laddu
-
తిరుమల శ్రీవారి ప్రతిష్ట దిగజార్చేలా కూటమి కుట్రలు
-
తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి బయటపడటానికి బాబు యత్నిస్తున్నారు
-
తిరుమల లడ్డూ కేసులో నలుగురు అరెస్ట్
-
యూపీ: బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం
-
తిరుమల లడ్డూ కౌంటర్లో మంటలు
-
'గోంద్ లడ్డు'..పోషకాల గని..!
కావలసినవి: గోంద్ (ఎడిబుల్ గమ్) – ము΄్పావు కప్పు; బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; రైజిన్స్ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము– 2 కప్పులు; బెల్లం పొడి– ఒకటింపావు కప్పు; ఖర్జూరాలు (గింజలు తొలగించినవి) – అర కప్పు; గసగసాలు– 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్. తయారీ: మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి గోంద్‌ను వేయించాలి. చల్లారిన తర్వాత చిదిమి పొడి చేయాలి లేదా చపాతీలు చేసే పీట మీద వేసి చపాతీల కర్రతో ΄పొడి చేయవచ్చు. చిన్న రోలు ఉంటే అందులో వేసి దంచి పొడి చేసుకోవచ్చు. ఒక బాణలిలో కొబ్బరి తురుము, గసగసాలు, కిస్మిస్, మిగిలిన గింజలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయిస్తూ, వేయించిన దినుసులన్నింటినీ ఒకే పాత్రలో వేయాలి. అందులో యాలకుల పొడి, ఖర్జూరాలు, గోంద్ పొడి వేసి సమంగా కలిసే వరకు స్పూన్‌తో కలపాలి. మరొక పాత్రలో బెల్లం పొడి వేసి మూడు టేబుల్ స్పూన్ల నీటిని ΄ోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి అందులో గోంద్పొడి తోపాటు దినుసులన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని వేసి కలపాలి. వేడి తగ్గే వరకు ఆగాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డులు చేయాలి. పై కొలతలతో చేస్తే 16 లడ్డులు వస్తాయి. గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఇది గోధుమ జిగురు. మార్కెట్లో గోంద్ కటిరా పేరుతో దొరుకుతుంది. ఒక్కో లడ్డులో పోషకాలు ఇలా ఉంటాయి..కేలరీలు – 120–130; కార్బోహైడ్రేట్లు – 15–18 గ్రాములు; ప్రోటీన్లు – 2–3 గ్రాములు;ఫ్యాట్ – 6–7 గ్రా.; ఫైబర్– 1–2 గ్రాములుప్రయోజనాలు..గోంద్ దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. చల్లటి వాతావరణంలో దేహానికి తగినంత వెచ్చదనాన్నిస్తుంది. గింజల నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, దేహానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయి.బెల్లంలో ఐరన్, జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొబ్బరి తురుములో ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఖర్జూరాలు, రైజిన్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ఉండటంతోపాటు అవి శక్తినిస్తాయి. (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
తిరుమల లడ్డూపై సీబీఐ సిట్ విచారణ
-
Diwali 2024 మోతీ చూర్ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!
ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యంహిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:రెండు కప్పుల సెనగపిండి రెండు కప్పుల పంచదారయాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్మిస్ బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,కర్పూరం పొడితయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.పంచదార పాకంఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.బూందీ తయారీస్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్కిన్పై ఉంచాలి.తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి. -
మోదీకి ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేక్.. రష్యా స్పెషల్!
కజాన్: బ్రిక్ శిఖరాగ్ర సదస్సులో వాడీవేడీ చర్చల కోసం రష్యాలోని కజాన్ నగరంలో ల్యాండయిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఛక్–ఛక్ లడ్డూలు, కొరొవాయ్ కేకులు స్వాగతం పలికాయి. ఈ కొత్తరకం పేర్ల వంటకాలను చూసి నెటిజన్లు ఆన్లైన్లో వీటి ప్రత్యేకత గురించి తెగ వెతికేస్తున్నారు. ప్రధాని మోదీకి రష్యా స్థానిక మైనారిటీలైన టాటర్ మహిళలు తమ సంప్రదాయ వేషధారణ, వంటకాలతో స్వాగతం పలికారు. ఇందులో ప్రధానంగా ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వంటకాల్లో రష్యా సంప్రదాయ, చారిత్రక విశిష్టత దాగి ఉంది. కజాన్ నగరం ఉన్న టాటర్, బష్కిర్ ప్రాంతాల ఆహార, ఆతిథ్య సంప్రదాయాలు వీటిలో సమ్మిళితమై ఉన్నాయి. ఏమిటీ ఛక్–ఛక్ లడ్డూ? ఛక్–ఛక్ లడ్డూను ప్రధానంగా గోధుమ పిండితో తయారుచేస్తారు. గోధుమపిండితో చపాతీలు చేసి పెనంపై కాల్చకుండా సన్నగా నిలువుగా, అడ్డంగా చిన్నచిన్న చతురస్రాకారపు గడుల్లా కత్తిరించుకోవాలి. తర్వాత వీటిని నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత బెల్లం లేదా చక్కెర పాకం తయారుచేసి అందులో కలుపుకుని గట్టిపడ్డాక లడ్డూలాగా గుండ్రంగా చేసుకోవాలి. అంతే ఛక్–ఛక్ లడ్డూ తయార్. ఛక్–ఛక్ లడ్డూ అంటే ఇక్కడి ప్రాంతవాసులకు ఎంతో ఇష్టం. దీన్ని రుచిచూడటానికి ఇవ్వగానే మోదీ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇది భారత్‌లో తయారుచేసే వంటకంలా ఉందని వ్యాఖ్యానించారు. బిహార్ వంటకం ముర్హీ కా లాయ్, పశ్చిమబెంగాల్ వంటకం మురీర్ మోవా, ఒడిశా వంటకం మువాలా ఉందని సరదాగా అన్నారు. ఛక్–ఛక్ లడ్డూ మూలాలు టాటర్స్థాన్, బష్కోర్టోస్థాన్లలో ఉన్నాయని స్థానికులు చెబతున్నారు. టాటర్‌స్థాన్‌లో ఇది జాతీయ మిఠాయిగా ప్రఖ్యాతిగాంచింది. కొరొవాయ్ కథాకమామిషు.. మోదీ రుచిచూసిన మరో తీపి పదార్థం కొరొవాయ్ కేకు. బేకరీ వంటకమైన ఈ కొరొవాయ్ కేకు అక్కడ ప్రతి పెళ్లి వేడుకల్లో తప్పకుండా ఉండాల్సిందే. అతిథులకు వడ్డించడం కోసమే ప్రత్యేకంగా దీనిని సిద్దంచేస్తారు. తూర్పు స్లావిక్ ప్రాంతవాసులు ఈ బ్రెడ్ కేక్‌ను తయారుచేసేవాళ్లు. అదే ఇప్పుడు సంప్రదాయంగా వస్తోంది. స్లావ్ ప్రాంత ప్రజలు సూర్యుడిని పూజించేవాళ్లు. వృత్తాకార సూర్యుడికి గుర్తుగా ఈ కేకును గుండ్రంగానే తయారుచేస్తారు.చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి.. అన్నివిధాలా సహకరిస్తాం: మోదీపెళ్లయిన జంట భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ పెళ్లిలో అందరికీ పంచిపెడతారు. కొన్ని సార్లు కేకు పిండి ముద్దలను పొడవుగా జడపాయల్లా అల్లి తర్వాత గుండ్రంగా చుట్టి బేక్ చేస్తారు. పూర్వం ఈ కేకులో ఉప్పు కాస్తంత ఎక్కువ వేసేవాళ్లు. ఉప్పు అతిథులతో బంధాన్ని మరింత బలపరుస్తుందని వారి నమ్మకం. బ్రిక్ సదస్సులో మాత్రం అతిథులకు దీనికి తోడుగా తేనెను అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
పవన్ కళ్యాణ్ తిక్క కుదిరింది తిరుమల లడ్డుపై కోర్టు నోటీసులు..
-
పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోరారు. పవన్‌తో పాటు తెలంగాణ సీఎస్‌కూ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు పవన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
ఈ సీజన్లో స్పెషల్ లడ్డూ : రోజుకొకటి తింటే లాభాలెన్నో!
పురాతన ఆయుర్వేద కాలం నుండి, నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఏదో విధంగా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను పిల్లలకు తినిపిస్తే బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. నువ్వులు, నువ్వుల లడ్డూ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతోపాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వీటిల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నువ్వులలోని మెగ్నీషియం సుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇందులోని జింక్ , సెలీనియం వంటి ఖనిజాలతో అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. నువ్వుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. చిన్నారులు, గర్భిణీలకు ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తహీనత ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులకు మంచి పరిష్కారం. నువ్వుల గింజలలో లిగ్నాన్స్, విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను సులభం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.నువ్వుల గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే మొక్కల ఆధారిత సమ్మేళనాలు. ఇవి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, సాధారణ ఋతు చక్రానికి మద్దతు ఇస్తాయి. అందుకే రజస్వల అయినపుడు ఆడపిల్లలకు నువ్వుల చిమ్నీ తినిపిస్తారు.నువ్వుల లడ్డూ తయారీకావాల్సిన పదార్థాలు: ఆర్గానికి బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు. కావాలంటే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. తయారీముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించాలి. చిటపడ లాడుతూ కమ్మటి వాసన వస్తాయి. అపుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వేరు శనగ పప్పులను కూడా వేయించి ముక్కా చెక్కలాగ మిక్సీ పట్టాలి. ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తరిగి, పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చాక నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అచ్చుల్లాగా కట్ చేసుకోవచ్చు.నువ్వులను ఇలా పలురకాలుగా నువ్వులు రెండు రకాలుగా లభిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల, నల్ల నువ్వులను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల తైలంతో శరీరానికి మర్ధన చేస్తే మంచిదని చెబుతారు. అయితే నల్ల నువ్వులను మాత్రం పూజాది కార్యక్రమాలకు వాడతారు. అలాగే శనిదోష నివారణకు నల్ల నువ్వులను దానం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు. -
విజయవాడ లడ్డు ఇష్యూ.. మల్లాది విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్
-
హిందూ సమాజంలో బాబు నేరస్తుడయ్యాడు: భూమన
తిరుపతి, సాక్షి : టీటీడీ లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. ఎల్లో మీడియాలో వచ్చిన కధనంపై స్పందిస్తూ మాట్లాడిన భూమన.. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రధానిని కలుస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు తిరుపతి లడ్డూ ఇస్తూ.. ‘ఇది కల్తీ లడ్డూ కాదు సార్. ఇది సిసలైన స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసింది’ అని చెబితే.. ‘బాబు చమత్కారానికి మోదీగారు విరగబడి నవ్వారట’..అని చెప్పారు. దీని వల్ల చంద్రబాబు దుర్భుద్ధి మరోసారి బట్టబయలైందని ఆయన వెల్లడించారు.తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్ నివేదిక తనకు అనుకూలంగా తెచ్చుకునేలా ఆయన కుట్ర చేశారని, అందుకే లౌక్యంగా ప్రధానిని వాడుకున్నారని భూమన ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు అదేపనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో తిరుమల వైభవంలో ఎక్కడా తప్పు జరగలేదని, ఆ వైభవానికి భంగం వాటిల్లలేదని తేల్చి చెప్పారు. దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన, చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్‌కు స్పందించాలని కోరారు. లడ్డూ స్వీకరించిన సమయంలో ప్రధాని నవ్విన నవ్వుకు శతవిధాల అర్థాలుంటాయన్న భూమన, సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ వివాదంపై మాట్లాడకూడదన్నా, సీఎం ప్రధాని వద్ద ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అసలు నివేదిక రాకుండా, ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండానే, విచారణ జరగకుండానే, బాబు ఎలా మాట్లాడుతారని నిలదీశారు. లడ్డూ ఇస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆయనను మందలించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి లడ్డూపై తప్పుడు ప్రకటన చేయడమే కాకుండా దేశ ప్రధానిని కూడా తప్పు దారి పట్టించేలా చంద్రబాబు వ్యవహారం ఉందని భూమన ఆక్షేపించారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు మాట్లాడింది తప్పు అని దేశమంతటా ధర్మ ఘోష చేస్తే, ప్రధాని ముందు భక్తుల మనోభావాలు అపహాస్యం చేసేలా ఆయన వ్యవహరించారని గుర్తు చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అదే పనిగా ప్రయత్నించడంలో భాగమే ప్రధాని వద్ద సీఎం వ్యాఖ్యాలని అభివర్ణించారు. ఏదేమైనా సిట్ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న టీటీడీ మాజీ ఛైర్మన్, గత ప్రభుత్వ హయాంలో తాను కానీ, తన కంటే ముందు ఛైర్మన్‌గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ‘రాజీవనేత్రుని వద్ద తప్పులు చేస్తే తట్టుకోవడం ఎవరికీ సాథ్యం కాదు. స్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు శ్రీవారి లడ్డూపై ఆరోపణలు చేయడం, స్వార్థ రాజకీయం కోసం దాన్ని పదే పదే వాడుకోవడం సమంజసం కాదు. ప్రాణం కాపాడిన పరామాత్మడితో బాబు పరాచికాలు ఆడితే ఆ పైశాచిక చేష్టకు ఫలితం ఎలా ఉంటుందో ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడు. లడ్డూ కల్తీ ఆరోపణలు తీవ్రమైన నేరం. హిందూ సమాజంలో దృష్టిలో చంద్రబాబు ఓ నేరస్తుడిగా మిగిలిపోతారు’ అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్: విజయసాయిరెడ్డి -
నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి. పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ ట్రై చేద్దాం. మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం పొడి– ముప్పావు కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు – పది; కిస్మిస్ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు వంతుకు ఇంకే వరకు మరిగించాలి).తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్ స్పూన్ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్ కుకర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. గమనిక: నీటి కొలత ప్రెషర్ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు. పచ్చికొబ్బరితో లడ్డు..తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు. -
YS Jagan: బాబు దేవునితో రాజకీయం చేస్తున్నావ్
-
సుబ్రమణ్య స్వామి Vs ఏపీ.
-
ఈ పాపం చంద్రబాబుకు మాత్రమే పరిమితం అవ్వాలి
-
దేవునితో బాబు ఆటలాడుతున్నాడు ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే!
-
Tirupati Laddu Row: పరువు మొత్తం పోయే
-
తిరుపతిలో గొప్ప వ్యవస్థ ఉంది.. మళ్ళీ గుర్తుచేస్తున్న ఇది టీటీడీ ప్రొసీజర్
-
లడ్డూ వివాదంపై సంచలన ట్వీట్..
-
తిరుమల లడ్డూ కేసు:.. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈరోజు విచారణప్రారంభమైన అనంతరం కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జర్నల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్ర అధికారిని ఏర్పాటు చేస్తే మంచిదని, లడ్డూ వ్యవహారంపై ఆరోపణలు నిజమైతే హర్షించదగనిది.. ఈ కేసు విచారణకు సిట్ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి. సెంట్రల్ నుంచి సూపర్ విజన్ ఉండాలి’’ అని తుషార్ మెహతా తెలిపారు.ఈ కేసు సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు?: సుప్రీంతిరుమల లడ్డూ వివాదంపై కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై పొలిటికల్ డ్రామా జరగొద్దనుకుంటున్నాం. సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు.కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా? కల్తీ నెయ్యి కేసు సీబీఐకి ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు’ అని ప్రశ్నించింది.స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టుస్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిది.సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండొచ్చు కదా. రాజకీయంగా లడ్డూపై వ్యాఖ్యలు చేయొద్దు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు. లడ్డూ కల్తీ జరిగితే చాలా తీవ్రమైన అంశం’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిట్ సభ్యులుగా ఇద్దురు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ఇండియా) నుంచి ఒకరు దర్యాప్తు చేపట్టనున్నారు.కాగా సెప్టెంబరు 30న ఈ కేసును విచారించిన సుప్రీం.. సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరిన విషయం తెలిసిందే. నెయ్యి కల్తీ పై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని గత విచారణలో వ్యాఖ్యానించింది. కల్తీ అంశంపై వాస్తవాలు నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే .. సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారు ?.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’ అంటూ ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీటీడీ తరుఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నీళ్లు నమిలారు. -
తిరుమలకు చంద్రబాబు కళంకం తెచ్చారు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం పవిత్రమైన తిరుమలకు కళంకం తెచ్చారని హైందవ, పౌర సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ జరిగిందంటూ నిందలు మోపిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తిరుమల లడ్డూ వివాదంపై ఆచార్య రామానుజ సమితి రూపొందించిన సత్యశోధన నివేదిక విడుదల చేశారు. నెయ్యి కల్తీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ పైనే అనుమానాలు ఉన్నాయని ఈ నివేదికలో తేల్చారు. ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిల్స్ ఒకే ల్యాబ్‌కు పంపడం, పంపే ముందు టీటీడీ ఈవో ఎన్డీడీబీ ప్రతినిధులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. ఎవరూ చేయనంత అపచారమిదిఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్ఎన్వీ ప్రసాదబాబు మాట్లాడుతూ.. తిరుమల చరిత్రలో ఎవరూ చేయనంత అపచారం సీఎం చంద్రబాబు చేశారన్నారు. శ్రీవారి ప్రసాదానికి కళంకం ఆపాదించారని మండిపడ్డారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావును దుష్ట్రతయంగా అభివర్ణించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఆ వివాదంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల పరువు మంటగలిపారుగీతా విజన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పొక్కులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తమ అధ్యయనంలో నెయ్యి శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలిసినట్టు ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేసి తిరుమల పరువు మంటగలిపారని మండిపడ్డారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను చూసి క్షుద్ర దేవతలు కూడా సిగ్గుపడతారన్నారు.లడ్డూ వివాదంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని, ఫలితంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాలనలో పగ ప్రతీకారాలకే ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో తన ప్రతి వైఫల్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూ విషయంలో చంద్రబాబు, ఈవో శ్యామలరావు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. సుప్రీం వ్యాఖ్యలు చెప్పు దెబ్బలాంటివిఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, పవన్, ఈవో శ్యామలరావుకు చెప్పు దెబ్బలాంటివన్నారు. నీతి, నిజాయితీ ఉన్న నాయకులు ఎవరైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు రాజీనామా చేసి ఉండేవారన్నారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఓవరాక్షన్ చేస్తున్నారని, దాని కారణంగా సనాతన ధర్మం నవ్వుల పాలవుతోందని ఎద్దేవా చేశారు. సత్యశోధన నివేదికను పరిశీలిస్తే లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్త వంగ శోభన్‌బాబు పాల్గొన్నారు. -
పవన్ అసలు రంగు బట్టబయలైంది
ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగకండితిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్ రిపోర్టులో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందు ఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జూలైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడెందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్. – ప్రకాశ్‌రాజ్, ప్రముఖ నటుడుదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun— Prakash Raj (@prakashraaj) September 30, 2024 సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది – సుబ్రమణియన్‌స్వామి, మాజీ ఎంపీ Tirupati Laddu controversy: Supreme Court slams CM Naidu, says no conclusive proof yet. Test report was on rejected ghee https://t.co/3ZHuifcdWN via @PGurus1— Subramanian Swamy (@Swamy39) September 30, 2024బాబు, పవన్ రాజీనామా చేయాలిచంద్రబాబు, పవన్ ఇద్దరూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారు. తిరుమల దేవస్థానంపై విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు వీరే బాధ్యత వహించాలి. హిందువులను మోసం చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు పశ్చాత్తాప్పడి పదవులకు రాజీనామా చేయాలి. -పీవీఎస్ శర్మ, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారిSC has put the ball in Central govt court whether to continue SIT investigation or with other agencies.One more issue by which Modi govt will control @ncbn in addition to #SkillDevelopmentScam We have to wait & see how both CM and Dy CM will dance to BJP tunes in Delhi.— PVS Sarma (@pvssarma) September 30, 2024From day one, since #TTDprasadam controversy erupted, I was convinced that only non-believers & dirty minds would play with devotees sentiments.I was not wrong.CM @ncbn & Dy CM @PawanKalyan raised the issue without any proof or evidence& hurt sentiments.#Thoo#CheeChee— PVS Sarma (@pvssarma) September 30, 2024భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం. నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఒక ఆహార పదార్థంలో 14 రకాల కల్తీలు చేయవచ్చా? ఇక మతవాదులకు చెప్పడానికి ఏముంది! – ధన్య రాజేంద్రన్ (ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ చీఫ్)Tirupati laddu row: How politics is shaping the conflictWas adulterated ghee actually used in srivari laddu?Should devotees really be worried about their faith being defiled?@PoojaPrasanna4 tells you all about this and more in this week's Let Me Explain. Watch the full… pic.twitter.com/6RoAAsw0P8— TheNewsMinute (@thenewsminute) September 27, 2024 దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి – పూనమ్‌కౌర్, నటి "At least the Gods should be kept away from politics"- SUPREME COURT 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2024బాబు, పవన్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను చూస్తుంటే సిగ్గేస్తోంది. – గబ్బర్, ప్రముఖ మలయాళీ రచయిత బాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని మతపరమైన భావోద్వేగాలు ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలోనే ‘ఎక్స్’లో చెప్పాను. ఈరోజు సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పింది. – శ్రీధర్ రామస్వామి, ఏఐసీసీ సోషల్ మీడియా నేషనల్ కో–ఆర్డినేటర్A few days ago I had posted on the Tirupati Laddu row was instigated by CBN to make it communal and he has a history to that. Today the SC has pulled up CBN for his remarks 👇 https://t.co/jHMeraRveB pic.twitter.com/PLEA4MmXUA— Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) September 30, 2024 పవన్ అసలు రంగు బట్టబయలైంది తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి – వీణా జైన్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్) Breaking!🚨Police raid on Sadhguru Isha Foundation, Today only Madras High court raised serious concerns over itThere are multiple allegations on Sadhguru & his foundation. Details of raid yet to come pic.twitter.com/UQrQ1Z289A— Veena Jain (@DrJain21) October 1, 2024దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? – ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ రాజ్యసభShame! If such be the case why did the Chief Minister claim otherwise? Will temples now be dragged into the politics of targeting opponents? For a few thousand votes it is okay to drag our places of worship?How is it okay to shake the faith of crores of devotees who believed… pic.twitter.com/DASek9o77h— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 30, 2024బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా! చంద్రబాబూ సిగ్గు సిగ్గు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెబుతారా! – సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకులు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారురాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. వీరిద్దరూ క్షమాపణ చెప్పాలి. పవన్ చాలా గొప్ప నటుడు. ఆయన నటనతో రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటే అది పొరపాటే. – డాక్టర్ గిరిజా షేట్కార్, యూనివర్సల్ హెల్త్ రైట్స్ అడ్వొకేట్ఇప్పుడేం చేస్తారు మీరందరూ అబ్బబ్బ.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు? భక్తుల మనోభావాల్ని ఎంత హింసించేశారు? రాజకీయ నేతల్ని పక్కన పెడదాం.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్ చేశారు వీళ్లంతా. ప్రాయశి్చత్త శ్లోకాలట..! వాళ్లే కనిపెట్టేసి .. రామ రామా.. మీరు చేసింది మామూలు రచ్చనా.. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా! ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వేంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి.. ఎంత మంది పెడతారో చూస్తాను. – వీణావాణి, వేణు స్వామి భార్యవైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధమాడారు. ఇది వారు రాజకీయ స్వార్ధంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గు చేటు. – హర్ష్ తివారి -
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ప్రకాశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి' అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల లడ్డు విషయంలో దీక్షలు చేస్తానంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రకటించారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ పలుసార్లు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం వ్యాఖ్యలతో మరోసారి పవన్‌కు తనదైన శైలిలో చురకలంటించారు.(ఇది చదవండి: 'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్)సోమవారం సుప్రీం కోర్టులో లడ్డు అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అంటూ పోస్ట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking— Prakash Raj (@prakashraaj) October 1, 2024 -
బొంకిన బాబు నోటికి ‘సుప్రీం’ తాళం!
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పేరుతోనూ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య వచనాలు పలికి అపచారం చేశారా? సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని మిడి మిడి జ్ఞానంతో వ్యాఖ్యానించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరువు పోగొట్టుకున్నారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ విషయం నిర్ధారణ అయినట్లేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వీరిద్దరూ అపభ్రంశపు వ్యాఖ్యలు చేసి వారి ప్రతిష్టను వారే తీసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా హిందు భక్తుల ఛీత్కారాలకు గురయ్యే పరిస్థితి తెచ్చుకున్నారా? శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న చంద్రబాబు ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇవన్నీ నిజమేనని స్పష్టమవుతోంది.రాజకీయాల్లో ఉన్నవారు అబద్ధాలు ఆడడం అన్నది పెద్ద విషయం కాకపోవచ్చు. చంద్రబాబు వంటివారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులూ కావచ్చు. కానీ ఏ నాయకుడైనా దైవాన్ని అడ్డం పెట్టుకొని అసత్యాలు చెప్పడానికి భయపడతాడు. కానీ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల చెంతనే తాను జన్మించానని, ఆయన్ను స్మరించుకోకుండా ఏ పనీ చేయనని చెప్పుకునే అత్యంత సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు ఎంత తప్పు చేశారో చూడండి... తిరుమల లడ్డులో జంతు కొవ్వును కలిపారనే తన వాదనను సమర్థించుకోవడానకి చంద్రబాబు సెప్టెంబర్ 21న ఒక సంచలన వ్యాఖ్య చేశారు.’’వెంకటేశ్వరస్వామే నాతో నిజాలు చెప్పించారు’’ అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది విన్న ప్రతి హిందువు, తిరుమలేశుని భక్తుడు చంద్రబాబు సత్యమే చెబుతున్నారేమో అన్న భ్రమ పడ్డారు. స్వామివారి మీద భక్తి ఉండే ఎవరూ ఇంతటి సాహసం చేయరు.కానీ చంద్రబాబు మాత్రం అంతకు తెగించారు. నిజానికి కొందరు మతోన్మాదులు, పూనకం వచ్చేవారు, జాతరవంటి కార్యక్రమాల్లో భవిష్యవాణి అంటూ తెలిసీ తెలియని మాటలు చెప్పేవారు మాత్రమే తనతో దేవుడే పలికిస్తున్నారని అంటారు. కానీ చంద్రబాబు కూడా వారి తరహాలోనే మాట్లాడారు. వీటిని దృష్టిలో ఉంచుకునే స్వామి వారే సుప్రీంకోర్టు రూపంలో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయించారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీ వారిని ఉద్దేశించి ’’తప్పులు, పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోంది’’ అని తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో చంద్రబాబు మాటల దాడి చేశారు. సీన్ కట్ చేస్తే సెప్టెంబర్ 27న మళ్లీ మీడియాతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు? అనేది అప్రస్తుతం అని ముక్తాయించారు. అంటే దాని అర్థం అప్పటివరకూ తాను ప్రచారం చేసినట్టుగా జంతు కొవ్వుతో కలిసిన నేతితో లడ్డూ తయారు చేశారన్న తన మాటలు తప్పనే కదా. నిజంగానే ఆయన మొదట చెప్పిన అబిప్రాయంతోనే ఉంటే జంతు కొవ్వు వ్యవహారంపై తన వాదనకు కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ’’కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారనేది అప్రస్తుతం‘ అని చెప్పి తప్పించుకున్నారు. తమిళనాడుకు చెందిన ఏ ఆర్ డెయిరీ మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి పంపితే నాలుగు ట్యాంకర్లు వినియోగించామని మరో నాలుగు ట్యాంకర్ల నేతి శాంపిల్స్ ఎన్డీడీబికి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు. తొలుత వినియోగించిన ట్యాంకర్లలో నేతిలో కల్తీ జరిగిందా అని అడిగితే ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవని అప్పటివరకూ ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత కేవలం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించే ల్యాబులే ఉన్నాయని, కల్తీ జరిగిందా లేదా అని నిర్దేశించే అడల్ట్రేషన్ ల్యాబులు లేవని చెప్పుకొచ్చారు.ఆపైన ఇంక ఏవేవో మాట్లాడారు. అంతే తప్ప జంతు కొవ్వు నేతిలో కలిసిందన్న తన వ్యాఖ్యను నేరుగా ఉపసంహరించుకోకుండా అలవాటు ప్రకారం మాటమార్చే యత్నం చేశారు. ఇక్కడే ఆయనకు శ్రీ వెంకటేశ్వరస్వామి మీద నిజంగానే భక్తి ఉందా? అనే సందేహం వస్తుంది. దానికి తగినట్లుగానే సుప్రీం కోర్టు సామాన్యులకు వచ్చిన అన్ని సందేహాలను ప్రశ్నల రూపంలో సంధించింది. వాటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. అందుకే దేవుళ్లను రాజకీయాలలోకి లాగవద్దని న్యాయమూర్తులు ఆయనకు హితవు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం మాట్లాడినప్పుడు, స్వామివారి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడారని స్పష్టం చేశారు. ఒక వైపు ప్రమాణాలు లేని నేతి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు కూడా చెప్పినా, ఒకటికి రెండుసార్లు జంతు కొవ్వు ప్రస్తావన తెచ్చి చంద్రబాబు స్వామివారి పట్ల అపచారం చేశారనేది భక్తుల ఆవేదన. తెలిసో తెలియక ఒక అబద్ధం ఆడితే, పొరపాటున అన్నానని సర్దుకుంటే ఒక మాటతో పోతుంది. అలా కాకుండా మరిన్ని అబద్ధాలు ఆడి తప్పుమీద తప్పు చేయడం సరైనదా? కాదా? అన్నది ఆయనే తేల్చుకోవాలి. అంటే వెంకటేశ్వరస్వామి తనతో నిజాలు చెప్పించారని అన్నారు గానీ, ఇప్పుడవన్నీ అబద్ధాలని తేలడంతో మొదట అసత్యాల్ని దేవుడే పలికించాడా? అన్న ప్రశ్న వస్తే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆయనకు స్వామివారి మీద ఉన్న భక్తి, నమ్మకం? ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు చంద్రబాబును ఎండగట్టింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు ఏవి అని ప్రశ్నించింది. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కథ మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. బీజేపీ వారి మెప్పు కోసమో లేక చంద్రబాబు కన్నా తానే పెద్ద హిందువు అని చెప్పుకోవడానికో, ఏ కారణం వల్లనన్నా కానీ ఆయన కాషాయం దుస్తులు ధరించి మరీ హడావిడీ చేశారు. జరగకూడనిది ఏదో జరిగిందన్నట్టుగా చంద్రబాబు మాదిరే అబద్ధాలాడేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ అదే చర్చిలోనో, మసీదులోనో ఇలా జరిగితే ఊరుకుంటారా ? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు సోషల్ మీడియా ప్రముఖులుగానీ వైఎస్సార్ సీపీ నేత పేర్నినాని వంటి వారు గానీ అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి పవన్ కల్యాణ్ గాలి తీసేశారు. సనాతన ధర్మమంటే ఏంటో తెలియక పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడేశారు. సనాతన ధర్మం ప్రకారం నాలుగు వర్ణాలుంటాయి. అందులో బ్రాహ్మణులు మొదటిస్థానంలో, క్షత్రియులు రెండో స్థానంలో, వైశ్యులు మూడో స్థానంలో ఉంటారని మను ధర్మం చెబుతుంది. నాలుగో స్థానంలో ఉన్న శూద్రులు పై మూడు వర్ణాలకు విధిగా సేవ చేయాల్సి ఉంటుందట. శూద్రులకు ఆస్తి హక్తు, వేదజ్ఞానం ఉండొద్దట. ఉద్యోగం, వ్యాపారం చేయకూడదట. శూద్ర మహిళల్ని పై మూడు వర్ణాలవారు లైంగికంగా అనుభవించవచ్చట. ఇలా అనేక అశాస్త్రీయమైన అంశాలతో కూడిన సనాతన ధర్మాన్ని పవన్ ఇప్పుడు జనం మీద రుద్దుతారా? పోనీ నిజంగానే ఈయన అచ్చమైన హిందువు అయితే వ్యక్తిగత జీవితంలో అన్ని అధర్మ వ్యవహారాలు చేస్తారా? అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు అసలు విడాకులు తీసుకోవడమనేది సనాతన ధర్మంలో ఉండనే ఉండదని చెప్పిన వీడియో ఇప్పుడు విస్తారంగా తిరుగుతోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఎన్నిసార్ల విడాకులు తీసుకున్నది తెలిసిందే కదా. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అయితే నేరుగా ఒక భార్య ఉండగా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం సనాతన ధర్మం అవుతుందా? అని ప్రశ్నించారు. క్రైస్తవ సమావేశంలో తాను బాప్టిజం తీసుకున్నానని, తన భార్య క్రైస్తవురాలని, తన పిల్లలు క్రైస్తవులని చెప్పిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? జనం చెవిలో పువ్వులు పెట్టడానికి ఇలాంటి వేషాలు వేస్తే సరిపోతుందా? దీక్ష పేరుతో కాషాయ వస్త్రాలు, ఆ వెంటనే షూటింగుల పేరుతో అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం ఏ పాటి హిందూ ధర్మం? సనాతన ధర్మం? అని పేర్నినాని ప్రశ్నించారు. తన తండ్రి దీపారాధన జ్యోతితో సిగరెట్ట వెలిగించారని పవన్ కళ్యాణే చెప్పారు. బీఫ్ తింటే మంచిదే అంటారు. అయినా సనాతన ధర్మాన్ని తానే పరిరక్షిస్తా అని అంటారు. చెప్పులేసుకొని దీక్ష చేస్తారు, అంటూ రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు సోషల్ మీడయాలో వచ్చాయి. మరి వీటన్నటికీ సమాధానం చెప్పే ధైర్యం, నైతిక ధర్మం పవన్ కల్యాణ్ కు వున్నాయా?సుప్రింకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు అతి విధేయత ప్రదర్శించబోయి తాను కూడా గబ్బు పట్టినట్లయిందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారో?లేదో? రాజకీయాలకోసం హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూపట్ల అపచారం చేయడమే కాకుండా స్వామివారిని కూడా ఇందులోకి లాగారు. స్వామివారే తనతో మాట్లాడించారంటూ పచ్చి అబద్దాన్ని చంద్రబాబు చెప్పడం పాపమో ?కాదో? ఆయనే తేల్చుకోవాలి.ఆయన పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి. తనది అజ్ఞానమో ?కాదో పవన్ కళ్యాణే నిర్ణయించుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబును ఉతికారేసిన సుప్రీంకోర్టు
-
అవును అది అబద్ధం.. అసలు నిజం చెప్పిన టీటీడీ లాయర్
-
అధికార మదం తలకెక్కితే.. జస్టిస్ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు
-
బాబు, పవన్ రాజీనామా చేయాలి మాజీ IAS డిమాండ్..
-
సుప్రీంకోర్టు సీరియస్.. రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దమేనా..?
-
చంద్రబాబుకు చెంప చెళ్లుమనిపించిన సుప్రీంకోర్టు... రోజా రియాక్షన్
-
రాజీనామా..!? వాళ్ల గోతిలో వాళ్లే పడ్డారు
-
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కొమ్మినేని రియాక్షన్..
-
‘హిందువులను మోసం చేశారు, చంద్రబాబు, పవన్ రాజీనామా చేయాలి’
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని,. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది.తాజాగా లడ్డూ వివాదంపై మాజీ ఐఏఎస్ పీవీఎస్ శర్మ ఘాటుగా స్పందించారు. శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారని మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలను దెబ్బేతీసే విధంగా, టీటీడీ దేవస్థానంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరిచేలా ప్రయత్నించినందుకు ఇద్దరు బాధ్యులేనని పేర్కొన్నారు. హిందూవులను తమ అబద్దాలతో, మోసం చేసినందుకు పశ్చాతాపంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.Both @ncbn & @PawanKalyan have cheated Hindus by making misleading statements on lord Venkateshwara Prasadam.Both are responsible for creating a negative perception on #TTDevasthanams run temple & our faith.As repentance for their lies & cheating Hindus, they should resign.— PVS Sarma (@pvssarma) September 30, 2024 -
కల్తీ జరిగిందని ఆధారం ఉందా?
-
బిగ్ బ్రేకింగ్.. సిట్ వద్దు?
-
దేవుడిపై అబద్దాలా..నువ్వేం సీఎం..! చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
చంద్రబాబు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా?.. లడ్డూ వివాదంపై వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : సత్యమేవ జయతే అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఈవో, చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ వీడియోలు పోస్ట్ చేశారు. దీని అర్ధం ఏంటి చంద్రబాబు? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. దీని అర్థం ఏంటి @ncbn ?దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా?“సత్యమేవ జయతే’’ pic.twitter.com/gQ7R6X6WfE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2024 కాగా, సెప్టెంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.తిరుమల లడ్డూలో‘యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు’’అని చంద్రబాబు అసత్యాలు వల్లివేశారు.సెప్టెంబర్ 22వ తేదీన చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ.. తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు మళ్లీ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేశారు.టీటీడీ ఈవో శ్యామలరావు ఆ ట్యాంకర్లను వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారానికి దిగారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా వీడియోలు పోస్ట్ చేసి చంద్రబాబు అసత్యపు ప్రచారాన్ని మరోసారి ఎండగట్టే యత్నం చేశారు.ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు.. అబద్ధాలు బట్టబయలు -
అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?: వరుదు కళ్యాణి సూటి ప్రశ్న
సాక్షి, విశాఖపట్నం: శ్రీవారి లడ్డూ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ డిమాండ్ చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఈ వివాదంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్యే వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చేసిన తప్పు బయట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. తిరుమలలో టీటీడీ నిబంధనలు ఉంటాయా, టీడీపీ నిబంధనలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేకుండా హోం మంత్రి అనితా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను క్రిస్టియన్ అని చెప్పిన అనితా నేడు, హిందువుని అని చెపుతున్నారని తెలిపారు. అనితా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. చదవండి: బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జలగతంలో సీఎంగా, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తిరుపతికి వెళ్ళారని, అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు. గతంలో ప్రధాని, హోం మంత్రితో, జగన్ తిరుపతి వెళ్లారని.. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చి, ఇవ్వలేదని అబద్ధం చెపుతున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని, ఆమెకు సొంత వ్యక్తిత్వం లేదని విమర్శించారు. షర్మిల కడుపు మంటతో మాట్లాడుతున్నారని అన్నారు. -
బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల
సాక్షి, హైదరాబాద్: శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిదంటూ చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. బాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును లీక్ చేశారని మండిపడ్డారు. ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు ఘోరమైన ఆరోపణలు చేశారని విమర్శించారు.అయితే ప్రభుత్వ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్లు ఖండించారని, దేనికైనా సిద్దమని చెప్పారని తెలిపారు. అంతేగాక లడ్డూ వివాదంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. సోమవారం ఈ కేసు విచారణకు కూడా రానుందని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్ర బాబు ఘోరమైన అబద్ధం ఆడారు. బాబు అన్నట్టుగా జంతువుల కొవ్వు మాట షోకాజ్ నోటీసులో లేవు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, బుడమేరు బాధితుల అంశాలు పక్కన పెట్టి.. ఇప్పుడు టీడీడీ లడ్డూను తెరపైకి తీసుకువచ్చారు . చలో తిరుపతి అని వైయస్ జగన్ ఏమైనా పిలుపు ఇచ్చారా? ఇష్యూ చేసింది టీడీపీ, ఉద్రిక్తత సృషించారు‘జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనకు అనుమతి లేదని మా నేతలకు ఇచ్చిన నోటీసులలో ఉంది. డిక్లరేషన్ అంశం భక్తుడు, టీటీడీకి సంబంధించిన అంశం. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు పాప పరిహారం చేసుకోవాలి. జగన్ హుందాగా వ్యవహరించారు. మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా? ఇప్పటికే పలు మార్లు జగన్ తిరుమలకు వెళ్లి వచ్చారు. ఎప్పుడు లేని డిక్లరేషన్ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? జగన్ తిరుమలకు వెళతా అంటే కట్టలు కట్టుకుని వచ్చి రాజకీయం చేశారు’ అని మండిపడ్డారు. -
అయ్యప్ప మాలేస్తే ఆదాయం తగ్గుతుందన్నాడుగా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్నరాద్దాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు పోసాని. హిందూ ధర్మా పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో మసీద్‌లోనే చెప్పాడని గుర్తు చేశారు.తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ.. కేడీ అంటే మోదీ అని ఘోరంగా తిట్టిన బాబు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చూశామని ఎద్దేవా చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటాడనే అంబేద్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఓట్ల కోసం క్రిస్టియన్, ముస్లింల ఇంటికి చంద్రబాబు వెళ్లలేదా?, నేను, నా భార్య కలిసి చర్చ్, మసీద్‌కు వెళ్లాం. మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అఫిడవిట్ అడగలేదు. జగన్‌ది గ్రేట్ పాలిటిక్స్.. నీది డర్టీ పాలిటిక్స్ బాబూ’ అని ధ్వజమెత్తారు పోసాని -
తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబుకు షాక్
-
జరగని తప్పుపై పచ్చగోల..
-
వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల 30 యాక్ట్ నోటీసులు
-
చంద్రబాబు చౌకబారు రాజకీయాలు.. ఎంపీ గురుమూర్తి ఫైర్
-
జగన్ పర్మిషన్ తీసుకోవాలా?
-
వైఎస్ జగన్ పై దాడికి కుట్ర
-
మీ చేత హిందువులని చెప్పించుకోవడానికి సిగ్గుపడతాం ...
-
సిట్‌తో వాస్తవాలు బయటకు రావు.. VHP లీడర్ ఫైర్
-
జగన్ తిరుమలకు వస్తే అంత భయమెందుకు బాబు
-
మతి భ్రమించి వెంకన్నతో రాజకీయం.. బాబుకు రోజులు దగ్గరపడ్డాయి
-
జగన్ ఆ సంతకం చేయనక్కరలేదు
-
అరె అవతారం..అయోమయం.. పవన్ పై ప్రకాష్ రాజ్ పంచులు
-
దేవుడుతో ఆటలొద్దు.. మీకు దమ్ముంటే లడ్డు వివాదంపై వంగా గీత రియాక్షన్
-
సాయంత్రం అయితే కోటార్ వేసేవాడు టీటీడీ మెంబెర్...? శ్రావణ్ కుమార్
-
పవన్ కు ప్రకాష్ రాజ్ మరుసారి కౌంటర్
-
చంద్రబాబు వ్యాఖ్యలపై సీబీఐ విచారణకు డిమాండ్
-
AR డైరీపై ఫిర్యాదు బయటపడ్డ టీటీడీ తప్పు
-
తిరుమల పవిత్రత రక్షణకు వైఎస్ జగన్ పిలుపు
-
బాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు.. గుడివాడ సంచలన వ్యాఖ్యలు
-
టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలు: మార్గాని భరత్
సాక్షి, రాజమండ్రి: రాజకీయాల కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయని తెలిపారు. సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా ఉందని పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం రాజమంత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలైలో రిపోర్టు వస్తే రెండు నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసులు ఎందుకు నమోదు చేయలేదని, అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘జులై 23న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నట్లు నివేదిక వచ్చిందన్న ఈవో.. సీఎంకు ఇచ్చన నివేదికలో మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చని ఎన్డీడీబీ అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎన్డీడీబీ నుంచి రిపోర్టు తెప్పించిన తర్వాత సెకండ్ ఒపినియన్ ఎందుకు తీసుకోలేదు? ఎవరిని మీరు తప్పు దోవ పట్టిస్తున్నారు? ’ అని మండిపడ్డారు.చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్‌పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్‌పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్ హెచ్చరించారు. సిట్‌లో చంద్రబాబు మనిషితిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. -
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్
-
మేము తప్పుచేసాం అని నిరూపించు నేను నీ బూట్లు తుడుస్తా...!
-
సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుంది
-
పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పవన్.. ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ .. నేను చేసిన ట్వీట్ ఏంటి? నా ట్వీట్‌పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్‌ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa— Prakash Raj (@prakashraaj) September 24, 2024 ట్వీట్లో ప్రకాష్ రాజ్ ఏమన్నారంటేపవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024 ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై పవన్ ఇలా మాట్లాడారుసున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే -
ఈ ప్రశ్నలకు జవాబు ఉందా బాబు?
-
టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే: అంబటి
సాక్షి, గుంటూరు: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేశారనిస్పష్టమైపోయిందన్నారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని.. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి, డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు.ఈ మేరకు గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.‘టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారు. హిందూ సంప్రదాయల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం. తండ్రి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’ అని మండిపడ్డారు. -
నిజం చెప్పేసిన లోకేష్ షాక్ లో చంద్రబాబు..
-
తిరుమల లడ్డు వివాదం.. ట్వీట్‌తో అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
సాక్షి,అమరావతి: ట్వీట్‌తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందని ట్వీట్ చేశారు. చంద్రబాబు స్టేట్మెంట్కి విరుద్ధంగా లోకేష్ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి వాడలేదని లోకేష్ ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడేసారంటూ సీఎం చంద్రబాబు విష ప్రచారం చేస్తుంటే అసలు ఆ ట్యాంక్‌ల నెయ్యి వాడలేదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు -
లడ్డూ వివాదం.. తిరుమలలో భూమన కరుణాకర రెడ్డి ప్రమాణం (ఫొటోలు)
-
ఆయన చరిత్ర నాకు తెలుసు సుబ్రహ్మణ్యస్వామి హాట్ కామెంట్స్
-
తిరుమల లడ్డులో పొగాకు. చంద్రబాబు పై భక్తులు ఫైర్
-
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
-
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు.‘‘మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకిత మైనది అని కలుషిత రాజకీయ మనష్కులు. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా..గోవిందా’’...అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు.ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు. -
వాలంటీర్ల ధర్నా.. చంద్రబాబుకు డిమాండ్
-
చంద్రబాబు వ్యాక్యాలపై సుప్రీంకోర్టులో బీజేపీ నేత పిల్
-
కల్తీ నెయ్యి లడ్డూలు భక్తులు తిన్నారా? లేదా ? పొన్నవోలు ఫుల్ క్లారిటీ..
-
ప్రసాదం శాంపిల్స్ ను ఇతర రాష్ట్రాల ల్యాబ్ లకు పంపాలి
-
దేవుడిని కూడా బాబు రాజకీయాలకు వాడుకుంటున్నారు
-
శ్రీవారి లడ్డూ వివాదంలో నిజానిజాలు తెలియాలి: న్యాయవాది పొన్నవోలు
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకులు నాసిరకంగా ఉన్నాయని, ఈ నాలుగు ట్యాంకులలో వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని అన్నారు. ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్తో తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.చదవండి: లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం‘ఆ పరీక్షల్లో సఫలమైన తర్వాతే ఆ టాంకర్ల నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారు. కల్తీ జరిగిందని నిర్ధారించే ల్యాబ్స్ లేవని ఈవో చెప్పడం దుర్మార్గం. 2014-19 వరకు పరీక్ష కేంద్రాలకు హెడ్‌గా ఉన్న శర్మిస్ట.. టీటీడీకి కల్తీ పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. మే 15న మొదటి ట్యాంక్ పంపించారు. అప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నాసిరకం నాలుగు ట్యాంకర్ల నెయ్యి వెనక్కి పంపారు. అటువంటి సమయంలో లడ్డూలలో కల్తీ ఎలా జరిగిందని చెప్పారు.భక్తుల మనోభావాలు గాయపరిస్తే మీకు ఒరిగేదేమిటి. రాజకీయ లాభం కోసం దేవుడిని కూడా ఉపయోగించడం సిగ్గుచేటు. రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లలో ఎస్ వాల్యూ తక్కువగా ఉందని ఈవో చెప్పారు. 2019 నుంచి ఆగస్టు 2023 వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. వై వి సుబ్బారెడ్డి హయంలో ఈ టెండర్లను పిలవలేదు. ఏఆర్ ఫుడ్స్ అసలు బిడ్డరే కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏఆర్ ఫు డ్స్కు ఆర్డర్ ఇవ్వలేదు. సప్లై జరగలేదు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆర్డరు, సప్లై జరిగింది. ఎస్ వాల్యూ తగ్గిందని టీటీడీ ఈఓ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. 319 రూపాయల కేజీ నెయ్యిలో 1, 450 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారు? రాగి బిందెలో బంగారం కలుపుతారా ?కానీ రాజకీయ దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు.పంది కొవ్వు కలిపారని చెప్పడం అబద్ధం -
దేవుడిపై కూడా బాబు రాజకీయాలే: గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయబ్రాంతులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం గడికోట మాట్లాడుతూ.. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. జులైలో వచ్చిన రిపోర్ట్‌ను సెప్టెంబర్‌లో బయటపెట్టారని, తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.చదవండి: బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?: మాజీ మంత్రి కాకాణి‘నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా లడ్డూ తయారీకి ఎలా పంపించారు?. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 40 లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజూ ఇలాంటి నెయ్యి 30 లీటర్లను అభిషేకం చేస్తారు. ఈ పద్ధతిలో 50 టన్నుల నెయ్యి తయారు చేయలేము. నైవేద్యం తయారీకి పవిత్రమైన నెయ్యిని వాడతారు. అభిషేకానికి, నైవేద్యానికి, దీపాలకు పవిత్రమైన నెయ్యిని ఉపయోగిస్తారు.వెన్నతో నవనీత సేవ కోసం కొండపైనే అవులను పెంచి వెన్నను తయారు చేస్తున్నారు. జూన్‌లో వచ్చిన నెయ్యి ని వెనక్కి పంపించకుండా అదే నెయ్యితో లడ్డూ ఎలా తయారు చేయించారు ?తప్పు చంద్రబాబు చేశారు.. డ్రామాలు ఎన్ని రోజులు చేస్తారు?. సెంటిమెంట్ క్రియేట్ చేసి తిరుమలను కలుషితం చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై చంద్రబాబు నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి.. వేద పాఠశాలను ప్రారంభించారు. 2014 - 2019 వరకు దేవాలయాలకు ఎన్ని నిధులు కేటాయించారు? 2019 - 2024 వరకు ఎన్ని నిధులు మంజూరు చేశారు ?. స్టీల్ ప్లాంట్, వరద నష్టం, మెడికల్ కాలేజీ, వంద రోజుల పాలన అంశాలను దృష్టి మళ్లించడానికి.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారునింద వేయడమే మా విధానం అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. వైఎస్సార్సీపీని భుజాన వేసుకొని మాట్లాడటానికి రాలేదు. శ్రీవారి భక్తుడిగా మాట్లాడుతున్నా. చిత్తశుద్ధి లోపించినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. తాపత్రయ పడి తిరుమలను రోడ్డున పడేయకుండి. అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. తిరుమలలో ఏ తప్పూ జరగలేదు. జరిగిన ప్రచారానికి ఇకనైనా ఫుల్‌స్టాఫ్ పెట్టాలి. వాస్తవాలను వక్రీకరించకుండా నిజాలని ప్రజలకు తెలియజేసే విధంగా విచారణ జరపాలి. రాజకీయ కోణంలో చూడొద్దు. తిరుమలలో పూజ విధానం జియ్యర్ల ద్వారానే జరుగుతోంది’ అని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్
ఖమ్మంరూరల్: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్‌షిప్‌కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు. అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది. దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మీకో దణ్ణం.. చంద్రబాబు వంద రోజుల పాలనపై ఆర్కే రోజా
సాక్షి,చిత్తూరు జిల్లా : సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆర్కేరోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 100 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలు కప్పి పుచ్చేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చ లేకపోయారని గుర్తు చేశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదు. చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు, చీకొడుతున్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ, సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారు. మాజీ సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు అని అన్నారు. ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. జూలై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? అని ఆర్కే రోజా ప్రశ్నించారు.టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావు ఆ?? వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో పీఎం మోదీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగింది. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా! అని తెలిపారు. ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు. అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, పార్థసారథి గత పాలకమండలిలో ఉన్నారు.తప్పు చేశారా లేదా వాళ్లైనా చెప్పాలి!ఈరోజు ప్రాయిశ్చిత దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రాయిశ్చిత్తం ఎవరు చేస్తారు? ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే పవన్ ప్రాయిశ్చిత దీక్ష చేస్తున్నానని ఆయనే ఒప్పుకున్నట్లే కదా అని ఆర్కే రోజా పునరుద్ఘాటించారు. చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు: వైఎస్ జగన్ -
జగన్ అంటే ఎందుకంత భయం చంద్రం .. ఆ రిపోర్ట్‌ను ఎందుకు దాచిపెట్టావు..?
-
సెంటిమెంట్ మీద కొట్టావ్..
-
తిరుపతి లడ్డూకు రాజకీయ రంగు దారుణం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయ రంగు పులమడం.. శ్రీవారి ప్రసాదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని భక్తులు మండిపడుతున్నారు. ఏదో ఒక సంస్థ సరఫరా చేసే నెయ్యి బాగుందని చెప్పి మిగిలిన సంస్థలపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను శుక్రవారం సాక్షి పలకరించగా వారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. – తిరుమలచంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరంసీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఏదైనా లోపాలుంటే వాటిని పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలి. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉంది.– శ్రీను, శ్రీవారి భక్తుడు, ఒంగోలుసమగ్ర విచారణ చేయాలి..ఆరోపణలు చేయడం కాదు సమగ్ర విచారణ జరపాలి. నందిని నెయ్యి బాగుందని చెప్పడం.. ఇతర కంపెనీల నెయ్యిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాం. భక్తులకు ప్రసాదంపై నమ్మకం పోతుందనే విషయం పాలకులు గమనించాలి. – రోహిత్, శ్రీవారి భక్తుడు, విశాఖపట్నంప్రసాదంపై నమ్మకం సన్నగిల్లేలా వ్యాఖ్యలుదవారి ప్రసాదం అంటే మాకు వరంతో సమానం. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా, సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంపై నిందలు వేసే విధంగా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం బాధాకరం. అసలు గతంలో అనుమానం వచ్చినప్పుడే దీనిపై ఎందుకు మాట్లడలేదు? ఇప్పుడు రచ్చ చేయడంపై అనుమానం వస్తోంది. ఇది రాజకీయ కుట్రలో భాగమేననిపిస్తోంది. స్వామివారిని రాజకీయ రొచ్చులోకి లాగడం దారుణం. – తంగవేలు, శ్రీవారి భక్తుడు, రాయవెల్లూరు జిల్లా, తమిళనాడుఇటువంటి వ్యాఖ్యలు తగదువారి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులకు తగదు. ఇలాంటి మాటలతో భక్తుల్లో అయోమయం నెలకొంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతలో లోపాలుంటే నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి పరిశీలించాలి. ఉద్యోగులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదు. – సుబ్రమణ్యం, టీటీడీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు మనోభావాలతో ఆటలా?పవిత్రమైన తిరుమల ప్రసాదంపై విచ్చలవిడిగా మాట్లాడటం సమంజసం కాదు. భక్తులు సైతం ఇలాంటి ఆరోపణలను సహించరు. వారి మనోభావాలతో రాజకీయ నేతలు ఆడుకోవడం సబబు కాదు. ఉద్యోగులు సైతం ఇలాంటి మాటలపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. కమిటీ వేసి నిజానిజాలను వెలికితీసి భక్తులకు తెలియజేయాల్సిన ప్రభుత్వం బహిరంగంగా ఆరోపణలు చేయడం సరికాదు.– జయచంద్ర, సీఐటీయూ నాయకులు, తిరుపతి -
తిరుమల లడ్డుపై చంద్రబాబు కుట్ర.. బయటపెట్టిన టీటీడీ ఈఓ
-
చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే.. YS జగన్ సీరియస్ కామెంట్స్
-
మా తిరుమల ఎంతో గొప్పది అని చెప్పాల్సిన వాళ్లే ఇంత ఘోరంగా
-
బాబుకు భయం లేదు.. భక్తి లేదు
-
చంద్రబాబుకున్న రాజకీయ యావ కోసం శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తున్నాడు
-
వెంకటేశ్వర స్వామితో ఆటలా..? చంద్రబాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్
-
Ys Jagan: చంద్రబాబు టీటీడీని బజారుకు ఈడ్చాడు...
-
మోడీకి లేఖ రాస్తా
-
లడ్డు ప్రసాదంపై వైఎస్ జగన్ రియాక్షన్
-
తిరుమల లడ్డూ వివాదం.. ఈవో చెప్పిన నిజాలు
-
చంద్రబాబు ‘లడ్డూ’ పాలిటిక్స్.. వైఎస్ జగన్ రియాక్షన్
సాక్షి, గుంటూరు: డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బాబు నీచ రాజకీయాలను ఆయన ఎండగట్టారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ.. రాజకీయాల కోసం దేవుడ్ని కూడా వాడుకునే నైజం బాబుది అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు కట్టుకథలు..‘‘తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారు. నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్టేనా?. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయందశాబ్ధాల తరబడి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రీ కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. ప్రతి ట్యాంకర్ ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. ఆ తర్వాత టీటీడీ మూడు శాంపిల్స్‌ను తీసుకుని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్‌లు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. ఈ విధానమంతా దశాబ్దాల నుంచి జరుగుతుంది.’’ అని వైఎస్ జగన్ వివరించారు.అబద్ధాలకు రెక్కలు..‘‘2014-19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజక్ట్ చేశారు. మా హయాంలో 18 సార్లు రిజక్ట్ చేశాం. టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబే.మూడు టెస్ట్‌లు చేశాక జులై 17న ఎన్డీడీబీకి పంపారు. 2 నెలలు క్రితం రిజక్ట్ అయితే ఇప్పటివరకు బాబు ఏం చేస్తున్నారు.’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.సీజేఐ, ప్రధానికి లేఖ రాస్తాం..తిరుమల శ్రీవారి ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నాడు. ఈ తప్పూ జరగకపోయినా టీటీడీ పరువును బజారు కీడుస్తున్నారు. ఈ విషయంపై సీజేఐ, ప్రధాని మోదీకి లేఖ రాస్తాం. 9 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలిచ్చాం. ఏ తప్పు జరగనప్పటికీ నేషనల్ మీడియా కూడా తప్పు జరిగినట్టు చూపిస్తోంది. టీటీడీ లడ్డు తయారీ గొప్ప కార్యక్రమమని చెప్పుకోవాలి. టీటీడీకి అద్భుత వ్యవస్థ ఉందని గొప్పగా చెప్పుకోవాలి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే నవనీత సేవ నిర్వహించాం. దీని కోసం మొదటగా తిరుమలలో గోశాల పెట్టాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు.చంద్రబాబుది ఎప్పుడూ దుర్భుదే..బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అబద్ధాల చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. దేవుడ్ని రాజకీయాలకు వాడుకునే హేయమైన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుది ఎప్పుడూ దుర్భుదే. టీటీడీ బోర్డు చాలా విశిష్టమైనది. కేబినెట్ కూర్పు కంటే కూడా టీటీడీ బోర్డు నియామకం చాలా కష్టమైనది. దేవునికి మంచి చేయడం ఎలా అనేదే వాళ్లు ఆలోచిస్తారు. వైఎస్సార్సీపీ హయాంలోనే జీర్ణావస్థలో ఉన్న ఆలయాలు పునరుద్ధరణ జరిగింది. హైదరాబాద్, చెన్నై, జమ్మూకశ్మీర్, భువనేశ్వర్‌లో కూడా టీటీడీ ఆలయాలు నిర్మించాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
మా సంస్థపై విష ప్రచారం తగదు.. తిరుపతి లడ్డు వివాదంపై ఏఆర్ డెయిరీ
చెన్నై : దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిని అందించే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ స్పందించింది. ‘‘ఏఆర్ డెయిరీ నుండి జూన్, జూలైలో నెయ్యి సరఫరా చేశాం. ఇప్పుడు మా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యడం లేదు. 25 సంవత్సరాలుగా మేం డైయిరీ సేవల్ని అందిస్తున్నాం. దేశ వ్యాప్తంగా మా ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహిస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు.తాజాగా, మా సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మేం.. టీటీడీకి అందించే నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై టెస్ట్‌లు నిర్వహించాం. ఆ టెస్టుల్లో నేయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలింది. కానీ మాపై విష ప్రచారం చేస్తున్నారు. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్ట్‌ను పంపించాం. కానీ టీటీడీ నుంచి మాకు స్పందన రాలేదు’’ అని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది. -
ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగింది: టీటీడీ ఈవో
సాక్షి,తిరుమల: ఏఆర్ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు. కల్తీ జరిగినట్లు తేలడంతో లడ్డూ తయారీలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని చెప్పారు. లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. టీటీడీకి సొంత టెస్ట్ ల్యాబ్ లేదు. జులై5,6 తేదీల్లో రెండు నెయ్యి ట్యాంకర్లలోని శాంపిల్స్‌ను బయట ల్యాబ్‌లలో టెస్ట్‌కు పంపాం. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఈ టెస్ట్‌లలో తేలింది. దీంతో సరఫరాదారులందరికీ వార్నింగ్ ఇచ్చాం. నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్ ఖరారైంది’అని ఈవో తెలిపారు. ఇదీ చదవండి.. శ్రీవారి లడ్డూపై సీబీఎన్ ఉన్మాద రాజకీయం -
చంద్రబాబు వ్యాఖ్యలు నేను నమ్మడం లేదు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
-
హైకోర్టు ముందు వైఎస్ఆర్సీపీ ప్రస్తావన
-
తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎస్ ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలతో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పింది తప్పని తేలితే బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఐవైఆర్ అన్నారు.మరోవైపు, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్‌పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయంతిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం బాధాకరమని.. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరమని చెప్పింది. -
రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం లడ్డూ వేలం విరాళాలు
-
తిరుమలపై మోసగాడి మాటలు క్షమించరాని నేరం..
-
తిరుమల లడ్డుపై బాబు అబద్ధాలకు వైవీ సుబ్బా రెడ్డి ఛాలెంజ్
-
తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు..
-
బాలాపూర్ లడ్డు వేలం పాట ఫుల్ వీడియో
-
లడ్డూ దక్కించుకున్న సినీ నిర్మాత కొండేటి సురేష్
ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం అధినేత కొండేటి సురేష్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఫిలింనగర్ దైవసన్నిదానంలో శనివారం నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయన ’ 19 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూ తనకు దక్కడం సంతోషంగా ఉందని, ప్రతియేటా తాను లడ్డూ వేలం పాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ కోశాధికారి కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
TTD: హైదరాబాద్‌లో రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమల లడ్డూ ప్రతి రోజు హైదరాబాద్‌లో లభ్యం కానుందని తెలిపింది. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ విక్రయించేవారు. భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతి రోజు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని టీటీడీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, ఎన్ నిరంజన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఒక్కో లడ్డూను రూ. 50కు విక్రయించనున్నారు. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లడ్డూ విక్రయాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భక్తులు గమనించి, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేయాలని సూచించారు. -
బాలాపూర్ లడ్డు స్పెషల్.. వెండి గిన్నెలో 21 KGల లడ్డు..
-
17వ శతాబ్దం నుంచీ అదే రుచి.. అదే లడ్డు ఇది!!
తీపి వంటకాల్లో లడ్డూ.. తీపి వంటకాల్లో లడ్డూ మొదటి వరుసలో ఉంటుంది. ఏ శుభకార్యమైనా, ఏ శుభ సందర్భమైనా లడ్డూతోనే పరిపూర్ణమవుతుంది. స్వీట్స్ అన్నిట్లోకి అంతటి ప్రత్యేకత పొందింది లడ్డూ! అందులో బందురు తొక్కుడు లడ్డూకున్న రుచే వేరు! నాణ్యమైన నెయ్యి, బెల్లంతో తయారుచేసిన బందరు తొక్కుడు లడ్డూ పేరు చెబితే చాలు చవులూరుతాయి. ఈ తియ్యటి ఖ్యాతి బందరు దాటి ప్రపంచానికీ పాకింది. ఆ కమ్మదనంపై ప్రత్యేక కథనం...ఈ లడ్డూ.. క్రీస్తుశకం 17వ శతాబ్దం చివరలో పాకానికి వచ్చినట్టు చెబుతారు. బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి బందరు (మచిలీపట్నం)కు వలస వచ్చిన మిఠాయి వ్యాపారులు బొందిలి రామ్‌సింగ్ సోదరులు బెల్లపు తొక్కుడు లడ్డూ, నల్ల హల్వాను ఈ ప్రాంతవాసులకు పరిచయం చేశారని చరిత్రకారుల మాట. వారి నుంచి ఈ మిఠాయి తయారీ విధానాన్ని అందిపుచ్చుకున్న బందరు వాసులు కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, శిర్విశెట్టి రామకృష్ణారావు (రాము), శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య తదితరులు లడ్డూ, హల్వాల ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చారు. మచిలీపట్నానికి ఉన్న మరో పేరు బందరు. ఆ లడ్డూ రుచి లోకమంతటికి తెలిసినా రెసిపీ బందురుకు మాత్రమే సొంతమవడంతో అది ‘బందరు లడ్డూ’గా పేరుపొందింది. దీన్ని రోకలితో బాగా దంచి, పొడిచేసి తయారు చేస్తుండటంతో ‘బందరు తొక్కుడు లడ్డూ’గా స్థిరపడింది.ప్రత్యేకమైందీ తయారీ విధానం..ఈ లడ్డూ తయారీకి కనీసం 12 గంటల సమయం పడుతుంది. ఇందులో శనగపిండి, బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి, పటిక బెల్లం, బాదం పప్పు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పును వినియోగిస్తారు. ముందుగా శనగ పిండిని నీటితో కలిపి నేతి బాండీలో బూంది మాదిరిగా పోస్తారు. అలా వచ్చిన పూసను ఒకపూట ఆరబెట్టి రోకలితో దంచి పొడిచేస్తారు. ఆ పొడిని బెల్లం పాకంలో వేసి లడ్డూ తయారీకి అనువుగా మారేంత వరకు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఆరబెట్టి, మళ్లీ రోకలితో దంచుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతారు. ఒకరు పిండిని తిప్పుతుండగా మరొకరు రోకలితో మిశ్రమాన్ని దంచి జీడిపప్పు, పటిక బెల్లం ముక్కలు, ఏలకుల పొడి కలుపుతారు. ఈ మిశ్రమాన్ని రెండు గంటలు ఆరబెట్టి, చెక్క బల్లపై ఒత్తుతూ తగినంత సైజులో లడ్డూలు కడతారు. ఇవి 15 రోజులకు పైగా నిల్వ ఉంటాయి.జీఐ గుర్తింపు.. విదేశాలకు ఎగుమతులు..మొన్నటి వరకు దేశానికే పరిమితమైన ఈ టేస్టీ వంటకం ఇప్పుడు భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ, ఆహార విభాగంలో 2017లో బందరు బెల్లపు తొక్కుడు లడ్డూ పరిశ్రమకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) ఇచ్చింది. ఈ స్వీట్‌కు పేటెంట్ హక్కు (పార్ట్–బి) లభించింది. దీంతో ప్రపంచ దేశాలకు బందరు లడ్డూ ఎగుమతులు భారీగా పెరిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు సహా దుబాయ్, ఇరాక్, కువైట్లకూ ఏటా వేల కిలోల లడ్డూ ఎగుమతి అవుతోందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఈ లడ్డూ తయారీదారులు, వ్యాపారస్థుల సంఖ్యా పెరుగుతోంది. మచిలీపట్నంలోని బృందావన మిఠాయి వర్తక సంఘంలో సభ్యత్వం కలిగిన 50 మందికి పైగా వ్యాపారులు బందరు తొక్కుడు లడ్డూ, హల్వాలను విక్రయిస్తున్నారు. వీరి వద్ద వెయ్యి మందికి పైగా పని చేస్తుండగా, వారిలో 250 మందికి పైగా మహిళలు ఉన్నారు.నోట్లో వేసుకోగానే కరిగే నేతి హల్వా..బందరులో తయారయ్యే మరో తీపి వంటకం ‘నేతి హల్వా’కూ మంచి డిమాండ్ ఉంది. రాత్రంతా గోధుమలను నానబెట్టి, మరుసటి రోజు పిండిగా రుబ్బి, దాన్నుంచి పాలు తీస్తారు. ఆ పాలను బెల్లం పాకంలో పోస్తూ కలియ తిప్పుతారు. ఆ పాకాన్ని పొయ్యి మీద నుంచి దించే అరగంట ముందు అందులో తగినంత నెయ్యి వేస్తారు. ఆ తర్వాత సరిపడా జీడిపప్పును దట్టించి, ప్రత్యేక ట్రేలలో పోస్తారు. అలా 24 గంటల పాటు ఆరబెడతారు. ఈ హల్వా సుమారు నెల వరకు నిల్వ ఉంటుంది. నలుపు వన్నెతో ఉండే ఈ హల్వా కూడా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతోంది. – ఎస్.పి. యూసుఫ్, ఫొటోలు: కందుల చక్రపాణి, సాక్షి, విజయవాడ. -
అంతా 77 మయం.. లాలూ బర్త్‌డే స్పెషల్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు(జూన్ 11) తన77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాలూ యాదవ్ కుటుంబసభ్యులు 77 కిలోల కేక్‌ను కట్ చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు 77 కిలోల లడ్డూలను రబ్రీ నివాసానికి తీసుకువచ్చారు. ఈ వేడుకల్లో రబ్రీదేవి, కుమార్తె రోహణి ఆచార్య పాల్గొన్నారు.దీనికి ముందు లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తల్లి, సోదరితో కలిసి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ సమక్షంలో కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. తన 'ఎక్స్' ఖాతాలో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘సాన్నిహిత్యం, వినయం, సరళత కలగలసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని కొనియాడారు. ఈ ఫొటోలలో లాలూ యాదవ్, రోహిణి ఆచార్య కూడా కనిపిస్తున్నారు.లాలూ ప్రసాద్‌కు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ కుమార్తెలు మిసా భారతి, రోహిణి ఆచార్య లు పట్నాలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఆర్జేడీ కార్యాలయంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. To the person who is a perfect blend of affinity, humility and simplicity.THE MAN who leads by example.A leader who nurtures leaders.Happiest birthday my papa ♥️Love you infinity ♾️ @laluprasadrjd @yadavtejashwi @RJDforIndia @RahulGandhi @yadavakhilesh @RabriDeviRJD pic.twitter.com/XmpsZV30Ju— Tej Pratap Yadav (@TejYadav14) June 10, 2024 -
అయోధ్యకు లక్ష వెంకన్న లడ్డూలు
తిరుమల: అయోధ్యలో సోమవారం జరుగనున్న బాల రాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రసాదం అయిన లక్ష లడ్డూలను రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆదివారం అందజేశారు. తొలుత రామ మందిరానికి చేరుకున్న కరుణాకరరెడ్డికి రామ మందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో మాట్లాడారు. కలియుగంలో తిరుమలలో స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి అని చెప్పారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. రసరమ్యంగా అయోధ్యకాండ అఖండ పారాయణం లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తిసాగరంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు కె.రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, మారుతి శ్లోక పారాయణం చేశారు. -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) స్వామివారిని 69,874 భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.39 కోట్లుగా లెక్క తేలింది. వచ్చే 22న అయోధ్య రామా మందిరం ప్రారంభం.. నేడు ప్రత్యేక ప్లైట్‌లో అయోధ్య చేరనున్న టీటీడీ శ్రీవారి లడ్డులు. దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లక్ష లడ్డూలు తయారి. నిన్న రాత్రి తిరుమల నుండి బయలుదేరిన లడ్డులు. -
అయోధ్యకు హైదరాబాద్ నుండి భారీ లడ్డు, ముత్యాల మాల
-
రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం!
2019 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ‘రామ జన్మభూమి’ తీర్పు రామభక్తులకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. 2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ నూతన రామాలయ భూమి పూజను నిర్వహించడంతో రామ భక్తులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాబోయే 22న నూతన రామాలయం ప్రారంభం కానుండటంతో రామభక్తులు పెద్దఎత్తున పండుగ చేసుకోబోతున్నారు. 2024, జనవరి 22.. ఈ తేదీ చరిత్ర పుటల్లో నమోదుకానుంది. శ్రీ రాముడు ఆ రోజున దివ్యమైన రామాలయంలో కొలువుదీరనున్నాడు. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రాములోరికి విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు ‘దేవ్రహా బాబా’ లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ‘దేవ్రహా బాబా’ రామ మందిర నిర్మాణాన్ని ముందే ఊహించిన సాధువు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఇదేనని ఆయనే తెలియజేశారు. శ్రీరామునికి భోగంగా సమర్పించేందుకు 44 క్వింటాళ్ల లడ్డూలను దేశీ నెయ్యితో తయారు చేస్తున్నామని, ఒక్క చుక్క నీరు కూడా వాడలేదని దేవ్రహ బాబా శిష్యులు తెలిపారు. ఈ లడ్డూలు ఆరు నెలల వరకూ చెడిపోవని పేర్కొన్నారు. ఈ లడ్డూలను వెండి పళ్లెంలో రామ్‌లల్లాకు నైవేద్యంగా సమర్పిస్తామన్నారు. అనంతరం వీటిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేయనున్నామన్నారు. 44 క్వింటాళ్ల బరువు కలిగిన ఒక వేయి 111 లడ్డూలను తయారు చేస్తున్నామన్నారు. శ్రీరామునికి ఈ విధమైన సేవ చేయడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని దేవ్రహ బాబా శిష్యులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి! -
తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
-
ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!
ఓట్స్ లడ్డూకి కావలసినవి: ఓట్స్ – ఒక కప్పు (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) వేరుశనగలు – అర కప్పు (దోరగా వేయించి కచ్చాపచ్చాగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి.. పొట్టు తీసినా తీయకపోయినా పరవాలేదు) బెల్లం తురుము – ఒక కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి) నెయ్యి – సరిపడా డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొన్ని (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా చిన్న మంట మీద బెల్లం పాకం పెట్టుకోవాలి. పాకం గమనించుకుని.. దగ్గర పడుతున్న సమయంలో, వేరుశనగల పొడి, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఓట్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: ఎప్పుడైనా పెసలుతో పాలక్ ఇడ్లీ ట్రై చేశారా! ఆరోగ్యాని ఆరోగ్యం..రుచికి రుచి..!) -
లంబో‘ధర’ లడ్డూ!
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఎత్తయిన గణేష్ విగ్రహం (63 అడుగులు) కూడా ఇదే. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తొలిసారిగా 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభించింది. తొలి వేలం పాటలో రూ.450కి దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో ఆ తర్వాత ప్రసాదానికి మరింత డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌నకు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలం పాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది. పోటాపోటీగా వేలం పాటలు.. ► నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా కొనసాగాయి. వినాయకుడి చేతిలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రముఖ మండపాల్లో నిర్వహించిన వేలం పాటల్లో రూ.15 కోట్లకుపైగా ఉత్సవ కమిటీలకు సమకూరినట్లు తెలిసింది. ► ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.5 కోట్లు, ఖైరతాబాద్‌లో రూ. 33.75 లక్షలు, సికింద్రాబాద్‌లో రూ.19 లక్షలు, శేరిలింగంపల్లిలో రూ.1.25 కోట్లు, అంబర్‌పేటలో రూ.25 లక్షలు, మల్కాజిగిరిలో రూ.48 లక్షలు, కుత్బుల్లాపూర్‌లో రూ.2.13 కోట్లు, చార్మినార్ ఏరియాలో రూ.56.88 లక్షలు, ఉప్ప ల్లో 1.50 కోట్లు, సనత్‌నగర్‌లో రూ.12 లక్షలు, గోషామహల్లో రూ.45 లక్షలు, మలక్‌పేటలో రూ.20 లక్షలు, మేడ్చల్‌లో రూ.1.50 కోట్లు, ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.20 లక్షల వరకు వేలం పాటలు కొనసాగాయి. ► కాగా.. బడంగ్‌పేట వీరాంజ నేయ భక్త సమాజం గణనాథుడి లడ్డూ కూడా రూ.17 లక్షలు.. చేవెళ్ల రచ్చబడం గణేషుడి చేతిలోని లడ్డూ ప్రసాదం రూ.22.11 లక్షలు, ఆదిబట్లలోని చైతన్య యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డు రూ.12.50 లక్షలు, ఫరూక్నగర్ మండల పరిధిలోని మధురాపూర్ గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని లడ్డు రూ.11.11 లక్షలు, కొంపల్లి అపర్ణ మెడల్స్లోని లడ్డూ ధర రూ.13 లక్షలు పలికింది. ► వేలం పాటలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తినడం, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిణీ చేయడం, పంట పొలాల్లో చల్లడం ద్వారా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. అంతే కాదు స్థానికంగా గుర్తింపుతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా లభిస్తుండటంతో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. రూ.1.25 కోట్లు పలికి.. ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతటా విస్తరించింది. ఈ ఏడాది గ్రేటర్లో చిన్నా పెద్దా కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డూ ప్రసాదం ఆ రికార్డును బద్దలు కొట్టింది. రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. నిత్యం రికార్డుల్లో నిలిచే బాలాపూర్ లడ్డూ మాత్రం ఈసారి రూ.27 లక్షలు పలికింది. -
మహాగణపతికి 2200 కిలోల లడ్డూ ప్రసాదం
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి బుధవారం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యాపారవేత్త జనల్లి శ్రీకాంత్ 2200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. 2016 నుంచి ప్రతి సంవత్సరం మహాగణపతికి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు. భారీ లడ్డూను తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని శ్రీకాంత్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం భారీ ఊరేగింపు మధ్య క్రేన్ సాయంతో మహాగణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారని తెలిపారు. -
పండుగ కోసం రవ్వ పూర్ణాలు
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ – 2 కప్పులు ఏలకులపొడి – 1 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పు పంచదార – రెండున్నర కప్పులు, నెయ్యి – 1/2 కప్పు మైదాపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యప్పిండి – 1/4 కప్పు తయారు చేసే విధానం: బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార ఏలకులపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోవాలి. (చదవండి: వినాయకుని వ్రత కల్పం... చేసుకోవలసిన విధి) -
వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి
ఈసారి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, ఇతర నైవేద్యాలతో పాటు... వైవిధ్యభరితమైన మరెన్నో స్వీట్లను తినిపించి ప్రసన్నం చేసుకుందాం.... సేమియా లడ్డు తయారీకి కావల్సినవి: కావలసినవి: వేయించిన సేమియా – కప్పు; కోవా – అరకప్పు; పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – టీస్పూను; బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►బాణలిలో పంచదార వేసి సన్నని మంటమీద కరగనివ్వాలి. ► పంచదార కరుగుతున్నప్పుడే కోవా వేసి తిప్పాలి ∙పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా, బాదం పలుకులు వేసి కలపాలి. ► అన్ని చక్కగా కలిసిన తరువాత రోజ్‌వాటర్ వేసి మరోసారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ∙ఇప్పుడు మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుంటే వర్మిసెల్లి లడ్డు రెడీ. -
ఓట్స్ – యాపిల్ లడ్డూలు
కావలసినవి: యాపిల్ – 3 మీడియం సైజ్ (తొక్క, గింజలు తీసి గుజ్జులా చేసుకోవాలి) ఓట్స్ పౌడర్ – అర కప్పు (నెయ్యితో దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – 2 కప్పులు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్– 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి – అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ – గార్నిష్‌కి కొద్దిగా (అభిరుచిని బట్టి) నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో యాపిల్ గుజ్జు, కొబ్బరి కోరు, పంచదార, మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, ఓట్స్ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవాలి. వాటిపైన డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొద్దికొద్దిగా పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి) -
శ్రీనివాసుని కటాక్షం...భక్తుల పాలిట వరం
-
స్వామివారి లడ్డూ ప్రసాదం చేయడం మా అదృష్టం
-
TTD: డిసెంబరు నాటికి ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు
సాక్షి, తిరుపతి: తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియాన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని అన్నారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది స్పష్టం చేశారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించామని ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాన్నారు. ‘‘తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నాం. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో మొబైల్ యాప్‌ను ఇటీవల ప్రారంభించాం’’ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చునని ధర్మారెడ్డి పేర్కొన్నారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారన్నారు. ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలు కాగా, హుండీ ద్వాతా రూ.123.07 కోట్లు ఆదాయం చేకూరింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.07 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు, కాగట కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలు. చదవండి: ఏకో ఇండియాతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ -
Recipe: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..
తమలపాకు లడ్డూ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►తమలపాకులు – 20 (శుభ్రంగా కడిగి, కాడలు తుంచి పెట్టుకోవాలి) ►శనగపిండి –250 గ్రాములు ►బేకింగ్ సోడా – కొద్దిగా ►జీడిపప్పు, కిస్మిస్ – కొన్ని (నేతిలో వేయించుకోవాలి) ►పంచదార – 400 గ్రాములు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా ►ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్) తయారీ: ►ముందుగా తమలపాకుల్లో నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకుని.. పలుచటి క్లాత్‌లో వేసుకుని.. రసం మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►అనంతరం శనగపిండిలో బేకింగ్ సోడా, తమలపాకుల రసం వేసుకుని.. హ్యాండ్ బ్లండర్‌తో బాగా కలుపుకోవాలి. ►కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని.. మరికాస్త నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి. ►తర్వాత కళాయిలో నూనె వేడి చేసుకుని.. అందులో జల్లెడ సాయంతో తమలపాకు మిశ్రమాన్ని వేసుకుంటూ.. చిన్న బూందీలా వేయించుకోవాలి. ►ఆ తర్వాత పంచదార పాకం పెట్టుకుని.. అందులో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకుని.. తీగపాకం మొదలయ్యే సమయంలో తమలపాకు బూందీని వేసుకుంటూ బాగా కలపాలి. ►జీడిపప్పు, కిస్మిస్లను అందులో వేసుకుని దగ్గర పడేదాకా చిన్న మంట మీద ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారాక లడ్డూల్లా చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Venna Murukulu: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు.. ఇంట్లోనే ఇలా ఈజీగా! ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... శనగపప్పు పాయసంతో -
మరింత ముదురుతున్న భద్రాద్రి లడ్డూ వివాదం
-
భక్తులకు ప్రసాదంగా బూజ్ పట్టిన లడ్డూలు
-
ఆన్లైన్లో లడ్డూల బుకింగ్ అవాస్తవం : టీటీడీ
తిరుమల: టీటీడీ వెబ్సైట్ ద్వారా లడ్డూలు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 14 నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,466 మంది స్వామిని దర్శించుకోగా, 28,123 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీ కానుకల రూపంలో భక్తులు రూ.4.29 కోట్లు సమర్పించారు. దర్శన టోకెన్లు లేని భక్తులకు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
26 వినాయక మండపాల్లో లడ్డూల చోరీ
చిట్యాల/మీర్‌పేట: వినాయకుడి చేతిలో పూజలందుకున్న లడ్డూలను గణేశ్ నిమజ్జనం రోజున వేలంలో వేలు, లక్షల రూపాయలు పెట్టి దక్కించుకుంటారు. అయితే నల్లగొండ జిల్లా చిట్యాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు లడ్డూలను ఎత్తుకెళ్లిపోయారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో్ల మండపాలను ఏర్పాటు చేసి గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే, కొందరు దుండగులు పట్టణంలోని 26 మండపాల్లో ఉన్న లడ్డూలను అపహరించుకుపోయారు. శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం నుంచి లడ్డూను అపహరిస్తున్న క్రమంలో విగ్రహం చేయి విరిగిపోయింది. ఓ వార్డులో లడ్డూ చోరీకి వచ్చిన ఇద్దరు అనుమానితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో లడ్డూల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని మండపాల నిర్వాహకులు లడ్డూల చోరీపై ఫిర్యాదు చేయలేదు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని డీఎల్ఆర్ కాలనీవాసులు స్థానిక కమ్యూనిటీహాల్లో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించే యత్నం చేశారు. అదికాస్తా విఫలమవడంతో చేసేది లేక విగ్రహాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. -
Ganesh Chaturthi Recipes: రవ్వలడ్డు తయారీ విధానం
కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, ఏలకులపొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు. తయారి విధానం: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఏలకులపొడి పాకంలో కలుపుకుంటే తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ. -
Ganesh Chaturthi Recipes: చిట్టి ముత్యాల లడ్డు తయారీ విధానం
కావలసిన పదార్థాలు శనగపిండి – 2 కప్పులు యాలకులపొడి – 1 టీ స్పూన్ లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు పంచదార – 2 1/2 కప్పులు ఆరెంజ్ కలర్ – చిటికెడు రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత తయారు చేసే విధానం : ►శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. ►మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకుల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి -
Srikrishna Janmashtami: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్ లడ్డు, అవల్ పుట్టు!
Srikrishna Janmashtami 2022- Protein Laddu- Aval Puttu Recipes: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణునికి ప్రియమైన అటుకులు, నెయ్యితో విభిన్న రకాల నైవేద్యాలను సమర్పిద్దాం... రుచులను ఆస్వాదిద్దాం.. ప్రోటీన్ లడ్డు కావలసినవి: ►వెన్న – టేబుల్ స్పూను ►జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – మూడు టేబుల్ స్పూన్లు ►పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు ►బెల్లం తరుగు – అరకప్పు ►అటుకులు – రెండు కప్పులు ►యాలకులు – ఆరు. తయారీ: ►జీడిపప్పు, కిస్మిస్లను వెన్నలో వేయించాలి. ►ఇవి వేగిన తరువాత కొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి ►కొబ్బరి కూడా వేగాక బెల్లం వేయాలి ►మరో బాణలిలో అటుకులను దోరగా వేయించి, యాలకులు వేసి మిక్సీజార్ లో పొడిచేసి పెట్టుకోవాలి ►బెల్లం కరిగిన తరువాత అటుకుల పొడి వేసి చక్కగా కలుపుకుని లడ్డులా చుట్టుకుంటే ప్రోటీన్ లడ్డు రెడీ. అవల్ పుట్టు కావలసినవి: ►అటుకులు – అరకప్పు ►బెల్లం – అరకప్పు ►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు పలుకులు – ఆరు ►యాలకుల పొడి – పావు టీస్పూను ►నెయ్యి – రెండు టీస్పూన్లు ►ఉప్పు – చిటికెడు. తయారీ: ►అటుకులను మూడు నిమిషాలపాటు రంగు మారకుండా దోరగా వేయించుకుని, చల్లారాక మిక్సీ జార్లో వేసి రవ్వలా గ్రైండ్ చేయాలి ►రవ్వను వెడల్పాటి పాత్రలో పోసుకుని, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ►దీనిలో కొద్దికొద్దిగా వేడి నీళ్లు చల్లుతూ కలుపుకోవాలి. ►రవ్వ మరీ మెత్తగా కాకుండా గుప్పెట్లో పట్టుకుని వత్తితే ఉండయ్యేంత మెత్తగా కలిపి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►టీస్పూను నెయ్యిలో జీడిపప్పుని బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి ►ఇప్పుడు మందపాటి పాత్రలో బెల్లం, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. ►బెల్లం కరిగిన వెంటనే ద్రావణాన్ని వడగట్టాలి ∙వడగట్టిన ద్రావణాన్ని ఉండపాకం రానివ్వాలి. ►పాకం రాగానే స్టవ్ ఆపేసి.. తడిపిపెట్టుకున్న అటుకుల రవ్వ వేసి తిప్పాలి ►రవ్వను చక్కగా కలుపుకున్న తరువాత జీడిపప్పు, కొబ్బరి తురుము, మిగిలిన నెయ్యి వేసి అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రే చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్ జామూన్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా! దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా! -
లడ్డూ విక్రయాల్లో అవినీతి.. యాదాద్రిలో భక్తుల ఆరోపణ
సాక్షి,యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టికెట్ లేకుండానే లడ్డూ ప్రసాద విక్రయాలు జరుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా ప్రసాదం కౌంటర్ల సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దైవదర్శనం అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఇష్టపడేది లడ్డూ, పులిహోర ప్రసాదం. ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రధానాలయం ప్రారంభమయ్యాక భక్తులు అధికంగా తీసుకెళ్తున్నారు. ప్రసాదం కొనుగోలుకు భక్తులు ఒక కౌంటర్లో డబ్బులు చెల్లించగానే టికెట్ ఇవ్వాల్సి ఉం టుంది. ఆ టికెట్ తీసుకుని మరో కౌంటర్ వద్దకు వెళ్లి ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నిబంధనల ప్రకారం ఎన్ని ప్రసాదాలు తీసుకుంటే అన్ని టికెట్లివ్వాల్సి ఉంటుంది. కానీ కౌంటర్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి టికెట్లు ఇవ్వకుండా లడ్డూ ప్రసాద విక్రయాలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. -
Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా..
వెలుగునిచ్చే దీపాలు, మిరుమిట్లుగొలిపే క్రాకర్స్, నోటిని తీపిచేసే∙స్వీట్లలోనే దీపావళి సందడంతా కనిపిస్తుంది. ఏటా చేçసుకునే మిఠాయిలు కాకుండా, ఆయిల్ వాడకుండా పాలతో ఆరోగ్యకరమైన స్వీట్లను సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బొప్పాయిహల్వా కావల్సిన పదార్ధాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు – ఒకటి (తొక్కసి తురుముకోవాలి) పంచదార – పావు కప్పు బాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – టీ స్పూను కోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టీస్పూన్లు. తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ►నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. మిల్క్ బర్ఫీ కావల్సిన పదార్ధాలు పాలపొడి – రెండున్నర కప్పులు పంచదార – ముప్పావు కప్పు పాలు – కప్పు నెయ్యి – పావు కప్పు పిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి. ►స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి. ►10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి. ►ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తాపలుకులు వేసి మరోసారి వత్తుకోని,ట్రేను గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. మలై లడ్డు కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కండెన్సెడ్ మిల్క్ – ముప్పావు కప్పు యాలకుల పొడి – పావు టీస్పూను. కోవా నెయ్యి – అరటీస్పూను పాలు – పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు పాల పొడి – ముప్పావు కప్పు తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, నిమ్మరసం వేసి పన్నీర్‌లా చేసుకోవాలి. ►బాణలి వేడెక్కిన తరువాత అరటీస్పూను నెయ్యి, పావు కప్పు పాలు పోసి వేయించాలి. ఇవన్నీ బాగా కలిసిన తరువాత ముప్పావు కప్పు పాలపొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ►బాణలి నుంచి ఈ పాలమిశ్రమం గట్టిపడి ఉండలా చుట్టుకునేటప్పుడు దించేస్తే పాలకోవ రెడీ. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని..ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్, కోవా వేసి సన్నని మంట మీద తిప్పుతూ వేయించాలి. ►మిశ్రమం మృదువుగా మారాక ముప్పావు కప్పు కండెన్స్డ్ పాలు పోసి కలపాలి. కండెన్స్డ్ పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పంచదార వేయకూడదు. ►మిశ్రమం దగ్గరపడ్డాకా.. యాలకులపొడి వేసి మరో ఐదునిమిషాలు వేయించి దించేయాలి. ►గోరువెచ్చగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టుకుంటే మలై లడ్డు రెడీ. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
Quick Sweet Recipes: నోరూరించే కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ ఇలా..
స్వీట్లు చూస్తే ఆగలే.. బజార్లో దొరికే స్వీట్లలో నాణ్యతలేని పదార్థాలు కలుపుతారు.. తింటే ఆరోగ్య సమస్యలు. ఇంట్లోనే మీకిష్టమైన స్వీట్లు తయారు చేస్తే.. కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ విధానం మీకోసం.. కిస్మిస్ లడ్డూ కావలసిన పదార్థాలు: ►కిస్మిస్ పేస్ట్ – 1కప్పు (మిక్సీ పట్టుకోవాలి) ►కొబ్బరి పాలు, తేనె, పీనట్ బటర్ – 4 టేబుల్ స్పూన్ల చొప్పున ►ఓట్స్ – పావు కప్పు ( వేయించి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి) ►బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకు ►కొబ్బరి తురుము – కొద్దిగా (అభిరుచిని బట్టి) తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, కొబ్బరిపాలు, తేనె, పీనట్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, కిస్మిస్ పేస్ట్ కూడా వేసుకుని ముద్దలా కలుపుకుని, చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను దొర్లిస్తే సరిపోతుంది. కస్టర్డ్ ఆపిల్ హల్వా కావలసిన పదార్థాలు: ►సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్) – 1 కప్పు (బాగా మగ్గిన సీతాఫలాలను పైతొక్క తొలగించి, వడకట్టే తొట్టెలో వేసుకుని, దాని కింద గిన్నె పెట్టుకుని, చేత్తో నలిపి గింజలన్నీ ►తొలగించి గుజ్జు తీసుకోవాలి) ►నెయ్యి, సుజీ రవ్వ – అర కప్పు చొప్పున ►పంచదార – పావు కప్పు, చిక్కటి పాలు – 1 కప్పు ►జాజికాయ పొడి – పావు టీ స్పూన్ ►కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలు – ►అర టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం ముందుగా కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసి తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార, పాలు పోసుకుని దగ్గర పడే వరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అనంతరం సీతాఫలాల గుజ్జు, జాజికాయ పొడి, నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలూ వేసి తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ.. -
భద్రాద్రి లడ్డూ ప్రసాదాల్లో అవకతవకలు
-
అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ
సాక్షి, వేములవాడ(కరీంనగర్): గణేశ్ విగ్రహం వద్దనున్న లడ్డూను తీసుకొచ్చి తినిపించడంతోపాటు ఇంటి చుట్టూ చల్లితే అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందనే సెంటిమెంట్‌తో 9వ తరగతి చదువుతున్న బాలుడు మార్కెట్ ఏరియాలోని వినాయడి చేతిలోని లడ్డూ ను దొంగిలించి సీసీ కెమెరాకు చిక్కాడు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నలుగురు వచ్చి వినాయకుడి చేతిలోని లడ్డూను తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. లడ్డూ చోరీ చేసిన వారంతా బాలురు కావడం విశేషం. వీరిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని సీఐ వెంకటేశ్ తెలి పారు. మరో లడ్డూ మాయం వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలోంచి మంగళవారం రాత్రి 10 కేజీల లడ్డూ మాయమైందని నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వేములవాడలో ఇది రెండో లడ్డూ దొంగతనానికి గురైంది. మూఢనమ్మకాలను నమ్మరాదు ఏదోఒక సెంటిమెంట్ అంటూ మైనర్లు, యువకులు వినాయక మంటపాల్లోని లడ్డూలను దొంగతనంగా తీసుకెళ్లడం సరైందికాదు. ఆరోగ్యం బాగుండాలంటే వైద్యం చేయించాలి. ఇలాంటి మూఢనమ్మకాలతో మండపాల నిర్వహణలో అల్లర్లు, గొడవలు జరిగే అవకాశాలున్నాయి. ప్రతీ మంటపం వద్ద నిర్వాహకులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. – సీఐ వెంకటేశ్ -
ఇలాంటి లడ్డు నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్!
న్యూఢిల్లీ: మ్యాగీ ఈ పేరు తలుచుకోగానే ప్రతి ఒక్కరి నోట్లో నీరు ఊరుతాయి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీకి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఇన్స్టాంట్ మ్యాగీగా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీని ప్యాకింగ్ చేసేటేప్పుడే అన్ని రకాల పదార్ధాలతో కలిసి ఉంటుంది. దీన్ని వేడినీళ్లలో వేయగానే.. మంచి రుచికరమైన మ్యాగీ క్షణాల్లో మన ముందుంటుంది. అయితే, కొంతమంది మాత్రం ట్రెండ్‌ను ఫాలో కాకుండా సెట్ చేశారు. మ్యాగీతో లడ్డు చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నారో.. ఏమో గానీ.. వెంటనే వారి ఆలోచనను అమలు చేసేశారు. మ్యాగీతో లడ్డు ప్రయోగం చేశారు. ఇంతటితో ఆగకుండా దానిపై అందంగా కాజునికూడా ఉంచారు. ఇప్పుడు, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వావ్.. దీన్ని చూస్తే నోటిలో నీరు ఊరుతోంది.. ఎలా తయారు చేశారంటూ’.. సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
పాల పొడితో లడ్డూ చేయండిలా..
మిల్క్ పౌడర్ లడ్డూ కావలసినవి: మిల్క్ పౌడర్ – 1 కప్పు, చిక్కటి పాలు – పావు కప్పు (కాచి చల్లార్చినవి), పంచదార – పావు కప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి) తయారీ: ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో పాలు, పంచదార, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని.. పంచదార కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ స్టవ్ మీద పెట్టి.. చిన్న మంట మీద ఉంచి.. కొద్దికొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా ముద్దలా అయిపోయిన తర్వాత రెండు భాగాలుగా చేసుకుని, ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టుకుని.. మరో భాగాన్ని పాన్‌లోనే ఉంచి మిగిలిన నెయ్యి వేసుకుని బాగా తిప్పాలి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలిపి.. పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటిగా తీసి పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న బాల్స్ చేసుకుని.. వాటిపైన ఫుడ్ కలర్ కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఒక్కోబాల్ చుట్టూ పెట్టుకుని.. నిమ్మకాయ సైజ్‌లో లడ్డూలు చేసుకోవాలి. క్యారెట్ పనియారం కావలసినవి: దోసెల పిండి – 1 కప్పు, ఉల్లిపాయలు – 3 (స్మాల్ సైజ్, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 1(చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి), అల్లం పేస్ట్ – పావు టీ స్పూన్, క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినప్పప్పు – పావు టీ స్పూన్, కరివేపాకు – 1 లేదా 2 రెమ్మలు, ఇంగువ – చిటికెడు, పసుపు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. దోసెల పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, క్యారెట్ తురుము, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కలుపు కోవాలి. ఇప్పుడు అందులో ఇంగువ, పసుపు, ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలుపుకుని.. పొంగనాల పాన్‌లో అడుగున నూనె రాసుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం వేసుకొని, కుక్కర్లో లేదా ఓవెన్లో ఉడికించుకోవాలి. బీట్రూట్ పకోడా కావలసినవి: బీట్రూట్ 2 (మీడియం సైజ్, సన్నగా తురుముకోవాలి), అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, కారం – 1 టీ స్పూన్, ఉల్లిపాయలు – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బీట్ రూట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని.. పకోడాలు వేసుకోవాలి. -
అందుబాటులోకి శ్రీవారి మహా ప్రసాదం
సాక్షి, తిరుపతి : నేటి నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులో రానుంది. తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలను విక్రయానికి ఉంచారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని సైతం విక్రయానికి ఉంచనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కోరినన్ని లడ్డూ, వడలు ఇవ్వనున్నారు. 50 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రావడం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
రుతువు మారింది, రుచి మార్చండి
శిశిరం పోయి వసంతం వస్తోంది. చెట్లు కొత్త చిగుళ్లు వేస్తాయి అవి కొత్తదనం తెచ్చుకున్నప్పుడు మన వంట గిన్నెలోకి కూడా కొత్తదనం రావాలి కదా. రుతువు మారేటప్పడుకొన్ని పదార్థాలు తప్పక తినాలంటారు పెద్దలు. ఎందుకు చెప్పారో. కూపీ లాగేబదులు కిచెన్‌లోకి నడిస్తే సరిపోదూ!!! ఖర్జూరాల లడ్డు కావలసినవి: వేయించిన సెనగ పప్పు (పుట్నాల పప్పు) – ఒక కప్పు; ఖర్జూరాలు – పావు కప్పు (గింజలు తీసేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను తయారీ: వేయించిన సెనగ పప్పు, ఖర్జూరాలు మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేయాలి ∙ఎండు కొబ్బరి తురుములో దొర్లించాలి ∙కొద్దిగా ఆరాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ∙ఇవి వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి (ఇష్టమైన వారు రంగులు కూడా జత చేసుకోవచ్చు. తాజాగా ఎప్పటికప్పుడు చేసుకోవటం మంచిది) కర్ర పెండలం బాల్స్ కావలసినవి: కర్ర పెండలం – అర కిలో; చిలగడ దుంప – పావు కేజీ; కొత్తిమీర – ఒక కట్ట; వెల్లుల్లి ముద్ద – అర టేబుల్ స్పూను; పచ్చి మిర్చి ముద్ద – పావు టీ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; అల్లం ముద్ద – అర టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; కిస్మిస్ – 15; నూనె – ఒక టేబుల్ స్పూను సాధారణంగా ఈ వంటకాన్ని హోలీ పండుగకు తయారుచేస్తారు. హోలికను దహనం చేసిన మంట బాగా చల్లారాక, ఆ సన్నని మంట మీద దుంపలను రాత్రంతా వండుతారు. ఒక్కోసారి ఆవిరి మీద ఉడికించి కూడా తయారుచేస్తారు. తయారీ: కర్ర పెండలాన్ని శుభ్రం చేసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి సుమారు అర గంట సేపు ఉడికించాలి ∙చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, తగినంత నీరు జత చేసి సుమారు పావు గంట సేపు ఉడికించాలి ∙ఇవి కొద్దిగా చల్లారాక, రెండు రకాల దుంపలకు తొక్కు తీసి, సన్నగా తురమాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙నువ్వులు వేసి మరోమారు వేయించాలి ∙పచ్చిమిర్చి ముద్ద, అల్లం ముద్ద జత చేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి ∙కిస్మిస్, కర్ర పెండలం తురుము, చిలగడ దుంప తురుము, కొత్తిమీర, వెల్లులి ముద్ద, ఉప్పు వేసి బాగా కలిపి, ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙నిమ్మరసం జత చేసి బాగా కలిపి ఉండలు చేసి అందించాలి. హెల్తీ ఠండై కావలసినవి: ఏలకులు – 5; సోంపు – ఒకటిన్నర టీ స్పూన్లు; ధనియాలు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పొద్దు తిరుగుడు గింజలు – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 50 గ్రా.; బ్రౌన్ సుగర్ – 5 టేబుల్ స్పూన్లు; గులాబీ రేకలు – 3 టేబుల్ స్పూన్లు; రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు; పాలు – ముప్పావు లీటరు; కుంకుమ పువ్వు – చిటికెడు. తయారీ: స్టౌ మీద బాణలి వేడయ్యాక, ఏలకులు, సోంపు, ధనియాలు, మిరియాలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పులను విడివిడిగా వేసి దోరగా వేయించాలి ∙తగినన్ని నీళ్లలో రెండు గంటలు నానబెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙బ్రౌన్ సుగర్, గులాబీ రేకలు, రోజ్ వాటర్ జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ పాలు జత చేసి బాగా కలియబెట్టి, వడకట్టి, గ్లాసులలో పోయాలి ∙గులాబీ రేకలు, కుంకుమ పువ్వులతో అలంకరించాలి. జొన్నల చట్‌పట్ కావలసినవి: జొన్న పేలాలు – 5 కప్పులు; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; ఇంగువ – పావు టీ స్పూను; పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: స్టౌ మీద బాణలి వేడి చేశాక, జొన్న పేలాలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి ∙వేయించిన సెనగ పపున్ప జత చేసి కొద్దిసేపు ఉంచాలి ∙పసుపు, మిరపకారం, ఉప్పు జతచేసి కొద్దిసేపు ఉడికించాలి ∙వేయించిన జొన్న పేలాలు, పుట్నాల పప్పు జత చేసి సుమారు రెండు నిమిషాల పాటు వేయించి దింపేయాలి ∙బాగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి‘ -
లడ్డూలతో చోరీ
టీ.నగర్: తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్‌లో మత్తు లడ్డూలు ఇచ్చి, ప్రయాణికుల వద్ద చోరీలకు పాల్పడుతున్న మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా తిరువైయ్యారు సమీపాన గల రంగనాథపురం ప్రాంతానికి చెందిన షణ్ముగం భార్య పార్వతి (50). ఈమె తిరుపూర్ జిల్లా పల్లడంలో బనియన్ కంపెనీలో పనిచేస్తోంది. గత జూన్ 27వ తేదీ తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్ నుంచి పల్లడం వెళుతుండగా, పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికురాలికి స్వామి ప్రసాదంగా మత్తు లడ్డూను అందజేసింది. ఆ తర్వాత స్పృహ తప్పిన ఆమె ధరించి ఉన్న 8.5 సవర్ల నగలను అపహరించి పరారైంది. బుధవారం తిరుచ్చి నుంచి కోవైకు వెళ్లేందుకు పార్వతి అక్కడికి రాగా, నగలు చోరీ చేసిన మహిళను గుర్తించి అక్కడి పోలీసులకు అప్పగించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
తిరుమల లడ్డూపై వాట్సాప్‌లో దుష్ప్రచారం
తిరుమల : తిరుమల లడ్డూ, టీటీడీపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు గురువారం తిరుమలలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ‘తిరుపతి లడ్డా లేదా జీసెస్ లడ్డా?’ అనే శీర్షికతో డిసెంబర్ 29న వాట్సాప్‌లో ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమైంది. దీన్ని టీటీడీ ఖండించింది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వాట్సాప్‌లో ఈ సమాచారాన్ని పంపిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇలాంటి అవాస్తవ సమాచారం ఇకపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాకుండా నిలువరించేందుకు క్రైం నంబర్ 2/2020 యూ/ఎస్ 500, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద టీటీడీ విజిలెన్స్ అధికారులు నమోదు చేశారు. -
శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ
తిరుమల: 2020 ఆంగ్ల నూతన సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూను అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల నుంచి కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూను టీటీడీ అందిస్తోంది. ఆ మేరకు ప్రతిరోజు 20 వేల లడ్డూలను అందిస్తోంది. నూతన ప్రతిపాదనలో భాగంగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేయనుంది. ఈ విధానాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 6 నుంచి అమల్లోకి తీసుకురానుంది. సాధారణ భక్తుడికి కల్యాణోత్సవం లడ్డూ, అదనపు లడ్డూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు కల్యాణోత్సవం లడ్డూ కావాలంటే సిఫార్సు లేఖ ఉండాల్సిందే. అయితే ఇకపై సిపారసు లేకుండానే సాధారణ భక్తుడికి కూడా కల్యాణోత్సవం లడ్డూతో పాటు అదనపు లడ్డూలు ఎన్ని కావాలన్నా టీటీడీ ఇవ్వనుంది. అదనపు లడ్డూ ఒక్కొక్కటి రూ.50లకు విక్రయిస్తారు. ఇందుకోసం అదనంగా లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పెద్ద లడ్డూలను అందించడం ద్వారా టీటీడీ అధికారులు సిఫారసు లేఖల ఇబ్బందిని తొలగించాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు పై ప్రతిపాదనలకు అంగీకరించినట్లు సమాచారం.