Goutham Gambhir
-
రాహుల్ పై 'గంభీర్' నమ్మకం.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుస్తాడా?
ఆస్ట్రేలియా పర్యటన లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని కీలకమైన మార్పులు చేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో ఇందుకోసం తన ఫార్ములా ని పరీక్షించేందుకు ఉపయోగించుకున్నాడు.భారత్ జట్టులోని కీలక బ్యాటర్ కూడా సొంత గడ్డపై మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ కి జట్టులోని ప్రధానబ్యాటర్లు అందరూ మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్్ కోహ్లీ, ఓపెనర్ శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు పరుగులు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.రాహుల్ వైపే గంభీర్ మొగ్గు..అయితే గంభీర్ తీసుకొచ్చిన మరో పెద్ద మార్పు. రిషబ్ పంత్ స్థానంలో భారత్ నెంబర్ 1 వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ ని ఎంచుకోవడం. రాహుల్ కి పంత్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరి బ్యాటింగ్ విధానంలో చాలా తేడా ఉంది. పంత్ భారీ షాట్లతో కొద్దిసేపటి లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నవాడు. రాహుల్ అందుకు భిన్నంగా ఆచి తూచి ఆడతాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటాడు. టెక్నికల్ గా రాహుల్ సమర్ధుడైన బ్యాటర్ అయినప్పటికీ, అతను స్వతహాగా ఆచి తూచి ఆడే స్వభావం గల బ్యాటర్.ఇక్కడ మ్యాచ్ లో పరిస్థితులని బట్టి వీరిద్దరినీ ఉపయోగించుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాటర్ బాగా రాణించి స్కోర్ బాగా చేసినట్టయితే,అలాంటి పరిస్థితుల్లో శరవేగంగా మరిన్ని పరుగులు సాధించడానికి పంత్ సరిగ్గా సరిపోతాడు. అయితే పంత్ బ్యాటింగ్ శైలి వల్ల అతను నిలకడ రాణించగలడన్న గ్యారెంటీ లేదు.కానీ రాహుల్ అందుకు భిన్నంగా, క్రీజులో నిలదొక్కుకుంటే తనదైన శైలిలో నేర్పుగా పరుగులు రాబట్టగలడు. ఇంత వైరుధ్యం గల ఇద్దరు వికెట్ కీపర్లలలో ఒకరిని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇద్దరూ వ్యక్తిగతంగా ఎంతో సామర్ధ్యం గల బ్యాట్స్‌మన్. ఇలాంటి క్లిష్టమైన విషయంలో కోచ్ గంభీర్ తన ప్రధాన వికెట్ కీపర్ గా రాహుల్ నే ఎంచుకోవడం. ఎందుకంటె రాహుల్ చాల నిలకడైన బ్యాటర్ కావడమే.రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్అయితే ఈ నిర్ణయం చాల మందికి రుచించలేదు. ఇక్కడ మరో విషయం ఉంది. అది రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్. రాహుల్ సాధారణంగా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వస్తాడు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లోని తొలి రెండు వన్డేల్లో రాహుల్ ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్ గా రంగంలోకి వచ్చాడు. “ప్రస్తుతానికి, కెఎల్ మాకు నంబర్ 1 వికెట్ కీపర్. ప్రస్తుతానికి అతను జట్టు తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు" అని గంభీర్ అహ్మదాబాద్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. "జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నప్పుడు, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం సాధ్యం కాదు. భారత్ జట్టులోని ఇతర బ్యాట్స్‌మన్ నైపుణ్యం, వారి అపార అనుభవం దృష్ట్యా చూస్తే, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక పంత్ విషయానికి వస్తే అతను అవకాశం వచ్చిన్నప్పుడు ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి నేను ఈ విషయం గురించి అంతే చెప్పగలను,," అని గంభీర్ తన నిర్ణయాన్ని తేటతెల్లం చేసాడు.ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కి బ్యాటింగ్ కి పంపించాలన్న గంభీర్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఫలితంగా, మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్ ప్రదర్శన నిరాశపరిచింది - మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్‌లో కేవలం రెండు, పది పరుగులు మాత్రమే చేసాడు. చేసాడు. అయితే మూడో మ్యాచ్ లో రాహుల్ తనకి అనుకూలంగా ఉండే ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు.“రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కి పంపించి అతనిని వృధా చేస్తున్నారు,” అని భారత మాజీ స్టంపర్ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. రికార్డులను చూడనని చెబుతూ గంభీర్ అలాంటి సూచనలను తోసిపుచ్చాడు. దుబాయ్‌లో రాహుల్ ఆరవ స్థానంలో కొనసాగాల్సి రావచ్చని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. .రాహుల్ ప్రపంచ కప్ రికార్డ్ 2023 ప్రపంచ కప్ కి ముందు పంత్ గాయపడ్డాడు. ఆ దశలో రాహుల్ భారత్ జట్టు కి అండగా నిలిచి రాణించాడు. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 75.33 సగటుతో 452 పరుగులు చేశాడు భారత్ ఫైనల్ కి చేర్చడంలో కీలక భూమిక పోషించాడు.పైగా రాహుల్ భారత్ మిడిల్ ఆర్డర్‌ను పటిష్టంగా ఉంచాడు. ప్రస్తుతం కోచ్ గంభీర్ కూడా రాహుల్ నుంచి అదే ఆశిస్తున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ని కూడా పటిష్టంగా ఉంచి జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో తోడ్పడుతాడని భావిస్తున్నాడు. మరి గంభీర్ వ్యూహం ఫలిస్తుందేమో చూడాలి. -
ఛాంపియన్స్ ట్రోఫీలో వారిద్దరిదే కీలక పాత్ర: గంభీర్
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat kohli) ఫామ్ లేమితో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన రోకో ద్వయం.. పుష్కరకాలం తర్వాత ఆడిన రంజీ ట్రోఫీలోనూ అదే తీరును కనబరిచారు. ముంబై తరపున ఆడిన 31 పరుగులు చేయగా.. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన కోహ్లి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు.వీరిద్దరూ ఇప్పుడు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్దమవుతున్నారు. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడేందుకు యూఏఈకు పయనం కానున్నారు. ఈ క్రమంలో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. ఈ సీనియర్ ద్వయం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటుతారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు."రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌కి ఎంతో విలువను చేకూర్చారు. ఒక డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా భారత జట్టుకు కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ జోడీ కీలక పాత్ర పోషించనున్నారు. వీరిద్దరే కాకుండా జట్టులోని మొత్తం ఆటగాళ్లు రాబోయే మెగా టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లరుతున్నారు. దేశానికి గౌరవం తీసుకురావాలనే తపన ప్రతీ ఒక్కరిలోనూ ఉంది" అని బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో గంభీర్ పేర్కొన్నాడు.అదే విధంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై కూడా గంభీర్ స్పందించాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. మొత్తం ఐదు లీగ్ మ్యాచ్‌లు మాకు ముఖ్యమే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా దుబాయ్‌లో అడుగుపెట్టనున్నాము. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌నే సీరియస్‌గా తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోలేము కాదా? మొత్తం అన్ని మ్యాచ్‌లను ఒకేలా చూస్తాము. వాస్తవానికి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైప్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ మేము మాత్రం కేవలం సాధారణ గేమ్‌లానే చూస్తాము" అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ -
ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన సంజూ.. గంభీర్ ఏమి చేశాడంటే?
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన శాంసన్.. నాలుగో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సకీబ్ మహమూద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ శాంసన్ నిరాశపరిచాడు. ఒక సులభమైన క్యాచ్‌ను శాంసన్ జారవిడిచాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతిని ఫుల్ అండ్ ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా ఓవర్టన్కు సంధించాడు. ఆ బంతిని ఓవర్టన్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని ఫైన్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం వరుణ్ చక్రవర్తి, శాంసన్ ఇద్దరూ పరిగెత్తారు. అయితే సంజూ సమయానికి చేరుకున్నప్పటికి సులభమైన క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. వాస్తవానికి చెప్పాలంటే వరుణ్ చక్రవర్తి అందుకోవాల్సిన క్యాచ్‌కు శాంసన్ మధ్యలోకి వెళ్లి జారవిడచాడు. దీంతో డౌగట్‌లో ఉన్న భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Goutham Gambhir) ఆసంతృప్తికి లోనయ్యాడు. గంభీర్ ముఖం చేయి వేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఓవర్టన్ క్యాచ్ అంత కాస్టలీగా మారలేదు. ఆ తర్వాతి ఓవర్లనే ఓవర్టన్ ఔటయ్యాడు.సిరీస్ భారత్ సొంతం..ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.భారత టాపార్డర్ విఫలమైనప్పటికి హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), రింకూ సింగ్(30) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌గా రావడం కాస్త వివాదస్పదమైంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు pic.twitter.com/hCJEOR66Sa— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 1, 2025 -
ఈ ఆరు నెలల్లో మీరేం చేశారు.. కోచ్‌లను మారిస్తే బెటర్: సునీల్ గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)ను ఆసీస్‌కు టీమిండియా సమర్పించుకుంది. బీజీటీ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను సైతం రోహిత్ సేన చేజార్చుకుంది.ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత జట్టుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ప్లేయర్స్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్ కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గంభీర్ అండ్ కో పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు."అస్సలు కోచ్‌లు ఏం చేస్తున్నారు? న్యూజిలాండ్‌పై కేవలం 46 పరుగులకు ఆలౌట్ అయ్యాం. జట్టు బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అప్పుడే ఆర్దం చేసుకోవచ్చు. కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్‌కు సరైన ప్రణాళికలతో వెళ్లాల్సింది. కానీ కోచ్‌లు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా బ్యాటర్ల ఆట తీరు మెరుగు పడలేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు కోచ్‌లే సమాధనమివ్వాలి. ఆటగాళ్లతో పాటు కోచ్‌ల పనితీరును కూడా అంచనా వేయాలి. మంచి బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో కోచ్‌లు ప్లాన్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్‌ను ఆర్డర్‌ను మార్చారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌కు బదులుగా కోచ్‌లను మారిస్తే బెటర్ అన్పిస్తోంది.ప్రతీ ఒక్కరూ బ్యాటర్లను మాత్రమే తప్పుబడుతున్నారు. కానీ కోచ్‌లను కూడా ప్రశ్నించాలన్నది నా అభిప్రాయం. ఈ ఆరు నెలల్లో వారేమి చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. దీనికి వారే సమాధానం చెప్పాలి" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ ఫైరయ్యాడు. గంభీర్ నేతృత్వంలో పది టెస్టులు ఆడిన భారత్ ఆరింట ఓటమి చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌లను కోల్పోయింది.చదవండి: ధోని కెప్టెన్సీలో ఎంట్రీ.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్ -
ఆటగాళ్ల భవిష్యత్తుపై నేనేమి మాట్లాడను: గౌతం గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్(Gautam Gambhir)కు మరో ఘోర పరాభవం ఎదురైంది. అతడి నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చూవిచూసిన భారత జట్టు.. 10 ఏళ్ల తర్వాత బీజీటీని టైటిల్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను సైతం భారత్ చేజార్చుకుంది. ఇక సిడ్నీ టెస్టులో ఓటమి అనంతరం భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి భవిష్యత్తులపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో ఆడాలా లేదా అన్నది వారి ఇష్టం, నిబద్ధతపై ఆదారపడి ఉంటుందని గౌతీ చెప్పుకొచ్చాడు."నేను ఏ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి మాట్లడాలని అనుకోవడం లేదు. అది వారి ఇష్టం. వారికి ఆటపై తపన, నిబద్ధత ఉన్నాయి. వారు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చేయగలిగినదంతా చేస్తారని నేను ఆశిస్తున్నాను గంభీర్ పేర్కొన్నాడు. కాగా పేలవ ఫామ్ కారణంగా ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో అతడు టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఈ టెస్టు రెండో రోజు ఆట సందర్బంగా ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదని రోహిత్ స్పష్టం చేశాడు.దేశవాళీ క్రికెట్లో అందరూ ఆడాలిఅదే విధంగా దేశవాళీ క్రికెట్లో సీనియర్ ప్లేయర్లు ఆడటంపై కూడా గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ప్రతీ ఒక్క ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో ఆడాలని నేను ఎప్పుడూ సూచిస్తాను. అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ రెడ్ బాల్ క్రికెట్లో తమ రాష్ట్ర జట్ల తరుపన ఆడాలి. డొమాస్టిక్ క్రికెట్లో ఆడితేనే అంతర్జాతీయ స్ధాయిలో మెరుగ్గా రాణించగలము" అని గంభీర్ వ్యాఖ్యనించాడు.ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లి ఎంపిక అవుతాడా?ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న కూడా గంభీర్‌కు ఎదురైంది. "ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. అందుకు తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాము. ఈ విషయం గురించి మాట్లాడానికి ఇది సరైన సమయం కాదు. క్రీడల్లో చాలా విషయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే మనం అంచనా వేయలేమని గంభీర్ బదులిచ్చాడు.చదవండి: Jasprit Bumrah: చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు -
రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే?
అంతా ఊహించిందే జరిగింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) దూరమయ్యాడు. అతడి స్దానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడని టాస్ సమయంలో బుమ్రా తెలిపాడు."ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ తనంతటతానే విశ్రాంతి తీసుకుని తన గొప్పతానాన్ని చాటుకున్నాడు. ఈ పరిణామం జట్టులో చాలా ఐక్యత ఉందని చూపిస్తుంది. టీమిండియాలో స్వార్దం అనే పదానికి తావు లేదు. అందరూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.రోహిత్ విశ్రాంతి తీసుకోగా, ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమయ్యాడు. రోహిత్ స్ధానంలో గిల్ జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడని" బుమ్రా పేర్కొన్నాడు. కాగా సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడనే వార్తలు ముందు నుంచే వినిపించాయి.దానికితోడు రోహిత్ ప్రాక్టీస్ సెషన్లో కన్పించకపోవడం, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ బుమ్రాతో సుదీర్ఘమైన చర్చలు జరపడంతో హిట్‌మ్యాన్ బెంచ్‌కే పరిమితం కానున్నడన్న విషయం అర్దం అయిపోయింది. అంతా అనుకున్నట్లే ఆఖరి టెస్టుకు ఈ ముంబైకర్ దూరమయ్యాడు.కాగా ఈ సిరీస్‌లో రోహిత్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. తన ట్రేడ్‌మార్క్ ఫ్రంట్ పుల్ షాట్ ఆడటంలో కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్చదవండి:లంక పర్యటనకు కమిన్స్ దూరం -
భారత డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గౌతం గంభీర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 3-1 సొంతం చేసుకోవాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. మరోవైపు సిడ్నీలో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్‌ను డ్రా చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.అందుకు తగ్గట్టే భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. ఈ క్రమంలో భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన పట్ల హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గౌతీ హెచ్చరించినట్లు వినికిడి. ఈ క్రమంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతవారణం వేడెక్కిందని, సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై గౌతం గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి గొడవలు జరగడం లేదని, అవన్నీ రూమర్సే అని గౌతీ కొట్టి పారేశాడు."డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్, ఆటగాళ్ల మధ్య చాలా చర్చలు జరుగుతాయి. అవి అక్కడి వరకే పరిమితం కావాలన్నది నా అభిప్రాయం. డ్రెసింగ్ రూమ్ వాతవారణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి విభేదాలు.బయట వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవం. వీటిపై స్పందించాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నామా లేదన్నది ముఖ్యం. నిజాయతీ కలిగిన వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నంత వరకుభారత క్రికెట్ సురక్షితంగానే ఉంటుంది.డ్రెసింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన, మ్యాచ్‌లు ఎలా గెలవాలన్న విషయాల గురించే చర్చిస్తాము. విరాట్ కోహ్లితో కూడా ప్రత్యేకంగా ఎటువంటి చర్చలు జరపలేదు. ప్రస్తుతం మా దృష్టింతా సిడ్నీ టెస్టుపైనే ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం -
జైశ్వాల్ అరుదైన ఫీట్.. 16 ఏళ్ల గంభీర్ రికార్డు బద్దలు
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ దిశగా సాగుతున్నాడు.తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న జైశ్వాల్.. స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 172 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసాదరణ ఇన్నింగ్స్ ఆడుతున్న జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన జైశ్వాల్..1170* పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరిట ఉండేది. 2008లో గంభీర్ ఒక క్యాలెండర్ ఈయర్‌లో 8 టెస్టులు ఆడి 1,134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గంభీర్ ఆల్‌టైమ్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా యశస్వి కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండ్ జోరూట్(1,338*) ఉన్నాడు.చదవండి: IND vs AUS: జైశ్వాల్, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్ -
మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు శుక్రవారం(నవంబర్ 22) నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత్ జట్టు ఈ సిరీస్‌ను ఎలా ఆరంభిస్తుందోనని అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా నేరుగా ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్‌ను 4-1తో ఓడించాలి. మరోవైపు ఈ సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు భవితవ్యం తేలిపోనుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాకపోతే ఈ సీనియర్ ద్వయం టెస్టులకు విడ్కోలు పలికే అవకాశముంది.వీరిద్దరిపైనే కాకుండా భారత హెడ్‌కోచ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో గంభీర్ కోచింగ్ వ్యూహాలు ఎలా ఉంటాయో అని భారత ప్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో గంభీర్ వైఖరిని క్లార్క్ సమర్థించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల వల్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, పోటీతత్వం తగ్గిపోయిందని క్లార్క్ వ్యాఖ్యనించాడు."ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు చాలా వచ్చాయి. కాబట్టి వేర్వేరు దేశాల ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు ఎక్కువ సమయం కలిసి ఉంటున్నారు. దీంతో ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేటప్పడు ప్రత్యర్ధి ఆటగాళ్లపై దూకుడు చూపలేకపోతున్నారు. గతంలో మేము ఆడేటప్పుడు ప్రత్యర్ధిలుగానే చూసేవాళ్లం. ఎందుకంటే మేము ఆడేటప్పుడు ఐపీఎల్ వంటి లీగ్‌లు లేవు. ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పటకి దేశం కోసం ఆడేటప్పుడు ఫీల్డ్‌లో దూకుడుగా ఉండాల్సిందే. మైదానంలో మనకు ఎవరూ స్నేహితులు ఉండరు.ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఆన్ది ఫీల్డ్‌లో మాత్రం ప్రత్యర్థులుగానే చూడాలి. మీరు దేశం కోసం ఆడుతున్నారు, ఒకే ఐపీఎల్ జట్టులో ఆడటం లేదనే సంగతిని గుర్తుంచుకోవాలి. గతంలో భారత జట్టు ఇదే దూకుడు కనబరిచింది. అందుకే గత రెండు పర్యటనలలో ఆస్ట్రేలియాలో భారత్ విజయం సాధించింది. హెడ్ కోచ్ గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచిదే. ఆస్ట్రేలియా కూడా అదే మైండ్ సెట్‌తో ఉంది. కాబట్టి ఈ సిరీస్ మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టనుంది" అని క్లార్క్ పేర్కొన్నాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ దూరం! భారత కెప్టెన్ అతడే? గంభీర్ క్లారిటీ
న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ సిరీస్ అయిన టీమిండియాకు ఆస్ట్రేలియా రూపంలో మరో కఠిన సవాలు ఎదురుకానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత జట్టు సన్నదమవుతోంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, సిరాజ్, ఆకాష్ దీప్, సుందర్‌లతో కూడిన ఫస్ట్ బ్యాచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. సోమవారం మిగిలిన ఆటగాళ్లు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆస్ట్రేలియా పయనం కానున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ముంబైలో విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ డౌటే: గంభీర్"తొలి టెస్టుకు రోహిత్ అందుబాటుపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అతడు పెర్త్ టెస్టులో ఆడతాడానే ఆశిస్తున్నాను. మరి కొన్ని రోజుల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గురించి మేము ఎక్కువ ఆలోచించడం లేదు. గతంలో ఏమి జరిగిందనే విషయంతో కూడా మాకు సంబంధం లేదు. ప్రతీ సిరీస్ మాకు ముఖ్యమైనదే. ఎక్కడికి వెళ్లినా అద్బుతంగా ప్రదర్శన చేయడమే మా లక్ష్యం. పెర్త్ టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపడతాడు. అదేవిధంగా ఈశ్వరన్, కేఎల్ రాహుల్‌లలో ఎవరో ఒకరు జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని" గౌతీ పేర్కొన్నాడు. కాగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్. -
ఒకవేళ అదే జరిగితే గంభీర్ పోస్ట్ ఊస్టింగ్!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు తన ప్రయాణం ఆరంభంలోనే మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అతడి నేతృత్వంలోనే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు.. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి వైట్ వాష్‌కు గురై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.దీంతో గంభీర్‌కు అందరికి టార్గెట్‌గా మారాడు. గంభీర్ లేనిపోని ప్రయోగాల కారణంగానే భారత్ ఓడిపోయిందని పలువురు మాజీలు కూడా విమర్శించారు. అదేవిధంగా ఈ ఘెర ఓటములపై బీసీసీఐ కూడా గంభీర్ నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రూపంలో గంభీర్‌కు మరో కఠిన సవాలు ఎదురుకానుంది. బీజీటీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అదే జరిగితే గంభీర్ పోస్ట్ ఊస్టింగ్!?భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బీజీటీలో ఆసీస్‌ను 4-0 తేడాతో ఓడించాలి. అయితే హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భవితవ్యం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితాలపై ఆధారపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచినట్లయితే టెస్టు జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి గంభీర్‌ను తప్పించాలని బీసీసీఐ భావిస్తుందంట. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. రెడ్ బాల్ క్రికెట్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ స్టాప్‌ను నియమించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే భారత టెస్టు హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. లక్ష్మణ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో -
'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు'
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన భారత బ్యాటర్లు.. ఇప్పుడు వాంఖడే వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో అదే తీరును కనబరిచారు.శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60),సుందర్(38) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. దీంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ను ఏకంగా 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు టీమిండియా మెన్‌జెమెంట్ పంపించింది. అంతకంటే ముందు సర్ఫరాజ్ స్ధానంలో మొదటి రోజు ఆటలో మహ్మద్ సిరాజ్‌ను నైట్ వాచ్‌మెన్‌గా ప్రమోట్ చేసింది. కానీ సిరాజ్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆటలో కూడా సర్ఫరాజ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపలేదు. అతడి కంటే ముందు పంత్, జడేజాలను జట్టు మెన్‌జెమెంట్ బ్యాటింగ్‌కు పంపిచారు.ఇక 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్.. ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్, గంభీర్‌లపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు చేశాడు.అదొక చెత్త నిర్ణయం.."సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు తన మొదటి మూడు టెస్టుల్లో మూడు అర్ధశతకాలు సాధించాడు. బెంగుళూరు టెస్టులో సూపర్ సెంచరీ(150)తో చెలరేగాడు. స్పిన్‌కు అద్భుతంగా ఆడుతున్నాడు.రైట్ అండ్ లెఫ్ట్ కాంబనేషన్ను కొనసాగించడానికి అతడిని డిమోట్ చేశారా? అతడి బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎందుకు మార్చారు? ఈ విషయం నాకు ఇప్పటికీ ఆర్ధం కావడం లేదు. ఏకంగా అతడిని 8వ స్ధానానికి నెట్టేశారు. ఏమైనప్పటికీ భారత జట్టు మెన్‌జెమెంట్ ఓ చెత్త నిర్ణయం తీసుకుందని ఎక్స్‌లో మంజ్రేకర్ మండి పడ్డాడు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
గౌతం గంభీర్ కీలక నిర్ణయం!?
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 టీమిండియా కోల్పోయింది. దీంతో సొంతగడ్డపై 12 ఏళ్ల భారత టెస్టు సిరీస్ విజయాల పరంపంరకు బ్రేక్ పడింది. అంతేకాకుండా ఈ ఓటమితో భారత్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఇక తొలి రెండు టెస్టుల్లో ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు సిరీస్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్‌కు సిద్దమైంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలబడాలంటే ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఈ నేపథ్యంలో భారత జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకోవాల్సింది.నో ఛాయిస్..!న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టుకు ముందు ప్రతీ ఒక్కరూ ట్రైనింగ్ సెషన్లో కచ్చితంగా పాల్గోవాలని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తమ ఆటగాళ్లకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదని గంభీర్ స్పష్టం చేశాడంట. కాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు పుణే నుంచి ఆదివారం(ఆక్టోబర్ 27) ముంబైకి చేరుకోనుంది. ఆటగాళ్లకు టీమ్ మేనేజ్మెంట్ రెండు రోజుల విశ్రాంతిని కేటాయించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా పాల్గోనుంది. ఈ రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రాక్టీస్ క్యాంపులో భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించనున్నారు. స్పిన్నర్లను ఎదుర్కొవడంతో తడబడుతున్న భారత జట్టు.. ఈ సన్నాహాక క్యాంపులో ఆ ఆంశంపై దృష్టిసారించే అవకాశముంది.చదవండి: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
బెడిసికొట్టిన గంభీర్ వ్యూహం..! టీమిండియా ఫ్యాన్స్ ఫైర్?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత్.. ఇప్పుడు పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో కూడా అదే తీరును కనబరుస్తోంది.తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కేవలం 156 పరుగులకే భారత్ కుప్పకూలింది.బెడిసి కొట్టిన గంభీర్ వ్యూహం...కాగా తొలి టెస్టులో ఓటమి అనంతరం కివీస్‌పై భారత జట్టు మెనెజ్‌మెంట్ స్పిన్ అస్త్రాన్ని సంధించాలని భావించింది. ఈ క్రమంలో పుణే పిచ్‌ను డ్రై వికెట్‌గా స్పిన్నర్లకు అనుకూలించేలా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అండ్ కో తయారు చేయించింది.అయితే 'ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్లు' అన్న చందంగా టీమిండియా పరిస్థితి మారింది. ప్రత్యర్ధిని స్పిన్‌తో బోల్తా కొట్టించాలనుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే స్పిన్ వలలో చిక్కుకుని విల్లవిల్లాడింది. కివీస్ స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మొత్తం 10 వికెట్లలో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.ఆఖరికి పార్ట్‌టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌ను కూడా భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. అసలు మనం చూస్తుంది భారత బ్యాటర్లనేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. విరాట్ కోహ్లి వంటి స్టార్ క్రికెటర్లు సైతం చెత్త షాట్లు ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నారు.దీంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్లాన్ మిస్ ఫైర్ కావడంతో గౌతం గంభీర్‌ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. "ఇది టెస్టు క్రికెట్ డ్యూడ్" ఎక్కువగా ప్లాన్స్ చేయవద్దు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. Next level hai #INDvsNZ pic.twitter.com/HZJ1T8qbgr— Hesy Rock (@Hesy_R0ck) October 25, 2024 Team India be like. #INDvsNZ pic.twitter.com/yr4E1dX9VL— Sagar (@sagarcasm) October 25, 2024 -
సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. తమ జట్టు మెంటార్‌గా వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను కేకేఆర్ మెనెజ్‌మెంట్ నియమించింది. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన బ్రావో.. ఇప్పుడు కేకేఆర్‌తో జతకట్టాడు. గత సీజన్లో కోల్‌కతా మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్ స్ధానాన్ని ఈ కరేబియన్ లెజెండ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా ధ్రువీకరించింది. మా కొత్త మెంటార్, డిజే 'సర్ ఛాంపియన్' బ్రావోకు హాలో చెప్పండి. ఛాంపియన్ సిటీకి స్వాగతిస్తున్నాము కేకేఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.నైట్‌రైడర్స్‌తో ప్రత్యేక బంధం..కాగా బ్రావో ఐపీఎల్లో ఎప్పుడూ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటకి.. నైట్‌రైడర్స్ యాజమాన్యంతో అతడికి మంచి అనుబంధం ఉంది. 2013 నుంచి 2020 వరకు సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 సీజన్లో కూడా టీకేఆర్కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. కాగా కేకేఆర్, టీకేఆర్ ఇరు ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం.ప్రొఫెషనల్ క్రికెట్‌కు విడ్కోలు..కాగా అన్ని రకాల క్రికెట్‌కు బ్రావో విడ్కోలు పలికాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని సీజన్ ఆరంభంలోనే వెల్లడించాడు. కానీ దురదృష్టవశాత్తూ టోర్నీ మధ్యలో గాయపడడంతో.. సీజన్ మొత్తం ఆడకుంటానే తన కెరీర్‌ను ముగించాడు. -
గంభీర్ స్ధానంలో దక్షిణాఫ్రికా లెజెండ్..?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ వేటలో పడింది. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్ పనిచేసిన గౌతం గంభీర్.. భారత హెడ్‌కోచ్‌గా వెళ్లిపోవడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో గంభీర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే మెంటార్ రేసులో ఇప్పటికే కుమార సంగర్కర, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్లు వినిపించగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్ పేరు చేరింది. ‘సంగ్బాద్ ప్రతిదిన్’ రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ మెంటార్ రేసులో సంగర్కకర, పాంటింగ్ కంటే కల్లిస్ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.కల్లిస్కు కేకేఆర్ ఫ్రాంచైజీతో మంచి అనుబందం ఉంది. ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ గతంలో గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ తరపున రెండు సీజన్ల పాటు ఆడాడు. అంతేకాకుండా కేకేఆర్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గానూ కల్లిస్ పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ యాజమాన్యం కల్లిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.చదవండి: IPL 2025: డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు! -
బంగ్లాతో టెస్టు సిరీస్.. గంభీర్ మాస్టర్ ప్లాన్! ఏంటంటే?
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్దమవుతోంది. తాజాగా బంగ్లాతో సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది.సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్‌కు ముందు భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ యుధ్వీర్ సింగ్ టీమిడియా నెట్ బౌలర్‌గా ఎంపికచేశాడు. కొత్త బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్ సలహా మేరకు గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా యుద్ద్‌వీర్ అద్బుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యుధ్వీర్.. గతేడాది సీజన్లో గౌతం గంభీర్, మోర్కల్ ఆధ్వర్యంలో అరంగేట్రం చేశాడు.అప్పుడు గంభీర్ లక్నో మెంటార్‌గా ఉండగా.. మోర్కల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే యుధ్వీర్ తన ప్రతిభతో మోర్కల్ ఆకట్టుకున్నాడు. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ఈ నేపథ్యంలోనే నెట్‌బౌలర్‌గా అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నారు. దీంతో అతడు చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు భారత జట్టుతో కలవనున్నాడు. కాగా బంగ్లాతో సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లందరూ సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానున్నారు. బంగ్లాతో తొలి టెస్టు కోసం చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఈ ప్రాక్టీస్ శిబిరంసెప్టెంబర్ 13 నుండి 18 వరకు కొనసాగుతుంది. కాగా ముంబై యువ ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను కూడా నెట్ బౌలర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అతడు కూడా భారత క్యాంపులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. -
గంభీర్ అవుట్.. శ్రీలంక క్రికెట్ దిగ్గజానికి ఛాన్స్?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కర కొత్త ఫ్రాంచైజీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం దాదాపుగా ఖారారు కావడంతో.. టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సంగక్కర ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.స్పోర్ట్స్ టుడే రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ 2025లో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా సంగక్కర బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు వినికిడి. ఇప్పటికే అతడితో కేకేఆర్ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు స్పోర్ట్స్ టుడే తమ కథనంలో పేర్కొంది. కాగా గత సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఆఫ్రాంచైజీని వీడి భారత్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి స్ధానాన్ని ఇంకా ఎవరితో కేకేఆర్ మెనెజ్‌మెంట్ భర్తీ చేయలేదు. ఈ క్రమంలోనే సంగక్కరతో కేకేఆర్ మెనెజ్‌మెంట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ శ్రీలంక క్రికెట్ దిగ్గజం స్ట్రోక్‌ప్లే, మైండ్ గేమ్‌కు పెట్టింది పేరు. అతడి నేతృత్వంలోనే ఐపీఎల్-2022లో రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది. -
గంభీర్ ఆల్‌టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, బుమ్రాకు దక్కని చోటు?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తన ప్రయాణం ఆరంభంలోనే గెలుపోటముల రుచి చూశాడు. అతడి నేతృత్వంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో విజయం సాధించిన భారత్.. వన్డే సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం గంభీర్ తన తదుపరి సవాల్‌కు సిద్దమవుతున్నాడు. ఈ నెల 18 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు భారత్ ఆడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. లంకతో వన్డే సిరీస్ తర్వాత భారత జట్టుకు దాదాపు నెల రోజులు విశ్రాంతి లభించడంతో గౌతీ వరుస ఇంటర్వ్యూలో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ తన ఆల్‌టైమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంచుకున్నాడు.కెప్టెన్‌గా ఎంఎస్ ధోని..గంభీర్ తన ఎంచుకున్న ఆల్‌టైమ్ జట్టుకు భారత మాజీ సారథి ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అదేవిధంగా ఈ జట్టులో ఓపెనర్లగా తనతో పాటు దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గౌతీ ఎంచుకున్నాడు. ఫస్ట్ డౌన్లో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెకెండ్ డౌన్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లకు గంభీర్ చోటిచ్చాడు. అదే విధంగా విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్‌లకు వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో ఛాన్స్ ఇచ్చాడు. వికెట్ కీపర్ జాబితాలో ధోనికి చోటు దక్కింది. ఇక తన జట్టులో ఫాస్ట్ బౌలర్లగా ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్‌లను గంభీర్ అవకాశమిచ్చాడు. అదేవిధంగా స్పిన్నర్ల కోటాలో దిగ్గజాలుఅనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌లను అతడు ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లు లేకపోవడం గమనార్హం.గంభీర్ ఎంచుకున్న ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేవీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని (కెప్టెన్/ వికెట్ కీపర్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ -
19 సిక్సర్లు.. సెంచరీ... ఎవరీ అరివీర భయంకర బ్యాట్స్‌మెన్?
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో బదోని చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఈ యువ సంచలనం ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టేడియం నలుమూలులా సిక్సర్ల బాదుతూ తన విశ్వరూపాన్ని బదోని చూపించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బదోని 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో ఏకంగా 165 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు సాధించాడు.దీంతో సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. దీంతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 112 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.అంతా గంభీర్ వల్లే..ఆయుష్ బదోని సక్సెస్ వెనక టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఉన్నాడనే చెప్పకోవాలి. బదోని కెరీర్ ఎదుగుదలలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బదోని ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.2022 సీజన్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి బదోని అడుగుపెట్టాడు. అయితే ఇదే సమయంలో లక్నో మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. తన అనుభవంతో బదోనిని రాటుదేల్చాడు. కాగా లక్నో జట్టులోకి బదోని రావడానికి గల కారణం కూడా గౌతీనే. ఐపీఎల్లో వేలంలో అతడి సలహా మెరకే బదోనిని లక్నో ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు లక్నో మెంటార్‌గా కొనసాగిన గంభీర్.. బదోనికి ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో అయూష్ సైతం ధ్రువీకరించాడు. గంభీర్‌కు తనకు పెద్దన్న లాంటి వాడని అయూష్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. -
గంభీర్‌కు షాకిచ్చిన సూర్య.. మనసులో మాట చెప్పిన మిస్టర్ 360
టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెడ్ బాల్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్-2024లో ముంబై తరపున సూర్యకుమార్ ఆడనున్నాడు.ఈ టోర్నీతో పాటు రాబోయో రంజీ ట్రోఫీ సీజన్లో కూడా సూర్యకుమార్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో మెరుగ్గా రాణించి భారత్ తరపున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు. ఈ ముంబైకర్ టీమిండియా తరపున ఇప్పటివరకు కేవలం ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సూర్య టెస్టు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అతడు కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం గాయం కారణంగా సిరీస్ నుంచి ఈ మిస్టర్ 360 తప్పుకున్నాడు.ఆ తర్వాత అతడికి టెస్టుల్లో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన సూర్యకుమార్ మూడు ఫార్మాట్లలో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు.నేను టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడాలనకుంటున్నాను. టెస్టు క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నాడు. స్కై బుచ్చిబాబు టోర్నీలో ఆడటం పట్ల ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ సైతం సంతోషం వ్యక్తం చేశాడు.సూర్య నాకు ఫోన్ చేసి బుచ్చి బాబు టోర్నమెంట్లో ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో మ్యాచ్‌లో సూర్య ఆడనున్నాడు. అతడు జట్టులోకి వస్తాను అంటే వద్దు అనే వారు ఎవరూ లేరు.సూర్య రాకతో ముంబై జట్టు మరింత బలోపేతం కానుంది. అతడు ఈ టోర్నీలో ఆడటం చాలా సంతోషంగా ఉంది అని సంజయ్ పాటిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 137 ఇన్నింగ్స్‌ల్లో 63.74 స్ట్రయిక్ రేటుతో అతడు 5,628 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 14 సెంచరీలు, 29 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సూర్యను కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణించారు. ఈ క్రమంలోనే సూర్యకు భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. లంకతో టీ20లు ఆడిన సూర్యను వన్డే సిరీస్‌కు మాత్రం ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సూర్య మూడు ఫార్మాట్ల ఆడాలనకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకు టీ20ల్లో తప్ప మిగితా ఫార్మాట్లలో గణనీయమైన రికార్డు లేదు. -
'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు'
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తన ప్రయణాన్ని విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే లంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది.తొలి వన్డేను టైగా ముగించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా రెండో వన్డేలో గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ పరాజయం పాలైందని అభిమానులు విమర్శిస్తున్నారు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపడాన్ని చాలా మంది మాజీలు తప్పబడుతున్నారు.గంభీర్‌కు అహంకారం ఎక్కువని, తను అనుకున్నదే చేస్తాడని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ను ఉద్దేశించి తన చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఇప్పటకి చిన్నపిల్లవాడేనని, అందరని అభిమానిస్తాడని భరద్వాజ్ తెలిపాడు."గంభీర్ ఒక అహంకారి, దూకుడెక్కువని అందరూ అనుకుంటారు. నిజానికి గంభీర్ చాలా మంచివాడు. అందరని గౌరవిస్తాడు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాడు. ఎంతో మంది యువ క్రికెటర్ల కెరీర్‌ను తీర్చిదిద్దాడు. పేసర్ నవదీప్ సైనీ వంటి వాళ్లు గంభీర్ సాయంతోనే క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. అతడు గెలవడం కోసమే కొన్నిసార్లు దూకుడుగా, సీరియస్‌గా ఉంటాడు. ఎందుకంటే అతడికి ఓడిపోవడం ఇష్టముండదు. చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతడు రాణించలేకపోయినా ఏడ్చేవాడు. ఎవరైనా సీరియస్‌గా ఉన్నంత మాత్రాన వారు మంచి వారు కాదని అనుకోకూడదు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారా?ఎలా గెలవాలో అర్థం చేసుకున్న వారు.. ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకోవాలి. గంభీర్ ఆటగాళ్ల టెక్నికల్ అంశాల జోలికి వెళ్లడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి.. వారి నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టడమే గంభీర్ పని. కోచ్‌గా గంభీర్ విజయవంతమవుతాడని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ నా దృష్టిలో గంభీర్ ఒక 12 ఏళ్ల చిన్న పిల్లవాడని" భారత మాజీ క్రికెటర్ మంజోత్ కల్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ భరద్వాజ్ పేర్కొన్నాడు. -
అతడెందుకు దండగ అన్నారు.. కట్‌చేస్తే! గంభీర్ ప్లాన్ సూపర్ సక్సెస్
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లెయింగ్ ఎలెవన్‌లో ఎంపిక చూసి మొదట అందరూ షాక్‌కు గురయ్యారు. అందుకు కారణం.. జింబాబ్వే సిరీస్‌లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్‌కు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటివ్వడమే.ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లను పక్కన పెట్టి మరి పరాగ్‌కు ఛాన్స్ ఇచ్చిన జట్టు మెనెజ్‌మెంట్ చాలా మంది అగ్రహం వ్యక్తం చేశారు. కానీ పరాగ్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వడం వెనక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాస్టర్ మైండ్ దాగి ఉందని మ్యాచ్ ఆఖరిలో అందరికి ఆర్దమైంది.ఈ మ్యాచ్‌లో రియాన్‌ను పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఉపయోగించాలని గంభీర్ ముందే నిర్ణయించుకున్నాడంట. అందుకే పరాగ్‌కే తొలి ప్రాధన్యతను గౌతీ ఇచ్చాడు. అయితే గౌతీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందే అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్‌లో విఫలమైన రియాన్ పరాగ్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. వికెట్ కాస్త స్పిన్‌కు అనుకూలించడంతో లంక ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు పరాగ్‌ను కెప్టెన్ సూర్యకుమార్ తీసుకువచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని పరాగ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లో కీలకమైన వికెట్‌ను భారత్‌కు అందించాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ అస్సాం ఆల్‌రౌండర్.. 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దీంతో గంభీర్ మాస్టర్ మైండ్ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కదా గౌతీ మార్క్ అంటే పోస్ట్‌లు పెడుతున్నారు. Riyan Parag can Bowl Off Spin + Leg Spin just like Great Sachin Tendulkar used to Bowl 👏🏻That's a Great News for Team India 🇮🇳 #INDvSL #RiyanParagpic.twitter.com/P0VjcDKEkf— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024 -
మేము నిజంగా అదృష్టవంతులం.. అలా జరిగింటేనా: సూర్యకుమార్
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. పంత్(49), జైశ్వాల్(40) పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీషా పతిరానా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. తొలి బంతి నుంచే మా దూకుడైన స్టైల్లో బ్యాటింగ్ చేశాము. ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వారు కూడా ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడారు. మేము ఇదే పిచ్‌పై దాదాపు మూడు రోజుల ప్రాక్టీస్ చేశాము. ఇక్కడ వికెట్ ఇలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా రాత్రి పూట మంచు ఎక్కువగా ఉండి బ్యాటింగ్‌కు ఈజీగా ఉంటుంది. కానీ ఆదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావం ఎక్కువగా లేదు. అది మాకు బాగా కలిసొచ్చింది.వరల్డ్‌కప్‌లో కనబరిచిన ఆటతీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌ను కొనసాగించాలా లేదా అన్నది జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఆడాల్సిన క్రికెట్ ఇంకా చాలా ఉంది. కాబట్టి జట్టు అవసరం తగ్గటు ఏ నిర్ణమైనా తీసుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. -
India vs sri lanka 1st t20: తొలి టీ20లో భారత్ ఘనవిజయం..
తొలి టీ20లో భారత్ ఘనవిజయం..పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 43 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్‌మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు..శ్రీలంక వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా(20) ఔట్ కాగా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అసలంక ఔటయ్యాడు. లంక విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాలి. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 158/4శ్రీలంక రెండో వికెట్ డౌన్..140 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 79 పరుగులతో దూకుడుగా ఆడుతున్న నిస్సాంక.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 14.1 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 140/113 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(71), కుశాల్ పెరీరా(12) పరుగులతో ఉన్నారు. లంక విజయానికి 42 బంతుల్లో 83 పరుగులు కావాలి.11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 106/1శ్రీలంక 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(49), కుశాల్ పెరీరా(10) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక..84 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 55/0214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(31), కుశాల్ మెండిస్(23) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 25/0214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(18), కుశాల్ మెండిస్(5) పరుగులతో ఉన్నారు.శ్రీలంక ముందు భారీ టార్గెట్పల్లెకెలె వేదికగా శ్రీలకంతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైశ్వాల్(40), రిషబ్ పంత్(49), శుబ్‌మన్ గిల్(34) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లలో మతీషా పతిరాన 4 వికెట్లు పడగొట్టగా.. మధుషంక, హసరంగా, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.నాలుగో వికెట్ డౌన్..టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. పతిరాన బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. అతడితో పాటు రిషబ్ పంత్(41) కూడా క్రీజులో ఉన్నాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 192/4సూర్య ఔట్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన సూర్య.. పతిరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 153/3సూర్య హాప్ సెంచరీ..కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో సూర్యకుమార్ హాప్ సెంచరీతో చెలరేగాడు. 54 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(54), రిషబ్ పంత్(16) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్ 111/210 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(28), రిషబ్ పంత్(9) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్..యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన జైశ్వాల్.. వనిందు హసరంగా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. మధుశంక బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో యశస్వీ జైశ్వాల్ 40 పరుగులతో ఉన్నాడు. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 74/1దూకుడుగా ఆడుతున్న భారత్.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(9), యశస్వీ జైశ్వాల్(27) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.పల్లెకలె వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలీల్ ఆహ్మద్‌లకు చోటు దక్కలేదు. అయితే జింబాబ్వే సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన రియాన్ పరాగ్‌కు మాత్రం భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించింది.ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంక ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ఇక ఈ సిరీస్‌లో ఇరు జట్లకు కొత్త సారథిలే కావడం విశేషం. భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తుండగా.. చరిత్ అసలంక లంక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంకభారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా!
భారత్-శ్రీలంక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లురూతున్నాయి. తొలి టీ20 కోసం తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. అయితే భారత జట్టు మాత్రం కొత్త హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్స్‌లో చెమటోడ్చారు. అయితే నెట్ ప్రాక్టీస్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్నర్‌గా అవతరెమెత్తాడు. సాధరణంగా మీడియం పేసర్ బౌలర్ అయిన పాండ్యా.. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు గంభీర్ కొత్త ప్రయోగం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది భారత జట్టుకు కొత్త స్పిన్నర్ వచ్చాడని పోస్ట్‌లు పెడుతున్నారు.కాగా పాండ్యా కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. లంకతో వన్డే సిరీస్‌కు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ దూరమయ్యాడు. అదేవిధంగా పాండ్యాను కాదని భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం విధితమే. ఇక పర్యటలో భాగంగా భారత్ లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.Hardik pandya bowling practice in net session at Colombo!!!!!New lege spinner in team india 🥰♥️#SLvIND #Cricket #IndianCricketTeam#hardikpandya pic.twitter.com/D2d21J8prh— Ashok BANA (@AshokBana_11) July 25, 2024 -
'గౌతీతో నా బంధం చాలా స్పెషల్.. అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్'
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, నూతన హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తమ ప్రయణాన్ని ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. జూలై 27న పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20తో వీరిద్దరి ప్రస్ధానం మొదలు కానుంది.రోహిత్ శర్మ స్ధానంలో భారత టీ20 కెప్టెన్‌గా సూర్య బాధ్యతలు చేపట్టగా.. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీర్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్‌కోచ్ గంభీర్‌ను ఉద్దేశించి సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్‌తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సూర్య తెలిపాడు."గౌతం గంభీర్‌తో నా బంధం చాలా ప్రత్యేకం. ఎందుకంటే నా ఐపీఎల్ అరంగేట్రంలో కేకేఆర్ తరపున గంభీర్ కెప్టెన్సీలోనే ఆడాను. కేకేఆర్ ఫ్రాంచైజీలో నాకు ఆడే అవకాశం రావడం నిజంగా చాలా గొప్పవిషయం. అక్కడ నుంచే నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత జాతీయ జట్టులో ఆడే అవకాశం నాకు లభించింది. మా మధ్య ఆ బంధం ఇప్పటికీ బలంగా ఉంది. నా మైండ్‌సెట్, పనితీరు ఎలా ఉంటుందో గంభీర్‌కు బాగా తెలుసు. అతడు కోచ్‌గా ఎలా పనిచేస్తాడో నాకు కూడా తెలుసు.గంభీర్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మా మా ఇద్దరి కాంబినేషన్లో అన్ని మంచి ఫలితాలే రావాలని ఆశిస్తున్నట్లు" బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. -
శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత జట్టుతో చేరిన గంభీర్ ఫ్రెండ్
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు అన్ని విధాల సన్నద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోస్చేట్ జట్టుతో చేరాడు.టీ20 వరల్డ్‌కప్-2024తో కోచింగ్ స్టాప్ రాహుల్ ద్రవిడ్ అండ్ కో పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఒక్క ఫీల్డింగ్ కోచ్ టి. దిలిప్ మినహా మిగితా ఎవరూ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ పొడగించలేదు. ఈక్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికయ్యాడు. అయితే సపోర్ట్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేఛ్చ ఇచ్చింది. దీంతో ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ డోస్చేట్, భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్లను అసిస్టెంట్ కోచ్‌లగా గంభీర్ సెలక్ట్ చేశాడు.కాగా ఈ త్రయం ఆధ్వర్యంలోనే ఐపీఎల్-2024 విజేతగా కేకేఆర్ నిలిచింది. ఇక ఈ టీ20 సిరీస్‌తో భారత హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మొదలు కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా సిద్దమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. జూలై 26న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టు సోమవారం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టింది. తొలి బ్యాచ్‌గా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 జట్టు శ్రీలంకకు చేరుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా జట్టు వెంట ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.వన్డే జట్టులో భాగమైన ఆటగాళ్లు వారం రోజుల తర్వాత లంకకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం వేకేషన్లో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నేరుగా శ్రీలంకకు చేరుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఇక పర్యటనతో భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుండగా.. హెడ్ కోచ్‌గా గంభీర్ ప్రస్ధానం మొదలు కానుంది. వన్డేల్లో రోహిత్ శర్మనే భారత జట్టును నడిపించనున్నాడు. అయితే ఈ పర్యటనకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. Breaking 🚨@GautamGambhir leads the way as Team India reaches the team hotel in Sri Lanka. @rohitjuglan reports for RevSportz. @tribes_social_ @BCCI #INDvsSL #INDvSL #GautamGambhir pic.twitter.com/kgf12oZVQm— RevSportz Global (@RevSportzGlobal) July 22, 2024 -
గంభీర్ ఎంట్రీ.. రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా? అంటే ఔననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజాను వన్డేలకు దూరంగా పెట్టాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక భారత జట్టులో రవీంద్ర జడేజాకు సెలక్టర్లు చోటివ్వలేదు. గత దశాబ్ద కాలంగా భారత జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్న జడేజాను సెలక్టర్లు లంక సిరీస్‌కు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.అయితే జట్టు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానాన్ని వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబెలలో ఎవరో ఒకరితో భర్తీ చేయాలని సెలకర్టు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబేలకు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు చోటు దక్కింది. అయితే ఇప్పటికే టీ20ల్లో భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. వన్డేల్లో కూడా జడ్డూ స్ధానాన్ని భర్తీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. దీంతో జడేజా ఇకపై టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జడ్డూ అద్బుతమైన ఆల్‌రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రదర్శన పరంగా కూడా అతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించే పనిలో మేనేజ్మెంట్ పడింది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. టెస్టుల్లో మాత్రం జడ్డూ కొనసాగుతాడని పేర్కొన్నారు. కాగా జడేజా ఇటీవల కాలంలో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లోనూ జడేజా విఫలమయ్యాడు. ఇక జడేజాను పక్కన పెట్టడంలో భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వడంపై ఎక్కువ దృష్టిపెట్టినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా తరపున ఇప్పటివరకు 197 వన్డేలాడిన జడ్డూ 2756 పరుగులు చేయడంతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
IND vs SL: 'గంభీర్ భయ్యా వల్లే ఇదంతా.. నేను అతడికి రుణపడి ఉంటా'
ఐపీఎల్ స్టార్, యువ పేసర్ హర్షిత్ రాణా బంపరాఫర్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత సెలక్టర్లు హర్షిత్ రాణాకు పిలుపునిచ్చారు. లంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కింది. భారత వన్డే జట్టులో రాణాకు చోటు దక్కడం ఇదే తొలిసారి.జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రాణా ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలోనైనా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయాలని ఈ ఢిల్లీ యువ పేసర్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే తను స్దాయికి చేరుకోవడంలో ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ది కీలక పాత్ర అని హర్షిత్ తెలిపాడు. కాగా గంభీర్, రాణా ఇద్దరూ ఢిల్లీ క్రికెట్‌కు ఆడి వచ్చిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా ఐపీఎల్లో గంభీర్ మెంటార్‌గా పనిచేసిన కేకేఆర్ జట్టులో రాణా సభ్యునిగా ఉన్నాడు."నేను ఎప్పుడూ నా కష్టాన్నే నమ్ముకుంటాను. కానీ కొన్ని సార్లు సీనియర్ జట్లలో చోటుదక్కినప్పడు ఒక్కడినే రూమ్‌లోని కూర్చోని బాధపడేవాడిని. నా ఈ అద్భుత ప్రయాణంలో నేను ముగ్గురికి కృతజ్ఝతలు తెలపాలనకుంటున్నాను. అందులో ఒకరు మా నాన్న. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఆయన ఎంతగానే కృషి చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కోచ్ అమిత్ భండారీ ( ఢిల్లీ మాజీ పేసర్). భండారీ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక అందరికంటే గంభీర్ భయ్యాకు నేను రుణపడి ఉంటాను. ఆట పట్ల నా ఆలోచన విధానం గంభీర్ భయ్యా వల్లే మారింది. ఆయనలాంటి వ్యక్తితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. మనకు ఎంత టాలెంట్ ఉన్నప్పటకి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించలగము. గంభీర్‌ను చూసి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేను నేర్చుకున్నాను. గౌతీ భయ్యా నాతో ఎప్పుడూ చెప్పేది ఒక్కటే విషయం. నేను నిన్ను నమ్ముతున్నాను, కచ్చితంగా నీవు విజయం సాధిస్తావని నాతో చెప్పేవారు" న్యూస్ 18తో మాట్లాడుతూ రాణా పేర్కొన్నాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక శ్రీలంక పర్యటన జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. -
గంభీర్ కీలక నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్ రీ ఎంట్రీ! ఎవరంటే?
శ్రీలంక పర్యటనకు భారత జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 18 (గురువారం) సాయంత్రం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాల్గోనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లలో తలపడనుంది.ఈ రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను అగార్కర్ అండ్ కో ఎంపికచేయనున్నారు. అయితే లంకతో వన్డేలకు టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి . తొలుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ హిట్‌మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు తెలియజేసినట్లు వినికిడి. అదేవిధంగా శ్రీలంకతో టీ20ల్లో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నవ్‌దీప్ సైనీ రీ ఎంట్రీశ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక ముందు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీకి తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లకు గంభీర్ సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లంకతో వన్డే జట్టులో సైనీ భాగం చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్‌ను పెంచుకునే విధంగా గంభీర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నవ్‌దీప్ సైనీ చివరగా 2021లో ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత తరపున ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అతడు ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఇటీవల దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి పిలుపునివ్వాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. -
శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడే? అతడు రీ ఎంట్రీ ఇస్తాడా?
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. కాగా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం(జూలై 16) ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఈ జట్టు ఎంపికలో భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా పాల్గోనున్నట్లు సమాచారం. ఇక లంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 క్రికెట్‌కు ఇప్పటికే గుడ్‌బై చెప్పిన రోహిత్, విరాట్, జడేజా.. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండనున్నారు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వినికిడి.అదే విధంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్.. ఇప్పుడు గంభీర్ రాకతో అతడి ఎంట్రీ సుగమైనట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఛాంపియన్స్ నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అయ్యర్ సారథ్యం వహించగా.. గంభీర్ మెంటార్‌గా పనిచేశాడు. -
Weekly Round Up: భారత్ హెడ్ కోచ్‌గా గంభీర్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ మనదే
భారత క్రికెట్లో నూతన శకానికి నాంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండా టీ20ల్లో టీమిండియా. భారత హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే టూర్.యూరో ఫుట్‌బాల్ కప్‌లో ఫైనల్‌కు చేరిన స్పెయిన్, ఇంగ్లండ్. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు చేరిన నొవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ వంటి ఈ వారంలో జరిగిన ముఖ్యమైన క్రీడా ఆంశాలపై ఓ లుక్కేద్దాం.భారత హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్..భారత క్రికెట్లో నూతన శకానికి బీసీసీఐ నాంది పలికింది. టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను బీసీసీఐ నియమించింది. 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గంభీర్.. ద్రవిడ్ వారసుడిగా బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోచ్‌గా గంభీర్‌కు తొలి పరీక్ష. టీ20 వరల్డ్‌కప్-2024తో హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే భారత్..టీ20 వరల్డ్‌కప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. దీంతో రోహిత్, విరాట్ లేకుండానే భారత్ టీ20ల్లో ఆడుతోంది. టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది.శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా..యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తొలిసారి భారత సీనియర్ జట్టు పగ్గాలు చేపట్టాడు. గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. సీనియర్ ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.అయితే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన ఆదిలోనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. తొలి టీ20లో ఆతిథ్య జట్టులో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఆ తర్వాత దెబ్బతిన్న సింహంలా గర్జించిన భారత జట్టు.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.ఈ సిరీస్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలన సెంచరీతో మెరిశాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. కెప్టెన్ శుబమన్ గిల్ సైతం తన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.యూరో కప్ ఫైనల్‌కు చేరిన స్పెయిన్, ఇంగ్లండ్..యూరో ఫుట్‌బాల్ కప్-2024 ఫైనల్‌కు స్పెయిన్, ఇంగ్లండ్ జట్లు చేరాయి. తొలి సెమీఫైనల్లో 2-1 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీస్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి ఇంగ్లండ్ తుది పోరుకు ఆర్హత సాధించింది. ఆదివారం(జూలై 14) జరగనున్న ఫైనల్ పోరులో స్పెయిన్, ఇంగ్లండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.కోపా అమెరికా ఫుట్‌బాల్ కప్ ఫైనల్లో అర్జెంటీనా- కొలంబియాకోపా అమెరికా ఫుట్‌బాల్ కప్ ఫైనల్లో అర్జెంటీనా- కొలంబియా అడుగుపెట్టాయి. తొలి సెమీఫైనల్లో కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి అర్జెంటీనా ఫైనల్‌కు చేరగా.. రెండో సెమీఫైనల్లో కెనడాపై 1–0 గోల్ తేడాతో విజయం సాధించి కొలంబియా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూలై 15న జరగనున్న టైటిల్‌పోరులో అర్జెంటీనా- కొలంబియా తాడోపేడో తెల్చుకోనున్నాయి. కాగా కొలంబియా ఈ టోర్నీలో ఫైనల్ చేరడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అదే విధంగా అర్జెంటీనా డిఫెండింగ్ హోదాలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్, అల్కరాజ్ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో కార్లోస్ అల్కరాజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)ను 6–7 (1/7), 6–3, 6–4, 6–4తో తేడాతో ఓడించిన అల్కరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. అదే విధంగా రెండో సెమీఫైనల్లో 6–4, 7–6 (7/2), 6–4తో 25వ సీడ్ లరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించి రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ కూడా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.సరికొత్త ఛాంపియన్‌గా క్రెజికోవా..ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరుతో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది.డబ్ల్యూసీఎల్ విజేతగా ఇండియా..వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత విజయంలో రాయుడు( 50), యూసఫ్ పఠాన్(30) కీలక పాత్ర పోషించారు.జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్..ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. వెస్టిండీస్ తొలి టెస్టు అనంతరం తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. -
హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ను బీసీసీఐ మంగళవారం(జూలై 10)న నియమించింది.హెడ్ కోచ్‌ను మాత్రమే ఎంపిక చేసిన బీసీసీఐ.. సపోర్ట్ స్టాప్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రోడ్స్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐని గంభీర్ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే గంభీర్ అభ్యర్ధనను బోర్డు తిరష్కరించినట్లు తెలుస్తోంది. సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఇండియన్సే ఉండాలని గౌతీకి బీసీసీఐ సూచించినట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్లు పేర్కొంది. కాగా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో మొత్తం కోచింగ్ స్టాప్ భారతీయులే ఉన్నారు. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే ,ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ వ్యవహరించారు.అయితే ద్రవిడ్‌తో పాటు వీరి పదవీ కాలం కూడా ముగిసింది. కాగా ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా భారత క్రికెట్లో సమూలమైన మార్పులు తీసుకువచ్చాడు. మ్యాచ్ అనంతరం బెస్ట్ ఫీల్డర్ అవార్డులను డ్రెస్సింగ్ రూమ్‌లో ఇవ్వడం అతడే ప్రారంభించాడు. శ్రీలంక పర్యటనకు ముందు భారత కోచింగ్ స్టాప్‌పై ఓ క్లారిటి వచ్చే అవకాశముంది. ఈ పర్యటనతోనే భారత జట్టు హెడ్‌కోచ్‌గా గంభీర్ ప్రయాణం మొదలు కానుంది. -
గంభీర్ రాక.. ఆ ఆటగాడికి మళ్లీ పిలుపు! ఎవరంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. శ్రీలంకతో వన్డే సిరీస్‌తో అయ్యర్ పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన అయ్యర్.. భారత జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్.. అయ్యర్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయ్యర్ విషయంపై గంభీర్ బీసీసీఐ పెద్దలతో మాట్లాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అయ్యర్‌కు చోటు దక్కనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవరిస్తుండగా.. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ పనిచేశాడు. వీరిద్దరి నేతృత్వంలో పీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. అదేవిధంగా అయ్యర్ కూడా మంచి టచ్‌లో కన్పించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయ్యర్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.మరోవైపు తన ఫిట్నెస్ కాపాడుకోవడానికి అయ్యర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముంబైలో వర్షంలో పడుతున్న సమయంలో కూడా తన ప్రాక్టీస్‌ను అయ్యర్ కొనసాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
గంభీర్ మార్క్.. భారత ఫీల్డింగ్ కోచ్‌గా నెదర్లాండ్స్ లెజెండ్!?
భారత జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంక పర్యటనతో అతడు తన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలో తన సహాయక సిబ్బంది నియామకంపై గంభీర్ కసరత్తులు మొదలెట్టాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ టెన్ డష్కాటేను తన టీమ్‌లోకి తీసుకునేందుకు గంభీర్ ఆసక్తిగా ఉ న్నట్లు తెలుస్తోంది.అతడికి ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశముందని క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. తాజాగా టెన్ డష్కాటేను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ర్యాన్ టెన్ డష్కాటే నిస్వార్థపరుడని, తను జీవితాంతం నమ్మే వ్యక్తి అతడేనని గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొనియాడాడు. దీంతో డష్కాటే గంభీర్ కోచింగ్ స్టాప్‌లో భాగం కావడం దాదాపు ఖారారైనట్లు అభిమానులు భావిస్తున్నారు. కాగా టెన్ డష్కాటేకి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, యూఏఈ టీ20 వంటి ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌ల్లో సపోర్ట్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. నెదర్లాండ్స్ తరపున 33 వన్డేలు, 24 టీ20లు ఆడిన అతడు.. వరుసగా 1541, 533 పరుగులు చేశాడు. అదేవిధంగా బౌలింగ్‌లో 88 వికెట్లు పడగొట్టాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో టెన్ డష్కాటే మరి కన్పించలేదు. -
అతడొక అద్భుతం.. ఫ్యూచర్ ఇండియన్ స్టార్: గంభీర్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఓపెనర్‌గా విరాట్ కోహ్లి విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. విరాట్ కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విరాట్ కోహ్లి స్థానంలో ఓపెనర్‌గా భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఛాన్స్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మెగా టోర్నీలో జైశ్వాల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఈ క్రమంలో జైశ్వాల్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్న గంభీర్‌కు ప్రస్తుత తరంలో భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. వెంటనే గౌతీ ఏమీ ఆలోచించకుండా టక్కున యశస్వీ జైశ్వాల్ అని బదులిచ్చాడు."ప్రస్తుతం తరంలో నన్ను బాగా ఆకట్టుకున్న క్రికెటర్ యశస్వి జైస్వాల్. జైశ్వాల్ అద్బుతమైన ఆటగాడు. అతడికి దూకుడుగా ఆడే సత్తా ఉంది. అంతేకాకుండా అతడు ఓపెనర్‌గా కూడా బాగా రాణిస్తున్నాడు. లెఫ్టాండర్ కావడం యశస్వీకి బాగా కలిసొచ్చింది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. జైశ్వాల్‌కి కష్టపడేతత్వం ఉంది. కచ్చితంగా అతడు ఫ్యూచర్ ఇండియన్ స్టార్‌గా ఎదుగుతాడని" గంభీర్ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్
భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మే 27తో దరఖాస్తు గడువు తేదీ ముగిసినా ఎవరెవరు పోటీలో ఉన్నారు? అనే విషయంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే మరి కొన్ని రిపోర్ట్లు మాత్రం గంభీర్‌కు హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేదని పేర్కొంటున్నాయి. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్స్‌గా నిలిపిన తర్వాత గంభీర్ వరుస కార్యక్రమాలతో బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అబుదాబిలోని మెడియర్ ఆసుపత్రిలో విద్యార్థులతో గౌతీ ఇంటరాక్టయ్యాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్‌కోచ్ పదవిపై తన అభిప్రాయాలను చెప్పమని గౌతీని విద్యార్థులు ప్రశ్నించారు. జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. "భారత జట్టు హెడ్‌కోచ్ పనిచేసేందుకు నేను ఇష్టపడతాను. జాతీయ జట్టుకు కోచ్ చేయడం కంటే గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు. మేము దేశంలో ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఆడుతాము. అంతకంటే అదృష్టం ఇంకేమి ఉంటుందని" గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC: సునీల్ గవాస్కర్‌ను కలిసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్ -
అతడు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకురావచ్చా? అని అడిగాడు: గంభీర్
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన విషయం విధితమే. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేకేఆర్.. టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడింది.అయితే కేకేఆర్ విజేతగా నిలవడంలో ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ ది కీలక పాత్ర. కేకేఆర్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతీ.. ఈసారి మెంటార్‌గా ట్రోఫీని అందించాడు. అయితే ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ విజేతగా కేకేఆర్ నిలిచిన అనంతరం గంభీర్ ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా ఎన్డీటీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నరైన్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, తను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా సునీల్ నరైన్ తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి కేకేఆర్ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సునీల్.. కేకేఆర్ మూడోసారి ఛాంపియన్‌గా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే నరైన్‌ను ఓపెనర్‌గా పరిచయం చేసింది గౌతం గంభీర్‌నే. 2012 సీజన్లో నరైన్‌ను ఓపెనర్‌గా పరిచియం చేసి విజయవంతమైన గంభీర్.. సారథిగా కేకేఆర్‌కు తొలి టైటిల్‌ను అందించాడు.నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా?"నాది, సునీల్ నరైన్ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. అదే విధంగా మేము ఇద్దరం కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వము. ఐపీఎల్-2012 సీజన్లో తొలిసారి నరైన్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో జై పూర్లో మా ప్రాక్టీస్‌ను ముగించుకుని లంచ్ చేసేందుకు సిద్దమయ్యాం.. ఈ క్రమంలో నరైన్‌కు లంచ్‌కు పిలిచాను. నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. నేను పిలవగానే అతను చాలా సిగ్గుపడ్డాడు. లంచ్ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా? అని అడిగాడు. నరైన్ తన మొదటి సీజన్లో చాలా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ నరైన్ ఇప్పుడు ఒకప్పుడులా లేడు. అతడితో నేను ఎదైనా మాట్లాడవచ్చు. సునీల్ కూడా నాతో స్వేఛ్చగానే మాట్లాడుతాడు. నేను ఎప్పుడు అతడిని సహచరుడిగా, స్నేహితుడిగా చూడలేదు. సునీల్ నా సొంత సోదరుడిలా భావించాను. తనకు ఏ అవసరమోచ్చినా నేను ముందుంటాను. అదే విధంగా నాకు ఏ సమస్య ఉన్నా తను కూడా ముందుంటాడు. మేము ఆడంబరంగా ఉండం. కానీ మా బాధ్యతను 100 శాతం నిర్వర్తించేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తామని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. -
ముగిసిన డెడ్ లైన్.. భారత కొత్త హెడ్ కోచ్ ఎవరో?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం(మే 27) సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది.కాగా ధరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటకి..కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికి.. వారవ్వరూ హెడ్‌కోచ్ పదవికి ఆప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ మాలాలు వెల్లడించాయి. నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!కాగా భారత హెడ్ కోచ్ రేసులోప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్‌కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయలేదంట. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు పూర్తి స్ధాయి హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్ అవుతాడా? ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఐపీఎల్-2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ వేటను మొదులెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ధరఖాస్తులను సైతం బీసీసీఐ అహ్హనించింది. హెడ్ కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు మే 27 సాయంత్రం ఆరు గంటలతో గడువు ముగియునుంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్ రేసులో గౌతం గంభీర్, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్,జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ కూడా భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెడ్‌కోచ్ పదవికి ధరఖాస్తు చేసేముందు గంభీర్ బీసీసీఐకు ఒక కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'సెలక్షన్ గ్యారెంటీ' ఇస్తేనే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని బీసీసీఐతో గంభీర్ చెప్పినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు వినికిడి. ప్రస్తుత సమాచారం ప్రకారం ద్రవిడ్ వారసుడిగా గంభీర్ బాధ్యతలు చెపట్టడం దాదాపు ఖాయమన్పిస్తోంది. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ తలపడనుంది. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..!
టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం విధితమే. భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 లోపు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్‌గా ఉండాలని గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన తర్వాత గంభీర్‌తో బీసీసీఐ పూర్తి స్ధాయి చర్చలు జరపనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గంభీర్ గతంలో ఎప్పుడూ కోచ్‌గా పనిచేయనప్పటికి మెంటార్‌గా మాత్రం అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కేకేఆర్‌తో పాటు గతంలో రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా కూడా గంభీర్ పనిచేశాడు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా ఉన్న కోల్‌కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌గా కూడా కేకేఆర్‌కు రెండు సార్లు టైటిల్‌ను గౌతీ అందించాడు. అంతేకాకుండా ఆటగాడిగా గంభీర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గౌతీకి భారత హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు వినికిడి. -
బర్త్‌డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్‌కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్‌డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్‌బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్‌డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్‌ను సచిన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
Virat Kohli-Gambhir: కలిసిపోయిన గంభీర్, కోహ్లి.. హగ్ చేసుకుని మరి! వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్‌లో గౌతం గంభీర్, కోహ్లి ఇద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య 11 ఏళ్లగా కొనసాగుతున్న వైరానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తమ అభిమాన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని, ఎప్పుడు మీ ఇద్దరూ ఇలానే కలిసి ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత 2015 ఐపీఎల్ సీజన్లో మళ్లీ విరాట్, గౌతీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేకపోయిన గౌతమ్ గంభీర్, డగౌట్లో కూర్చీని తన్ని, ఫైన్ కూడా కట్టాడు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్లో మరోసారి విరాట్ , గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ ఉల్ హాక్-కోహ్లి మధ్య గొడవ జరగగా.. అందులో గంభీర్ జోస్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఇద్దరూ ఒకే మైదానంలో ఉండడంతో అందరి కళ్లు ఈ మ్యాచ్‌పైనే ఉన్ను. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. They hugged 😭😭😭 Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him. I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb — RanaJi🏹 (@RanaTells) March 29, 2024 -
అతడొక అద్భుతం.. పాక్ క్రికెట్లో లెజెండ్ అవుతాడు: గంభీర్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజం తన కెరీర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తాడని గంభీర్ కొనియాడాడు. వన్డే ప్రపంచకప్-2023 అనంతరం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. బాబర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న పాక్ టెస్టు జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కీడాతో గంభీర్ మాట్లాడుతూ.. "కెప్టెన్సీని విడిచిపెట్టడం లేదా స్వీకరించడమనేది ఆటగాళ్ల వ్యక్తిగతం. నా వరకు అయితే బాబర్ ఆజం అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వర్క్‌లోడ్ తగ్గింది. పాకిస్తాన్లో మాత్రం ప్రశంసలైనా, విమర్శలైనా కెప్టెన్‌కే దక్కుతాయి. ఇటువంటిది భారత్‌లో కూడా కొంత వరకు ఉంది. బాబర్ ఆజం బ్యాటింగ్‌పై ఎప్పుడూ పెద్దగా విమర్శలు రాలేదు. ప్రతీ సారి అతడి కెప్టెన్సీపైనే ప్రశ్నల వర్షం కురిసేది. ఇప్పుడు అతడు కెప్టెన్సీ విడిచిపెట్టాడు. ఇకపై మనం సరికొత్త బాబర్‌ను చూడవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా బాబర్ నిలిచాడు. అతడికి ఇంకా చాలా వయస్సు ఉంది. బాబర్ మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతాడు. కచ్చితంగా అతడు రిటైర్ అయ్యే సమయానికి పాక్ క్రికెట్ చరిత్రలో తన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడని పేర్కొన్నాడు. చదవండి: AUS vs PAK: ఫేర్వెల్ టెస్టు సిరీస్ ... పాక్‌పై సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్ -
గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు
లెజెండ్స్ లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్- శ్రీశాంత్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరిదద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం గంభీర్‌ను ఉద్దేశించి శ్రీశాంత్ చేసిన ఓ పోస్ట్.. ఈ గొడవకు మరింత అజ్యం పోసింది. గంభీర్ తనను పదే పదే ఫిక్సర్ అన్నాడని, అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీశాంత్ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అయితే.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీశాంత్ టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని కమిషనర్ నోటీస్‌లో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలు తొలగించిన తర్వాతనే అతనితో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ వివాదంపై అంపైర్లు ఇచ్చిన నివేదికలో శ్రీశాంత్‌ను శ్రీశాంత్‌ను గంభీర్ ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనలేదు. కాగా వీరిద్దరూ భారత తరుపన కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. చదవండి: IPL 2024: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!? -
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: గంభీర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న రోహిత్.. కేవలం వన్డేల్లో, టెస్టుల్లో మాత్రమే కొనసాగున్నట్లు క్రికెట్ వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది. రోహిత్‌తో పాటు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా గత ఏడాది నుంచి టీ20ల్లో ఆడటం లేదు. రోహిత్ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా టీ20ల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఆడాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. "టీ20 ప్రపంచకప్-2024కు రోహిత్ శర్మ, కోహ్లి ఇద్దరినీ కచ్చితంగా ఎంపిక చేయాలి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించాలి. హార్దిక్ టీ20ల్లో సారథిగా ఉన్నప్పటికీ.. రోహిత్‌ను నేను కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నాను. ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ తన బ్యాటింగ్ పవర్ ఎంటో చూపించాడు. రోహిత్‌ను ఎంపిక చేస్తే విరాట్ కోహ్లి కూడా ఆటోమేటిక్‌గా జట్టులోకి వస్తాడు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకుంటే, అతడిని బ్యాటర్‌గా కాకుండా కెప్టెన్‌గా ఎంపిక చేయాలి" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, కోహ్లితో పాటు సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. చదవండి: IPL 2024-Rashid Khan Injury: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. రషీద్ ఖాన్‌కు సర్జరీ!? ఐపీఎల్‌కు దూరం -
కోహ్లి, రోహిత్, గిల్ కాదు.. అతడే గేమ్ ఛేంజర్: గంభీర్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. నవంబర్ 19న అహ్మదాదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో ఆసీస్‌ను చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై మాజీ ఓపెనర్, ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్‌తో జరగనున్న ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ మరోసారి అదరగొడతాడని గంభీర్ జోస్యం చెప్పాడు. కాగా శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ ఆడిన అయ్యర్.. 75.14 సగటుతో 526 పరుగులు చేశాడు. "ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో నా వరకు అయితే శ్రేయాస్ అయ్యర్ బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్. అతడు ఈ టోర్నీకి ముందు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఈ తరహా ప్రదర్శన చేయడం అంత ఈజీకాదు. న్యూజిలాండ్ వంటి జట్టుపై సెమీఫైనల్లో కేవలం 70 బంతుల్లో సెంచరీ చేయడం అయ్యర్‌కే సాధ్యమైంది. అతడు టీమిండియాకు చాలా కీలకమైన ఆటగాడు. ఆసీస్‌తో ఫైనల్లో మరోసారి తన మార్క్‌ను చూపిస్తాడని భావిస్తున్నాను. మిడిల్ ఓవర్లలో జంపా, మాక్స్‌వెల్‌ను ధీటుగా అయ్యర్ ఎదుర్కొంటాడని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: CWC 2023: టీమిండియాతో ఫైనల్.. ఏకపక్షంగా ఉంటుంది: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ -
ఇంగ్లండ్‌ను చూస్తుంటే దేశం కోసం ఆడుతున్నట్లు లేదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ వరల్డ్‌కప్‌లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇంగ్లండ్ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేరాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గోన్న గంభీర్‌కు.. ఇంగ్లండ్ ఓటములకు బ్యాటింగ్ కారణమా? బౌలింగ్ కారణమన్న ప్రశ్న ఎదురైంది. "ఈ టోర్నీలో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిల్లోనూ నిరాశపరిచింది. వరల్డ్‌కప్ తొలి మ్యాచ్ నుంచే ఇంగ్లండ్ జట్టు చాలా నిరూత్సహంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ తీరు అయితే మరి దారుణంగా ఉంది. మొత్తం బ్యాటింగ్ యూనిట్లో ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో ఆడినట్లు కన్పించడం లేదు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారు తప్ప దేశం కోసం కాదు. శ్రీలంకపై మొదటి 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 350 పరుగులపైగా వస్తుంది అనుకున్నాను. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు. జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్‌ను పారేసుకున్నారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసింది. అందుకే వారు విజయం సాధించారు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! -
'బాబర్ ఆజం చాలా పిరికివాడు.. ఫిప్టి కొసమే ఆడాడు'
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ మండిపడ్డాడు. బాబర్ ఆజం కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడాడని గంభీర్ విమర్శించాడు. "బాబర్ అజం చాలా పిరికివాడు. ఇద్దరు బ్యాటర్లు భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో ఎవరో ఒకరు కొంచెం దూకుడుగా ఆడాలి. రిజ్వాన్ కంటే ముందు బాబర్ బ్యాటింగ్ వచ్చాడు. కాబట్టి ఆజం ఛాన్స్‌లు తీసుకుని ఆడాల్సింది. ఫిప్టీ కోసమో లేదా మీ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇటువంటి ఫలితాలే ఎదురవతాయి. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఇప్పటికే చాలా పరుగులు సాధించాడు. ఎన్నో రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ గత చరిత్ర చూసుకుంటే షాహిద్ అఫ్రిది, ఇమ్రాన్ నజీర్, తౌఫీక్ ఉమర్ వంటి ఆటగాళ్లు ఆరంభంలో దూకుడుగా ఆడేవారు. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తడి పెంచేవారు. కానీ ప్రస్తుత పాకిస్తాన్ జట్టు టాపర్డర్‌లో అటువంటి ఆటగాడు ఒక్కడు కూడా లేడు. భారత్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఎటాక్ ఎదుర్కొవలసి వచ్చినప్పుడు ఎటువంటి భయం లేకుండా ఆడాలని ముందే డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకోవాలి. అంతే తప్ప పిరికిగా మాత్రం ఆడకూడదు. అలా అయితే టాప్ 3 బ్యాటర్లు ఔట్ కాగానే మిగితా బ్యాటర్లకు పెవిలియన్‌కు క్యూ కడతారని స్టార్‌స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్ కౌంటర్ -
గంభీర్ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గంభీర్ ఓ యోధుడు అని అశ్విన్ కొనియాడాడు. తాజాగా యూట్యూబ్ లైవ్‌లో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో అశ్విన్ సంభాషించాడు. ఈ సందర్భంగా గంభీర్ వరల్డ్‌కప్ ప్రదర్శనల గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు. "మన దేశంలో గంభీర్‌ను చాలా మంది అపార్ధం చేసుకున్నారు. అతడొక గొప్ప టీమ్మ్యాన్. జట్టు కోసం పోరాడటానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. అతడు ముఖంలో పెద్దగా ఉద్వేగాలు కన్పించకపోయినా ఎల్లప్పుడూ జట్టు గురించి ఆలోచించే నిస్వార్థ వ్యక్తి. వరల్డ్‌కప్‌లో ఫైనల్లో మాత్రమే కాదు, అతడు అటువంటి ఇన్నింగ్స్‌లు భారత జట్టు కోసం ఎన్నో ఆడాడు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సచిన్ టెండూల్కర్ ,వీరేంద్ర సెహ్వాగ్ వెంటవెంటనే ఔటైనప్పుడు గౌతీ జట్టుపై ఎటువంటి ఒత్తడి కలగకుండా చేశాడు. ఆ కాసేపటికే విరాట్ కోహ్లి కూడా పెవిలియన్‌కు చేరాడు. కానీ గంభీర్ మాత్రం శ్రీలంక బౌలర్లకు ఎదురు నిలబడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఈజీగా 120-130 పరుగులు చేసే అవకాశమున్నా నిస్వార్థంగా ఆడాడు" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్‌లను సొంతం టీమిండియా సొంతం చేసుకోవడంలో గంభీర్ ది కీలక పాత్ర. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో గెలిచిన రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గంభీర్ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో జోహన్నెస్ బర్గ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 75 పరుగులు చేశాడు గంభీర్. 2011 వరల్డ్‌కప్‌లో ముంబైలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు డు. గంభీర్ తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడి 4154, 5238, 932 పరుగులు చేశాడు. చదవండి: WC 2023: టీమిండియాతో తొలి మ్యాచ్.. ఆసీస్ తుది జట్టు ఇదే! స్టార్ ఆల్‌రౌండర్‌కు నో ఛాన్స్ -
శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. ఫోటోలు వైరల్
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్ పాల్గొన్నాడు. దర్శనం ఆనంతరం.. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు గౌతీని సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో టీమిండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా భారత్ వేదికగా ఆక్టోబర్ 5నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. చదవండి: IND vs AUS 3rd Odi: ఓటమితో ముగింపు.. సిరీస్ భారత్ సొంతం -
సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ అంటే ఎవరైనా సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతారు. లేదంటే ప్రస్తుత తరంలో అయితే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వైపు మొగ్గు చూపుతారు. కానీ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ దృష్టిలో వీరిద్దరిలో ఎవరూ కూడా బెస్ట్ బ్యాటర్ కాదంటా. విషయంలోకి వెళ్తే తాజాగా వివేక్ బింద్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది బడా భారత్ షోలో గౌతం గంభీర్ పాల్గోనున్నాడు. ఇప్పటివరకు భారత క్రికెట్లో మీ అత్యుత్తమ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న గంభీర్‌కు ఎదురైంది. అందుకు ఆప్షన్స్‌గా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేర్లను వివేక్ బింద్రా ఇచ్చాడు. గంభీర్ మాత్రం బిన్నంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భారత్ తరఫున బెస్ట్ బ్యాటర్ అని తన సమాధనమిచ్చాడు. అదే విధంగా టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరన్న విషయంలోనూ గంభీర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. భారత బెస్ట్ కెప్టెన్ ఎవరంటూ కపిల్ దేవ్, గంగూలీ, ధోనీ, కోహ్లి పేర్లను ఆప్షన్లుగా ఇవ్వగా.. గంభీర్ మాత్రం అనిల్ కుంబ్లేను ఎంచుకున్నాడు. కాగా గంభీర్ తన చర్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసియాకప్‌లో అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించి గంభీర్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. చదవండి: BCCI: ‘టీమిండియా హెడ్‌కోచ్ పదవి వద్దు’.. ఆసక్తి లేదన్న మాజీ పేసర్! కారణమిదేనా? -
అందుకే మిడిల్ ఫింగర్ చూపించా.. నేను అది సహించలేను: గంభీర్
టీమిండియా మూజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన చర్యతో వార్తలకెక్కాడు. ఆసియాకప్-2023లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ఫ్యాన్స్ కోహ్లి, కోహ్లి అంటూ గట్టిగా అరుస్తుండగా.. గంభీర్ తన మిడిల్ ఫింగర్ చూపించడం కన్పించింది. తాజాగా ఈ వీడియోపై గంభీర్ స్పందించాడు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోనే తను అలా రియాక్ట్ అయ్యానని గంభీర్ తెలిపాడు. అది నిజం కాదు.. "సోషల్ మీడియలో మీరు చూస్తున్నది నిజం కాదు. ఎందుకంటే నేను ఎవరి ఫ్యాన్స్‌కి వ్యతిరేకిని కాదు. అక్కడ జరిగింది వేరు.. వీడియోలో ఉన్నది ఒకటి. అక్కడ కొంతమంది పాకిస్తానీలు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఇలానే రియాక్ట్ అవుతా. అటువంటివి విని నేను నవ్వుతూ వెళ్లిపోలేను" అంటూ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఆ సమయంలో చాలా నిరాశ చెందా.. అది క్షమించరానిది: రోహిత్ శర్మ #WATCH | Kandy, Sri Lanka | On his recent viral video during Asia Cup 2023, former cricketer and BJP MP Gautam Gambhir says, "What is shown on social media has no truth in it because people show whatever they want to show. The truth about the video that went viral is that if you… pic.twitter.com/RX4MJVhmyd — ANI (@ANI) September 4, 2023 -
'కోహ్లి, గంభీర్ అలా చేస్తారనుకోలేదు.. చాలా బాధ కలిగించింది'
ఐపీఎల్-2023లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మధ్య తీవ్ర వాగ్వదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల మధ్య కరచాలనం చేసుకునే సమయంలో వీరిద్దరి మధ్య మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరికి ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా కూడా విధించారు. అదే విధంగా గౌతీ, విరాట్ ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపించారు. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. మైదానంలో కోహ్లి, గంభీర్ ప్రవర్తన తనను చాలా బాధ కలిగించిందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. "బీసీసీఐ క్రికెటర్లను మంచి ఆటగాళ్ల గానే కాదు, మంచి పౌరులుగా కూడా తీర్చిదిద్దాలి. మైదానంలో ఎలా ప్రవర్తించుకోవాలో నెర్పించాలి. ఐపీఎల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ప్రవర్తన నన్ను చాలా బాధ కలిగించింది. ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు. విరాట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతుండగా.. గౌతీ చాలా ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించాడు. అంతేకాకుండా గంభీర్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నాడు. అటువంటిది వీరిద్దరూ బహిరంగంగా అలా ఎలా ప్రవర్తిస్తారు. కానీ క్రీడాకారులు ఎదో ఒక సమయంలో తమ సహనాన్ని కోల్పోతారు. బ్రాడ్‌మన్, పీలే వంటి దిగ్గజాలు కూడా ఈ కోవకు చెందిన వారే" అని ది వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. చదవండి: Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం.. -
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
నవీన్ ఉల్ హక్ కి చెంపపెట్టులా కోహ్లి పై LSG ట్వీట్
-
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
కే ఎల్ రాహుల్ అవుట్...ఎల్ఎస్ జీ లోకి కొత్త ప్లేయర్
-
కోచ్ లు డగౌట్ లో ఉండాలి.. గ్రౌండ్ లో ఏం పని
-
కోహ్లీ, గంభీర్ ఫైట్... బీసీసీఐ సీరియస్...!
-
పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి గంభీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. వీరిద్దరూ మరోసారి జెంటిల్ మేన్ గేమ్‌ని వీధిపాలు చేశారు. ఏం జరిగిందంటే? ఈ ఏడాది సీజన్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత గంభీర్ నోటి మీద వేలు వేసుకొని.. ఇక నోరు మూసుకోండి అన్నట్టుగా సైగ చేశాడు. ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో కోహ్లి రివేంజ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగినట్లు సృష్టంగా కన్పించింది. లక్నో వికెట్లు పడినప్పుడు దూకుడుగా సెల్రబేషన్స్ చేయడం, ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం లాంటివి చేశాడు. ఈ క్రమంలో లక్నో ఇన్నింగ్స్ 17 ఓవర్లో పేసర్ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య చిన్న పాటి మాటల యుద్దం జరిగింది. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడువ సద్దుమణిగింది. అయితే అది అక్కడతో ఆగలేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చే సమయంలో మళ్లీ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్‌ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. చదవండి: #Kohli, Gambhir Fight: గౌతం గంభీర్, విరాట్ కోహ్లికి బిగ్ షాక్.. భారీ జరిమానా పో నేనేం సారీ చెప్పను.. ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్ కోహ్లి, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన నవీన్ ఉల్-హక్‌ను కోహ్లికి క్షమాపణ చెప్పమని రాహుల్ అడిగాడు. అయితే నవీన్ మాత్రం నేనేం సారీ చెప్పను పో అన్నట్టుగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇంత తలపొగరా? ఇక నవీన్ ఉల్-హక్ ప్రవర్తనపై విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో ఇటువంటి సహజం. దాన్ని సీరియస్‌గా తీసుకుని సారీ చెప్పకపోవడం ఏంటి? మరి ఇంత తలపొగరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: IPL 2023: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. కింగ్ ఏం చేశాడంటే? Naveen😭😭😭 king ko apne ling pe rakh raha pic.twitter.com/O4Qf0tVZyz — Masum💛 (@chicken_heartz) May 1, 2023 The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
గౌతం గంభీర్, విరాట్ కోహ్లికి బిగ్ షాక్.. భారీ జరిమానా
లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే గొడవపడ్డ విరాట్ కోహ్లి, గౌతం గంభీర్‌లకు బిగ్ షాక్ తగిలింది. వీరిద్దరితో పాటు గొడవకు పరోక్షంగా కారణమైన నవీన్-ఉల్-హక్లకు ఐపీఎల్ నిర్వహకులు భారీ జరిమానా విధించారు. కోహ్లి, గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం.. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కొత ఐపీఎల్ నిర్వహకులు విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఆర్టికల్ 2.21 కింద ఈ ముగ్గిరికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏం జరిగిందంటే? మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. షేక్ హ్యండ్ ఇచ్చే సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ మధ్య ఏదో వాదన జరిగింది. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్‌ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆర్సీబీ సంచలన విజయం ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్‌వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో బౌలర్లు చెలరేగడంతో కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. లక్నోబౌలర్లలో నవీనుల్ హఖ్ మూడు వికెట్లు పడగొట్టగా, బిష్ణోయ్, మిశ్రా తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: #Kohli Gambhir Fight: మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్ The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్‌వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. గంభీర్, కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం ఇక ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవను ఇది గుర్తుకు తెచ్చింది. అయితే ఇందులో నేరుగా గంభీర్ పాత్ర లేకపోయినా...అతని జోక్యంతో పరిస్థితి కాస్త వేడిగా మారింది. బెంగళూరు విజయం తర్వాత షేక్ హ్యాండ్ల సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ (అఫ్గానిస్తాన్) మధ్య ఏదో వాదన జరిగింది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. అయితే ఆ తర్వాత నవీన్‌ను పిలిచి కోహ్లి ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందుగా కైల్ మేయర్స్ (వెస్టిండీస్), ఆ తర్వాత గంభీర్ తమ ఆటగాడికి అండగా నిలుస్తూ మధ్యలోకి వచ్చారు. దాంతో కోహ్లి, గంభీర్ తీవ్రంగా వాదించుకున్నారు. చివరకు రాహుల్, మిశ్రా జోక్యం చేసుకొని విడిపించాల్సి వచ్చింది. ఆ తర్వాతా కోహ్లి పదే పదే ఇదే విషయాన్ని రాహుల్‌కు ఫిర్యాదు చేయడం కనిపించింది. నిజానికి గత మ్యాచ్‌లో గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో నోరు మూయమంటూ ప్రేక్షకులను ఉద్దేశించి గంభీర్ సైగ చేయగా...ఈసారి గెలుపు బాటలో కోహ్లి అదే తరహాలో సైగ చేస్తూ దానిని గుర్తు చేయడం కూడా ఒక కారణం కావచ్చు! ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి చదవండి: LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..! The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు! ఇక చాలు గౌతీ! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయం సాధించింది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(72), కైల్ మైర్స్(54), పూరన్(45) విధ్వంసం సృష్టించారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. ఎట్టకేలకు నవ్విన గౌతం గంభీర్ ఇక ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ ఎట్టకేలకు నవ్వాడు. గౌతీ తన మైదానంలో తన హావభావాలను వ్యక్తం చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ పంజాబ్‌పై లక్నో విజయం సాధించడంతో గంభీర్ ఖుషీగా ఉన్నాడు. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఔటైన వెంటనే గంభీర్ నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియో సినిమా సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు, ఇక చాలు గౌతీ అంటూ కామెంట్ చేశాడు. చదవండి: IPL 2023: అంత మంచి క్యాచ్ పట్టి అలా చేశావు ఏంటి? వీడియో వైరల్ A performance that made Gambhir smile 😏#PBKSvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/NNKUBdr8Ky — JioCinema (@JioCinema) April 28, 2023 -
డివిలియర్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్!
దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది అభిమానులను డివిలియర్స్ సంపాందించుకున్నాడు. తన విధ్వంసకర ఆట తీరుతో అభిమానులను మంత్రముగ్ధులను చేసేవాడు. ఫ్యాన్స్ అతడిని ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారు. అదే విధంగా తన సొంత దేశం దక్షిణాఫ్రికా తర్వాత ఇష్టమైనది ఇండియానే అని చాలా సందర్భాల్లో ఏబీడీ కూడా తెలిపాడు. అటువంటి డివిలియర్స్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వివాదాస్పద వాఖ్యలు చేశాడు. డివిలియర్స్ కేవలం వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే ఆడాడని సంచలన కామెంట్స్ చేశాడు. "చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న మైదానంలో ఎబీ డివిలియర్స్ దాదాపు 8 నుంచి 10 ఏళ్ల పాటు ఆడాడు. అటువంటి ఏ ఆటగాడికైనా స్ట్రైక్ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఐపీఎల్లో డివిలియర్స్ కంటే సురేష్ రైనా అద్భుతమైన ఆటగాడు. అతడు వ్యక్తిగత రికార్డులతో పాటు నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉన్నాడు. కానీ డివిలియర్స్ మాత్రం కేవలం వ్యక్తిగత రికార్డులు మాత్రమే కలిగి ఉన్నాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. ఇక వివాదాస్పద వాఖ్యలు చేసిన గంభీర్‌పై ఏబీడీ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక తన ఐపీఎల్ కెరీర్లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 5162 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలతో పాటు 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: WPL 2023 MI VS GG: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన హర్మన్ -
రోహిత్ చేసిందేమీ లేదు.. కేవలం కోహ్లిని ఫాలో అవుతున్నాడంతే!
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరేందుకు మార్గం మరింత సుగమం అయ్యింది. ఇక పరిమిత ఓవర్లలో టీమిండియా సారథిగా విజయవంతమైన రోహిత్ శర్మ.. టెస్టుల్లో కూడా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే, జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన ఇప్పుడే అంచనాకు రావడం కష్టమే. కెప్టెన్‌గా పూర్తి స్థాయి టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి అయినా రోహిత్ తన ముద్ర వేయగలిగాడు. ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా హిట్‌మ్యాన్ అద్భుతంగా రాణించాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రోహిత్.. రెండు టెస్టులో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో సారథిగా ఆస్ట్రేలియాను మట్టికరిపించిన రోహిత్ శర్మపై సర్వాత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల టెస్ట్ కెప్టెన్సీ మధ్య పెద్దగా తేడాలు లేవని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో సారథిగా కోహ్లి వ్యూహాలనే రోహిత్ అనుసరిస్తున్నాడని అతడు చెప్పుకొచ్చాడు. 'నిజం చెప్పాలంటే.. రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య పెద్దగా తేడా లేదు. గతంలో విరాట్ కూడా ఇటువంటి వ్యూహాలనే రచించేవాడు. ఇప్పుడు రోహిత్ కూడా విరాట్ శైలినే అనుసరిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా రోహిత్‌కు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల పర్యటనలకు వెళ్లినప్పుడు అసలైన సవాలు ఎదురవుతుంది. ఎందుకంటే గతంలో కోహ్లికి కూడా విదేశీ పర్యటనలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ అక్కడ విరాట్ సారథిగా విజయవంతమయ్యాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్, విరాట్‌లలో ఎవరు అత్యుత్తమ కెప్టెన్ అని ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకంటే రోహిత్ విదేశీ గడ్డపై సారథిగా ఎలా రాణిస్తాడో ఇప్పుడే నేను అంచనా వేయలేను" అని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ -
సచిన్‌తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు
కొత్త ఏడాదిని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో విరాట్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 113 పరుగులు చేశాడు. కాగా విరాట్‌కు ఇది 45వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. సచిన్‌కు 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. అదే విధంగా స్వదేశంలో అత్యధిక సెంచరీల చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లి(20) సమం చేశాడు. దీంతో విరాట్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిస్తోంది. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చడం సరికాదు అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ కాలంలో ఫీల్డ్ ఆంక్షలు బ్యాటర్లకు అంత అనుకూలంగా లేనందున పరుగులు చేయడం కష్టమని గంభీర్ తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "కోహ్లిని సచిన్‌తో పోల్చడం సరికాదు. సచిన్ క్రికెట్ ఆడే కాలంలో ఫీల్డ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఫీల్డ్‌లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల 5 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లు ఉండేవారు. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉండేది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND VS SL 1st ODI: రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..? -
కెప్టెన్‌గా తొలి ఓటమి.. హార్దిక్ పాండ్యాపై గంభీర్ కీలక వాఖ్యలు
పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక టీ20ల్లో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ఇదే తొలి ఓటమి కూడా. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వాఖ్యలు చేశాడు. భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడని గంభీర్ కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "హార్దిక్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అయితే ప్రతీ మ్యాచ్ తర్వాత అతడి కెప్టెన్సీ గురించి మనం చర్చించకూడదు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనంతమాత్రాన హార్దిక్ ఏదో తప్పు చేశాడని భావించడం సరికాదు. అతడు నో-బాల్స్ వేయకుండా బౌలర్లను నియంత్రించలేడు కదా. అది బౌలర్ బాధ్యత. ఇప్పటివరకు అతడు సారథిగా వ్యవహరించినా ప్రతీ మ్యాచ్‌లోనే తన కెప్టన్సీ మార్క్‌ను చూపించాడు. అతడు ఫీల్డ్‌లో చాలా కూల్‌గా ఉంటాడు. హార్దిక్ తన సహాచర ఆటగాళ్లకు మద్దతుగా కూడా ఉంటాడు" అని పేర్కొన్నాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో శనివారం రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. చదవండి: IND Vs SL: శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్‌దీప్, గిల్‌కు నో ఛాన్స్! పేసర్ ఎంట్రీ -
బాబర్‌పై గంభీర్ తీవ్ర విమర్శ, ఆఫ్రిది గట్టి కౌంటర్.. టోర్నీ అయ్యాక చెబుతా!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాబర్ 'స్వార్థపరుడు' అంటూ గంభీర్ మండిపడ్డాడు. ఇక గంభీర్ చేసిన వాఖ్యలపై తాజాగా పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. ఆటగాళ్లపై విమర్శలు చేసే ముందు మనం ఏ మాట్లడాతున్నామో తెలుసుకోవాలని ఆ సూచించాడు. సమా టీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ.. "టోర్నీ అయ్యాక గంభీర్ గురించి ఏమి మాట్లాడాలో బాబర్‌కు చెబుతాను. ఎందుకంటే.. భారత్ కూడా టోర్నీ నుంచి ఇంటికి వెళ్లాల్సిందే కదా? గంభీర్ ఏమి అంత గొప్ప ఆటగాడు ఏమి కాదు. కాగా ఆటగాళ్లపై విమర్శలు చేయడం సహజం. కానీ వ్యక్తిగతంగా ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే వాఖ్యలు ఆటగాడిగా సలహాగా ఉండాలి కానీ, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. బాబర్ విషయానికి వస్తే.. తన కెరీర్లో ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించాడు. అతడి లాంటి అద్భుతమైన ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అతడు ఈ టోర్నీలో తన అంచనాలను అందుకోలేకపోయాడు. అంతమాత్రాన అతడిని మర్శించడం సరికాదు" అని అతడు పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్- భారత్ మ్యాచ్ గురించి షాహిద్ మాట్లాడుతూ.. "టీ20 ఫార్మాట్లో ఏ జట్టు అయినా ఇతర జట్టును కలవరపెడుతుంది. కానీ భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా జట్టుకు చాలా అనుభవం కూడా ఉంది. అయితే గతంలో బంగ్లాదేశ్ జట్టులో కూడా స్టార్ ఆటగాళ్లు ఉండేవారు. అయితే ప్రస్తుతం షకీబ్ కెప్టెన్సీలో అటువంటి ఆటగాళ్లు ఎవరూ కనిపించడంలేదు. షకీబ్ కూడా తన స్థాయికి తగ్గట్టూ రాణించడంలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయాకాశాలు భారత్‌కే ఎక్కువ ఉన్నాయి" అని అతడు తెలిపాడు. చదవండి: పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు..! -
'బాబర్ అజం స్వార్దపరుడు.. కేవలం రికార్డుల కోసం మాత్రమే'
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్ ఎట్టకేలకు ఒక విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు వరుస ఓటముల తర్వాత.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ గెలుపు రుచి చూసింది. ముఖ్యంగా జింబ్వాబ్వే చేతిలో ఓటమి తర్వాత.. పాకిస్తాన్ జట్టుపై విమర్శల వర్షం కురిసింది. జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ అజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా బాబర్ అజంపై కీలక వాఖ్యలు చేశాడు. బాబర్ జట్టు కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి ఉండాల్సిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో బాబర్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో అయితే ఏకంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో గంభీర్ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. "బాబర్ తన కోసం కాకుండా జట్టు కోసం ఆలోచిస్తే బాగుంటుంది. ఓపెనర్‌గా అతడు దారుణంగా విఫలమవుతున్నప్పుడు.. ఆ స్థానంలో ఫఖర్ జమాన్‌ను అవకాశం ఇవ్వాలి కదా?. దీనినే స్వార్థం అంటారు. కెప్టెన్‌గా ఎప్పుడూ స్వార్థపూరితంగా ఆలోచించకూడదు. బాబర్, రిజ్వాన్ ఓపెనర్లుగా ఎన్నో రికార్డులు సృష్టించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జట్టుకు ఏది అవసరమో గ్రహించి సరైన నిర్ణయం తీసుకునే వాడే నిజమైన లీడర్. ఇప్పటికైనా మీ రికార్డులు గురించి కాకుండా జట్టు కోసం ఆలోచించండి" అని పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది మెగా ఈవెంట్లో పాకిస్తాన్ దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియాలో మూడు మార్పులు! -
'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్ బ్యాటర్'
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్ము రేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో వరుస అర్ద సెంచరీలతో విరాట్ దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి(82 నాటౌట్).. అనంతరం నెదర్లాండ్స్‌పై (62 నాటౌట్) కూడా అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 144 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా కింగ్ కోహ్లి కొనసాగుతున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియాలో బెస్ట్ బ్యాటర్ ఎవరంటే టక్కున గుర్తు వచ్చేది విరాట్ కోహ్లినే. గానీ ఇందుకు భిన్నంగా భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించాడు. గంభీర్ కోహ్లీపై మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న గంభీర్‌కు.. ప్రస్తుత భారత జట్టులో బెస్ట్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా..టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్‌ను మించిన ఆటగాడు ఎవరూ లేరని గంభీర్ సమాదానిమిచ్చాడు. "ప్రస్తుత భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను మించిన ఆటగాడు ఎవరూ లేరు. రోహిత్, రాహుల్, కోహ్లిలా తొలి ఆరు ఓవర్లలో(పవర్ ప్లే)లో బ్యాటింగ్ చేసే సదుపాయం సూర్యకు లేదు. అతడు బ్యాటింగ్ చేసేటప్పడు మైదానం నలుమూలల ఫీల్డర్లు ఉంటారు. అటువంటి సమయంలో భారీ షాట్లు ఆడి, అవతలి ఆటగాడికి ఒత్తిడి తగ్గించడం అంత సులభం కాదు. భారత జట్టులో ఎదుర్కొన్న తొలి బంతికి బౌండరీ కొట్టగలిగే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు యాదవ్ మాత్రమే. విరాట్ కోహ్లి, రోహిత్ సూర్యలా ఆడాలేరు. అదే విధంగా రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కోహ్లిలపై ఒత్తిడిని సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే తగ్గించగలడు. మిడిలార్డర్లో సూర్య ఉన్నాడు కాబట్టే అందుకే ఈ ముగ్గురూ తమకు నచ్చిన విధంగా ఆడతారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బాగా రాణిస్తే ఈ ఏడాది వరల్డ్ కప్‌ను భారత్ గెలవడం అంత కష్టం ఏమి కాదు. ఇక టాప్ 3లో రోహిత్, రాహుల్ విరాట్, హాఫ్ సెంచరీలు చేస్తారు, సెంచరీలు కొడతారు. కానీ వీరికంటే సూర్య, హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్‌లే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి" అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి' -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్, అశ్విన్‌కు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2022లో దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్ను భారత మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేరాడు. ఈ బ్లాక్ బ్లస్టర్ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎల్వన్ను గంభీర్ అంచనా వేశాడు. కాగా పాక్‌తో పోరుకు టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను గంభీర్ ఎంపిక చేశాడు. అతడు ఎంచుకున్న జట్టులో దినేష్ కార్తీక్‌కు చోటు దక్క లేదు. ఇక తన అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మను గౌతీ ఎంపిక చేశాడు. అదే విధంగా మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు గంభీర్ ఛాన్స్ ఇచ్చాడు. కాగా తన ప్రకటించిన జట్టులో ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను గంభీర్ ఎంచుకున్నాడు. తన జట్టులో స్ఫెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్‌ను కాదని యుజువేంద్ర చాహల్ అవకాశం ఇచ్చాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్, షమీతో పాటుగా భువనేశ్వర్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లో ఒకరికే తుది జట్టులో జట్టు దక్కుతుందిని గంభీర్ అభిప్రాయపడ్డాడు. పాక్‌తో మ్యాచ్‌కు గౌతీ అంచనా వేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. టీ20 వరల్డ్‌కప్-2022 బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! -
విధ్వంసం సృష్టించిన టేలర్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా గంభీర్ సేన
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇండియా క్యాపిటిల్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు రాస్ టేలర్, మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్ టేలర్, జాన్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టేలర్ 41 బంతుల్లో 82 , జాన్సెన్ 35 బంతుల్లో 62 పరుగులు సాధించారు. కాగా టేలర్ ఇన్నింగ్స్‌లో 4 పోర్లు, 8 సిక్స్‌లు ఉండటం గమానార్హం. ఇక అఖరిలో నర్స్(19 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భిల్వారా కింగ్స్ బౌలర్లలో రాహుల్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పనేసర్ రెండు, బ్రెస్నెన్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భిల్వారా కింగ్స్.. 18.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. భిల్వారా బ్యాటర్లలో షేన్ వాట్సన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో పంకజ్ సింగ్, ప్రవీణ్ తాంబే, పవన్ సయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ప్లంకెట్, భాటియా చెరో వికెట్ సాధించారు. Time for #legendary Celebrations! 🥳@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/XBFMJtj6Zf — Legends League Cricket (@llct20) October 5, 2022 చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్ -
చెలరేగిన జింబాబ్వే బ్యాటర్.. టైగర్స్‌పై గంభీర్ సేన ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కటక్ వేదికగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇండియా క్యాపిటల్స్ విజయ భేరి మోగించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి గంభీర్ సేన.. 17.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇండియా క్యాపిటల్స్ బ్యాటర్లలో హామిల్టన్ మసకద్జా మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 4సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మణిపాల్ బౌలర్లలో ఫెర్నాండో, మురళీధరన్, మూఫు తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మణిపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మణిపాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జెస్సీ రైడర్ (79), కైఫ్(67) పరుగులతో రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ప్లంకెట్, భాటియా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానంలో నిలిచింది. చదవండి: IND vs SA: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్.. తొలి భారత కెప్టెన్‌గా -
భారత జట్టులో వారిద్దరి కంటే రాహుల్‌కే ఎక్కువ సత్తా: గంభీర్
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాలలో భాగంగా స్వదేశంలో టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబర్20) జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభంకు ముందు భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు మెగా ఈవెంట్స్‌లో ఆడేటప్పుడు వ్యక్తిగత మైలురాళ్లపై దృష్టి పెట్టకూడదని, జట్టు గెలుపు కోసం మాత్రమే పోరాడాలని గంభీర్ తెలిపాడు. "ఎవరో ఒకరు జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలి. దానిని మిగితా ఆటగాళ్లు కొనసాగించాలి. అయితే ఆసియాకప్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చి సెంచరీ సాధించాడు. దీంతో విరాట్ ఓపెనర్‌గా రావాలని చర్చలు మొదలయ్యాయి. అంటే ఇన్నాళ్లూ ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అందించిన అద్భుతమైన బాగస్వామ్యాలను మనం మరిచిపోయాం. ఇటువంటి అనవసర చర్చలతో రాహుల్ కీలక ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేయవద్దు. నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ, కోహ్లి కంటే రాహుల్‌కే ఎక్కువ సత్తా ఉంది. రాహుల్ ఆటను ఇప్పటికే మనం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కూడా చూశాం. అదే విధంగా ఏ ఈవెంట్లోనైనా ఆటగాళ్లు జట్టు విజయంపైనే మాత్రమే దృష్టి సారించాలి తప్ప.. వ్యక్తిగత రికార్డులు కోసం మాత్రం ఆలోచించకూడదని" గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. చదవండి: టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది: రోహిత్ శర్మ -
టీమిండియా ఓపెనర్‌గా అతడు వద్దు: గౌతం గంభీర్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసియాకప్-2022తో తిరిగి గాడిలో పడ్డాడు. ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన విరాట్.. తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. అదే విధంగా దాదాపు 1000 రోజుల తర్వాత తన 71వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో ఓపెనర్ వచ్చిన కింగ్ కోహ్లి.. దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 122 పరుగులు సాధించి ఆజేయం నిలిచాడు. దీంతో టీ20ల్లో భారత ఓపెనర్‌గా కోహ్లిని పంపించాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ మాత్రం కోహ్లిని ఓపెనర్‌గా పంపాలన్న చర్చలను కొట్టిపారేశాడు. విరాట్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానమే సరైనది అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్‌ప్లాన్'లో భాగంగా గంభీర్ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి భారత బ్యాకప్ ఓపెనర్ మాత్రమే. కోహ్లిని ఓపెనర్‌గా పంపించాలన్న కొత్త చర్చలను ప్రారంభించవద్దు. జట్టులో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఉంటే విరాట్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ రాదు. అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే సరిపోతుంది. ఒక వేళ ఓపెనర్లు 10 ఓవరర్ వరకు బ్యాటింగ్ చేస్తే.. అప్పుడు మూడో స్థానంలో కోహ్లికి బదులుగా సూర్యకుమార్ యాదవ్‌ను పంపించాలి. సూర్య దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును మరింత పరుగులు పెట్టిస్తాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు -
పాకిస్తాన్‌పై ఘన విజయం.. శ్రీలంక జెండాతో గంభీర్ సెలబ్రేషన్స్!
Asia Cup 2022 Winner Sri Lanka: ఆసియాకప్-2022 ఛాంపియన్స్‌గా శ్రీలంక అవతరించింది. ఈ మెగా ఈవెంట్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా టైటిల్‌ను ఎగరసేకిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో చిత్తు చేసి 6 వసారి ఆసియాకప్ విజేతగా లంక నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాక గ్రౌండ్లో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ శ్రీలంక జెండా పట్టుకోని సంబురాలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక జాతీయ జెండా పట్టుకోని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. కాగా గంభీర్ ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గంభీర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత, ఆఫ్గనిస్తాన్ అభిమానులు లంకేయుల విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శ్రీలంకకు అభినందనలు తెలుపుతూ.. మరోవైపు పాకిస్తాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్ సూపర్-4 దశలోనే భారత్, ఆఫ్గనిస్తాన్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe — Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022 చదవండి: Asia Cup 2022 Final: అందుకే శ్రీలంక చేతిలో ఓడిపోయాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం