉత్సాహంతో ఇండియా వచ్చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఈ యంగ్ రెబల్ స్టార్ త్వరలో ‘సాహో’ షూటింగ్లో పాల్గొంటారు. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం టీజర్లో ప్రభాస్ ‘ఇట్స్ షో టైమ్’ అన్నారు. ఇప్పుడు పూర్తిగా ఈ చిత్రానికే డెడికేట్ కాబోతున్నారు కాబట్టి, ‘ఇట్స్ సాహో టైమ్’ అనాలి. ఆ సంగతలా ఉంచితే.. ప్రభాస్ తననెవరూ గుర్తుపట్టకూడదని యూఎస్‌లో ఉన్నప్పుడు గడ్డం, మీసాలు తీసేశారట. హ్యాపీగా హాలిడేస్‌ను ఎంజాయ్ చేసి, హైదరా బాద్‌లో వచ్చారు. ఆయన అభిమానులు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే, బ్యాంకాక్‌లోని ‘మేడమ్ తుస్సాడ్స్’లో ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు బొమ్మను పెట్టారు. ఆ మధ్య ఈ బొమ్మ కోసం అక్కడివాళ్లు ఇక్కడికొచ్చి ప్రభాస్ కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే. -
టుస్సాడ్ మ్యూజియంలో బీబర్ విగ్రహం
లండన్: లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కొత్త మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వారంలో లండన్ లోని ఓ2 అరేనా స్టేడియంలో అంతర్జాతీయ ప్రదర్శన ఇవ్వబోతున్న సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. బీబర్ చొక్కాలేకుండా ఉండే మైనపు ప్రతిమను ఆవిష్కంచారు. ‘రెయిన్ షవర్ ఫినాలే’ ప్రదర్శనలోని బీబర్ గెటప్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. బీబర్ 22వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ మ్యూజియం తొలిసారిగా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం కొత్తగా ఆవిష్కరించిన మైనపు ప్రతిమ రెండోది. 2017 జనవరి మూడో తేదీవరకు మాత్రమే ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచుతామని టుస్సాడ్ మ్యూజియం నిర్వాకులు తెలిపారు. -
గాంధీ... మోదీ తర్వాత ప్రభాస్‌కే!
-
గాంధీ... మోదీ తర్వాత ప్రభాస్‌కే!
సత్యం, అహింసలే ఆయుధంగా చేసుకున్న జాతిపిత మహాత్మా గాంధీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. వీళ్లిద్దరి తర్వాత ఆ గౌరవం ప్రభాస్‌కే అంటే.. ఆ గౌరవం దేనికి సంబంధించినది అయ్యుంటుందా? అని ఆశ్చర్యపోవడం సహజం. రాజకీయాలతో సంబంధం లేని గౌరవం ఇది. మైనపు విగ్రహాల రూపకల్పనలో పేరున్న కళాకారిణి ‘మేడమ్ టుస్సాడ్’ పేరున లండన్‌లో ప్రసిద్ధ మ్యూజియమ్ ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాల్ని అక్కడ పెడుతుంటారు. ప్రపంచంలోని పలు చోట్ల ఆ మ్యూజియమ్ బ్రాంచ్‌లున్నాయి. బ్యాంకాక్‌లోని శాఖలో మన దేశం నుంచి మహాత్మా గాంధీ, ఆ తర్వాత నరేంద్ర మోదీ బొమ్మలు అక్కడ పెట్టారు. తాజాగా ప్రభాస్ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించనున్నారు. ఈ గౌరవం దక్కించుకుంటున్న తొలి దక్షిణ భారతీయుడు ప్రభాసే కావడం విశేషం. శుక్రవారం జరిగిన ‘బాహుబలి 2’ ప్రెస్మీట్లో ‘ఈ నెల 5న ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఓ తీపి కబురు చెప్తా’ అని రాజమౌళి ఊరించారు. ఆ కబురు ఈ మైనపు బొమ్మకు సంబంధించినదే. ఆయన చెప్పే లోపే విషయం బయటకు రావడంతో ‘‘5న చెప్పాలను కున్నది ఇవాళే చెప్పేస్తున్నా. వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠిస్తారు’’ అని శనివారం రాజమౌళి వెల్లడించారు. ‘బాహుబలి’లో శస్త్రాస్త్రాలు ధరించిన అమరేంద్ర బాహుబలి గెటప్‌లో ఈ బొమ్మ ఉండనుంది. విగ్రహం అచ్చంగా ప్రభాస్ లాగే అనిపించేందుకు టుస్సాడ్స్ వారు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి, ప్రభాస్‌తో సిట్టింగ్ వేసి, రకరకాల కోణాల్లో ఆయన్ను 350 ఫోటోలు తీశారు. ఒంటి కొలతలు తీసుకున్నారు. ‘‘గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో అత్యధికులు వెతికే వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు. ఆయన ప్రతిమను పెట్టాలని ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానులు కోరారు’’ అనీ, భారతీయ చిత్రాల్లో వసూళ్ల పరంగా ‘బాహుబలి’ చరిత్ర సృష్టించడమే ఈ బొమ్మ పెట్టాలనుకోవడానికి కారణమనీ అని బ్యాంకాక్‌లోని టుస్సాడ్స్ శాఖ జనరల్ మేనేజర్ తెలిపారు. అభిమానుల వల్లే ఇది సాధ్యమైందనీ, చాలా ఆనందంగా ఉందనీ హీరో ప్రభాస్ వ్యాఖ్యానించారు. -
రాజమౌళి ఆ రహస్యం చెప్పేశాడు
శుక్రవారం బాహుబలి టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అక్టోబర్ 5న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తానంటూ చెప్పాడు దర్శకుడు రాజమౌళి. ఆ విషయం ఏమై ఉంటుంది అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కొంత మంది అది ప్రభాస్ పెళ్లి వార్తే అని ఫిక్స్ అయ్యారు కూడా. అయితే అనుకున్నసమయానికన్నా ముందే రాజమౌళి ఆ రహస్యాన్ని వెల్లడించాడు. 'ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వార్తని ఎక్కువగా కాలం దాచి పెట్టలేం, అందుకే 5వ తారీఖున చెప్పాల్సిన వార్త ఇవాళే చెప్పేస్తున్నా. మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గౌరవం దక్కిన తొలి దక్షిణాది నటుడు ప్రభాస్. ప్రభాస్ విగ్రహాన్ని 2017 మార్చిలో బ్యాంకాక్‌లో ఆవిష్కరిస్తారు' అంటూ ట్వీట్ చేశాడు. Guess its impossible to keep the news under wraps nowadays.:) Revealing the good news today itself. — rajamouli ss (@ssrajamouli) 1 October 2016 Very happy to announce that Madame Tussauds is making a wax statue of our PRABHAS.. First South Indian to be honoured thus. — rajamouli ss (@ssrajamouli) 1 October 2016 The statue will be unvieled at Bangkok in March 2017 and subsequently will be toured all over the world. — rajamouli ss (@ssrajamouli) 1 October 2016 -
మేడమ్ టుస్సాడ్స్‌లో మోదీ విగ్రహం
లండన్: మైనపు విగ్రహాల ప్రదర్శనశాల మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. దీన్ని ఢిల్లీలో గతవారమే మోదీ పరీక్షించారు. విఖ్యాత నాయకుల విభాగంలో మోదీ విగ్రహానికి స్థానం కల్పించారు. ఈ విభాగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తదితరుల విగ్రహాలు ఇప్పటికే కొలువుదీరి ఉన్నాయి. వీరితోపాటు పాతతరం నాయకులు మహాత్మా గాంధీ, విన్స్టన్ చర్చిల్ల మైనపు ప్రతిమలూ ఇక్కడ ఉన్నాయి. లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌ల్లోని మేడమ్ టుస్సాడ్స్ ప్రదర్శనశాలల్లోనూ మోదీ విగ్రహాలను ఉంచుతారు. -
టుస్సాడ్స్‌లో తొలిసారిగా భారతీయ సీఎం విగ్రహం
లండన్: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో భారత్‌లోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. కేజ్రివాల్ విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం మరో విశేషమవుతుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు భారతీయ పార్టనర్ అయిన విజ్‌క్రాఫ్ట్ ఎంటర్నేన్‌మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మేరకు కేజ్రివాల్‌కు జనవరి 11వ తేదీన ఓ లేఖ రాసినట్లు తెల్సింది. ఫిబ్రవరి మొదటివారంలో విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధులు కేజ్రివాల్‌ను కలసి ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. వచ్చే ఏడాది నాటికల్లా ఢిల్లీలో ఆకర్షనీయమైన మైనపు విగ్రహాల మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నది విజ్‌క్రాఫ్ట్ లక్ష్యం. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోది గత నవంబర్ నెలలో లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల అభివృద్ధి కోసం తాము ఢిల్లీలో వాక్య్ మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు టుస్సాడ్ మ్యూజియం వర్గాలు ప్రకటించాయి. ఆ మ్యూజియంలో ముందుగా కేజ్రీవాల్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది తాజా నిర్ణయం. అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాలతోపాటు యూరప్‌లోని మొత్తం 20 దేశాల్లో మైనపు విగ్రహాల మ్యూజియంలను టుస్సాడ్స్ ఏర్పాటు చేసింది. ఆ మ్యూజియంలలో ఇప్పటికే జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్, హృతిక్ రోషణ్, సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. -
కత్రినా.. బొమ్మయిపోయింది!
లండన్ : లండన్‌లోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు చోటుదక్కింది. ఇటీవల టుస్సాడ్ వెబ్సైట్, పంజాబ్ రేడియో సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ పోటీలో ప్రియాంకా చోప్రా, దీపికా పడుకోన్‌ను వెనక్కి నెట్టి కత్రినా ఈ గౌరవాన్ని దక్కించుకుంది. హోరా హోరీగా జరిగిన ఈ పోటీలో 2.25 లక్షల మందికి పైగా నెటిజన్లు కత్రినాకు ఓటు వేశారు. మైనపు బొమ్మల ప్రదర్శనశాలలో స్థానాన్ని దక్కించుకున్న ఏడో బాలీవుడ్ నటిగాఖ్యాతి దక్కించుకుంది. ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ , మాధురీ దీక్షిత్ బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను మ్యూజియంలో ప్రతిష్టించే ఈ పరంపర గత 150 ఏళ్లుగా సాగుతోంది. దాదాపు 500 బొమ్మలు ఇక్కడ కొలువుదీరాయి. బంగారు, వెండివర్ణాల కలబోసిన టూ పీస్ డ్రెస్‌లో డాన్స్ చేస్తున్న పోజులో ఉన్న తన మైనపు బొమ్మను చూసిన కత్రినా.. వావ్... అద్భుతం, అచ్చం నాలాగే ఉందే అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోందట.