raksha bandhan
-
ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!.. రాఖీ వేళ నిమిషానికి..
అన్నా చెల్లల్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ 'రక్షా బంధన్' (రాఖీ). ఈ పండుగ వేళ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గణనీయమైన అమ్మకాలను నివేదించాయి. 2023లో జరిగిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి.రాఖీ పండుగ వేళ నిమిషాల వ్యవధిలో ఆల్-టైమ్ హై ఆర్డర్లను ఒక రోజులో అధిగమించామని బ్లింకిట్ సీఈఓ 'అల్బీందర్ దిండ్సా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పేర్కొన్నారు. ఇందులో చాక్లెట్స్ అమ్మకాలు కూడా చాలానే ఉన్నట్లు వెల్లడించారు. బ్లింకిట్‌లో నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రక్షా బంధన్ సమయంలో బ్లింకిట్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దీంతో అమెరికా, కెనడా, జర్మనీతో సహా ఆరు దేశాల నుంచి ఆర్డర్లను స్వీకరించినట్లు ధిండ్సా వెల్లడించారు.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కూడా రాఖీ రోజు అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ కో ఫౌండర్ 'ఫణి కిషన్' వెల్లడించారు. మేము ఏడాది పొడవునా విక్రయించే రాఖీల కంటే.. రాఖీ పండుగ రోజు ఎక్కువ విక్రయించగలిగాము. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. ముంబైలో ఒక వ్యక్తి తన సోదరికి 11000 రూపాయల విలువైన బహుమతులను కూడా ఇచ్చినట్లు.. ఇది ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అని కిషన్ వెల్లడించారు. ఈ ఆర్డర్లో హామ్లీస్, చాక్లెట్లు, పువ్వులు, కొన్ని బ్యూటీ కాస్మొటిక్స్ ఉన్నట్లు సమాచారం. -
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్‌కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
క్రికెటర్ల హ్యాపీ రక్షాబంధన్.. ఫొటోలు
-
సినిమా స్టార్స్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఉజ్జయిని మహాకాళేశ్వరునికి రక్షా బంధనం
-
అక్కలో అమ్మను చూసుకుంటా: బాలీవుడ్ నటి
అక్క నాకు మరో అమ్మలాంటిది అంటోంది బాలీవుడ్ నటి ఇషా గుప్తా. రాఖీ పండగ సందర్భంగా తన సోదరి నేహా గుప్తాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఇషా మాట్లాడుతూ.. అక్క ఎప్పుడూ సమయపాలన పాటించదు. కానీ తను చాలా మంచి వ్యక్తి. తనలో నేను మరో అమ్మను చూసుకుంటాను. అలా నాకు ఇద్దరు తల్లులు.బ్లాక్మెయిల్ చేసేదాన్నిమేము ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం. ఎప్పుడూ పోట్లాడుకోం. నేను కాస్త రౌడీయిజం చేసినా తను మాత్రం ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు తను ప్రోగ్రెస్ కార్డులు దాచిపెట్టుకుంటే నేను వాటిని తీసి అమ్మానాన్నకు చూపించేదాన్ని. లేదంటే ఎక్కడున్నాయో చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేసేదాన్ని అని పేర్కొంది.సహించలేనునేహా మాట్లాడుతూ.. నాకు మా చెల్లి అంటే ఎంత ఇష్టమంటే.. తను నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అస్సలు సహించలేను. తన ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నా సరే నా కాల్ లిఫ్ట్ చేయాలంతే! తన గురించి ప్రతీది నాకు తెలియాలనుకుంటాను. ప్రతి ఏడాది ఒకరికి ఒకరం రాఖీ కట్టుకుంటాం. పెద్దదాన్ని కాబట్టి గిఫ్టులు మాత్రం నేనే ఇస్తుంటాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. -
ప్రేమకు ప్రతిరూపం రక్షాబంధన్.. విశిష్టత ఇదే
-
Raksha bandhan 2024 : ప్రముఖుల రక్షాబంధన్ వేడుక (ఫొటోలు)
-
Madhya Pradesh: ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’
ఉజ్జయిని: ‘నేను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు. నా ప్రియతమ సోదరీమణులకు ప్రధాన సేవకుడిని’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు. వెంటనే అక్కడున్న ఆడపడుచులంతా ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’ అంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నేడు (సోమవారం) రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబమంతటి శ్రేయస్సును ఇంటి ఆడపడుచులు కోరుకుంటారని, వారు సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో సోదరీమణులను ఎప్పటి నుంచో దేవతలుగా పూజిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా పలు పండుగలు నిలుస్తున్నాయని అన్నారు. రాఖీ సందర్భంగా సీఎంకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. సీఎం రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. -
రాఖీ వేళ.. కవితపై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, సాక్షి: రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు.. తన సోదరి కవితను ఉద్దేశించి భావోద్వేగ సందేశం ఎక్స్ ఖాతాలో ఉంచారు. ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి. అయినప్పటికీ.. ఎలాంటి కష్టంలో అయినా నీ వెంట ఉంటా అంటూ ట్వీట్ చేశారాయన. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్నారు. You may not be able to tie Rakhi today But will be with you through thick and thin ❤️#Rakhi 2024 pic.twitter.com/mQpfDeqbkc— KTR (@KTRBRS) August 19, 2024 -
మహాకాళేశ్వరునికి రక్షాబంధనం... అలరిస్తున్న వీడియో
దేశవ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.నేటి(సోమవారం) తెల్లవారుజామున 2.30 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించడంతోపాటు అందంగా అలంకరించిన రాఖీని కట్టారు. 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించారు. ఈ లడ్డూలను ఈరోజు భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఆలయ పురోహితులు పండిట్ ఆశిష్ పూజారి, పండిట్ వికాస్ పూజారి భస్మ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. #WATCH उज्जैन (मध्य प्रदेश): सावन माह के 5वें सोमवार के अवसर पर श्री महाकालेश्वर मंदिर में भक्तों की भीड़ उमड़ी। pic.twitter.com/SSjHKAk6eR— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 -
రాఖీ కడితే ఊరు వదలాల్సివస్తుందట!
దేశ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలోని ప్రజలు రాఖీ పండుగ చేసుకోరు. దీని వెనుక వారు ఒక కారణాన్ని చూపుతుంటారు. రాఖీ చేసుకుంటే అన్నదమ్ములు ఊరు వదలాల్సి వస్తుందని వారు చెబుతుంటారు.యూపీలోని సంభాల్ జిల్లా బేనిపూర్ చక్ గ్రామంలో మచ్చుకైనా రాఖీ వేడుకలు కనిపించవు. రక్షాబంధన్ పేరు వినగానే ఇక్కడి ప్రజలు హడలిపోతుంటారు. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, సర్వం కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి అన్నదమ్ములు భయపడుతుంటారు.గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు యాదవులు, ఠాకూర్ల ఆధిపత్యం ఉండేదట. నాడు ఇక్కడి జమిందారు ఠాకూర్ కుటుంబానికి చెందినవాడు. అయితే అతనికి మగ సంతానమే లేదట. దీంతో ఒకసారి రాఖీ పండుగనాడు యాదవుల ఇంటి ఆడపిల్ల ఆ ఠాకూర్‌కు రాఖీ కట్టి, అతని జమిందారీని కానుకగా అడిగిందట.ఈ నేపధ్యంలో నాడు యాదవులకు, ఠాకూర్లకు వివాదం జరిగిందని చెబుతారు. చివరికి ఆ ఠాకూర్ తన జమిందారీని యాదవులకు అప్పగించి, ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. నాటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ రాఖీ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అది ఈ నాటికీ గ్రామంలో కొనసాగుతోంది. -
రక్షాబంధన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
నేడు (ఆగస్టు 19) దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం విశిష్టమైనదని, దీనికి ప్రతీకగా రాఖీ జరుపుకుంటారని అన్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి రక్షాబంధన్ ఒక ప్రతీక అని, ఈ పండుగను మతపరమైన సరిహద్దులను దాటి జరుపుకోవడం విశేషమన్నారు.మహిళలకు గౌరవం అందించడంతోపాటు, వారి హక్కులను పరిరక్షించాలనే సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహదపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు (సోమవారం) అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఇదేవిధంగా ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ కూడా అదనంగా బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. President Droupadi Murmu extends Raksha Bandhan greetingsRead @ANI Story | https://t.co/NeXkXdRoLO#PresidentMurmu #RakshaBandhan #DroupadiMurmu pic.twitter.com/OFYFbD2UXm— ANI Digital (@ani_digital) August 18, 2024 -
Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ సంప్రదాయ బద్ధంగా ఆనాడు ఏం చేయాలో... రాఖీ కట్టడంలోని అంతరార్థం ఏమిటో తెలిసినవారు అరుదనే చె΄్పాలి.పూర్ణిమనాడు శ్రవణానక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసమని పేరు. శ్రావణమాసంలో రాత్రివేళ పూర్ణిమ తిథి ఉన్న రోజును రక్షికా పూర్ణిమ అన్నారు పెద్దలు. రక్షించగలిగిన పూర్ణిమ, రక్షణ కోరుకునే వారికోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ అని అర్థం. ఈ పండుగ కాస్తా కాలక్రమంలో రాఖీపూర్ణిమగా పేరు మార్చుకుంది.శ్రావణ పూర్ణిమనాడు ఉదయమే స్నానం చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి కడుతూ– ‘ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. అయితే ఇది ఇప్పటి ఆచారం కాదు... ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే!రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక అంతటితో వదిలేయకూడదు. ఆ బంధానికి కట్టుబడి ఒకరికి ఒకరు అన్నింటా అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. అంతేకాదు.. దేశ రక్షణలో పాల్గొనే సరిహద్దు భద్రతాదళాలకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి విజయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమిరోజు రక్షాబంధనం కడుతుండటం శుభపరిణామం.స్థితి కారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమనాడే నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేనూ రక్షించేవాడిగానే ఉండాలని అర్థం చేసుకోవడానికే శ్రావణపూర్ణిమని ఈ పండుగ రోజుగా నిర్ణయించారని గమనించాలి. అంతేకాదు, అపరాహ్ణ సమయంలో రక్షికని కడుతున్న నా రక్షికాబంధానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యుడని తెల్పడానికే. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలఃతేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమై΄ోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. ఈ పండుగలోని హంగులు, ఆర్భాటాల మాట ఎలా ఉన్నా, తమకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతూ... తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయÆ . ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో çమాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. – డి.వి.ఆర్. -
రాఖీ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు!
అన్నా చెల్లి, అక్కా తమ్ముళ్లు ఎంతో ప్రేమగా సెలబ్రేట్ చేసుకునే పండుగ రాఖీ. ప్రతి ఏడాది ఆగస్టులో వచ్చే ఈ పండగ నాడు సోదరీ సోదరమణులు తమ తోడబుట్టిన వాళ్లని కలుసుకుని రాఖీ కట్టుకుని రోజంతా హాయిగా ఉంటారు. ఇలాంటి టైంలో అక్కడికో ఇక్కడికో వెళ్లే బదులు ఇంట్లోనే కూర్చుని ఓ మంచి సినిమా చూసుకోవచ్చు. అలా అన్నచెల్లి అనే బంధాన్ని గుర్తుచేసేలా తెలుగులో బోలెడన్ని సినిమాలు వాటిలో 15 సినిమాలు మాత్రం స్పెషల్.(ఇదీ చదవండి: రాఖీ స్పెషల్: ఈ పాటలు స్టేటస్ పెట్టుకోండి..)ఈ రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా తెలుగులోనే రాఖీ, హిట్లర్, గోరింటాకు.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా యూట్యూబ్‌లోనే అందుబాటులో ఉండటం విశేషం. ఇంతకీ ఆ సినిమాలేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం.చిరంజీవి 'హిట్లర్'అర్జున్ 'పుట్టింటికి రా చెల్లి'బాలకృష్ణ 'ముద్దుల మావయ్య'మహేశ్ బాబు 'అర్జున్'జూ.ఎన్టీఆర్ 'రాఖీ'పవన్ కల్యాణ్ 'అన్నవరం'రాజశేఖర్ 'గోరింటాకు'ఎన్టీఆర్ 'రక్త సంబంధం'శోభన్ బాబు 'జీవన రాగం''చెల్లెలి కాపురం'వెంకటేశ్ 'గణేష్'అక్కినేని నాగేశ్వరరావు 'బంగారు గాజులు'జగపతిబాబు 'శివరామరాజు'కృష్ణ 'సంప్రదాయం'కృష్ణం రాజు 'పల్నాటి పౌరుషం'(ఇదీ చదవండి: ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి) -
ఈసారి రాఖీ వ్యాపారం రూ. 12,000 కోట్లు!
ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ సుమారు రూ. 12,000 కోట్ల వ్యాపారాన్ని ఆర్జించే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. చైనాలో తయారైన రాఖీలతో పోలిస్తే దేశీయ రాఖీలకు డిమాండ్ గణనీయంగా పెరగడం వ్యాపార వృద్ధికి ముఖ్యమైన కారణం.రాఖీలకు పెరిగిన డిమాండ్‌తో గతేడాది జరిగిన రూ.10,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఈసారి పండుగ వ్యాపారం రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. అంటే గతేడాది కంటే 20 శాతం పెరుగుతుందన్న మాట. రాఖీల వ్యాపారం 2022లో రూ.7,000 కోట్లు కాగా, 2021లో రూ.6,000 కోట్లు, 2020లో రూ.5,000 కోట్లు, 2019లో రూ.3,500 కోట్లు, 2018లో రూ.3,000 కోట్లు.ఇప్పుడు దేశంలోని నగరాల్లో వివిధ కళారూపాలను సూచించే స్థానికంగా తయారు చేసిన రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాగ్‌పూర్‌లో తయారైన ఖాదీ రాఖీలు , జైపూర్‌కు చెందిన సంగనేరి ఆర్ట్ రాఖీ, పుణె నుంచి విత్తన రాఖీ, మధ్యప్రదేశ్‌లోని సత్నా నుంచి ఉన్ని రాఖీ, గిరిజన వస్తువులతో చేసిన వెదురు రాఖీ, అస్సాంలో తయారు చేసిన టీ ఆకు రాఖీలు వంటివి వీటిలో ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో దేశీయ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని సీఏఐటీ అంచనా వేసింది. -
రాఖీ స్పెషల్: ఈ పాటలు స్టేటస్ పెట్టుకోండి..
'అమ్మలో ఉండే సగం అక్షరం నేనే.. నాన్నలో ఉండే సగం లక్షణం నేనే.. అమ్మతోడు.. నాన్న తోడు.. అన్ని నీకు అన్నే చూడు..' పాటలో ఉన్నట్లుగా నిజ జీవితంలోనూ ఎంతోమంది అన్నలు చెల్లెళ్లకు తోడుగా, రక్షగా నిలబడతారు. జీవితాంతం అండగా ఉంటామని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని రక్షాబంధన్‌ను జరుపుకుంటారు.అల్లంత దూరంలో ఉన్నా సరే అన్న/ తమ్ముడికి రాఖీ కట్టాలని పరుగెత్తుకుంటూ పుట్టింటి దగ్గర వాలిపోతారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమను చాటిచెప్పే పాటలు ఎన్నో ఉన్నాయి. రేపు (ఆగస్టు 19న) రాఖీ పండగ దినాన ఇలాంటి సాంగ్స్ ఎన్నో స్టేటస్‌లో మార్మోగనున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..అన్నయ్య అన్నావంటే.. ఎదురవనా... (అన్నవరం సినిమా) అన్నాచెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం.. (గోరింటాకు) మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి.. మన్మధుని రాఘవుని కలబోతే బావ.. (లక్ష్మీనరసింహ సినిమా)చామంతి..పూబంతి.. చిన్నారి నా సిరిమల్లి.. (పుట్టింటికి రా చెల్లి సినిమా) సిరిసిరి మువ్వలూ.. ఆ విరిసిన పువ్వులూ.. చిరుచిరు ఆశలూ.. (గణేశ్ సినిమా)అందాల పసిపాప.. అన్నయ్యకు కనుపాప.. బజ్జోరా బుజ్జాయి కథలెన్నో.. (చిట్టిచెల్లెలు మూవీ)నా చెల్లి చంద్రమ్మ.. (ఊరుమనదిరా మూవీ) అన్నయ్య నువ్వు పిలిస్తే.. చెల్లిగా జన్మనెత్తాను.. (బ్రో మూవీ) చందురిని మించు అందమొలికించు ముద్దు పాపాయి.. (రక్తసంబంధం మూవీ) -
ఆ గ్రామంలో రెండు రోజుల పాటు రక్షాబంధన్
దేశంలో రక్షాబంధన్ సందడి నెలకొంది. వాడవాడలా రాఖీ దుకాణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రక్షాబంధన్‌ను ఒకరోజు జరుపుకుంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం రెండు రోజుల పాటు రక్షాబంధన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలోని బహెరాడీ గ్రామంలో రక్షాబంధన్‌ను ప్రతీయేటా రెండురోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడి రైతులు, మహిళలు విద్యార్థులు రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్లకు, మొక్కలకు రాఖీలు కడతారు. ప్రకృతిని కాపాడాలని ప్రజలకు సందేశం ఇస్తుంటారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఆ మర్నాడు రక్షాబంధన్ రోజున గ్రామంలోని మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి, ఆనందంగా నృత్యాలు చేస్తారు.స్థానికుడు దీనదయాళ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెర్బల్ రాఖీలను తయారుచేస్తారని, వాటిని వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు ఇక్కడి మహిళా సంఘం సభ్యులు రాఖీలను పంపిస్తుంటారన్నారు. -
బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని
బహుమతులు ఆనందాన్నిస్తాయి... అయితే వస్తువుల రూపంలో కన్నా మాటల రూపంలో ప్రేమను వ్యక్తపరిస్తే ఆ ఫీలింగ్ హృదయంలో నిలిచిపోతుంది. అన్నయ్య గౌతమ్ నుంచి అలాంటి ప్రేమనే ఎక్కువగా కోరుకుంటున్నానని చిన్నారి సితార అంటోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రతల కుమార్తెగా పన్నెండేళ్ల సితార పాపులర్. ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా తనకంటూ పాపులార్టీ తెచ్చుకుంది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా ‘సాక్షి’కి సితార చెప్పిన ప్రత్యేకమైన ముచ్చట్లు...రాఖీ పండగను ఇంట్లో చిన్న పూజతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టి, ఇద్దరం బహుమతులు ఇచ్చి, పుచ్చుకుంటాం. నాకు ఎనిమిది.. తొమ్మిదేళ్లప్పుడు అనుకుంటా... రాఖీకి అసలైన అర్థం తెలిసింది. చేతికి రాఖీ కట్టడం అనేది ఓ ఆచారం కాబట్టి పాటించాలి. అంతవరకే నాకు తెలుసు. అయితే సోదరుడి అనుబంధం, రక్షణ ఎంతో అవసరమని, అది సూచించే విధంగా కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యం ఉందని ఈ పండగ అసలు విషయం అర్థమైంది. ఆచారం అర్థం అయ్యాక ఈ ఫెస్టివల్‌కి ప్రాధాన్యం ఇస్తున్నాను.రాఖీ కొనడానికి చాలా టైమ్ తీసుకుంటాఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పై చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఇప్పటిరకూ ఒక విధంగా ఉండేది.. ఇప్పుడు తనకు దూరంగా ఉండటం అనే మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాఖీ కొనడం అనేది పెద్ద పనే. ఎందుకంటే ఒక పట్టాన సెలక్ట్ చేయలేను. చాలా టైమ్ పడుతుంది. మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉన్న రాఖీ కొంటుంటాను.అమ్మ గైడెన్స్‌తో పండగ చేసుకుంటాంఈ పండగ అనే కాదు ప్రతి పండగకీ మా అమ్మ గైడెన్స్ ఉంటుంది. అయితే అన్నయ్యకి హారతి ఇవ్వడం, స్వీటు తినిపించడం... ఇలా నేను మాత్రమే చేయాల్సినవే ఉంటాయి కాబట్టి రాఖీ పండగ అప్పుడు ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. అమ్మకు సంప్రదాయాలు పాటించడం చాలా ఇష్టం. మేం కూడా పాటించాలని కోరుకుంటారు. అలాఅని ఒత్తిడి చేయరు. మా స్వేచ్ఛ మాకు ఉంటుంది.నా ప్రేమను మెసేజ్ రూపంలో చెబుతాఒకవేళ వచ్చే ఏడాది మా అన్నయ్య రాఖీ పండగ సమయంలో విదేశాల్లో ఉంటే వీడియో కాల్ చేస్తాను. దాంతో పాటు తన మీద నాకు ఉన్న ప్రేమను ఒక మంచి మెసేజ్ రూపంలో చెబుతాను. ఆ మెసేజ్ హృదయపూర్వకంగా తను నాకెంత ముఖ్యమో చెప్పేలా ఉంటుంది. దూరం అనేది విషయం కాదు అని చెప్పేలా ఉంటుంది.నన్ను సర్ప్రైజ్ చేస్తే ఇష్టంఅన్నయ్య నాకు ఫలానా గిఫ్ట్ ఇవ్వాలని అనుకోను. కానీ నన్ను సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టం. తను నా గురించి ఆలోచిస్తున్నాడని సూచించే ఏ గిఫ్ట్ అయినా నాకు ఓకే. పుస్తకం అయినా, ఏదైనా జ్యువెలరీ అయినా లేక తన చేతితో రాసిన లెటర్ అయినా సరే... తను నా గురించి ఆలోచిస్తున్నాడనే ఆ ఫీల్ నాకు ముఖ్యం.నా బ్రదర్ నా ఆత్మవిశ్వాసంబ్రదర్ ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాంటి వాడు... రక్షణగా నిలబడేవాడు. ఏ విషయంలోనైనా నా బ్రదర్ మీద ఆధారపడిపోవచ్చు అనే భరోసా నాకు ఉంది. తను నా ఆత్మవిశ్వాసం... మా బాండింగ్‌ని నేను చాలా గాఢంగా ఇష్టపడతాను. ఒక బ్రదర్ ఉండటం అనేది ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి పక్కనే ఉండటంలాంటిది. – డి.జి. భవాని -
Raksha Bandhan 2024: ఎక్కడ చూసినా మోదీ రాఖీలే..
అనుబంధాలను పంచుకునే పండుగ రక్షా బంధన్. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగ. రాఖీ నాడు సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, ఆశీర్వాదం పొందుతారు. ఈసారి రక్షాబంధన్ ఆగస్టు 19న వచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విక్రయాల కోసం రాఖీలను అందుబాటులో ఉంచారు. ఈసారి పిల్లల కోసం వెరైటీ రాఖీలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చిన్నారులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే ఛోటా భీమ్, హల్క్, డోరేమాన్, సూపర్మాన్, షించెన్, మోటు-పత్లు లాంటి అనేక కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన దుకాణదారు భాస్కర్ సాహ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున మార్కెట్లోకి వివిధ రకాల రాఖీలను తీసుకువస్తుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీకి అమితమైన డిమాండ్ ఏర్పడిందని, ఎక్కడ చూసినా ఇటువంటి రాఖీలు కనిపిస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో రూ.10 నుంచి రూ.50 వరకు ఖరీదు కలిగిన రాఖీలు విరివిగా విక్రయమవుతున్నాయన్నారు. -
ఆవు పేడతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు
ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన పూజా మెహతా రూపొందిస్తున్న రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినులు కలిపి ఆమె అందమైన రాఖీలను తయారు చేస్తోంది. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ రాఖీలను రూపొందిస్తున్న పూజా వీటిని విక్రయిస్తూ, స్వయం ఉపాధి కూడా పొందుతోంది. తన మాదిరిగానే ఎవరైనా సరే ఇటువంటి రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని ఆమె చెబుతోంది. తాను రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని పూజ తెలిపింది.బస్‌గావ్ గ్రామ నివాసి పూజా మీడియాతో మాట్లాడుతూ తాను తయారు చేస్తున్న రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికి పంపిస్తానని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్టు వస్తున్నాయని పూజా పేర్కొన్నారు. తాను ఈ రాఖీలను రూ. 40కు విక్రయిస్తున్నానని తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ రాఖీలను విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తానని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని తెలిపారు. -
అక్క రాఖీకి వస్తానంది: శ్రేయ సోదరుడు
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ కావాలనే కలతో ఆ కోచింగ్ సెంటర్లో చేరిన శ్రేయ యాదవ్ కూడా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.టీవీలో వస్తున్న వార్తలు చూశాకనే తమ శ్రేయ ఈ లోకంలో ఇక లేదని తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన శ్రేయ సోదరుడు.. అక్క రాబోయే రక్షాబంధన్‌కు వస్తానని హామీ ఇచ్చిందని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు. ఇంటిలోని పెద్ద సంతానం మృతి చెందడంలో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.ఘజియాబాద్‌లో ఉంటున్న శ్రేయ మామ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన వార్త టీవీలో చూడగానే శ్రేయకు ఫోన్ చేశాను. ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చివరికి కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లగా, అక్కడి సిబ్బంది శ్రేయ మృతిచెందిందని చెప్పారుగానీ, ఆమె ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఇది పోలీసు కేసు అని చెప్పారని ధర్మేంద్ర తెలిపారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణంలో..
గోపాలపట్నం : రక్షాబంధన్ మా బంధాన్ని తెంచే స్తుందని ఊహించ లేదు. రాఖీ కట్టేందు కు రాకపోయి ఉంటే నా అన్న బతికేవాడు అని ఆ చెల్లెలు ఆవేదన అందర్నీ కలచివేసింది. గురువారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎన్ఏడీ ఫ్లై వోవర్‌పై ట్రాలర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన కొంచాడ గోవిందరావు (27) (అలియాస్ గోపి) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అగనంపూడిలో నివాసముంటున్న చెల్లి పద్మ ఇంటికి సాయంత్రం ద్విచక్రవాహనంపై గోవిందరావు వెళ్లాడు. రాఖీ కట్టి, చెల్లిని ఆశీర్వదించి తిరుగుపయనమయ్యాడు. ఎన్ఏడీ ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి స్టీల్‌ప్లాంట్ నుంచి ఇరన్ లోడుతో వెళుతున్న ట్రాలర్ లారీ మురళీ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. వెనుక చక్రాల కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు నెలల క్రితమే విశాఖకు.. : నిమ్మాడ నుంచి రెండు నెలల క్రితమే మురళీ విశాఖ వచ్చాడు. నగరంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా చేరాడు. మురళీనగర్‌లో తన స్నేహితుడు ఇంట్లో ఉంటున్నాడు. మృతునికి తల్లి, తండ్రి, సోదరి ఉన్నారు. తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు సీఐ బీఎండీ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
విషాదాల్లోనూ వీడని రాఖీ బంధం
తిమ్మాపూర్, ముస్తాబాద్(సిరిసిల్ల), నర్సాపూర్ రూరల్: సోదరీ సోదరుల ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ రోజున గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు, ప్రమాదాల్లో ముగ్గురు సోదరులు దుర్మరణం పాలయ్యారు. రాఖీ కడదామని ఆనందంగా పుట్టింటికి వచ్చిన చెల్లెళ్లకు అన్నల మృతి తీరని శోకాన్ని మిగల్చగా.. అంతటి విషాదంలోనూ చివరిగా మృతదేహాలకు రాఖీ కట్టి సోదరులపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. రాఖీ కట్టేందుకు తన ఇద్దరు చెల్లెళ్లు వస్తున్నారని తెలిసి పొలం నుంచి స్కూటీపై ఇంటికి బయలుదేరిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన పోచమల్లు యాదవ్ (43)ను రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మరణవార్త విని చెల్లెళ్లు బోరున విలపిస్తూ ఇంటికి వచ్చి శవానికి చివరిసారిగా రాఖీ కట్టారు. చివరిసారి రాఖీ కడుతున్నా.. లేరా తమ్మీ.. ‘లేరా తమ్మీ.. రాఖీ కట్టేందుకు వచ్చిన.. ఒక్కసారి చూడురా.. ఇది నీకు కట్టే చివరి రాఖీరా తమ్మీ..’అంటూ తమ్ముడి మృతదేహంపై పడి సోదరి గుండెలవిసేలా రోదించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కౌలురైతు అనమేని నర్సింలు(37) బుధవారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం తరువాత బావిలో పడ్డట్లు గుర్తించి మృతదేహాన్ని బయటికి తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలో ఉండే సోదరి రాజవ్వకు ఈ విషయం తెలియక తన తమ్ముడు నర్సింలుకు రాఖీ కట్టేందుకు గురువారం ఉదయమే ముస్తాబాద్‌కు వచ్చింది. నర్సింలు బావిలో గల్లంతయ్యాడని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. రాఖీ కడదామని వచ్చి అంత్యక్రియల్లో.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచ గ్రామానికి చెందిన కొండి జగన్(45)కు నర్సమ్మ, అంబిక ఇద్దరు చెల్లెళ్లు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరూ పుట్టింటికి వచ్చారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ గురువారమే మృతి చెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాఖీ కడదామని వస్తే అన్న అంత్యక్రియలు చే -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్‌తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్‌కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
రాఖీ కట్టేందుకే విక్రమ్‌ని పంపించాం! ఏం గిప్ట్ ఇస్తున్నావ్ మామా!
చందమామ రావే... జాబిల్లి రావే... అని పాలబువ్వ తిన్నన్ని రోజులూ పాడుతూనే ఉన్నాం. నీ పాట పాడుతూ, నువ్వు వస్తావని నమ్ముతూనే పెరిగాం. పెద్దయిన తర్వాత రావోయి చందమామా అని పిలిచాం. వస్తాడు నా రాజు ఈ రోజు అని దొంగచూపులు, బెంగచూపులు చూశాం. నెలవంక కోసం ఆకాశంలో వెతికాం. పున్నమి రోజు నీ వెన్నెల కోసం ఎదురుచూస్తుంటాం. మా చిన్నప్పుడు మా అమ్మ ‘నిన్ను అంతగా పిలిచింది’ ఎన్ని తరాలు పిలిచినా, ఎన్ని తరాల అమ్మలు పిలిచినా నువ్వు రాలేదు. అందుకే మేమే నీ దగ్గరకు వచ్చేశాం. అమ్మలందరికీ అమ్మ మా భూమాత. భూమి తల్లి తన ప్రతినిధిగా నీ దగ్గరకు విక్రమ్‌ని పంపించింది చూశావు కదా! అమ్మకు తమ్ముడంటే చాలా ఇష్టం మామా! రక్షాబంధన్ పండుగకు నీకు రాఖీ కట్టడానికే విక్రమ్‌ని పంపించింది చూడు! మరి!!! రక్షాబంధన్ కట్టించుకున్న నువ్వు... అమ్మకు బహుమతి ఏమిస్తున్నావ్ చందమామా! ఈ రోజు శ్రావణమాసం, పున్నమి రోజు. రక్షాబంధన్ వేడుక చేసుకుంటున్నాం. ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కచెల్లెళ్లు భగవంతుడికి పూజ చేసి, తీపి వంటకాలను నివేదన చేస్తారు. పూజలో ఉంచిన రక్షాబంధనాన్ని అన్నదమ్ముల ముంజేతికి కట్టి ‘ఇది నీకు రక్ష, నువ్వు నాకు రక్ష’ అని మమతలు పూయిస్తారు. పురాణకాలంలో యమున తన సోదరుడు యముడికి రాఖీ కట్టింది. శ్రీకృష్ణుడికి వరుసకు చెల్లెలైన ద్రౌపది రాఖీ కట్టింది. చరిత్రకాలంలో రాణి కర్ణావతి చక్రవర్తి హుమయూన్‌కి రాఖీ పంపింది. ఈ కథనాలను చదువుకున్నాం. రాఖీ మీద వచ్చిన సినిమాలను చూశాం. సినిమాలో హీరోకి అక్క పాత్ర కట్టినంత అందమైన రాఖీని చూసినప్పుడు ఈ సారి రక్షాబంధన్‌కి తన తమ్ముడికి కూడా అలాంటి అందమైన రాఖీనే కట్టాలని ప్రతి అక్కా ఉవ్విళ్లూరుతుంది. అలా వచ్చినవే రకరకాల రాఖీలు. ముత్యాలను పోలిన తెల్లటి పూసలతో అల్లిన రాఖీలు, కెంపుల వంటి రాళ్లు పొదిగిన రాఖీలు, తెల్లటి రాళ్లు, పచ్చటి చమ్కీలతో మెరిసే రాఖీలు, రంగురంగు పూసల రాఖీలు, మువ్వల రాఖీలు రూపుదిద్దుకున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా మట్టి రాఖీలు మణికట్టును ఆకట్టుకున్నాయి. బంగారు, వెండి రాఖీలు రాజ్యమేలాయి. ఈ ఏడాది మాత్రం రాఖీల్లో చందమామ హీరో అయ్యాడు. రాఖీల మీద రాకింగ్ చేస్తున్నాడు. ఇక మేమైతే ఈ ఏడాది నీ రాఖీలతో పండుగ చేసుకుంటున్నాం. అమ్మాయిల చెవులు పట్టుకుని ఉయ్యాలలూగిన చాంద్‌బాలీలు ఇప్పుడు అబ్బాయిల మణికట్టు మీద మకుటాయమానంగా మెరుస్తున్నాయి. అర్ధవలయాకారంలో నువ్వు ముంజేతి మీద ఉంటే ప్రతి అబ్బాయీ ‘మా అక్క కట్టింది చూడు’ అని ప్రియురాలికి చూపించుకుంటూ తామే చందమామ అయినట్లు మురిసిపోతున్నారు... మెరిసిపోతున్నారు నీ మేనల్లుళ్లు. (చదవండి: తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!) -
రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు
క్రైమ్: ‘‘ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. ఒక సోదరుడు తన సోదరిని తన చివరి శ్వాస వరకు కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేసే పర్వదినం ఇది. అలాంటి పండుగనాడు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి రావడం దిగ్భ్రాంతికరం. కానీ, ఈ కేసులో నిందితుడు దుర్మార్గుడు. అందుకే ఇలాంటి శిక్ష విధిస్తున్నా’’ అంటూ జస్టిస్ ఎస్ సాహూ వ్యాఖ్యలు చేశారు. ఒడిశా హైకోర్టు బుధవారం సంచలన కేసులో.. అంతే సంచలన తీర్పు వెల్లడించింది. తన చెల్లిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డ మృగానికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సరైందేనని తెలిపింది. ట్రయల్ కోర్టు విధించిన ఈ శిక్షను సమర్థిస్తూనే.. మరో రెండేళ్ల పాటు శిక్షను పొడిగిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి సాహూ. మల్కన్‌గిరికి చెందిన నిందితుడు.. 2018-19 మధ్య తల్లిని చంపేస్తానని బెదిరించి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. తల్లికి విషయం తెలిసి స్థానిక అధికారుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కొడుకుపైనే న్యాయపోరాటానికి దిగింది. స్థానిక నేతల అండతో కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు నిందితుడు. అయితే.. చివరకు న్యాయమే నెగ్గింది. ఈ కేసుకు సంబంధించి మల్కన్‌గిరి జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై నిందితుడు హైకోర్టుకు వెళ్లగా.. ఇలాంటి మృగానికి శిక్ష సరైందేనని జడ్జి చెబుతూ అదనంగా మరో రెండేళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు. -
సెలబ్రిటీల ఇంట రాఖీ పండగ సెలబ్రేషన్స్
అన్న అంటే కొండంత అండ.. తల్లిదండ్రుల తర్వాత అంత ప్రేమను పంచేది, అన్ని బాధ్యతలు చూసుకునేది అన్న మాత్రమే.. ఆ మాటకొస్తే కష్టసుఖాలను ముందుగా పంచుకునేది, తొలి మిత్రువు కూడా సోదరుడే అవుతాడు. మరి అన్నకు చెల్లి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు?.. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మరుక్షణం అన్నా అంటూ వచ్చే చెల్లి ప్రేమకు అన్న బదులుగా ఏమివ్వగలడు? అందుకే ఈ రాఖీ పండగ.. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉంటామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పేదే రక్షా బంధన్. సెలబ్రిటీలు సైతం రాఖీ పండగ రోజు తమ సోదరులకు రాఖీ కట్టి పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఎవరెవరు రాఖీ పండగ జరుపుకున్నారో కింద చూసేయండి.. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
Raksha Bandhan 2023: సోదరుడికి ప్రేమతో...
అన్న గుండె ఆగిపోయిన క్షణాన చెల్లెలి గుండె ఆగిపోతుంది... అందుకే వెండితెరపై అన్నాచెల్లెలి అనుబంధం అనగానే వీరి ‘రక్త సంబంధం’ గుర్తుకు వస్తుంది. ఇంకా తెలుగు తెరపై అన్నా చెల్లెళ్ల అనుబంధంతో చాలా సినిమాలు వచ్చాయి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. ఈ రాఖీ పండగ సందర్భంగా ఓ పది సినిమాల గురించి చెప్పుకుందాం.. రక్త సంబంధం (1962) ఎన్టీఆర్–సావిత్రి.. తెలుగు చిత్ర పరిశ్రమలో జంటగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ‘హిట్ పెయిర్’. అలాంటి హిట్ జోడీని అన్నా–చెల్లెలిగా చూపించే సాహసం చేసి, ‘రక్త సంబంధం’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వి. మధుసూదనరావు. ఈ అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్, కాంతారావు, సావిత్రి, దేవిక, సూర్యకాంతం ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రక్త సంబంధం’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పాస మలర్’ సినిమాకి రీమేక్‌గా ‘రక్త సంబంధం’ రూ΄పొందింది. హీరో–హీరోయిన్లుగా అలరించిన ఎన్టీఆర్–సావిత్రిలు ‘రక్త సంబంధం’లో అన్నా, చెల్లెలు పాత్రల్లో జీవించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో రాజు (ఎన్టీఆర్), రాధ (సావిత్రి) ఒకేసారి ్రపాణాలు వదలడం ప్రేక్షకుల చేత కన్నీళ్లు తెప్పిస్తుంది. మరణం కూడా విడదీయలేనంత అనుబంధం రాజు–రాధలది. అందుకే అన్నాచెల్లెళ్ల అనుబంధం అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చేది ‘రక్త సంబంధం’ చిత్రమే. బంగారు గాజులు (1968) రాము (నాగేశ్వరరావు), రాధ (విజయనిర్మల) అన్నాచెల్లెళ్లు. చెల్లెలి చేతికి బంగారు గాజులు తొడగాలని రాము ఆశ పడతాడు. ఇందుకోసం డబ్బు కూడబెడుతుంటాడు. ఓ రైస్ మిల్లులో రాము డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆ రైస్ మిల్లు యజమాని రావూజీ కన్ను రాధపై పడుతుంది. రాధను బలవంతం చేయబోతాడు రావూజీ. ఆ సమయంలో రాధ తప్పించుకుంటుంది. ఇదే సమయంలో రాము హంతకుడనే నిందను మోపి అతన్ని జైలుపాలు చేస్తాడు రావూజీ. చెల్లెలిని వెతుక్కునే క్రమంలో రాము హైదరాబాద్‌కి వచ్చి రాధను చూస్తాడు. కానీ రాధ గుర్తు పట్టదు. దీంతో రాము ఆశ్చర్యానికి గురవుతాడు. కానీ హైదరాబాద్‌లో కనిపించిన రాధను తన చెల్లెలిగానే భావిస్తాడు, ఏదో తెలియని ఆత్మీయతతో రామును కూడా రాధ అన్నయ్యలానే భావిస్తుంటుంది. అయితే ఇద్దరు రాధలు ఉన్నారని, ఈ ఇద్దరు కవలలని, అందుకే రాముని హైదరాబాద్‌లో ఉన్న రాధ గుర్తుపట్టలేక పోయిందన్నది ట్విస్ట్. ఈ ఇద్దరు చెల్లెళ్లకు బంగారు గాజులు తొడుగుతాడు రాము. నాగేశ్వరరావు, విజయనిర్మల ముఖ్య తారాగణంగా భారతి, పద్మనాభం, గీతాంజలి కీలక పాత్రల్లో నటించిన ‘బంగారు గాజులు’ సినిమాకు సీఎస్‌రావు దర్శకత్వం వహించారు. చెల్లెలి కాపురం (1971) రాము (శోభన్‌బాబు)కు చెల్లెలు (మణిమాల) అంటే చాలా ఇష్టం. చెల్లికి పెళ్లి చేయాలని డబ్బు సంపాదించడం కోసం పట్నంలో అడుగుపెట్టిన రాముకు అతని స్నేహితుడు శ్రీరామ్ (నాగభూషణం) తారసపడతాడు. స్వతహాగా రచయిత అయిన రాము తన రచనలతో డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ రాము ఆహార్యం చూసి, అతని రచనలను అచ్చు వేసేందుకు ప్రచురణ కర్తలెవరూ ముందుకు రారు. రాము విజ్ఞప్తి మేరకు అతని స్నేహితుడైన శ్రీరామ్.. రాము రచనలను తన రచనలుగా పబ్లిష్ చేయించుకుని, కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తాడు. ఈ క్రమంలోనే రాము చెల్లిని శ్రీరామ్ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత రాము చెల్లిని ఎలాంటి కష్టాలు పెట్టాడు? ఆ కష్టాల నుంచి ఆమెను రాము, అతన్ని ప్రేమించే రాధ (వాణీ శ్రీ) ఎలా కాపాడారు? శ్రీరామ్ తన తప్పు తాను తెలుసుకునేలా రాధ ఏం చేసింది? అన్నదే కథ. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. పల్నాటి పౌరుషం (1994) రెండు కుటుంబాల మధ్య జరిగే కథతో రూ΄పొందిన చిత్రం ‘పల్నాటి పౌరుషం’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు (భీమినేని బ్రహ్మన్న), రాధిక (సీత) అన్నా చెల్లెలి పాత్రల్లో నటించారు. తనకెంతో ఇష్టమైన చెల్లిని (సీత) వేరే ఊర్లోని రాజారావ్ (చరణ్‌రాజ్)కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు బ్రహ్మన్న. అయితే రాజారావ్ బామ్మర్ది సూరిబాబు (సురేశ్)కి బ్రహ్మన్న అంటే ఇష్టం ఉండదు. దీంతో కుట్రలతో ఇరు కుటుంబాల్లో కలహాలు తీసుకొస్తాడు సూరిబాబు. ఆ కలహాలకి తన భర్తే కారకుడని తెలుసుకున్న సూరిబాబు భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మృతికి బావ బ్రహ్మన్నే కారణమని భావించి, అన్నని కలవొద్దని తన భార్య సీతకు ఆంక్ష విధిస్తాడు రాజారావ్. ఆ తర్వాత బ్రహ్మన్న, సీతలకు నిజం ఎలా తెలుస్తుంది? ఈ కుటుంబాలను కలపడంలో తర్వాతి తరం పాత్ర ఎంత... అన్నదే ‘పల్నాటి పౌరుషం’ కథాంశం. తమిళ హిట్ మూవీ ‘కిళక్కు సీమయిలే’కు రీమేక్ ఇది. హిట్లర్ (1997) మాధవరావు అలియాస్ హిట్లర్ (చిరంజీవి)కు ఐదుగురు శారద (అశ్వని), అనుపమ (మోహిని), లక్ష్మి (పద్మశ్రీ), గాయత్రి (గాయత్రి), సరస్వతి (మీనాకుమారి) చెల్లెళ్లు. మాధవరావు చిన్నతనంలోనే తల్లి మరణించడం, తండ్రి జైలుపాలు కావడంతో ఐదుగురి చెల్లెళ్ల బాధ్యత అతనిపైనే పడుతుంది. చాలా కష్టపడి, వారిని పెంచి, పెద్ద చేస్తాడు మాధవరావు. తన రెండో చెల్లి మోహిని ప్రేమను మాధవరావు సరిగా అర్థం చేసుకోకపోవడం, మొదటి చెల్లి శారద కాపురంలోని ఇబ్బందులు, సవతి తల్లి ఇద్దరు కూతుళ్లను చేరదీయడం వంటి కారణాలతో మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి.. మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య ఉన్న అభి్రపాయభేదాలను బాలు (మోహిని భర్త, మాధవరావు మామయ్య కొడుకు రాజేంద్రప్రసాద్) ఎలా పరిష్కరిస్తాడు? మాధవరావు, అతని చెల్లెళ్లు తిరిగి ఎలా కలుస్తారు? ఇందులో బుజ్జి (రంభ) పాత్ర ఏమిటన్నదే ‘హిట్లర్’ కథాంశం. సిద్దిఖీ దర్శకత్వంలో రూ΄పొందిన మలయాళ హిట్ ఫిల్మ్ ‘హిట్లర్’కు తెలుగు రీమేక్ ‘హిట్లర్’లో చిరంజీవి హీరోగా నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. శివరామరాజు (2002) పూసపాటి శివరామరాజు (జగపతిబాబు), రామరాజు (వెంకట్), రుద్రరాజు (శివాజీ) అన్నదమ్ములు. ఈ ముగ్గురి అన్నదమ్ములకు ఏకైక చెల్లెలు స్వాతి (మోనికా). అయితే శివరామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడం కోసం శత్రువర్గం నాటకం ఆడి స్వాతిని తమ ఇంటి కోడలుగా చేసుకుంటుంది. ఈ పెళ్లి తర్వాత శివరామరాజు, రామరాజు, రుద్రరాజు తమ ఆస్తిని కోల్పోయి పేదవాళ్లు అయిపోతారు. తనవల్ల పేదరికంలో జీవిస్తున్న అన్నలను చూసి స్వాతి కుమిలిపోతుంటుంది. స్వాతిని అత్తింటి వేధింపుల నుంచి శివరామరాజు ఎలా కాపాడాడన్నదే చిత్రకథ. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వి. సముద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అర్జున్ (2004) అర్జున్ (మహేశ్‌బాబు), మీనాక్షి (కీర్తి రెడ్డి) కవలలు. మీనాక్షి, ఉదయ్ (రాజా) ప్రేమించుకుంటారు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మీనాక్షికి ఉదయ్ ఓ లేఖ రాస్తాడు. ఈ లేఖను అర్జున్‌కు చూపిస్తుంది మీనాక్షి. దీంతో ఉదయ్ తల్లిదండ్రులు బాలానాయర్ (ప్రకాష్‌రాజ్), ఆండాళ్ (సరిత) అతనికి చేయాలనుకున్న అమ్మాయితో కాకుండా, మీనాక్షి తో వివాహం జరిగేలా చేస్తాడు అర్జున్. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో బాలానాయర్, ఆండాళ్లు కలిసి మీనాక్షిని చంపి, ఉదయ్‌కు మరో అమ్మాయితో వివాహం చేయాలనుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్జున్‌కు తెలుస్తుంది. అప్పుడు మీనాక్షిని రక్షించేందుకు సోదరుడిగా అర్జున్ ఏం చేశాడు? మధుర మీనాక్షి అమ్మవారి సాక్షిగా మీనాక్షిని ఎలా కాపాడుకున్నాడు– అన్నదే అర్జున్ కథ. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. ‘పుట్టింటికి రా చెల్లి’ (2004) చిన్నతనంలోనే శివన్న (అర్జున్) తల్లి కన్నుమూస్తుంది. దీంతో చెల్లెలు లక్ష్మి (మధుమిత) ఆలనాపాలన శివన్నపై పడుతుంది. సేద్యం చేస్తూ చెల్లెల్ని చదివిస్తాడు శివన్న. తన చెల్లెలు ప్రేమించిన అజయ్ (శ్రీనాథ్)తోనే ఆమె వివాహం జరిపిస్తాడు. ఈ పెళ్లి ఇష్టం లేని అజయ్ కుటుంబ సభ్యులు లక్ష్మిని నిత్యం వేధిస్తుంటారు. అంతేకాదు.. ఎలాగైనా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు ఓ పెద్ద నింద వేస్తారు. అది నమ్మిన అజయ్ గర్భవతిగా ఉన్న లక్ష్మిని పట్టించుకోడు. పుట్టింటికి రమ్మని శివన్న వచ్చి లక్ష్మిని వేడుకుంటాడు. నిందతో రాను.. నిప్పులా వస్తానని అన్నకు చెబుతుంది లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మిపై పడ్డ నిందని శివన్న ఎలా చెరిగిపోయేలా చేశాడు– అనే కథాంశంతో ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా రూ΄పొందింది. అర్జున్, మీనా జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఖీ (2006) అల్లారుముద్దుగా పెరిగిన తన చెల్లి చావుకి కారణమైన ఆమె అత్తింటి వారిపై ఓ అన్నగా, తోడ పుట్టకపోయినా.. సమాజంలోని కొందరు యువతులపై దౌర్జన్యం చేసినవారిపై రాఖీ బ్రదర్‌గా రామకృష్ణ ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ‘రాఖీ’ సినిమా రూ΄పొందింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. రామకృష్ణ అలియాస్ రాఖీ (ఎన్టీఆర్)కి చెల్లెలు గాయత్రి (మంజూష) అంటే అమితమైన ప్రేమ. ఐదు లక్షల కట్నం ఇచ్చి రవివర్మతో గాయత్రి వివాహం జరిపిస్తారు రాఖీ, కుటుంబ సభ్యులు. అయితే తన కొడుక్కి కోటి రూపాయల కట్నం వస్తుందని తెలుసుకొని మూడు నెలల గర్భవతి అయిన గాయత్రిని కిరోసిన్ పోసి చంపేస్తారు అత్తింటివారు. కానీ, వారు నిర్దోషులంటూ కోర్టులో కేసు కొట్టేస్తారు. దీంతో తన చెల్లిని చంపిన అత్తింటి వారందర్నీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు రాఖీ. తన చెల్లెలి కేసుకు వ్యతిరేకంగా వాదించిన లాయర్ని, దొంగ సాక్ష్యం ఇచ్చిన డాక్టర్ని, పోలీసు అధికారులని కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. ఆ తర్వాత ఏ మహిళకు అన్యాయం జరిగినా అందుకు కారకులైన వారిని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. వరుస హత్యలు చేస్తున్న రాఖీని పోలీసులు పట్టుకున్నాక కోర్టు అతనికి శిక్ష విధించిందా? అన్నది ఈ చిత్ర కథాంశం. గోరింటాకు (2008) అశోక్ (రాజశేఖర్)కి చెల్లెలు లక్ష్మి (మీరా జాస్మిన్) అంటే పంచ్రపాణాలు. చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో అన్నీ తానై చెల్లెల్ని పెంచి పెద్ద చేస్తాడు అశోక్. చెల్లికి పెళ్లి అయ్యేవరకు తాను కూడా చేసుకోకూడదనుకుంటాడు. చెల్లెలు ప్రేమించిన అబ్బాయి ఆకాశ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఆకాశ్‌ని ఆస్తి కోసం అయినవాళ్లే మోసం చేసి, జైలుకి పంపిస్తారు. ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పి, సాయం అడుగుదామని ఇంటికి వచ్చిన లక్ష్మిని.. అశోక్ భార్య నందిని (ఆర్తి అగర్వాల్) అవమానించి పంపించేస్తుంది. భర్త జైలులో ఉండటం..అన్నయ్యను కలిసే అవకాశం లేకపోవడం.. పిల్లలు ఆకలితో అలమటిస్తుండడంతో.. ఏం చేయాలో పాలుపోని లక్ష్మి.. పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విషయం తెలిసి లక్ష్మి భౌతిక కాయం వద్ద అశోక్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. అక్కడే ్రపాణాలు విడవడం ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది. కన్నడ హిట్ ‘అన్న తంగి’కి రీమేక్‌గా వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. కాగా, 2008 నుంచి ఇప్పటివరకు అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇటీవల ‘భోళా శంకర్’లో చిరంజీవి, కీర్తీ సురేశ్, రెండేళ్ల క్రితం వచ్చిన ‘పెద్దన్న’లో రజనీకాంత్, కీర్తీ సురేశ్ అన్నాచెల్లెళ్లుగా నటించిన విషయం తెలిసిందే. రాఖీ స్పెషల్ -
రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు
అమరావతి: రక్షాబంధన్(రాఖీ పర్వదినం)ను పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులు విన్నూత్న శైలిలో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమకున్న ప్రేమ, కృతజ్ఞతను చాటుకోవడానికి రక్షాబంధన్ పండుగను వేదికగా చేసుకున్నారు విద్యార్థులు. ‘రాష్ట్రానికి రక్ష జగనన్న’ అంటూ మానవ గొలుసుగా ఏర్పడి హృదయపూర్వకమైన సంజ్ఞను ప్రదర్శించారు. సీఎం జగన్‌ను మేనమామగా పిలుచుకునే విద్యార్థులు.. ఆయనపై అమితమైన విశ్వాసంతో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విద్యాకుసుమాలు జగన్‌లో ఓ సంరక్షకుడిని చూసుకుంటున్నారు. ప్రకాశవంతమైన రేపటికోసం సీఎం జగన్‌పైనే నమ్మకం ఉంచిన విద్యార్థులు.. అందుకు బదులుగా రాష్ట్రానికి రక్ష జగనన్న అంటూ ఇలా తమ ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు. సీఎం జగన్, విద్యార్ధుల మధ్య ఉన్న బంధానికి ఇదొక ప్రతీకగా చెప్పవచ్చు. -
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో.. -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్‌పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్‌తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్‌తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్‌పూర్‌లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్‌కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్‌కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!
త్వరలోనే మెగా కోడలిగా అడుగుపెట్టబోతోన్న టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇప్పటికే వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది చివర్లోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేదికతో పాటు పెళ్లి తేదీపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించి ఉంగరాలు కూడా మార్చుకున్నారు. (ఇది చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ! ) అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఉన్న లావణ్య త్రిపాఠి తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అన్న, వదినతో కలిసి రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు. అన్నా, చెల్లెల్ల అనుబంధం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిచ్చిన వరలాంటిదని అన్నారు. ఇన్‌స్టాలో లావణ్య రాస్తూ..' అన్న, వదినకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు. మీపై ప్రేమ రోజు రోజుకు ఇంకా పెరుగుతూనే ఉంది.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సైతం లావణ్యకు హ్యాపీ రాఖీ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) -
ఆ రోజే రాఖీ పండుగ ఎందుకు? భద్రకాలం అంటే..?
ప్రతి ఏడాది రాఖీ పండుగ చక్కగా జరుపుకునేవాళ్లం. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ తలెత్తింది. అసలు ఏ రోజు ఈ పండుగ జరుపుకోవాలనేది ఒకటే గందరగోళం. కొందరూ ఆ రోజుని మరొకరు వేరొకటి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకి గందరగోళం వచ్చిందో, ఎప్పుడూ రాఖీ కట్టాలో తదితర విషయాలు చూద్దాం!. ఈ నెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా.. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.10 నిమిషాల వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి. ఇంతకీ భద్రకాలం అంటే..?? భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర(శూర్పణఖ). ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు. ఇక పోతే మనం సౌరమానం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. సూర్యోదయం మొదలైన తర్వాత ఉన్న తిథినే ప్రధానంగా తీసుకుంటాం. బుధవారం ఉదయం చతుర్ధశి తిథి ఉంది. ఉదయం 10.30 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి వస్తుంది. అందువల్ల బుధవారం చేసుకోము. గురువారం ఉదయం 9.45 నిమిషాల వరకు ఉండటంతో ఇక ఆరోజునే రాఖీపండుగ పరిగణించి జరుపుకుంటున్నాం. రక్ష కోసం కడుతున్నాం కాబట్టి అన్నా చెల్లెళ్ల ఇరువురికి మంచి జరిగేలా మంచి టైంలోనే కట్టుకుందా. మంచి సత్సంబంధాలనే కొనసాగిద్దాం. (చదవండి: రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?) -
ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్ చేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాణేనికి అటు.. ఢిల్లీలో చంద్రబాబు డ్రామా! ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను! — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2023 -
రాఖీ పండుగ: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అందిస్తున్న టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ సోమవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. నాలుగు రోజుల పాటు టికెట్‌ను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో మంగళవారం నుంచి 4 రోజుల పాటు టీ-9 టికెట్ల నిలుపుదల అమల్లో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, సెప్టెంబర్ 2 నుంచి ఈ టికెట్ల అమలు యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. కాగా, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. టీఎస్ఆర్టీసీ 60 కి.మీ. పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కి.మీ. టీ-9-30 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. టీ-9-60 టికెట్‌ను రూ.100కు, టీ-9-30 టికెట్‌ను రూ.50కి ప్రయాణికులకు సంస్థ అందజేస్తోంది. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 28, 2023 టికెట్ల నిలుపుదలపై ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీ-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయి’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: వినాయక చవితిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన -
TSRTC: రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. రాఖీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ప్రత్యే బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈనెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు వెయ్యి బస్సుల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. సజ్జనార్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌తోపాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలానే పనిచేయాలన్నారు. టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. చదవండి: అమిత్ షా ఖమ్మం పర్యటనలో మార్పులు ‘అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఆ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ నాడు.. మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యూలర్ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది’ అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు. పండుగ నాడు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్‌లతో పాటు హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు, తదితరులు పాల్గొన్నారు. -
ఎకో ఫ్రెండీ వినాయకుడినే చూశారు.. మట్టితో ఈసారి రాఖీ చేసుకుందామా?
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేశాం. ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూశాం. ప్రకృతి– పర్యావరణాల బంధానికి... ఇకపై... ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధనం. బంధాల అల్లిక రాఖీ పండుగకు... అనుబంధాల లతలల్లింది శ్రీలత. నిజామాబాద్‌కు చెందిన శ్రీలత సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. గృహిణిగా ఇంటి నాలుగ్గోడలే జీవితం అనుకోలేదామె. నాలుగు గోడలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. శ్రీలత తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఏ గోడను చూసుకున్నా తాను చేసిన ఫ్లవర్ వాజ్, కార్నర్ స్టాండ్, తలమీద కుండలు పేర్చుకుని భవనంలోకి అడుగుపెడుతున్న ఎంబ్రాయిడరీ గొల్లభామ, రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్‌లు కనిపిస్తాయి. తలెత్తి చూస్తే షాండ్లియర్ కనువిందు చేస్తుంది. బీరువా తెరిస్తే తాను పెయింటింగ్ చేసుకున్న చీరలు. ఏక్తార మీటుతున్న భక్త మీరాబాయి ఆమె కుంచెలో ఒదిగిపోయి చీర కొంగులో జాలువారి ఉంది. మెడలో ధరించిన టెర్రకోట ఆభరణంలో రాధాకృష్ణులు వయ్యారాలొలికిస్తుంటారు. మరోదిక్కున వర్లి జానపద మహిళలు కొలువుదీరిన మినీ టేబుల్ స్టాండ్. డాబా మీదకెళ్తే మొక్కల పచ్చదనం, చుట్టూ ఎర్రటి పిట్టగోడల మీద తెల్లటి చుక్కల ముగ్గులు... ఖాళీ సమయాన్ని ఇంత ఉపయుక్తంగా మార్చుకోవచ్చా... అన్న విస్మయం, అందరికీ రోజుకు ఇరవై నాలుగ్గంటలే కదా ఉంటాయి... ఇన్ని రకాలెలా సాధ్యం అనే ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. ఇప్పుడామె రాబోతున్న రాఖీ పండుగకు పర్యావరణహితమైన టెర్రకోట రాఖీల తయారీకి సిద్ధమయ్యారు. తన కళాభిరుచిని సాక్షితో పంచుకున్నారు శ్రీలత. రంగు... బ్రష్ ఉంటే చాలు! ‘‘మా సొంతూరు దోమకొండ. మా చిన్నప్పుడే నిజామాబాద్‌కి వచ్చేశాం. అత్తగారిల్లు బాన్సువాడ, కానీ మావారి వ్యాపారరీత్యా నిజామాబాద్‌లోనే స్థిరపడ్డాం. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, ఇంటి బాధ్యతల కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది. దాంతో ఉద్యోగం మానేయక తప్పలేదు. అయితే నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు, కాలేజ్‌కి, మా వారు బయటకు వెళ్లిన తర్వాత రోజంతా ఖాళీనే. టీవీ చూస్తూ గడిపేయడం నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న కళలన్నీ గుర్తుకు వచ్చాయి. నా క్రియేటివ్ జర్నీ అలా మొదలైంది. వీటన్నింటినీ చేయడానికి ముడిసరుకు కోసం మార్కెట్కెళ్లే పనే ఉండదు. ఇంటికి వచ్చిన పెళ్లి పత్రిక, చాక్లెట్ బాక్సులు, కేక్ కట్ చేసిన తర్వాత మిగిలిన అట్టముక్క... దేనినీ వదలను. రంగులు, బ్రష్‌లు కొంటే చాలు ఇక నాకు చేతినిండా పని. నా మెదడు చివరికి ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే... ఉపయోగంలో లేని ఏ వస్తువును చూసినా దాంతో ఏమి చేయవచ్చు... అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆలోచనలకు ఒక రూపం వచ్చిందంటే పని మొదలు పెట్టడమే. వచ్చిన ఐడియాని మర్చిపోతానేమోనని ఒక్కోసారి ఒకటి పూర్తికాకముందే మరొకటి మొదలు పెడతాను. మట్టితో రాఖీ! కోవిడ్ లాక్డౌన్ సమయం నాకు బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజు కూడా బోరు కొట్టలేదు. అప్పటివరకు ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు మాత్రమే చేసిన నేను రాఖీల తయారీ కూడా మొదలు పెట్టాను. మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టిని రాఖీలు, ఆభరణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుంటాను. మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తరవాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్లోకి వడపోయాలి. రాళ్లు, నలకలు, పుల్లల వంటివి జల్లెడ పైన ఉండిపోతాయి. ఓ గంట సేపటికి బకెట్లో నీరు పైకి తేలుతుంది. అడుగుకు చేరిన మట్టిని తీసి ఎండబెట్టాలి. తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు ఆభరణాలు తయారుచేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలి. ఇటుకలు కాల్చినట్లేనన్నమాట. వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి, దారాలు చుడితే రాఖీ రెడీ. లాకెట్లు, చెవుల జూకాలు కూడా ఇలాగే చేస్తాను. మొక్క నాటుతాం! రాఖీలను మొదట్లో మా ఇంట్లో వరకే చేశాను. ఇప్పుడు నా రాఖీలు కావాలని బంధువులు, స్నేహితులు అడుగుతున్నారు. ఓ వంద రాఖీలు అవసరమవుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఆగస్టు మొదటివారం నుంచే పని మొదలుపెట్టాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగినప్పటి నుంచి మట్టి వినాయకుడి బొమ్మనే తెచ్చుకుంటున్నాం. పండుగ తరవాత గణపతిని పూలకుండీలో పెట్టి నీరు పోసి కరిగిన తరవాత మొక్క నాటుతాను. మరో విషయం... మా ఇంట్లో ఏటా పుట్టినరోజులు, పెళ్లిరోజుకు కొత్త మొక్కను నాటుతాం’’ అని చెప్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేశారు శ్రీలత. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట!
భారతదేశం దేవాలయాల నిలయం. ఇక్కడ లక్షల దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని పలు ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాలలోని కొన్నింటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని అందమైన ఆలయాలైతే, మరికొన్ని అద్భుతాలకు నిలయాలు. కొన్ని దేవాలయాలు దూరప్రాంతాలలో నెలకొనివుంటాయి. వాటి దగ్గరకు చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. అలాంటి ఒక దేవాలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. కేవలం రక్షా బంధన్(రాఖీ) రోజున మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని దుర్గమ లోయలో ఉన్న ఈ ఆలయాన్ని బన్షీనారాయణ లేదా వంశీనారాయణ దేవాలయం అని అంటారు. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. దాదాపు 12 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ చాలా మంది ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. బన్సీ నారాయణ్ ఆలయంలో విష్ణువు, శివునితో పాటు గణేశుని విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయ తలుపులు రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుస్తారు. రక్షా బంధన్ నాడు స్థానికులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టే సమయానికి ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయానికొస్తే విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక గుహ కూడా ఉంది. ఇక్కడ భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజున స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది కూడా చదవండి: షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది? -
ఈ సినిమాలకు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. కారణం ఇదే
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్ధా'. బెబో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అయితే 'లాల్ సింగ్ చద్ధా' విడుదలైన తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. అనుకన్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా రిలీజ్ రోజైన గురువారం 11. 70 కోట్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు శుక్రవారం 7.26 కోట్లకు పడిపోయింది. మొత్తంగా 'లాల్ సింగ్ చద్ధా' తొలి రెండు రోజుల్లో రూ. 18.96 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే కనీసం రూ. 20 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. కాగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభం నుంచే 'బాయ్‌కాట్ బాలీవుడ్'లో భాగంగా 'లాల్ సింగ్ చద్ధా'పై సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం. 'బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్ధా' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కూడా అయింది. అమీర్ ఖాన్ సినిమా ఇలా తక్కువ వసూళ్లు సాధించడానికి ఈ ట్రెండింగే కారణంగా తెలుస్తోంది. #LaalSinghChaddha falls flat on Day 2... Drop at national chains... Mass pockets face steep fall... 2-day total is alarmingly low for an event film... Extremely crucial to score from Sat-Mon... Thu 11.70 cr, Fri 7.26 cr. Total: ₹ 18.96 cr. #India biz. Note: #HINDI version. pic.twitter.com/9hwygm6Jrm — taran adarsh (@taran_adarsh) August 13, 2022 అలాగే 'బాయ్‌కాట్ బాలీవుడ్' సెగ ప్రభావం ఈ సినిమాతో పాటు మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిత్రంపై కూడా పడింది. అన్నాచెళ్లెల్ల అనుబంధంగా తరకెక్కిన 'రక్షా బంధన్' చిత్రం కూడా ఆగస్టు 11నే విడుదలైంది. తొలి రోజైన గురువారం రూ. 8.20 కోట్లను సాధించిన 'రక్షా బంధన్' రెండో రోజు శుక్రవారం రూ. 6.40 కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తంగా అమీర్ ఖాన్ చిత్రం కంటే తక్కువగా రూ. 14.60 కోట్ల కలెక్షన్లతో నెమ్మదిగా ముందుకుసాగుతోంది. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను బట్టి చూస్తే 'బాయ్‌కాట్ బాలీవుడ్' ప్రభావం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. #RakshaBandhan declines on Day 2... National chains remain extremely low... Mass belt is driving its biz... 2-day total is underwhelming... Needs to have a miraculous turnaround from Sat-Mon... Thu 8.20 cr, Fri 6.40 cr. Total: ₹ 14.60 cr. #India biz. pic.twitter.com/WaJtvW8SJY — taran adarsh (@taran_adarsh) August 13, 2022 -
ఏటి ఒడ్డున కన్నీటి సుడులు.. తమ్ముడూ రాఖీ కడదామని వచ్చానురా.. !
నేలకొండపల్లి / ఖమ్మం వైద్యవిభాగం: మండలంలోని సుర్దేపల్లి ఏటిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తితో పాటు ఆయనను కాపాడేందుకు వచ్చి గల్లంతైన డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలు శుక్రవారం లభించాయి. గురువారం ఏటిలో చేపల వేటకు వెళ్లిన రంజిత్ గల్లంతు కాగా, ఆయనను రక్షించేందుకు వచ్చిన ఖమ్మం కార్పొరేషన్ డీఆర్ఎఫ్ సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, బి.ప్రదీప్ కూడా గల్లంతైన విషయం విదితమే. అయితే, గురువారం రాత్రి వెంకటేశ్వర్లు మృతదేహం లభించగా, శుక్రవారం ప్రదీప్, రంజిత్ మృతదేహాలను గుర్తించారు. అనంతరం రంజిత్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాక, డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులను సస్పెండ్ చేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. అధికారులు రాకుండా బలవంతం చేస్తే తాము ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. (చదవండి: అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్) వీరి ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలపగా, ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ చర్చించినా ససేమిరా అన్నారు. చివరకు కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్ వచ్చి నచ్చచెప్పారు. అలాగే, ఖమ్మంలో ఉన్న నాయకులతో ఫోన్లో మాట్లాడిన ప్రదీప్ బంధువులు వారి సూచనతో ఐదు గంటల ఆందోళన అనంతరం మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. కాగా, ఆందోళన నేపథ్యాన నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ పోలీస్స్టేషన్ల నుంచి సిబ్బందిని పిలిపించి ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్, ముదిగొండ ఎస్సై నాగరాజు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ సీ.హెచ్.శివ పర్యవేక్షించారు. సీపీఐ, సీపీఎం, ప్రజాపంథా, కాంగ్రెస్‌తో పాటు ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, గోగినపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్, తుమ్మా విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఎం.జయరాజ్, పొట్టపింజర నాగులు, పగిడికత్తుల నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, కడియాల శ్రీనివాసరావు, గరిడేపల్లి రామారావు, తోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోదిస్తున్న ప్రదీప్ భార్య బంధువులు విలేకరిపై రాళ్లదాడి ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు న్యాయం చేయాలని ధర్నా చేస్తూ అధికారులు రావాలి్సందేనని పట్టుబడ్డారు. ఇంతలోనే నేలకొండపలి్లకి చెందిన ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరి.. అధికారులంతా రావడానికి చనిపోయిన వ్యక్తి ఏమైనా వీఐపీనా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న రాళ్లతో దాడికి దిగారు. దాదాపు అర కిలోమీటర్ మేర పరుగులు పెట్టిస్తూ రాళ్లు విసరగా, సహచర విలేకరులు, పోలీసులు అడ్డుకుని పంపించారు. రోదిస్తున్న నాగరాణి(కుడి) కుప్పకూలిన నాగరాణి తమ్ముడూ... రాఖీ పండగకు వచ్చాను... నీకు రాఖీ కడతాను, లేవరా అంటూ ప్రదీప్ మృతదేహం వద్ద ఆయన సోదరి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ బి.ప్రదీప్(32) అక్క లింగం కనకదుర్గ నాగరాణి బోనకల్లో ఉంటుండగా, పండుగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు రావాలని గురువారం సాయంత్రం సిద్ధమవుతోంది. ఇంతలోనే ఆయన ఏటిలో గల్లంతైనట్లు తెలుసుకుని ఆవేదనతో వచ్చింది. గురువారం చీకటి పడడంతో గాలింపు నిలిపివేసినా తమ్ముడు వస్తాడని ఆశగా ఎదురుచూసింది. శుక్రవారం అక్కడే ఉన్న ఆమె తమ్ముడిపై ప్రేమతో ఆశగా చూస్తోంది. ఇంతలోనే ఆయన మృతదేహాన్ని స్థానికులు తీసుకురావడంతో నాగరాణి కుప్పకూలింది. నాగరాణి తన తమ్ముడు ప్రదీప్‌తో పాటు అన్నకు ఏటా రాఖీ కట్టేది. కానీ సుర్దేపల్లి చెక్‌డ్యామ్ ఆమె సంతోషంపై నీళ్లు చల్లడంతో రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. పరిహారం, ఉద్యోగం డీఆర్ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాక అక్కడ కూడా ధర్నా చేశారు. చివరకు ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం, ఇంటి స్ధలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. (చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..) -
ప్రగతిభవన్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
ఘనంగా రక్షాబంధన్ వేడుకలు (ఫొటోలు)
-
ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్‌కాట్ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. ఆమిర్.. ట్రోలింగ్ గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్‌ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో నెటిజనులు ట్రోల్ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్ ఖాన్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్‌కాట్ బాలీవుడ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్‌ఖాన్ దంగల్, దీపికా పదుకోన్ పద్మావత్ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. అక్షయ్‌కు తప్పని తలనొప్పి ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్ కుమార్ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. తాప్సి సినిమా చూడొద్దు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ట్విటర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్ ప్రచారాన్ని అనురాగ్, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు) ఒటీటీలనూ వదలడం లేదు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సినిమా ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్‌కాట్ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్‌టాగ్‌తో అలియా భట్‌పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్‌కు నవ్వులాటగా ఉందని ఫైర్ అవుతున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలసి అలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్ అవర్స్ నమోదు చేసి దూసుకుపోతోంది. (క్లిక్: ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!) `బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్‌తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్ కపూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున) -
మార్కెట్ లో దర్శనమిస్తోన్న వివిధ రకాల రాఖీలు
-
సమ గౌరవమే సరైన రక్ష
కుటుంబంలో ఆమె సమాన భాగస్వామి. పని ప్రదేశంలో ఆమె సమాన సహోద్యోగి. సమాజంలో ఆమె సమాన పౌరురాలు. అవకాశాలలో.. అధికారంలో.. అంతరిక్షంలో అన్నింటా ఆమెకు సమాన హక్కు ఉంది. పురుషులు గ్రహించ వలసింది ఇదే రక్షా బంధన్ సందర్భంలో. స్త్రీకి సాటి పురుషుల నుంచి ‘రక్ష’ ఇచ్చే బదులు అందరు పురుషులు స్త్రీల సమస్థానాన్ని స్వీకరిస్తే చాలు. అన్న స్థానం మంచిదే. సమ స్థానం గొప్పది. పురాణాల్లో ద్రౌపదికి కృష్ణుడు అన్నగా కనిపిస్తాడు. ద్రౌపదికి రక్షగా ఆయన నిలిచిన ఉదంతాలు అందరికీ తెలుసు. కౌరవసభలో జూదంలో ఓడిపోయిన పాండవులను మరింత అవమానించడానికి ద్రౌపది వస్త్రాపహరణానికి పురిగొల్పుతాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు అందుకు పూనుకుంటాడు. నిండు సభలో స్త్రీకి... ఒక రకంగా ఇంటి కోడలికి అవమానం జరగబోతుంది. ఆ సమయంలో ఒక అన్నగా ప్రత్యక్షమయ్యి ఆమెకు రక్షగా నిలుస్తాడు కృష్ణుడు. మగవారి గొడవలో స్త్రీలను లాగకూడదనే సంస్కారం కౌరవులకు ఉండి ఉంటే ద్రౌపదికి పరాభవం జరిగి ఉండేది కాదు. మగవారైన కౌరవుల నుంచి రక్షించడానికి మగవాడైన కృష్ణుడు ప్రత్యక్షం కావల్సిన అవసరమూ ఉండేది కాదు. అంటే? స్త్రీలను గౌరవించాలనే సంస్కారమే ప్రథమం. ఆ సంస్కారం ఉంటే స్త్రీలకు మగవారి నుంచి ఎటువంటి ఆపదా, ఇబ్బంది ఉండదు. వారికి రక్షగా నిలవాల్సిన అవసరమూ ఉండదు. చెల్లెలు బంగారు తల్లి. ఇంటి ఆడపిల్లంటే లక్ష్మి. తండ్రికి, అన్నకు, తమ్ముడికి కూడా ఆమె అంటే అంతులేని మమకారం. ఆమె పాదంలో ముల్లు దిగితే వారి కంట కన్నీరు పొంగుతుంది. ఆమె కోరింది ఇవ్వబుద్ధవుతుంది. ఆమెను ఇష్టాన్ని మన్నించాలనిపిస్తుంది. కాని ఇదంతా తమ ఇంటి ఆడపిల్ల విషయంలోనే. మరి పొరుగింటి, ఇరుగింటి, ఊళ్లో ఉన్న, ఆఫీసులో ఉన్న స్త్రీలు అందరూ ఇలా ప్రేమగా, ఆదరంగా చూడవలసిన వారే కదా. మన ఇంటి ఆడవాళ్లని మాత్రమే ఆదరంగా చూస్తాము ఇతర ఇళ్ల ఆడవాళ్లను చులకన చేస్తాము అనే భావన ఎందుకు? అలా ఎవరైనా తమ ఇంటి ఆడవాళ్లను చులకన చేస్తే ‘మేమున్నాం’ అని ఆ ఇంటి అన్నదమ్ములు ముందుకు రావడం ఎందుకు? అసలు ఒక స్త్రీని చులకన గా లేదా ఆధిపత్య భావనతో చూడవలసిన అవసరం ఏముంది? మీరు మేము రక్షగా నిలువదగ్గవారు అని చెప్పవలసిన అవసరం ఏమి? ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ∙∙ ఆడపిల్ల చదువు విషయంలో, ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో, జీవిత భాగస్వామిని కోరుకునే విషయంలో, ఆస్తి పంపకాలలో, ఇంటికి సంబంధించిన నిర్ణయాలను వ్యక్తం చేయడంలో ఎంత అవకాశం ఇస్తున్నారో ఎవరికి వారు చూసుకోవాలి. కావలసిన బట్టలు, నగలు కొనిపెట్టడమే అనురాగం, ఆత్మీయత కాదు. వారి ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి చోటు కల్పించాలి. స్వయం సమృద్ధితో జీవితాన్ని నిర్మించుకునే శక్తి, స్వేచ్ఛ పొందేందుకు అడ్డు లేకుండా ఉండాలి. మద్దతుగా నిలవాలి. అది ఇంటికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం అంటే. ఇక పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగినుల ప్రతిభను గౌరవించాలి. వారికి ‘బాస్’లుగా ఎదిగే సామర్థ్యం ఉంటే వారి దగ్గర పని చేయడం ఇతర పురుష బాస్‌ల వద్ద పని చేయడంతో సమానంగానే భావించాలి. వారు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ ఉద్యోగంలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి అనుక్షణం గుర్తుంచుకోవాలి. పురుషుడు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది. ఉద్యోగం చేయాలనుకునే స్త్రీ ఇల్లు కూడా చూసుకోవాలి. కనుక ఆఫీసులో వారే ఎక్కువ సమానం అవుతారు కాని తక్కువ సమానం కాదు. పురుష ఉద్యోగులతో పరస్పర సహకారం అందిస్తూ ఎలా పని చేస్తారో మహిళా ఉద్యోగులతో కూడా పరస్పర సహకారం అందిస్తూ పని చేస్తే అదే ఆఫీసు వరకు నిజమైన రక్షాబంధనం. సమాజంలో అనేక దొంతరల్లో ఇవాళ స్త్రీలు వికాస పథంలో పని చేస్తున్నారు. పురుషులకు అట్టి వారిని చూసినప్పుడు ప్రధానంగా ప్రశంసాపూర్వకంగా చూడాలి. నాయకులు, ఆటగాళ్ళు, కళాకారులు, అధికారులు అనంటే పురుషుల మాత్రమే కాదని, స్త్రీలు కూడా అని గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఇవాళ స్త్రీలే ఫోర్బ్స్‌కు ఎక్కుతున్నారని గ్రహిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఇంటి అమ్మాయికి వారిని ఆదర్శం చేయడమే సమాజానికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం. పులితో పోరాడిన స్త్రీలు, బిడ్డను నడుముకు కట్టుకుని శత్రువులతో పోరాడిన స్త్రీలు మన దగ్గర కొదవ కాదు. వారు పరాక్రమవంతులు. వారే ఎవరికైనా రక్షగా నిలువగలరు. తమను తాము రక్షించుకోగలరు. వారు కోరేదల్లా తమ దారిన తాము నడవనివ్వమని. తమ ఎంపికల పట్ల ప్రజాస్వామికంగా ఉండమని. బాధ్యతల బంధాల బట్వాడాలో సమన్యాయం పాటించమని. తమను గౌరవిస్తూ తమ గౌరవం పొందే విధంగా పురుషులు ఉండాలని. తల్లీతండ్రి, భార్యా భర్త, అక్కా తమ్ముడు, స్త్రీ పురుషుడు, యువతీ యువకుడు... జీవన– సామాజిక చక్రాలలో స్త్రీలు పురుషులకు రక్షగా పురుషులు స్త్రీలకు రక్షగా సందర్భాన్ని బట్టి మారాల్సి ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తించమని చెప్పేదే నిజమైన రక్షాబంధనం. ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. -
Most Expensive Rakhi: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో..
ఇప్పుడెక్కడ చూసినా రాఖీ ముచ్చటే. గుజరాత్‌లోని సూరత్ మాత్రం ఇంకాస్త స్పెషల్. ఎందుకంటే... అక్కడంతా ఈ ఫొటోలో ఉన్న రాఖీ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది? అంటే. దాని విలువ. ఆ రాఖీ ఖరీదు ఐదు లక్షలు. బంగారంతో డిజైన్ చేసిన రాఖీ మధ్యలో వజ్రాలను పొదిగారు. ఆ వజ్రాలపై మళ్లీ ‘ఓం’గుర్తును పొందుపరిచారు. ప్రతి ఏటా వివిధ రకాల బంగారు, వెండి, ప్లాటినమ్ రాఖీలతో ఆకట్టుకునే ఆ షాప్ ఈసారి... వజ్రాలు పొదిగిన రాఖీని తయారు చేసింది. సాధారణంగా రాఖీని రెండు, మూడు రోజుల తరువాత తీసేస్తారు. కానీ ఈ రాఖీని ఎప్పుడైనా ఆభరణంగా కూడా ధరించే వీలుందంటున్నాడు నగల షాప్ యజమాని దీపక్ భాయ్ చోక్సీ. అంతవిలువైన రాఖీని మీ అక్కనో, చెల్లెనో కడితే బాగుండేది అనుకుంటున్నారా.. అయితే అంతకంటే విలువైన గిఫ్ట్‌ను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి! -
Raksha Bandhan 2022: పెద్దన్న కేసీఆర్‌కు రాఖీ కట్టండి
సాక్షి, హైదరాబాద్: మహిళాభ్యున్నతి, ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప జేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్దన్నగా ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ప్రతి మహిళకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు అవసరమైన భరోసా కల్పించారని అన్నారు. అందువల్ల రాఖీ పండుగ సందర్భంగా ఆడబిడ్డలంతా కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టాలని కోరారు. రాఖీ పండుగను పురస్కరించుకొని 33 జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో గురువారం కేటీఆర్ జూమ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని వివరించారు. సుసంపన్నమైన సమాజ నిర్మాణ రూపకర్తలు స్త్రీలే అని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఒక్క ఆడబిడ్డ బాగుంటే మొత్తం కుటుంబం, సమాజం బావుంటుందన్న లక్ష్యంతోనే మహిళా సంక్షేమాన్ని కర్తవ్యంగా భావించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో పెన్షన్ పదిరెట్లు పెరిగిందని, 14 లక్షల మంది ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మంది కొత్తవారికి రూ.2,016 చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్ము తున్న ప్రభుత్వం మాది. దేశంలో మరెక్కడా లేని విధంగా మహిళల కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉద్యమకాలం నుంచి తమకు అండగా ఉన్న మహిళల ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. శిశువులు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి స్త్రీ కి అండగా ఉండి వారి అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములుగా ఉన్నాం. అమ్మ ఒడి పథకంలో భాగంగా గర్భిణుల కోసం ప్రత్యేకంగా 300 ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది. మాతాశిశు మరణాల తగ్గింపులో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుంది. అన్ని విధాలా అండగా..: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి–షాదీ ముబా రక్ పథకంలో భాగంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలను కట్నంగా ఇస్తున్నాం. ఆరోగ్యలక్ష్మి కింద 5,18,215 మంది శిశువులకు, 21,58,479 మంది గర్భి ణులకు, 18,96,844 మంది పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. రాష్ట్రంలో 4 లక్షల స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం నిరంతరం మద్దతు అందిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తల జీతాలను పెంచింది. మిషన్ భగీరథతో ఆడబిడ్డల నీటి కష్టాలను పూర్తిగా తొలగించాం. మహిళలకు అత్యంత సురక్షి తమైన రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. చదవండి: రాష్ట్రంపై కేంద్రం నిందలను తిప్పికొడదాం.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
నితిన్‌కి రాఖీ కట్టిన సింగర్ మంగ్లీ.. గిఫ్ట్ ఇచ్చిన హీరో
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. తాజాగా నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగర్ మంగ్లీ నితిన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్న నితిన్‌కు ఇంటర్వ్యూ చివర్లో మంగ్లీ రాఖీ కట్టింది. దీంతో నితిన్ ఆమెకు బ్యూటిఫుల్ గిఫ్ట్‌ను అందించారు. -
రక్షాబంధన్: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు (ఫొటోలు)
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి తాడేపల్లి: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. చదవండి: రూ.6కే మధ్యాహ్న భోజనం కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Raksha Bandhan 2022: సీఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?) -
స్పృహ: పర్యావరణ రక్షాబంధన్
ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అని గట్టిగా అనుకోవచ్చు. అయితే ముంజేతి రాఖీకి అద్దం అక్కర లేకపోవచ్చుగానీ... అర్థం మాత్రం ఉంటుంది. బంధాల గురించి రాఖీ ఎన్నో మాటలు చెప్పకనే చెబుతుంది. ఇప్పుడది పర్యావరణహిత వచనాలు కూడా అందంగా చెబుతోంది. ‘మమ్మల్ని చల్లగా చూడు తల్లీ’ అంటూ చెట్లకు రాఖీ కట్టే ఆచారం ఉంది. ‘అయితే మనం చల్లగా ఉండాలంటే చెట్టు చల్లగా ఉండాలి. పర్యావరణం బాగుండాలి’ అంటున్నారు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళలు. పైన్ చెట్ల పత్రాలతో ఎకో–ఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఊరూరు తీసుకువెళుతున్నారు.... పైన్ చెట్ల నుంచి నేల రాలిన పత్రాల వలన ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నకు ఉపయోగపడే సమాధానం ఒకప్పుడు ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. బోలెడు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫామ్స్ ప్రయోగాత్మకంగా 22 మంది మహిళలకు పైన్ పత్రాలతో రాఖీల తయారీ నేర్పించింది. ఆ తరువాత సిమ్లా, సోలన్ జిల్లాలో 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక కోణం అయితే, పర్యావరణానికి మేలు జరగడం మరో కోణం. ఎండిపోయిన పైన్ పత్రాల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గింది. ‘గతంలో పైన్ పత్రాలపై దృష్టి ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవి మాకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ ప్రయోజన కార్యక్రమాల్లో భాగం అయ్యేలా చేస్తున్నాయి’ అంటుంది ప్రియదర్శిని కుమారి. రకరకాల మొక్కల విత్తనాలు కూర్చి ఈ రాఖీలను తయారు చేయడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణప్రాంతాల్లో చిన్నస్థాయిలో అయినా ఉపాధి దొరకడం కష్టం అయ్యేది. ఈ రాఖీల తయారీ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలను జనాలలో ప్రచారం చేయగలుగుతున్నాం’ అంటుంది 42 సంవత్సరాల హేమావతి. ట్రైనర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన హేమావతి నెలకు ముప్పై వేలకు పైగా సంపాదిస్తుంది. ‘పర్యావరణ స్పృహ పెరిగిన తరువాత ఎకో–ఫ్రెండ్లీ రాఖీలకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ రాఖీల కంటే భిన్నంగా ఉండడం కూడా వీటి డిమాండ్‌కు మరో కారణం’ అంటుంది నేహా. ఊరూరూ తిరిగి ఎకో–ఫ్రెండ్లీ రాఖీలను అమ్మడమే కాదు పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలను ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకు వెళుతున్నారు. ‘ఈ సంవత్సరం నా సోదరులకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులకు కూడా వీటి ప్రత్యేకతను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది కాలేజి స్టూడెంట్ శ్వేత. దిల్లీకి చెందిన తోరాని బ్రాండ్ రాఖీలు కూడా పర్యావరణ స్పృహతో తయారుచేయబడుతున్నాయి. పాత దుస్తులు, బట్టలతో తయారుచేసిన పాతబ్యాగులు... మొదలైన వాటిని ఉపయోగించి అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంగళూరు(కర్నాటక)లోని ‘పేపర్‌సీడ్ కో’ అనే సామాజిక సంస్థ రకరకాల మొక్కల విత్తనాలను కూర్చి పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తుంది. పండగ తరువాత చేతికి ఉన్న రాఖీలోని విత్తనాలు భూమిలోకి వెళ్లి పచ్చటి భవిష్యత్‌ను ఇస్తాయి. ఈ రాఖీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ‘పేపర్‌సీడ్ విలేజి’ కోసం కేటాయిస్తున్నారు. ఇది మహిళలకు పర్యావరణహిత బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ. ఎకో–ఫ్రెండ్లీ రాఖీల గురించి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. -
అల్లరి చేసేవారే ఇలా బహిష్కరిస్తారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Mischievous People Are Boycotting Films: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తుంటాడు. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలతో పలకరించాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రక్షా బంధన్'. అయితే ఈ మధ్య 'బాయ్‌కాట్ బాలీవుడ్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్రం', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అలియా భట్ 'డార్లింగ్స్'తో పాటు అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' చిత్రాలను బహిష్కరించాలని నెట్టింట్లో ట్రోలింగ్ జరిగింది. రక్షా బంధన్ ప్రమోషన్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ బాయ్‌కాట్‌పై స్పందించాడు. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా బాయ్‌కాట్' ట్రెండింగ్‌లో ఉండటం తనను బాధించిందని తెలిపాడు. 'ఇలా బాయ్‌కాట్ పేరుతో అల్లరిపాలు చేసేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అల్లరి చేసేవాళ్లు మాత్రమే ఇలా బాయ్‌కాట్ చేస్తారు. అది పర్వాలేదు. ఇది స్వేచ్ఛాయుత భారతదేశం. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినవి చేసేందుకు అనుమతిస్తారు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుందా?. అలా జరగడం లేదు కదా. ప్రజలు ఇలాంటి పనులు చేయడంలో ఎలాంటి అర్థం లేదు. మన భారతదేశాన్ని గొప్పగా పెంపొందిచడంలో తోడ్పడాలి కానీ, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు' అని అక్కీ పేర్కొన్నాడు. కాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఒక్క అన్న, నలుగురు చెళ్లెళ్ల మధ్య అనుబంధంగా తెరకెక్కింది 'రక్షా బంధన్' చిత్రం. ఇందులో భూమి పెడ్నేకర్, సాదియా ఖతీబ్, సాహెజ్మీన్ కౌర్, స్మృతి శ్రీకాంత్, దీపికా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కూడా విడుదల కానుంది. -
మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది. చదవండి: ఇష్టారాజ్యంగా చికెన్ విక్రయాలు ఊరికో ధర..! టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. -
భక్తులకు గుడ్ న్యూస్.. అమర్నాథ్ యాత్ర ఎప్పుడంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: భక్తులకు అమర్నాథ్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రపై ఆదివారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆదివారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన అమర్నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను జూన్ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈసారి భక్తులకు దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో తగ్గని నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు బోర్డు సభ్యులు చెబుతున్నారు. Amaranth Yatra to start from June 30th, 2022, with all covid protocols in place & culminate, as per the tradition, on the day of Raksha Bandhan. The Amarnath Yatra will last for 43 days this year: Office of Lt. Governor of Jammu & Kashmir — ANI (@ANI) March 27, 2022 -
ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్‌కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్ జనరేషన్ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్లో రావత్‌తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్ గతంలో కశ్మీర్లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజక్‌స్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు. సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్‌కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. సెకండ్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్ జనరల్ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన హవాల్దార్ సత్పాల్ రాయ్ సొంతూరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్‌లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్‌లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్‌లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్‌లో భారత వాయుసేనలో చేరారు. -
పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ
సాక్షి,నెన్నెల(ఆదిలాబాద్): అక్కాతమ్ముడు..అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. అనుబంధమే పదేళ్ల తర్వాత అక్కాతమ్ముడిని మళ్లీ కలిపింది. కుటుంబానికి దగ్గర చేసింది. చనిపోయిందేమో.. అనుకున్న మహిళ శనివారం తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన టేకులపల్లి వెంకటి, మధునక్క దంపతులకు కుమారులు శ్రీనివాస్, పవన్, కూతురు రజిత ఉన్నారు. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండేవారు. ఈ ప్రాంతం నుంచి కూలీలు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ పనులు చేయడానికి వలస వెళ్తుంటారు. అలా పనుల కోసం పదేళ్ల క్రితం వెళ్లిన రజిత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాగా, జమ్మికుంటలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హనీగావుకు చెందిన రాజు అనే యువకుడు రజితకు పరిచయమయ్యాడు. అతడితో కలిసి ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్క డే రాజును పెళ్లి చేసుకుంది. ఈ విషయం తల్లి దండ్రులకు తెలిస్తే కొడతారనే భయంతో ఇంతకాలం నెన్నెలకు రాలేదు. రజిత ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా చనిపోయిందేమోనని భావించారు. రెండేళ్ల క్రితం ఆమె అన్న శ్రీనివాస్ చనిపోయినా సమాచారం తెలియకపోవడంతో రాలేదు. ఇటీవల రాఖీ పండుగకు రజిత భర్త రాజుకు రాఖీ కట్టేందుకు అతడి చెల్లెళ్లు రావడం, రాఖీ కట్టడం తన తమ్ముడిని, కుటుంబాన్ని గుర్తు చేసింది. ‘‘మా ఆయనకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెళ్లను చూసి నాకు నా తమ్ముడు పవన్ గుర్తుకు వచ్చాడు. వాడికి రాఖీ కడతానని మూడు రోజుల క్రితం నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం నెన్నెలకు వచ్చాను.. నాకు ప్రస్తుతం ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. పదేళ్ల తర్వాత మా అమ్మానాన్నలు, నా కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది..’’ అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. మహారాష్ట్రలో జీవనంతో ఆమె కట్టు, బొట్టు మారింది. మరాఠీ, హిందీ భాషా మాట్లాడుతోంది. ఆమెను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. శనివారం తమ్ముడు పవన్‌కు రాఖీ కట్టింది. అన్నను గుర్తు చేసుకుంటూ విలపించింది. చదవండి: సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా? -
మెగా సందడి
-
అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్): మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజు(35) ఆదివారం పాము కాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు. తన సోదరితో రాఖీ కట్టిన తర్వాత రాజు తన బార్బర్ షాపులో పని చేసుకుంటుండగా పాము కరవడం గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిన చాలా సేపటి తర్వాత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ పేర్కొన్నారు. చదవండి: Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత -
అర్బన్ నక్సల్స్తోనే హిందుత్వానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు హిందువులు కాదంటూ అర్బన్ నక్సలైట్లు విషప్రచారం చేస్తున్నారని, వారివల్లే హిందుత్వానికి ముప్పు పొంచి ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధానకార్యదర్శి మిలింద్ పరండేజీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల పండుగలు అతి ప్రాచీనమైనవని, దాదాపు రెండు వేల ఏళ్ల నుంచి విదేశీ దురాక్రమణలను ఎదుర్కొంటూ హిందువులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 185 జిల్లాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కశీ్మర్, అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో హిందువుల పండుగలను స్వేచ్ఛగా జరగనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో ‘మేం ఏ మతానికి చెందని వారం కాదు’ అని చెప్పేవారి సంఖ్య కోట్లలో ఉందని, వారంతా హిందువులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు స్థానుమలై, రాఘవులు, సత్యంజీ, కేశవ్హెడ్గే, యాదిరెడ్డి, జగదీశ్వర్, రాజేశ్వర్‌రెడ్డి, పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు. -
రక్షాబంధన్ రోజు విషాదం
రాపూరు/ఆత్మకూరు/చెన్నూరు: రక్షాబంధన్ రోజు రాష్ట్ర రహదారులు రక్తమోడాయి. వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళ్తే.. నెల్లూరు మూలాపేటకు చెందిన మల్లేశ్వరరావు (35), రాము (22) బైక్‌పై పెంచలకోన క్షేత్రంలో మిత్రుడి పిల్లలకు తలనీలాలు సమర్పించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాపూరు మండలం రామకూరు ఎస్టీ కాలనీ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్నారు. మల్లేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. రామును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆగి ఉన్న లారీని ఢీకొని.. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో నెల్లూరు–ముంబై రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (35) ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నెల్లూరుపాలెం వద్ద బోయలచిరువెళ్లకు చెందిన కృష్ణయ్య (67) లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ బైక్‌పై వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో అక్కాతమ్ముడు వైఎస్సార్ జిల్లా చెన్నూరు పెన్నా నది బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాపాడు మండలం నక్కలదిన్నె అనంతపురం గ్రామానికి చెందిన చెరువు మల్లేష్ (45), ఆయన సోదరి ఇండ్ల వెంకట లక్షుమ్మ (47) మృతి చెందగా మేనకోడలు లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. చెరువు మల్లేష్ రాఖీ పర్వదినం సందర్భంగా కడప అల్మాస్‌పేటలో ఉంటున్న తన అక్క లక్షుమ్మ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి అక్కతోపాటు మేనకోడలిని తీసుకుని బయలుదేరాడు. చెన్నూరు పెన్నాబ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కిందపడడంతో మల్లేష్ చేయి, తలకు, లక్షుమ్మకు తలతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. లావణ్య కాలు తెగిపడి తీవ్ర రక్తస్రావమైంది. వీరిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వెంకట లక్షుమ్మ, మల్లేష్లు మృతి చెందారు. లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో అక్క మృతి.. ఆ బాధతో తమ్ముడి కన్నుమూత అనకాపల్లి టౌన్: 75 ఏళ్లకుపైగా అనుబంధం వారిది. చివరకు మరణంలోనూ ఒకరిని ఒకరు వీడలేకపోయారు. ఇద్దరూ రక్షాబంధన్ రోజునే కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో అక్క రాజా సాగి లలితాదేవి (85) ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె తమ్ముడు ఎస్ఆర్ఎన్ఎంఆర్ రాజు (76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని శారదా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. లలితాదేవి తన భర్త మృతి చెందాక కుమార్తె పద్మినీరాణితో కలసి తమ్ముడు రాజు (76)తోనే 30 ఏళ్లుగా ఉంటున్నారు. అక్క మరణంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి రాజు ఇంటికి చేరుకున్నారు. తర్వాత భోజనం చేసి బంధువులతో ఫోన్లో తన అక్క మృతి విషయం మాట్లాడుతూ గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన చాలాకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. -
అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య
సంగారెడ్డి:రాఖీ పండుగ వేడుకలు దేశమంతటా ఘనంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదరసోదరీమణుల సందడితో అన్నీ ఇళ్లూ కళకళలాడుతుంటాయి.తమ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను చాటుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. కానీ ఇదే రాఖీ పండగ రోజు ఆ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. అందరిలానే ఆమె కూడా తన అన్నకు రాఖీ కట్టాలనుకుంది. ఆదివారం రాఖీ పండగ కావడంతో అందరు చెల్లెళ్ల మాదిరే మమత అనే యువతి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. కానీ ఆ యువతి చేత రాఖీ కట్టించుకునేందుకు తన అన్నయ్య రమేశ్ నిరాకరించాడు. కారణమేంటో తెలియదు గానీ తాను రాఖీ మాత్రం కట్టించుకోనని స్పష్టం చేశాడు. అన్నపై ఎంతో ప్రేమతో రాఖీ తీసుకొచ్చిన మమత తన అన్నయ్య ఆ మాట అనగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇంటికి వచ్చిన పెద్ద సోదరి సరితతో రమేశ్ రాఖీ కట్టించుకున్నాడు. తన అక్కతో అన్నయ్య రాఖీ కట్టించుకుని తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపానికి గురైన మమతను తండ్రి ఓదార్చి పొలానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి వచ్చిన బసన్నకు కూతురు శవమై కనిపించడంతో బోరున విలపించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారెడ్డి నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న బసన్న(బస్వరాజ్)కు నలుగురు సంతానం. భార్య చనిపోయింది. పెద్ద కూతరుకు పెళ్లయింది. పెద్ద కుమారుడు కూడా వేరుగా నివసిస్తున్నాడు. బసన్నతో పాటు చిన్న కొడుకు రమేశ్, చిన్న కూతురు మమత(22)లు ఉంటున్నారు. నాలుగైదు రోజులుగా అన్నాచెల్లెళ్ల మధ్య గొడవల కారణంగా మమతతో రమేశ్ మాట్లాడటం లేదని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం మమత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ కట్టించుకోనంత మాత్రన ఇలా ఆత్మహత్య చేసుకుంటారా అని సందేహపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గరం గరం ముచ్చట్లు 22 August 2021
-
చిన్న వయస్సులోనే పెద్ద సినిమాల్లో పాటలు పాడుతున్న అన్నాచెల్లెల్లు
-
ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
-
విషాదం: మరణించిన సోదరుడి చేతికి రాఖీ కట్టిన తోబుట్టువులు
-
రాఖీ స్పెషల్ : సెలబ్రిటీల అన్నాచెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లను చూశారా?
-
రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లు.. తీవ్ర విషాదం
సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం మాలగూడెంలో రాఖీ పండగనాడు విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టినవాడికి రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లకు తీరని శోకం మిగిలింది. శనివారం రాత్రి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ అక్కాచెల్లెళ్ల సోదరుడు చింతపల్లి లక్ష్మయ్య ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన లక్ష్మయ్య చేతికి రాఖీ కట్టి తోడబుట్టిన బంధం విలువ తెలిపిన ఆ అక్కాచెల్లెళ్లు కన్నీరుమున్నీరయ్యారు. రాఖీ పౌర్ణమినాడు జరిగిన ఈ ఘటన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది. అన్నకు రాఖీ కట్టేందుకు వారంతా నిన్ననే లక్ష్మయ్య ఇంటికి వచ్చినట్టు తెలిసింది. -
జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల, సోదరుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. హ్యాపీ రాఖీ’ అని ట్విటర్లో పేర్కొన్నారు. నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. #HappyRakhi pic.twitter.com/EP35BVUJ7z — YS Sharmila (@realyssharmila) August 22, 2021 -
Raksha bandhan 2021: రాఖీ అంటే అపురూప బంధం
కుటుంబాల్లో అన్నాచెలెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు. వీరి ప్రేమానురాగాలకు సూచనగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. రాఖీ అంటే రక్షణ. నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే అపురూప బంధం. తన తోడబుట్టిన వాడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఆడబిడ్డలు కట్టేదే ఈ రాఖీ. అలాగే సదా నీకు రక్షగా ఉంటానంటూ అన్నదమ్ములు హామీ ఇవ్వడం ఆనవాయితీ. అయితే, అత్యంత సంబరంగా చేసుకునే ఈ వేడుకలో అన్నా తమ్ములకు రాఖీ కట్టడంతోపాటు మరిన్ని విధాలుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.. -
ప్రధానికి.. బృందావన్ రాఖీ!
బీద, గొప్ప, స్థాయి భేదం లేనివే అనుబంధాలు. అందుకే సొంత అన్నయ్యలు, తమ్ముళ్లకేగాక.. అప్యాయత, అనురాగాలు పంచేవారు, కష్టాల్లో వెన్నంటి ఉండి ధైర్యం నూరిపోసేవారు, ఆపదలో ఆదుకునే ప్రతిఒక్కరినీ తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ అడపడుచులు. వీర జవాన్ల నుంచి ప్రధాని మంత్రిదాకా అందరికీ రాఖీలు పంపుతూ సోదర సమానులపై తమకున్న ప్రేమను చాటిచెబుతుంటారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన కొంతమంది వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు పంపించారు. బృందావన్‌లోని ‘మా శారద’, రాధా తిల ఆశ్రమంలోని వయసుపైబడిన వితంతువులు ప్రధాని కోసం ప్రత్యేకంగా రంగురంగుల రాఖీలను రూపొందించారు. 251 రాఖీలను స్వయంగా తయారు చేసి, వాటిపై మోదీ ఫొటోనూ చిత్రీకరించారు. రాఖీలతోపాటు ‘ఆత్మనిర్భర్’, ‘స్టే సేఫ్’ అని మెసేజ్æ రాసిన ప్రత్యేకమైన మాస్కులు, స్వీట్లు పంపడం విశేషం. వీళ్లంతా మోదీని తమ సోదరుడిలా భావించి గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా రాఖీలు పంపిస్తున్నారు. గతేడాది బృందావన్‌కు చెందిన 103 ఏళ్ల వితంతు బామ్మ మోదీకి రాఖీ కట్టగా ఈ ఏడాది ఆ అవకాశం దక్కలేదు. దీంతో నలుగురు మహిళలతో మోదీకి రాఖీల బుట్టను పంపారు. -
నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
‘ఓ అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’... ఈ పాట ప్రతి రాఖీ పండక్కీ వినిపిస్తుంది. ఇళ్లల్లో అన్నదమ్ములకు జరక్కపోయినా చెల్లెళ్లకు ముద్దు మురిపాలు జరుగుతాయి. తండ్రో లేకుంటే అన్నయ్యలో ఆమెను భుజాల మీదకు ఎక్కించుకుని ఆడిస్తారు. తల్లి కోపగించాలని చూసినా గారం చేసి వెనకేసుకు వస్తారు. తండ్రి, అన్నదమ్ముల ప్రేమ పొందిన చెల్లెలు తన జీవితంలో భర్తగా వచ్చే పురుషుడి నుంచి కూడా అలాంటి ప్రేమనే ఆశిస్తుంది. అక్కడ ఏదైనా లోటు జరిగితే అన్నదమ్ముల తోడ ఆ లోటును పూడ్చుకుందామని చూసుకుంటుంది. ఒకప్పటి కాలంలో ఆమె పురుషుల మీద ఆధారపడే స్త్రీ అయినా నేడు ఆర్థికంగా, వ్యక్తిత్వపరంగా స్వతంత్రతను, ఉనికిని చాటుతున్నా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగంలో ఎటువంటి మార్పూ ఉండదు. ఉండబోదు. వారు కలిసి పెరిగారు. కలసి బాల్యం పంచుకున్నారు. వారు ఒకరికొకరు తెలిసినట్టుగా మరొకరికి తెలియరు. అందుకే ఆపద వస్తే చెల్లెలు ‘అన్నా’ అంటుంది. అన్న ఉలికిపాటుకు గురైతే చెల్లెలు హాజరవుతుంది. మేనమామ, మేనత్తలుగా ఈ అన్నాచెల్లెళ్లు పిల్లలకు ప్రియ బంధువులవుతారు. అపురూపమైన మానవ బంధాల నిర్మాణం ఇది. చందురుని మించు అందమొలికించు ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లా అని జనం అనుకున్నారుగాని వారిద్దరూ ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్లుగా చిరకాలం గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఆ అన్నకు చెల్లెలి కోసం సర్వస్వం వదులుకునేంత ప్రేమ. ఆ చెల్లెలికి ఆ అన్న కోసం ప్రాణమే ఇచ్చే పాశం. అబ్బ... ఆ అవినాభావ బంధం చాలా ఉద్వేగపూరితమైనది. ఇదే ఎన్.టి.ఆర్ ‘చిట్టిచెల్లెలు’లో వాణిశ్రీ కోసం ఏడ్చి ఏడ్చి మనకు ఏడుపు తెప్పిస్తాడు. ‘అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప’.. అన్నాచెల్లెళ్ల పాటల్లో కంటిపాప వంటి పాట. అక్కినేని ‘బంగారు గాజులు’లో విజయనిర్మలతో ఈ అనుబంధాన్ని గొప్పగా పండించాడు. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ పాటలో అన్నగా ఆయనను చూడాలి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’ సినిమా చెల్లెలి సెంటిమెంట్ వల్లే హిట్. ఆయన నటించిన ‘శారద’ సినిమాలో శారదకు అన్నయ్యగా కైకాల సత్యనారాయణ నటించి విలన్ నుంచి పూర్తి స్థాయి కేరెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. ‘కానిస్టేబుల్ కూతురు’లో జగ్గయ్య, కృష్ణకుమారి అన్నాచెల్లెళ్లుగా నటించారు. చెల్లెల్ని ఆట పట్టిస్తూ జగ్గయ్య పి.బి.శ్రీనివాస్ గొంతుతో పాడే ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’ చాలా బాగుంటుంది. పగ–ప్రతీకారాల దశాబ్దం 1980లు వచ్చే సరికి తెలుగు సినిమాలో చెల్లెలి పాత్ర పరమ స్టీరియోటైప్‌గా మారింది. హీరోకు చెల్లెలు ఉంటే చాలు ఆమె విలన్ బాధలకు బలి అవనున్నదని ప్రేక్షకులకు తెలిసిపోయేది. ఈ పిచ్చి సినిమాల మధ్య కూడా ‘చట్టానికి కళ్లులేవు’లాంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో అక్కగా లక్ష్మి, తమ్ముడిగా చిరంజీవి ఘర్షణతో కూడిన బంధంలో కనిపిస్తారు. ఎన్.టి.ఆర్ ‘డ్రైవర్ రాముడు’లో అంధురాలైన తన చెల్లి రోజా రమణితో ‘ఏమని వర్ణించను’ పాట పాడతాడు. తమిళం నుంచి బాపు రీమేక్ చేసిన ‘సీతమ్మ పెళ్లి’లో మోహన్‌బాబు బహుశా తన గొప్ప పెర్ఫార్మెన్స్లలో ఒకటిగా నటించాడు. ఇందులోనే ‘తల్లివైనా చెల్లివైనా’ పాట ఉంది. కొంచెం కాలం ముందుకు నడిస్తే చిరంజీవి తన ‘లంకేశ్వరుడు’లో చెల్లెలి సెంటిమెంట్‌ను చూపడానికి ప్రయత్నించాడు. ఆ సినిమా పని చేయకపోయినా నలుగురు చెల్లెళ్లతో ఆ తర్వాత నటించిన ‘హిట్లర్’ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాన్స్ ఇచ్చింది. బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’ సినిమాలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట పాడి పెద్ద ఎత్తున హిట్ కొట్టాడు. కృష్ణంరాజు, రాధిక అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘పల్నాటి పౌరుషం’ గట్టి కథాంశమే అయినా అంతగా ఆడలేదు. పూర్ణిమ, శివకృష్ణలతో వచ్చిన పరుచూరి రచన ‘ఆడపడుచు’ పెద్ద హిట్ అయ్యింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై... ఆ సమయంలోనే గద్దర్ రాసిన ‘మల్లెతీగకు పందిరివోలే’ పాట ‘ఒరేయ్ రిక్షా’ సూపర్‌హిట్ కావడానికి ముఖ్యకారణంగా మారింది. 1995లో వచ్చిన ఈ సినిమా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అనే గొప్ప లైన్‌ను ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా చెల్లెలి పాత్రను చాలా కొత్తగా చూపించింది. ఇందులో పవన్‌కల్యాణ్, వాసుకి మధ్య సన్నివేశాలు గొప్పగా పండాయి. 2000 సంవత్సరం తర్వాత కాలం మారినా చెల్లెలి బంధం మారదు. సినిమాలూ ఆ కథను ఎంచుకోక మానలేదు. ‘పుట్టింటికిరా చెల్లి’ వంటి పాతవాసన వేసే టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. అర్జున్, స్వప్నమాధురి అద్భుతంగా నటించారు. మహేశ్‌బాబు ‘అర్జున్’లో అక్క కీర్తి రెడ్డిని కాపాడుకునే తమ్ముడిగా గొప్పగా నటించాడు. పవన్ కల్యాణ్ ‘అన్నవరం’ చెల్లెలి రక్షణకు వేట కొడవలి పట్టిన అన్నను చూపిస్తుంది. కృష్ణవంశీ ‘రాఖీ’ అనే టైటిల్ పెట్టి మరీ ప్రతి మగవాడు స్త్రీలను సోదరుడిలా చూసుకోవాలనే సందేశంతో హిట్ కొట్టాడు. జూనియర్ ఎన్.టి.ఆర్కు ఆ సమయంలో అవసరమైన హిట్ అది. ఇక రాజశేఖర్, మీరా జాస్మిన్ నటించిన ‘గోరింటాకు’ గొప్ప కరుణరసం పండించి అన్నాచెల్లెళ్ల బంధానికి తిరుగులేదని నిరూపించింది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే ఈ రాఖీ పండగ నాడు ఆ సెంటిమెంట్‌ను పండిస్తూ తీసిన, నటించిన తెలుగు సినిమా వారికి కూడా శుభాకాంక్షలు చెబుదాం. చెల్లెలి క్షేమం కోరుకోని అన్న అన్న శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరు. తల్లిదండ్రులు ఉన్నా గతించినా తల్లి అంశ చెల్లిలో తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు పరస్పరం అన్నాచెల్లెళ్లు. అది రక్తసంబంధం. యుగాలుగా ఏర్పడింది. యుగాంతం వరకూ ఉంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఎన్నో సినిమా కథలయ్యాయి. పాటలయ్యాయి. అవుతూనే ఉంటాయి. రాఖీ సందర్భంగా కొన్నింటిని గుర్తు చేసే ప్రయత్నం ఇది. -
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి, అమరావతి: రాఖీ పండగ సందర్భంగా ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. శనివారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ గుప్తా కల్యాణ మండపంలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గాయత్రి సంతోషిణి సీఎం జగన్‌కు రాఖీలు కట్టారు. సీఎం వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు : రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం జగన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారిత సాధించేందుకు మనందరి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక చర్యలు చేపట్టిందని తెలిపినట్లు సీఎం కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. -
రాఖీపౌర్ణమి సదారక్ష
-
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల మిఠాయి
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల తియ్యటి పండుగ.. సోదరుడి నోరు తీపి చేయటానికి సోదరి ఆప్యాయతను కలబోసి తినిపించే మిఠాయిల పండుగ తనకు రక్షణగా ఉండమని సోదరుడిని భరోసా కోరే రక్షాబంధన్ పండుగ.. 1. దూద్ పాక్ కావలసినవి: చిక్కటి పాలు – 5 కప్పులు; కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; బాస్మతి బియ్యం – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; గార్నిషింగ్ కోసం: బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; పిస్తా పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ ఒక చిన్న పాత్రలో టేబుల్ స్పూను పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, నెయ్యి జత చేసి పక్కన ఉంచాలి. పాలను మరిగించాక, నెయ్యి జత చేసిన బియ్యం అందులో పోసి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ, ఉడికించాలి. పంచదార, కుంకుమ పువ్వు జత చేసిన పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ ఆరేడు నిమిషాలు ఉంచి, దింపేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచి బయటకు తీయాలి. బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పుల తరుగుతో అలంకరించి, అందించాలి. చదవండి: రొయ్యల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసా? 2. కాజు కోప్రా షీరా కావలసినవ: జీడి పప్పుల పొడి – అర కప్పు (రవ్వలా ఉండాలి); కొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ చిన్న గ్లాసులో కొద్దిగా నీళ్లు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడి పప్పు పొడి, కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద మూడు నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఒక పాత్రలో పావు కప్పు నీళ్లలో పంచదార వేసి కరిగించి, వేయించిన జీడి పప్పు మిశ్రమానికి జత చేసి, బాగా కలపాలి. కుంకుమ పువ్వు నీళ్లను జత చేసి మరోమారు కలపాలి. ఏలకుల పొడి జత చేసి, కలిపి, దింపేసి, చల్లారాక అందించాలి. 3. కేసర్ మలై కుల్ఫీ కావలసినవి: కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – నాలుగున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. చిన్న పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నటి సెగ మీద మధ్యమధ్యలో కలుపుతూ మరిగించాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లు, పంచదార జత చేసి సన్నటి మంట మీద సుమారు అరగంట సేపు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి దింపేయాలి. మిశ్రమం బాగా చల్లారాక కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి జత చేయాలి. తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి పోసి, డీప్ ఫ్రీజర్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచాక తీసుకుని తినాలి. – వైజయంతి పురాణపండ చదవండి: బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసా? -
‘రక్షాబంధన్’తో అమ్మ చేతి హల్వా తినే అదృష్టం
పాత్ర కోసం అక్షయ్‌కుమార్ ఎలాంటి రిస్క్ అయినా చేస్తారు. ఎలాంటి మేకోవర్కి అయినా రెడీ అయిపోతారు. తాజాగా అక్షయ్ ‘రక్షాబంధన్’ సినిమా కోసం బరువు పెరుగుతున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో భూమీ ఫడ్నేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం 5 కేజీల బరువు పెరిగారు అక్షయ్. బరువు పెరగడం గురించి అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘పాత్ర కోసం బరువు తగ్గడం లేదా పెరిగే ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తాను. ‘రక్షాబంధన్’ కోసం సహజమైన పద్ధతిలోనే 5కిలోలు పెరిగాను. ఈ బరువు పెరిగే ప్రాసెస్‌లో మా అమ్మ చేతి హల్వా తినే అదృష్టం కూడా నాకు కలిగింది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయ్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... అక్షయ్‌కుమార్ పోలీసాఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సూర్యవంశీ’ విడుదల కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కోసం అప్పట్లో 5 కేజీల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. -
తొలిసారి అలాంటి సినిమా చేస్తున్న అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ అన్నయ్య అయ్యారు. నిజజీవితంలో ఆయనకో చెల్లెలు ఉంది. కానీ సినిమాలో నలుగురు చెల్లెళ్లకు అన్న అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అక్షయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షా బంధన్’. ఇందులో నలుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా కనిపించనున్నారాయన. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. అక్షయ్ కుమార్ తొలిసారి అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ఇది. భూమీ పెడ్నేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ తండ్రి పాత్రలో నానా పటేకర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని సోమవారం ఆరంభించారు. ‘‘నా సోదరి అల్కా నా బెస్ట్ ఫ్రెండ్. ఆనంద్ రాయ్‌తో చేస్తున్న ‘రక్షా బంధన్’ తనకి, మా మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైన బంధానికి అంకితం’’ అని లాక్డౌన్ 2.0 తర్వాత ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న సందర్భంగా అక్షయ్ పేర్కొన్నారు. చదవండి: వివాదంలో అక్షయ్ కుమార్ చిత్రం.. దిష్టిబొమ్మ దహనం -
ఆన్లైన్ జాబులకు డబ్బు చెల్లించొద్దు..
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు అవగహన కల్పించేలా ఆన్లైన్ శిక్షణా తరుగతులను ప్రభుత్వం చేపడుతోంది. దీనిలో భాగంగానే విజయవాడలో శుక్రవారం 18వ రోజు ‘ఈ రక్షా బంధన్’ శిక్షణ తరగతులు జరిగాయి. పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వెబ్‌నార్‌లో వ్యక్తిగత సమాచార దోపిడి, ఉద్యోగాల మోసాలు వంటి అంశాలపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా వెబ్‌నార్‌లో పాల్గొన్న సైబర్ నిపుణులు విమల్ ఆదిత్య, నందీశ్వర్ పలు కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అలాగే సోషల్ మీడియాలోనూ షేర్ చేయవద్దని సలహాఇచ్చారు. ఆన్లైన్ జాబ్ మోసగాళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా డబ్బు చెల్లించవద్దని నిరుద్యోగులకు సూచించారు. అలాగే వ్యక్తిగత సమాచారం దోపిడికి గురైతే దానిని ఎలా కనుగోవచ్చు అంశపై సుదీర్ఘంగా చర్చించారు. సైబర్ స్థలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వైఖరిని పెంపొందించుకోవాలన్నారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో సర్వే ఫారాలను నింపడం ద్వారా సమాచారం దోపిడి జరుగుతుందన్న అనుమానంపై సైతం సలహాలు ఇచ్చారు. అలాగే ఆన్లైన్ ఉద్యోగ మోసాలు ,పెళ్ళి సంబంధాల మోసాల నుంచి రక్షణ పొందడానికి భద్రతా చిట్కాలను సైతం సైబర నిపుణులు చర్చించారు. కాగా తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్‌కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. -
కొత్త ఇల్లు: సోనూ సూద్ రాఖీ గిఫ్ట్
-
వితంతువుకు సోనూసూద్ కానుక
ఎక్కడ ఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ఏమాత్రం వెనకాడని రీల్ విలన్ సోనూసూద్. రక్షా బంధన్ సందర్భంగా ఈ రియల్ హీరో ఓ వితంతువుకు సాయం చేసి మరోసారి మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు. అస్సాంలోని జల్పైగురిలో వరదల కారణంగా ఓ మహిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. ఆమెకు తోడుగా నిలిచేందుకు భర్త కూడా లేరు. పిల్లలు తినడానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. దీంతో దెబ్బతిన్న గుడిసెను వీడియో తీసి దాన్ని సోనాల్ సింఘ్ అనే మహిళ ట్విటర్లో షేర్ చేశారు. (సోనూసూద్ పుట్టినరోజు: 3 లక్షల ఉద్యోగాలు) పై లోకంలో ఉండే దేవుడిని తల్చుకునే బదులు కళ్ల ముందు కనిపిస్తున్న ఈ రియల్ హీరోను సాయం చేయమంటూ వేడుకున్నారు. ఈ వీడియో కాస్తా సోనూ దృష్టికి వచ్చింది. నో చెప్పడం ఇంటా వంటా లేని ఆయన వెంటనే ఆమెకు రాఖీ పండుగరోజు వరాన్ని ప్రసాదించారు. చెల్లెమ్మకు కొత్త ఇంటిని కానుకగా ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాఖీ పండుగకు ఇంతకు మించిన గిఫ్ట్ మరొకటి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. (కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం) -
అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంత లోకాలకు!
చిన్నంబావి/వీపనగండ్ల (వనపర్తి): ‘అన్నాచెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక రక్షాబంధన్.. అన్నయ్యా.. నువ్వే నాకు రక్ష..’ అంటూ ఆ చెల్లెలు రాఖీ కట్టింది. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెతో పాటు వరుసకు సోదరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిస్టేజీ సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన నందిని (14), వరుసకు అన్నయ్య అయిన దామోదర్ (16) తో కలిసి సోమవారం ఉదయం రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్దదగడకు బైక్‌పై వెళ్లారు. తమ బంధువు శంకరయ్య ఇంటికి వచ్చి వరుసకు ఆయన కుమారులు సోదరులు కావడంతో రాఖీ కట్టింది. సాయంత్రం తిరిగి శంకరయ్య కూతురు లక్ష్మితో కలిసి ముగ్గురూ తిరుగు ప్రయాణమయ్యారు. లక్ష్మీపల్లి స్టేజీ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, తూంకుంటకు చెందిన సుధాకర్, కురుమయ్య సొంత అన్నదమ్ములు. సుధాకర్ కూతురు నందిని, కురుమయ్య ఒక్కగానొక్క కుమారుడు దామోదర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూటీ, కారు ఢీకొన్న ఘటనలో యువతి.. దేవరకద్ర: స్కూటీని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువతి మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. నారాయణపేటకి చెందిన వడ్ల నాగరాణి(21), జాజాపూర్‌కు చెందిన సిద్దప్ప సోమవారం నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌కు స్కూటీపై బయల్దేరారు. చౌదర్పల్లి సమీపంలో అంతర్రాష్ట రహదారిపై మహబూబ్‌నగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీ కొట్టింది. దీంతో నాగరాణి అక్కడికక్కడే మృతి చెందగా సిద్దప్ప తీవ్రంగా గాయపడ్డాడు. -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
సాక్షి, అమరావతి: తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఎమన్నారంటే.. ► రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టాం. ► ఉదయం వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్ యునిలీవర్, ప్రోక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ► ఇంతకుముందు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. ► అర్హత పొందిన మహిళలకు నాలుగేళ్లపాటు తోడ్పాటు అందుతుంది. ► ఈ పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్థిరమైన ఆదాయం లభించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ► ఇందుకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం చేపడుతున్నాం.. ► 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. ► రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు. ► ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంది కాబట్టి దానివల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు. ► సైబర్, వైట్‌కాలర్ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు. ► ఏయే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు. ► నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు. దిశ యాప్, పోలీస్స్టేషన్లు.. ► దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు. ► ఇవికాక దిశ పోలీస్స్టేషన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు. ► 18 దిశ పోలీస్స్టేషన్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా పెట్టాం. ► దిశ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా చేయాల్సినవి చేశాం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. ► రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదు. ► ఇప్పటికే వారికి 50శాతం రిజర్వేషన్లు.. అమ్మ ఒడి, వసతి దీవెన ఇస్తున్నాం. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారి పేరు మీద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► హోంమంత్రి పదవి కూడా మహిళకు ఇచ్చాం. ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను పెట్టాం. ► మద్యాన్ని కూడా నియంత్రించాం. ► 4ఎస్4యూ పోర్టల్ ద్వారా కూడా వారికి మంచి జరుగుతుంది. ఇది మరో చరిత్రాత్మక ఘట్టం. హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే రజని, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు. -
రక్షా బంధన్
‘రక్షా బంధన్’ టైటిల్‌తో తాను హీరోగా నటించనున్న కొత్త చిత్రాన్ని రాఖీ సందర్భంగా సోమవారం ప్రకటించారు అక్షయ్ కుమార్. ‘తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అన్నాచెల్లెలి సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాను తన సోదరి అల్కాకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు అక్షయ్. ‘‘ఈ కథ అందరి హృదయాల్ని తాకుతుంది. కథ విన్నాక అతి తక్కువ సమయంలో నేను అంగీకరించిన చిత్రమిదే. ప్రపంచంలో ఉన్న విశిష్టమైన బంధమేదైనా ఉందంటే అది తోబుట్టువులదే’’ అని ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్. వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. -
పాఠకులు పంపిన రక్షా బంధన్ ఫొటోలు
-
రాఖీ: చెల్లెళ్లతో చిరంజీవి.. వీడియో వైరల్
రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బంధన్ సంబర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టి నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోగా, వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందంగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతే కాకుండా ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశారు. నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B — Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020 అలాగే హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత రాఖీ కట్టిన ఫోటోను ట్విటర్లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు తన కూతురు, కుమారుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని పేర్కొన్నారు. -
అన్న కోసం పోరాటం, మంత్రి కేటీఆర్ అభయం
సాక్షి, రాజన్నసిరిసిల్ల: అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అలాంటి రక్షా బంధన్ రోజున ఓ చెల్లెలు తన సోదరుడి ప్రాణాలు కాపాడండి అంటూ . మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వేములవాడ మండలం వావిలాలకు చెందిన కిడ్నీ పేషెంట్ పోచయ్య జ్వరంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది పోచయ్యను పటించుకోకపోవడంతో అతని సోదరి విలవిల్లాడారు. (చదవండి: సిఫారసు ఉంటేనే.. కరోనా పరీక్షలు!) రాఖీ పండుగ రోజు సిరిసిల్ల ఆసుపత్రికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసిన ఆమె తన అన్న ప్రాణాలు కాపాడండి అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. డాక్టర్లు బిజీగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న వైద్యం కోసం చెల్లెలు పోరాటానికి దిగిన ఘటనను స్థానికులు చూసి చలించిపోయారు. అయితే, మంత్రి కేటీఆర్ ఆసుపత్రి నుంచి తిరుగుప్రయాణం అవుతున్న సమయంలో బాధిత మహిళను పలకరించి, కిడ్నీ పేషంట్ పోచయ్యకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్‌ను ఆదేశించారు. కేటీఆర్ అన్నయ్య అభయంతో ఆ చెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు. (రాఖీ విషాదం, అన్నాచెల్లెలు మృతి) -
‘సీఎం జగన్ పాలన మహిళలకు స్వర్ణ యుగం’
సాక్షి, అమరావతి : మహిళల రక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ హోశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఆయన నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ-రక్షాబంధన్ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించామని, రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థినులకు సైబర్ నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మహిళల రక్షనకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు సైబర్ నేరాలపై ఎలా పిర్యాదు చేయాలో కూడా అవగాహన కల్పిస్తామని అన్నారు. దిశా చట్టం ద్వారా మహిళలపై అరాచకాలకు అడ్డుకట్ట వేస్తున్నామని, అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఒక అన్నగా అండగా నిలుస్తున్నారని మేకతోటి సుచరిత తెలిపారు. (‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్) రక్షా బందన్ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు మరిన్ని వరాలు ఇచ్చారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మహిళా పక్షపాత పాలన నడుస్తోందని, సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన మహిళల సంక్షేమానికి ఎన్నో చేశారని ప్రశంసించారు. ఆగస్ట్ 15న 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిగా దిశా చట్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని కొనియాడారు. వైఎస్సార్ చేయూత, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల సొంతమని, వారి రక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. దానిలో భాగంగా నేడు ఈ- రక్షాబంధన్ ప్రారంభించారన్నారు. వైఎస్ జగన్ పరిపాలన మహిళలకు స్వర్ణయుగం లాంటిదని. మద్యపాన నిషేధం దిశగా చేపడుతున్న ప్రభుత్వ చర్యలు మహిళల జీవన స్థితిని మారుస్తున్నాయని తెలిపారు. (శ్రీదేవి ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్) -
‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్
-
రాఖీ కట్టి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
సాక్షి, వనపర్తి: రాఖీ పండుగరోజు జిల్లాలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామం వద్ద విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సుఢీకొట్టిన ఘటనలో అన్నాచెల్లెలు మృత్యువాత పడ్డారు. మరో చెల్లెలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులు తూంకుంటకు చెందిన సుధాకర్, నందినిగా తెలిసింది. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పెద్దదగడకు వెళ్లి సోదరుడికి రాఖీకట్టి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. (మృత్యుపాశమైన బావి) -
‘సహనం, వాస్తవం నీ నుంచే నేర్చుకున్నాను’
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెల్లు.. తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. దానితో పాటు సోదరి ప్రియాంకతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన 40 నిమిషాల్లోనే దాదాపు 18 వేల లైక్‌లు వచ్చాయి. మరో వైపు ప్రియాంక గాంధీ కూడా రాఖీ సందర్భంగా సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. (ఉన్నాను నీకు తోడుగా) Wishing every one a happy #RakshaBandhan. आप सभी को रक्षाबंधन की शुभकामनाएँ। pic.twitter.com/EJZWPSGO2J — Rahul Gandhi (@RahulGandhi) August 3, 2020 ‘కష్ట, సుఖాల్లో నా సోదరుడితో కలిసి జీవించడం వల్ల నేను తన నుంచి నేను ప్రేమ, ఓర్పు, వాస్తవం వంటి వాటిని అవర్చుకున్నాను. నీ లాంటి సోదరుడు ఉన్నందుకు నేను గర్వ పడుతున్నాను. రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. దాంతో పాటు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. हर सुख-दुख में साथ रहते हुए मैंने अपने भाई से प्रेम, सत्य और धैर्य का साथ सीखा है। मुझे ऐसा भाई मिलने पर गर्व है। समस्त देशवासियों को पावन पर्व #रक्षाबंधन की हार्दिक शुभकामनाएं।#RakshaBandhan pic.twitter.com/KWTGpTZQYy — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 3, 2020 -
‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్‌కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. (4 నుంచి ‘సైబర్ సేఫ్’పై ఆన్లైన్ ద్వారా అవగాహన.. ) అదే విధంగా అక్కాచెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమ ప్రభుత్వం మహిళా సాధికారికతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించిన సీఎం జగన్.. అన్ని రంగాల్లో వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. సుమారు 30 లక్షలమంది మహిళల పేరుతో ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మద్య నిషేధంలో భాగంగా బెల్ట్ షాపులు పర్మిట్ రూంలను పూర్తిగా తొలగించామని, 33శాతం వైన్‌షాపులను తగ్గించామని తెలిపారు. కాగా ఈ- రక్షాబంధన్ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్‌కు రాఖీ కట్టారు.(అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం
సాక్షి, ముంబై: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. శ్వేతాసింగ్ కీర్తి రాఖీ పర్వదినం సందర్భంగా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు..నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు.(సుశాంత్ కేసు : మరో వివాదం) హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ...బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్...ఔర్ హమేషా కర్తే రహెంగే...యూ వర్..ఆర్..యూ విల్..అవర్ ప్రైడ్ అంటూ శ్వేతా సింగ్ కీర్తి రాశారు. సోషల్ మీడియా ద్వారా సుశాంత్ సోదరి శ్వేతాతోపాటు మరో సోదరి నీతూ సింగ్ కూడా సుశాంత్ పై ప్రేమను వ్యక్తం చేశారు. గుల్షన్, నా బేబీ ..రక్షా బంధన్ రోజు నువ్వు లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదు. నువ్వు శాశ్వతంగా దూరమైన రక్షా బంధన్ ఉంటుందని ఆలోచించలేదు. నువ్వు లేకుండా జీవించడం ఎలా నేర్చుకోవాలో నువ్వే చెప్పు అంటూ నీతూ సింగ్(రాణి దీ) పోస్ట్ చేశారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో) కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరికి వైలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నతరుణంలో రోజుకో కీలక పరిణామం వెలుగు చూస్తోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు ప్రియురాలు రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రియాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. Happy Rakshabandhan mera sweet sa baby... bahut pyaar karte hain hum aapko jaan... aur hamesha karte rahenge... you were, you are and you will always be our PRIDE! ❤️ @sushantsinghrajput #HappyRakshaBandhan pic.twitter.com/SKWU4MlLd9 — shweta singh kirti (@shwetasinghkirt) August 3, 2020 -
రాఖీ పండుగ.. మృత్యుపాశమైన బావి
కొణిజర్ల: అక్కా రాఖీ పండుగకు మా అమ్మ వాళ్లింటికి పోతున్నా, తొందరగా నాటు పూర్తి చేద్దాం, రాఖీ కట్టడానికి మీ ఇంటికి పోతున్నావా వదినా, కరోనా ఉంది జాగ్రత్త అంటూ అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుకున్న మహిళా కూలీలు అంతలోనే వ్యవసాయ బావి రూపంలో కానరాని లోకాలకు తరలిపోయారు. వ్యవసాయ బావిలో ప్రమాద వశాత్తు ఇద్దరు మహిళా కూలీలు పడి మృతి చెందిన విషాద సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్లకు చెందిన తద్దె నాగేశ్వరరావు అనే కౌలు రైతు పొలంలో నాటు వేసేందుకు 9 మంది మహిళలు వెళ్లారు, మధ్యాహ్నానికి నాటు పూర్తి చేసారు. భోజనం చేసి వేరే రైతుకు చెందిన పొలంలో నాటు వేయాలని నిర్ణయించుకుని పక్కనే ఉన్న షేక్ చిన సైదబాబు అనే రైతు వ్యవసాయ బావి వద్దకు కాళ్లు కడుక్కోవడానికి వెళ్లారు. 9 మంది కూలీలలో బండారు మల్లిక (30), తుప్పతి రమాదేవి (35), చింతల మమత, తద్దె నాగమణి, తద్దె మౌనికలు బావిలో ఉన్న మెట్లపై ఉండి కాళ్లు కడుకొంటున్నారు. ఈ క్రమంలో మెట్టు కూలడంతో ఐదుగురు ఒకేసారి బావిలో పడిపోయారు. వారు పడిపోవడం చూసిన ముఠామేస్త్రి చింతల యల్లమ్మ తన వద్ద ఉన్న చీర విసిరి మమత, నాగమణి, మల్లికలను బయటకు లాగింది. ఈ లోగా మల్లిక, రమాదేవి బావిలో మునిగి చనిపోయారు. మహిళల కేకలు విని సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరిగెత్తుకొచ్చారు. బావిలో నీరు నిండుగా ఉండటంతో మోటార్ల సాయంతో నీరు బయటకు వెళ్లదీసి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటి వరకు సంతోషంగా నాటు వేసిన తోటి మహిళలు అంతలోనే విగత జీవులుగా మారి పోవడంతో కూలీలు నిశ్చేష్టులయ్యారు. సంఘటనా స్థలంలో స్థానికుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన రమాదేవికి భర్త నరసింహారావు, కూతురు మౌనిక, కుమారుడు మధు ఉన్నారు. మల్లికకు భర్త భాస్కరరావు, ఇద్దరు చిన్నారి కూతుళ్లు జస్మిత, దివ్య ఉన్నారు. ఎస్ఐ మొగిలి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘యల్లమ్మ’ తల్లి కొణిజర్ల: తన కళ్ల ముందే ఐదుగురు తన తోటి మహిళలు బావిలో పడగా ముగ్గురిని కాపాడుకోగలిగాను.. మరో ఇద్దరు బావిలో మునిగి పోయారని ముఠా మేస్త్రి చింతల యల్లమ్మ వాపోయింది. బావిలోపడ్డ మహిళలను ధైర్యంగా తన చీరతో ముగ్గురిని బయటకు లాగిన యల్లమ్మను పలువురు దేవతగా కొనియాడారు. ఆమె మాటల్లోనే.. నాటు పూర్తి చేసుకుని కాళ్లు చేతులు కడుక్కొని అన్నం తినడానికి సిద్ధమయ్యాం.. బండారు మల్లిక, తుప్పతి రమాదేవి, చింతల మమత, తద్దె మౌనిక, తద్దె నాగమణి బావిలోకి దిగి మెట్టుమీద నిలుచుని ముఖం కడుక్కుంటున్నారు. ఒక్కసారిగా మెట్టు కూలి పోవడంతో ఐదుగురు బావిలో పడిపోయారు. వెంటనే నా చేతిలో ఉన్న కండువా విసరడంతో మౌనిక పట్టుకుని బయటకు వచ్చింది. తర్వాత నా చీర తీసి బావిలోకి విసిరాను దాని సాయంతో మమత, నాగమణిని బయటకు లాగ గలిగాను. అప్పటికే రమాదేవి, మల్లిక రెండు సార్లు పైకి తేలి మునిగి పోయారు. నాతో పాటు మరో ఇద్దరి చీరలు కలిపి బాలిలోకి విసిరినా వారు పట్టుకోలేక పోయారు. దీంతో కళ్ల ముందే బావిలో మునిగి పోయారు. మా పక్కనే ఉన్న పొలం యజమాని కుమారుడు బావిలోకి దూకి ప్రయత్నించినా నీళ్లు బాగా ఉండటంతో బయటకు తీయలేక పోయాడు. ముగ్గురిని ధైర్యంగా కాపాడిన యల్లమ్మను పలువురు ప్రశంశిస్తున్నారు.ధైర్యంగా చీరవేసి బయటకు లాగి కాపాడిన యల్లమ్మను పొలీసులు,స్థానికులు అభినందించారు. -
వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నగరంలోని వేమన మందిరం వద్ద వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలు గొల్లగాని లక్ష్మీ తన కుటుంబంతో కలిసి వైఎస్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రతియేటా వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆమె కొనసాగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలో ఎందరికో అన్నగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని ఈ సందర్భంగా లక్ష్మీ పేర్కొన్నారు. -
సీఎం జగన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు
-
అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు’’ అని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.(బాలలు, మహిళల భద్రతకు ‘రక్షా’బంధన్) The joyous festival of #RakshaBandhan celebrates the eternal bond of love between siblings. To protect one another has taken on a different meaning this year, amidst a pandemic, but the festive spirit remains the same. Greetings & lots of love to all my dear sisters across AP. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2020 -
ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు
భోపాల్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు వినూత్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3న రక్షా బంధన్ సందర్భంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె చేత రాఖీ కట్టించుకోవాలని ఆదేశించింది. అంతేగాక పండుగ సందర్భంగా సోదరికి అందజేసే కానుకల కింద రూ. 11 వేలు బహుమతిగా ఇవ్వాలని, ఆమె కొడుకుకు మరో రూ. 5 వేలు అందజేయాలని పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇవన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. (మైనర్ అంగీకారంతోనే జరిగి ఉంటుంది.. కాబట్టి) అదే విధంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, రసీదులు కోర్టుకు సమర్పించాలని, అయితే తదుపరి విచారణపై ఈ అంశాలు ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. కేవలం బెయిలు పొందేందుకు మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయని తెలిపింది. వివరాలు.. ఈ ఏడాది జూన్‌లో సదరు నిందితుడిపై లైంగిక ఆరోపణల కింద కేసు నమోదైంది. పొరుగింట్లో ప్రవేశించి మహిళపై అత్యాచార యత్నం చేసినట్లు ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు బెయిలు కోసం అర్థించగా జూలై 30న కేసును విచారించిన ఇండోర్ ధర్మాసనం రూ. 50 వేల పూచీకత్తు కింద బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. ‘‘నిందితుడు తన భార్యతో కలిసి ఆగష్టు 3, 2020న ఉదయం 11 గంటలకు బాధితురాలి ఇంటికి వెళ్లాలి. ఆమె చేత రాఖీ కట్టించుకోవాలి. తనకు అన్ని విధాలుగా రక్షగా ఉంటాననే హామీ ఇవ్వాలి. (ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు) ఈ సంప్రదాయం ప్రకారం సోదరీమణులకు సోదరులు ఇచ్చే కానుక కింద రూ. 11 వేలు ఇవ్వాలి. ఆమె కొడుకుకు దుస్తులు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు మరో రూ. 5 వేలు ఇవ్వాలి. ప్రాణాంతక వైరస్ విస్తరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం, పరిశుభ్రత, మాస్కు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’’అని జస్టిస్ రోహిత్ ఆర్య పేర్కొన్నారు. కాగా ఇటీవల గ్వాలియర్ బెంచ్ సైతం హత్యాయత్నం చేసిన ఓ వ్యక్తికి వింతైన షరతులతో బెయిలు మంజూరు చేసింది. గ్వాలియర్ జిల్లా ఆస్పత్రిలో చైనా వెలుపల తయారు చేసిన ఎల్ఈడీ టీవీని పెట్టించాలని ఆదేశించింది. -
లక్ష్మణుడు..అందరి ఆప్తుడు
సాక్షి,సిటీబ్యూరో: పెద్ద ఉమ్మడి కుటుంబం, ఎంత పని చేసినా సమయం చాలని వ్యాపార సమూహం, కాలక్షేపానికి బోలెడు మంది స్నేహితులు..అన్నీ ఉన్నా ఏదో వెళితి అతడిని వెంటాడింది..అన్ని పనులు చేస్తున్నా ఎక్కడో తెలియని అసంతృప్తి ఆయనలో మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో సమాజం నుంచి ఎప్పుడూ తీసుకోటమే కాదు, సమాజానికి మనమూ ఇవ్వాలన్న ఆలోచనతో బీఎల్ఆర్(బండారి లక్ష్మారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్) ఏర్పాటు చేశాడు. గత ఐదేళ్లుగా తన చుట్టూ ఉన్న వారు కన్నీళ్లు, కష్టాలు ఎదుర్కోకూడదన్న లక్ష్యంతో ప్రతి నెల ఐదు రోజులు పూర్తిగా స్వచ్చంద సేవకోసం కేటాయిస్తున్నారు బండారి లక్ష్మారెడ్డి. ఇబ్బందుల్లో ఉన్నవారు తన వద్దకు రావటం కంటే తానే చుట్టూ ఉన్న సమూహాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారి వద్దకే వెళ్లి ఓ తోబుట్టువులా స్నేహితుడిలా ఓదార్చి వారి జీవితాలు మళ్లీ గాడిన పడేందుకు అవసరమైన సహాయం చేస్తున్న తీరు అందరి మన్ననలు పొందుతోంది. ఎంప్లాయిమెంట్‌తో మొదలై: ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం, ఉపాధి వేటలో కుదేలైన వారి కోసం ఆయన ఐదేళ్ల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంప్లాయిమెంట్ గైడెన్స్ మేళాలు నిర్వహించారు. ఎంతోమంది నిరుద్యోగ యువతకు తన స్నేహితుల కంపెనీల్లో అవకాశాలిప్పించటంతో పాటు పలువురికి పోలీస్ ఉద్యోగాల కోసం రెండు నెలల పాటు ప్రత్యేక క్యాంప్‌నే నిర్వహించారు. ఇందులో తొమ్మిది మంది మెరిట్ జాబితాలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వారు కూడా ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు గైడెన్స్ ఇస్తుండటం విశేషం. ఆపత్కాలంలో అన్నీ తానై.. కోవిడ్ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో కార్మికులు, నిరుపేదలను ఆదుకునేందుకు బీఎల్ఆర్ ట్రస్ట్ అన్నీ తానై ముందుకు వచ్చింది. కరోనా నియంత్రణపై అవగాహన కల్పించడమేగాక, కార్మికులకు అవసరమైన పీపీఈ కిట్ల పంపిణీ, కాలనీల్లో రోజూ డిస్ఇన్ఫెక్షన్ మందుల పిచికారీ, వైరస్ బారిన పడిన వారికి పౌష్టికాహారం పంపిణీ చేస్తూ వారు కోలుకునేందుకు ట్రస్ట్ వలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇవే కాకుండా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి గత ఐదు నెలలుగా నిత్యావసర కిట్లను అందజేస్తున్నారు. ఈ విషయమై లక్ష్మారెడ్డిని కదిలిస్తే..’’అపదలో ఉన్న వారికి అండగా ఉండేందుకు తోబుట్టువులే అయి ఉండాల్సిన అవసరం లేదు.. అన్ని మార్గాలు మూసుకుపోయిన వారికి కొత్తదారిని చూపేందుకు స్నేహితుడే కావాల్సిన అవసరం లేదు. నా కిచ్చిన శక్తిని సమాజంలో మంచి కోసం ఉపయోగిస్తున్నా..అందులో గొప్పేం లేదు’’ అని పేర్కొన్నారు. -
నేనైతే గిఫ్ట్ కోసం కట్టను..
‘అక్కినేని నాగార్జున.. పరిచయం అక్కర్లేని స్టార్ హీరో.. అమ్మాయిలకు మన్మథుడు, గ్రీకు వీరుడు.. ఇండస్ట్రీకి యువసమ్రాట్.. ఫ్యాన్స్‌కు ముద్దుపేరు నాగ్, స్మార్ట్ స్టార్, టెరాస్టార్, కింగ్.. సోదరి నాగసుశీలకు మాత్రం ‘చినాబు’..అందరికంటే చిన్నవాడు, గారాల తమ్ముడు, అల్లరి పిల్లాడు కాబట్టి చిన్నప్పటి నుంచి నాగార్జునను చినాబు అని పిలుస్తుంటుంది.. నాగార్జున టాలీవుడ్లో ఎంతటి స్టార్ అయినా నాగసుశీలకు మాత్రం గారాల తమ్ముడే. ఆమె ముద్దుగా చినాబు అని పిలుస్తుంది. ‘అక్కినేని నాగార్జున.. పరిచయం అక్కర్లేని స్టార్ హీరో.. తన అక్క నాగసుశీల ఆయన్ని ‘చినాబు’ అని పిలుస్తుందంట. అందరికంటే చిన్నవాడు గారాల తమ్ముడు, అల్లరి పిల్లాడు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను నాగ్ తమ్ముడిని ‘చినాబు’ అని పిలుస్తానంటూ ‘సాక్షి’కి వివరించారు. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో మాత్రం ఆయన నంబర్ని ‘నాగ్’ అనే పేరుతోనే సేవ్ చేసుకున్నారంట. రాఖీ పౌర్ణమి సందర్భంగా ‘సాక్షి’ నాగసుశీలని పలకరించగా.. హీరో నాగార్జున సుశీల మధ్య అనుబంధం, ఆయన ఏ విధంగా సుశీలని పిలుస్తారు, ప్రతి రాఖీకి ఏం చేస్తారు? అనే కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆ విషయాలను ఆమె మాటల్లోనే...! రాఖీ ద్వారా నా ప్రేమను చూపిస్తుంటా.. ప్రతి సంవత్సరం తమ్ముడు ‘చినాబు’ ఎక్కడున్నా సరే వెళ్లి మరీ రాఖీ కడతా.. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య జరిగే సరదా సంభాషణలు పొట్టచెక్కలయ్యేలా ఉంటాయి. నేను రాఖీ కట్టి శుభాకాంక్షలు చెబుతాను. ‘చినాబు’ కూడా ఏదో ఒక గిఫ్ట్‌తో నన్ను సర్ప్రైజ్ చేస్తుంటాడు. నేనైతే గిఫ్ట్ కోసం కట్టను, నా తమ్ముడిపై నాకున్న వల్లమాలిన అభిమానం, ప్రేమను ఆరోజు మరింతగా వ్యక్తపరుస్తా.. తమ్ముడు గిఫ్ట్ ఇచ్చి నా మీద అతడికి ఉన్న ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తుంటాడు. (ప్యాకెట్ మనీతో వాళ్లు రాఖీ కొనేవారు..) ప్రతి సండే ఇష్టమైన మెనూ.. నా వివాహం అయ్యాక కొంతకాలం నేను యూఎస్ లో ఉన్నాను. ఆ సమయంలో చినాబు కూడా అక్కడ మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. మా మధ్య సాన్నిహిత్యం, స్నేహం, బాండింగ్ అప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యింది. సండే వస్తుందంటే చాలు రెండు రోజుల ముందే కావాల్సిన వంటకాల మెనూ అంతా చెప్పేవాడు. నేను ఇంటికి వచ్చే సరికి ఇవన్నీ నాకోసం చేసిపెట్టాలనేవాడు. మెనూ నోట్ చేసుకున్నాక ఆ తయారీలో నేను నిమగ్నమయ్యేదాన్ని. సండే చినాబు ఇంటికి రాగానే ఆ మెనూ వంటకాలతో సర్ప్రైజ్ చేసేదాన్ని. వారం రోజుల పాటు వేసుకున్న దుస్తులన్నీ తెచ్చి నా ముందు పడేసేవాడు(నవ్వుతూ).. మరుసటి రోజు వెళ్లేసరికి వాటన్నింటిని ఉతికి ఇస్త్రీ చేసి రెడీ చేసి ఇచ్చేదాన్ని నా ముద్దుల తమ్ముడికి(నవ్వుతూ).. నాగ్.. నా ‘చినాబు’ మా తోబుట్టువుల్లో అందరి కంటే చిన్నవాడు, గారాల తమ్ముడు, అల్లరి పిల్లోడు నాగార్జున. చిన్నప్పటి నుంచి నాగ్‌ను ఆప్యాయంగా ‘చినాబు’ అని పిలవడం అలవాటయ్యింది. ప్రతి సంవత్సరం తమ్ముడు ఎక్కడున్నా సరే వెళ్లి మరీ రాఖీ కడతాను. వాడిపై నాకున్న అభిమానం, ప్రేమను ఈ రోజు మరింత ఎక్కువగా వ్యక్తపరుస్తా. నాతో ఎంత సరదాగా ఉంటాడో.. నా విషయంలో అంతే కేర్ తీసుకుంటాడు. ప్రపంచంలోనే నా తమ్ముడంతా కేరింగ్ పర్సన్ ఇంకొక్కరు ఉండరని చెప్పడానికి నేను గర్వంగా ఫీలవుతుంటా. ప్రస్తుతం ‘కరోనా’ నేపథ్యంలో మా ఫ్యామిలీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాట్సాప్‌లో ప్రతిరోజూ పోస్ట్ చేస్తుంటాడు చినాబు. మరో జన్మలోనూ నాగ్‌కు అక్కగానే పుట్టాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా. – నాగసుశీల, హీరో నాగార్జున సోదరి కేరింగ్ బ్రదర్.. నాగార్జున పెద్ద స్టార్.. బిజీ బిజీ లైఫ్. కానీ.. ఫ్యామిలీకి నా తమ్ముడు కేటాయించే సమయం మా అందర్నీ ఎంతో సంతోషపరుస్తుంటుంది. కాల్ చేసి ‘సుషీల.. సుషీలమ్మ.. అంటూ పిలుస్తూ ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్..? ఎవ్రీతింగ్ ఈజ్ ఓకేనా? ఇబ్బందేమీ లేదు కదా? ఏమున్నా ఒక్క కాల్ చేయ్..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడతాడు. ఒక అక్కగా నా తమ్ముడి నుంచి ఇంతకన్నా నాకేం కావాలి? ఎంత సరదాగా ఉంటాడో.. అంతే కేర్ తీసుకుంటాడు నా విషయంలో.. ప్రపంచంలోనే నా తమ్ముడంత కేరింగ్ పర్సన్ ఇంకొక్కరూ ఉండరని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. -
చిన్నప్పుడు రిక్షా రైడ్స్ చేసి పందెం..
నేను ఉన్నా లేకున్నా.. అక్కా, చెల్లిని నువ్వు కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్లకు అన్ని విషయాల్లో నువ్వు అండగా నిలవాలి. వాళ్లను ప్రయోజకుల్ని చేయాలి. వారికి భరోసా ఇవ్వాలంటూ చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు మదిలో నాటుకుపోయాయంటూ గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటుడు, ప్రజల గుండెల్లో హీరో సోనూసూద్.. అక్క మౌనిక, చెల్లి మాళవిక(గున్నూ)లు నా రెండు కళ్లు.. రక్షా బంధన్ వస్తుందంటే మా ముగ్గురిలో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.. ముగ్గురం ఎంతో సంతోషంగా గడుపుతాం..’ అంటూ పలు విషయాలను ‘సాక్షి’తో ముచ్చటించారాయన.. విలన్ పాత్రలతో వావ్ అనిపిస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్.. లాక్డౌన్ సమయంలో ఎన్నో సేవలు అందించి ప్రజల గుండెల్లో హీరో అయ్యారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మార్మోగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయనపై ఎంతో అభిమానం పెంచుకున్నారు. ప్రతి రక్షాబంధన్ సమయంలో తాను మాత్రం అక్క మౌనిక, చెల్లి మాళవికతోనే ఉంటారు.. అక్కా, చెల్లీ ఇద్దరూ ఆయనకు రెండు కళ్లు.. రక్షా బంధన్ సందర్భంగా బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను ‘సాక్షి’ పలకరించింది.. ఈ సందర్భంగా వారు తమ మనసులోని భావాలను వ్యక్తపరిచారు.. అక్కాచెల్లెలు.. నా రెండు కళ్లు రాఖీ పండగ వస్తుందంటే చాలు ఎక్కడ లేని ఆనందం. అక్క మౌనిక, చెల్లి మాళవిక (గున్నూ) నాకు రక్షాబంధన్ కడతారు. వీళ్లిద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు. ‘నేను ఉన్నా లేకున్నా అక్కను, చెల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలి’ అని అమ్మ చెప్పిన మాటలు నా మదిలో నాటుకుపోయాయి. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. వాళ్ల మనసుల్ని అర్థం చేసుకుంటాను. ప్రస్తుత కరోనా పరిస్థితులో దేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులందరికీ నేను ఒక పెద్దన్నను కావడం నాకెంతో సంతృప్తినిస్తోంది. ఈ రాఖీ పండగ రోజున అక్కను, చెల్లిని ప్రత్యేకంగా సర్ప్రైజ్ చేయాలని డిసైడయ్యాను. ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా అందరికీ చెబుతా. – సోనూసూద్, బాలీవుడ్ నటుడు ఆ ఇద్దరికీ నేను రక్షకుడిని అక్క అంటే గౌరవం, ప్రేమ.. చెల్లి గున్నూ అంటే పంచ ప్రాణాలు.. చిన్నప్పటి నుంచి వారికేదైనా చిన్న సమస్య ఎదురైనా నేను ఆ సమస్యకు ఎదురు నిలబడేవాడ్ని. ఇద్దరూ ప్రతి ఒక్కటీ నాతో షేర్ చేసుకునేవాళ్లు. ఆ ఇద్దరికీ నేను రక్షకుడినే కాదు.. ఆ ఇద్దరూ నాకు రెండు కళ్లు.. పంజాబ్ టూ ముంబై.. చెల్లి నేనూ ఒకేచోట ఉండేవాళ్లం.. ప్రతి రక్షా బంధన్‌కు అక్క మౌనిక నేను ముంబైలో ఉంటే తను పంజాబ్ నుంచి వచ్చేది.. ఇలా నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టి నన్ను సర్ప్రైజ్ చేసేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలుగా ప్రతి రాఖీకి పంజాబ్ టూ ముంబై ట్రావల్ చేస్తూ.. నన్ను సర్ప్రైజ్ చేసేది. -
సోదర భావాన్ని పెంపొందించే పండుగ రక్షా బంధన్
సాక్షి,అమరావతి: రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని ప్రతిబింబించే పండుగని పేర్కొన్నారు. మహిళలను రక్షించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించడం, వారి సంక్షేమం కోరుకోవడమే ఈ పండుగ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు రద్దు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్లో సోమవారం జరగాల్సిన రక్షా బంధన్ వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రేపు జరగాల్సిన వేడుకలను రాజ్ భవన్ రద్దు చేసింది. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్ మాస్కులు ధరించి, జాగ్రత్తలతో ఇంటి వద్దే పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సబ్బు లేదా శానిటైజర్లతో చేతులు శుభ్రపరుచుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. (చదవండి : నూలు వెచ్చని రక్షాబంధం) -
మానవతకు ఇది రక్షాబంధన్!
సందర్భం భారతీయులు నిర్వహించుకునే పండుగల్లో పౌరాణిక, చారిత్రక నేపథ్యం కలిగిన పండుగ రక్షాబంధన్. రాక్షస సంహారానికి సన్నద్ధుడైన దేవేంద్రునికి శచీదేవి రక్ష కట్టి విజయ ప్రాప్తికోసం ప్రార్థిం చిందని పౌరాణిక గాథ. కాలక్రమంలో స్త్రీ పురుషుల మధ్య అన్నా చెల్లెళ్ల అనురాగాన్ని, భరతమాత సంతానమైన మనం అందరం అన్నదమ్ములమనే సహోదర భావాన్ని సమాజం అంతటికీ అలవర్చే సంస్కారమే రక్షాబంధన్ పండుగ అయింది. కొన్ని ప్రాంతాలకు కుటుంబాలకు పరిమితమై కొందరి వేడుకగా సాగుతున్న రక్షాబంధన్‌ని ఇవాళ సర్వే సర్వత్రా సామాజిక ఉత్సవంగా జరపాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్త్రీలకు గౌరవ మర్యాదలు లభించే తావుల్లో దేవతలు సంతసిస్తారు అని చాటి చెప్పిన వేదభూమి మనది. పౌరాణికంగా, చారిత్రకంగా, రాజకీయంగా మహిళలకు సమున్నత స్థానం కల్పించడం భారతీయ సంస్కృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అని మహిళకు ప్రథమ స్థానం కల్పించిన పౌరాణిక నేపథ్యం మనది. రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ వంటి మహిళాపాలకులు మన దేశ చరిత్రలో కనిపిస్తారు. జనరంజకమైన పాలనతో వారు ప్రజల మన్నన చూరగొన్నారు. ఆధునిక రాజకీయాల్లో సైతం భారతీయ మహిళకు సముచిత స్థానమే దక్కింది. భారత్ స్వతంత్ర దేశంగా అవతరిస్తూ, ప్రజాస్వామిక వ్యవస్థను స్వీకరించిన మరుక్షణమే ఎలాంటి శషభిషలు లేకుండా సార్వజనిక ఓటు హక్కుతో మహిళలకు కూడా సమాన స్థాయి కల్పిం చడం చరిత్ర. ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే ప్రతిభావంతులైన మహిళలు జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో రాజకీయ పదవులు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి మహిళా లోకానికి వన్నెతేవడం భారతీయతకు గర్వకారణం. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించి పాలన వ్యవస్థలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ప్రయత్నాన్ని అందరూ స్వాగతించడం హర్షణీయం. వర్తకం, వాణిజ్యం, వ్యవసాయం, పరిశోధన, విద్యా, వైద్య రంగాల నుండి రక్షణ రంగందాకా భారతీయ మహిళలు ప్రవేశించి తమ సత్తా చాటని రంగమే లేదనడం అతిశయోక్తికాదు. గర్వించదగిన ఇంతటి ఘన చరిత్ర గలిగిన భరత భూమిలో నేడు మహిళల ప్రాణ, మాన, మర్యాదలు ప్రమాదంలో పడడం విషాదం. తమ మానప్రాణాలకు రక్షణ కరువైందని ఘోషిస్తున్న మహిళల ఆక్రందన మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నది. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వాలు తగిన చట్టాలు చేస్తున్నాయి. ‘దిశ’ వంటి చట్టాలు, ప్రత్యేక మహిళా పోలీసు స్టేషన్లు, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు జరుగుతోంది. ప్రభుత్వాల ప్రయత్నాలు, ప్రత్యేక చట్టాలు ముమ్మరం అవుతున్నా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గు ముఖం పట్టకపోవడం విషాదం. మన సోదరీమణులకు భద్రత కల్పించవలసిన బాధ్యతను మనమే స్వీకరించాలి. ప్రతి పురుషుడూ మరో మహిళ చేతికి రక్ష కట్టి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాలి. చీమలో, బ్రహ్మలో శివ కేశవులలో వెలిగే పరబ్రహ్మ ఒకటే అని ఎలుగెత్తి చాటిన సంస్కృతి మనది. సర్వధర్మ సమభావన వెల్లి విరియాల్సిన దేశంలో కుల వివక్ష, అంటరానితనం వేళ్లూను కోవడం విషాదం. రక్షాబంధన్ సందర్భంగా కట్టే రక్ష అన్నిరకాల వివక్షను అంతమొందించే వజ్రాయుధం కావాలి. రాత్రనక, పగలనక, ఎండ వానలను సైతం లెక్క చేయక దేశ సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తూ విదేశీ దురాక్రమణకారుల ప్రయత్నాలను తిప్పి కొడుతున్న మన వీర జవానులకు రక్షా బంధన్ జేజేలు తెలుపుదాం. వారికి రక్షలు పంపించి వీరులారా దేశం అంతా మీ వెనక ఉందని మద్దతు తెల్పుదాం. 1994లో నేను లోక్‌సభ సభ్యునిగా ఉన్నప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విముక్తం చేస్తామంటూ నాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో భారత పార్లమెంటు ముందుకు వచ్చిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆనందోత్సాహాలతో ఆ సందర్భంగా తెల్పిన మా మద్దతుకు సంకేతంగా చరిచిన బల్లల చప్పుడు నా చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతోంది. చరిత్రాత్మకమైన ఆ తీర్మానం నేటికీ కాగితాలమీదనే ఉంది. తీర్మానసారాన్ని సాకారం చేయడానికి నేటి మన ప్రియతమ ప్రధాని మోదీ సాగిస్తున్న ప్రయత్నాలను స్వాగతిద్దాం. భారత దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాల కోసం భారత జాతీయులమైన మనం అన్న దమ్ముల్లా కలిసి కట్టుగా కృషి చేయాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞాపూర్వకంగా పరస్పరం మనం అందరం రక్షలు కట్టుకుందాం. ప్రపంచం అంతటా కరోనా ప్రబలిన వేళ భారతీయ సంస్కారమైన నమస్కారం విలువను ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నది. ఔషధగుణాలున్న శొంఠి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి భారతీయ వంటింటి దినుసుల సాయంతో పలువురు కరోనాను ఓడించినట్లు తెలుస్తున్న అనుభవాలతో భారతీయ ఆహారపు అలవాట్ల పట్ల ప్రపంచ ప్రజ లకు ఆసక్తి పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే దివ్య ఔషధంగా భారతీయ యోగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఎదుట ప్రస్తావించి భారతీయ యోగాను ప్రపంచ దేశాలకు చేర్చిన మన ప్రధాని మోదీని ప్రపంచ దేశాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరోనా విపత్తు నుండి దేశ ప్రజ లను రక్షించడానికి కఠోర దీక్షతో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసు వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి మన మద్దతు ప్రకటిద్దాం. ప్రభుత్వాల, వైద్యఆరోగ్య అధికారుల సూచనల ప్రకారం పరిశుభ్రతను పాటిస్తూ, మాస్కులు ధరిం చడం, సార్వజనిక స్థలాల్లో ఎడం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించి కరోనాను ఓడిద్దాం. ఈ శ్రావణ పూర్ణిమ సందర్భంగా వచ్చే రక్షాబంధన్‌ను సామాజిక ప్రజాఉత్సవంగా నిర్వహించుకుందాం. వివక్షను అంతం చేసి మానవతా విలువల పరిరక్షణకు ముందు నిలిచి ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయం అవుదాం. భారతదేశంలో మహిళా భద్రతకు భరోసా కల్పిద్దాం. మాతృభూమి రక్షణలో, భారతీయ సంస్కృతి పరిరక్షణలో మనం అంతా ఏకాత్మ భావనతో ఒక్కటిగా నిలబడి నినదిద్దాం! (రేపు రక్షాబంధన్ సందర్భంగా) వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ప్రదేశ్ బండారు దత్తాత్రేయ -
నూలు వెచ్చని రక్షాబంధం
భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. అంతటి శక్తి గల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ రక్షాబంధన సంప్రదాయాన్ని ఏర్పరిచారు. చారిత్రకంగా, ఐతిహాసికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణ సంప్రదాయం ప్రకారం రక్షాబంధన దినోత్సవం నాడు సోదరులకు తోబుట్టువులు రక్షాబంధనం కడితే విశాల దృక్పథంతో గ్రామ ప్రజలందరి హితాన్ని కోరుతూ పురోహితుడు ప్రజలందరికీ రక్షాబంధనం కట్టడం కూడా గమనించవచ్చు. అంతేకాదు, యుద్ధ సమయాలలో సైనికులు దేశ రక్షణకు ముందుకు నడుస్తున్నప్పుడు, సరిహద్దు ప్రాంతాలలోని యువతులు, వృద్ధులు, బాలికలు సైనికులందరికీ రక్షాబంధనం కట్టి తిలకం దిద్ది, మంగళహారతులతో సాగనంపడం రివాజు. రక్షాబంధన మంత్రం యేనబద్ధో బలీరాజా దానవేంద్రోమహాబలః తేనత్వామభి బధ్నామి రక్షమాచల మాచల ‘బలాధికుడు, దానశీలుడు అయిన రాక్షసరాజు బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతున్నాను. నీ చేతిని అంటి పెట్టుకుని ఉండే ఈ రక్షాకవచ ప్రభావం వల్ల దేవతలందరూ నీ పక్షాన నిలచి ఏ ప్రమాదమూ జరగకుండా నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను’ అని ఈ మంత్రానికి అర్థం. రక్షాబంధన పండుగ పరమార్థం ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే– ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలని. ఎంత ఖరీదైన రాఖీ అయినా కట్టుకోవచ్చు కానీ నూలు పోగుది మంచిది. జంధ్యాల పూర్ణిమ దైవీశక్తులతో కూడిన శ్రావణ పూర్ణిమనాడు చేసే దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం సత్ఫలితాలనిస్తాయి. దక్షిణ భారతదేశంలో శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు న దులలో, చెరువులలో లేదా కాలువ స్నానం– అదీ కుదరని పక్షంలో ఇంటి వద్దనయినా స్నానం చేసి జీర్ణ (పాత)యజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మ (ముంజవిడుపు) జరిపిస్తారు. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరు ఈ రోజున జంధ్యం మార్చుకోవడం ఆచారం గనుక దీనిని జంధ్యాల పూర్ణిమగా పేర్కొంటారు. హయగ్రీవజయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు ‘జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని, జ్ఞానం వికసిస్తుందనీ ప్రతీతి. – డి.వి.ఆర్ (సోమవారం శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన దినోత్సవం) -
మోదీకి రాఖీ పంపిన పాకిస్తాన్ మహిళ!
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో రక్షబంధన్ రాబోతుంది. ప్రతి సోదరి తమ సోదరులకు రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ పంపుతున్న పాకిస్తాన్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈసారి కూడా రాఖీ పంపారు. మోదీ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు కమర్ తెలిపారు. మోదీని తనతోపాటు తన భర్త మొహిసిన్, కుమారుడు సుఫీయాన్ కూడా అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు. గత 25 ఏళ్ల నుంచి మోదీకి రాఖీ కడుతున్నానని అప్పుడు మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని తెలిపారు. తన పట్టుదల, శ్రమతో మోదీ ప్రధానమంత్రి వరకు ఎదిగారని ప్రశంసించారు. మోదీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని కమర్ చెప్పుకొచ్చారు. చాలా సార్లు మోదీ, కమర్‌కు ఫోన్ చేసి రాఖీ కట్టించుకోవడానికి పిలిచారు. కమర్ భర్త, కొడుకు గురించి అడిగి తెలుసుకునే వారు. మోదీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కమర్ కొనియాడారు. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన కమర్ మొహిసిన్ భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వారు అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. రాఖీ కట్టినందుకు ప్రధాని నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడగ్గా ఆయన ఆశీర్వదం మాత్రం చాలని, తన ప్రతి విజయం వెనుక మోదీ ఉన్నారని పేర్కొన్నారు. చదవండి: దైవ దూషణ: కోర్టులో ముస్లిం హత్య -
సెల్ఫ్ హెల్ప్ రక్షాబంధన్
డాక్టర్లు కొంతవరకే రక్షించగలరు. ఉద్యోగమైతే ఎంతవరకో తెలీదు. ఊపిర్లను తీసుకెళుతోంది కరోనా. సోషల్ డిస్టెన్స్... సెల్ఫ్ హెల్ప్... ఈ రెండే రక్షాబంధన్‌లు ఇప్పుడు. దూరదూరంగా ఉంటేనే బతుకు. కొత్తగా ఏదైనా చేస్తేనే.. మెతుకు. ‘సీడ్ రాఖీ’.. సరికొత్త ఆలోచన! గ్రామాల్లో నాలుగు రూపాయలు వచ్చే అన్ని పనుల్నీ కరోనా బంద్ చేసేసింది. నీళ్ల ట్యాప్నే కట్టేస్తే ట్యాంకర్లో ఎన్ని నీళ్లుండి ఏం లాభం? పని చెయ్యగలవారూ, పని ఇవ్వగలవారూ ఇద్దరూ ఒకటే అయ్యారు. అర్థికవేత్తలే అచేతనులై చూస్తుంటే.. రక్షాబంధన్ కట్టేవారెవరు?! చేతితో పది నోటు ఉండటం పెద్ద సంపన్నతైంది ఊళ్లలో. ఈ చేత్తో కష్టపడి ఆ చేత్తో కష్టార్జితాన్ని తీసుకుంటున్న ‘సెల్ఫ్‌హెల్ప్’ గ్రూపులే ఇప్పుడు ప్రతి ఊళ్లోనూ బహుళజాతి కంపెనీలు. ఛత్తీస్‌గఢ్, ధంతరి జిల్లాలోని చిప్లీ గ్రామంలో వెలసిన ‘కంపెనీ’ కూడా ఇటువంటిదే. స్థానికంగా ఉండే రెండు వందల మంది మహిళలు రాబోయే రాఖీ పండుగను తమ తాత్కాలిక ఉపాధిగా ఏర్పచుకున్నారు. గోమయంతో (ఆవు పేడ) సీడ్ రాఖీలు తయారు చేసి, మార్కెటింగ్‌కి సిద్ధం చేస్తున్నారు. మిగిలి వున్న వ్యవధి ఇరవై రోజులే. ఆగస్టు 3న రాఖీ. గోమయం, విత్తనాలు, పల్చటి వెదురు రేకులు.. ఇవీ వీళ్ల ముడిసరుకులు. సగం మంది.. ముందుగా సిద్ధం చేసి ఉంచిన మూసల్లో గోమయాన్ని, విత్తనాలను కలిపి వృత్తాలుగా, చతురస్రాలుగా, నక్షత్రాలుగా అచ్చుల్ని తీసి ఎండబెడతారు. తర్వాత మిగతా సగంమంది ఆ అచ్చులకు రంగులు అద్ది, పైన మోటిఫ్‌లను (డిజైన్ బిళ్లలు) గుచ్చి, అడుగున నునుపుపైన వెదురు రేకుల్ని అమర్చుతారు. వారిలోనే ఇంకో టీమ్ వీటికి మందపాటి దారాలను, సన్నటి రిబ్బన్లను కట్టడంతో రాఖీలకు పూర్తి ఆకృతి వచ్చేస్తుంది. అయితే ముడిసరుకులు దొరికినంత తేలిక కాదు, కళాత్మకంగా ఆ రాఖీలను తీర్చిదిద్దడం. ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యాన్ని ‘ధంతరి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’, ‘ఆర్య ప్రేరణ సమితి’ కలిసి చిప్లీ గ్రామ స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణగా అందిస్తున్నాయి. జిల్లా పంచాయితీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నమ్రతా గాంధీ సహకారం కూడా వారికి ఉంది. సీడ్ రాఖీ అనేది కొత్త కాన్సెప్టు. ఇప్పటికే వాడుకలో ఉన్న ‘సీడ్ బాల్స్’ను ప్రేరణగా తీసుకుని చిప్లీ మహిళలు సీడ్ రాఖీలను తయారు చేస్తున్నారు. పండగ అయిపోయాక వాటిని ఏ గూట్లోనో, అరల్లోనో పెట్టేయకుండా.. పొలాల్లోకి విసిరితే గోమయం ఎరువుగా శక్తిని ఇచ్చి, అందులో ఉంచిన విత్తనాలు మొక్కలుగా ఎదుగుతాయి. పచ్చదనానికి రాఖీ కట్టడం ఇది! ఈ ఆలోచన మొదట ఆర్య ప్రేరణ సమితిలోని దుర్గేష్ నందిని, మంజూ చక్రవర్తిలకు వచ్చింది. రూరల్ మిషన్ వారికి నచ్చింది. ఈసారి రాఖీల తయారీలో వీళ్ల థీమ్ వైద్యులు, సైనికులు, పారిశుద్ధ్య కార్మికులు. ఆ యోధుల సేవలకు ధన్యవాదాలు అర్పించేలా.. జాతీయ జెండాలోని మూడు రంగులను, రెడ్ క్రాస్ గుర్తును, స్వచ్ఛభారత్ లోని కళ్లద్దాలను మోటిఫ్‌లుగా రాఖీలపై పొదుగుతున్నారు. పెయింట్ చేస్తున్నారు. రాఖీల ప్యాకింగ్‌కి హోమ్మేడ్ పేపర్ బ్యాగులను, గుడ్డ సంచులను కూడా వాళ్లే తయారు చేస్తున్నారు. ఒక్కో రాఖీ 40 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. రూరల్ మిషన్ వాళ్లే అమ్మిపెడతారు. సీజన్ పూర్తయ్యే లోపు టార్గెట్‌ను చేరుకుంటే ఒక్కో మహిⶠచేతిలో కనీసం పది వేల రూపాయలైనా ఉంటాయని ప్రేరణ సమితి అంచనా. వాస్తవానికి ఏప్రిల్ నుంచే వీళ్లు సీడ్ రాఖీలు చెయ్యడం మొదలు పెట్టారు కాబట్టి తేలిగ్గానే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇప్పటికిప్పుడు కావాలన్నా 15 వేల రాఖీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. లాక్డౌన్ ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుని దూరదూరంగా మల్టీ యూనిట్లు ఏర్పాటు చేయడంతో వాళ్ల పనికి అంతరాయం ఏర్పడలేదు. ఇక మార్కెటింగ్‌కి సమస్యే లేదు. ఇప్పటికే అనేక ఎన్జీఓలు ఆ పనిని షాపింగ్ బ్యాగుల్లా రెండు చేతుల్లోకీ తీసుకున్నాయి. రాఖీ అయ్యాక మళ్లీ ఒక కొత్త థీమ్‌తో వస్తారట. అంతే కదా. కొత్త ఆలోచనను మించిన రక్షాబంధన్ ఏముంటుంది ఏ ఉపాధికైనా. ఆవుపేడ రాఖీల తయారీలో చిప్లీ గ్రామ మహిళలు -
‘నా ఏంజిల్, రక్షకురాలు తనే’
దేశ వ్యాప్తంగా ప్రజలు నిన్న సంతోషంగా రక్షా బంధన్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు తమ అన్నదమ్ములతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలతో పాటు ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో హీరో రణ్వీర్ సింగ్ షేర్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నా బెస్ట్‌ఫ్రెండ్, నా రక్షకురాలు, నా ఏంజిల్’ అంటూ సోదరితో కలిసి చిన్నతనంలో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రణ్వీర్ సింగ్. ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలల్లో లైక్‌లు, కామెంట్లు అందుకుంది. ఇకపోతే రక్షా బంధన్ సందర్భంగా హీరోయిన్ అలియా భట్.. కరణ్‌జోహర్ కుమారుడు యష్‌కు రాఖీ కట్టారు. ఈ ఫోటోలు కూడా అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణ్వీర్ సింగ్ 83తో బిజీగా ఉండగా.. అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’తో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram Just too much love.. ❤️ A post shared by Alia 🌸 (@aliaabhatt) on Aug 15, 2019 at 7:45am PDT -
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్ : రాఖీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన సోదరి వైఎస్ షర్మిల రాఖీ కట్టారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ తన సోదరికి స్వీటు తినిపించారు. ఇక, ఇవాళ రాత్రికి సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లనున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్ ఇదివరకే శుభాకాంక్షలు తెలియజేశారు. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. #RakshaBandhan pic.twitter.com/TXRB8qPH1G — YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2019 -
అన్నయ్య తప్ప ఎవరూ ఈ సాహసం చేయలేరు..
న్యూఢిల్లీ : ముస్లిం మహిళా హక్కులను కాపాడేందుకై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ చూపారని ఆయన ‘రాఖీ చెల్లెలు’ ఖమర్ మోహిసిన్ షేక్ అన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో తన అన్నయ్య మోదీ తప్ప మరెవరూ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేరని ప్రశంసించారు. గురువారం రక్షా బంధన్ సందర్భంగా నరేంద్ర మోదీకి రాఖీ కట్టేందుకు ఆమె ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖమర్ మాట్లాడుతూ...‘ ప్రతీ యేడు అన్నయ్యకు రాఖీ కట్టే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న ఐదేళ్లలో ఆయన ప్రపంచం గుర్తించే మరెన్నో గొప్ప, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నా. తక్షణ ముమ్మారు తలాక్ గురించి ఖురాన్, ఇస్లాంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ట్రిపుల్ తలాక్ విషయంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం హర్షించదగినది’ అని పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ జాతీయురాలైన ఖమర్ పెళ్లి తర్వాత భారత్‌కు వచ్చేశారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్ననాటి నుంచి ఆయనకు ఖమర్ రాఖీ కడుతున్నారు. గత 20 ఏళ్లుగా ఈ ఆనవాయితీ క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. ఇక ఈరోజు కూడా ఆమె తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లారు. అదే విధంగా తన భర్త వేసిన పెయింట్‌ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చారు. -
రక్షాబంధన్: భార్య కూడా భర్తకు రక్ష కట్టవచ్చు!
రక్తసంబంధం ఉన్నా లేకున్నా...అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని పంచేది రాఖీ. అయితే రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కాదు భార్య కూడా భర్తకు రాఖీ కట్టవచ్చట. ఇంతకీ రాఖీ పౌర్ణమి వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఏఏ రాష్ట్రల్లో ఈ పండుగని ఎలా జరుపుకుంటారు? తెలియాలంటే కింది వీడియోని వీక్షించండి. -
అన్నను కాపాడిన రాఖి
చెల్లెలి చేత రాఖీ కట్టించుకోవడం అంటే ఆమెకు రక్షగా ఉంటానని పునర్ వాగ్దానం ఇవ్వడమే. రాఖీ కట్టించుకున్న అన్నకు చెల్లెలి అనురాగమే బలం.మనోబలం. చెల్లెలిని ఆదరించని అన్న గుండె,రాఖీ కట్టించుకోని అతని చేయి అర్థరహితం. చెల్లెలే అన్నకు రక్షగా నిలవాల్సినఒక వాస్తవ కథ ఇది. ‘ఆ రోజు చాలా వాన పడుతోంది. నేను ఏడో క్లాస్ చదువుతున్నాను. మా చెల్లెలు అయిదో క్లాసు. మా స్కూల్ నుంచి వచ్చేదారిలో రెడ్డిగారి ఇల్లు ఉంది. ఆ గేటును ఆనుకునే అవతలి వైపు జామచెట్టు ఉంటుంది. దాని నిండా జామకాయలే. కాని పనివాళ్లు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. ఆ జామచెట్టు వైపు పిల్లలు చూస్తే నాలుగు తగిలిస్తారు. అందువల్ల దాని వైపు చూడటమే తప్ప ఎప్పుడూ తిని ఎరగం. ఆ ముందు రోజు మా చెల్లెలు ఎప్పుడూ లేనిది అన్నయ్యా... ఒక జామకాయ కోసిపెట్టవా అని అడిగింది. కోయాలంటే ఎలా? చూస్తే కొడతారు. వద్దమ్మా... కుదరదు అని చెప్పి ఇంటికి తెచ్చేశాను. ఆ మరుసటిరోజు భారీ వాన. ఎవ్వరం స్కూళ్లకు వెళ్లలేదు. ఎవరూ వీధుల్లోకి రాలేదు. ఆకాశం మూసుకుపోయింది. పట్టపగలు చీకటి కమ్ముకుంది. ఇంట్లో అందరం పొయ్యి దగ్గర ముణగదీసుకొని కూచుని ఉన్నాం. కాని నాకు మాత్రం చెల్లెలు అడిగిన చిన్న కోరికే గుర్తుకు వస్తోంది. ఏమడిగిందని... మణులా మాణిక్యాలా... ఒక జామకాయేగా... ఈ వానలో రెడ్డిగారి ఇంటి గేటు దగ్గర ఎవరూ ఉండరని అనిపించింది. ఇంట్లో గొడుగు లేదు. వానకు తడిస్తే తుడుచుకోవడానికి సరైన తువ్వాలు కూడా లేనంత పేదరికం. అయినా అంతటి వానలో తలుపు తీసుకొని రివ్వున బయటకు పరిగెత్తాను. వాన తరుముతూ ఉన్నా తడుపుతూ ఉన్నా బాణాల్లా గుచ్చుతున్నా రెడ్డిగారి ఇంటికి చేరుకున్నాను. నేననుకున్నట్టుగానే గేటు దగ్గర ఎవరూ లేరు. చెట్టు నిండా జామకాయలు తడిసి దుమ్ము కడుక్కుని మెరుస్తున్నాయి. చకచకా గేటు మీద నుంచి చెట్టు మీదకు పాకి దొరికినన్ని కోసి దిగుతుండగానే కుక్క మొరిగింది. రెడ్డిగారి కుక్క. అంతే ఒక్క దూకు దూకాను. కాలు పూర్తిగా బెణికింది. అయినా పరుగు ఆపలేదు. ఇల్లు చేరి ఆ జామకాయలు మా చెల్లెలికి ఇచ్చి వాటిని తను తింటూ ఉంటే కాలు నొప్పి అంతా మర్చిపోయాను. మా చెల్లెలంటే అంత ఇష్టం మేడమ్ నాకు’ అన్నాడతను లేడీ సైకియాట్రిస్ట్‌తో. నలభై ఐదేళ్లు ఉంటాయి. మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి రూపం, వేషం ఉన్నాయి. కాని మనిషి సంతోషంగా లేడు. ఒక కన్ను లేకపోతే, ఒక చేయి లేకపోతే, ఒక ఊపిరితిత్తి లేకపోతే, ఒక మూత్రపిండం లేకపోతే మనిషికి సహజంగా ఒక దిగులు కమ్ముకునే అవకాశం ఉంది. అలాంటి దిగులుతో ఉన్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి. మరి లేనిది ఏమిటి? ‘మా చెల్లెలిని చూసి నేను పదేళ్లు అవుతోంది మేడమ్’ అన్నాడు మళ్లీ. అతడు రోజూ గత కొన్నాళ్లుగా రాత్రిళ్లు మంచం మీదకు చేరి దుప్పటి ముఖం మీదుగా కప్పుకొని తెల్లారే దాకా శోకిస్తున్నాడని అతడి భార్య డాక్టర్ దగ్గరకు తీసుకు వచ్చింది. ఎందుకు అలా ఏడుస్తున్నావని అడిగితే ఏమీ చెప్పడు. పగలంతా మామూలుగానే ఉంటాడు. ఉద్యోగానికి వెళతాడు. పిల్లల అవసరాలు చూస్తాడు. కాని రాత్రయితే బెడ్రూమ్లో దూరి ఎవరికీ కనపడకుండా ఏడుస్తూ ఉంటాడు. భార్య ఉండగా డాక్టర్ అడిగితే కారణం ఏమీ లేదని ఉండేవాడేమో కానీ భార్యను బయట కూచోబెట్టడం వల్ల కొద్ది కొద్దిగా ఓపెన్ అవుతూ ఉన్నాడు. ‘పేదవాళ్ల బతుకులో అతి పెద్ద బరువు ఏమిటో తెలుసా డాక్టర్? బంధం. అవును.. అమ్మా నాన్నా అన్న బంధం. చెల్లెలు అన్న బంధం. కుటుంబం అన్న బంధం. మనిషి ఈ బంధాల కోసమే బతుకుతాడు. కాని పేదరికం ఉన్నప్పుడు ఈ బంధం లేనట్టే మరుపు నటిస్తాడు. నేను టెన్త్ క్లాస్‌కు వచ్చేటప్పటికే చాలా చురుకైన స్టూడెంట్‌నని మా చుట్టుపక్కల పల్లెల్లో బంధువుల్లో తెలిసిపోయింది. మా దూరపు బంధువు ఒకాయన ఒకరోజు మా ఇంటికి వచ్చి మా నాన్నతో– ‘చూడు ఈశ్వరయ్య. నీ కొడుకు నీ దగ్గర ఉంటే మరుసటి సంవత్సరానికి నీలాగే మట్టిపనికి వెళ్లాలి. లేదంటే ఇక్కడి గవర్నమెంట్ కాలేజీలో ఏదో ఒక దిక్కుమాలిన కోర్సు చదవాలి. ఎందుకు కన్నావో కన్నావు. నేనెలా ఉన్నా పర్లేదు నా కొడుకు చల్లగా ఉంటే చాలనుకునే మనసు తెచ్చుకో. నీ కొడుకును నాకిచ్చెయ్. వాణ్ణి చదివించుకొని ఇంజనీరుని చేసి నా కూతురుకి ఇచ్చి చేసుకుంటా. నా మనిషిని చేసుకుంటా’ అన్నాడు. అమ్మా నాన్న అది విని మూడురోజులు ఏడ్చారు. ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి కాని డబ్బులు రావు. నన్ను మా బంధువుతో పంపించేశారు’ అని తల దించుకున్నాడు. కన్సల్టేషన్ రూమ్‌లో డాక్టర్‌తో పాటు గదిలో ఉన్న ప్రతి వస్తువు అతడు చెబుతున్న కథకు చెవి ఒగ్గినట్టుగా చాలా నిశ్శబ్దం ఉంది. అతడు కొనసాగించాడు. ‘ఆ తర్వాత మా ఇంటిని పట్టించుకోలేదు. మా చెల్లెలిని పట్టించుకోలేదు. ప్రతి రాఖీనాడు మా చెల్లెలు అందమైన దారాలతో రాఖీ అల్లి దానిని కవర్లో పెట్టి నాకు పోస్ట్‌లో పంపేది. ఆ రాఖీకి బదులుగా చిన్న చాక్లెట్ పంపే వీలు కూడా నాకు ఉండేది కాదు. పాత లంపటాలు ఎక్కడ నన్ను వెనక్కు లాగుతాయో అని నన్ను తీసుకెళ్లినవాళ్లు ప్రతిదానికీ ఉలిక్కిపడుతూ ఉండేవారు. మా చెల్లెలికి ఊళ్లోనే మరో మట్టిపనివాడికిచ్చి పెళ్లి చేశారు. మా చెల్లెలు కంప్లయింట్ చేయలేదు. నేనొచ్చి నాలుగు అక్షింతలు వేయడమే పెద్ద కానుక అన్నట్టు సంతోషంగా నవ్వింది. దాని జీవితంలో నేను అన్నగా లేను. దాని పిల్లలకు మేనమామగా లేను. చివరకు నా తల్లిదండ్రులకు నేను కొడుకుగా కూడా లేను’... అతడి కళ్లు అంచు తెగకుండా నీళ్లు నిలిపి పెట్టి ఉన్నాయి. ‘మా అమ్మా నాన్నలు చివరి రోజుల్లో చూసే మనిషి లేక అవస్థలు పడ్డారు. తీసుకెళ్లి ఉంచుకోవడానికి నా చెల్లెలు శ్రీమంతురాలు కాదు. నిరుపేద. తీసుకెళ్లి పెట్టుకోవాల్సినవాడిని నేను. కాని చేతులు కట్టివేయబడి ఉన్నాను. ఒకరోజు మా చెల్లెలు ఫోన్ చేసింది– ‘అన్నయ్యా.. నా కోసం నిన్ను నేను ఏమీ అడగలేదు. అమ్మా నాన్న కోసం అడుగుతున్నాను. వాళ్లను బాధించక తీసుకెళ్లి నాలుగు ముద్దలు పెట్టరా’ అంది. దొంగ సంజాయిషీలు చెప్పాను. ఇది జరిగి పదేళ్లు. పదేళ్లుగా మా చెల్లెలు నా ముఖం చూడలేదు. నాతో మాట్లాడలేదు. అన్నగా కాదు నన్నో మనిషిగా కూడా తన మనసులో నుంచి తీసేసింది. పోతే పోయిందిలే అని నేను హాయిగా ఉండొచ్చు. కాని అలా ఉండలేకపోతున్నాను. నా ఒంట్లో రక్తం ఉంది. మా చెల్లెలి ఒంట్లో కూడా రక్తం ఉంది. దానిని ఒక గర్భం నుంచి మేము పంచుకున్నాము. ఆ రక్తం ఏ అర్ధరాత్రో నన్ను లాగుతుంది. ప్రశ్నిస్తుంది. నిలదీస్తుంది. ఎందుకిలా చేశావ్ అని దోషిగా నిలబెడుతుంది. నాకు నిద్ర పట్టదు. ఏం చేయాలో తోచదు. అందుకే ఏడుస్తున్నాను డాక్టర్’ అని ఆపిన కన్నీరును మనసు తేలిక పర్చుకోవడానికి చెంపల మీద కారనిచ్చాడు. లేడీ సైకియాట్రిస్ట్ అంతా వింది. ఇతనికి ఉన్న జబ్బుకు ఒకే ఒక మందు ఉంది. ఆ మందు పేరు చెల్లెలు. ఆ చెల్లెలు పెట్టాల్సిన క్షమాభిక్ష. అన్నను క్షమించడానికి ప్రతి చెల్లెలు సిద్ధంగా ఉంటుంది. ప్రయత్నించాల్సింది అన్నే. సాధారణంగా ఆ సైకియాట్రిస్ట్ పేషంట్ చెప్పిన వివరాలను రికార్డ్ చేయదు. చేసినా అతడి సంబంధీకులకు వినిపించదు. కాని ఈ కేసును చేసింది. చేసి అతడి భార్యకు వినిపించింది. ‘చూడమ్మా... దగ్గరలో రాఖీ పండగ ఉంది. ఏం చేయాలో నీ ఇష్టం’ అంది. ‘నీ భర్తకు చాలా క్షమాపణ అవసరం. నీకు కూడా అవసరం. బంధాలు కూలిపోయాయని కూల్చగలమని మనం అనుకోవచ్చు. కాని రక్తం ఎరుపుగా ఉన్నంత కాలం ఆ బంధం నిలిచే ఉంటుందని గ్రహిస్తే మేలు’ అంది. ఆమె అంగీకారంగా తల ఊపింది. బహుశా ఈ రాఖీ పండుగ ఒక అన్నాచెల్లెళ్ల సంతోషకరమైన ఆలింగనంగా కళకళలాడే అవకాశం ఉంది.– కథనం: సాక్షి ఫ్యామిలీ -
రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. Greetings to all on the auspicious occasion of #RakshaBandhan, which signifies the bond of love, protection and respect of siblings for each other. Wishing you all a joyous and a fun-filled Rakhi. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2019 -
ఎంతెత్తుకెదిగినా తమ్ముడే కదా..!
రాఖీ... ఒక బంధం... తోబుట్టువుల మధ్య అనుబంధాలను ముడివేసే రక్షాబంధన్.. ఈ ఆనంద వేడుకలకు నగరం సన్నద్ధమైంది. అందమైన రాఖీలతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం నగరంలో వీటి అమ్మకాలతో దుకాణాలు కిటకిటలాడాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రతి ఏటా వైవిధ్యభరితమైన రాఖీలను అందుబాటులోకి తెచ్చే ధూల్‌పేట్ కళాకారులు ఈసారి కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆకర్షణీయమైన రంగుల్లో రాఖీలను రూపొందించారు. కేవలం అందంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే రంగురాళ్లు, రుద్రాక్షలు పొదిగిన జరీ రాఖీలకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు కోల్‌కతా నుంచి నగరానికి దిగుమతి అయ్యే ఫ్యాన్సీ రాఖీలపై మహిళలు ఆసక్తి చూపారు. పిల్లలను ఆకట్టుకొనే లైటింగ్, మ్యూజిక్ రాఖీలు వందలాది వెరైటీలతో మార్కెట్లో కొలువుదీరాయి. ధూల్‌పేట్, బేగంపేట్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో బుధవారం రాఖీల విక్రయాలతో సందడి నెలకొంది. సాక్షి, సిటీబ్యూరో :అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అపురూప ప్రేమానురాగాలను ముడివేసే రక్షాబంధన్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దీంతో పాటు రాఖీల తయారీలో శతాబ్దాల ఘన చరిత ధూల్‌పేట్ సొంతం. నిజాంల కాలం నుంచే ధూల్‌పేట్ రాఖీలకు పెట్టింది పేరు. అద్భుత సృజనాత్మకతకు ఆలవాలం. ఇక్కడి కళాకారులు సమున్నత ప్రతిభ చాటుతారు. రాఖీ పండగ వచ్చిందంటే ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమగా మారుతుంది. 2 నెలల ముందు నుంచే రాఖీలను తయారు చేయడంలో నిమగ్నమవుతారు. లక్షల కొద్దీ డజన్లలో మార్కెట్‌కు చేరవేస్తారు. ఈ అందమైన రాఖీల్లో ఇప్పుడు మరిన్ని వెరైటీలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఎన్ని వెరైటీలో.. కోల్‌కతా నుంచి ఫ్యాన్సీ, ధూల్‌పేట నుంచి జరీ రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. జరీ రాఖీల్లోనూ 400 వరకు వెరైటీలు ఉన్నట్లు ధూల్‌పేట్‌లోని కోటా రాఖీ భండార్ నిర్వాహకులు రవీందర్ చెప్పారు. తెలుపు, ఎరుపు పూసలతో రాఖీలను రూపొందిస్తున్నారు. వాటిలో ఏడీ, సీటూ రాళ్లు పొదుగుతున్నారు. ఇవి అచ్చం ఆభరణాల్లాగే ఉంటాయి. ‘ఈ తరహా జరీ రాఖీల ట్రెండ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది’ అని రవీందర్ తెలిపారు. వెల్వెట్ క్లాత్‌పై రకరకాల స్టోన్స్‌తో రాఖీలను రూపొందిస్తున్నారు. ఈ రాఖీలు రూ.50 నుంచి రూ.500 వరకు కూడా లభిస్తున్నాయి. కొన్నింటి ధరలు రూ.1000 వరకు ఉన్నాయి. వీటిని వెండితో తయారు చేశారు. ఆకట్టుకునే మెటల్స్ను వినియోగించారు. మరోవైపు కేవలంఆకర్షణ కోసం వినియోగించే రాళ్లే కాకుండా నాణ్యమైన రంగురాళ్లను కూడా రాఖీల్లో కూర్చారు. ‘రక్షాబంధన్ అన్నదమ్ములతో తమ అనుబంధాలను పంచుకోవడమే కాకుండా వారికి ఆయురారోగ్యాలను, అదృష్టాలను ప్రసాదించాలని కోరుకొనే వేడుక. అందుకే అదృష్ట రాళ్లు పొదిగిన రాఖీలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. వీటిని ఒక్క రోజు ధరించి వదిలివేయకుండా ఆ రాయిని ఏడాది పొడవునా ధరించవచ్చు. వినియోగదారుల అభిరుచి మేరకు రుద్రాక్షలను కూడా జత చేస్తున్నామ’ని ఓ కళాకారుడు వివరించారు. ఇదీ చరిత్ర.. ♦ రక్షాబంధన్‌కు గొప్ప చరిత్ర ఉంది. శిశుపాలుని వధించే క్రమంలో సుదర్శన చక్రం వల్ల శ్రీకృష్ణుడి వేలికి గాయమవుతుంది. ఆ గాయానికి ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టుకడుతుంది. చెల్లెలుగా తన అనుబంధాన్ని చాటుకుంటుంది. ♦ పురుషోత్తముడికి అలెగ్జాండర్‌కు జరిగిన యుద్ధం సందర్భంగా తన భర్తను రక్షించాలని కోరుతూ అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రాఖీని అందజేస్తుంది. ♦ మొఘలుల కాలంలో చిత్తోడ్ రాణి కర్నావటి అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీని అందజేసి రక్షణ కోరినట్లు చరిత్ర చెబుతోంది. ♦ జాతీయోద్యమకాలంలో ప్రజల మధ్య ఐక్యతను, సంఘటితత్వాన్ని ఏర్పరిచేందుకు రాఖీలను ధరించేలా ప్రోత్సహించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపునిచ్చారు. ♦ ఏటా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే రాఖీ పండగ తొలినాళ్లలో కేవలం తెల్లటి నూలు దారానికి పసుపు రుద్ది కంకణంలా కట్టేవారు. ఆ తర్వాత రకరకాల రంగుల్లో దారాలను తయారు చేశారు. వాటికి పైన దారంతోనే పూల ఆకృతులను రూపొందించారు. ♦ అనంతరం స్పాంజ్‌తో రాఖీలను తయారు చేశారు. వీటిపై మెరుపు కాగితాలను అతికించి వాటిని అందంగా అలంకరించారు. ఇవి మణికట్టు నిండా ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవి. ♦ ఇప్పుడు ఫ్యాన్సీ, జరీ రాఖీలు ఎక్కువగా తయారు చేస్తున్నారు. వీటిలోనూ వందలకొద్దీ వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. పోలీస్ బ్రదర్స్.. మా సేవియర్స్ సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మ్యాజిక్ ఎఫ్ఎం రేడియో 106.4 ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, షీ టీమ్స్ సిబ్బందికి రాఖీలు కట్టారు. ప్రజారక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు క్షేమంగా ఉండాలని రాఖీలు కడుతున్నామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, క్రైమ్స్ అడిషనల్ డీసీపీ ఇందిర, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ మాణిక్ రాజ్, షీ టీమ్స్ సీఐ సునీత, ఎఫ్ఎం రేడియో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాఖీ కట్టండి.. హెల్మెట్ ఇవ్వండి మణికొండ: రాఖీలు కట్టడంతో పాటు తమ సోదరులకు ఓ హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చి వారి మేలు కోరాలని రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్, ఎనర్జీ సలహాదారు ఏకే గోయల్ పేర్కొన్నారు. బుధవారం గండిపేట మండలం, వట్టినాగులపల్లి శివారులోని శ్రీదేవి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ‘సిస్టర్ ఫర్ చేంజ్– గిఫ్ట్ ఎ హెల్మెట్’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి, కళాశాల జాతీయ సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ వాడకపోవటంతోనే మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ మల్లీశ్వరి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. టామ్ – జెర్రీ .. సూపర్‌మ్యాన్.. రాజస్థాన్‌లో విత్తనాల రాఖీలు,. ఆర్మీ జవాన్లకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు.. భోపాల్‌లో మోదీ రాఖీలు.. ఇలా ఈ ఏడాది దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన రాఖీలు ఫేమస్ అవుతున్నాయి. కొత్త ట్రెండ్ పట్ల, కొత్త తయారీ పట్ల ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఈసారి నగర అంగళ్ల నుంచి ఆన్లైన్ దుకాణాల వరకూ ఎన్నో రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్న రాఖీలు ఇలా ఉన్నాయి.. ఎకో రక్షా బంధన్.. దూది, బంగారు, వెండి, మెరుపు కాగితం రాఖీలకు కాలం చెల్లిపోయింది. ఎన్నో రకాల కాన్సెప్టులు, డిజైన్లు, మెటీరియల్స్‌తో రాఖీలు రూపొందాయి. ముఖ్యంగా పర్యవరణ హిత రాఖీలపై ఆసక్తి పెరిగింది. నువ్వూ, నేను, మనందరం కలిసి ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాలనే బాధ్యతను ఈ బీజ్ (విత్తన) రాఖీల ద్వారా తెలియచేయవచ్చుంటున్నారు రాఖీ తయారీ దారులు, కొనుగోలుదారులు. పండగ తర్వాత రాఖీ చెత్తలోకి కాకుండా పూర్తిగా మట్టిలో కలిసి పోవటం, అందులో విత్తనం మొక్కగా నాటుకోవటం.. చక్కటి బహుమతి, ఆనుభూతి అంటూ మురిసిపోతున్నారు. ఉభయకుశలోపరి అన్నట్టు ఎకో ఫ్రెండ్లీ రాఖీలపై ఈసారి ఆసక్తి బాగా పెరిగిందంటున్నారు టెర్రకోట రాఖీల తయారు చేసే కృష్ణలతా అంకెం. తినే రాఖీ.. పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు అంటే ఎంతిష్టమో విడిగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చేతికి కట్టిన రాఖీ, లాలీపాప్‌లా తినొచ్చు అంటే మారాం లేకుండా రాఖీ కట్టించుకునేందుకు రెడీ అయిపోతారు చిన్నారులు. అందుకే నగరంలో బేకర్స్ ఈ రాఖీల తయారీ ముందు నుంచే మొదలుపెట్టారు. గేమ్స్.. కార్టూన్స్.. రాఖీస్.. రాఖీ పండుగ అనగానే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, టీనేజర్లే ప్రముఖంగా గుర్తుకు వస్తారు. పిల్లలను బాగా ఆకట్టుకునే చోటా భీం, డోరెమాన్, నోబితా, టామ్అండ్జెర్రీ, సూపర్‌మ్యాన్ తదితర కార్టూన్లతో కూడిన ఎన్నో రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎక్కువగా ఆన్లైన్లోనే ఉన్నాయి. ఈ ఏడాది రాఖీ పండగ, స్వాతంత్య్ర దినోత్సవం ఒకేసారి రావడంతో జాతీయ జెండా రంగులున్న రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి. దేశభక్తి, సోదర ప్రేమను ఏక కాలంలో చాటుకోవడానికి ఈ రాఖీలను ఎంచుకుంటున్నారు. ఎంతెత్తుకెదిగినా తమ్ముడే కదా..! అంబర్‌పేట: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నచందంగా.. ఆయన ఎంత ఎదిగినా అక్కలకు మాత్రం తమ్ముడే. ఇద్దరు అక్కల చిన్న తమ్ముడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఏటా తమ సోదరీమణులతో రాఖీలు కట్టించుకుంటారు. ప్రతి రాఖీ పండగకు ఇద్దరు అక్కలు ఆయన నివాసానికి వచ్చి మనసారా దీవించి రాఖీ కడతారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి మహిళలందరితో ఒక అన్నగా ఆప్యాయతను పంచుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండగకు మాత్రం ఆయన కేంద్రమంత్రి హోదాలో ఢిల్లీలో గడపనున్నారు. బ్రహ్మకుమారీలు ప్రత్యేకం.. రాయదుర్గం: రాఖీ పౌర్ణమిని ‡బ్రహ్మకుమారీలు ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ నుంచి మొదలుకుని సామాన్య పౌరుడికి సైతం గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని బ్రహ్మకుమారీలు రాఖీలు కడతారు. వీరు కట్టే రాఖీలు ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. వీటిపై పరమాత్మ బొమ్మ బిందు స్వరూపం ఉంటుంది. రాఖీలను ఆత్మ, బిందు, పరమాత్మ స్వరూపాలకు ప్రతీకగా వీరు భావిస్తారు. విజయానికి ప్రతీకగా భావించే చందన తిలకాన్ని కూడా దిద్దుతారు. చివరగా ఆప్యాయత, ప్రేమను పంచడానికి మిఠాయిలు తినిపిస్తారు. ఇలా ఏటా రాఖీ పౌర్ణమి సందర్భంగా నగరంలో ఈ నెల 11 నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించారు. మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు, బుధవారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి రాఖీలు కట్టారు. నేడు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌కు రాఖీలు కట్టనున్నారు. పర్యావరణ ‘బంధం’ బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పర్యావరణ హిత రాఖీలను చూడముచ్చటగా తయారు చేశారు. సామాజిక బాధ్యతలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఇంట్లోనే లభించే ముడిసరుకుతో, వాడి పారేసిన వస్తువులతో వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇంట్లోనే లభించే దూది, దారంతో పాటు పూల నుంచి తీసుకున్న రంగులను వీటికి అద్ది మరింత ఆకట్టుకునేలా చేశారు. పర్యావరణహిత ఆవశ్యకతను ఇలా చాటి చెప్పారు. విభిన్న రకాల రాఖీలను రూపొందించి రక్షాబంధన్ వేడుకలను పాఠశాల ఆవరణలో బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ రాఖీలను విక్రయించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును పాఠశాలలో అభివృద్ధి కోసం తమవంతు సాయంగా అందిస్తామని విద్యార్థులు తెలిపారు. రక్షా బంధన్ వేడుకలను తమ విద్యార్థులు సామాజిక స్ఫూర్తితో నిర్వహించారని పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అనిత ఆనందం వ్యక్తం చేశారు. మీరే మాకు రక్ష! కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని 1ఈఎంఈ సెంటర్లో ఆర్మీ జవాన్లు ఒకరోజు ముందుగానే రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. కుటుంబాలకు దూరంగా ఉండే జవాన్లకు స్థానిక పాఠశాలల విద్యార్థులు రాఖీ కట్టి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. దేశరక్షణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపలా కాస్తున్న సైనికులను దేశపౌరులంతా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఉండటం ఎంతో స్ఫూర్తినిస్తోందని 1ఈఎంఈ సెంటర్ అఫీషియేటింగ్ కమాండెంట్ కల్నల్ దేబబస నందా అన్నారు. హిమాయత్‌నగర్‌లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, మెహిదీ పట్నంలోని ఎంఎన్ఆర్ స్కూలు విద్యార్థినులు ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టారు. -
ప్రకృతి హితమే రక్షగా...
‘రక్షాబంధనం’ అనేది అన్న చెల్లెలికి ఇచ్చేరక్షణకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేది.ఒక్క మార్పుతో ఈ పండగను మరింతవేడుకగా జరుపుకోవచ్చు. అదెలాగో చెబుతున్నాయి కొన్ని పర్యావరణహిత సంస్థలు. 1. మొక్కలకే రాఖీలు మీరు మనసు పెడితే మొక్కలకే రాఖీలను పూయించవచ్చు అంటున్నారు గార్గి. ‘బా నో బాట్వో’ వ్యవస్థాపకులు గార్గి ఔరంగాబాద్ నివాసి. చెట్లు, మొక్కల నుంచి ఆకులు, గింజలు, షెల్ ..వంటి భాగాలను సేకరించి వాటిని రాఖీల తయారీ కోసం వాడుతున్నారు. ఆన్లైన్ ప్రచారం ద్వారా ‘నా సోదరి నా బలం’ అనే ట్యాగ్‌తో క్యాంపెయిన్ ద్వారా గార్గి మరో మైలురాయి దాటారు. 2. హెచ్ఐవీ పిల్లలకు రాఖీ బెంగుళూరులోని జీసస్ హెచ్ఐవీ హోమ్‌లో ఏడాది నుంచి పదేళ్ల వయసున్న హెచ్ఐవీ ప్రభావిత పిల్లలు తలదాచుకుంటున్నారు. వీరికి ‘సీడ్ పేపర్ ఇండియా’ వ్యవస్థాపకులు రోషన్ రాయ్ పర్యావరణ హితమైన రాఖీలను రెండేళ్లుగా అందిస్తున్నారు. ఈ రాఖీలు ఎలా ఉంటాయంటే .. మొక్క వచ్చేందుకు అనువైన విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరినారతో తయారు చేసిన కార్డులను.. ఇలాంటి వాటితో ఒక కిట్‌ని రూపొందించి వారికి ఇస్తున్నారు. 3. స్లమ్ మహిళలకు ఉపాధి ప్రజలతో కలిసి పనిచేస్తేనే అనుభవాలు పువ్వుల పరిమళాలవుతాయి. ఢిల్లీ వాసి సౌరభ్ డిగ్రీ తర్వాత సొంతంగా బాల్ పెన్ తయారీ వ్యాపారం పెట్టుకున్నాడు. ఏడాది గడిచాక పెన్నులన్నీ ప్లాస్టిక్‌వే అని ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. ‘బయో క్యూ’ పేరుతో ‘పర్యావరణహితమైన స్టేషనరీ’ని ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ ద్వారా ప్రతి నెలా 5–6 లక్షల విత్తనాల పెన్నులు, పెన్సిళ్లను తయారు చే యడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన నుంచే మొక్కల రాఖీలను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు సౌరభ్. ‘కిందటేడాది 6,000ల సీడ్ రాఖీలు తయారుచేశాం. ఈ ఏడాది 15,000 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఢిల్లీలోని చుట్టుపక్కల స్లమ్ ఏరియాల నుంచి 20 మంది మహిళలతో ఈ గ్రీన్ రాఖీల తయారీ చేస్తున్నాం. దీనిద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం’ అని ఆనందంగా తెలిపారు సౌరభ్. 4. ఒక్కో దారం ఒక్కో కథ సామాజిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మధ్యప్రదేశ్‌కి చెందిన గ్రామ్‌ఆర్ట్ ఈ వేడుకను ఒక అవకాశంగా తీసుకొని ఈ రాఖీలను రూపొందించింది. ముంబయ్‌లో ఆదివాసీల హక్కుల కోసం ర్యాలీ చేసిన మానవ హక్కుల కార్యకర్త నవ్లీన్ 19 కత్తి పోట్లకు గురయ్యారు. ఆమె జ్ఞాపకార్థం ‘గ్రామ్ ఆర్ట్’ 19 ముడులతో కూడిన రాఖీని తయారుచేసింది. అలాగే గర్భాశయ ఆకారంలో ఉన్న రాఖీ ద్వారా సమాజంలో లింగ అంతరాన్ని ఎత్తి చూపుతుంది. ఇలా ఒక్కో దారం ఒక్కో కథను కళ్లకు కట్టేలా చేస్తుంది గ్రామ్ ఆర్ట్. ‘హమ్ కమ్జోర్ నహీ’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కి చెందిన 100 మంది గ్రామీణ మహిళలతో కలిసి ఈ విత్తన రాఖీల తయారీని చేపట్టారు. కిందటేడాది 12,000 రాఖీలను అమ్మిన ఈ సంస్థ ఈ ఏడాది 20,000ల సీడ్ రాఖీలను అమ్మాయిలని నిర్ణయించుకున్నామని సంస్థ వ్యవస్థాపకులు లలిత్ వంశీ తెలిపారు. 5. మట్టితో అనుబంధం అభికా క్రియేషన్స్ మట్టితో రాఖీలను తయారు చేస్తుంటుంది. ఈ రాఖీలను బటర్ పేపర్లో ప్యాక్ చేస్తారు. మట్టి రాఖీ, పేపర్ నేలలో సులువుగా కలిసిపోతుంది. ‘వీటిని కొంతమంది తమ ఆప్తులకు కానుకలుగా కూడా ఇస్తుంటారు’ అని ఆనందంగా తెలిపారు వ్యవస్థాపకులు. 6. పేపర్ రాఖీ పేపర్‌తో తయారు చేసిన రాఖీతో పాటు కిట్‌లో అరుదైన జాతి మొక్కల విత్తనాలు చుట్టి ఉన్న కాగితం పాకెట్ కూడా ఉంటుంది. ఈ విత్తనాల ద్వారా మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నేటి తరాన్ని రకరకాల గ్యాడ్జెట్లు తమవైపుకు తిప్పుకుంటున్నాయి. ఇలాంటప్పుడు పర్యావరణ మూలాలకు వారిని తీసుకెళ్లడం అత్యవసరం’ అంటారు బైస్మిటా వ్యవస్థాపకులు స్మిత. రాఖీని సోదర ప్రేమకు, రక్షణకు, సంఘీభావనకు గుర్తుగా ఉపయోగిస్తారు. అయితే, చాలా వరకు రాఖీలో ఉపయోగించే ప్లాస్టిక్, రసాయనాల రంగులు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. వీటికి సరైన పరిష్కారం పర్యావరణ హితమైనవి ఎంపిక చేసుకోవడమే. మన చుట్టూ ఉన్నవారికి ప్రకృతి పట్ల వారి బాధ్యతను గుర్తుచేయడమే. -
కొంచెం వ్యత్యాసంగా తల్లికి రాఖీ కట్టింది..
తమిళసినిమా: దాని గురించి పట్టించుకోను అంటోంది నటి శ్రుతీహాసన్. తనకు నచ్చింది, మనసుకు అనిపించింది చేసుకుపోయే నటి శ్రుతీహాసన్. కమలహాసన్, సారికల నటవారసత్వాన్ని అనుకోకుండానే భుజాల మీద మోస్తున్న శ్రుతీహాసన్ క్రేజీ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ముంబైలో ఉంటే తల్లి సారికతో, చెన్నైలో ఉంటే తండ్రి కమలహాసన్‌తోనూ తన అనుబంధాన్ని పంచుకునే శ్రుతీహాసన్ ప్రియుడిని కలవాలంటే లండన్‌కు వెళ్లొస్తుంటుంది. అలా సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన ఈ బ్యూటీ తనకు తాను తీసుకున్న చిన్న గ్యాప్ తరువాత తాజాగా ఒక హింది చిత్రంలో నటిస్తోంది. ఇక పోతే రక్షాబంధన్ పండుగ అంటే అన్నాచెల్లెల్ల అనుబంధానికి చిహ్నం. ఆదివారం ఈ వేడుకను అందరూ సంతోషంగా జరుపుకున్నారు. నటి శ్రుతీహాసన్ కూడా రాఖీ పండుగను జరుపుకుంది. అదేమిటీ శ్రుతీహాసన్‌కు సోదరులు లేరు కదా! అనే సందేహం కలుగుతోందా? యువతులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీసులు అందుకుంటే నటి శ్రుతీహాసన్ కొంచెం వ్యత్యాసంగా తన తల్లికి రాఖీ కట్టి ఆశీసులు అందుకుంది. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ సందర్భంగా శ్రుతీహాసన్ పేర్కొంటూ అమ్మ సారికతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మేమిద్ద రం కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాం. నాన్నతో కలిసి ఇప్పటికే పని చేశాను. అయితే అమ్మతో కలిసి నటించాలని ఆశగా ఉంది. అమ్మా,నాన్నలు నటనలో ప్రతి భావంతులు కావడంతో నేను నటిగా ప్రతిభను చాటుకోవాలన్న ఒత్తిడి లేదు. ఇది నా జీవితం. అమ్మా నాన్న నాలుగేళ్ల వయసు నుంచే నటిస్తున్నారు. వారితో నేను పోటీ పడలేను. నా తల్లిదండ్రులతో నన్ను పోల్చుకుంటారన్న విషయం తెలుసు. అదంతా నేను పట్టించుకోను. అయితే నేను అమ్మానాన్నలు గర్వించేలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా ను. అందుకు నా కఠిన శ్రమ చూసి వారు కచ్చి తంగా గర్వపడతారు. నాకూ అదే ముఖ్యం. సినీ పరిశ్రమ చాలా సహనాన్ని నేర్పుతుం ది. మరో విషయం ఏమిటంటే నేను కావా లని కోరుకుని నటిని కాలేదు. ఆ విధంగా నేను అదృష్టవంతురాలిని. -
ఆడబిడ్డలతో కళకళలాడిన పుట్టినిళ్లు
సత్తుపల్లిటౌన్ : సోదరీ, సోదరుల అనురాగబంధానికి ప్రతీక అయిన రాఖీ పర్వదినాన్ని సత్తుపల్లి నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న చెల్లెళ్లు, అక్కలు తమ సోదరుల ఇళ్లకు వచ్చి రాఖీలు కట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి రాష్టాన్ని సుభిక్షంగా ఉండే విధంగా చూడాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆడబిడ్డలతో పుట్టినిళ్లు కళకళలాడాయి. రాఖీలు కట్టిన అనంతరం సోదరులు సంప్రదాయంగా కానుకలు ఇచ్చి దీవెనలు అందించారు. పెనుబల్లి మండలంలో.. పెనుబల్లి: రక్షాబంధన్ వేడుకలను ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. అక్కాలకు తమ్ముళ్లు, అన్నాలకు చెళ్లిళ్లు రాఖీలు కట్టారు. స్వీట్లు పంపిణీ చేశారు. సోదర భావాన్ని నిరూపించుకున్నారు. లింగగూడెం ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలను నిర్వహించారు. తల్లాడ మండలంలో.. తల్లాడ: రక్షాబంధన్ పర్వదినాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు, చెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించారు. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు తమ సోదరులకు రాఖీలు కట్టారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు జరిగాయి. తల్లాడలో రాఖీ, స్వీట్స్ షాపుల వద్ద సందడి కన్పించింది. వేంసూరు మండలంలో.. వేంసూరు : సోదరీమణులు.. సోదరులకు ఆప్యాయంగా రాఖీలు కట్టారు. అక్కా, చెల్లెళ్లు.. అన్నదమ్ముల ఇళ్లకు వచ్చి రక్షబంధన్ కట్టి అనురాగాన్ని పంచి ఇవ్వాలని కోరారు. సోదరుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. కల్లూరు మండలంలో.. కల్లూరు: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మండలంలో ఆదివారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు పుట్టింటికి వచ్చి రాఖీలు కట్టారు. వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలతో పండగ వాతావరణం చోటు చేసుకుంది. కల్లూరులో ఎంపీపీ వలసాల జయలక్ష్మి.. టీఆర్ఎస్ నాయకులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, లక్కినేని కృష్ణ, అత్తునూరి రంగారెడ్డి, మేకల కృష్ణ, ఎస్కే యూకూబ్ అలీ బొప్పన శ్రీనా«ధ్, కర్నాటి సాంబశివారెడ్డి, ఎస్డీ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
రక్షాబంధన్ వేళ.. ఎందుకీ శిక్ష
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా నిర్వహించేది రక్షాబంధన్. అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చే ఈ పండుగ జరపుకొనేందుకు, తాము ఎక్కడున్నా ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటామని మళ్లీమళ్లీ సోదరిలకు భరోసా కల్పించేందుకు అన్నదమ్ములు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తారు. అయితే ఓ ప్రిన్సిపాల్ వారికి ఆ ఆనందం లేకుండా అడ్డుకున్నారు. కనీసం తమ చెలెళ్లు, అక్కలను చూడడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పలువురు యువకులు, వారి తల్లిదండ్రులు పండగ వేళ తీవ్ర క్షోభకు గురయ్యారు. విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్) ప్రిన్సిపాల్ నిర్వాకంతో రక్షాబంధన్ పండుగ వేళ గిరిజన విద్యార్థినులు, వారి అన్నదమ్ములు తీవ్ర క్షోభకు గురయ్యారు. మాకెందుకీ శిక్ష అంటూ ఆవేదన చెందారు. చివరకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆదేశాల మేరకు రాఖీ కట్టేందుకు ప్రిన్సిపాల్ అంగీకరించడంతో కొంతమందికి మాత్రమే ఆ ఆనందం దక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో చదువుతున్న తమ అక్క,చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకునేందుకు చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి,ముంచంగిపుటు,పెదబయలు,హుకుంపేట,జి.మాగుడుల, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల నుంచి సుమారు 150 మంది గిరిజన యువకులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఉదయం యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్)కు వచ్చారు. అక్కడి ప్రిన్సిపాల్ అరుణజ్యోతి విద్యార్థినులను బయటకు పంపేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను చూసేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వస్తే ఇలా అడ్డుకోవడమేమిటని గొడవకు దిగారు. అయినా ప్రిన్సిపాల్ ససేమిరా అనడంతో వారు గిరిజన సంక్షేశాఖ డిప్యూటీడైరెక్టర్ విజయ్‌కుమార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సాయంత్రం నాలుగు గంటలకు కొంత మంది విద్యార్థినుల తల్లిదండ్రులను పాఠశాల లోపలికి వెళ్లేందుకు ప్రిన్సిపాల్ అనుమతించారు. వర్షం పడుతుండడంతో తడుస్తూ ఉండలేక చాలా మంది యువకులు, వారి తల్లిదండ్రులు అప్పటికే నిరాశతో వెళ్లిపోయారు. దీంతో తమ అన్నదమ్ములకు రాఖీ కట్టలేకపోయామని పలువురు విద్యార్థినులు తీవ్ర వేదనకు గురయ్యారు. ప్రిన్సిపాల్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పడిగాపులు కాశాం... దూరం ప్రాంతం నుంచి కుమార్తెను చూసేందుకు, తమ్ముడితో రాఖీ కట్టించేందు ఉదయం 10 గంట లకు పాఠశాలకు వచ్చాం. అయితే ప్రిన్సిపాల్ అనుమతించలేదు. ఎంతో వేడుకున్నాం. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశాం. అయినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. తమ పిల్లలను కలుసుకునే అవకాశం ఇవ్వని ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి. – కొండబాబు,విద్యార్థిని తండ్రి, జి.మాడుగుల మండలం -
చెల్లెలి కోసం చేనేత బహుమతులు
‘‘ఏదోటి కొనిచ్చే దానికంటే మన సమయాన్ని వెచ్చించి మన వాళ్లకు ఏది నచ్చుతుందో అది సెలెక్ట్ చేసి ఇచ్చిన బహుమతుల్లో ప్రేమ ఎక్కువుంటుంది అనే విషయాన్ని నమ్ముతాను’’ అంటున్నారు వరుణ్ ధావన్. రక్షా బంధన్ సందర్భంగా ప్రతి సంవత్సరం తన చెల్లెలకు ఏదో బహుమతి ప్రెజెంట్ చేయడం వరుణ్‌కు అలవాటట. ఈ సంవత్సరం తనే కొన్ని చేనేత చీరలు, దుప్పట్టాలు, డైరీలు.. ఇలా అన్నీ చేత్తో చేసిన సామాన్లను స్వయంగా సెలెక్ట్ చేసి, గిఫ్ట్‌గా బహూకరించదలిచారట. ‘‘ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా చెల్లెలకు గుర్తుండిపోయే గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. ‘సూయి ధాగా’ సినిమా చేస్తున్నప్పుడు మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్ గురించి తెలుసుకున్నాను. వాటినే గిఫ్ట్‌గా ఇవ్వదలిచాను. నా చెల్లికి నచ్చుతాయనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
రక్షా బంధన్
-
మై డియర్ బ్రదర్
-
అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు..
రక్ష బంధన్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాద్ కూతురు పవిత్ర, కొడుకు ఆకాశ్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి? పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు. ఆకాశ్: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను. పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం? ఆకాశ్: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ). పవిత్ర: లాస్ట్ ఇయర్ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్ నుండి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకాశ్: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి ప్లాన్ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్ ఇయర్ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్ బ్యాగ్ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్ ఉంది. కానీ సర్ప్రైజ్. పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ). ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారా? పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీ ఇద్దరూ పర్సల్ విషయాలు షేర్ చేసుకుంటారా? పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్ ఏముంటాయి? మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్? పవిత్ర: సినిమా షూటింVŠ టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని మేం కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్ చేసి షూటింగ్ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్ న్యాయం చేశాడు. రివ్యూస్ ఎలా వచ్చినా తను డల్ అవ్వటం ఉండదు. ఆకాశ్: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను. మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా? ఆకాశ్: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే. పవిత్ర ఎలాంటి కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటోంది? ఆకాశ్: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్ అయిపోగానే ప్రొడక్షన్లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్ తెచ్చిస్తుంటారు. ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటారు? పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు. కాలేజీలో మీరు డైరెక్టర్ పూరీ డాటర్ అని అందరికీ తెలుసా? పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్ అవుతాను. డ్రగ్స్ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయినట్లు అనిపించింది.. పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్ ఉంది అని మా అమ్మను ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు. ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్ చేశాను. ఆకాశ్: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్ చేస్తూ, నాకు చాలా కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా? ఆకాశ్: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు. పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ). అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు? ఆకాశ్: ఏమో స్క్రిప్ట్ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం. పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు. పవిత్ర ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఆకాశ్: కాంప్లిమెంట్ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్ అందరితో ఫుల్ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే నీ డ్రీమ్ రోల్? ఆకాశ్: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా చాలెంజింగ్ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్ టచ్ చేయాలనేది నా డ్రీమ్. నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? పవిత్ర: ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్లో సక్సెస్ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్ వాళ్లు. అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా? పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే తను బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ దగ్గర వీటి గురించి డిస్కస్ చే సేవాడు. అందుకే ఫస్ట్ డే షూటింగ్లో తన ఎగై్జట్‌మెంట్ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్ అయ్యాను. ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి.. ఆకాశ్: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు. పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్లో ఆకాశ్ సరదాగా ఆశీర్వదించాడు. -
అక్క.. అమ్మలా పెంచింది
‘అన్నా చెల్లెళ్ల అనుబంధం... జన్మజన్మల సంబంధం’ అంటూ వివరించాడో రచయిత. సృష్టిలో ఓ అపూర్వ బంధమిది. అక్కాచెల్లెళ్లకుజీవితాంతం అండగా నిలిచే సోదరులు...అన్నాదమ్ములను అంతే ఆప్యాయంగా చూసుకునే సోదరీమణులు ఎందరో. వీరందరికీ రాఖీ పండగ ఎంతో ప్రత్యేకం. నేడు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ. ఈ సందర్భంగా అటు అక్కాచెల్లెళ్లను, ఇటు అన్నాదమ్ములను‘సాక్షి’ పలకరించింది. ఆ విశేషాల సమాహారమిది... సాక్షి, సిటీబ్యూరో: ‘ మా అక్క అంటే నాకెంతో ఇష్టం. అమ్మ తర్వాత అమ్మలా నన్ను పెంచింది. మా కుటుంబంలో రాఖీ సంప్రదాయం లేకపోయినా... అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగకు ప్రతిసారి మా అక్క జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అక్క ఫాతిమా నన్ను అల్లారు ముద్దుగా చూసుకునేది. మా సొంతూరు రాజమండ్రి. అక్క పెళ్లయ్యే నాటికి నా వయస్సు తొమ్మిదేళ్లు ఉంటుందేమో. వైజాగ్ వాళ్ల అత్తారిల్లు. వాళ్లింట్లో ఓ రోజు పాలు వేడి చేస్తుండగా చున్నీ అంటుకుంది. అక్క గమనించలేదు. వెనుక నుంచి మంటలు చెలరేగాయి. భయంతో ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. అక్కడున్న వాళ్లు గమనించి, అక్కపై నీళ్లు పోశారు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. అప్పటికే అక్క ఆరు నెలల గర్భిణి. కుటుంబసభ్యుతో అలీ...ఫాతిమా నీళ్ల కారణంగా ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగాయి. అక్కతో పాటు, కడుపులోని బేబీ కూడా చనిపోయింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న మా అక్క లేని లోటు నా జీవితంలో ఎప్పటికీ పూడ్చలేనిది. మా అక్క జ్ఞాపకంగా నా పెద్ద కూతురుకు ఆమె పేరు పెట్టుకున్నాను. అక్కను నా కూతురులో చూసుకుంటున్నాను. ప్రతి ఏటా రాఖీ సందర్భంగా తెలిసిన వాళ్లు వచ్చి రాఖీలు కడతారు. షూటింగులలో ఉన్నప్పుడు ఆ అనుబంధాలు బాగా తెలిసి వస్తాయి. అలా సినీనటి విజయశాంతి నన్ను తన సొంత సోదరుడిలా చూసుకునేది. ప్రతి ఏటా రాఖీలు కట్టేది. సినిమా రంగం నుంచి ఆమె దూరమయ్యాక రాఖీలు కట్టడం తగ్గిపోయింద’ని అక్క ఫాతిమాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ సినీ నటుడు అలీ. -
రాఖీ స్పెషల్ : గోల్డ్ స్వీట్స్
-
రాఖీ స్పెషల్ : ఆ స్వీట్ ధర ఎంతంటే..
అహ్మదాబాద్ : రక్షా బంధన్ పండుగకు ముందు గుజరాత్‌లోని సూరత్‌లో ఓ స్వీట్ షాప్‌లో బంగారు పూతతో చేసిన డ్రై ఫ్రూట్ స్వీట్‌ను కిలో రూ 9000కు విక్రయిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా బంగారు పూతతో చేసిన స్వీట్లకు భారీ డిమాండ్ నెలకొంది. 24 క్యారట్స్ మిఠాయి మేజిక్ పేరుతో ఉన్న ఈ షాప్‌లో 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో పలు వెరైటీ స్వీట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ స్వీట్లకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని షాప్ యజమాని బ్రిజ్ మిఠాయివాలా చెప్పకొచ్చారు. బంగారు పూతతో చేసిన ఆహారంతో పలు ఆరోగ్య ప్రయోజనాలుండటంతో ఈ స్వీట్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ నెల 26న రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారు. -
రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకులు
-
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి
న్యూఢిల్లీ: రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాఖీ కట్టారు.103 ఏళ్ల బామ్మ షర్బతి దేవి సోమవారం మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చారు. బామ్మతో రాఖీ కట్టించుకున్న ప్రధాని... ఆమెతో ఆత్మీయంగా మాట్లాడారు. వీల్ చెయిర్‌కు దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని ఆమెతో ముచ్చటించారు. Smt. Sharbati Devi, a 103 year old widow, today visited the PM's residence, and tied a Rakhi on PM @narendramodi's wrist. pic.twitter.com/IwRq1QiBhj — PMO India (@PMOIndia) 7 August 2017 50ఏళ్ల క్రితమే తన సోదరుడిని కోల్పోయిన షర్బతి దేవి ప్రధానిలో తన సోదరుడిని చూసుకుని మురిసిపోయింది. అంతేకాకుండా ప్రధానిని చేతులతో నిమిరి, ఆశీర్వదించారు. ఈ విషయాన్ని పీఎంవో కార్యాలయం ట్విట్ చేసింది. మరోవైపు పలువురు స్కూల్ విద్యార్థినులు ప్రధానికి రాఖీ కట్టారు. -
చెట్లకు రాఖీలు కట్టిన సీఎం, డిప్యూటీ సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ రక్షా బంధన్‌ను వినూత్నంగా, కొంత సందేశాత్మకంగా జరుపుకున్నారు. వారిద్దరు పట్నాలో మొక్కలకు రాఖీలు కడుతూ సందడిగా కనిపించారు. తాము చెట్లకు రాఖీ కట్టిన ఉద్దేశం ప్రజలు వాటిని సంరక్షించాలని పిలుపునివ్వడమేనని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా అభివృద్ది చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటిలా మాదిరిగా తెల్లటి కుర్తా పైజామాలో వచ్చిన నితీష్ కుమార్ 'మొక్కలను సంరక్షించాలని చెప్పేందుకు ఇది (మొక్కలకు రాఖీ కట్టడం) ఒక సంకేతం. హరితవనం పెంచాలని చెప్పడం దీని ఉద్దేశం. ఇది పర్యావరణానికి అత్యంతముఖ్యమైనది' అని ఆయన చెప్పారు. 2001 నుంచి తాను రాఖీలు చెట్లకు కడుతున్నానని తెలిపారు. తన సందేశాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారని, తమ రాష్ట్రంలో గ్రీనరీ కూడా బాగా పెరిగిందని తెలిపారు. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని తెలిపారు. -
ఆమెకు మోదీ 'నరేంద్ర భాయ్'
న్యూఢిల్లీ: ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళ. పెళ్లి అయిన తర్వాత భారత్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్న ఆమె గత 22 ఏళ్లుగా ఇక్కడే రాఖీ ఉత్సవం జరుపుకుంటోంది. కచ్చితంగా ఓ వ్యక్తికి ఆమె రాఖీ కడుతుంటుంది. కానీ, ఈ సంవత్సరం మాత్రం అలా జరుగుతుందో లేదో అని కాస్త ఆందోళన పడింది. అయితే, ఆమె ఆందోళనను తలగిందులు చేస్తూ ఆ వ్యక్తి నుంచి రాఖీ కట్టేందుకు ఆహ్వానం అందింది. దీంతో ఆమె మనసులోని ఆందోళన స్థానంలో ఆనందం వెళ్లి విరిసింది. ఇంతకీ ఆమెతో రాఖీ కట్టించుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు.. మన ప్రధాని నరేంద్రమోదీ. అవునూ, ఖమర్ మోసిన్ షేక్ అనే మహిళ గత 22 ఏళ్లుగా నేటి ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారంట. మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆమె మోదీకి రాఖీ కడుతున్నారంట. అయితే, ప్రస్తుతం ఎన్నికల హడావుడితోపాటు విదేశీ పర్యటనలు, ప్రధాని హోదాలో మరింత బిజీ అవడంతో ఈసారి అవకాశం ఉంటుందో ఉండదో అని భావించిన ఆమెకు సరిగ్గా రెండు రోజుల కిందటే ఆహ్వానం అందిందట. ఈ సందర్భంగా ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే పరిశీలిస్తే.. 'నేను 22 నుంచి 23 ఏళ్లుగా నరేంద్ర భాయ్‌కి రాఖీ కడుతున్నాను. కానీ, ఈసారి మరింత ఉత్సాహంతో ఉన్నాను. నేను తొలిసారి రాఖీ కట్టినప్పుడు భాయ్ ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్నారు. ఆయన కఠిన శ్రమ, దూరదృష్టికారణంగా ప్రధాని అయ్యారు. ఈ ఏడాది మాత్రం నాకు ఆయన నుంచి ఫోన్ వస్తుందని ఊహించలేదు. కానీ, ఇంత బిజీలో ఉండి కూడా రెండు రోజుల కిందటే నాకు ఆయన నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నాకు అమితానందంగా ఉంది. ప్రస్తుతం నేను రక్షాబంధన్ ఏర్పాట్లలో ఉన్నాను' అంటూ ఆమె చెప్పారు. -
రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకులు
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో విద్యార్థినులు రాఖీ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ నరసింహన్‌కు బ్రహ్మకుమారీలు, పాఠశాలల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. -
అభిషేక్ అరుదైన రాఖీ కానుక
ముంబయి: రక్షాబంధన్‌ను బాలీవుడ్ నటులు తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాఖీ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సోదరి శ్వేతా బచ్చన్‌కు అరుదైన కానుక ఇచ్చారు. తాను సోదరితో కలిసి ఉన్నప్పటి చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి శ్వేతాను సర్ప్రైజ్ చేశారు. ఈ పోస్ట్‌కు విపరీతమైన లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. చిన్ననాటి ఫోటోను ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు శ్వేత తనపై ఫైర్ అవుతుందని చమత్కరించారు. శ్వేతతో తన అనుబంధం ఇలాగే వర్థిల్లుతుందని పేర్కొన్నారు. 43 ఏళ్ల శ్వేతా బచ్చన్ వ్యాపారవేత్త నందాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
హిందూ, ముస్లింల కోసమా రక్షాబంధన్?
న్యూఢిల్లీ: దేశంలో పశ్చిమ బెంగాల్ రూటే సెపరేట్. దేశమంతా పండుగలను పబ్బాలను ఏకరీతిన జరుపుకుంటే బెంగాల్ ప్రజలు అందుకు భిన్నంగా జరుపుకుంటారు. దేశ ప్రజలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటే, బెంగాల్ ప్రజలు దుర్గా పూజ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. విజయదశమి సందర్భంగా దేశమంతా దసరా వేడుకలను జరుపుకుంటే బెంగాల్ ప్రజలు దసరా రోజున కన్నీళ్లు పెట్టుకుంటారు. వారు రాఖీ పండుగను కూడా హిందూ, ముస్లిం ప్రజల సమైక్యతకు చిహ్నంగా జరపుకుంటారు. అంతా విస్తృతంగా లేకపోయినా ఈ రోజున కూడా వారు భాయి, భాయి అంటూ పరస్పరం రాఖీలు కట్టుకొని భిన్న మతాల సమైక్యత గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. విభజించు పాలించు సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్న నాటి బ్రిటీష్ పాలకులు, హిందూ ముస్లింలు ఎక్కువగా ఉన్న సువిశాల బెంగాల్‌ను మతం ప్రాతిపదికన విభజించాలనుకున్నారు. పాలనాపరమైన సౌలభ్యం పేరిట ముస్లింలు ఎక్కువగా వున్న తూర్పు ప్రాంతాన్ని ఒక ప్రాంతంగా (ప్రస్తుత బంగ్లాదేశ్), హిందువులు ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంగా విభజించాలని 1905, ఆగస్టు నెలలో నిర్ణయించారు. అందుకు అప్పటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ కర్జాన్ అక్టోబర్ 16వ తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరించాలంటూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. బెంగాల్ విభజనను అడ్డుకోవాలంటే హిందూ, ముస్లింల మధ్య ఐక్యత పెరగాలని, ఇరుమతాలు ఐక్యతతో పోరాడితే బెంగాల్ విభజనను అడ్డుకోవచ్చని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత రవీంద్ర నాథ్ టాగూర్ భావించారు. హిందూ, ముస్లింల మధ్య సమైక్యతను చాటుతూ బెంగాల్ ప్రజలెవరూ అక్టోబర్ 16వ తేదీన ఇంట్లో వంటచేయరాదని, ఇరుమతాల వారు ఒకరికొకరు రక్షించుకునే విధంగా పరస్పరం రాఖీలు లేదా రక్షాబంధన్‌లు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. నాడు అక్టోబర్ నెల శ్రావణ మాసంలో రావడంతో టాగూర్ తన పిలుపును విజయవంతం చేయడం కోసం ఉదయమే గంగానదికి వెళ్లి పవిత్రస్నానమాచరించి అక్కడి నుంచి ప్రజలతో ఓ ప్రదర్శనగా కోల్‌కతా నగరంలోకి వస్తూ దారిలో కనిపించిన వారందరికి రాఖీలు కడుతూ వచ్చారు. మసీదుల్లోకి వెళ్లి మౌల్వీలకు కూడా రక్షాబంధన్‌లు కట్టారు. అలా హిందూ ప్రజలు ఓ ఊరేగింపులా మసీదుల్లోకి దూసుకుపోయినా మౌల్వీలెవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. బెంగాల్ రక్షణ, ఐక్యత కొనసాగాలని ఆకాంక్షిస్తూ టాగూర్ స్వయంగా రాసిన పాటను ప్రజలు ఆలపిస్తూ ప్రదర్శన వెంట ముందుకు సాగారు. హిందూ ముస్లింలకు ఐక్యతకు చిహ్నంగా ఫెడరేషన్ హాలు నిర్మాంచాలనుకున్న చోటు వరకు వారి ప్రదర్శన సాగింది. అక్కడ భవన నిర్మాణానికి టాగూర్ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి బారిస్టర్ ఆనంద్ మోహన్ బోస్ అక్కడ ఉపన్యాసం ఇవ్వాల్సి ఉండింది. అనుకోకుండా ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆయన ప్రసంగ పాఠాన్ని టాగూర్ చదవి వినిపించారు. అదే సందర్భంగా భవన నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలు వసూలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రజల రాఖీ యాత్ర బాగ్‌బజార్‌లోని పాసుపతి, నంద్లాల్ బసు ఇల్లైన బసు బాటి వద్దకు కొనసాగింది. అప్పటి నుంచి బెంగాల్ ప్రజలు రాఖీ పండుగను హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా జరుపుకుంటూ వచ్చారు. దాంతో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం బెంగాల్ విభజనపై వెనక్కి తగ్గింది. 1911లో బెంగాల్ విభజన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. మరో ఏడాదికి, అంటే 1912లో మళ్లీ బెంగాల్‌ను విభజించాలని నిర్ణయించింది. -
రాష్ట్రపతి భవన్లో రక్షాబంధన్ వేడుకలు
-
తెలుగు ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి : రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారందరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఉండవల్లిలోని తన నివాసంలో రాఖీ కట్టిన మహిళలను సీఎం అభినందించారు. చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాత, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అనూరాధ, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ సతీమణి రజనీ, బ్రహ్మకుమారీలు, తెలుగుపార్టీ మహిళా నాయకురాళ్లు పి. వెంకటలక్ష్మి, వి. రాణి, హేమలత, పద్మావతి, ఐ. అరుణ, మంజూషలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. -
రక్షాబంధన్ కానుకగా మరుగుదొడ్డి
రక్షాబంధన్... ఈ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేదేమిటంటే అన్నాచెల్లెళ్లు ఆ రోజు ఒకచోటికి చేరుకుని తమ బంధాన్ని నెమరువేసుకోవడం. ఇంకా చెప్పాలంటే వారికి ఓ పర్వదినం. ఆ రోజున రాఖీ కట్టిన సోదరికి వారి వారి స్తోమతను బట్టి సోదరుడు కానుకలు ఇవ్వడం ఆనవా యితీ. అది వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు దోహదం చేస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా వాసులు మాత్రం రాఖీ పండుగను విభిన్నంగా జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రక్షాబంధన్ సమీపిస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై జిల్లా స్వచ్ఛతా సమితి ‘విభిన్న అమేథీ–విభిన్న సోదరుడు’ అనే ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ మొత్తం 854 మంది సోదరులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా వీరంతా తమ సోదరీమణులకు మరుగుదొడ్డిని కానుకగా ఇవ్వనున్నారు. సోదరులు ఇచ్చే డబ్బుతో సోదరీమణుల ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. -
రతనాల రాఖీలు
అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు నడుమ ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ ఇది. అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లు రాఖీ కడతారు. రాఖీలు కట్టిన అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములు కానుకలు ఇచ్చి సంతోషపెడతారు. రాఖీ పండుగ గురించి ఇదంతా అందరికీ తెలిసిన ముచ్చటే. ఈ పండుగకు సంబంధించి చాలా పురాణగాథలు ఉన్నాయి. అంతేకాదు, చరిత్రలోనూ రక్షాబంధనానికి ప్రాధాన్యమిచ్చే ఉదంతాలు ఉన్నాయి. ఏటా శ్రావణ పున్నమి నాడు వచ్చే ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిలో వేడుకలు చేసుకుంటారు. రాఖీ పండుగ గురించి, రాఖీల గురించి అవీ... ఇవీ... చరిత్రలో రాఖీ భారత్ మీద క్రీస్తుపూర్వం 326లో దండెత్తిన అలెగ్జాండర్ భార్య రొక్సానా భారతీయ రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టి, తన భర్తకు హాని తలపెట్టవద్దని కోరిందట. అందువల్ల యుద్ధరంగంలో చేతికి చిక్కిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు ప్రాణాలతో విడిచిపెట్టేశాడట. మొఘల్ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తుశకం 1535లో చిత్తోర్ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయం పొందిందట. భర్త మరణించగా చిత్తోర్ రాజ్యపాలన బాధ్యతలు చేపట్టిన రాణి కర్నావతికి గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుంచి బెడదగా ఉండేది. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె హుమయూన్‌కు రాఖీ పంపిందని, హుమయూన్ ఆమెను సోదరిగా అంగీకరించి అభయం ఇచ్చాడనే కథనం ప్రచారంలో ఉంది. అతి పొడవాటి రాఖీ దడ పుట్టించే ధరల్లోనే కాదు, సైజులోని భారీతనంలోనూ రాఖీలు రికార్డులకెక్కుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో 2011 ఆగస్టు 2న జి.బాలకృష్ణ అనే యువకుడు ప్రపంచంలోనే అతి పొడవాటి రాఖీని ప్రదర్శించాడు. దీని పొడవు ఏకంగా 666 అడుగులు. వెడల్పు 4 అడుగులు. దీని తయారీకి ఆయన థర్మోకోల్, కాగితాలు, బ్యానర్ వస్త్రాలు, వాటర్ కలర్స్, గుండుసూదులు వినియోగిచాడు. అతి పెద్ద రాఖీ బెంగళూరులోని బ్రహ్మకుమారిలు 2013 ఆగస్టు 17న ప్రపంచంలోనే అతి భారీ అలంకరణ రాఖీని ప్రదర్శించారు. దీని తయారీకి దాదాపు 150 మంది హస్తకళా నిపుణులు నెల్లాళ్లు శ్రమించారు. దీని ఎత్తు 40 అడుగులు, వెడల్పు 400 అడుగులు. ఈ అతి పెద్ద రాఖీ తయారీకి ఉక్కు గజాలు, స్టైరోఫోమ్, పట్టు వస్త్రం, రిబ్బన్లు, లేసులు, వెదురు చాపలు, తాడు, ఇతర అలంకరణ వస్తువులను ఉపయోగించారు. అతి భారీ రాఖీ భువనేశ్వర్‌లోని ఉత్కళ్ యూనివర్సిటీ విద్యార్థులు బిశ్వకర్మ పండా, యన్నితా ప్రియదర్శిని 2015 ఆగస్టు 29న అతి భారీ రాఖీని ప్రదర్శించారు. ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథస్వామికి అంకితం చేస్తూ రూపొందించిన ఈ రాఖీ పొడవు 500 అడుగులు, వ్యాసం 50 అడుగులు. దీని తయారీకి 300 కిలోల ధాన్యం, 40 కిలోల బియ్యం, రంగులు, ఇతర పదార్థాలు ఉపయోగించారు. సిక్కు రాజ్యపాలకుడు రాజా రంజిత్ సింగ్ భార్య మహారాణి జిందన్ కౌర్ పద్దెనిమిదో శతాబ్దిలో నేపాల్ రాజుకు రాఖీ పంపింది. ఆమెను సోదరిగా అంగీకరించిన నేపాల్ రాజు ఆ సోదర భావంతోనే బ్రిటిష్ సైన్యాలు పంజాబ్‌ను ఆక్రమించుకున్నప్పుడు రాజా రంజిత్ సింగ్ దంపతులకు తన రాజ్యంలో ఆశ్రయం కల్పించాడు. బ్రిటిష్ పాలకులు 1905లో బెంగాల్‌ను రెండుగా విభజించారు. ఈ విభజన హిందూ ముస్లింలలో వైషమ్యాలకు దారి తీసింది. ఉభయ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి, సోదర భావాన్ని పెంపొందించడానికి రక్షాబంధన్ ఒక్కటే తగిన వేడుక అని రవీంద్రనాథ్ టాగోర్ భావించారు. హిందువులకు ముస్లింలు, ముస్లింలకు హిందువులు రాఖీలు కట్టుకోవడం ద్వారా ఉభయుల మధ్య సౌభ్రాతృత్వం నెలకొంటుందని ఆయన ఆకాంక్షించారు. అప్పట్లో ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన రక్షాబంధన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లింలు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో వేడుకలు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగ రోజున రాఖీలు కట్టుకోవడంతో పాటు, రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనినే వారు ‘ఝులన్ పూర్ణిమ’ (ఊయల పున్నమి) అని వ్యవహరిస్తారు. ఒడిశాలో కొన్ని చోట్ల ‘గుమ్మా పున్నమి’గా వ్యవహరిస్తారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, వాటికి రెండువైపులా పొడవైన వెదురుబొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్ది మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టెకొట్టడంలాగానే ఉంటుంది. మహారాష్ట్రలో ఇదే రోజున ‘నారాలీ పూర్ణిమ’ (కొబ్బరి పున్నమి) వేడుకలు జరుపుకొంటారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు... కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచిపెట్టి, వరుణ దేవుడికి పూజలు జరుపుతారు. జమ్ముకశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరుబయటకు వచ్చి గాలిపటాలను ఎగరేస్తారు. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో ఈ వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. ఎక్కడ ఆకాశం వైపు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. నేపాల్‌లో ఇదేరోజున జనై పూర్ణిమగా జరుపుకొంటారు. అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడామగా పిల్లా పెద్దా అందరికీ అక్కడి పూజారులు పవిత్రరక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తికొద్ది కానుకలు సమర్పించుకుంటారు. -
రాఖీ గిఫ్ట్: బస్సుల్లో ఉచిత ప్రయాణం
లక్నో : ఉత్తరప్రదేశ్ మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రక్షాబంధన్ కానుక ఇచ్చారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని మహిళలు ఆ రోజు ఉచితంగా ఎక్కడికైనా బస్సులో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా టిక్కెట్ కొనకుండా ఆగస్టు 6 అర్థరాత్రి నుంచి ఆగస్టు 7 అర్థరాత్రి వరకు మహిళలు ఈ ఉచిత రైడ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు, రవాణా కార్పొరేషన్‌కు యోగిఆదిత్యానాథ్ ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. ఉచితంగా బస్సులో మహిళలు సురక్షితంగా ప్రయాణించేలా రక్షణ కల్పించాలని ఆ రాష్ట్రప్రభుత్వం పోలీసులను కూడా ఆదేశించింది. సంఘవ్యతిరేక కార్యకలాపాలతో వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోలీసులు సాయపడాలన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, యూపీఎస్‌ఆర్‌టీసీకి సంబంధించిన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన యోగి ఆదిత్యానాథ్ ఈ ప్రకటన చేశారు. -
సోదరికి టాయిలెట్ గిప్ట్ గా ఇచ్చాడు..
రాంచీ: రక్షాబంధన్ రోజున తన సోదరికి ఓ అన్న అరుదైన కానుక ఇచ్చాడు. సాధారణంగా రాఖీ కడితే సోదరులు... అక్కా లేదా చెల్లెళ్లకు చీర లేక నగదు రూపంలో బహుమతి ఇస్తుంటారు. అయితే జార్ఖండ్‌లోని రాంగఢ్‌కు చెందిన పింటూ అనే యువకుడు మాత్రం తన సోదరికి మరుగుదొడ్డిని నిర్మించి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపకల్పన చేసిన స్వచ్ఛ భారత్ ద్వారా స్ఫూర్తి పొందిన అతడు ఈ పనికి పూనుకున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనకు వెళ్లడం అనేది ఎంతో ఇబ్బందో తనకు తెలుసునని, అది ఆరోగ్యానికి మంచిది కాదని పింటూ పేర్కొన్నాడు. దీంతో మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు అతడు తెలిపాడు. 'నేను రక్షా బంధన్ సందర్భంగా నా సోదరికి టాయిలెట్ బహుమతిగా అందించాను. ఇతరులు కూడా దీన్ని అనుసరిస్తే బాగుంటుంది' అని సూచన చేశాడు. ఈ నిర్ణయంతో తన సోదరి కూడా సంతోషంగా ఉందని పింటూ తెలిపాడు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందన్నట్లు పింటూ ఆలోచనతో ...ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. కాగా స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. -
రాజ్‌భవన్‌లో ఘనంగా రక్షాబంధన్
సాక్షి, హైదరాబాద్: శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులు, మహిళలు, రాజకీయ ప్రముఖులు.. గవర్నర్ నరసింహన్‌ను కలసి, శుభాకాంక్షలు చెబుతూ ఆయన చేతికి రాఖీలు కట్టారు. రాఖీ కట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ గవర్నర్ నరసింహన్ మాట్లాడి, వారితో రాఖీలు కట్టించుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య బలమైన బంధానికి రక్షాబంధన్ ప్రతీక అన్నారు. మిమ్మల్ని మేం రక్షిస్తామంటూ.. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములంతా భరోసానిచ్చి, వారి బాధ్యతను స్వీకరించాలన్నారు. అలాగే, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనల కవరేజీలో ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ ఆవేదన వ్యక్తంచేశారు. లైంగిక వేధింపుల వీడియోలను పదే పదే ప్రసారం చేయడం మంచిది కాదని.. దీంతో ఆత్మీయులు, బాధితుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఇలాంటివాటిని మీడియా వారు మార్చుకోవాలని.. బాధ్యతాయుతంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. -
బీఎస్ఎఫ్ సిబ్బంధితో ఆశా భోంస్లే రాఖీ పండుగ
గౌహతి: ప్రముఖ గాయిని ఆశాభోంస్లే(82) రాఖీ పౌర్ణమి పండుగను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) సైనికులతో అసోంలోని గౌహతిలో జరుపుకున్నారు. ఈ రక్షాబంధన్ వేడుకను ఆర్మీ సోదరులకు అంకితం చేస్తున్నానని ఆమె ట్వీటర్లో కామెంట్ చేశారు. ఈసందర్భంగా ఫోటోలను పోస్ట్ చేశారు. ఆశా భోంస్లేను అసోం సాంప్రదాయ పద్దతిలో సైనికులు స్వాగతం పలికారు. -
ఆడపిల్లల రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
-
రాఖీ వేడుకల్లో తారలు..
సినీ ప్రముఖులంతా రక్షా బంధన్ వేడుకల్లో ఉన్నారు. రాఖీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్.. తన సోదరి నీహారికతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బాన్సువాడలో శేఖర్ కమ్ముల 'ఫిదా' షూటింగ్లో బిజీగా ఉన్న అన్న దగ్గరకు వెళ్లి రాఖీ కట్టింది ఈ మెగా చెల్లెలు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్.. 'ధృవ' షూటింగ్ సెట్స్‌లో ఉంది. రకుల్ తమ్ముడు అమన్.. షూటింగ్ స్పాట్‌కు వెళ్లి అక్కకు తన చెయ్యందించాడు. ఆనందంగా రాఖీ కట్టిన రకుల్.. 'ఎంత ఫైట్ చేసుకున్నా..నువ్వే నా బలం తమ్ముడూ' అంటూ ప్రేమనంతా ట్వీట్ రూపంలో బయటపెట్టింది. గులాబీ బాల హన్సిక తన సోదరుడికి రాఖీ కడుతూ, అతడిని ఆశీర్వదిస్తూ.. బోలెడంత సంతోషాన్ని వ్యక్తపరిచింది. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తన సోదరుడితో జరుపుకున్న రాఖీ వేడుకలను ట్విట్టర్లో పంచుకుంది. 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ తన సోదరితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అన్నదమ్ముల్లాంటి మంచి అక్కచెల్లెళ్లం మేం.. అంటూ అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది. బ్రదర్స్ లేని అమ్మాయిలందరూ.. తమ సిస్టర్స్‌ను సర్ప్రైజ్ చేయమంటూ ట్వీట్ చేసింది. అలాగే బాలీవుడ్ ప్రముఖులు కూడా రాఖీ పౌర్ణమిని సంబరంగా జరుపుకుంటున్నారు. అభిషేక్ బచ్చన్, పరిణీతి చోప్రా, సూరజ్ పంచోలీ తదితరులు శుభాకాంక్షలతోపాటు తోబుట్టువులతో దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. జూహీ చావ్లా దూరమైపోయిన తన సోదరుడిని తలచుకుంటూ తన చిన్ననాటి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
నేడు రక్షాబంధన్
-
అనుబంధాల ‘రక్ష’
సందర్భం : నేడు రాఖీ పౌర్ణమి అనంతపురం కల్చరల్ : మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ’రక్షా బంధన్‘ సంప్రదాయ విలువలను మరింత ఉట్టిపడేలా చేస్తోంది. ఉన్మాదత్వం, వెకిలి చేష్టలు పేట్రేగి, మానవతా విలువలు మంటగలుస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో ’రాఖీ పౌర్ణమి‘ తన విశిష్టతను చాటుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. కేవలం అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు స్నేహానికీ ఈ బంధనం ప్రతీకగా నిలుస్తోంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే. ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగను శ్రావణ పౌర్ణమిగా మరి కొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ‘ఆవని ఆవిట్టం’, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో ‘కజరి పూర్ణిమ’గా రక్షాబంధన్‌ని నిర్వహిస్తుంటారు. గోవా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఈ పండుగతోనే కొత్త రుతవు ప్రారంభమైనట్లు అక్కడి ప్రజలు భావిస్తారు. ఆత్మీయ బంధాలను గాలికోదిలేస్తున్న ప్రస్తుత కాలంలో బ్రిటన్, నేపాల్, కెనడా తదితర దేశాల్లో రాఖీ పౌర్ణమిని జరుపుకుంటుండడం గమనార్హం. అనంతపురంలో వివిధ వర్గాల వారికి రాఖీ కట్టడానికి పలు స్వచ్ఛంద సంస్థలు సిద్ధమవుతున్నాయి. రాఖీ పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న కొందరి అభిప్రాయాలిలా... రాఖీ అంటే నిండుచంద్రుడే భారతీయ సనాతన ఆచారాలలో రక్షాబంధనానికి విశేష ప్రాముఖ్యత ఉంది. మతాలకతీతంగా సాగే జాతీయ పండుగ ఇది. భగవంతుని రక్ష అవసరమని చెప్పేది రాఖీ విశిష్టత. సమాజంలో అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తూ మేం రాఖీలు కడతాం. ప్రపంచవ్యాప్తంగా రాఖీని జరిపేది మా సంస్థ మాత్రమే. – శారదక్క, బ్రహ్మకుమారీ సమాజ్, అనంతపురం ఇన్చార్జి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ నాడు మా ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. ఉద్యోగాల రీత్యా మా తమ్ముళ్లు ఒకరు సింగపూరులో, మరొకరు తిరుపతిలో ఉంటున్నారు. వాళ్లకు రాఖీలను పోస్టు ద్వారా పంపిస్తాను. – గీతా గాంధీవాణి, యువజన సంక్షేమ శాఖ అధికారి ఆత్మీయతకు బంధం మా చిన్నప్పుడు కోయిలకుంట్లలో ఉండేవాళ్లం. ఉద్యోగాలరీత్యా మా అక్కాచెల్లెలు అవుకులో ఉంటున్నారు. మా మధ్య ఆత్మీయతకు బంధంగా క్రమతప్పకుండా పోస్టుల్లోనైనా వారు రాఖీలు పంపి శుభాకాంక్షలు చెబుతుంటారు. – బీఎస్ సుబ్బారాయుడు, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పోస్టులోనైనా రాఖీ వస్తుంది మాకు అక్క మాత్రమే ఉంది. చిన్నప్పుడు బాగా సరదాగా ఉండేవాళ్లం. ఇప్పుడు అక్కయ్య వాళ్లు చిత్తూరులో ఉన్నారు. అయినా రాఖీని పోస్టల్లోనైనా పంపిస్తుంది. ఇతర ఉద్యోగులు కూడా రాఖీ కడతారు. – వెంకటరమణ, డీఎంహెచ్ఓ ఆత్మీయులను కలిపే బంధం ప్రస్తుతం మా అక్కచెల్లెళ్లలో ఒకరు గుంటూరు, మరొకరు హైదరాబాదులో ఉంటున్నారు. మాకు ఒక అబ్బాయి. ఒక అమ్మాయి. వాళ్లు కూడా దూరంగా ఉంటున్నా రాఖీ పండుగ నాడు అందరూ క్రమం తప్పకుండా కలుస్తుంటాం. – ప్రసాద్, హౌసింగ్ పీడీ భారతీయ వ్యవస్థకు ప్రతిబింబం భారతీయ కుటుంబ వ్యవస్థలో అనుబంధం చాలా బలమైంది. ఆప్యాయతకు ప్రేమానురాగాలకు రాఖీ ప్రతీక. నాకు ఇద్దరు చెల్లెళ్లున్నారు. ప్రతి రాఖీ పండుగను మేము ఉత్సాహంగా జరుపుకుంటాం. మా సిస్టర్స్ ఎక్కడున్నా నాకు రాఖీ కట్టాలని వస్తారు. మరీ దూరంగా ఉన్నప్పుడు పోస్టులో పంపిస్తారు. వాళ్ల దీవెనలే మాకు శ్రీరామరక్ష. – అంజయ్య, జిల్లా విద్యాశాఖాధికారి -
రాఖీకి పోస్టల్ శాఖ అరుదైన కానుక
ముంబై: ముంబై పోస్టల్ శాఖ రక్షా బంధన్ సందర్భంగా అన్నచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు సంతోషపడే నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండురోజులు రావడంతో రాఖీ పౌర్ణమిరోజు సోదరసోదరీమణుల ఆనందాన్ని ఇనుమడింప చేసే లక్ష్యంతో అరుదైన నిర్ణయం తీసుకుంది. ఎక్కడో దూరాన ఉన్న అక్కాచెల్లెళ్లు పంపించే రాఖీలను సకాలంలో డెలివరీ చేయాలనే యోచనతో ఆగస్ట్14 ఆదివారం ముంబై పోస్టల్ డిపార్ట్ మెంట్ పనిచేయాలని నిర్ణయించుకుంది. శనివారం సెమీ క్లోజ్డ్ , ఆదివారం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సం సెలవు లు రావడంతో పోస్ట్ ద్వారా వచ్చిన రాఖీలు ప్రతి వినియోగదారునికి బట్వాడా చేయడం కోసం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ముంబై నగరం, థానే / నవీ ముంబై, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాలలో ప్రధాన పోస్ట్ కార్యాలయం ఆదివారం నాడు ప్రత్యేకంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఇ- కామర్స్ వ్యాపారంలో గణనీయమైన వృద్ధి ఉందనీ, అందుకే సాధారణ వాటితో పాటూ, ప్రత్యేకంగా వచ్చిన రాఖీ కానుకలను కూడా రాఖీ రోజు పంపిణీ చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నామని అసిస్టెంట్ డైరెక్టర్ వీవీ నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముంబై పోస్టల్ ప్రాంతం అంతటా ముంబై నగరం, పొరుగున ఉన్న థానే, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాల అంతటా బలమైన నెట్ వర్క్ ఉందని..దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తమ ఈ నిర్ణయం లక్షల వినియోగదారులకు సరైన సమయానికి అందించడానికి మార్గం సుగమం చేసిందని ఆయన తెలిపారు. రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి గా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకుసూచికగా రాఖీలు కట్టుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే మొదట్లో ఉత్తర, పశ్చిమ భారతదేశాలకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇపుడు సర్వత్రా వ్యాపించిన సంగతి తెలిసిందే. -
రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది!
జైసల్మేర్ : రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని బిల్ తెగ వారి పరిస్థితి మరోలా ఉంది. రాఖీ వచ్చిందంటే చాలు వారి ఆనందం ఆవిరయిపోయి.. ఓ విషాధంగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలసలు ఎక్కువగా ఉన్నాయి. మరికొందరికి పెళ్లిళ్ల తర్వాత వారి కుటుంబాలకు దూరం కావాల్సిన దుస్థితి తలెత్తింది. భారత్-పాక్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికి విదితమే. వివరాల్లోకి వెళితే.. లాచో దేవి అనే మహిళ జైసల్మేర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఐదేళ్లయింది. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా తన సోదరులకు ఆమె రాఖీ కట్టలేకపోయింది. కారణం.. ఆమె సోదరులు, వారి కుటుంబాలు పాక్ లో ఉంటున్నాయి. వీసాలేని కారణంగా ఆమె అక్కడికి వెళ్లలేకపోతోంది. వీసా పొందడం చాలా కష్టంగా ఉన్నందువల్లే తన సోదరులను కలుసుకోలేక పోతున్నానంటూ రక్షా బంధన్ పండుగ నాడు కన్నీరుమున్నీరయింది. తమకు రక్షా బంధన్ రోజైనా సోదరులను, సోదరిలను కలుసుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని గీనా రామ్ ప్రాధేయపడ్డారు. ఇరు దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, ఇందులో చాలా మార్పులు రావాలని బిల్ వర్గం నాయకుడు నాథూరామ్ అన్నారు.వీసా లేకపోవడంతో సరిహద్దులే.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధాల మధ్య హద్దులను ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. మా వర్గానికి చెందిన చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉందని ఆయన వాపోయారు. రాఖీ పండుగ వచ్చిందంటే వారి బాధలు, కష్టాలు రెట్టింపవుతాయి. -
మహిళలందరికీ రక్షణ కల్పిస్తాం : గవర్నర్
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఆడపడుచుకు రక్షణ కల్పిస్తామని, ఆడ శిశువులను రక్షించుకుంటామని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ భరోసా కల్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని అభిలాషించారు. రక్షా బంధన్ వేడుకల్లో భాగంగా శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, విమల నరసింహన్ దంపతులు పాల్గొని పాఠశాలల చిన్నారుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులోని నాగార్జున వర్శిటీలో ర్యాగింగ్‌కు రిషితేశ్వరి అనే విద్యార్థిని బలైన ఘటనపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా వున్నాయని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ర్యాగింగ్ నిర్మూలన కోసం విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యాంటి ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. మళ్లీ ర్యాగింగ్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు ఇంజక్షన్ సూదులను గుచ్చి పారిపోతున్న సైకోను త్వరలో పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సంచలనాల కోసం పాకులాడవద్దని మీడియాకు హితవు పలికారు. సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని గవర్నర్ దంపతులకు రాఖీలు కట్టారు. జవహర్ హైస్కూల్‌కు చెందిన ముస్లిం విద్యార్థినులు గవర్నర్ దంపతులకు రాఖీ కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రహ్మకుమారీస్ మఠం బీకే కుల్దీప్, బీకే మంజు, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియాకు రక్షణ : రాజ్‌భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఓ ఎలక్ట్రానిక్ మీడియా మహిళా విలేఖరి గవర్నర్‌కు రాఖీ కట్టారు. 'మీ రిపోర్టర్ రాఖీ కట్టారు. మీడియాకు సైతం రక్షణ కల్పిస్తాం' అని చమత్కరించడంతో నవ్వులు విరిశాయి.