లండన్: లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కొత్త మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వారంలో లండన్ లోని ఓ2 అరేనా స్టేడియంలో అంతర్జాతీయ ప్రదర్శన ఇవ్వబోతున్న సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. బీబర్ చొక్కాలేకుండా ఉండే మైనపు ప్రతిమను ఆవిష్కంచారు.
‘రెయిన్ షవర్ ఫినాలే’ ప్రదర్శనలోని బీబర్ గెటప్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. బీబర్ 22వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ మ్యూజియం తొలిసారిగా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం కొత్తగా ఆవిష్కరించిన మైనపు ప్రతిమ రెండోది. 2017 జనవరి మూడో తేదీవరకు మాత్రమే ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచుతామని టుస్సాడ్ మ్యూజియం నిర్వాకులు తెలిపారు.
టుస్సాడ్ మ్యూజియంలో బీబర్ విగ్రహం
Published Wed, Oct 12 2016 7:31 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
Advertisement
Advertisement