తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) స్వామివారిని 69,874 భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.39 కోట్లుగా లెక్క తేలింది. వచ్చే 22న అయోధ్య రామా మందిరం ప్రారంభం.. నేడు ప్రత్యేక ప్లైట్‌లో అయోధ్య చేరనున్న టీటీడీ శ్రీవారి లడ్డులు. దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లక్ష లడ్డూలు తయారి. నిన్న రాత్రి తిరుమల నుండి బయలుదేరిన లడ్డులు.
Comments
Please login to add a commentAdd a comment