mumbai police
-
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడిని పట్టించిన హోటల్ బిల్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) నివాసంలో దూరి ఆయన్ను కత్తితో పొడిచింది 30 ఏళ్ల బంగ్లాదేశీ(Bangladesh) అని పోలీసులు ప్రకటించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ కాగా.. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు సహాయపడిన మనీ ట్రాన్సెక్షన్ వివరాలు వైరల్ అవుతున్నాయి.సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన వెంటనే ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. థానే జిల్లా ఘోడ్‌బందర్ రోడ్డులోని హీరానందానీ ఎస్టేట్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన వారు 24వ తేదీ దాకా కస్టడీకి తీసుకున్నారు. దీని వెనక అంతర్జాతీయ కుట్రను తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడటంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అయితే, బిజయ్ దాస్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది నెట్టింట వైరల్ అవుతుంది.పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేయడంతో..సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన తర్వాత బిజయ్ దాస్ తన హోటల్ వద్దకు వచ్చినట్లు మహ్మద్ అనే వ్యక్తి పోలీసులుకు చేరవేశాడని తెలుస్తోంది. అతని తీరు కాస్త అనుమానంగా ఉన్నట్లు అతను పోలీసులకు చెప్పాడట. చాలా ఆందోళనగా తన హోటల్ వద్దకు వచ్చి పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, అందుకుగాను యూపీఐ పేమెంట్ చేశాడని మహ్మద్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. యూపీఐ ద్వారా డబ్బు పంపడంతో నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయడం ఆపై అతను ఠానేలో ఉన్నట్లు తెలుసుకున్నట్లు సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడినుంచి పారిపోవాలని చూడగా.. ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ గాలింపులో దాదాపు 600 పైగానే సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది.ఐదు నెలలుగా ముంబైలో... బంగ్లాదేశ్‌లోని ఝలోకాటికి చెందిన నిందితుడు ఐదు నెలలుగా ముంబైలో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో ఉద్యోగం, చిన్నాచితకా పనులు చేస్తున్నాడు. దొంగతనం చేయడమే అతని ఉద్దేశమని ప్రాథమికంగా తేలినట్టు పోలీసులు చెప్పారు. ‘‘తాను దొంగతనానికి వెళ్తున్నది ఓ బాలీవుడ్ స్టార్ ఇంట్లోనని అతనికి తెలియదు. ఏడో అంతస్తు దాకా మెట్ల ద్వారా వెళ్లాడు. తర్వాత పైప్ ద్వారా 12వ అంతస్తుకు పాకి కిటికీ గుండా సైఫ్ ఇంటి బాత్రూంలోకి దూరాడు. అందులోంచి బయటికి రాగానే బయట కనిపించిన సిబ్బందిపై దాడి చేసి రూ.కోటి డిమాండ్ చేశాడు. అతన్ని సైఫ్ ముందు నుంచి పట్టుకున్నాడు. దాంతో సైఫ్ వీపుపై పొడిచాడు. తర్వాత నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేశారు. అతను లోనికి వెళ్లిన దారిలోనే పరారయ్యాడు. ఉదయం దాకా బాంద్రా బస్టాప్‌లో పడుకున్నాడు. లోకల్ ట్రైన్లో వర్లీకి చేరుకున్నాడు. అతని బ్యాగు నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు స్వాదీనం చేసుకున్నాం’’ అని వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరుపరిచిన సమయంలో అతని తరఫున వాదించడానికి ఇద్దరు లాయర్లు పోటీ పడటం విశేషం. -
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్
-
సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.#WATCH | Saif Ali Khan Attack case | Mumbai: DCP Zone 9 Dixit Gedam says, "There is primary evidence to anticipate that the accused is a Bangladeshi. He does not have valid Indian documents. There are some seizures that indicate that he is a Bangladeshi national...As of now, we… pic.twitter.com/aV22IhKF30— ANI (@ANI) January 19, 2025ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. -
సైఫ్‌పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్
దుర్గ్: నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెరి్మనస్(ఎలీ్టటీ)నుంచి కోల్‌కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్ కైలాశ్ కనోజియా(31)గా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్ రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు. అనుమానితుడి సెల్ ఫోన్ లొకేషన్‌తోపాటు అతడి ఫొటోను షేర్ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్‌నంద్‌గావ్ స్టేషన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్‌నంద్‌గావ్‌లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్ రైల్వే స్టేషన్లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్ బోగీలో ఉన్న ఆకాశ్‌ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్‌పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్‌పూర్ వెళ్లి ఆకాశ్ కైలాశ్‌ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. -
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్‌మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్‌ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్‌పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్‌కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్‌ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్‌ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్‌ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్‌లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్‌పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్‌లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్‌ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు. -
సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. -
సైఫ్ ఇంటికి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఇప్పటికే ఈ దాడిలో ఇద్దదు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైఫ్ ఇంటిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ (Daya Nayak) కూడా ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కాగా.. ముంబయి అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా దయా నాయక్‌కు పేరుంది.అసలు ఎవరీ దయా నాయక్..కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం. 1979లో ఆయన ఫ్యామిలీ ముంబయి షిఫ్ట్ అయింది. అక్కడే అంధేరిలోని కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో పోలీస్ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధుల్లో చేరారు.దయా నాయక్ ఉద్యోగంలో చేరేసరికి అండర్‌వరల్డ్ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్లోనూ ఆయన పేరు ఓ రేంజ్లో వినిపించింది. అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం.सैफ अली खान पर हमले पर मुंबई पुलिस अधिकारी दया नायक ने कहा...#SaifAliKhan #KareenaKapoorKhan #SaraAliKhan #IbrahimAliKhan #MumbaiPolice #mumbaiattack #DayaNayak pic.twitter.com/RVCEl7qzxJ— CNBC-AWAAZ (@CNBC_Awaaz) January 16, 2025 -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
32 ఏళ్ల మహిళతో అసభ్య ప్రవర్తన.. నటుడిపై లైంగిక వేధింపుల కేసు!
బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ శరద్‌పై 32 ఏళ్ల మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించాలంటూ తన ఆఫీస్‌కి ఆహ్వానించి.. అసభ్యకరంగా తాకాడని, లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మహిళా ఫిర్యాదుతో ముంబై పోలీసులు శరద్ కపూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. రీల్స్ గురించి చర్చించాలంటూ నవంబర్ 26న సదరు మహిళను శరద్ తన ఆఫీస్‌కి ఆహ్వానించాడు. ఆమె ఆఫీస్‌కి వెళ్లగానే అక్కడి సిబ్బంది శరద్ కపూర్ గదికి వెళ్లమని చెప్పారు. ఆమె అతని దగ్గరకు వెళ్లగానే బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడ నుంచి పారిపోయిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై శరద్ కపూర్ ఇంతవరకు స్పందించలేదు.శరద్ కపూర్ 1995 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. తన కెరీర్లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించాడు. షారుక్ ఖాన్ ‘జోష్’, హృతిక్ రోషన్ ‘లక్ష’ సినిమాలో శరద్ పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. -
ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
ముంబై: ఈ మధ్యకాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, స్కూల్స్, ఎయిర్‌పోర్టులు, మాల్స్ లక్ష్యంగా ప్రతిచోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే బెదిరింపులు వచ్చాయి. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలినింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న అంబోలీ పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో ఏం కేసులు లేవని, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. -
ముంబైలో అలర్ట్.. 53 మంది రౌడీషీటర్ల నగర బహిష్కరణ
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్సీఎఫ్ నగర్, తిలక్‌నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్నార్, మాన్‌ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్‌కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.రూ. 14.5 కోట్ల బంగారం సీజ్ నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాగపూర్‌లో శనివారం పోల్ అధికారులు రూ.14.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్థ ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని రవాణా చేస్తుండగా ఫ్లయింగ్ నిఘా బృందానికి పట్టుబడిందని ఓ అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేందుకు సీక్వెల్ లాజిస్టిక్స్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. స్వాదీనం చేసుకున్న బంగారాన్ని అంబజారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోంద’ని ఆ అధికారి పేర్కొన్నారు. -
షారుఖ్‌కి చంపేస్తామని బెదిరింపు కాల్.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్‌ని చంపేస్తానని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుడు రాయఫూర్కి చెందిన ఫైజల్ ఖాన్‌గా తేలింది. మంగళవారం ఛతీస్గడ్కి వెళ్లిన పోలీసులు..అక్కడ ఫైజల్‌ని అదుపులోకి తీసుకున్నారు.నా పేరు హిందుస్తానీడబ్బుల కోసం నిందుతుడు ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డబ్బు కావాలని ఇలాంటి బ్లాక్ మెయిల్ కాల్స్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘నవంబర్ 7న ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి ‘షారుఖ్ ఖాన్ నాకు రూ.50 ఇవ్వకపోతే చంపేస్తా అని ఓ వ్యక్తి చెప్పారు. మీ పేరు ఏంటని అడిగితే.. ‘అది అనవసరం. మీకు నా పేరే ముఖ్యమని అనిపిస్తే.. ‘హిందుస్తాని’ అని రాసుకోండి’అని చెప్పి కాల్ కట్ చేశాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.బిగ్ ట్విస్ట్షారుఖ్ని చంపేస్తామని కాల్ రావడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ గురించి ఆరా తీయగా అది ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఓ బృందం ఛత్తీస్‌గఢ్‌కి వెళ్లి నిందితుడుని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మాత్రం ఆ కాల్ చేసింది తాను కాదని చెబుతున్నాడు. \తన ఫోన్ ఎవరో దొంగిలించారని.. దీనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాయ్ పూర్ ఎస్పీ అజయ్ కుమార్ కూడా దృవీకరించారు. ‘నవంబర్ 2న ఫైజన్ ఖాన్ పోలీసు స్టేషన్‌కి వచ్చిన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. ముంబై పోలీసులకు కూడా విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్ కూడా ముంబై పోలీసులకు అందించాడు’అని రాయ్‌పూర్ ఎస్పీ మీడియాకు తెలిపారు.షారుఖ్‌కి భద్రత పెంపుషారుక్కి గతేడాదిలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుక్‌కి Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ షారుఖ్‌కి వై ప్లస్(Y+) సెక్యూరిటీనే కొనసాగుతుంది. కాగా, బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి కూడా వరుసగా ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. సల్మాన్‌ని చంపేస్తామని గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేస్తునే ఉంది. దీంతో సల్మాన్‌కి కూడా భద్రతను పెంచారు. ఇలా స్టార్ హీరోలందరికి బెదింపు కాల్స్ రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్‌తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
టార్గెట్ సల్మాన్ ఖాన్.. విస్తుపోయే విషయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. వారిని ముంబై పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నిందితుల్లో ఒకరైన అనూజ్ థాపన్ కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా సల్మాన్‌పై నిఘా పెట్టింది. ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సల్మాన్ ఎక్కడెక్కడ ఉంటాడో నిత్యం ఆయన కదలికలపై నిఘా పెట్టింది.కారుపై కాల్పులు జరిపేందుకు స్కెచ్సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సమయం నుంచి ముంబై పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. కేసులో దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమయ్యే ఏకే-47 తుపాకులను పాకిస్థాన్‌కు చెందిన ఒక గ్యాంగ్ నుంచి వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారట. వాటితో పాటు ఏకే-92, అధునాతనమైన ఆయుధాలను తెప్పించుకున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరపాలని స్కెచ్ వేశారట. ఒకవేళ ఆ అవకాశం కుదరకపోతే ఆయన ఉంటున్న ఫామ్హోస్లోకి చొచ్చుకుపోయి కాల్పులు జరపాలని బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ రచించిందట.కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాజాగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు ఆయన సోదరుడు అన్మోల్, గోల్డీబ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్‌కు చెందిన సుమారు 20 మంది పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఫామ్హోస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఆయనపై దాడి చేసే ప్లాన్స్ వారు వేశారు కూడా.. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. కృష్ణజింకలను వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. -
కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి సమాచారం అందినట్లు వెళ్లడించారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోపు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్ రీచ్ అవుతాం.' అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలుమార్లు వచ్చాయి. గతంలో ఈమెయిల్స్ ద్వారా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో గొడవేంటి..? ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్ ఢిల్లీ జైలులో ఉన్నాడు. दाउद इब्राहीम और छोटा शकील के नाम के हमने दो कुत्ते पाल रखे हैं - अनमोल विश्नोई (लॉरेंस के भाई का पोस्ट)#LawrenceBishnoi #DawoodIbrahim #SalmanKhan #AnmolBishnoi #ChotaShakeel #BJPManifesto pic.twitter.com/oj2sTHRlK8 — Nisha A (Modi's family) (@matribhumi1st) April 14, 2024 -
ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. #WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning. Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J — ANI (@ANI) April 14, 2024 -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
Bollywood Celebrities In Umang 2023: ఉమాంగ్ ముంబై పోలీస్ షోలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నా మనశ్శాంతి పోయింది పోలీసులే వెతకాలి
‘నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికి తేవాలి. స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేస్తా’ అని ఒక ముంబై మహిళ సరదాగా పెట్టిన ‘ఎక్స్’ పోస్టుకు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పారు. అది కాస్తా వైరల్ అయ్యి పోలీసులను మెచ్చుకున్నవారూ... మీ పంచ్‌లు తర్వాత... ముందు మా కేసులు చూడండి అని మొత్తుకున్నవారూ ఉన్నారు. ఈ సరదా ఉదంతం ఎట్టిదనిన... ‘పోలీస్ స్టేషన్ జా రహీ హూ... సుకున్ ఖోగయాహై మేరా’ (నా మనశ్శాంతి పోయింది... వెతికి పెట్టమని కోరేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నా) అంటూ అక్టోబర్ 31న వేదిక ఆర్య అనే మహిళ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టింది. మనశ్శాంతిగా లేను అని చెప్పడానికి ఆమె చేసిన సరదా ప్రయోగం అది. ముంబై పోలీసులు ఆమెకు సరదాగా సినిమా భాషలో సమాధానం చెప్పారు. వారు హిందీ సినిమాల పేర్లతో చెప్పినా... తెలుగు సినిమాలకు అన్వయిస్తే ఆ సమాధానం ఇలా ఉండొచ్చు... ‘మన మనసు ‘శాంతి నివాసం’లా ఉండాలని ప్రతి ఒక్కరూ ‘ఆశ ఆశ ఆశ’ పడతారు. ‘అన్వేషణ’ సాగిస్తారు. ‘ఇది (మీ ఒక్కరి) కథ కాదు’. మీ ‘గుప్పెడు మనసే’ ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా ‘కర్తవ్యం’. మీరు ఎప్పుడొచ్చినా ‘ఆవిడే శ్యామలా’ అని గుర్తించగలం’... ఇలాంటి జవాబు చూసి పోలీసు వారిలో ఇంత పంచ్ ఉందా అని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే రకరకాల జవాబులూ వచ్చాయి. ‘మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి’ అని ఒకరు, ‘షాపింగ్ చెయ్ దొరుకుతుంది’ అని ఒకరు, ‘మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది’ అని ఒకరు ‘రాధాకృష్ణ మందిరానికి పో’ అని ఒకరు వేదిక ఆర్యకు సలహాలు ఇస్తే మరి కొందరు పోలీసులకు చివాట్లేశారు. ‘మా కేసు సంగతి చూడండి ముందు’ అని ఒకరు, ‘ఫేస్బుక్లో వీడు వేధిస్తున్నాడు.. వీడి సంగతి చూడండి ముందు’ అని మరొకరు రిప్లైలు పెట్టారు. ‘ఉన్న మనశ్శాంతి లాక్కోకపోతే అదే పదివేలు’ అని ముక్తాయించారొకరు. -
ఫేక్ అరెస్ట్ వీడియో.. నటిపై క్రిమినల్ కేసు నమోదు
ఉర్ఫీ జావెద్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. విచిత్రమైన డ్రెస్సులు ధరించి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు అభిమానులను అలరిస్తుంది. ఆమెకు ఉన్న వింత ఫ్యాషన్ పిచ్చి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటుంది. కొన్నిసార్లు అయితే ఆమె షేర్ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి దారి తీస్తాయి. ఈ మధ్యే ఆమె భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ పాత్ర గెటప్‌లో ఫోటో షూట్ చేసి.. వాటిని నెట్టింట్లో పెట్టగా..ఓ వర్గం బెదిరింపులకు దిగింది. ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ.. ఉర్ఫీ మాత్రం వాటిని తొలగించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన ఓ వీడియా కారణంగా..ఆమెపై కేసు నమోదైంది. ఏం జరిగింది? తనను ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉర్ఫీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఓ కేఫ్ వద్ద ఉర్ఫీని ఇద్దరు మహిళా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉంది. నన్నుందుకు అరెస్ట్ చేస్తున్నారని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘చిన్న చిన్న దుస్తులు ధరించి ఎవరైనా తిరుగుతారా? అంటూ పోలీసులు ఫైర్ అవుతున్నారు. కాసేపు వాదనలు జరిగాక.. ఉర్ఫీ వెళ్లి పోలీసు వాహనంలో ఎక్కింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ‘చిన్న దుస్తులు ధరిస్తే అరెస్ట్ చేస్తారా’ అని నెటిజన్స్ ముంబై పోలీసులను ట్రోల్ చేశారు. ఫేక్ వీడియో.. కేసు నమోదు అయితే ఉర్ఫీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వీడియో ఫేక్‌ది. ప్రచారం కోసం ఉర్ఫీనే ఆ వీడియో రెడీ చేయించుకుంది. ముంబై పోలీసులు స్పందించేవరకు ఆ విషయం బయటకు రాలేదు. వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఉర్ఫీని అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులని విచారణలో తేలింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఐపీసీ 171, 419, 500, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు -
ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!
ముంబై మహానగరంలో ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్‌లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్) చివరి నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్‌గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్(ట్విటర్) ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. (మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు) We’ve received a 'nostalgic heist' report from @anandmahindra Sir! We can clearly see the theft, but we cannot take possession of it. Those B.E.S.T cherished memories are safely kept in your heart, and among all Mumbaikars.#DoubleDecker #MumbaiMemories #BestMemories https://t.co/32L2nmzXiQ — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) September 15, 2023 “హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు కూడా స్పందించారు. డిపార్ట్మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు మీతోపాటు ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) కాగా 1997లో86 ఏళ్ల క్రితం నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్‌లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మా గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో ఫేమస్ అయినా ఈ షో తెలుగువారికి సుపరిచితమే. అయితే ఇటీవల ఈ షో నిర్మాతలపై పలువురు నటీమణులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఈ షో నిర్మాతలు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జెన్నిఫర్ మిస్త్రీ ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాత అసిత్ మోదీతో పాటు ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (ఇది చదవండి: Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?) మద్యం తాగమని బలవంతం తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జెన్నిఫర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్మాత అసిత్ మోడీ తన చెంపలు గిల్లాడని ఆరోపించింది. తన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడని వెల్లడించింది. తనను మద్యం తాగాలని బలవంతం చేసేవాడని తెలిపింది. అతని చెప్పినట్లు చేయకపోతే.. తన వర్క్‌లో తప్పులను ఎత్తి చూపేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. ఒకరోజు మా టీమ్ సింగపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్ లేని సమయంలో అతనితో కలిసి మద్యం తాగమని బలవంతం చేశాడని తెలిపింది. ఒకసారి ఫోన్లో మాట్లాడుతూనే నిన్ను కౌగిలించుకోవాలనుందని అన్నాడని ఆమె ఆరోపించారు. 'కుటుంబాన్ని వదిలి షూట్‌కు రావాలన్నారు' తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బందులు పెట్టేవారని మిస్త్రీ స్టేట్మెంట్లో వివరించింది. రమణి, బజాజ్ ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడల్లా తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతారని జెన్నిఫర్ పోలీసులకు చెప్పింది. వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని పేర్కొంది. తన కుటుంబంతో ఉన్నప్పుడు మేకర్స్ తనను షూట్‌కు రమ్మని బలవంతం చేస్తారని.. తన తండ్రి చనిపోయినప్పుడు, తన సోదరుడు వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా సెట్లోకి రావాలని వేధించారని వెల్లడించింది. తనకు రెమ్యునరేషన్ సకాలంలో చెల్లించరని.. వేధింపులు తట్టుకోలేక ఈ ఏడాది మార్చి 6న జెన్నిఫర్ మిస్త్రీ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు)