
రాయ్‌బరేలీలో ప్రియాంకకు జ్ఞాపికను అందజేస్తున్న ఆమె అభిమానులు
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా అమేథీకి వెళ్లిన ప్రియాంక బుధవారం అర్థరాత్రి సమయంలో పార్టీ నేత ఫతే బహదూర్ ఇంటివద్ద ఆగారు. అప్పటికే అక్కడ ప్రియాంకకు తులాభారం వేసేందుకు లడ్డూలు సిద్ధంచేశారు. అయితే, తులాభారం వద్దని ప్రియాంక సున్నితంగా తిరస్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటు 2022లో యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషిచేయాలని సూచించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె అయోధ్యను సందర్శించనున్నారు. ప్రియాంకా గాంధీకి ఆతిథ్యం ఇచ్చిన పార్టీ నేత ఫతే బహదూర్ సహా పలువురు కార్యకర్తలపై కేసు నమోదైందని డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ రామ్ మనోహర్ మిశ్రా వెల్లడించారు. కాలపరిమితిని దాటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు దాఖలైందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment