సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)ను ఆసీస్‌కు టీమిండియా సమర్పించుకుంది. బీజీటీ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను సైతం రోహిత్ సేన చేజార్చుకుంది.
ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత జట్టుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ప్లేయర్స్‌తో పాటు జట్టు మేనేజ్‌మెంట్ కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గంభీర్ అండ్ కో పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
"అస్సలు కోచ్‌లు ఏం చేస్తున్నారు? న్యూజిలాండ్‌పై కేవలం 46 పరుగులకు ఆలౌట్ అయ్యాం. జట్టు బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అప్పుడే ఆర్దం చేసుకోవచ్చు. కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్‌కు సరైన ప్రణాళికలతో వెళ్లాల్సింది. కానీ కోచ్‌లు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు.
ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా బ్యాటర్ల ఆట తీరు మెరుగు పడలేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు కోచ్‌లే సమాధనమివ్వాలి. ఆటగాళ్లతో పాటు కోచ్‌ల పనితీరును కూడా అంచనా వేయాలి. మంచి బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో కోచ్‌లు ప్లాన్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్‌ను ఆర్డర్‌ను మార్చారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌కు బదులుగా కోచ్‌లను మారిస్తే బెటర్ అన్పిస్తోంది.
ప్రతీ ఒక్కరూ బ్యాటర్లను మాత్రమే తప్పుబడుతున్నారు. కానీ కోచ్‌లను కూడా ప్రశ్నించాలన్నది నా అభిప్రాయం. ఈ ఆరు నెలల్లో వారేమి చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. దీనికి వారే సమాధానం చెప్పాలి" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ ఫైరయ్యాడు. గంభీర్ నేతృత్వంలో పది టెస్టులు ఆడిన భారత్ ఆరింట ఓటమి చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌లను కోల్పోయింది.
చదవండి: ధోని కెప్టెన్సీలో ఎంట్రీ.. కట్ చేస్తే! రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment