ఆ మిస్టీరియస్ గర్ల్ స్పందించింది! | 'I so do not know how to deal with this': Justin Bieber's mystery Instagram girl responds after singer's plea to find out her identity | Sakshi
Sakshi News home page

ఆ మిస్టీరియస్ గర్ల్ స్పందించింది!

Published Wed, Dec 9 2015 11:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

ఆ మిస్టీరియస్ గర్ల్  స్పందించింది!

ఆ మిస్టీరియస్ గర్ల్ స్పందించింది!

యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ దృష్టిని ఆకర్షించిన ఇన్స్టాగ్రామ్ మిస్టీరియస్ గర్ల్ ఎట్టకేలకు స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా తన కోసం ఆరాతీస్తుండటం, ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపు మళ్లడంతో మనస్సును ఉద్వేగ పరుస్తున్నది అని ఆమె తెలిపింది. ఇన్స్టాగ్రామ్ లో 'వోల్ఫీసిండీ' పేరిట కనిపించిన ఆమె ఫొటో చూసి జస్టిన్ బీబర్ ఫిదా అయిపోయాడు.  చూడచక్కని సొగసైన కళ్లతో అచ్చం రష్యా మోడల్ ఇరినా ష్యెక్ లా ఉన్న ఈ అమ్మాయిని చూసి 'ఓమై గాడ్! ఎవరు ఈమె? ఎక్కడ ఉంటుంది?' అంటూ ఆయన తన అకౌంట్ లో ఆరా తీశారు. ఆమె గురించి వివరాలు ఏమైనా తెలిస్తే తనకు తెలియజేయాలని అభిమానులను కోరారు.

దీంతో అందరి కళ్లు ఈ సుందరిపైనే పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి ఆరా తీయడం మొదలైంది. దీంతో చాలామంది బీబర్ మహిళ అభిమానులు 'మేమే ఆ అమ్మాయి' అంటూ ఆయనకు నకిలీ మెసెజ్ లు పెట్టారు. దీంతో బీబర్ కొంత కలత కూడా చెందాడు. ఈ నేపథ్యంలో సిండీ కింబర్లీ పేరుతో ట్విట్టర్ లో ఓ అమ్మాయి ఉంటుందని, ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సెల్ఫీలు పెడుతుందని అభిమానులు ఆరా తీసి కనుకొన్నారు. చివరకు 'వోల్ఫీ సిండీ' పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్పందించింది.

తన ఆచూకీ గురించి అందరూ ఆరాతీయడం భావోద్వేగానికి గురిచేస్తున్నదని, దీని గురించి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని పేర్కొంది. తనకు ఇన్స్టాగ్రామ్, టంబ్లర్ లో మాత్రమే అకౌంట్లు ఉన్నాయని,  ట్విట్టర్ లో గతంలో ఉన్న అకౌంట్ ను డియాక్టివేట్ చేశావని, మిగతా సోషల్ వెబ్ సైట్లలో తన గురించి ఉన్న అకౌంట్లన్నీ నకిలీవని ఆమె స్పష్టం చేసింది. 'వోల్ఫీ సిండీ'  పేరుతో టంబ్లర్ లో ఉన్న అకౌంట్ లో ఆమె వయసు 17 ఏళ్లు అని ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఇదేపేరుతో ఉన్న అకౌంట్ కు 2.50 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement