దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి. పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం.
పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ ట్రై చేద్దాం.
మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్
కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం పొడి– ముప్పావు కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు – పది; కిస్‌మిస్ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్ స్పూన్‌లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్‌లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు వంతుకు ఇంకే వరకు మరిగించాలి).
తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్ స్పూన్‌ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్ కుకర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి.
గమనిక: నీటి కొలత ప్రెషర్ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు.
పచ్చికొబ్బరితో లడ్డు..
తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి.
గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment