Tirumala Tirupati Devasthanams (TTD)
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,987 మంది స్వామివారిని దర్శించుకోగా 26,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 51,148 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 76,598 మంది స్వామిని దర్శించుకున్నారు.35,334 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.46 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
డ్రెస్ కోడ్ ‘గోవిందా.. గోవింద..!’
తిరుమల: సంప్రదాయ దుస్తులు లేకున్నా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఓ భక్తురాలిని అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ బ్రేక్ దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు సంప్రదాయ దుస్తులతో దర్శనానికి వెళ్లాలి. పురుషులైతే ధోతీ/కుర్తా పైజమా ధరించాలి. స్త్రీలైతే పంజాబీ డ్రెస్, లంగా వోణీ, చీరలు ధరించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వైకుంఠంలో పనిచేసే టీటీడీ, విజిలెన్స్ అధికారులు తాము అనుకుంటే ఎలాగైనా దర్శనానికి అనుమతిస్తామని సోమవారం రుజువు చేశారు. ఓ మహిళ టీ షర్టు, నైట్ ప్యాంటు వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనానికి రావడం.. ఆమెను అనుమతించడం పలు విమర్శలకు దారి తీసింది. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట MBC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు . టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఒక ప్రకటనలో వెల్లడించింది.రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 78,414 మంది భక్తులు దర్శించుకోగా, 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం లోపెరిగిన భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూల వద్ద బారులు తీరారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ఉచిత కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పా హారం, బిస్కెట్లు పంపిణీ చేశారు. కాగా భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,715 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 24,503 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 66,160 మంది స్వామివారిని దర్శించుకోగా 22,724 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.47 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కె ట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. క్యూకాంప్లెక్స్‌లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 72,962మంది స్వామిని దర్శించుకున్నారు.30,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లా లని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో7 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,722 మంది స్వామిని దర్శించుకున్నారు.22,225 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 9 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లా లని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసంధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దుడిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనంజనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (మంగళవారం) 60,301 మంది స్వామివారిని దర్శించుకోగా 20,222 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.32 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీంఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ను నింగిలోనికి ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో టీం ఈరోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఇస్రో అధికారులు రాకెట్ నమూనాని స్వామివారి పాదాల చెంత వుంచి ఆశీస్సులు పొందారు. -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శనివారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శుక్రవారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.12 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 56,711 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,775 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా లెక్క తేలింది.నేడు తిరుమలలో గరుడసేవ...కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడవాహనం పై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.రాత్రి 7 గంటలకు గరుడవాహనం పై తిరు వీధుల్లో ఊరేగింపు.ఈ నెల 17 న తిరుమలలో కార్తీక వనభోజనం.18 టిటిడి పాలకమండలి సమావేశం -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 61,446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లుగా లెక్క తేలింది.ఉగ్ర శ్రీనివాసమూర్తి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహించాము. శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించిన టీటీడీ. చిరుజల్లుల మద్య ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.– టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(ఆదివారం) 82,233 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (శుక్రవారం ) 56,501 మంది స్వామివారిని దర్శించుకోగా 21,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.78 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
నా మతం మానవత్వం... ఇదే నా డిక్లరేషన్... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
దైవంతో జూదమా?
శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా హిందూ భక్తులు ఆరాధిస్తారు. వారి దృష్టిలో తిరుమల క్షేత్రం సాక్షాత్తూ కలియుగ వైకుంఠమే. ‘‘భావింప సకల సంపదరూప మదివో... పావనములకెల్ల పావనమయము’’ అంటూ ఆ శ్రీహరివాసాన్నిఅన్నమయ్య కాలం నుంచీ భజిస్తూనే ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవునిగా కోట్లాదిమంది చేత నిత్య పూజలందుకునే వేంకటనాథుని ఆలయ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రతి పక్షంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని ఆయన పణంగా పెట్టారు.కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వరదల పాలు కావడం, ‘సూపర్ సిక్స్’ పేరుతో చేసిన ఎన్నికల బాసలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, కనీసం ఎప్పుడు చేస్తారనే షెడ్యూల్‌ను కూడా విడుదల చేయలేకపోవడం వంటి కారణాలు ఈ తాజా కుట్రకు నేపథ్యం. తమ కూటమి పరిపాలనకు వంద రోజులు పూర్తయిన సంద ర్భంగా ఏర్పాటు చేసుకున్న శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశంలో ఆ కుట్రను అమలు చేయడం ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని, ఇది వైసీపీ పాలనలో జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.రాజకీయాల్లో ఇక ఇంతకంటే దిగజారుడు సాధ్యం కాదనుకున్న ప్రతిసారీ చంద్రబాబు షాక్ ఇస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదంపై అనుమాన పంకిలం చల్లడానికి ఆయన ఏడు పాతాళ లోకాలను దాటి కిందకు దిగజారారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల పైచిలుకు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.లడ్డూ ప్రసాదం తయారీకి, అందులో వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పటిష్ఠమైన వ్యవస్థ తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఈ వ్యవస్థలో మార్పు ఉండదు. తిరుమలలో గత వంద సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదం అమల్లో ఉంది. మహంతుల అజమాయిషీలో నడిచే తిరుమల పాలనా వ్యవహారాలను తొంభయ్యేళ్ల కింద బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకొని టీటీడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదానికీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి లడ్డూలు తయారుచేసే పోటు సామర్థ్యం రోజుకు 45 వేలు మాత్రమే. పోటు సామర్థ్యాన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ ఆయన హయాంలో ఆధునిక వసతులను సమకూర్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోటును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు. మూడున్నర లక్షల లడ్డూల తయారీ సామర్థ్యం ఇప్పు డున్నది. అవసరమైతే ఆరు లక్షల వరకు తయారు చేసుకోవ డానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా చేశారు.తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడటానికి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను పెంచడం కోసం ల్యాబ్ వ్యవస్థను పటిష్ఠం చేయడం కూడా వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. నవనీత సేవకోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్నను తయారు చేయడానికి తిరుమలలోనే ఒక ప్రత్యేక గోశాల కూడా ఆయన హయాంలోనే ఏర్పాటయింది. ఏడుకొండలపై ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలన్న సంకల్పంతో మఠాధిపతులతో కూడిన విద్వత్ సభ కూడా అప్పట్లో జరిగింది. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రయినప్పటికీ ఈ తరహా కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవు.ఇక చంద్రబాబు ఆరోపణలకు సంబంధించిన నెయ్యి కొనుగోలు వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతున్నది. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారిలో కొందరితో కలిసి కొనుగోలుకు సంబంధించిన సబ్–కమిటీ ఉంటుంది. ఆరు నెలలకోసారి ఆన్లైన్లో టెండర్లు పిలిచి ఎల్–వన్‌గా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న ప్లాంట్‌ను పరిశీలించి, అందులో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఈ సబ్‌కమిటీ బేరీజు వేసుకుంటుంది. అనంతరం కాంట్రాక్టుకు సంబంధించిన అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ వుంటే సబ్‌కమిటీ బోర్డుకు నివేదిస్తుంది.టెండర్ ఖరారు చేయడానికీ లేదా రద్దు చేయడానికీ కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేబినేట్లో ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, కేంద ప్రభుత్వానికి సన్నిహితుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.నెయ్యి సరఫరా దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రతి ట్యాంక ర్తో పాటు నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంట తెచ్చు కోవాలి. ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబుల్లో ఈ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవచ్చు. ట్యాంకర్ తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ వున్న మార్కెటింగ్ కార్యాలయంలో మూడు శాంపిళ్లను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు. ఈ మూడు శాంపిళ్ల పరీక్షలోనూ నాణ్యత నిర్ధారణ అయితేనే ట్యాంకర్ తిరుమలకు చేరుకుంటుంది. లేకుంటే వచ్చిన దారిన వెనక్కు వెళ్తుంది. పరీక్షలో విఫలమై ట్యాంకర్లు వెనక్కు వెళ్లడం ఈ ఇరవై ఏళ్లలో వందలసార్లు జరిగినట్టు సమాచారం. అదేవిధంగా చంద్రబాబు ఆరోపించిన ఏఆర్ డెయిరీ వారి కంటెయినర్ కూడా వెనక్కు వెళ్లింది. అది కొండెక్కిందీ లేదు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడిందీ లేదు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు ఆరగించిందీ లేదు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థ కల్తీ సరుకులను ప్రసా దాల్లోకి అనుమతించదు.తిరస్కరించిన ఈ ట్యాంకర్‌లోని శాంపిల్‌ను తీసుకున్నది జూలై 12వ తేదీన! అప్పటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆ శాంపిల్‌ను జూలై 17న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్‌కు పంపించారు. 23న ఆ ల్యాబ్ రిపోర్టు పంపించింది. టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిట బుల్ ఫ్యాట్స్ కలిశాయని నివేదిక ఆధారంగా చెప్పారు. విశ్వస నీయ సమాచారం మేరకు ఎన్డీడీబీతో పాటే మైసూర్‌లోని మరో కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌కు కూడా ఈ శాంపిల్స్ పంపించారట. వారి రిపోర్టు గురించి మాత్రం ఎటువంటి సమాచా రాన్ని టీటీడీ ఇవ్వడం లేదు.ఈ వ్యవహారం పూర్తయి రెండు నెలలు గడిచాయి. కూటమి సర్కార్‌కు వందరోజులు నిండిన నేపథ్యంలో జరిగిన రాజకీయ సమావేశంలో చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను విడుదల చేశారు. జంతువుల ఫ్యాట్ కలిసిందనే ఆరోపణ అక్కడే చేశారు. టీటీడీ విడుదల చేయవలసిన నివేదికను పొలిటికల్ మీటింగ్‌లో విడుదల చేయడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. అంతకుముందు వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిందని చెప్పిన ఈఓ ఈ సమావేశం తర్వాత స్క్రిప్టు మార్చి చంద్రబాబు ప్రసంగాన్ని అనుసరించారు.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తిరుమల ప్రసాదానికి అపవిత్రతను ఆపాదిస్తూ మాట్లాడడంతో ఇది జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారిపోయింది. తిరుమలకు ఉన్న విశిష్టత అటువంటిది. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసి, తద్వారా రాష్ట్ర ఇమేజ్‌కు మసిపూసి చంద్రబాబు ఏం సాధించదలుచుకున్నారు? కల్తీ సరుకును కనిపెట్టి వెనక్కు తిప్పి పంపే వ్యవస్థాగత బలం టీటీడీకి ఉన్నది. పలు సంద ర్భాల్లో అలా జరిగింది. మొన్నటి కల్తీ సరుకు వచ్చింది టీడీపీ సర్కార్ జమానాలోనే. దాన్ని గుర్తించిన టీటీడీ వ్యవస్థ వెనక్కు పంపింది కూడా! మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టాలని చంద్రబాబు భావించారు? తనకు అనుకూలంగా అరవై నాలుగు నోళ్లు లేస్తాయన్న ధీమాతోనే కదా అభాండాలు వేయడం!తమ జీవితాలను వరదల్లో ముంచేసినందుకు మూడు లక్షల కుటుంబాలు విజయవాడలో బాబు సర్కారు మీద భగ్గుమంటున్నాయి. సర్కార్ బడుల్లో వసతులపై కోత పెట్టడం, సీబీఎస్ఈ సిలబస్ రద్దు చేయడం, ఇంగ్లీష్ మీడి యాన్ని నిరుత్సాహపరచడంతో రెండున్నర లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేట్ బాట పట్టారు. కేంద్ర సర్కార్‌లో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ యత్నాలను అడ్డుకోవడం లేదని కార్మికులు మండి పడుతున్నారు.ఉద్యోగాల కల్పన ఊసేలేదు, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. వంచనకు గురయ్యామని మహిళలు మథనపడుతున్నారు. సర్కార్ మేనిఫెస్టోలపై సోషల్ మీడి యాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వీడియోల నిండా వెట కారం ప్రవహిస్తున్నది.వంద రోజుల్లోనే విశ్వరూపం దాల్చిన వ్యతిరేకతను దారి మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండవచ్చు. కానీ ఆ దారి మళ్లింపు ఇలా ఉండకూడదు. నిస్సందేహంగా బాబు చేసింది మహాపచారం. ఆయన చేసిన పనివల్ల తిరుమల ప్రతిష్ఠకు జాతీయ స్థాయిలో భంగం వాటిల్లింది. కూటమి సర్కార్ అందజేసిన సమాచారాన్నే కళ్లకద్దుకొని జాతీయ మీడియా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. ఈ మీడియా ప్రచారం వల్ల జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్ఠే దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తుండవచ్చు. కానీ చంద్రబాబు జమానాలోనే కల్తీ సరుకు వచ్చిన విషయం నేడు కాకపోతే రేపైనా జాతీయ మీడియాకు తెలుస్తుంది. అక్కడ అమలవుతున్న కట్టుదిట్టమైన వ్యవస్థపై అవగాహన కలుగుతుంది. కానీ, తిరుమల పవిత్రతకు చంద్రబాబు వల్ల తగిలిన గాయం ఎప్పుడు మానాలి? రాజకీయ జూదం కోసం పుణ్యక్షేత్రాలను పణంగా పెట్టేవారికి ఆ ఏడు కొండలవాడే బుద్ధి చెప్పాలి. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తిరుపతి లడ్డూకు రాజకీయ రంగు దారుణం
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయ రంగు పులమడం.. శ్రీవారి ప్రసాదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని భక్తులు మండిపడుతున్నారు. ఏదో ఒక సంస్థ సరఫరా చేసే నెయ్యి బాగుందని చెప్పి మిగిలిన సంస్థలపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను శుక్రవారం సాక్షి పలకరించగా వారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. – తిరుమలచంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరంసీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఏదైనా లోపాలుంటే వాటిని పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలి. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉంది.– శ్రీను, శ్రీవారి భక్తుడు, ఒంగోలుసమగ్ర విచారణ చేయాలి..ఆరోపణలు చేయడం కాదు సమగ్ర విచారణ జరపాలి. నందిని నెయ్యి బాగుందని చెప్పడం.. ఇతర కంపెనీల నెయ్యిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాం. భక్తులకు ప్రసాదంపై నమ్మకం పోతుందనే విషయం పాలకులు గమనించాలి. – రోహిత్, శ్రీవారి భక్తుడు, విశాఖపట్నంప్రసాదంపై నమ్మకం సన్నగిల్లేలా వ్యాఖ్యలుదవారి ప్రసాదం అంటే మాకు వరంతో సమానం. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా, సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంపై నిందలు వేసే విధంగా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం బాధాకరం. అసలు గతంలో అనుమానం వచ్చినప్పుడే దీనిపై ఎందుకు మాట్లడలేదు? ఇప్పుడు రచ్చ చేయడంపై అనుమానం వస్తోంది. ఇది రాజకీయ కుట్రలో భాగమేననిపిస్తోంది. స్వామివారిని రాజకీయ రొచ్చులోకి లాగడం దారుణం. – తంగవేలు, శ్రీవారి భక్తుడు, రాయవెల్లూరు జిల్లా, తమిళనాడుఇటువంటి వ్యాఖ్యలు తగదువారి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులకు తగదు. ఇలాంటి మాటలతో భక్తుల్లో అయోమయం నెలకొంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతలో లోపాలుంటే నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి పరిశీలించాలి. ఉద్యోగులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదు. – సుబ్రమణ్యం, టీటీడీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు మనోభావాలతో ఆటలా?పవిత్రమైన తిరుమల ప్రసాదంపై విచ్చలవిడిగా మాట్లాడటం సమంజసం కాదు. భక్తులు సైతం ఇలాంటి ఆరోపణలను సహించరు. వారి మనోభావాలతో రాజకీయ నేతలు ఆడుకోవడం సబబు కాదు. ఉద్యోగులు సైతం ఇలాంటి మాటలపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. కమిటీ వేసి నిజానిజాలను వెలికితీసి భక్తులకు తెలియజేయాల్సిన ప్రభుత్వం బహిరంగంగా ఆరోపణలు చేయడం సరికాదు.– జయచంద్ర, సీఐటీయూ నాయకులు, తిరుపతి -
తిరుమల శ్రీవారి దర్శనికి పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ కృష్ణతేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,072 మంది స్వామివారిని దర్శించుకోగా 30,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. టీబీసీ అతిథిగృహం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 85,626 మంది స్వామివారిని దర్శించుకోగా 33,138 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
Tirumala: సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో నిండి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 63,936 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 18,697 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.55 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,320 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.26 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
అక్టోబరు 4 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు. ఉచిత సర్వ దర్శనానికి 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 74,957 మంది భక్తులు దర్శించుకోగా 33,066 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని తెలిపారు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,421 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.26 కోట్లుగా లెక్క తేలింది. -
రూ. 21 కోట్లు విరాళంగా అందించిన దాత రాజిందర్ గుప్తా
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(ఆదివారం) 86,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,536 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా లెక్క తేలింది. -
వడ్డీ కాసులవాడా... గోవిందా..!
కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న ఆడిటర్ అతడు. డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత ఒక్కటే పీడిస్తోంది. దాంతో ఏడుకొండల వాడిని ప్రార్థించాడు. మగ పిల్లవాడు పుడితే తన చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు... ఏడాదికే మగ పిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు ఆ ఆడిటర్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే, ‘ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము’ అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు.ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టు పట్టేసరికి కొడుకు ఐదో పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఈ ఉంగరం ఖరీదు పది హేనువేలు, ఇప్పుడు దీని ఖరీదు ఇరవై వేలు. ఈ ఉంగరం ఉంచేసుకుని స్వామి వారి హుండీలో పదిహేను వేలు వేద్దామనుకున్నాడు. కొడుకును తీసుకుని తిరుమల కొండ చేరాడు. ఆరోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ, ఎలాంటి తొడుగు లేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆపాదమస్తకం కన్నులారా తిలకించి ‘‘ధన్యుడిని స్వామీ...’’ అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకును తీసుకుని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే పదిహేనువేల నూట పదహార్లు హుండీలో వేసి ‘‘మొక్కు చెల్లించేశాను స్వామీ... బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను. రుణ విముక్తుడినైనాను’’ అని హుండీకి దండం పెట్టుకుని అక్కడినుంచి కదిలాడు.తండ్రీ కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్నచిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికి లాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తియ్య తియ్యగా ఉన్న లడ్డును ఆ అయిదేళ్ళ పిల్లవాడు గబగబా తినేశాడు. ‘‘అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్నా వీళ్ళు?’’ అని ఆశగా అడిగాడు. ‘ఒక్కరికి ఒక్కటే బాబూ... కావాల్సి ఉంటే నా లడ్డు తీసుకో!’’ అని కొడుకు చేతికి ఇచ్చాడు.తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా ‘‘నీ ఉంగరం ఏది నాన్నా?’’ అని అడిగాడు.అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ‘ఏమి జరిగిందా...’ అని లిప్తపాటు కళ్ళు మూసుకుని ఆలోచించాడు.ఆరు నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్డుల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది.‘అంటే... హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్న మాట. నిద్ర లేచింది మొదలు, రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ వడ్డీ కాసులవాడు... ఎంత తప్పు చేశాను... స్వామీ నన్ను క్షమించు!!’’ అని తలెత్తి ధ్వజ స్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,131 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 30,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించారని స్పష్టం చేసింది. -
TTD: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(మంగళవారం) 71,409 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.15 కోట్లుగా లెక్క తేలింది. -
July 05: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుపతి, సాక్షి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్నీ కంపార్టుమెంట్లు నిండి.. బయట ATC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న(గురువారం) 63,826 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,530 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
July 04: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . నిన్న 69,632 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 26,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లు . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
June 29: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,256 మంది స్వామివారిని దర్శించుకోగా, 30,087 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు.అలాగే, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది . ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది.ఇదిలా ఉంటే.. అక్టోబర్నెలా కోటా టికెట్లను జులై 18వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది -
June 25: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 77,878 మంది స్వామివారిని దర్శించుకోగా, 30,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.46 కోట్లు సమర్పించారు. ఇంకా.. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది . ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . నిన్న 64,467 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 40,005 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 62,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం. నేటితో జ్యేష్ఠాభిషేకం ముగింపు. నేడు ఉత్సవమూర్తులకు బంగారం కవచాలు అలంకరణ చెయ్యనున్న అర్చకులు. -
June15: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 66,782 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,229 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 61,499 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.04 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు
-
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,416 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(మంగళవారం) 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 35,726 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 70,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శనివారం) 76,945 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.67 కోట్లుగా లెక్క తేలింది. -
May 10 Tirumala: తిరుమలలో నేటి రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,508 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.97 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,313 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది. నిఘా వేశాం.. ఆందోళన వద్దు తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు. అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు". -
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
సాక్షి, తిరుపతి : నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణి లో తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవం తొలిరోజు మార్చి 20న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పపై మూడు ప్రదక్షిణలు చేసి భక్తులను ఆశీర్వదిస్తారు. రెండో రోజు మార్చి 21న రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి మూడుసార్లు తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు మార్చి 22న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పుష్కరిణిలో మూడుసార్లు చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా మార్చి 23న నాలుగో రోజు ఐదుసార్లు, మార్చి 24న చివరి రోజు ఏడుసార్లు మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆర్జిత సేవలు రద్దు తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం స్వామివారిని 63,251 మంది దర్శించుకున్నారు. వారిలో 20,989 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకతో స్వామివారి హుండీ ఆదాయం 4.14 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామి ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం.. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది. 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుందని టీటీడీ అధికారులు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న 83,825 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా.. 25,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లుగా లెక్క లేలిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి 10 గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (ఆదివారం) 66,322 మంది స్వామివారిని దర్శించుకోగా 24,672 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.39 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 5 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 12 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న స్వామివారిని 57,973 భక్తులు దర్శించుకున్నారు. అందులో 21,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమల: మే నెల దర్శన టికెట్ల తేదీల విడుదల
తిరుపతి: మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీలను టీటీడీ విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను విడుదల చేసింది. అలాగే, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక.. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్లైన్ కోటాను రేపు(ఫిబ్రవరి 23) ఉదయం 11 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ దేవస్థానం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో పెట్టనుంది. దీంతోపాటు 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి టీటీడీ దేవస్థానం తీసుకురానుంది. ఇక.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 69,191 మంది స్వామివారిని దర్శించుకోగా 22,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.60 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 62,304 మంది స్వామివారిని దర్శించుకోగా 20,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.61 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమల తిరుపతి దేవస్థానాల సౌకర్యాలు భేష్
తిరుమల/న్యూఢిల్లీ: శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి విచ్చేస్తోన్న భక్తులకు శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను టీటీడీ చక్కగా కల్పిస్తోందని బ్రిజ్‌లాల్ అధ్యక్షతన ఉన్న భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభినందించింది. కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ ఆవిర్భావం నుంచి చేపడుతోన్న సామాజిక, ధార్మిక, సంక్షేమ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి వివరించారు. కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలను ప్రశంసించారు. కమిటీ సభ్యులు బిప్లవ్ కుమార్ దేవ్, నీరజ్ శేఖర్, దిలీప్ ఘోష్, దులాల్ చంద్ర గోస్వామి, రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్య పాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ.43 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం డీడీలను టీటీడీ ఈవోకు దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.33 లక్షల 33 వేలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల11 వేలు అందించారు. తిరుపతి పరిశుభ్రతపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంస తిరుపతి నగరం పారిశు«ధ్యంలో మరింత నిబద్ధత పాటిస్తుందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. తడి–పొడి చెత్త ద్వారా సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్, నిర్వహణ సౌకర్యాల కోసం శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. స్వచ్ఛభారత్ మిషన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 11న తిరుపతి నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న అనంతరం పారిశుద్ధ్యానికి సంబంధించి తిరుపతి నగరం పాటిస్తోన్న నిబద్ధతను కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. పారిశుధ్య సేవలను మరింతగా విస్తరించేందుకు, సిటీని ది బెస్ట్ క్లీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు 1,000 మంది కార్మికులను నియమించింది. ఇక్కడ ఏర్పా టు చేసిన వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్.. కేంద్రీకృత ప్లాంట్లపై భారాన్ని తగ్గిస్తుందని, వాటి పనిభారం, రవాణా ఖర్చులను కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. గణనీయ పరిమాణంలో సేంద్రీయ వ్యర్థాలు ఉత్పన్నమయ్యే మార్కెట్లు, తోటల్లో తడి వ్యర్థాలను ప్రాసెస్ చేయడంపై దృష్టి సారించిందని వెల్లడించింది. 3 ప్రధాన మార్కెట్లు, 3 తోటల వద్ద 6 వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. నగరంలో 3 వేర్వేరు ప్రదేశాల్లో 3 బయో చెస్ట్ యంత్రాలను ఏర్పాటు చేసి రోజుకు 100 కిలోలకు పైగా ఉత్పత్తి చేసే 27 బల్క్ వేస్ట్ జనరేటర్లను, రోజుకు 50–100 కిలోలు ఉత్పత్తి చేసే 60 జనరేటర్లను గుర్తించి వర్గీకరించినట్లు పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకమైన రీతిలో రీసైక్లింగ్ చేయడానికి వాషింగ్ ప్లాంట్, ఆగ్లోమెరేటర్ మిషన్ (ధన మెషినరీ)ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ మిషనరీ వల్ల తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ బృందం ఏడాది కాలంలో 263.29 టన్నుల ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌ను విక్రయించేలా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కృషి చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ కొనియాడింది. -
TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 6కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (ఆదివారం) 70,338 మంది స్వామివారిని దర్శించుకోగా 22,741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.96 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. మే నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 22న వర్చువల్ సేవల కోటా విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా…. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23న అంగప్రదక్షిణం టోకెన్లు…. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. -
Tirumala Temple: మే నెల శ్రీవారి సేవా టికెట్లు.. విడుదల తేదీలివే
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం 71,021 మంది స్వామివారిని దర్శించుకోగా 25,965 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఫిబ్రవరి 19న మే నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తిరుమల, 17 ఫిబ్రవరి 2024: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 22న వర్చువల్ సేవల కోటా విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా…. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23న అంగప్రదక్షిణం టోకెన్లు…. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. -
తిరుమల వేంకటమే.. అక్కడున్నది వేంకటేశ్వరుడే
తిరుమలపై కొన్ని అసత్య కథనాలు ప్రచారంలో ఉన్న, ప్రచారంలోకి వస్తున్న పూర్వ రంగంలో తిరుమల గురించి సరైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయంపై తెలివి లేకుండా ఏదో అనుకోవడమూ, అసత్యాల్ని ప్రచారం చెయ్యడమూ పెనుదోషాలు. తిరుమలలో దైవం వేంకటేశ్వరుడు కాదు అది అమ్మవారు అనీ, అక్కడ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అనీ, 9వ శతాబ్ది వరకూ అది బౌద్ధ క్షేత్రం ఆ తరువాతి కాలంలో దాన్ని వేంకటేశ్వరుడి ఆలయంగా మార్చేశారు అనీ విన వస్తున్నవి పూర్తిగా అసత్యాలు అని తెలుసుకోగలిగే ఆధారాలు ఉన్నాయి! తిరుమల విషయమై తెలివిడిలోకి వెళదాం రండి... వామన, గరుడ పురాణాల్లో వేంకటాచల క్షేత్ర ప్రస్తావన ఉంది. బ్రహ్మాండ, వరాహ పురాణాల్లో 'వేంకట' శబ్దానికి వివరణలున్నాయి. "వికటే" అనేదే "వేంకట" పదానికి పూర్వ రూపమనీ, "వేం" అంటే పాపం "కటతి" అంటే కాల్చేది అనీ చెప్పబడింది. పురాతనమైన తమిళ కావ్యాల్లో వెంకటాద్రి ప్రస్తావన ఉంది. సాధారణ శకం 2వ శతాబ్దికి చెందింది తమిళ్ష్ సంగ కాల సాహిత్యం. ఆ సంగ కాలంలోని ఒక తమిళ్ష్ కవి కల్లాడనర్ రాసిన అగనానూరు కావ్యంలో 83వ పద్యం (సెయ్యుళ్)లో శ్రీ వేంకటగిరి పైన ఒక ఆటవిక తెగ యువరాజు విహరించిన విశాలమైన మంచి ప్రదేశంలోని వేంకటం అని సూచిస్తూ "తిరువేంగడమలై కళ్షియినుమ్ కల్లా ఇళయర్ పెరుమగన్ పుల్లి వియందలై నన్ నాట్టు వేంగడం" అని చెప్పబడ్డది. ఇక్కడ శ్రీ వేంకటగిరి ప్రసక్తీ, వేంకటం ప్రసక్తీ కనిపిస్తున్నాయి. ఆ కావ్యంలో మరికొన్ని చోట్ల కూడా ఈ వేంకట శబ్దం చెప్పబడ్డది. అంతే కాదు ఆ రచనలో "ఏళీర్ కున్ఱం" అంటే ఏడుకొండలు అన్న ప్రస్తావన కూడా ఉంది. ఈ సంగ కాల సాహిత్యం అన్నది కొందరు రచయితల రచనల సంకలనం. సంగ కాల సాహిత్యం సాధారణ శకం 2వ శతాబ్ది కన్నా పూర్వంది అంటున్న పరిశీలనలు కూడా ఉన్నాయి. ఈ తమిళ సంగ కాల సాహిత్యంలో మరి కొందరు కవులు కూడా వేంగడం (వేంకటం) గురించి ప్రస్తావించారు. "ఉత్తర వేంకటం నుంచి దక్షిణ కన్యాకుమారి మధ్యన ఉంది తమిళ్ష్ మాట్లాడే మంచి లోకం (వడ వేంగడం తెన్ కుమరి / ఆయిడై తమిళ్ష్ కూఱుమ్ నల్ ఉలగం)" అనే లోకోక్తి చాల పాత నాళ్లలోనే తమిళ్ష్‌లో ఉంది. సాధారణ శకం 3వ శతాబ్దిలో ఇళంగో కవి రాసిన తమిళ్ష్ కావ్యం సిలప్పదిగారమ్లో వేంకటేశ్వరుడి వర్ణన ఉంది. ఆ రచనలో "తిరువరంగత్తిల్ కిడంద తిరుక్కోలముమ్, వేంగడత్తిల్ నిన్ఱ తిరుక్కోలముమ్" అని ఉంది. అంటే శ్రీరంగంలో (తిరువరంగత్తిల్) పడుకుని ఉన్న పవిత్ర రూపమూ, వేంకటంలో (వేంగడత్తిల్) నుంచుని ఉన్న పవిత్ర రూపమూ అని అర్థం. ఆ రచనలో నుంచుని ఉన్న ఈ రూపంపై వర్ణన పునరావృతం అయింది. వేంకటమూ, వేంకటేశుడూ గురించి 2, 3 శతాబ్దులకు లేదా అంతకు పూర్వ కాలానికి చెందిన తమిళ్ష్ కావ్యాలలో ప్రస్తావన ఉంది. అటు తరువాత 3-8 శతాబ్దులకు చెందిన ఆళ్ష్వారుల కాలానికి వేంకటేశుడు వేంకటాద్రితో సహా ప్రసిద్ధమయ్యాడు. ఆళ్ష్వారులు వందల పాసురాల్లో వేంకటేశుణ్ణి కీర్తించారు. ఈ ఆళ్ష్వారుల్లో తొలి తరానికి చెందిన పేయ్ ఆళ్వార్ తిరుమలై అనే పదాన్ని వాడారు. పేయ్ ఆళ్వార్ సాధారణ శకానికి పూర్వం 300 - 200 మధ్య కాలం వారు అని కొన్ని పరిశీలనలు తెలియజేస్తున్నాయి. తిరుమలై లేదా తిరుమల, తిరుపతి అన్నవి తమిళ పదాలు. తిరు అంటే శ్రీ అని, ఉన్నతమైన అని, మేలిమి అని, పవిత్రమైన అని అర్థాలు. తిరుమలై అంటే శ్రీ పర్వతం లేదా పవిత్రమైన పర్వతం, ఉన్నతమైన పర్వతం లేదా మేలికొండ అనీ, తిరుపతి అంటే శ్రీపతి లేదా పవిత్రమైన, ఉన్నతమైన నాథుడు అనీ అర్థాలు. ఈ వివరణల ద్వారా కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా 9వ శతాబ్ది వఱకూ బౌద్ధ క్షేత్రంగా ఉండి ఆ తరువాత అది వేంకటేశం అవలేదని తేట తెల్లంగా తెలియవస్తోంది. అది అమ్మవారి ఆలయమో సుబ్రహ్మణ్య ఆలయమో కాదు అని కూడా తెలుస్తోంది. అన్నమయ్య "తిరు వేంకటశుడు" అనే పాడారు కదా? అది అమ్మవారో లేదా సుబ్రహ్మణ్యస్వామో అయుంటే అన్నమయ్య వంటి కవికి, భక్తునికి, జ్ఞానికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా? అన్నమయ్య కాలానికి తిరుమల దైవం వేంకటేశుడే అని అప్పటి ప్రజలకు బాగా తెలుసు అని మనం గ్రహించాలి. నిజం కానిది, ప్రజల్లో లేనిది అయిన తిరుమల బౌద్ధ క్షేత్రం అనే అబద్ధాన్ని ఇటీవల కొందరు సృష్టించారని స్పష్టంగా అర్థమౌతోంది. (వెంకట్ అనీ వెంకటేష్ అనీ మనకు అలవాటయింది. అది తప్పు. అది వేంకటం, వెంకటం కాదు. వేంకట్ అనో వేంకటేశ్ అనో అనడమే సరైంది. ఈ వేంకటేశ అనే పేరు వేదాంత దేశికుల పేరు. వారే ఈ పేరుకు తొలివ్యక్తి.) 7-5-1820 నుండి 10-5-1820 వరకు తిరుమల ఆలయం మూసివెయ్యబడింది. అంతకు ముందు ఆలయం పూర్తిగా వడగలై సంప్రదాయంలో ఉండేది. ఆ మూడునాళ్ల తరువాత తిరుమల ఆలయం వడగలై, తెన్‌గలై సంప్రదాయాల వాళ్లకు ఆమోదయోగ్యంగా ఉండే విధానాల్లోకి మారింది. ఆ సమయంలోనే వేంకటేశ్వరుడి నామం వడగలై, తెన్‌గలై పద్ధతుల్లో కాకుండా ப గా మారింది. కానీ ధ్వజ స్థంభం, రథం, ఏనుగు, గరుడ వాహనం వంటి వాటిపై నామాలు మారకుండా నేటికీ వడగలై పద్ధతిలోనే ఉన్నాయి. మొదట్లో తిరుమల ఆలయం పాంచరాత్ర ఆగమ విధానంలో ఉండేది. పాంచరాత్ర ఆలయాల్లో ముందు ధ్వజ స్తంభం తరువాత బలిపీఠం ఉంటాయి. తిరుమలలో మనకు ఈ నిర్మాణమే కనిపిస్తుంది. పాంచరాత్ర ఆలయాలు కొండలపైనా, నదీ తీరాల్లోనూ ఉంటాయి. (శ్రీరంగం నదీ తీరంలో ఉంది) వైఖానస ఆగమ ఆలయాలు ఊరి లోపల ఉంటాయి. విజయనగర రాజు అచ్యుత దేవరాయల కాలంలో తిరుమల ఆలయం పాంచరాత్ర ఆగమం నుండి వైఖానస ఆగమంలోకి మారింది. అచ్యుతరాయలు వ్యక్తిగత కారణాలతో ఈ మార్పుకు కారణమయ్యాడు. మధ్యలో కొంత కాలం తిరుమల ఆలయం వ్యాసరాయర్ పర్యవేక్షణలో మార్ధ్వ సంప్రదాయంలోనూ ఉండేది. ఇవాళ ప్రధాన గోపురంలో మనం చూస్తున్న విమాన వేంకటేశ్వరుడు ఈ వ్యాసరాయర్ ఏర్పఱిచిందే. తిరుమలకు ఇవాళున్న ప్రశస్తి, ప్రాచుర్యం రావడానికి ప్రధానమైన కారణం రామానుజులు. రామానుజులు జన్మతః వైష్ణవుడు కాదు! స్మార్తుడు లేదా వైదికుడు. జన్మతః స్మార్తుడైన రామానుజులు వైష్ణవ సంప్రదాయ పంచ సంస్కార దీక్షను తీసుకుని వైష్ణవుడు ఆయ్యారు. రామానుజుల్ని వైష్ణవుడుగా మార్చిన గురువు పెరియనంబి. ఈ పెరియనంబి బ్రాహ్మణుడు కాదు శూద్ర అనబడుతున్న వర్గానికి చెందినవారు. ఇది మనకు దిశా నిర్దేశం చేసే చారిత్రిక సత్యం! ఆళ్ష్వారుల కాలం నుండే వైష్ణవం ఉంది. పొదిగై ఆళ్ష్వార్, బూదత్తు ఆళ్ష్వార్, పేయ్ ఆళ్ష్వార్ వీళ్లు మొదటి ముగ్గురు ఆళ్వార్లు. ఈ ముగ్గురూ వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం 300 - 200 మధ్య కాలంవారు అని కొన్ని పరిశీలనలు, వ్యావహారిక లేదా సామాన్య శకం తొలి శతాబ్దివారు అని కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. అటు తరువాత తిరుమళ్షిసై ఆళ్ష్వార్, నమ్మ ఆళ్ష్వార్, తిరుమఙ్‌గై ఆళ్ష్వార్, తొణ్డర్ అడిప్పొడి ఆళ్ష్వార్, పెరియ ఆళ్ష్వార్, ఆణ్డాళ్, కులశేఖర ఆళ్ష్వార్, మదుర కవి ఆళ్ష్వార్, తిరుప్పాణ ఆళ్ష్వార్లు వచ్చారు. బెంగాల్ లో 15వ శతాబ్దిలో చైతన్య ఏర్పఱిచిన గౌడియ వైష్ణవం, వల్లభాచార్యుల రుద్ర సంప్రదాయం, కర్ణాటక ఉడిపిలో 13వ శతాబ్దిలో మధ్వాచార్యుల మధ్వ సంప్రదాయం, నింబారకుల నింబారక సంప్రదాయం వంటివి వైష్ణవంలో ఉన్నాయి. రామానుజుల గురువు పెరియనంబికి పూర్వం వైష్ణవ గురు పరంపర ముక్కాల్ నంబి, ఆళవందార్ వంటి వారి మీదుగా శ్రీమత్ నాదమునిగళ్ వఱకూ వెళుతుంది. ఈ నాదమునిగళ్ను ఈనాడున్న వైష్ణవానికి ఆదిగా తీసుకోవచ్చు. రామానుజుల తరువాత ఈనాటి వైష్ణవ సంప్రదాయానికి ఊపు వచ్చింది. రామానుజుల తరువాత వైష్ణవంలో వేదాంత దేశికులు ఉన్నతమైన గురువు. అటు తరువాత మనవాళ మామునిగళ్ కాలంలో వడగలై సంప్రదాయమూ, తెన్‌గలై సంప్రదాయమూ ఏర్పడ్డాయి. ఈ మనవాళ మామునిగళ్ జన్మతః బ్రాహ్మణులు కాదు! ఈడిగ అనబడుతున్న వర్గానికి చెందినవారు మనవాళ మామునిగళ్. ఈ చారిత్రిక సత్యం మనకు కనువిప్పు కలిగిస్తూ సామాజిక వర్గాల అసమానతల్ని తొలగించేది కావాలి. వడగలై, తెన్‌గలై సంప్రదాయాల్లో నుదుటిపై పెట్టుకునే నామాలలో తేడాలున్నాయి. వడగలై నామం U. ఈ U కి కింద చిన్న గీత పెడితే తెన్‌గలై నామం అవుతుంది. మాధవా, కేశవా అంటూ నామాలు చెప్పుకుంటూ గీతలు గీసుకోవడం వల్ల ఈ ముద్రలకు నామాలు అని అనడం వచ్చింది. ఇవాళున్న ఈ వైష్ణవ నామాలు రామానుజుల కాలంలో లేవు. రామానుజులు ఈ నామాల్ని పెట్టుకుని ఉండరు. ఆయన శ్రీచందనంతో ఊర్ధ్వ పుండరాన్ని పెట్టుకుని ఉంటారు. వడగలై నామం వేదాంత దేశికర్తోనూ, తెన్‌గలై నామం మనవాళ మామునిగళ్తోనూ మొదలైనట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, ఉత్తరాది వైష్ణవ సంప్రదాయాల్లో శ్రీచందనంతో ఉర్ధ్వ పుండరమే ఉంది. ఇస్కాన్ కూడా ఈ నామాన్నే తీసుకుంది. ఇవాళ రామానుజల విగ్రహానికి తెన్‌గలై నామం కనిపిస్తోంది. అది ఎంత మాత్రమూ సరికాదు. రామానుజులకు ముందు, రామానుజులకు తరువాత అని వైష్ణవాన్ని పరిగణించాల్సి ఉంటుంది. అదే విధంగా తిరుమలను కూడా రామానుజులకు ముందు, రామానుజులకు తరువాత అని పరిగణించాల్సి ఉంటుంది. రామానుజులు తిరమలలో పూజా విధానాలు, సేవలు, పద్ధతులలో పెనుమార్పులు తీసుకువచ్చారు. రామానుజులు తిరుమలకు రంజనను, రాణింపును తీసుకువచ్చారు. సరైన విషయాల్ని తెలుసుకుని తెలివిడితో తిరుమల విషయమై ఇకనైనా సరైన అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. తిరుమల అమ్మవారి ఆలయమో, సుబ్రహ్మణ్య ఆలయమో, ఏ బౌద్ధ క్షేత్రమో, మరొకటో కాదు. తిరుమల వేంకటమే; అక్కడున్నది వేంకటేశ్వరుడే. రోచిష్మాన్ 9444012279 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం.. కీలక నిర్ణయాలివే
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమలలో స్థానిక అన్నమయ్య భవన్లో సోమవారం నిర్వహించిన పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీ ప్రత్యేకంగా మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించమని…వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాసినట్లు చెప్పారు.గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు, నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించామన్నారు. చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఈసీకి ఫిర్యాదు వాటర్ వర్క్స్. అన్నప్రసాదం, వేదపాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు భూమన తెలదిపారు. వేదపండితుల పేన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేదపారాయణదారులు పోస్టులు నియామకానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేశామన్నారు. అటవిశాఖ ఉద్యోగుల సమస్య గురించి మంగళవారం కార్మికులుతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారని టీటీడీ చైర్మన్ తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలకమండలి సానుకూలంగా ఉందన్నారు. పిబ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని, దీనికి 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సుకు హజరవుతారని తెలిపారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు,స లహాలను టీటీడీ తూచా తప్పకూండా అమలు చేస్తామన్నారు. హుండి ద్వారా 1611 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు,దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు వస్తూందని అంచనా వేశామన్నారు. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
ఇక టీటీడీ పరిధిలోకి రాజనాలబండ ఆలయాలు..!
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం, సమీపంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో చరిత్రాత్మక ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు విశిష్ట కృషిచేశారని కొనియాడారు. తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ డిప్యూటీ ఈఓ శాంతి, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం కలిసి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఆలయానికి చెందిన భూములు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు ఇక నుంచి టీటీడీ ఆధ్వ ర్యంలో జరుగుతాయన్నారు. ఈ మేరకు ఆలయ ఆదాయ వనరులు, ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఈఓ శాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ ఏఈఓ మణి, జనరల్ సెక్షన్ డిప్యూటీ ఈఓ శివప్రసాద్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వెంకట్రమణ, ల్యాండ్స్ ఎస్టేట్ విభాగం తహసీల్దార్ లలితాంజలి, టెంపుల్ ఇన్చార్జి భానుప్రకాష్ తదితరులున్నారు. భక్తి శ్రద్ధలతో చండీ హోమం బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని యాగశాలలో నెలకొల్పారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి అభిషేక పూజలు చేశారు. పూర్ణాహుతి అనంతరం ఉభయదారులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేయించారు. -
Tirumala: నేడు రామకృష్ణ తీర్థ ముక్కోటి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో12 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న మంగళవారం 65,991 మంది స్వామివారిని దర్శించుకోగా 21,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి తిరుమలలో జనవరి 25న గురువారం ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. కాగా, అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరడమైనది. కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ దాదాపు 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. గురువారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే యాత్రికులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాలు, కాఫీ, పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) స్వామివారిని 69,874 భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.39 కోట్లుగా లెక్క తేలింది. వచ్చే 22న అయోధ్య రామా మందిరం ప్రారంభం.. నేడు ప్రత్యేక ప్లైట్‌లో అయోధ్య చేరనున్న టీటీడీ శ్రీవారి లడ్డులు. దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లక్ష లడ్డూలు తయారి. నిన్న రాత్రి తిరుమల నుండి బయలుదేరిన లడ్డులు. -
టీటీడీ ఆలయాల సమాచారంతో అందుబాటులోకి ఆధునీకరించిన వెబ్సైట్
-
టీటీడీ ఉద్యోగులకు శుభవార్త
-
TTD: కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ
సాక్షి, తిరుపతి: వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి(డిసెంబర్ 23) పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం Vaikunta Dwara Darshan కోసం టోకెన్లను నేటి మధ్యాహ్నాం నుంచి కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే భక్తులు భారీగా తరలి రావడంతో.. కాస్తంత ముందుగానే నిన్న అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టింది. శుక్రవారం ఉదయం అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం.. తిరుపతిలోని 90 కౌంటర్లలో 4 లక్షల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రంత టోకెన్ కేంద్రాల వద్ద జాగారం చేశారు. దీంతో అధికారులు టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకన్లు కోటా త్వరగతినే పూర్తైంది. మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ. టికెట్లు ఇచ్చేది ఈ కేంద్రాల్లోనే.. 1. విష్ణునివాసం, 2. శ్రీనివాసం, 3. గోవిందరాజస్వామి సత్రాలు, 4. భూదేవి కాంప్లెక్స్, 5. రామచంద్ర పుష్కరిణి 6. ఇందిరా మైదానం, 7. జీవకోన హైస్కూల్, 8. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, 9. ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది టీటీడీ. వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్ ధరించాలని టీటీడీ ఇప్పటికే భక్తులకు సూచిస్తోంది. భక్తులకు ఆహారం, నీటి సౌకర్యంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. భక్తులు సంయమనం పాటించాలి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రాలకు సైతం భక్తులు ముందుగానే తరలి వచ్చారు. రద్దీ నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేసే టికెట్ కేంద్రాన్ని పరిశీలించారు అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి. భక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నారు. రేపు వైకుంఠ ఏకాదశి రేపు వైకుంఠ ఏకాదశి. శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఎల్లుండి 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది. వీఐపీలకు సూచన వైకుంఠ ద్వారా దర్శనం కోసం.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తారు. లేకుంటే లేదు. అలాగే.. దర్శనం స్లాట్ సమయానికి 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. దర్శనం టోకెన్, టిక్కెట్టు ఉన్నవారికి అద్దెగది కేటాయిస్తారు. ఇక స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనాలు ఉంటాయి. సిఫార్సు లేఖలు రద్దు చేశారు. అలాగే.. తిరుమలలో వసతి కొరత కారణంగా తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాలని వీఐపీలకు టీటీడీ సూచిస్తోంది. కాకపోతే దర్శన టోకెన్ ఉన్నవాళ్లకు తిరుమలలో వసతి కేటాయింపు చేస్తోంది. కొనసాగుతున్న రద్దీ.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. గురువారం 59,868 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే.. 23,935 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.91 కోట్లుగా లెక్క తేలింది. వైకుంఠ ఏకాదశి దృష్ట్యా ఇవాళ్టి దర్శనానికి టోకెన్ల జారీ రద్దు చేసింది టీటీడీ. -
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు నారాయణగిరి ఉద్యానవనం వరకు బారులు తీరారు. శనివారం 74,845 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,122 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.44 కోట్లు ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. రేపు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి కార్యక్రమం, సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పి వేసి గర్భగుడిని, పూజా సామాగ్రిని సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ది చేశారు. 2024 మార్చి నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తేదీలను ప్రకటించింన టిటిడి ► నేడు ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ► డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం,ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల. ► డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల. ► డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ► డిసెంబరు 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ► డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► డిసెంబరు 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► డిసెంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల. ► డిసెంబరు 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ► https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి సూచన. -
శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు. చదవండి: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్ అందించిన సీఎం జగన్ -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో స్వామివారి సర్వదర్శనం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్మెంట్లు నిండాయి.శుక్రవారం 56,950 మంది స్వామివారిని దర్శించుకోగా 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 2 గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,278 మంది స్వామివారిని దర్శించుకోగా 17,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. టీటీడీకి రెండు బస్సులు విరాళం చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేసిన భక్తులు. అక్టోబర్ లో నెలలో తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు ► అక్టోబర్ లో నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 19.73 లక్షలు ► అక్టోబర్ లో నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 108.46 కోట్లు ► నెలలో విక్రయించిన లడ్డులు 97.47 లక్షలు ► అక్టోబర్ లో తలనీలాలు సమర్పించిన భక్తులు 7.06 లక్షలు ► అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 36.50 లక్షలు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
తిరుమలలో శ్రీవారి లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు
-
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి నేరుగా భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో ఎనిమిది గంటల్లోనే సర్వదర్శనం ముగుస్తోంది. ఇక శుక్రవారం 66,048 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు 24,666 మంది సమర్పించగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లుగా తేలింది. మరోవైపు డిసెంబర్ 23–జనవరి1 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను (రోజుకు 2 వేల టికెట్లు) నవంబర్ 10న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకుగాను 4.25 లక్షల టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. అలాగే.. నవంబర్ 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని, 24న చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తామన్నారాయన. -
TTD: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. గురువారం శ్రీవారిని 59,335 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,271 కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లుగా తేలింది. -
అలిపిరి మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగు సంచారం
సాక్షి, తిరుపతి: అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఈ మేరకు భక్తులను అప్రమత్తం చేస్తూ శుక్రవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఒక ప్రకటన విడుదల చేసింది. అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు కెమెరా ట్రాప్‌లో నమోదైంది. దీంతో నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వరుస దాడుల ఘటనల తర్వాత.. ఈ మార్గంలో ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా పలు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే. భక్తుల భద్రత తమకు మొదటి ప్రాధాన్యం అని చెబుతున్న టీటీడీ.. ఈ మేరకు అవసరమైన చర్యలను తీసుకుంటోంది. మరోవైపు నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో సర్వే చేపట్టింది. ►అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుగు బంటి సంచారం రికార్డయ్యింది. నరసింహస్వామి ఆలయం నుంచి ఏడవ మైలు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వీటి సంచారం గుర్తించారు. మూడు రోజులుగా వేకువజామున, రాత్రి సమయాల్లో అవి సంచరిస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలి :::వైల్డ్ లైఫ్ అధికారులు -
ఘనంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
-
పుష్పక విమానంలో విహరించిన శ్రీమలయప్పస్వామి (ఫోటోలు)
-
గరుడ వాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామి వారు (ఫొటోలు)
-
సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్షం అలంకరణలో శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారి దర్శనం (ఫొటోలు)
-
నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై శ్రీహరి (ఫొటోలు)
-
స్వామివారు స్వయంభువుగా వెలసిన శేషాచలం కొండల మహాత్మ్యం అదే
ఓ విదేశీయుడు భారతదేశంలోని దేవాలయాల ప్రాశస్త్యాన్ని కంప్యూటర్ ద్వారా తెలుసుకున్నాడు. శేషాచలం కొండల్లో నెలవై ఉన్న వేంకటేశ్వరస్వామి అతడిని ఆకర్షించాడు. వెంటనే స్వామిని దర్శించుకోవాలనిపించింది. అనుకున్నదే తడవుగా చెన్నై విమానమెక్కాడు. పక్కన కూర్చున్న ప్రయాణికుడి సలహా మేరకు విమానాశ్రయం నుంచి కాలి నడకన తిరుమలకి వెళ్ళదలిచాడు. సంప్రదాయ దుస్తులు ధరించి, భుజానికి సంచీ తగిలించుకుని బయలుదేరాడు. ఎప్పుడూ చెప్పులు లేకుండా నడవని అతడు, ఎర్రటి ఎండకి కాళ్ళు కాలుతున్నా లెక్కచేయలేదు. స్వామి రూపాన్నే తలుచుకుంటూ ముందుకు నడిచాడు. దారిలో కొండకి నడిచి వెళ్ళే బృందాలు కొన్ని కనిపించాయి. వారితో కలిసి నడవటం కొనసాగించాడు. అలా మైళ్ళ కొద్దీ ప్రయాణం చేశాక, తిరుచానూరు చేరాడు. తల్లి పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. అమ్మవారి ప్రసాదం తింటూ తలెత్తి చూశాడు. వెండిరంగు లో మిలమిలా మెరుస్తున్న శేషాచలం కొండ చాలా దగ్గరగా అనిపించింది. చిన్న పిల్లవాడిలాగా ఎగిరి గంతులేశాడు. చకచకా నడుచుకుంటూ తిరుపతి పట్టణంలోని గోవింద రాజస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టాడు. అక్కడే నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదువుతూ మళ్ళీ శేషాచలం కొండల వైపు చూశాడు. ఆశ్చర్యం... కొండలు దూరంగా ఉన్నట్లు కనిపించాయి. ఉండబట్టలేక అతడు, తనతో పాటు నడుస్తూ ఉన్న మరో భక్తుడితో ‘‘అదేమిటండీ...? శేషాచలం కొండలకు దూరంగా ఉంటే, అవి చాలా దగ్గరగా ఉన్నట్లు, దగ్గరికి వెళితే ఎక్కడో... దూరంలో ఉన్నట్లు కనబడుతున్నాయి’’ అని ఆసక్తిగా అడిగాడు. ఆ భక్తుడు చిన్న నవ్వు నవ్వి ‘‘అదే నాయనా శేషాచలం కొండల మహాత్మ్యం. అవి స్వామివారు స్వయంభువుగా వెలసిన పవిత్రమైన కొండలు కదా! మనం పనుల్లో పడి స్వామిని మరిస్తే ‘నీకు దగ్గరే ఉన్నాను, వచ్చిపోరాదా!’ అని పిలిచినట్లు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ‘వచ్చావు కదా, నీ కష్టాలు తీరుతాయిలే...’ అని చెప్పి దూరమైనట్లవుతుంది. అయినా... అది చెబితే అర్థమయ్యేది కాదు. అనుభూతి చెందాల్సిందే. అందుకే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భక్తులు స్వామి దర్శనానికి పరుగులు తీస్తారు’’ అని వివరించాడు.భక్తిభావంతో ఆ విదేశీయుడి కళ్ళు తడి అయ్యాయి. గట్టిగా గోవిందనామ స్మరణలు చేస్తూ బృందాలతో కలిసి అలిపిరి చేరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
తిరుమల ఆలయ పాలనలో.. ఇప్పటికీ బ్రిటిష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది!
సాక్షి: స్వామి రోజూ అద్దంలో చూసుకుంటారా? అంటే అవుననే చెబుతోంది వైఖానస ఆగమ శాస్త్రం. ప్రత్యూష కాల పూజల్లో గర్భాలయ మూలమూర్తికి ఆదర్శం (అద్దం), గోవు, సలక్షణమైనటువంటి కన్య, గజం, అశ్వం, గాయకుడు.. ఇలా వరుసగా దర్శింప చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. ఇదే సంప్రదాయం ఆధునిక కాలంలోనూ స్పల్పమార్పులతో నేటికీ కొనసాగుతుండటం విశేషం. ► 8వ శతాబ్దంలో వైఖానస మహాపండితుడు శ్రీమాన్ నృసింహ వాజపేయ యాజులవారు తన ‘భగవదర్చాప్రకరణమ్’ అనే గ్రంథంలో తిరుమల ఆలయంలో నిత్యం వైఖానస ఆగమోక్తంగా జరిగే ఆరాధన గురించి తెలియజేశారు. శ్రీవారికి కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాల అమలు కోసం పూర్వం వైఖానస అర్చకులు దూరదృష్టితో కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ► ప్రత్యూష కాలంలో అర్చకులు ఆలయ ప్రవేశం చేసి కుంచెకోల (తాళాలు)తో మంత్ర పూర్వకంగా బంగారు వాకిలి ద్వారాలు తెరిచి వేదపఠనంతో అంతరాళంలోకి ప్రవేశిస్తారు. ► గర్భాలయంలోని స్వామి మూర్తికి కుడివైపున దక్షిణ దిశలో దర్పణం ఏర్పాటు చేసి ఉంది. అర్చకులు ఆ అద్దంలోగుండానే స్వామిని చూస్తూ ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆగమ సంప్రదాయానికి లోబడే మూలమూర్తికి ఎదురుగా బంగారు వాకిలిలోని గరుడాళ్వారు సన్నిధికి పైభాగంలో టీటీడీ పెద్ద అద్దం ఏర్పాటు చేసింది. ► లేగదూడతో సహా గోవును స్వామివారి ప్రథమ వీక్షణకై అంతరాళంగా పరిగణించే శయన మండపంలో నిలిపి ఉంచాలి. పూర్వం శ్రీవారికి ప్రత్యూష కాల కైంకర్యాల నిర్వహణ కోసం సన్నిధి గొల్ల ముందుగా ఆవు, దూడతో వెళుతుండగా, ఆయనను అనుసరించి అర్చకులు ఆలయ ప్రవేశం చేసేవారు. ► ఆవు, లేగదూడలను గర్భాలయ మూలమూర్తికి అభిముఖంగా నిలిపి, ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని పూర్తి చేయించాలి. తర్వాత సన్నిధి గొల్ల గోవు పొదుగు నుండి పాలు పితికి అర్చకులకు అందించేవాడు. ఆగమంలో చెప్పినట్టు ఆ పాలు ‘ధారోష్ణం’ అంటే ఆవు పొదుగు నుండి పాలు పితికినపుడు పాత్రలో పడిన పాలధార వల్ల కొంత ఉష్ణం పుడుతుంది. అటువంటి ధారోష్ణం కలిగిన పాలను నివేదనగా సమర్పించేవారు. ► ప్రస్తుత పరిస్థితుల్లో గోవు, లేగదూడ ఆలయంలోనికి ప్రవేశించే సంప్రదాయం లేదు. వైఖానస ఆగమంలో చెప్పబడిన ‘గో సూక్తం’ అనే వేద మంత్ర పఠనం ద్వారా పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆగమ సంప్రదాయంకోసం స్వామివారే యాదవ వంశస్థుడైన సన్నిధి గొల్లకు ప్రథమ దర్శనం చేసుకునే వరమిచ్చారు. అదే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. గజముఖాన్ని దర్శించే స్వామి.. ► స్వామివారు ప్రథమ వీక్షణ కోసం గజాన్ని దర్శించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ► గర్భాలయ మూలమూర్తికి ప్రతినిధిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సమస్త పూజలను మూలమూర్తికి సమానంగానే నిర్వహిస్తారు. రాత్రి ఏకాంత సేవ కూడా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికే నిర్వహిస్తారు. ఇదే చివరగా నిర్వహించే పవళింపు పూజ. గర్భాలయానికి ముందున్న శయనమండపంలో వేలాడదీసిన నవారు మంచంపై దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి భోగ శ్రీనివాసుడిని శయనింప చేస్తారు. మరుసటి రోజు ప్రత్యూషకాల సుప్రభాత సేవలో భాగంగా, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొలుపుతారు. ► శయన మండపంలో స్వామివారికి ఉత్తర, దక్షిణ దిశల్లో రెండేసి శిలాస్తంభాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర దిశలో ఉన్న ఓ శిలాçస్తంభం అగ్రభాగాన గజ శిర స్సు చెక్కబడి ఉంది. ► శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సుప్రభాత సేవలో మేల్కొలుపు తర్వాత ప్రథమంగా శిలాççస్తంభంపై ఉన్న గజ ముఖాన్ని దర్శింప చేస్తారు. ఆ తర్వాతే భోగ శ్రీనివాసుడిని శయనమండపం నుంచి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉన్న సింహాసనంపై జీవస్థాపంలో వేంచేపు చేస్తారు. శ్రీవారి పద్మపీఠం.. దివ్యతేజో రహస్య యంత్రం! ► శ్రీవేంకటేశ్వర స్వామి వారు గర్భాలయంలోని ఉపద్యక పవిత్ర స్థానంలో స్వయంవ్యక్త సాలగ్రామ అర్చావతారంగా స్థానిక మూర్తి/ ధ్రువమూర్తిగా పద్మపీఠంపై కొలువయ్యారు. స్వామి పాదపద్మాల కింద రహస్య యంత్రం ఉంది. సాక్షాత్తు మూలమూర్తి అంశగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహ పరిశీలనలో ఈ విషయం తేలింది. ► క్రీ.శ.614 వ సంవత్సరంలో పల్లవ రాణి సామవై పెరుందేవి మహారాణి ఈ రజత మూర్తిని ఆలయానికి సమర్పించారు. శంఖచక్రాలు ధరించి, అడుగున్నర పొడవు కలిగిన ఈ రజితæమూర్తి పూర్తిగా మూలమూర్తిని పోలి ఉంటుంది. ఈ విగ్రహం కింద యంత్రం ఉన్నట్టు అర్చకులు గుర్తించారు. అందువల్ల కచ్చితంగా మూలవిరాట్టు పాదపద్మాల కింద యంత్రస్థాపన ఉండి ఉంటుందనీ అర్చకుల వాదన. వైష్ణవ పరంపరలో గొప్ప ఆచార్యుడైనటువంటి నమ్మాళ్వారు ఈ రహస్యాన్ని గురించి వివరణ ఇచ్చి ఉండటం అర్చకుల వాదనకు బలం చేకూరింది. తెల్లదొరలూ... శ్రీవారి సేవకులే.. 1801 నుండి 1843 వరకు బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా పాలకుల హయాంలోనే ఆలయ పాలనకు కఠిన నిబంధనలు, క్రమశిక్షణ పద్ధతులు అమలయ్యాయి. నేటికీ తిరుమల ఆలయం, టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్ ఈస్టిండియా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి. దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు ∙1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు. టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు దిట్టం: శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాల తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు. కైంకర్యపట్టీ: తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీదారులు, జియ్యర్ సిబ్బంది వి«ధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చే శారు. దీనిప్రకారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి. బ్రూస్‌కోడ్: బ్రిటిష్ ప్రావిన్షియల్ జడ్జి పి.బ్రూస్ ఈస్టిండియా కోడ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికీ ఆలయపాలనకు అదే దిక్సూచిగా ఉంది. సవాల్–ఇ–జవాబు: శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలు వేసి వాటికి సమా«ధానాలు రూపొందించారు. దీన్నే సవాల్– ఇ–జవాబు పట్టీగా పిలుస్తారు. పైమేయిషీ ఖాతా: ఆలయ స్థిర, చరాస్తులు, దేవతావిగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషీ అకౌంట్’ అని పిలుస్తారు. ధార్మికసంస్థ పరిపాలనలో రికార్డులు, వి«ధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది. ►జీవో ఎంఎస్ నెంబరు 4429 తేది:23.09.1940, జీవో ఎంఎస్ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చదరపు కి.మీ. పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్లదొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండటం వారి భక్తి తత్పరతకు నిదర్శనం. -
తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం! మీకు తెలుసా! \
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. అక్టోబరు 14 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. టీటీడీ చైర్మన్ హోదాలో భూమన కరుణాకర్ రెడ్డికి స్వామివారి సేవచేసే భాగ్యం మరోసారి దక్కింది. గతంలో చైర్మన్‌గా ఉన్న సమయంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చైర్మన్‌గా మరోసారి అవకాశం వచ్చిన వెంటనే తిరిగి నూతన సంస్కరణలతో హిందూ ధర్మ ప్రచారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు భక్తి మార్గంలో నడిచేందుకు గోవింద కోటిని ప్రారంభించారు. గోవింద కోటి రాసిన ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం లభించేలా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు. సాక్షి: టీటీడీ చైర్మన్‌గా మీకు రెండోసారి శ్రీవారి సేవచేసే అవకాశం లభించింది. గతంలో చైర్మన్‌గా ఉన్నప్పుడు టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంతటి మహద్భాగ్యాన్ని మీరు ఏమనుకుంటున్నారు? చైర్మన్: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఊహించని విధంగా నాకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా పనిచేసే మహద్భాగ్యం దక్కింది. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. • 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఒకవైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలుచేశాం. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాము. • ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి విశ్వాసాలతో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా మా ధర్మకర్తల మండలి, అధికారుల సహకారంతో పనిచేస్తాను. ఈ సందర్భంగా గతంలో నా నేతృత్వంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను. దళిత గోవిందం! తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు, శ్రీవారి ఆలయ అర్చకులు అంతా దళిత వాడలకు వెళ్ళి కల్యాణం అనంతరం అక్కడే నిద్రించాం. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు స్వామివారినే దళితుల చెంతకు తీసుకుని వెళ్ళాం. దీనికి కొనసాగింపుగా గిరిజన గ్రామాల్లో గిరిజన గోవిందం, మత్స్యకార గ్రామాల్లో మత్స్య గోవిందం కార్యక్రమాలు కూడా నిర్వహించాం. శ్రీనివాస కల్యాణాలు భగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించాం. కల్యాణమస్తు! పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణమస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 35 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్లి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశాం. అందరికీ అన్నప్రసాదం 2006కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానంలో భోజనం చేసే అవకాశం ఉండేది. మా హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తునికీ రెండు పూటలా కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించాం. నాలుగుమాడ వీథుల్లో పాదరక్షలు నిషేధం.. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి నాలుగుమాడ వీ«థుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించాం. చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్కనుంచి ఆలయ ప్రవేశం చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూల్లో చాలా ఇబ్బందిపడే వారు. దీన్ని గమనించి చంటిబిడ్డలతో పాటు తల్లులు మహాద్వారం కుడివైపు నుంచి ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నాం. పుష్కరిణి హారతి.. ఎంతో పవిత్రమైన స్వామివారి పుష్కరిణికి ప్రతిరోజూ హారతి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం. పౌర్ణమి గరుడ సేవ.. బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీథుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్జిత సేవలో పాల్గొనే వారు పంచె కట్టుకునే నిర్ణయం! స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని వచ్చేలా నిర్ణయం అమలు చేశాం. ఇప్పుడు సేవలతో పాటు బ్రేక్ దర్శనంలో కూడా ఈ విధానం అమలవుతోంది. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు తిరునామం ధరించి వెళ్లే ఏర్పాటు చేశాం. మహిళా క్షురకుల నియామకం: కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే మహిళలకు మహిళలే తలనీలాలు తీసేందుకు మహిళా క్షురకులను నియమించాం. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక చిన్న లడ్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం. శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రోజూ సహస్ర దీపాలంకార సేవ ప్రారంభించాం. నడకమార్గంలో దశావతార విగ్రహాలు అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కల్పించడానికి దశావతార మూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయించాం. హిందువులకే ఉద్యోగాలు! ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా నిర్ణయం చేశాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేత చట్టం చేయించి అమలు చేశాం. ఎస్వీబీసీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ను ఏర్పాటు చేశాం. అలాగే ఎఫ్ఎం రేడియోను కూడా ప్రారంభించాం. వేద విశ్వవిద్యాలయం వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాను. అప్పటి గవర్నర్ శ్రీరామేశ్వర్ ఠాకూర్‌తో అనేకసార్లు చర్చించి అనుమతులు మంజూరు చేయించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారి సంపూర్ణ సహకారంతో విశ్వ విద్యాలయం ప్రారంభమైంది. విద్యార్థులకు ఉచిత భోజనం టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతూ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహాన్ని ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో ఏర్పాటు చేయించాం. గోమహాసమ్మేళనం! సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న విశిష్టత ఎంతో గొప్పది. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారే గో సంరక్షణకు ముందుకు వచ్చారు. అలాంటి గోవిందుడి ఆశీస్సులతో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున గో మహాసమ్మేళనం నిర్వహించాం. పీఠాధిపతులు, మఠాధిపతులు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోమాత విశిష్టతను ప్రపంచానికి చాటుతూ గో సంరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం పండిత, పామరుల మన్ననలు పొందింది. ధార్మిక సదస్సు సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరై అనేక సూచనలు చేయడంతోపాటు ధర్మకర్తల మండలి చేస్తున్న హిందూ ధర్మ ప్రచారం పై ప్రశంసలు కురిపించారు. అమృతోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున అమృతోత్సవాలు నిర్వహించాం. ద్వాదశి శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖంగా నిర్వహించే కైశిక ద్వాదశి ఉత్సవాన్ని ప్రారంభించాం. మాలదాసర్లకు ప్రోత్సాహకాలు గ్రామీణ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారకులుగా పనిచేస్తున్న మాలదాసర్లు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాం. ఎస్సీ, ఎస్టీలకు అర్చక శిక్షణ ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారికి అర్చక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్థానికాలయాల్లో దిట్టం పెంపు తిరుపతికి బయట ఉన్న టీటీడీ ఆలయాల్లో ప్రసాదాల దిట్టం, తీర్థం పెంచడం జరిగింది. అన్ని ఆలయాల్లోనూ మూలవర్లకు పట్టువస్త్రాలను అలంకరించేలా నిర్ణయం తీసుకున్నాం.. వకుళమాత ఆలయం తిరుపతికి సమీపంలోని పేరూరు బండ మీద శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని గుర్తించి, అది వకుళమాత ఆలయంగా నిర్ధారించాం. అర్చకులకు జీతాలు పెంపు అర్చకులకు జీతాలు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాం. సాక్షి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. సాక్షి: బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? చైర్మన్: తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి: భక్తులు అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం. సాక్షి: తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ, ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండేలా ఏర్పాట్లు చేశాం. సాక్షి: ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? చైర్మన్: అక్టోబర్ 19న గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గరుడ వాహనాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి: భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చైర్మన్: లక్షలాదిగా వచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సాక్షి: లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చైర్మన్: ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాం. - లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: 'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే? -
'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే?
దేశంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రామదేవత తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి శ్రీవారికి స్వయానా చెల్లెలు. తిరుపతి ప్రజలను పరిరక్షించే గ్రామదేవతగా భక్తులచే పూజలందుకుంటోంది. శ్రీవేంకటేశ్వరస్వామికి స్వయాన తోబుట్టువు కావడంతో తిరుపతి గంగమ్మ జాతర సమయంలో శ్రీవారు సారె పంపేవారు. ఈ సంప్రదాయం సుమారు నాలుగు శతాబ్దాల నాటిది. విష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. కాటమరాజుల కథల ప్రకారం గంగమ్మ శ్రీకృష్ణునికి చెల్లెలు. అందుకే శ్రీవారి ఆలయం నుంచి ప్రతి ఏటా ఆమెకు పుట్టింటి సారె పంపే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీవారి తోబుట్టువుగా భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం శ్రీతాతయ్యగుంట గంగమ్మకు ప్రతి ఏటా జాతర నెలలో శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ ఆలయానికి గంప, చేట, పట్టుశేషవస్త్రాలు, పసుపు, కుంకుమలను టీటీడీ వారు అందజేస్తున్నారు. తిరుచానూరులో చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంçపుతారు. శ్రీవారు శ్రీపద్మావతి అమ్మవారికి పంపే పసుపు ముద్ద తిరుమల నుంచి తిరుచానూరు చేరుకున్నాకే అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది. ఈ పసుపు ముద్దను తిరుచానూరుకు తీసుకెళ్లే మార్గమధ్యలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ గుడి ముందు ఆపి పూజారులు, అధికారులు అమ్మవారికి కొబ్బరి కాయ సమర్పించి హారతి ఇస్తారు. ఆ తరువాతే తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర! తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కట్టడాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు చెబుతున్నారు. గర్భాలయ నిర్మాణంలో భాగంగా 12 అడుగుల లోతులో బయటపడిన అపురూపమైన శిల్పాలతో బయటపడ్డ రాతి కట్టడాలు పల్లవుల ఆఖరి కాలం నాటివని పురావస్తుశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఆలయాన్ని శ్రీవారి భక్తాగ్రేసరుడు అనంతాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించారు. అప్పటి కుగ్రామమైన తిరుపతి ప్రజలను పరిరక్షించే ఆ గ్రామదేవతకు భక్తులు పూజలందిస్తూ.. ఏడు రోజుల పాటు జానపద వేషధారణలతో ప్రతిష్ఠాత్మకంగా జాతర సంబరాలను కొనసాగిస్తారు. దేశంలోనే ప్రథమ గ్రామదేవత ఉత్సవాన్ని జరుపుకున్న ఆలయం కూడా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి. సమ్మక్క–సారక్క జాతర చరిత్ర 200 ఏళ్లు అయితే, పైడితల్లి అమ్మవారి జాతరకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుపతి గంగమ్మ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉండటం విశేషం. తాతయ్య గుంట ఎందుకొచ్చిందంటే? వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అని పేరు ఉండేది. ఇదే చెరువు గట్టు మీద వెలసినందున అమ్మవారిని తిరుపతి గంగమ్మ అని పిలిచేవారు. కాలక్రమేణ శ్రీతాతయ్యగుంట గంగమ్మ అని ప్రశస్తి పొందింది. నాటి నుంచే అశేష భక్తకోటి పూజలందుకుంటూ గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా ఆలరారుతోంది. ఈ ఆలయం తరువాతే దేశంలోని గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు వెలసి భక్తజనుల పూజలు అందుకోవడం ఆరంభమయ్యాయి. తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించి మొక్కులు చెల్లించడంతో తాళ్లపాక గంగమ్మ అని కూడా పిలుస్తున్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ ‘జలక్రీడావిలాసం’ యక్షగానంలో తాతయ్యగుంట గంగమ్మను ప్రస్తావించింది. నాటి నుంచే టీటీడీ పర్యవేక్షణలో గంగమ్మ ఆలయం గంగమ్మ ఆలయాన్ని ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తోంది. బ్రిటిష్ వారు 1843 సంవత్సరంలో టీటీడీ ఆలయ పర్యవేక్షణను హథీరామ్జీ బాబాకు అప్పగించారు. అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం ఆలయం ఇలా 26 ఆలయాల పర్యవేక్షణను హాథీరామ్‌జీ బాబా చూసేవారు. హాథీరామ్‌జీ బాబా పర్యవేక్షణలోనే శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం కూడా ఉండేది. 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పాటవటంతో బ్రిటిష్ వారు తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణను పాలకమండలికి అప్పగించారు. అప్పట్లో శ్రీతాతయ్యగుంట గంగమ్మ రికార్డులు మాయమయ్యాయి. అంటే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం టీటీడీ ఉప ఆలయమే అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. గంగమ్మ దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం.. తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా శ్రీవారి చెల్లెలైన గంగమ్మను దర్శించుకునే వారు. ఆ తరువాతే తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. శతాబ్దాల పూర్వం నుంచే ఈ ఆచారం ఉండేది. నాటి రాజులందరూ అదే సంప్రదాయాన్ని పాటించారు. అయితే కాలక్రమేణా తిరుమలకు వెళ్లే దారులు పెరగటంతో ఈ సంప్రదాయం కనుమరుగైంది. నాటి సంప్రదాయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేత పునఃప్రారంభించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ గంగమ్మవారిని దర్శించుకున్న దాఖలాలు లేవు. ఓ ఆధ్యాత్మిక ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఈ సంప్రదాయం గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించటంతో గత ఏడాది, ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సీఎం ముందుగా తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. గంగమ్మ దర్శనం తర్వాతే శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి స్వామివారి దర్శనం చేసుకోవటం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీశారు. ప్రతిష్ఠాత్మకంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం తాతయ్యగుంట గంగమ్మ ఆలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చొరవతో రూ.16 కోట్లలో దేవదాయశాఖ, టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయం మొత్తాన్ని కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర విషయాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మే నెలలో గంగమ్మ జాతరను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించటం గమనార్హం. - తిరుమల రవిరెడ్డి, సాక్షి–తిరుపతి -
తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?
శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోక వైకుంఠమైన వెంకటాద్రిపై కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రాన దివ్యమైన ముహూర్తంలో అర్చారూపంలో స్వయంవ్యక్తమూర్తిగా శ్రీవేంకటేశ్వరునిగా వెలశాడు. శ్రీస్వామి ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్త ప్రియుడు. కోరినవారికి కొంగు బంగారమై కోర్కెలు నెరవేర్చే ఆ శ్రీవేంకటేశ్వరుని 'వైభోగం న భూతో న భవిష్యతి!'. వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. • దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. • సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయమే. • వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా ఉత్సవాలను అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదవ నాడు.. మహారథానికి (చెక్కరథం) బదులు ముందు వరకు వెండి రథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుండి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై ఊరేగింపు సాగింది. 2012లో దాని స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం.. వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)– శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. • శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది. అంకురార్పణం (14–10–2023) (రాత్రి 7 నుండి 9 గంటల వరకు): వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారికి ఆలయ మాడ వీథుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంగారు తిరుచ్చి ఉత్సవం (15–10–2023) (ఉదయం 9 గంటలకు): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. పెద్దశేషవాహనం (15–10–2023) (రాత్రి 7 గంటలకు): మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. చిన్నశేషవాహనం (16–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి. హంస వాహనం (16–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు. సింహ వాహనం (17–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం. ముత్యపుపందిరి వాహనం (17–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. కల్పవృక్ష వాహనం (18–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీ«థుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సర్వభూపాల వాహనం (18–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహినీ అవతారం (19–10–2023) (ఉదయం 8 గంటలకు): బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు. గరుడ వాహనం(19–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు. హనుమంత వాహనం (20–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది. పుష్పకవిమానం (20–10–2023) (సాయంత్రం 4 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి పుష్పకవిమానంపై విహరిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. గజవాహనం(20–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది. సూర్యప్రభ వాహనం (21–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీ«థుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం (21–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాలలో అనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. స్వర్ణరథం (22–10–2023) (ఉదయం 7.15 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అశ్వవాహనం (22–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం (23–10–2023) (ఉదయం 6 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. -లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!? -
శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. తొమ్మిదిరోజుల పాటు సప్తగిరులు గోవిందనామ ధ్వనులతో మారుమోగనున్నాయి. అసలు వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి, బ్రహ్మోత్సవాలు ఎందుకు జరిపేవారు, ఎన్నివాహనాలపై గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చేవాడు.. బ్రహ్మోత్సవాల చరిత్రను తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం. లోక కల్యాణం కోసం తనకు ఉత్సవాలు జరపమని ఆ గోవిందుడే బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపించారట! వెంకన్న ఆదేశాలమేరకే బ్రహ్మదేవుడు ఏటా ఈ ఉత్సవాలు జరుపుతాడని ప్రతీతి. కన్యామాసం (అశ్వయుజం) లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు ముందు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. బ్రహ్మే స్వయంగా ఉత్సవాలను నిర్వహించారు కాబట్టే ఈ ఉత్సవాలకు ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలను ఒకదశలో నెలకొకటి వంతున ప్రతి ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు జరిగేవట! స్వయంగా బ్రహ్మే ఈ ఉత్సవాలను జరుపుతాడని చెప్పడానికి ప్రతీకగా ప్రతిరోజూ వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ఒక్క రథోత్సవం రోజు మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు స్వయంగా ఆ బ్రహ్మదేవుడే పగ్గాలు స్వీకరించి రథం నడుపుతాడని చెబుతారు. అంకురార్పణతో మొదలయ్యే ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, చినశేషవాహనం, పెద్దశేషవాహనం, సింహవాహనం, ముత్యాలపందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహినీ అవతారం, గరుడవాహనం, గజవాహనం, సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, రథోత్సవం, బంగారు తిరుచ్చి వంటి వాహనాలపై దేవదేవుడు కొలువై భక్తకోటికి దర్శనమిస్తారు. క్రీస్తుశకం 614లో పల్లవరాణి సమవాయి.. మనవాళ పెరుమాళ్ అనే భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించింది. అప్పట్లో ఈ విగ్రహాన్ని ఊరేగించి బ్రహ్మోత్సవాలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రీస్తుశకం 1254 చైత్రమాసంలో తెలుగురాజు విజయగండ గోపాలదేవుడు, 1328లో ఆషాఢమాసంలో ఆడితిరునాళ్లు పేరిట త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవ రాయలు ఉత్సవాలు జరిపారు. అలాగే 1429లో ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహర రాయలు. 1530లో అచ్యుతరాయలు బ్రహ్మోత్సవాలు జరిపారు. ఇలా 1583 ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు ఏడాదిలో ప్రతినెలా జరుగుతుండేవి. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఈ ఉత్సవాలు అర్ధంతరంగా ఆగిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఏడాదికి పన్నెండుసార్లు జరిగే ఈ ఉత్సవాలు క్రీస్తుశకం 1583 నాటి వరకు కొనసాగాయి. అయితే కాలక్రమేణా మార్పులు జరిగి ఏడాదికి పది రోజుల పాటు నిర్వహించడం మొదలుపెట్టారు. బ్రహ్మోత్సవాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది గరుడ వాహనం. అంత పేరున్న గరుడ వాహనాన్ని క్రీ.శ 1530కి ముందు వాడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. సూర్యప్రభ వాహనం, గజవాహనం క్రీ.శ 1538లో ప్రారంభించారు. సింహవాహనం క్రీ.శ 1614లో మొదలైంది. మట్ల కుమార అనంతరాజు క్రీ.శ 1625లో శ్రీవారికి బంగారు అశ్వవాహనం, వెండి గజవాహనాన్ని, సర్వభూపాల వాహనాన్ని బహూకరించారు. ఇటివల టీటీడీ సర్వభూపాల వాహనాన్ని కొత్తగా తయారు చేయించింది. ప్రస్తుతం ఈ వాహనాన్నే వినియోగిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమవు తున్నాయి అని ప్రకటించే విధానం అప్పట్లో విచిత్రంగా ఉండేది. శ్రీవారి ఆలయం ముందు పెద్ద పేలుడు సంభవించినట్టు శబ్దం చేసి మంటను వేసేవారట. ఈ పద్ధతిని ఆదిర్వేది అనేవారు. తొలిసారిగా ఈ విధానాన్ని క్రీ.శ 1583లో ప్రారంభించినట్టు శాసనాధారం ఉంది. ఉత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని వైదిక ఆచారాలతో శుద్ధి చేసేందుకు క్రీ.శ 1583లో ప్రవేశపెట్టిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం నేటికీ సాగుతోంది. 2020, 2021లో కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నుంచి బ్రహ్మోత్సవాలను యథాప్రకారం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. గత నెల సెప్టంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలను కూడా గొప్పగా జరపడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. - తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి -
నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
-
Tirumala: పెరిగిన భక్తుల రద్దీ.. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు భక్తులు. సర్వ దర్శనానికి 12 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లుగా తేలింది. 29,508 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదిలా ఉంటే.. నేడు నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరగనుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. -
తిరుమల: సర్వదర్శనానికి 15 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ పరిస్థితికి చేరుకుంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, అలాగే ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న శ్రీవారిని 80,551 మంది దర్శించుకున్నారు. పెరటాసి మాసం కారణంగా రద్దీ కొనసాగగా.. సర్వదర్శనానికి ఏకంగా 35 గంటల సమయం పట్టింది. మరోవైపు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లుగా లెక్క తేలింది. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,028 మంది. -
తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ.. టీటీడీ సూచనలివి
సాక్షి, తిరుపతి: తిరుమలలో రద్దీ కొనసాగుతోందని, రద్దీ కారణంగా, భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. సోమవారం ఉదయం టీటీ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, శిలాతోరణం మార్గంలో గల క్యూలైన్స్, గోగర్భం డ్యాం వరకూ ఉన్న క్యూలైన్స్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం క్యూలైన్స్ వద్ద భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌఖర్యాలపై టీటీడీ అధికారులకు భూమన కరుణాకర్ రెడ్డి సలహాలు, సూచనలు చేసారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ..పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, స్వామీ వారి సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుందన్నారు. భక్తులంతా సమన్వయం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు. క్యూలైన్స్‌లో ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు రేయింబవళ్ళు కష్టపడి సౌఖర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు దగ్గరుండి సౌకర్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ టికెట్ల దర్శనాల్లో నియంత్రణ చేశామని భుమన తెలిపారు. నారాయణవనంలోని షెడ్లు దాటి ఐదు కిలో మీటర్ల దూరం మేర భక్తులు క్యూలైన్స్‌లో వేచి ఉన్నారని, లైన్లో ఉన్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా టీటీడీ అధికార యంత్రంగం పని చేస్తుందన్నారు. భక్తులకు ప్రాథమిక అవసరమైన ఆహారం, నీరును నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. భక్తుల భధ్రత, సౌఖర్యాల పట్ల టీటీడీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పని చేస్తుందన్నారు. గత మూడు రోజులుగా అధిక రద్దీ కొనసాగుతుందని, అయితే వర్షంలో కూడా యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ అధికారులు పని చేశారని, ఇది అభినందించ విషయమన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఉన్న నియంత్రణ పూర్తిగా తొలగించామని, నడిచి వెళ్ళే భక్తులకు మరింత భధ్రత కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అపాయం లేదని అటవీ శాఖా అధికారులు చెప్పే వరకూ నడక మార్గంలో ఆంక్షలను అలానే కొనసాగిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. నేడు పౌర్ణమి గరుడ సేవ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే.. నిన్న(గురువారం) 54,620 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,234. హుండీ ఆదాయం రూ.2.98 కోట్లుగా లెక్క తేలింది. Tirumala Garuda Seva : శుక్రవారం తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు మాడ వీధులలో గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. ఫోటోలు వైరల్
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్ పాల్గొన్నాడు. దర్శనం ఆనంతరం.. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు గౌతీని సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో టీమిండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా భారత్ వేదికగా ఆక్టోబర్ 5నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. చదవండి: IND vs AUS 3rd Odi: ఓటమితో ముగింపు.. సిరీస్ భారత్ సొంతం -
2 లక్షల మంది వీక్షించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు టీడీడీ ఈవోExecutive Officer ఏవీ ధర్మారెడ్డి సాక్షికి తెలిపారు. రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారాయన. సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇచ్చేలా.. బ్రహ్మోత్సవాలను వేడుకగా జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సాక్షితో అన్నారాయన. బ్రహ్మెత్సవాలు జరిగే 9 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారాయన. ఆన్లైన్లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టీటీడీ అందించనుందని తెలిపారాయన. అలాగే.. నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారాయన. ఇప్పటికే మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దామని.. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పుట్టమన్నులో నవధాన్యాలను.. తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 17న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి వాటికి మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. 18వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వాహన సేవల వివరాలివీ.. 18న రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. 19న ఉదయం 8 గంటలకు 5 తలల చిన్నశేష వాహనంపై, రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామి వారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమివ్వనున్నారు. 20న ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు. 21న ఉదయం 8 గంటలకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. 22న ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంలో ఊరేగుతారు. 23న ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీనివాసుడు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. 24న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 25న ఉదయం 6:55 గంటలకు శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వ వాహనంపై విహరిస్తారు. 26న ఉదయం 6 గంటలకు చక్రస్నానాన్ని, రాత్రి 7గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా చేపడతారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులకు గమనిక ► స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ► వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్ దర్శనాలూ రద్దు ► బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8–10 గంటల వరకు, రాత్రి 7–9 గంటల వరకు వాహన సేవలు ► సెప్టెంబర్ 22న గరుడ సేవ కారణంగా.. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు -
తిరుమలకు విపరీతంగా పెరిగిన రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం ముగుస్తుండడంతో.. భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) కోసం 18 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం, 10) శ్రీవారిని 84,449 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,570గా ఉంది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్లుగా లెక్క తేలింది. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి చెయ్యనున్నారు అర్చకులు. ఈ నెల18 నుండి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 17న అంకురార్పణ, 18 ధ్వజారోహణం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంతత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 22వ తేదీన గరుడ సేవ ఉండగా.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల్ని అనుమతించరు. ఇక బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిఫారసు లేఖలు రద్దు ఉంటుందని తెలియజేసింది టీటీడీ. అలాగే.. వాహనసేవలు తిలకించడానికి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. -
తిరుమల శ్రీవారి ఆనంద నిలయంపై విమాన రాకపోకలు
-
తిరుమలలో నేడు ఉట్లోత్సవం.. ఆర్జిత సేవలు రద్దు
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక.. ఇవాళ తిరుమల మాడవీధులలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని పేర్కొంది. తిరుమలలో ఈ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. తిరుమాడ వీధులలో ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తీసుకొస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్టి.. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. శ్రావణ మాసం ముగింపు కావడంతో.. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. భక్తులు బయట క్యూ లైన్లలో నిల్చున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(సెప్టెంబర్ 7, 2023) 58,855 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో.. 29,014 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రూ. 4.65 కోట్లుగా లెక్కతేలింది. -
తిరుమల ఆలయంపై విమానం సంచారం...తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీటీడీ
-
విమర్శలకు భయపడం.. భక్తుల భద్రతే ముఖ్యం: టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండు నెలల కాలంలో 5 చిరుతలను పట్టుకున్నామని తెలిపారు. నడక దారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. విమర్శలకు భయపడమని, చిత్తశుద్ధితో భక్తులకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. చిరుత చిక్కుకున్న ప్రదేశానికి టీటీడీ చైర్మన్ భూమన చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ చిరుత కొనసాతుందని పేర్కొన్నారు. రాత్రి పన్నెండు.. ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని, తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని భూమన అన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, ఈ కారణంగానే నేడు అయిదో చిరుతను పట్టుకున్నట్లు చెప్పారుజ నడక దారిలో వస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించాలని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారికి చేతి కర్రలు కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. కర్రలు ఇస్తామని ప్రకటించగానే దానిమీద ఇష్టం వచ్చినట్టుగా తమ ఎన్నో అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని విమర్శించారు. కర్రలు ఇస్తామని చెప్పిన తర్వాత నాలుగు చిరుతలు దొరికాయని, అంతకు ముందు ఒక చిరుత బోనులో చిక్కిందని గుర్తు చేశారు. భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో తెలియజేసేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని చైర్మన్ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి అధికారుల పర్యవేక్షణలో రెండు మూడు వందల మంది సిబ్బంది అధునాతన బోనులతో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారని తెలిపారు. విమర్శలకు, జడిసి.. ఆపరేషన్ చిరుతను ఆపేసే ప్రసక్తి లేదని విమర్శకులను హెచ్చరించారు. కాగా తిరుమలలో కాలిబాటన వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా మరో చిరుతపులిని బంధించారు అధికారులు. తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. వేకువజామున 12 నుంచి 1 గంట మధ్యలో బోన్లో చిక్కుకున్నట్లు అటవీశాఖ అధికారుల చెప్పారు. గత వారం రోజులుగా ఈ చిరుత సంచారం గుర్తించిన అధికారులు పట్టుకోవడానికి బోన్ పెట్టగా.. నేడు చిక్కుకుంది. దానిని ఎస్వీ జూపార్క్ తరలించారు. -
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. మూడు నెలల వ్యవధిలో బోనులో చిక్కిన ఐదవ చిరుత ఇది. నరసింహ ఆలయం- ఏడవ మైలు రాయి మధ్య ఏర్పాటు చేసిన ట్రాప్‌లో ఈ చిరుత చిక్కినట్లు అటవీ శాఖఅధికారులు తెలిపారు. నాలుగు రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దీని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్‌లో చిక్కింది. ఇక కాసేపట్లో అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ చైర్మన్ భూమన చిరుతను బంధించిన ప్రాంతానికి వెళ్తున్నట్లు సమాచారం. ఇక.. తిరుపతిలో 'ఆపరేషన్ చిరుత’ కొనసాగుతోంది. తాజాగా చిక్కిన చిరుతతో కలిపి ఐదింటిని అధికారులు బంధించినట్లయ్యింది. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. భద్రతే ప్రధాన ప్రాముఖ్యత.. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. సక్సెస్ అవుతున్నారు. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, తాజాగా.. సెప్టెంబర్ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. ఇదీ చదవండి: కర్ర పంపిణీపై విమర్శలు.. స్పందించిన టీటీడీ -
భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే చేతి కర్రలు: టీటీడీ చైర్మన్
తిరుపతి కల్చరల్: అలిపిరి నడక మార్గంలో క్రూరమృగాల సంచారం నేపథ్యంలో అనేక భద్రతా చర్యలు తీసుకున్నామని, ఇందులో ఓ చర్యగా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి చేతి కర్రలు అందజేస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన బుధవారం భక్తులకు చేతి కర్రలను అందజేశారు. మీడియాతో భూమన మాట్లాడుతూ.. చేతి కర్రలతో భక్తులు క్రూరమృగాలతో పోరాడతారని కాదని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజు వైందని చెప్పారు. వేల ఏళ్ల నుంచి గ్రామాల్లో ప్రజలు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతి కర్రలను ఆసరాగా తీసుకెళుతుంటారని గుర్తుచేశారు. కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చేతి కర్రలను భక్తులకు ఉచితంగా అందిస్తామని, వీటిని అలిపిరిలో అందజేసి శ్రీనరసింహస్వామి వారి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామని తెలిపారు. టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తిరుమల శిలాతోరణం వద్ద, ఏడో మైలు వద్ద చిరుతల సంచారాన్ని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో గాలిగోపురం నుంచి వంద మంది భక్తులను గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్లోనున్న అలిపిరి నడక మార్గంలో ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపామని, వారు తగిన డిజైన్లతో అంగీకారం తెలిపితే కంచె నిర్మిస్తామన్నారు. చేతి కర్రల కోసం అడవిని నాశనం చేయడం లేదని, పది వేల కర్రలు మాత్రమే తీసుకున్నామని, ఇందు కోసం రూ.45,000 ఖర్చయిందని తెలిపారు. -
తిరుమల: బాగా పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(సెప్టెంబర్ 5, మంగళవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,946. తలనీలాలు సమర్పించిన వాళ్ల సంఖ్య 30,294గా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లుగా లెక్క తేలింది. ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది TTD. 17వ తేదీ వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు తిరుమలకు విచ్చేసి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22న గరుడసేవ, 23న స్వర్ణరథోత్సవం, 25న మహారథం, 26న చక్రస్నానం, చివరగా.. ధ్వజారోహణంతో వార్షిక బ్రహోత్సవాలు ముగుస్తాయి. మళ్లీ అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: యువతలో సనాతన ధర్మం కోసం టీటీడీ ప్రయత్నం -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం 24 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న(సెప్టెంబర్ 3, 2023)న శ్రీవారిని 81,459 మంది భక్తులు దర్శించుకున్నారు. 32, 899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లుగా తేలింది. -
తిరుమల అలిపిరి మార్గంలో మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ చిక్కింది. చిన్నారి అక్షితపై దాడి చేసి చంపిన స్థలంలోనే చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత పేరుతో నాలుగు చిరుతలను అధికారులు బంధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో చిరుత సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలలో స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 31, 2023)న తిరుమల శ్రీవారిని 59, 808 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.6కోట్లుగా లెక్క తేలింది. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చేస్తోంది టీటీడీ. ఇదీ చదవండి: సెప్టెంబర్ 18న తిరుమలకు సీఎం జగన్ -
Tirumala: పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది. -
తిరుమల: సర్వదర్శనానికి ఏడుగంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్లేని సర్వదర్శనం కోసం ఏడుగంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న 64, 214 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,777 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 4.05 కోట్లు హుండీ ఆదాయంగా లెక్క తేలింది. ద్వారకా తిరుమలలో.. ఏలూరు: చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమలలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు పవిత్రాది వాసం, రేపు పవిత్రావరోహణ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. -
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తారు. ఇక నిన్న(సోమవారం, ఆగష్టు 28) 68,263 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లుగా తేలింది.తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28, 355గా తేలింది. ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు ఏలూరు: నేటి నుంచి ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 30వ తేదీన పవిత్రాదివాసం, 31వ తేదీన పవిత్రావరోహణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తారు. -
తిరుమల: ఎట్టకేలకు చిక్కిన చిరుత.. ఆపరేషన్ సక్సెస్
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కింది. దీంతో ఇకపై నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా సంచరించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో చిరుత.. బోను దాకా వచ్చిపడకుండా పోతోంది అది. అలా వారం గడిచింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిక్కింది. ఈ చిరుత పట్టివేతతో.. ఆపరేషన్ చిరుత ముగిసినట్లేనని అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో.. ఇకపై భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించే అవకాశం ఉందని అంటున్నారు. టీటీడీ అప్రమత్తత చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. విజయవంతమయ్యారు. మరో 500 ట్రాప్ కెమెరాల ఏర్పాటు చిరుత చిక్కిన ప్రదేశాన్ని సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు పరిశీలించారు. ‘‘చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించాం. ఇది మగ చిరుత. రెండేళ్ల వయసుంది. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు నిరంతరం ఉంటాయి. నడకమార్గంలో ప్రస్తుతం 300 కెమెరాలు ఉన్నాయి. మరో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. -
తిరుమల: నేడు నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు మరో వార్షికోత్సవం కనువిందు చెయ్యనుంది. ఆగస్టు 27 నుంచి వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంంది. ఎల్లుండి మాఢవీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగనున్నారు. మూడ్రోజుల పాటు(ఆగస్టు 29) వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది కాగా ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. నేడు నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఆన్లైన్ వసతి కోటాను 25న విడుదల చేయనుంది, తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది,. శ్రీవారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చింది. -
తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు కారీరిష్టి యాగం
తిరుమల : దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, దేశమంతటా శాంతిని కాంక్షిస్తూ నేటి నుంచి తిరుమలలో కారీరిష్టి, వరుణ, పర్జన్య శాంతి యాగాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే యాగ క్రతువు ఆరు రోజుల పాటు కొనసాగి, 26వ తేదీన తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో జరిగే అవబృదేష్టితో ముగుస్తుంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనుండగా 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగస్టు 26న మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ధర్మగిరిలో మూడ్రోజులు వరుణజపం నిర్వహించనున్నారు అర్చకులు. ఈనెల 26న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేసి 27 నుంచి మూడ్రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో టికెట్లు.. ఈ యాగాలు పూర్తయ్యాక వచ్చేనెల తితిదేలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాటిని అనుసరిస్తూ అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక నవంబర్ నెలలో జరగనున్న కార్యక్రమాలకు నేడే ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఉ.10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా, సహస్ర దీపాలంకరణ టికెట్లు విడుదల చేయనున్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం 13కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి వెళ్ళే భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న(శనివారం, ఆగష్టు 19) స్వామివారిని 79,242 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 36,039 కాగా, స్వామివారి హుండీ ఆదాయం 4.76 కోట్లుగా లెక్క తేలింది. ఇదీ చదవండి: ఇక ఆక్టోపస్ బృందం పర్యవేక్షణలో శ్రీవారి ఆలయం -
రక్తదానం చేసిన వారికి శ్రీవారి దర్శన భాగ్యం
-
తిరుమలను ఇలా ఎవరు అభివృద్ధి చేశారు
-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం కలిశారు. టీటీడీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించటంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్ గా భూమన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్‌రెడ్డి 1958, ఏప్రిల్ 5న వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించారు. ఆయన తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2004–06 మధ్య తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్‌గా భూమన పనిచేశారు. ఆ తర్వాత 2006–08 మధ్య టీటీడీ బోర్డు చైర్మన్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేశారు. (నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్) -
వీఐపీ బ్రేక్ దర్శన వేళలో మార్పు
-
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
సాక్షి, తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్తీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 69,733 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28,614 మంది భక్తులు తలనీలాలు సమర్పించినారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చింది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. 10న టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఈ నెల 10వ తేదీ ఉదయం 11.44 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన మొదటిగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారి గరుడ అల్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భూమన రెండోసారి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనుండటం విశేషం. -
చిన్నారుల నుండి వృద్ధుల వరకు టీటీడీ చేసిన ఏర్పాట్లు అద్భుతం
-
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే..!
-
టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి..ఇంకా ఇతర అప్డేట్స్
-
టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అరుదైన చిత్రాలు
-
చిన్నశేష వాహనం పై శ్రీవారి ఊరేగింపు
-
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
తిరుమల: నిండిపోయిన అన్ని కంపార్ట్మెంట్లు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మొత్తం కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం(ఉచిత దర్శనం) కోసం 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న(గురువారం, జులై 20) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,628గా ఉంది. హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. పది కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (మంళవారం) 64 వేలమంది స్వామివారిని దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లుగా లెక్క తేలింది. తిరుమల పుష్ప పల్లకీ సేవ.. ఫొటోలు వీక్షించండి -
తిరుమల: నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల
సాక్షి, తిరుపతి: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్టోబర్ కోటా టికెట్లను విడుదల చేయనుంది. అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పాతిక వేల మంది భక్తులు తలనీలాలు, 71 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇదీ చదవండి: శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం -
తిరుమల : అంగరంగ వైభవంగా పుష్పపల్లకీ సేవ (ఫోటోలు)
-
తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం
సాక్షి, తిరుపతి: తిరుమలలో ఇవాళ(సోమవారం, జులై 17) శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను సైతం రద్దు చేసింది. ఇక సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా.. బంగారం వాకిలిలో ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు. ఆపై స్వామివారికి రూపాయి హారతి ఇస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్ప పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి శ్రీవారి ఆలయం ఇప్పటికే ముస్తాబయ్యింది. ఉదయం బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో ఉభయదేవేరుల సమేతంగా మలయప్పస్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేయనున్నారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. గతంలో ఆణివార ఆస్థానం రోజు నుండి శ్రీవారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేది. అయితే టీటీడీ ఏర్పడ్డాక ఏప్రిల్ నుండి ఆదాయ వ్యయాలు అనుసరిస్తూ వస్తోంది. జియ్యంగార్ల వస్త్ర సమర్పణ తిరుమల పెద జియ్యర్ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామిని ఆశీర్వదిస్తారు. భక్తులకు శుభవార్త భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదీ చదవండి: వాళ్లకు డబ్బులు ఇవ్వకండి.. భక్తులకు ఈవో సూచన -
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ ఆగమోక్తంగా నిర్వహించింది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం కారణంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు విఐపీ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది. -
తొలి ఏకాదశి.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,615గా ఉండగా.. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లుగా తేలింది. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న(సోమవారం జూన్ 26) శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్లుగా లెక్క తేలింది. ఇదీ చదవండి: ఏపీ: ఇక్కడ సీటొస్తే విదేశాల్లో చదవొచ్చు! -
తిరుమల: ఉచిత దర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల క్యూ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటలు సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. ఇదిలా ఉంటే మంగళవారం శ్రీవారిని 71,935 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్లుగా తేలింది. ఇదీ చదవండి: సాధారణ భక్తుల కోసం.. టీటీడీ ప్రయోగం సక్సెస్ -
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల సమయం పడుతోంది. అలాగే.. దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న(సోమవారం, జూన్ 19) శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,510 మందిగా నమోదు అయ్యింది. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా తేలింది. అదనపు లడ్డూ కౌంటర్లు.. టీటీడీ కీలక నిర్ణయం -
భక్తులకు శుభవార్త.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం కోరకు టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు. తిరుమలలో రూ. 4 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరించనున్నట్లు తెలిపారు. రూ. 40.50 కోట్లతో వ్యర్థాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీకి మూడు సంవత్సరాల కాలపరిమితికి అనుమతి ఇచ్చినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్టలో దాతల సాయంతో రూ.4 కోట్లతో నూతన అన్నదాన భవన నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ►తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీసు క్వార్టర్స్ ఆధునీకీకరణ ►శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో వసతి గృహాలు ► రూ.9.5 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు రూమ్‌కు ఆమోదం ►రూ.97 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి ఆధునీకీకరణకు ఆమోదం ►29 కొట్ల 50 లక్షలతో ఎఫ్ఎంఎస్‌కు కేటాయింపు ►ఒంటి మిట్ట కోదండ రామాలయం వద్ద ప్రతి రోజు అన్న ప్రసాదం వితరణ, నూతన భవన నిర్మాణానికి ► తిరుమలలో 3 కోట్లు10 లక్షలతో తిరుమలలో ప్లాస్టిక్ చెత్త కుండీల ఏర్పాటు. చదవండి: పవన్‌కు చంద్రబాబు వల్లే ప్రాణహాని: పేర్ని నాని ► ఎస్వీ వేదిక్ యునివర్సిటీ స్టాప్ క్వార్టర్స్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు. ►తిరుమలలో ఉన్న కంప్యూటర్లను తొలగించి, రూ.7.44 కోట్లతో ఆదునిక కంప్యూటర్ కొనుగోలుకు నిర్ణయం ►నగిరిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్లు కేటాయింపు ►కర్నూలు జిల్లాలో 4 కోట్ల 15 లక్షలతో శ్రీవేంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ. ►స్వీమ్స్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి బెడ్స్ మరింత పెంచాలని నిర్ణయం ►1,200 పడకలతో స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి, 97 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం శ్రీకారం. ►జమ్మూ కాశ్మీర్ లో 24 నెలలో ఆలయం పూర్తి చేసి, వైభవంగా ఆలయాన్ని ప్రారంభించాం. ►తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ అమరిక 6 కోట్లు కేటాయించారు. ►తిరుపతి రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 5.16 కోట్లు ►పట్టణాలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు, కళ్యాణమండపాలు నిర్మిస్తున్నాం. ►గుజరాత్ గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాయపుర్ లో త్వరలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేస్తాం ►శ్రీవాణి ట్రస్ట్‌పై కొంతమంది రాజకీయ లబ్ది కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు ►సనాతన హిందు దర్శ ప్రచారంలో దేశవ్యాప్తంగా దేవాలయాలు ఏర్పాటుకి శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు. ►వచ్చే నిధులు ఆలయ నిర్మాణం కోసం వాడాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాం. ►హుండీ, కార్పస్ ద్వారా వచ్చే ఆదాయం అంతా తెలియపరిచాము, శ్వేతపత్రం విడుదల చేశాం. ►శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, టీటీడీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తూ తీర్మానం. ►శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతో 2. 445 ఆలయాలు నిర్మాణం చేస్తున్నాం. ►అధికశాతం బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఉన్న ప్రాంతాలలో చేపట్టాం. ►పురాతన ఆలయాలు 200 పైగా పునర్నిర్మాణం చేశాం. ►దూప దీప నైవేద్యాలు, గోసంరక్షణ, ధర్మ ప్రచారం కోసం వినియోగం. ►పది వేలు తీసుకొంటున్నారు, 300 బిల్లు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ అసత్యం ►విరాళం ఇచ్చిన అందరికి విరాళం బిళ్లు, దర్శన టికెట్లకు రసీదులు ఇస్తున్నాం ►ఇలాంటి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం. ►తిరుమలలో నిషేధిత వస్తువులు రావడం అనే దానిపై చర్చించాం. ►ఇలాంటి సమస్యలు రాకుండా నూతన యంత్రాలను ఏర్పాటు చేస్తాం. ►విమానాలు ఆలయంపై తిరగకుండా విమాన శాఖకు లేఖ రాశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు -
TTD: సర్వదర్శనానికి 20 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీవారిని 86,181 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్లుగా తేలింది. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,654గా ఉంది. ఇక.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఇవాళ(జూన్ 19న) విడుదల చేయనుంది టీటీడీ. సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం ఉదయం 10గంటల నుంచి జూన్ 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను.. జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మరోవైపు నేడు టీటీడీ పాలక మండలి భేటీ అయ్యి.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: జూన్‌లో తిరుమల వెంకన్న దగ్గరకు ఎందుకు వెళ్లాలంటే.. -
సాధారణ భక్తులకు ప్రాధాన్యత.. టీటీడీ ప్రయోగం సక్సెస్
సాక్షి, తిరుమల: సాధారణ కేటగిరీ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేసిన ప్రయోగం సఫలమైంది. వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం సాటించడంతో అత్యధిక భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రోజు రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారాంతం కావడం, ఆదివారంతో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలలో కిలోమీటర్లమేర భక్తులు క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. గత నాలుగేళ్లలో నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తలే అత్యధికం కావడం విశేషం. ఆదివారం రోజు శ్రీవారిని 92,238 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్ ద్వారానే 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్ మార్పులపై ఈవో ధర్మారెడ్డి నిరంతరం పర్యవేక్షించారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 40,400 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వచ్చింది. -
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
TTD: శ్రీవారి ఉచిత(సర్వ) దర్శనానికి 24 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండడంతో.. క్యూలైన్ల బయట వేచి ఉన్నారు భక్తులు. ఈ క్రమంలో శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నేటి(శుక్రవారం) నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఎనభైవ దశకం నుంచి జేష్టాభిషేకం ప్రారంభించారు. ఉత్సవమూర్తుల అరుగుదల గురికావడంతో బింభరక్షనార్థం జేష్టాభిషేకం నిర్వహిస్తారు. 🙏 సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఉత్సవమూర్తులకు కవచాల తొలగిస్తారు. ఉత్సవమూర్తులకు కవచాలు తిలగించి, మరమ్మత్తులు చేపడుతారు. 🙏 మొదటి రోజు వజ్రాభరణాలు, రెండవరోజు ముత్యాల ఆభరణాలు, మూడవరోజు స్వర్ణకవచాలతో అలంకరణ చేపడతారు. ఎల్లుండి అర్జిత సేవలు రద్దు చేస్తారు. -
TTD: శ్రీవారి ఉచిత దర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ గత రెండ్రోజులతో పోల్చితే కొద్ది మేర తగ్గింది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి(ఉచిత) 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 75,871 మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 32,859 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం లభించింది. 🙏 అప్పలాయగుంటలో నేటి నుంచి ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మిధున లగ్నంలో ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు. నేటి నుంచి జూన్ 8 వరకు వైభవంగా జరగనున్నాయి అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు. 🙏 నారాయణవనం శ్రీపద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం తో ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి జూన్ 8 వరకు నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. -
కోనేటి రాయుడి దర్శనం కోసం భారీగా వస్తున్న భక్తులు
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 3 కిలోమీటర్ల మేర బారులు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్మెంట్లు,షెడ్లు కిక్కిరిపోయి.. దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. చదవండి: టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రి సిద్దా రాఘవులు, ఎంపీ కోటగిరి శ్రీధర్, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ టీ.ఏ. శరవణ, తెలంగాణ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. -
తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో చిత్రీకరణపై టీటీడీ విచారణ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో రికార్డు చేయడం కలకలం రేపింది. మూడు అంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు శ్రీవారి ఆలయంలో హల్చల్ చేశాడు. ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని ద్వారా వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టింది. ఆలయం లోపలి సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు. ని కాగా శ్రీవారి ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తుంటారు. సెల్‌ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్‌తో తిరిగినా.. సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొనడం గమనార్హం. చదవండి: మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు -
భార్య తో కలిసి శ్రీ వారిని దర్శించుకున్న నిఖిల్...
-
ఢిల్లీ టీటీడీ దేవాలయంలో మే 3నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్ ఛైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మే 3న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 'ఢిల్లీ టీటీడీ టెంపుల్ లో త్వరలోనే యాగశాల, పోటు ప్రారంభోత్సవం ఉంటుంది. జూన్ 3 నుంచి 8 మధ్య జమ్ములో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం. జమ్ములో జూన్ 3న కుంభాభిషేకం, 8 న విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటుంది. టీటీడీ దేవాలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నాం.' అని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ► మే 3 బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ ► మే 4 ఉదయం 8:30 నుంచి 9.30 మధ్య ధ్వజారోహణ ; సాయంత్రం 7:30 నుంచి 9:30 మధ్య వృషభ లగ్నం పెద్ద శేష వాహనం ► మే 5 ఉదయం 8 నుంచి 9 మధ్య చిన్న శేష వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి 8:30 మధ్య హంస వాహనం ► మే 6 శనివారం ఉదయం 8 నుంచి 9 మధ్య సింహ వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య ముత్యాల పందిరి వాహనం ► మే 7 ఆదివారం ఉదయం 8 నుంచి 9 మధ్యలో కల్పవృక్ష వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య సర్వభూపాల వాహనం ► మే 8 సోమవారం ఉదయం 8 నుంచి 9 మధ్య మోహిని అవతారం; సాయంత్రం 5 నుంచి 9 మధ్య కల్యాణోత్సవం , రాత్రి 8 నుంచి 9:30 మధ్య గరుడ వాహనం ► మే 9 ఉదయం 8 నుంచి 9 మధ్య హనుమంత వాహనం ; సాయంత్రం 7 నుంచి 8:30 మధ్య గజవాహనం ► మే 10 ఉదయం 8 నుంచి 9 మధ్య సూర్యప్రభ వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8.30 మధ్య చంద్రప్రభ వాహనం ► మే 11 ఉదయం 7:55 నుంచి 9.30 మధ్య రథోత్సవ మిధున లగ్నం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య అశ్వ వాహనం ► మే 12 ఉదయం 11:50 నిమిషాలకు చక్రస్నానం కన్యా లగ్నం ; సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజారోహణం ► మే 13 శనివారం సాయంత్రం 6 నుంచి 8 మధ్య అకంకార స్నపనం పుష్య యాగం చదవండి: టీటీడీ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు -
Tirumala: మే, జూన్ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా.. ఈనెల 25న విడుదల
తిరుమల: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రాన్ని నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వివిధ మార్గాల్లో శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా వీఐపీ బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైం స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం, ఆర్జిత సేవ వంటి పద్దతుల్లో దర్శనం కల్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మే, జూన్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీడీడీ అధికారిక వెబ్సైట్ ttps://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని కోరింది. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్‌ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని తెలిపింది. ఇటీవల అమాయకులైన భక్తులను టార్గెట్ చేసుకుని కొందరు అక్రమార్కులు తిరుమల తిరుపతి దేవస్ధానం పేరుతో నకిలి వెబ్ సైట్‌ను సృష్టించి భక్తులను నట్టేట ముంచేస్తున్నారని టీటీడీ తెలిపింది. నకిలీ వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతున్న భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో పాటు, భక్తుల నుంచి అధికంగా ఫిర్యాదులు రావడంతో నకిలీ వెబ్సైట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు పెట్టిన్నట్లు తెలిపింది. దాదాపుగా 41 నకిలీ వెబ్ సైట్లను గుర్తించి టిటిడి వాటి వివరాల సేకరించి, వాటిని ఆపరేటర్ చేసే వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. చదవండి: ఈ నెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే