ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్పరాజ్ అంతకుమించిన రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాడు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సెలబ్రిటీలు, అభిమానులు సినిమా డైలాగ్‌లు, కవర్ సాంగ్స్‌తో వీడియోలు రూపొందిస్తున్నారు.
చదవండి: 'శ్రీవల్లి' పాట పాడిన ట్రాఫిక్ పోలీస్.. అది కూడా మరాఠీ వెర్షన్‌లో
అందులో ముఖ్యంగా 'చూపే బంగారమాయేనా శ్రీవల్లి' సాంగ్‌పై కవర్ సాంగ్స్ చేస్తూ అనేకమంది నెటిజన్స్ అలరించారు. 'తగ్గేదే లే..' అంటూ శ్రీవల్లి సాంగ్‌లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ వేస్తూ అదరగొట్టారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ మరాఠీ భాషలో 'శ్రీవల్లి' పాటకు లిరిక్స్ రాసి స్వయంగా పాడాడు. ఇప్పుడు తాజాగా ఈ పాటను సంగీత వాయిద్యాలతో ట్యూన్ చేశారు ముంబై పోలీసులు. ఎప్పుడూ ప్రజల రక్షణ కోసం పాటుపడే పోలీసులు తమలోని మరో కళను బయటపెట్టారు. బ్యాండ్‌తో శ్రీవల్లి సాంగ్‌ను కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇవే కాకుండా సినిమాల్లోని పలు హిట్ సాంగ్స్‌ను ట్యూన్ చేస్తున్నారు ఈ పోలీసులు. అలాగే మహిళల రక్షణ కోసం పలు వీడియోలు చేసి తమ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment