భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ అంటే ఎవరైనా సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతారు. లేదంటే ప్రస్తుత తరంలో అయితే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వైపు మొగ్గు చూపుతారు. కానీ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ దృష్టిలో వీరిద్దరిలో ఎవరూ కూడా బెస్ట్ బ్యాటర్ కాదంటా. విషయంలోకి వెళ్తే తాజాగా వివేక్ బింద్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది బడా భారత్ షోలో గౌతం గంభీర్ పాల్గోనున్నాడు.
ఇప్పటివరకు భారత క్రికెట్‌లో మీ అత్యుత్తమ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న గంభీర్‌కు ఎదురైంది. అందుకు ఆప్షన్స్‌గా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేర్లను వివేక్ బింద్రా ఇచ్చాడు. గంభీర్ మాత్రం బిన్నంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భారత్ తరఫున బెస్ట్ బ్యాటర్ అని తన సమాధనమిచ్చాడు.
అదే విధంగా టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరన్న విషయంలోనూ గంభీర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. భారత బెస్ట్ కెప్టెన్ ఎవరంటూ కపిల్ దేవ్, గంగూలీ, ధోనీ, కోహ్లి పేర్లను ఆప్షన్లుగా ఇవ్వగా.. గంభీర్ మాత్రం అనిల్ కుంబ్లేను ఎంచుకున్నాడు. కాగా గంభీర్ తన చర్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసియాకప్‌లో అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించి గంభీర్ తీవ్ర విమర్శల పాలయ్యాడు.
చదవండి: BCCI: ‘టీమిండియా హెడ్‌కోచ్ పదవి వద్దు’.. ఆసక్తి లేదన్న మాజీ పేసర్! కారణమిదేనా?
Comments
Please login to add a commentAdd a comment