ఖమ్మం అర్బన్: ఖమ్మంలో ఓ సోదరుడు తన అక్కకు రూ.56 వేల విలువైన రూ.5 నాణేలతో తులాభారం వేసి కానుక అందజేయడం ద్వారా తన ప్రేమను చాటుకున్నాడు. భదాద్రి కొత్తగూడెం జిల్లా గార్ల బయ్యారానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బొలగాని బసవనారాయణ ఖమ్మంలో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె రణశ్రీకి గత ఏడాది వివాహం జరగ్గా, కుమారుడు త్రివేది పదో తరగతి చదువుతున్నాడు.
ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా తనకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని రూ.5 నాణేలుగా మారుస్తున్న త్రివేదిని ఎవరడిగినా ఎందుకో చెప్పేవాడు కాదు. వివాహమయ్యాక తొలిసారి రాఖీ కట్టేందుకు వస్తున్న సోదరికి ఈ నాణేలతో తులాభారం వేసి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు త్రివేది.. తన తల్లిదండ్రులకు పండుగ ముందురోజు చెప్పాడు. దీంతో శుక్రవారం బంధువులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో తులాభారంపై ఒక వైపు అక్కను కూర్చోపెట్టి మరో వైపు అక్క బరువు ఎత్తు తాను సేకరించిన రూ.5 నాణేలను ఉంచి బహుమతిగా ఇవ్వడంతో ఆమె మురిసిపోయింది. (క్లిక్: ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం)
పంచ పాండవుల పూలే రాఖీలు
మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ రాఖీలతో అందరూ రక్షాబంధన్ జరుపు కొంటారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య ఇంట్లో మాత్రం రాఖీ పండుగ వినూత్నంగా జరుగుతుంది. వీళ్ల ఇంట్లో పంచపాండవుల పూలతోనే రాఖీలు కట్టుకుంటారు. రాఖీల పోలికతో ఉండే ఈపంచపాండవుల పూలను రాఖీలుగా తయారు చేసి కట్టుకోవడం గొప్ప అనుభూతిని స్తున్నందని అయిలయ్య చెబుతున్నాడు. అయిలయ్య కొన్నే ళ్లుగా కూర గాయలు, పండ్లు, పూల నర్సరీలను పెంచుతుండటంతో కూర గాయల అయిలయ్యగా అందరికీ చిరపరిచితం.
– హుస్నాబాద్
Comments
Please login to add a commentAdd a comment