తప్పనిపిస్తే క్షమించండి: జస్టిన్ బీబర్ | Justin Bieber apologises for nude photograph | Sakshi
Sakshi News home page

తప్పనిపిస్తే క్షమించండి: జస్టిన్ బీబర్

Jul 13 2015 2:24 PM | Updated on Sep 3 2017 5:26 AM

తప్పనిపిస్తే క్షమించండి: జస్టిన్ బీబర్

తప్పనిపిస్తే క్షమించండి: జస్టిన్ బీబర్

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన తన నగ్న ఫోటోను పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ తొలగించాడు.

లాస్ ఏంజెలెస్: సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన తన నగ్న ఫోటోను పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ తొలగించాడు. తన చర్యను ఎవరైనా అపరాధంగా భావిస్తే క్షమాపణ చెబుతున్నానని ప్రకటించాడు. 21 ఏళ్ల ఈ పాప్ సింగర్ జూలై  7న ఇన్ స్టా గ్రామ్ లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేశాడు. వీటికి 17 లక్షల లైక్స్ వచ్చాయి. అయితే ఈ ఫోటో తన ఫ్రెండ్స్ కూతురుకు చికాకు కలిగించడంతో దీన్ని తీసేశాడు.

'ఇన్ స్టాగ్రామ్ నుంచి న్యూడ్ ఫోటో తొలగించా. నాకు సన్నిహితులైన వారి కుమార్తె ఈ ఫోటో చూసి ఇబ్బంది పడింది. దీంతో నేను ఆలోచన పడ్డా. సరదా కోసమే ఇలా చేశా. నేను తప్పు చేశానని భావిస్తే అందుకు క్షమాపణ చెబుతున్నా'నని బీబర్ పేర్కొన్నాడు. కాగా, బీబర్ న్యూడ్ ఫోటో పోస్ట్ చేయడాన్ని పాప్ గాయని మిలీ సైరస్ వెక్కిరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement