nude photograph
-
నగ్న ఫొటోషూట్ కేసు: విచారణలో రణ్వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ఎంతటి వివాదం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ ఇటీవల నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్‌వీర్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు స్టేషన్లో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్ ఇటీవల ఈ కేసులో ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేసి ఈనెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ విచారణలో రణ్వీర్ అమాయకత్వాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రీసెంట్గా ముంబైలోని చెంబూరు పోలీసు స్టేషన్లో విచారణకు హాజరైన రణ్వీర్ను పోలీసులు 2 గంటలకుపైగా విచారించినట్లు సమాచారం. తన నగ్న ఫొటోషూట్‌పై వివాదం నెలకొన్నప్పటికీ రణవీర్ సింగ్ ఇంత వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. పోలీసుల ముందు కూడా అదే విధానాన్ని కొనసాగించాడట రణ్వీర్. ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదంటూ బుకాయిచ్చాడట అతడు. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ఇక పోలీసులు ఏం అడిగిన ఇదే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా పోలీసులకు నేరుగా చెప్పాలని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దంటూ రణవీర్ సింగ్ అతడి న్యాయవాదులు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ మొత్తం విచారణ సమయంలో రణవీర్ మౌనంగా ఉన్నాడని, ఫొటోలను తాను అప్లోడ్ కానీ, పబ్లిష్ చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో రణ్‌వీర్‌పై ఐపీసీ సెక్షన్ 292, 294, 509, 67(ఏ) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి పిలిపిస్తామని విచారణాధికారి వెల్లడించారు. -
చిక్కుల్లో రణ్వీర్ సింగ్.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చిక్కల్లో పడ్డారు. ఆయన న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ముంబై పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ రణ్‌వీర్‌కు సమన్లు అందజేశారు. కాగా ఇటీవలె ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మహిళల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు విచారణలో ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్‌కి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. -
మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ ఎంతటి దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రణ్వీర్ సింగ్ ఫొటోషూట్ హాట్‌టాపిక్ మారింది. ఈ విషయంలో కొందరు రణ్‌వీర్‌కు మద్దుతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల మనోభవాలు దెబ్బతీశాడంటూ రణ్‌వీర్‌పై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. చదవండి: ప్రభాస్‌పై దిశ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి హీరోని ఇంతవరకు చూడలేదు ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రణ్వీర్ సింగ్‌పై వస్తున్న విమర్శలు, ఎఫ్ఐఆర్ను ఖండించాడు. ఇందులో తప్పేముందంటూ రణ్‌వీర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘రణ్వీర్ ఫొటోషూట్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదు. అది ఓ స్టుపిడ్ కేసు. ఎలాంటి కారణం లేకుండా నమోదైన కేసు అది. మహిళల మనోభవాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ నాకో విషయం అర్థం కావడటం లేదు. ఇప్పటికే ఎన్నో మహిళల నగ్న చిత్రాలు వచ్చాయి. వాటి వల్ల పురుషుల మనోభవాలు దెబ్బతినవా? దాని సంగతేంటి? ఇదో ముర్ఖపు వాదన. చదవండి: ఇక యాక్టింగ్‌కి బ్రేక్.. అందుకే అంటున్న స్టార్ హీరోయిన్ ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయను. మన సంస్కృతిలోనే మానవ శరీరానికి గౌరవం ఉంది. మానవ శరీరం భగవంతుడి అద్భుత సృష్టి అని నేను నమ్ముతున్నాను. అందుకే దీనికి నేను మద్దతు ఇవ్వను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే రణ్‌వీర్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాలు పలువురు సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. కాగా ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్ ఇచ్చాడు. . ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇక దీనికి తన ఫ్యాన్ నుంచి ‘హాట్’ అంటూ కామెంట్స్ రాగా మరికొందరు ఈ పిచ్చి చేష్టలేంటని విమర్శిస్తున్నారు. -
తప్పనిపిస్తే క్షమించండి: జస్టిన్ బీబర్
లాస్ ఏంజెలెస్: సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన తన నగ్న ఫోటోను పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ తొలగించాడు. తన చర్యను ఎవరైనా అపరాధంగా భావిస్తే క్షమాపణ చెబుతున్నానని ప్రకటించాడు. 21 ఏళ్ల ఈ పాప్ సింగర్ జూలై 7న ఇన్ స్టా గ్రామ్ లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేశాడు. వీటికి 17 లక్షల లైక్స్ వచ్చాయి. అయితే ఈ ఫోటో తన ఫ్రెండ్స్ కూతురుకు చికాకు కలిగించడంతో దీన్ని తీసేశాడు. 'ఇన్ స్టాగ్రామ్ నుంచి న్యూడ్ ఫోటో తొలగించా. నాకు సన్నిహితులైన వారి కుమార్తె ఈ ఫోటో చూసి ఇబ్బంది పడింది. దీంతో నేను ఆలోచన పడ్డా. సరదా కోసమే ఇలా చేశా. నేను తప్పు చేశానని భావిస్తే అందుకు క్షమాపణ చెబుతున్నా'నని బీబర్ పేర్కొన్నాడు. కాగా, బీబర్ న్యూడ్ ఫోటో పోస్ట్ చేయడాన్ని పాప్ గాయని మిలీ సైరస్ వెక్కిరించింది.