
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చిక్కల్లో పడ్డారు. ఆయన న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ముంబై పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ రణ్‌వీర్‌కు సమన్లు అందజేశారు. కాగా ఇటీవలె ఓ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
దీంతో మహిళల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసు విచారణలో ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్‌కి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు అందజేశారు.