
సాక్షి, అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు.
(చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?)