న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ సిరీస్ అయిన టీమిండియాకు ఆస్ట్రేలియా రూపంలో మరో కఠిన సవాలు ఎదురుకానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత జట్టు సన్నదమవుతోంది.
ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, సిరాజ్, ఆకాష్ దీప్, సుందర్‌లతో కూడిన ఫస్ట్ బ్యాచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. సోమవారం మిగిలిన ఆటగాళ్లు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆస్ట్రేలియా పయనం కానున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ముంబైలో విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ డౌటే: గంభీర్
"తొలి టెస్టుకు రోహిత్ అందుబాటుపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అతడు పెర్త్ టెస్టులో ఆడతాడానే ఆశిస్తున్నాను. మరి కొన్ని రోజుల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గురించి మేము ఎక్కువ ఆలోచించడం లేదు. గతంలో ఏమి జరిగిందనే విషయంతో కూడా మాకు సంబంధం లేదు. ప్రతీ సిరీస్ మాకు ముఖ్యమైనదే. ఎక్కడికి వెళ్లినా అద్బుతంగా ప్రదర్శన చేయడమే మా లక్ష్యం.
పెర్త్ టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపడతాడు. అదేవిధంగా ఈశ్వరన్, కేఎల్ రాహుల్‌లలో ఎవరో ఒకరు జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని" గౌతీ పేర్కొన్నాడు. కాగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్.
Comments
Please login to add a commentAdd a comment