పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ దిశగా సాగుతున్నాడు.
తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న జైశ్వాల్.. స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 172 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆసాదరణ ఇన్నింగ్స్ ఆడుతున్న జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన జైశ్వాల్..1170* పరుగులు చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరిట ఉండేది. 2008లో గంభీర్ ఒక క్యాలెండర్ ఈయర్‌లో 8 టెస్టులు ఆడి 1,134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గంభీర్ ఆల్‌టైమ్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా యశస్వి కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండ్ జోరూట్(1,338*) ఉన్నాడు.
చదవండి: IND vs AUS: జైశ్వాల్, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment