thulabharam
-
టమాటాలతో తులాభారం
-
5 రూపాయల నాణేలతో అక్కకు తులాభారం
ఖమ్మం అర్బన్: ఖమ్మంలో ఓ సోదరుడు తన అక్కకు రూ.56 వేల విలువైన రూ.5 నాణేలతో తులాభారం వేసి కానుక అందజేయడం ద్వారా తన ప్రేమను చాటుకున్నాడు. భదాద్రి కొత్తగూడెం జిల్లా గార్ల బయ్యారానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బొలగాని బసవనారాయణ ఖమ్మంలో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె రణశ్రీకి గత ఏడాది వివాహం జరగ్గా, కుమారుడు త్రివేది పదో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా తనకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని రూ.5 నాణేలుగా మారుస్తున్న త్రివేదిని ఎవరడిగినా ఎందుకో చెప్పేవాడు కాదు. వివాహమయ్యాక తొలిసారి రాఖీ కట్టేందుకు వస్తున్న సోదరికి ఈ నాణేలతో తులాభారం వేసి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు త్రివేది.. తన తల్లిదండ్రులకు పండుగ ముందురోజు చెప్పాడు. దీంతో శుక్రవారం బంధువులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో తులాభారంపై ఒక వైపు అక్కను కూర్చోపెట్టి మరో వైపు అక్క బరువు ఎత్తు తాను సేకరించిన రూ.5 నాణేలను ఉంచి బహుమతిగా ఇవ్వడంతో ఆమె మురిసిపోయింది. (క్లిక్: ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం) పంచ పాండవుల పూలే రాఖీలు మార్కెట్లో దొరికే రెడీమేడ్ రాఖీలతో అందరూ రక్షాబంధన్ జరుపు కొంటారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య ఇంట్లో మాత్రం రాఖీ పండుగ వినూత్నంగా జరుగుతుంది. వీళ్ల ఇంట్లో పంచపాండవుల పూలతోనే రాఖీలు కట్టుకుంటారు. రాఖీల పోలికతో ఉండే ఈపంచపాండవుల పూలను రాఖీలుగా తయారు చేసి కట్టుకోవడం గొప్ప అనుభూతిని స్తున్నందని అయిలయ్య చెబుతున్నాడు. అయిలయ్య కొన్నే ళ్లుగా కూర గాయలు, పండ్లు, పూల నర్సరీలను పెంచుతుండటంతో కూర గాయల అయిలయ్యగా అందరికీ చిరపరిచితం. – హుస్నాబాద్ -
సంప్రదాయ పంచెకట్టు..తామర పూల తులాభారం
-
సంప్రదాయ పంచెకట్టు..తామర పూల తులాభారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో భాగంగా ఈ రోజు ( శనివారం) త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ కేరళ దుస్తులు పంచెకట్టుతో సరికొత్త గెటప్‌లో గురువాయుర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిబంధనలను పాటించిన మోదీ పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. శనివారం ఉదయం కొచ్చి చేరుకున్న ప్రధాని, కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్‌కు చెందిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గురువాయూర్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు పూర్వ కుంభంతో దేశ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మోదీ 'నెయ్యాభిషేకం' , 'కాలాభాం' వంటి ఇతర ఆలయ ఆచారాలను కూడా పాటించారు. ముఖ్యంగా 111 కిలోల తామర పువ్వులతో తులాభారం సమర్పించారు. తమిళనాడులోని నాగార్కోల్ నుంచి ప్రత్యేకంగా 111 కిలోల తామర పువ్వులు తెప్పించారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండవసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారిగా గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. 2008లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక, గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు మోదీ. కేరళను బీజేపీ దూరంగా ఉంచుతోందన్న విమర్శల నేపథ్యంలో తన తొలి పర్యటనకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం ఒక విశేషం కాగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై తనకు ఎంత ప్రేమ ఉందో కేరళపై కూడా అంతే ప్రేమ ఉందంటూ మోదీ తన ప్రసంగంలో భరోసా ఇవ్వడం మరో విశేషం. -
ప్రియాంకకు లడ్డూలతో తులాభారం!
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా అమేథీకి వెళ్లిన ప్రియాంక బుధవారం అర్థరాత్రి సమయంలో పార్టీ నేత ఫతే బహదూర్ ఇంటివద్ద ఆగారు. అప్పటికే అక్కడ ప్రియాంకకు తులాభారం వేసేందుకు లడ్డూలు సిద్ధంచేశారు. అయితే, తులాభారం వద్దని ప్రియాంక సున్నితంగా తిరస్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటు 2022లో యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషిచేయాలని సూచించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె అయోధ్యను సందర్శించనున్నారు. ప్రియాంకా గాంధీకి ఆతిథ్యం ఇచ్చిన పార్టీ నేత ఫతే బహదూర్ సహా పలువురు కార్యకర్తలపై కేసు నమోదైందని డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రామ్ మనోహర్ మిశ్రా వెల్లడించారు. కాలపరిమితిని దాటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు దాఖలైందని తెలిపారు. -
నాలుగేళ్ల ఎదురుచూపులు ఫలించాయి
-
వైఎస్ జగన్‌కు లడ్డూలతో తులాభారం
-
ఖమ్మం జిల్లాలో గోమాతకు తులాభారం
-
శ్రీవారికి సింధూ తులభారం
– 68 కిలోల బెల్లంతో మొక్కులు సమర్పణ – శ్రీవారికి తలనీలాలు సమర్పించిన గోపిచంద్ సాక్షి,తిరుమల: రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం విజేత పీవీ సింధూ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి మొక్కులు సమర్పించారు. కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా తలనీలాల మొక్కులు సమర్పించారు. ఉదయం వేళ తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధూ రాగా, సతీమణితో కలసి పుల్లెల గోపీచంద్ ఆలయానికి వచ్చారు. ముందుగా బెల్లంతో తులాభారం సమర్పించారు. తర్వాత శ్రీవారి, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో పోల భాస్కర్ లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ వారి వెంట ఉన్నారు. బాధ్యత పెరిగింది.. మరింత కష్టపడతా: పీవీ సిం«ధూ రియో ఒలింపిక్స్‌లో వెండిపతకం సాధించడంతో తనపై బాధ్యత పెరిగిందని, మరింత కష్టపడి దేశానికి మంచిపేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పీవీ సింధూ అన్నారు. ఒలింపిక్స్ ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నానని , పతకం సాధించి మళ్లీ వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో అమ్మాయిలకు ప్రోత్సాహం అందిస్తే మరికొందరి ప్రతిభ తప్పక వెలుగు చూస్తుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దేవుడి కృప ఉండాలని ప్రార్థించాను : పుల్లెల గోపీచంద్ తిరుమల శ్రీవారి ఆశీస్సులు, సింధూ ఆటతీరుతో ఒలింపిక్స్‌లో పతకం వచ్చిందని, ఎల్లప్పుడూ ఆ దేవదేవుని కృప ఉండాలని కోరుకున్నానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు.