Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా | Sakshi Special Story About Rakhi Purnima 2024 | Sakshi
Sakshi News home page

Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా

Published Mon, Aug 19 2024 12:44 AM | Last Updated on Mon, Aug 19 2024 12:44 AM

Sakshi Special Story About Rakhi Purnima 2024

శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ సంప్రదాయ బద్ధంగా ఆనాడు ఏం చేయాలో... రాఖీ కట్టడంలోని అంతరార్థం ఏమిటో తెలిసినవారు అరుదనే చె΄్పాలి.

పూర్ణిమనాడు శ్రవణానక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసమని పేరు. శ్రావణమాసంలో రాత్రివేళ పూర్ణిమ తిథి ఉన్న రోజును రక్షికా పూర్ణిమ అన్నారు పెద్దలు. రక్షించగలిగిన పూర్ణిమ, రక్షణ కోరుకునే వారికోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ అని అర్థం. ఈ పండుగ కాస్తా కాలక్రమంలో రాఖీపూర్ణిమగా పేరు మార్చుకుంది.

శ్రావణ పూర్ణిమనాడు ఉదయమే స్నానం చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక  సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి 
ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.

అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి కడుతూ– ‘ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. అయితే ఇది ఇప్పటి ఆచారం కాదు... ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే!రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక అంతటితో వదిలేయకూడదు. ఆ బంధానికి కట్టుబడి ఒకరికి ఒకరు అన్నింటా అండగా నిలవాలి. 

మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. అంతేకాదు.. దేశ రక్షణలో పాల్గొనే సరిహద్దు భద్రతాదళాలకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి విజయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమిరోజు రక్షాబంధనం కడుతుండటం శుభపరిణామం.

స్థితి కారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమనాడే నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేనూ రక్షించేవాడిగానే ఉండాలని అర్థం చేసుకోవడానికే శ్రావణపూర్ణిమని ఈ పండుగ రోజుగా నిర్ణయించారని గమనించాలి. అంతేకాదు, అపరాహ్ణ సమయంలో రక్షికని కడుతున్న నా రక్షికాబంధానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యుడని తెల్పడానికే. 

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!

రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమై΄ోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. 

ఈ పండుగలోని హంగులు, ఆర్భాటాల మాట ఎలా ఉన్నా, తమకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతూ... తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయÆ . ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో çమాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. 

– డి.వి.ఆర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement