టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్, హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 34 ఏళ్ల రిషి ధావన్ వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నిధావన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 గ్రూపు స్టేజి నుంచి హిమాచల్ ప్రదేశ్ నిష్క్రమించిన వెంటనే ధావన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
"పరిమిత ఓవర్ల క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా బాధగా ఉంది. కానీ అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత 20 ఏళ్లగా క్రికెట్ నా జీవితంలో భాగమైంది. ఈ క్రీడ నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చింది.
బీసీసీఐ (BCCI), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA), పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ధన్యవాదాలు. అత్యున్నత స్ధాయిలో నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు ఎల్లప్పుడూ గర్వకారణం" అంటూ ఇన్‌స్టాలో ధావన్ రాసుకొచ్చాడు. ధావన్ ఇకపై రెడ్‌బాల్ క్రికెట్‌లో మాత్రం ఆడనున్నాడు.
ధోని సారథ్యంలో అరంగేట్రం..
కాగా ఈ హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ 2016లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రిషి.. తన కెరీర్‌లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లన్నీ 2016లోనే అతడు ఆడాడు. ఆ తర్వాత అతడికి ఛాన్స్‌లు లభించలేదు. భారత తరపున అతడు కేవలం 2 వికెట్లు మాత్రమే సాధించాడు.
దేశవాళీ క్రికెట్‌లో అదుర్స్..
దేశవాళీ క్రికెట్‌లో మాత్రం రిషి ధావన్‌కు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి సారథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీ(2021-22)ని గెలుచుకుంది. ఆ సీజన్‌లో ధావన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 458 పరుగులతో పాటు17 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు.
తన కెరీర్‌లో 34 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 2906 పరుగులతో పాటు 186 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 135 టీ20ల్లో 1740 పరుగులతో పాటు 118 వికెట్లను అతడు సాధించాడు. మొత్తంగా 4,646 పరుగులు, 186 వికెట్లతో తన వైట్ బాల్ కెరీర్‌ను ధావన్ ముగించాడు. అదే విధంగా ధావన్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment