Justin Bieber
-
Justin Bieber: అనంత్-రాధికలతో స్టార్ సింగర్ హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
అనంత్-రాధిక సంగీత్.. అదరగొట్టేందుకు స్టార్ సింగర్ రెడీ
అనంత్ అంబానీ, రాధి మర్చెంట్ వివాహ వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇటీవలే మామేరు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సంగీత్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో యుఎస్ సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన ఉంటుంది. సంగీత్‌లో పాటలు పాడేందుకు బీబర్ రూ.83 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ రోజు సాయంత్రం జరగనున్న సంగీత్ కార్యక్రమంలో పాటలు పాడటానికి బీబర్ ముంబై చేరుకున్నారు. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బీబర్ గులాబీ రంగు స్వెట్‌షర్ట్, ఎరుపు రంగు బకెట్ టోపీని ధరించి ఉండటం చూడవచ్చు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లిఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ముంబైలోని బీకేసీలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో సంగీత్ నిర్వహించనున్నారు. దీనికి కుటుంబం, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ఈ మ్యూజికల్ సునామీ ఎవరో గుర్తు పట్టండి! (ఫోటోలు)
-
పాప్ స్టార్ బీబర్ స్పెషల్ స్కూటర్.. ధర రూ. 6.45 లక్షలు!
ముంబై: వెస్పా స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తాజాగా జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ధర రూ. 6.45 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్). కెనడాకు చెందిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ పేరిట ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను (పది లోపే) ప్రీ–ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా అసెంబుల్ చేసిన యూనిట్‌గా దిగుమతి అవుతాయి. 150 సీసీ ఇంజిన్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్ ఉంటుందని పియాజియో వెహికల్స్ సీఎండీ డీగో గ్రాఫీ తెలిపారు. జస్టిన్ బీబర్ రూపొందించిన కొత్త వెస్పా వైట్ కలర్ ఆప్షన్లో మోనోక్రోమ్ స్టైల్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులోని శాడిల్, గ్రిప్స్, రిమ్స్ స్పోక్స్ వంటి ఎలిమెంట్స్ అన్నీ వైట్‌లోనే ఉన్నాయి. బ్రాండ్ లోగో, వెహికల్ బాడీపై ఫ్లేమ్స్ కూడా టోన్-ఆన్-టోన్ తెలుపు రంగులో ఉంటాయి. -
పక్షవాతం బారిన స్టార్ సింగర్.., వీడియో వైరల్
Justin Bieber Reveals He Suffer With Face Paralysis: కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జస్టిన్ పాటలంలే చెవి కొసుకునేవారు ఇండియాలో సైతం ఉన్నారు. చిన్న వయసులోనే బేబీ.. బేబీ అంటూ పాడి ఎంతో మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు. అంతగా తన గాత్రంతో ఆకట్టుకున్న జస్టీన్ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను పాక్షిక పక్షవాతానికి గురైనట్టు ప్రకటించాడు. ఈ మేరకు జస్టీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. చదవండి: నయనతార దంపతులపై టీటీడీ ఫైర్, నోటీసులు జారీ ‘చాలా ముఖ్యమైనది దయచేసి చూడండి.. నా కోసం ప్రార్థించండి’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో జస్టీన్ తాను అరుదైన వ్యాధితో భాధపడుతున్నట్లు వెల్లడించాడు. ‘నేను రామ్ సే హంట్ సిండ్రోమ్ భారిన పడ్డాను. ఈ వ్యాధి వల్ల నా ముఖ భాగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ముఖం పక్షపాతానికి గురైంది. కదలికలు సరిగా లేవు. కుడి కన్ను ఆర్పలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చాడు. దీని శరీరం కూడా మెల్లిగా శక్తి లేకుండా పోతుంది. తనలో ఈ వ్యాధి లక్షణాలో కాస్తా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తాను వరల్డ్ టూర్ క్యాన్సల్ చేసుకున్నానని చెప్పాడు. ‘టొరంటో, వాషింగ్టన్ డీసీ, ఇండియా టూర్ రద్దు చేసుకున్నాను. పూర్తిగా కోలుకునే వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు చేయాలేను’ అని తెలిపాడు. చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ కాగా ఈ రామ్సే హంట్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. సాధారణంగా చెవి, నోటి భాగంలోని నరాలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ముఖ భాగం పక్షవాతాని గురవుతుంది. ముఖ పక్షవాతం బారినపడినవారిలో ఒకవైపు ముఖ కదళికలు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం బీబర్ ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా కొన్నిసార్లు వినికిడి లోపం కూడా రావొచ్చు. పిల్లలు, పెద్దల్లో చికెన్‌పాక్స్ వ్యాధికి కారణమయ్యే వైరసే ఈ రామ్సే హంట్ సిండ్రోమ్. ప్రతీ 1 లక్ష మందిలో ఐదు నుంచి 10 మంది మాత్రమే రామ్సే సిండ్రోమ్ బారినపడుతారు. ఈ సిండ్రోమ్ బారినపడితే.. చెవి వద్ద ఎర్రని దద్దురు ఏర్పడుతుంద న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. View this post on Instagram A post shared by Justin Bieber (@justinbieber) -
పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు భారీ షాక్!
అమెరికన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు ఇటాలియన్ సూపర్ కార్ మ్యానిఫ్యాక్చరర్ ఫెరారీ సంస్థ భారీ షాకిచ్చింది. ఈ పాప్ స్టార్ ఫెరారీ కారును వినియోగించేందుకు వీలు లేదని హెచ్చరించింది. ఇటలీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఇల్ జియోర్నాలే నివేదిక ప్రకారం..ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఫెరారీ కార్ల పట్ల జస్టిన్ బీబర్‌కు నైతిక విలువలు లేవని, వాటిని మెయింటెన్స్ చేయడంలో విఫలం అయ్యాడని,అందుకే ఫెరారీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా సంస్థ తెలిపింది. ఫెరారీ సంస్థ తన కార్లను సరైన రీతిలో వినియోగించని సెలబ్రిటీలపై ఆంక్షలు విధించడం సర్వసాధారణం. గతంలో హాట్ మోడలింగ్‌తో గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిమ్ కర్దాషియన్‌తో పాటు, నికోలస్ కేజ్, ర్యాపర్ 50సెంట్ వంటి ప్రముఖులు ఫెరారీ కార్లను వినియోగించకుండా నిషేధించింది. తాజాగా ర్యాపర్ జస్టిన్ బీబర్‌పై అదే తరహాలో చర్యలు తీసుకుంది. జస్టిన్ బీబర్‌కు చెందిన ఎఫ్ 458ను నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జస్టిన్ బీబర్ ఫెరారీ రంగును మార్చడం, వేలం వేయడం వంటి అంశాలే ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై నిషేదం విధించే కారణాల్లో ఇవి కూడా ఉన్నాయి. గతంలో జస్టిన్ బీబర్ తన ఎఫ్ 458ని కొనుగోలు చేసిన కొన్ని నెలల తరువాత బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్ వెలుపల పార్కింగ్ చేశాడు. నాటి నుంచి బీబర్‌కు ఫెరారీ కార్ల విషయంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంన్నాడు. బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్లో పార్కింగ్ చేసిన తర్వాత ఆ కారు మిస్ అవ్వడం కలకలం రేగింది. దీంతో బీబర్ సహాయకుడు ఆ సూపర్ కార్‌ను గుర్తించాడు. కారు అదృశ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ కెనడియన్ ర్యాపర్ తన ఫెరారీ కారును తెలుపు రంగును బ్లూకి మార్చాడు. అంతేకాదు కారు స్టీరింగ్ వీల్ మీద గుర్రం సింబల్ రంగును, అల్లాయ్ వీల్స్, రిమ్స్ మీద బోల్ట్ లను మార్చాడు. దీంతో ఫెరారీ సంస్థ బీబర్‌పై గుర్రుగా ఉంది. దీనికితోడు రంగును మార్చి వేలం వేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెరారీ సంస్థ.. ఇకపై బీబర్ తమ సంస్థకు చెందిన కారును వినియోగించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్ -
జస్టిన్ బీబర్ మ్యూజిక్ కన్సర్ట్ వద్ద కాల్పుల కలకలం
అమెరికా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే అతడి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువే. ఇక అతడి మ్యూజిక్ కన్సర్ట్ అంటే వేలల్లో, లక్షల్లో అభిమానులు హజరవుతారు. ఈ నేపథ్యంలో అమెరికాలో రీసెంట్గా నిర్వహించిన జస్టిన్ బీబర్ కన్సర్ట్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిన రెస్టారెంట్ బయట కాల్పులు కలకలం సృష్టించింది. అక్కడి వచ్చిన పలువురి మధ్య ఘర్షణ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికి మీడియా సమాచారం. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ ది నైస్ గై రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి లిజెత్ లోమెలి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అక్కడ ఇద్దరు బాధితులను గుర్తించారని, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో రాపర్ కోడాక్ బ్లాక్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి ఎటువంటి సమాచారం లేదని, ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: Krithi Shetty: మాటిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ‘బేబమ్మ’ కానీ జస్టిన్ బీబర్ మ్యూజిక్ కన్సర్ట్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ఈ ఘటనపై పలు అనుమానులు కూడా తలెత్తున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. డ్రేక్, లియో డికాప్రియో, కెండల్ జెన్నర్, కోల్ కర్దాషియాన్ వంటి పలువురు ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. సంగీత కచేరీ అనంతరం కొడాక్ బ్లాక్, గున్నా , లిల్ బేబీ బయటికి వచ్చారని, అప్పుడే గొడవ జరిగిందని ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం. కొందరు వ్యక్తులు కారుపైకి ఎక్కడంతో గొడవ మొదలైందని.. కొంతసేపటికి బుల్లెట్ల శబ్ధం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. -
ఆ మహిళలపై బీబర్ పరువునష్టం దావా
పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఇద్దరు మహిళలపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తనపై ఆరోపణలు చేసిన ఒక్కో మహిళపై 10 యూఎస్ మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 75.6 కోట్లు) పరువు నష్టం దావా వేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని బీబర్ స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు నిరాధరమైనవని నిరూపించడానిని తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాలను ఓ ప్రముఖ మీడియా వెబ్సైట్ వెల్లడించింది.(చదవండి : స్వీయ నిర్బంధంలో ‘ముద్దు’ ముచ్చట) ఈ ఆరోపణలు చేసినవారిలో ఒకరు.. 2014లో అస్టిన్‌లో జరిగిన సౌత్‌వెస్ట్ ఫెస్టివల్ చూసేందుకు వచ్చిన సమయంలో బీబర్ తనపై దాడి చేసినట్టుగా చెప్పారు. మరో మహిళ 2015 న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీబర్ తనపై దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. అయితే ఇవి రెండు కూడా పూర్తిగా కల్పితమైనవని.. ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే కుట్ర దాగి ఉందని బీబర్ పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు చర్యల వల్ల ఇతరుల పరువుకు భంగం వాటిల్లడమే కాకుండా.. కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ఇదివరకే తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేయనున్నట్టు బీబర్.. ట్విటర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్టార్ కపుల్ ‘ముద్దు’ ముచ్చట
కెనడా : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ప్రజలు కూడా బయట తిరగకుండా ఇంటికి పరిమితమవ్వాలని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా స్వీయ నిర్బంధంలోని తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టార్ కపుల్‌కు చెందిన ‘ముద్దు’ ముచ్చట వైరల్‌గా మారింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన భార్య, మోడల్ హేలే బాల్డ్విన్ను ముద్దు పెట్టుకున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘నా స్వీయ నిర్బంధ భాగస్వామి’ అంటూ స్పందించారు. ( అవును.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యా: సింగర్ ) కాగా, గత కొద్దిరోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ జంట తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటోంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన జస్టిన్ బీబర్ కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. అయితే కొంతకాలంగా లాస్ ఏంజిల్స్‌లో ఉన్న ఆయన ఈనెల 16న భార్యతో కలిసి కెనడా వచ్చేశారు. View this post on Instagram My quarantine partner A post shared by Justin Bieber (@justinbieber) on Mar 18, 2020 at 3:06pm PDT -
అవును.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యా: సింగర్
తన మాజీ ప్రియుడు జస్టిన్ బీబర్‌తో సహజీవనం సమయంలో ‘ఎమోషనల్ బ్లాక్మెయిల్’కు గురయ్యానని అన్నారు అమెరికా పాప్ సింగర్ సెలెనా గోమేజ్. తాజాగా సెలెనా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టీన్ బీబర్‌తో బ్రేకప్ తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. బీబర్‌తో విడిపోయిన తర్వాత జీవితంలో ముందుకు సాగడం మీకు కష్టం అనిపించిందా అని అడిగిన ప్రశ్నకు.. ‘అవును.. అనిపించింది. ఇష్టమైన వారితో విడిపోవడం అనేది చాలా బాధకరం. మానసికంగా బాధించే ఆ బాధను మాటల్లో చెప్పలేం. దాని నుంచి బయటపడటం అంత సులువు కాదు. అయితే నేను దీని నుంచి మరింత బలవంతురాలినయ్యాను. అంతే తప్పా దీన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ నేను కూడా కొన్ని భావోద్వేగ దూషణలకు బాధితురాలిననే అనుకుంటున్నాను’ అంటూ సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ‘పరిణతి చెందిన అమ్మాయిగా నేను ఈ విషయం నుంచి బయటపడాలి అనుకున్నాను. జీవితంలో ఎప్పటికీ దీని గురించి బాధపడనంతగా మారాలి అనుకున్నాను. మారాను కూడా. అప్పుడప్పుడు నాకంటే బలవంతులు లేరని గర్వపడుతుంటాను’ అన్నారు. కాగా సెలినా, జస్టిన్ బీబర్లు 2011లో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. కొంత కాలం హాలీవుడ్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వీరిద్దరూ 2018లో విడిపోయారు. ఆ తర్వాత సెలినాకు బ్రేకప్ చేప్పినా కొద్ది రోజులకే బీబర్ టాప్ మోడల్ హేలీ బోల్డ్విన్ను వివాహమాడిన సంగతి తెలిసిందే. -
సింగర్ జస్టిన్ బీబర్‌కు లైమ్ వ్యాధి
తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ ప్రస్తుతం ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు లైమ్ వ్యాధి సోకిందని, అయితే దీనికి చికిత్స తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. పాతికేళ్లు వయసున్న జస్టిన్ బీబర్ ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చారు. ‘చాలా మందికి తెలియదు. జస్టిన్ బీబర్ ఎందుకు ఇలా తయారయ్యాడని అందరూ అనుకుంటున్నారు. నేను లైమ్ వ్యాధితో బాధపడుతున్నానని వారికి తెలీదు. ఇది నాపై దీర్ఘకాలంగా ప్రభావం చూపింది. ఈ వ్యాధి వల్ల నా చర్మం పూర్తిగా పాడైపోయింది. మెదడు పనితీరు మారింది. ఒంట్లో శక్తి తగ్గి, ఆరోగ్యం క్షీణించిపోయింది’ అని పేర్కొన్నారు. అయితే చాలా కాలం ఈ జబ్బుతో పోరాడం చేశానని ప్రస్తుతం దీనిని పూర్తిగా అధిగమించడానికి సరైన చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. కాగా లైమ్ వ్యాధి బొర్రెలియా బర్గ్ డార్ఫరి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇక్సోడ్స్ అనే పేను లాంటి పురుగుల (టిక్స్) ద్వారా వ్యాపిస్తుంది. అమెరికా వంటి దేశాల్లో ఎండకాలంలో బాగా వచ్చే ఈ వ్యాధి సోకడం వల్ల చర్మం ఎర్రగా మారి.. దద్దుర్లు ఏర్పడతాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. ఇక ఓ నివేదిక ప్రకారం సుమారు మూడు లక్షల మంది అమెరికన్లు లైమ్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. -
మరోసారి పెళ్లి చేసుకుంటున్న బీబర్!
హుషారెత్తించే పాటలతో పాటు, ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ తన గర్ల్‌ఫ్రెండ్, టాప్ మోడల్ హేలీ బోల్డ్విన్ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు బీబర్. ఈ సందర్భంగా పెళ్లిలో ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పాలంటూ అభిమానుల అభిప్రాయం కోరాడు. ఈ మేరకు... ‘పెళ్లి డ్రెస్ ఎంపికలో నాకు సహాయం చేయండి. ఈ ఐదింటిలో ఏ సూట్ బాగుందో చెప్పండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో బీబర్ ఇన్‌స్టా అకౌంట్‌కు ఉన్న 119 మిలియన్ల ఫాలోవర్లలో ఎక్కువ మంది ఇంధ్రధనుస్సు రంగులతో కూడిన సూట్‌కే ఓటు వేశారు. మరికొంత మంది మాత్రం బేబీ పింక్ కలర్లో ఉన్న సూటైతే మీకు అదిరిపోతుంది బాస్ అని కామెంట్లు పెడుతుండగా.. ఇంకొంత మంది.. ‘ఈ డ్రెస్సులన్నీ భలేగా ఉన్నాయి. ఈ కలెక్షన్ ఎక్కడ దొరికింది’ అంటూ ఫన్నీగా బీబర్‌కు బదులిస్తున్నారు. అయ్యో అసలు విషయం చెప్పలేదు కదూ.. బీబర్ మరోసారి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. అతడి భార్యనే. అవును కొన్ని నెలల కిందట హేలీని రహస్యంగా పెళ్లి చేసుకున్న బీబర్ ప్రస్తుతం అట్టహాసంగా వివాహ వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా గతంలో పాప్ సింగర్ సెలీనా గోమెజ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన బీబర్.. ఆమెకు పలుమార్లు బ్రేకప్ చెప్పినప్పటికీ ఆమెతో బంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో జలీనా జంట(సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్ జంటకు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు) మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమవడంతో తాము విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల అంగీకారంతో తన మరో గర్ల్‌ఫ్రెండ్ హేలీతో నిశ్చితార్థం చేసుకున్న బీబర్.. ఆమెను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ కరోలినాలోని ఓ అందమైన ప్రదేశంలో ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram Help me choose a tux for my wedding. It’s between these three A post shared by Justin Bieber (@justinbieber) on Sep 26, 2019 at 12:36pm PDT View this post on Instagram Help me choose my tuxedo for the wedding here are two more options A post shared by Justin Bieber (@justinbieber) on Sep 26, 2019 at 12:47pm PDT -
మ్యారేజ్ కోసం లైసెన్స్!
పాప్ మ్యూజిక్ రాక్‌స్టార్ పాప్‌ను ప్లే చేయకుండా పెళ్ళి బజంత్రీలు మోగించేందుకు సిద్ధం అయ్యాడట. తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ హెయిలీ బాల్డ్విన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు జస్టిన్ బీబర్. దానికోసం మ్యారేజ్ లైసెన్స్ తీసుకున్నారు ఇద్దరూ. డ్రైవింగ్ లైసెన్స్‌లా ఈ మ్యారేజ్ లైసెన్స్ ఏంటీ అనుకుంటున్నారా?.. ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ చర్చ్ లేదా ఆ దేశానికి సంబంధించిన స్టేట్ అథారిటీ ఇచ్చే సర్టిఫికేట్. జూలై నెలలో ఈ జోడీ రింగులు మార్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ యువ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని బీబర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రేమికుల సన్నిహితులు మాత్రం వచ్చే వారంలోనే పెళ్లి ఉండొచ్చంటూ హింట్స్ ఇస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. మ్యారేజ్ లైసెన్స్ కేవలం 60 రోజులే వర్తిస్తుంది కాబట్టి ఈ రెండు నెలల్లో కచ్చితంగా పెళ్ళి భాజాలు వినొచ్చన్నమాట. ∙జస్టిన్, హెయిలీ -
మాజీ ప్రియుడికి సింగర్ భావోద్వేగమైన లేఖ!
ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్.. తన కొత్త గర్ల్‌ఫ్రెండ్, మోడల్ హేలీ బోల్డ్‌విన్‌తో ఇటీవల ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల(జూలై)8న వీరి నిశ్చితార్థం జరిగినట్లుగా బీబర్, హేలీ తల్లిదండ్రులు ధ్రువీకరించారు. తాజాగా ఈ విషయంపై బీబర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్, పాప్ సింగర్ సెలీనా గోమెజ్ స్పందించారు. బీబర్, హేలీలకు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత లేఖ రాయడంతోపాటు ‘బాక్ టు యు’ అనే కొత్త ఆల్బమ్‌ను రిలీజ్ చేసింది. సుమారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన తమ ప్రేమ బంధానికి ముగింపునిస్తూ, బీబర్ కొత్త జీవితానికి నాంది పలకడంతో సెలీనా ఉద్వేగానికి లోనైందని ఆమె సన్నిహితులు తెలిపారు. కానీ తనకెంతో విశాల హృదయం ఉందని, బీబర్ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని కోరుకునే స్వభావం ఆమెదని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల బంధానికి ముగింపు.. జలీనా.. సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్ జంటకు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు ఇది. సెలీనా- బీబర్ జంట 2010లో తమ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నోసార్లు లవ్, బ్రేకప్‌లతో వార్తల్లో నిలిచిన ఈ జంట 2017 అక్టోబర్‌లో మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రకటించారు. దీంతో వీరి అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ బీబర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ హేలీ బోల్డ్‌విన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులతోపాటు సెలీనా కూడా షాక్‌కి గురయ్యారు. కాగా బీబర్, హేలీలు త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘జలీనా’ అభిమానులకు షాక్
హుషారెత్తించే పాటలతో పాటు, ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ వివాహ బంధంలో అడుగుపెట్టడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త గర్ల్‌ఫ్రెండ్ మోడల్ హేలీ బోల్డ్‌విన్‌తో బీబర్ ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ‘బీబర్ జీవితంలో మొదలుకాబోతున్న కొత్త అధ్యాయం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ బీబర్ తండ్రి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. హేలీ తండ్రి కూడా.. ‘జేబీ, హెచ్‌బీ హృదయపూర్వకంగా కోరుకున్నదే జరుగుతుంది’ అంటూ ట్వీట్ చేసి, శుభాకాంక్షలు అంటూ బీబర్ తల్లిదండ్రులను ట్యాగ్ చేయడంతో ఇరు కుటుంబాల పరస్పర అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. జస్టిన్ బీబర్ ఎంగేజ్మెంట్ విషయం తెలియగానే ‘జలీనా’ (సెలీనా గోమెజ్, జస్టిన్ బీబర్ జంటకు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు) అభిమానులు షాక్‌కు గురయ్యారు. గత కొన్నేళ్లుగా స్టార్ సింగర్ సెలీనా గోమెజ్‌తో లవ్, బ్రేకప్‌లతో వార్తల్లో నిలిచిన జస్టిన్ 2017 అక్టోబర్‌లో మళ్లీ ఆమెతో ప్రేమలో పడినట్లు ప్రకటించారు. దీంతో జలీనా అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే 2016లో హేలీతో విడిపోయిన బీబర్ ప్రస్తుతం ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం బీబర్, హేలీ జంట బహమాస్ టూర్లో ఉన్నట్లు వాళ్ల సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తే తెలుస్తోంది. -
ఒక బ్రేకప్ ప్రేమకథ!
ప్రేమంటేనే కలవడం, విడిపోవడం; కలవడం విడిపోవడం. కొన్నిసార్లు ప్రేమలో ఉన్నప్పుడే కలిసి విడిపోతుంటారు. కొన్నిసార్లు ఇంకఈ ప్రేమలేం వద్దంటూ విడిపోయి, మళ్లీ కలుస్తుంటారు. వీళ్లూ వాళ్లుఅనేం లేదు అందరూ ఇలాంటి ప్రేమల్లో చిక్కుకున్నవారే! తమ పాటలతో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్స్ జస్టిన్ బీబర్, సెలీనా గోమెజ్ కూడా ఓ మంచి ప్రేమకథ నడిపించారు. నడిపించారు అనేకంటే నడిపిస్తూనే ఉన్నారు అనాలి. కాకపోతే అది వింత ప్రేమకథ! ఒక బ్రేకప్ ప్రేమకథ!! 2010 డిసెంబర్.. అçప్పటికే తమ తమ కెరీర్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారిద్దరూ. ఏదో మ్యాజిక్ పనిచేసింది ఇద్దరి మధ్య. ఇక అంతే.. ప్రేమలో పడిపోయారు. అప్పటికి జస్టీన్ బీబర్ వయసు 16 ఏళ్లు. సెలీనా గోమెజ్‌కు 18 ఏళ్లు. లేలేత ప్రాయం. టీనేజ్ ప్రేమల్లో ఉండే ఉత్సాహం అంతా వాళ్లలో కనిపించేది. ఇక్కడా, అక్కడా అని లేదు.. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించేది. ఫంక్షన్లు, అవార్డ్ వేడుకలు, పార్టీలు, హాలీడేలు.. జస్టిన్, గోమెజ్ కలిసి ఉన్నారంటే ఫోటోలు దిగాల్సిందే, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పడాల్సిందే! ఇక ఫ్యాన్స్ హంగామా ఎలాగూ ఉండేదే! రెండేళ్లు ఇలా సూపర్ కూల్ అన్నట్టు సాగిపోయింది జస్టిన్, గోమెజ్ల ప్రేమ జీవితం. ఫ్యాన్స్ వీరిద్దరి ప్రేమకు ‘జలీనా’ అన్న పేరు కూడా పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచాయి. 2012 వచ్చింది.. ఇద్దరికీ గొడవలు. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితులు కూడా వచ్చాయి. ‘జస్టిన్ను నమ్మలేం!’ అంది సెలీనా. ‘సెలీనాతో ఉండలేం!’ అన్నాడు జస్టిన్. ఇద్దరూ విడిపోయారు. ‘జలీనా’ ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ఇద్దరూ ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. కోపమొస్తే ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్స్ డిలీట్ చేసేసుకుంటారు. ఇదో రెగ్యులర్ గేమ్‌లా సాగిపోతూనే వచ్చింది. ఎన్ని మలుపులో! 2013, 2014, 2015.. ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి. జస్టిన్ జీవితంలోకి కొత్త గర్ల్‌ఫ్రెండ్స్ వస్తున్నారు, వెళుతున్నారు. సెలీనా జీవితంలోకీ కొత్త బాయ్‌ఫ్రెండ్స్ వస్తున్నారు, వెళుతున్నారు. మధ్యలో ఎప్పుడో ఒకసారి, ఏ ఆరు నెలలకో మాత్రం కలిసి కనిపిస్తారిద్దరూ. ‘వీళ్లు మళ్లీ కలిశారు’ అని అభిమానులు సంబరపడిపోయేంతలో, ‘అబ్బే అలాంటిదేం లేదే!’ అన్నట్టు విడిపోతారు. ఎప్పుడు కలుస్తారో, ఎందుకు విడిపోతారో ఎవ్వరికీ అర్థం కాదు. సెలీనాకు తగిలేలా తన పాటల్లో లిరిక్స్ ఉండేలా చూసుకుంటాడు జస్టిన్. దానికి మళ్లీ పాటతోనే సమాధానమిస్తుంది సెలీనా. ఈ బ్రేకప్ ప్రేమకథ అలాంటి ట్విస్టులతోనే 2017వరకూ నడిచి, 2017లో క్లైమాక్స్‌కు దగ్గరైనట్టు కనిపిస్తోంది. లవర్స్‌కి గుడ్‌బై చెప్పిన జస్టిన్, సెలీనా 2017లో ఈ ఇద్దరి లవ్‌స్టోరీలో ఎన్నో మలుపులు. డ్రగ్ అడిక్ట్ అని, పిచ్చోడిలా మారిపోయాడని జస్టిన్ బీబర్‌ను అభిమానులే విమర్శించడం మొదలై అప్పటికే రెండేళ్లు. జస్టిన్ అందులోనుంచి బయటకు రావాలనుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సూపర్‌హిట్ పాటలను అందించాడు. ఆ పాటల్లో సెలీనా రిఫరెన్స్ కనిపించింది. అభిమానులు మళ్లీ వీళ్ల మధ్య ఏదో జరుగుతుందనుకున్నారు. కాకపోతే సెలీనా.. సింగర్ ది వీకెండ్‌తో కొత్తగా ప్రేమలో పడిపోయింది. దానిపై జస్టిన్ కొన్ని సెటైర్లు కూడా వేశాడు. సడెన్‌గా ఈ కథకు ఇంకో మలుపు, సెలీనా కిడ్నీ పాడవ్వడం. ఫ్రాన్సియా రైజా సెలీనాకు తన కిడ్నీ దానం చేసింది. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. సెలీనాకు ఇలా ఆపరేషన్ జరిగిందన్న విషయం జస్టిన్‌కు తెలియలేదంటారు. సెప్టెంబర్‌లో ఇది జరిగితే, అక్టోబర్ నెలాఖరుకు బాయ్‌ఫ్రెండ్ వీకెండ్‌కు బ్రేకప్ చెప్పేసింది సెలీనా. కారణాలు ఎవ్వరికీ తెలీదు. అలాగే జస్టిన్ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరూ సింగిల్. మళ్లీ ప్రేమలో.. 2017 నవంబర్ వచ్చింది. జస్టిన్ బీబర్, సెలీనా గోమెజ్ మళ్లీ దగ్గరయ్యారు. ఇది సెలీనా తల్లి మ్యాండీ టిఫీకి ఏమాత్రం నచ్చలేదు. జస్టిన్‌కు దూరంగా ఉండమని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. కానీ సెలీనా, జస్టిన్‌కు దూరం కావాలనుకోలేదు. తల్లితో గొడవ పెట్టుకొని మరీ జస్టిన్‌తో మళ్లీ ప్రేమలో పడిపోయింది. ఏడేళ్ల ప్రేమకథలో ఎన్నిసార్లు విడిపోయారో అన్నిసార్లూ కలిసిపోయారు వీళ్లిద్దరూ. ఈసారి ఇంక విడిపోయేదే లేదు అంటున్నారు. ఇద్దరూ కలిసి సిడ్నీలోని హిల్సంగ్ చర్చిలో కపుల్ థెరపీకి కూడా హాజరయ్యారు. ఇప్పుడింక ఇద్దరి మధ్య అన్నీ సర్దుకున్నాయి అంటున్నారు. మరి ఇది క్లైమాక్సే అనుకోవచ్చా? ఏమో!! స్టార్‌వార్స్ జస్ట్ ఓకే హాలీవుడ్లో ‘స్టార్‌వార్స్’కు ఉన్న క్రేజ్ మరే ఇతర సిరీస్‌కు లేదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్‌లో బాక్సాఫీస్ వద్ద ‘స్టార్ వార్స్’ సినిమాలు కొన్నేళ్లుగా సృష్టిస్తూ వచ్చిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ ఏడాది ‘స్టార్ వార్స్’ సీక్వెల్ ట్రయాలజీలో రెండో సినిమా అయిన ‘స్టార్ వార్స్ : ది లాస్ట్ జేడి’ వచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 15న విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద నిలబడడం లేదు. నిజానికి ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్స్‌లో టాప్‌లో ఈ సినిమా నిలుస్తుందనుకున్నా అంత సీన్ అయితే కనపడడంలేదు. ఇక క్రిస్మస్ వారానికి కూడా లెక్కలేనన్ని సినిమాలు వచ్చేయడంతో ‘స్టార్‌వార్స్’ కథ ఈసారికి ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ సినిమా 650 మిలియన్ డాలర్లు (4,161 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి నంబరే కానీ, ‘స్టార్‌వార్స్’ రేంజ్ కాదన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఈ ఏడాది చివర్లో వచ్చినా టాప్‌లో నిలబడుతుందనుకున్న సినిమా మొత్తానికి అంతంత మాత్రమే అనిపించుకుంది. సెలీనా గోమెజ్ -
జస్టిన్ బీబర్ కొత్త రికార్డు
న్యూయార్క్ : పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఆదివారం సరికొత్త రికార్డు నమోదు చేశారు. సంగీత ప్రియులను తన గాత్రంతో అలరించే బీబర్.. తాజాగా ట్విటర్లో 100 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నారు. ట్విటర్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బీబర్ నిలిచారు. బీబర్ కంటే ముందుగా క్యాటీ పెర్రీ ఈ అంకెను చేరుకున్నారు. వీరి తరువాత స్థానంలో టేలర్ స్విఫ్ట్ 85.5, రిహానా 76.9, లేడీగాగ 69.9 మిలియన్ పాలోవర్లతో ఉన్నారు. తన ట్విటర్ అకౌంట్‌కు 100 మిలియన్ ఫాలోవర్లు రావడంపై బీబర్ ఆనందం వ్యక్తం చేశారు. బీబర్ సాధించిన ఘనతను ట్విటర్ కూడా #100Mbeliebers emoji పేరుతో సెలబ్రేట్ చేసింది. -
సచిన్ కుమారుడు అర్జున్‌కు ఏమైంది..!
-
సచిన్ కుమారుడు అర్జున్‌కు ఏమైంది..!
ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెందూల్కర్‌కు ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం.. ముంబైలో పాప్ సంచలనం జస్టిస్ బీబర్ షోకు అర్జున్ ఊతకర్రలతో నడస్తూ రావడమే. గాయాలు వేధిస్తున్నా అర్జున్ బీబర్ ఈవెంట్‌కు హాజరవడానికి కారణం లేకపోలేదు. భారతీయులు అర్జున్ను ముద్దుగా ఇండియన్ జస్టిన్ బీబర్‌గా పిలుచుకుంటారు. అర్జున్ ఎడమకాలుకు బ్యాండేజీతో కనిపించాడు. దీంతో బీబర్‌కు ఏమైందా అని కంగారుపడ్డారు. స్టేజీపై బీబర్‌ను చూసి ఇతడు అర్జున్ అని గుర్తించాక వారి ఆందోళన మరి ఎక్కువైంది. బయటకు రాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇండియన్ బీబర్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా అర్జున్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్డేడియంలో ఏర్పాటుచేసిన బీబర్ ఈవెంట్‌కు అర్జున్ రావడంతో సచిన్ అభిమానులతో పాటు బీబర్ ఫ్యాన్స్ కూడా ఇద్దరు బీబర్స్ను ఒకేసారి చూసే అవకాశం దొరికింది. ఆపై ట్విట్టర్లో తమ కామెంట్ల వర్షం కురిపించారు. లిప్ సింక్ సరిగాకాలేదని నిరాశ చెందిన బీబర్ ఫ్యాన్స్.. అర్జున్ టెండూల్కర్ స్టేజీపై ఉన్నాడేమోనని కొందరు ట్వీట్ చేయగా.. అర్జున్ అయితే ఇంకా బాగా లిప్ సింగ్ చేసేవాడని ట్వీట్లు చేశారు. Arjun Tendulkar, #SachinTendulkar's son might just be India's craziest Belieber! He went for the concert on crutches pic.twitter.com/QygFLLyHUX — Jinnions (@jinnions) 11 May 2017 Desi Justin Bieber (Arjun Tendulkar) at Justin Bieber's #PurposeTourIndia concert. Apne pass Justin Tendulkar hai. -
బీబర్ కోసం ఒంటరిగా..!
ముంబై : పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ మేనియా ఇండియాను ఏ స్థాయిలో ఊపేస్తుందో తెలిపే మరో ఘటన ఇది. ఇక్కడి డీవై పాటిల్ స్టేడియంలో బీబర్ ప్రదర్శనను చూసేందుకు పన్నెండేళ్ల చిన్నారి విమానమెక్కి ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది. ఢిల్లీకి చెందిన అక్షితా రాజ్‌పాల్ అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. బీబర్‌కు వీరభిమాని అయిన ఆమె, బీబర్ షోను అమ్మానాన్నలతో కలిసి చూడడానికి మూడు ప్లాటినం టికెట్లను బుక్ చేసింది. కాని చివరి నిమిషంలో ఆమె తల్లిదండ్రులు రాలేకపోయారు. కానీ అక్షిత మాత్రం చక్కగా విమానంలో నవీ ముంబైకు చేరుకుంది. తన దగ్గరున్న రెండు టికెట్లను ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కు ఇచ్చేసింది. చదువులోనే కాకుండా సంగీతం, మార్షల్ ఆర్ట్స్, మోడలింగ్, నటనలో అక్షిత చురుగ్గా ఉంటుందని ఆమె మామయ్య సుమిత్ కౌశిక్ మీడియాకు తెలిపారు. అక్షిత ఇంతకుముందు బాలీవుడ్ చిత్రం ‘ఫిలౌరీ’లో చిన్న పాత్రలో నటించింది. అంతేకాకుండా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, కొడక్, బిర్లా సన్ లైఫ్స్, ఫోర్టిస్, తదితర కంపెనీల ప్రకటనల్లోనూ కనిపించింది. అక్షిత తండ్రి అజయ్ రాజ్‌పాల్ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్లో ఓ ఫ్యాషన్ రిటైల్ స్టోర్‌ను నిర్వహిస్తుండగా, తల్లి భావన ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. -
భారత్‌లో పాప్ సంచలనం ప్రదర్శనలు
ముంబై: తన పాటలతో పాప్ ప్రపంచాన్ని మైమరపించే కెనడా పాప్ సంచలనం జస్టిన్ బీబర్ తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేశాడు. మంగళవారం అర్ధారత్రి ముంబైకి వచ్చిన బీబర్‌ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఐదు రోజులపాటు భారత్‌లో గడపనున్న బీబర్.. ముంబైతోపాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్లను సందర్శించనున్నాడు. నేడు ముంబైలోని డీవై పాటిల్ స్డేడియంలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. బాహుబలి సమర్పకుడు, బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్'షోలో బీబర్ పాల్గొనున్నాడు. బుధవారం ఈ పాప్ సంచలనం కరణ్ షో కోసం షూటింగ్లో పాల్గొంటాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. కరణ్ రెగ్యూలర్‌గా బాలీవుడ్ ప్రముఖులను తన షోలో ఇంటర్వ్యూ చేసేవారు. అయితే తొలిసారిగా ఓ అంతర్జాతీయ సెలబ్రిటీని కరణ్ ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రైవేట్ విమానంలో ముంబైకి చేరుకున్న బీబర్ 120 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. అంతర్జాతీయ సెలబ్రిటీ కావడంతో షో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో బీబర్ కోసం ప్రత్యేక సూట్లను సిద్ధం చేశారు. సల్మాన్‌ఖాన్ బాడీగార్డు మూడు రోజుల పాటు బీబర్ వద్ద విధులు నిర్వహించనున్న విషయం తెలిసిందే. -
బాహుబలి సమర్పకుడి షోలో జస్టిన్ బీబర్
- పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌తో ‘కాఫీ విత్ కరణ్’ - ముంబై, ఢిల్లీల్లో బీబర్ ఫీవర్.. ముంబై: తన మెస్మరైజింగ్ పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న కెనడియన్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ భారత పర్యటనలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో బీబర్ పాల్గొంటాడని నిర్వాహకులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం ఈ షోకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. అయితే అదే రోజు(మే 10) ముంబైలోని డీవై పాటిట్ స్టేడియంలో జస్టిన్ ప్రదర్శన ఉండటంతో ఆలస్యంగానైనా టాక్ షో షూట్ చేస్తారని తెలిసింది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ’కాఫీ విత్ కరణ్’లో ఎంతో మంది బాలీవుడ్ స్టార్లను ఇంటర్వ్యూ చేసిన కరణ్.. ఆరో సీజన్లో భాగంగా తొలిసారి తన షోలో ఓ అంతర్జాతీయ సెలబ్రిటీకి ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ఐదు రోజులపాటు భారత్‌లో గడపనున్న బీబర్.. ముంబైతోపాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్లను సందర్శించనున్నాడు. బీబర్ కోసం సల్మాన్ త్యాగం.. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న సింగర్ జస్టిన్ బీబర్ తొలిసారి ఇండియాకు వస్తుండటంతో నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. ప్రవైవేట్ జెట్ విమానంలో ఇండియాకు చేరుకోనున్న బీబర్..120 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో బీబర్ కోసం ప్రత్యేక సూట్లను సిద్ధం చేశారు. పాప్ సింగర్ అభిరుచి మేరకు ఆయా గదులను లావిష్‌గా ముస్తాబు చేశారు. బీబర్ వెంట 120 కార్లతో భారీ కాన్వాయ్ వెళుతుంది. ఇకపోతే బీబర్ సెక్యూరిటీ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ త్యాగం చేయాల్సివచ్చింది. కొన్నేళ్లుగా సల్మాన్‌కు బాడీగార్డ్ గా వ్యవహరిస్తోన్న షెరా.. ఈ మూడు రోజులూ జస్టిన్ బీబర్ వద్ద విధులు నిర్వహించనున్నాడు. సల్మాన్ అంగీకారం మేరకే షెరాను బీబర్‌కు బాడీగార్డ్‌గా నియమించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తమ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాహుబలి-1, 2 హిందీ వెర్షన్లను కరణ్ జోహార్ సమర్పించిన సంగతి తెలిసిందే. -
బీబర్‌తో ఉన్న ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరో?
లాస్ ఎంజెల్స్: నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ కెరటం జస్టిన్ బీబర్ మరోసారి గాసిప్ వార్తల్లో దర్శనం ఇచ్చాడు. బ్రెజిల్లో ప్రదర్శన ఇచ్చిన అతగాడు అనంతరం కొత్తగా ఓ మిస్టరీ గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపించాడు. వారితో ఆ గర్ల్‌ఫ్రెండ్ స్నేహితురాలు కూడా కనిపించింది. ఆమె ఫొటో తీసేందుకు విలేకరులు ఎంత ప్రయత్నించినప్పటికీ అవకాశం లేకుండా పోయింది. బ్రెజిల్ రాజధాని రియోడిజనిరోలో బీబర్ తన పాప్ గీతాలతో హోరెత్తించాడు. అనంతరం అతడితో గతంలో ఎప్పుడూ చూడని ఓ అమ్మాయి భుజాలపై చేయి వేసి ఏం చక్కా హోటల్ ఫోసానోలో పార్టీకి హాజరైనట్లు హాలీవుడ్ లైఫ్ అనే వెబ్ సంస్థ తెలిపింది. ఆ యువతి ల్యూసియానా చామోన్ అయ్యుంటుందని పేర్కొంది. ఆమెకు మారినా పుమార్ అనే స్నేహితురాలు ఉందని, ఆమెను కూడా పార్టీకి ఆహ్వానించారని, హోటల్లో ముగిసిన తర్వాత తిరిగి బీబర్ ప్రైవేట్ ఇంటికి వెళ్లి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారని కూడా ఆ సంస్థ వెల్లడించింది. -
జస్టిన్ బీబర్ ముంబై షో... ఒక్కో టికెట్ రూ.76,000
కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్ పర్యటన కన్ఫామ్ అయ్యింది. మే 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ షోలో బీబర్ దాదాపు పది పాటలను ప్రదర్శించే అవకాశం ఉంది. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ షో టికెట్స్ కోసం ఫిబ్రవరి 22 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ధరతో ఈ టికెట్స్‌ను అమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయి వీవీఐపిలు ఈ షోకు హాజరవుతున్న నేపథ్యంలో వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీ టికెట్ ధర రూ.76000 వేలుగా నిర్ణయించారు. ఆ తరువాత వివిధ క్యాటగిరీల్లో రూ.4000 వేల వరకు టికెట్ ధరలను నిర్ణయించారు. ఇప్పటికే వీవీఐపిల కోసం కేటాయించిన టికెట్లు అమ్ముడవ్వగా మిగిలిన కేటగిరిల టికెట్లు కూడా మరికొద్ది గంటల్లోనే అమ్ముడవుతాయని భావిస్తున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్ ఈ షోకు హారవ్వనున్నారు. పర్పస్ వరల్డ్ టూర్ పేరుతో చేపట్టిన జస్టిన్ బీబర్ ఇండియా టూర్‌కు వైట్ ఫాక్స్ ఇండియా టీం ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. -
భారత్‌లో అడుగిడనున్న పాప్ కెరటం.. మేలోనే
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఓ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సెన్సేషన్ సింగర్, గ్రామీ అవార్డు విజేత జస్టిన్ బీబర్ భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ వేసవిలోనే అతడు ఇండియాకు వస్తున్నాడు. అధికారిక కార్యక్రమంలోనే భాగంగా ఈ ఏడాది(2017) మే 10న ముంబయికి వస్తున్నాడు. ప్రపంచ టూర్లో భాగంగా ఈ కెనడియన్ పాప్ స్టార్ భారత్‌కు వచ్చి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని వైట్ ఫాక్స్ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అతడు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, దుబాయ్, యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా ప్రదర్శన ఇవ్వనున్నాడు. ముంబయిలో నిర్వహించనున్న పాప్ మ్యూజికల్ షోకు ముందస్తుగా ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో టికెట్ ధర రూ.4000 నుంచి ప్రారంభం కానున్నట్లు వివరించారు.