గౌతం గంభీర్ కీల‌క నిర్ణ‌యం!? | Indian Players To Follow Strict Guidelines Before Mumbai Test | Sakshi
Sakshi News home page

IND vs NZ: రెండో టెస్టులో ఘోర ఓట‌మి.. గౌతం గంభీర్ కీల‌క నిర్ణ‌యం!?

Published Sun, Oct 27 2024 11:03 AM | Last Updated on Sun, Oct 27 2024 11:38 AM

Indian Players To Follow Strict Guidelines Before Mumbai Test

పుణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో 113 ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలూండ‌గానే 2-0 టీమిండియా కోల్పోయింది. దీంతో సొంత‌గ‌డ్డ‌పై 12 ఏళ్ల భార‌త టెస్టు సిరీస్ విజ‌యాల ప‌రంపంర‌కు బ్రేక్ ప‌డింది. అంతేకాకుండా ఈ ఓట‌మితో భార‌త్‌ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు కూడా సన్నగిల్లాయి. 

ఇక తొలి రెండు టెస్టుల్లో ఓట‌మి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు సిరీస్‌లో ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌కు సిద్ద‌మైంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదిక‌గా ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి త‌ప్పించుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో నిలబడాలంటే ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు మేనేజ్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల్సింది.

నో ఛాయిస్‌..!
న్యూజిలాండ్‌తో ఆఖ‌రి టెస్టుకు ముందు ప్ర‌తీ ఒక్క‌రూ ట్రైనింగ్ సెష‌న్‌లో కచ్చితంగా  పాల్గోవాలని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తమ ఆటగాళ్లకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదని గంభీర్ స్పష్టం చేశాడంట. 

కాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు పుణే నుంచి ఆదివారం(ఆక్టోబర్ 27) ముంబైకి చేరుకోనుంది. ఆటగాళ్లకు  టీమ్ మేనేజ్‌మెంట్ రెండు రోజుల విశ్రాంతిని కేటాయించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా పాల్గోనుంది. 

ఈ రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రాక్టీస్‌ క్యాంపులో భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించనున్నారు. స్పిన్నర్లను ఎదుర్కొవడంతో తడబడుతున్న భారత జట్టు.. ఈ సన్నాహాక క్యాంపులో ఆ ఆంశంపై దృష్టిసారించే అవకాశముంది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. 92 ఏళ్ల భారత క్రికెట్‌ హిస్ట‌రీలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement