టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్ పాల్గొన్నాడు. దర్శనం ఆనంతరం.. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు గౌతీని సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో టీమిండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేసారు.
కాగా భారత్ వేదికగా ఆక్టోబర్ 5నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
చదవండి: IND vs AUS 3rd Odi: ఓటమితో ముగింపు.. సిరీస్ భారత్ సొంతం
Comments
Please login to add a commentAdd a comment