'అమ్మలో ఉండే సగం అక్షరం నేనే.. నాన్నలో ఉండే సగం లక్షణం నేనే.. అమ్మతోడు.. నాన్న తోడు.. అన్ని నీకు అన్నే చూడు..' పాటలో ఉన్నట్లుగా నిజ జీవితంలోనూ ఎంతోమంది అన్నలు చెల్లెళ్లకు తోడుగా, రక్షగా నిలబడతారు. జీవితాంతం అండగా ఉంటామని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని రక్షాబంధన్‌ను జరుపుకుంటారు.
అల్లంత దూరంలో ఉన్నా సరే అన్న/ తమ్ముడికి రాఖీ కట్టాలని పరుగెత్తుకుంటూ పుట్టింటి దగ్గర వాలిపోతారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమను చాటిచెప్పే పాటలు ఎన్నో ఉన్నాయి. రేపు (ఆగస్టు 19న) రాఖీ పండగ దినాన ఇలాంటి సాంగ్స్ ఎన్నో స్టేటస్‌లో మార్మోగనున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..
అన్నయ్య అన్నావంటే.. ఎదురవనా... (అన్నవరం సినిమా)
అన్నాచెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం.. (గోరింటాకు)
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి.. మన్మధుని రాఘవుని కలబోతే బావ.. (లక్ష్మీనరసింహ సినిమా)
చామంతి..పూబంతి.. చిన్నారి నా సిరిమల్లి.. (పుట్టింటికి రా చెల్లి సినిమా)
సిరిసిరి మువ్వలూ.. ఆ విరిసిన పువ్వులూ.. చిరుచిరు ఆశలూ.. (గణేశ్ సినిమా)
అందాల పసిపాప.. అన్నయ్యకు కనుపాప.. బజ్జోరా బుజ్జాయి కథలెన్నో.. (చిట్టిచెల్లెలు మూవీ)
నా చెల్లి చంద్రమ్మ.. (ఊరుమనదిరా మూవీ)
అన్నయ్య నువ్వు పిలిస్తే.. చెల్లిగా జన్మనెత్తాను.. (బ్రో మూవీ)
చందురిని మించు అందమొలికించు ముద్దు పాపాయి.. (రక్తసంబంధం మూవీ)
Comments
Please login to add a commentAdd a comment