బంగ్లాతో టెస్టు సిరీస్‌.. గంభీర్ మాస్ట‌ర్ ప్లాన్‌! ఏంటంటే? | Gambhir, Morkel bring in LSG pacer Yudhvir Singh as net bowler for IND vs BAN Tests | Sakshi
Sakshi News home page

IND vs BAN: బంగ్లాతో టెస్టు సిరీస్‌.. గంభీర్ మాస్ట‌ర్ ప్లాన్‌! అతడికి పిలుపు

Published Mon, Sep 9 2024 10:34 AM | Last Updated on Mon, Sep 9 2024 12:58 PM

Gambhir, Morkel bring in LSG pacer Yudhvir Singh as net bowler for IND vs BAN Tests

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ద‌మ‌వుతోంది. తాజాగా బంగ్లాతో సిరీస్‌కు 16 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును కూడా బీసీసీఐ ప్ర‌క‌టించింది.సెప్టెంబ‌ర్ 19 నుంచి చెన్నై వేదిక‌గా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌కు ముందు భార‌త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ ఓ కీల‌క నిర్ణయం తీసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ యుధ్వీర్ సింగ్ టీమిడియా నెట్ బౌల‌ర్‌గా ఎంపిక‌చేశాడు. కొత్త‌ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్క‌ల్ స‌ల‌హా మేర‌కు గంభీర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

కాగా యుద్ద్‌వీర్ అద్బుత‌మైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న యుధ్వీర్‌.. గ‌తేడాది సీజ‌న్‌లో గౌతం గంభీర్‌, మోర్క‌ల్ ఆధ్వ‌ర్యంలో అరంగేట్రం చేశాడు.

అప్పుడు గంభీర్ లక్నో మెంటార్‌గా ఉండ‌గా.. మోర్క‌ల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే యుధ్వీర్ త‌న ప్ర‌తిభ‌తో మోర్క‌ల్ ఆక‌ట్టుకున్నాడు. గంట‌కు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే స‌త్తా అత‌డికి ఉంది. ఈ నేప‌థ్యంలోనే నెట్‌బౌలర్‌గా అత‌డి సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని గంభీర్ అండ్ కో భావిస్తున్నారు. దీంతో అత‌డు చెన్నై వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టుకు ముందు భార‌త జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. 

కాగా బంగ్లాతో సిరీస్‌కు ఎంపికైన‌ ఆట‌గాళ్లంద‌రూ సెప్టెంబ‌ర్ 12న చెన్నైలో స‌మావేశం కానున్నారు. బంగ్లాతో తొలి టెస్టు కోసం చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా ఆట‌గాళ్లు పాల్గోనున్నారు. 

ఈ ప్రాక్టీస్ శిబిరంసెప్టెంబర్ 13 నుండి 18 వరకు కొనసాగుతుంది.  కాగా ముంబై యువ ఆఫ్ స్పిన్న‌ర్  హిమాన్షు సింగ్‌ను కూడా నెట్ బౌల‌ర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అతడు కూడా భారత క్యాంపులో చేరనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, కోహ్లి, కేఎల్‌ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్, రిషభ్‌ పంత్, ధ్రువ్‌ జురెల్, రవిచంద్రన్‌ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్, మహమ్మద్‌ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్‌ బుమ్రా, యశ్‌ దయాల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement