Himachal pradesh
-
టీమిండియా ప్లేయర్ షాకింగ్ రిటైర్మెంట్..
టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్, హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 34 ఏళ్ల రిషి ధావన్ వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నిధావన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 గ్రూపు స్టేజి నుంచి హిమాచల్ ప్రదేశ్ నిష్క్రమించిన వెంటనే ధావన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు."పరిమిత ఓవర్ల క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా బాధగా ఉంది. కానీ అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత 20 ఏళ్లగా క్రికెట్ నా జీవితంలో భాగమైంది. ఈ క్రీడ నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చింది.బీసీసీఐ (BCCI), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA), పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ధన్యవాదాలు. అత్యున్నత స్ధాయిలో నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు ఎల్లప్పుడూ గర్వకారణం" అంటూ ఇన్‌స్టాలో ధావన్ రాసుకొచ్చాడు. ధావన్ ఇకపై రెడ్‌బాల్ క్రికెట్లో మాత్రం ఆడనున్నాడు.ధోని సారథ్యంలో అరంగేట్రం..కాగా ఈ హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ 2016లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రిషి.. తన కెరీర్లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లన్నీ 2016లోనే అతడు ఆడాడు. ఆ తర్వాత అతడికి ఛాన్స్‌లు లభించలేదు. భారత తరపున అతడు కేవలం 2 వికెట్లు మాత్రమే సాధించాడు.దేశవాళీ క్రికెట్లో అదుర్స్..దేశవాళీ క్రికెట్లో మాత్రం రిషి ధావన్‌కు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి సారథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీ(2021-22)ని గెలుచుకుంది. ఆ సీజన్లో ధావన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 458 పరుగులతో పాటు17 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు.తన కెరీర్లో 34 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 2906 పరుగులతో పాటు 186 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 135 టీ20ల్లో 1740 పరుగులతో పాటు 118 వికెట్లను అతడు సాధించాడు. మొత్తంగా 4,646 పరుగులు, 186 వికెట్లతో తన వైట్ బాల్ కెరీర్‌ను ధావన్ ముగించాడు. అదే విధంగా ధావన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్ -
సిమ్లాలో ఘనంగా భుండా మహాయజ్ఞం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలోని స్పాల్ లోయలో అరుదైన, పురాతనమైన సంప్రదాయం మళ్లీ ప్రారంభమైంది. దేవంతలందరినీ ఏకం చేస్తుందని నమ్మే సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనను పునరుద్ధరించారు. సిమ్లాలోని మారుమూలమైన దల్గావ్లో ధారి్మక కార్యక్రమం ‘భుండా మహా యజ్ఞం’ జరిగింది. ఈనెల 2న ప్రారంభమైన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. నాలుగురోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్పాల్ లోయను కలుపుతూ ఉండే రెండు పర్వతాల మధ్య ముంజి(పవిత్రమైన తాడు)పై జారే కార్యక్రమం శనివారం నిర్వహించారు. మరణలోయగా పిలుచుకునే స్పాల్ లోయలో ఒక కొండ నుంచి మరో కొండకు కనీసం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. రెండు కొండలపైన ఉన్న వ్యక్తులు తాడును బిగ్గరగా పట్టుకోగా.. ఆ తాడును పట్టుకుని జారతారు. ఈ సాహసోపేతమైన కార్యక్రమాన్ని సూరత్ రామ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు శనివారం ఆ తాడు గుండా జారాడు. మరో అంచున ఉన్న వ్యక్తుల చేతిలో తాడు చేజారింది. వెంటనే పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది తరలివచ్చారు. -
ముఖ్యమంత్రి సమోసాలు ఎవరు తీసుకున్నారు?.. సీఐడీ దర్యాప్తు
‘నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నేనొచ్చిన కార్యక్రమానికి నాకు సమోసాలు పెట్టకుండా.. నా సిబ్బందికి పెడతారా? వెంటనే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారెవరో గుర్తించి, కఠిన చర్యలు తీసుకోండి’ అని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమోస స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించేందుకు వెళ్లారు. సీఎం సుక్కు పర్యటన రాక నేపథ్యంలో ఐజీ ర్యాంక్ అధికారి.. సీఎం వస్తున్నారు. వెంటనే స్నాక్స్ ఏర్పాటు చేయండి అంటూ ఎస్సైని ఆదేశించారు. దీంతో సదరు ఎస్సై (సమోసాలు సీఎం కోసమని చెప్పకుండా) .. తన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), హెడ్ కానిస్టేబుల్‌ను సమోసాలు తీసుకుని రావాలని పురమాయించారు. ఎస్సై ఆదేశాలతో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థానిక లక్కర్ బజార్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి మూడు పెట్టెల సమోసాలను తీసుకొచ్చారు. సీఎం సుక్కు కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడే ఉన్న ఏఎస్సై, కానిస్టేబుల్ తెచ్చిన సమోసాల్ని పక్కనే ఉన్న మహిళా ఎస్సైకి అందించారు. స్నాక్స్ పెట్టాలని కోరారు. మహిళా ఎస్సై ఆ సమోసాలను సీఎం కోసం తెచ్చినవే అని తెలియక బదులుగా సీఎం సిబ్బందిలోని మెకానికల్ ట్రాన్స్పోర్ట్ (ఎంటీ) విభాగానికి పంపించారు. ఆ విభాగంలోని ఉద్యోగులే ఆ సమోసాల్ని తిన్నారు.మీటింగ్‌లో ఉన్న సీఎంతోపాటు, సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. అధికారుల తీరుపై సీఎంతో పాటు సీఐడీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశాలకు జారీ చేశారు. -
‘క్షమించండి’ అని వేడుకున్నా.. కంగనాపై ఆగని విమర్శలు
ధర్మశాల : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మూడు వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ‘తప్పుగా మాట్లాడాను. క్షమించండి’ అని వేడుకున్నా అటు విపక్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఆగడం లేదు. ప్రధాని మోదీ స్వయంగా రద్దు చేసిన మూడూ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ తాజాగా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఖంఢించారు. కంగనా మాటలు నిరాధారామైనవని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచిని దెబ్బ తీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోదీ చేస్తున్న మంచిని దెబ్బతీయొద్దు‘‘కంగనా రనౌత్ స్టేట్మెంట్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనికిరాని, నిరాధారమైన,అసంబద్ధమైన ప్రకటనలు, పంజాబ్ రైతులు పంజాబ్, పంజాబీ సంక్షేమం కోసం మోదీ చేస్తున్న అన్ని మంచి పనులను, అందిస్తున్న సంక్షేమాన్ని దెబ్బ తీసేలా కంగనా వ్యవహరిస్తున్నారు’’ అని షెర్గిల్ మండిపడ్డారు. #WATCH | Delhi: On his tweet on actor & BJP MP Kangana Ranaut, party's national spokesperson Jaiveer Shergill says, "I am grateful to the BJP for distancing themself from the comments of Kangana Ranaut. But as a Punjabi, I must say that Kangana Ranaut's consistent rant, useless,… pic.twitter.com/jVa5qKJpe7— TIMES NOW (@TimesNow) September 25, 2024పంజాబ్, పంజాబ్ రైతులతో ప్రధాని మోదీకి ఉన్న బంధం విడదీయరానిది. మా పార్టీ ఎంపీ కంగనా చేసిన బాధ్యతా రహితమైన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ బంధాన్ని అంచనా వేయొద్దని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలిమంగళవారం కంగనా తన నియోజకవర్గం మండిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ‘రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలి. రైతులే దానిని డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.వ్యాఖ్యలు.. ఆమె వ్యక్తిగతంఆమె మాటలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వెల్లడించారు. పార్టీ తరుఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అధికారం లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కంగనా క్షమాపణలు చెప్పారు. అయినా బీజేపీ నేతలు మాత్రం కంగనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షెర్గిల్ సైతం ఖండించారు. చదవండి : సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు -
‘మీ పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పరిశుభ్రమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము’ అని పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.BIG NEWS 🚨 Himachal Congress Minister Vikramaditya Singh announces that all restaurants, food outlets will have to display owner’s identification. SHOCKING part is he referenced recent directive from CM Yogi Adityanath in his postYOGI MAGIC ACROSS INDIA 🔥🔥Yesterday CM… pic.twitter.com/J8YltyFvF4— Times Algebra (@TimesAlgebraIND) September 25, 2024పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో ఆహార లభ్యతపై ప్రజల్లో నెలకొన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త నిబంధనల్ని అమలు చేయాలని భావించినట్లు విక్రమాదిత్య సింగ్ చెప్పారు. 👉 చదవండి : రాష్ట్రంలో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్యూపీ యోగి సర్కార్ సైతంకాగా,మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేలా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు తినుబండరాలు అమ్మే ప్రదేశాల్లో యజమానులు, సిబ్బంది, చెఫ్‌లు తప్పని సరిగా మాస్క్‌లు, గ్లౌజ్స్ ధరించాలి. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు సిబ్బంది, ఇతర మేనేజర్లు ఇతర ఉద్యోగులు తప్పని సరిగా వారి వివరాల్ని మెనూ కార్డ్‌లో ప్రదర్శించాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మాకు జీతాలేం వద్దు.. సీఎం, మంత్రుల తీర్మానం
రాష్ట్రంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్), క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.రానున్న రెండు నెలలపాటు జీతాలు, టీడీ, డీఏలు తీసుకోబోమని కేబినెట్లో చర్చించిన తర్వాత మంత్రివర్గంలోని సభ్యులంతా నిర్ణయించారు’ అని సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్-ఆగస్ట్ నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి.100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్‌లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రెండు నెలల పాటు తమ జీత భత్యాల్ని తీసుకోమని తీర్మానించారు. -
విజయం దిశగా కంగనా? మండీ క్వీన్ ఇంట్లో సంబరాలు
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల ఫలితాల ట్రెండ్ వెలువడుతోంది. రాష్ట్రంలోని హాట్ సీట్ అయిన మండీపైనే అధికంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ హాట్ సీటు నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె తొలిసారి ఎన్నికల పోరులో దిగారు. ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్‌లో వెనుకంజలో ఉన్నా, ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను ఆమె అధిగమిస్తూ వస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు. వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ హిమాచల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ జెండా ఎగురవేయనుంది. మండీ లోక్‌సభ సీటు నుంచి కంగనాకు గెలవనున్నారనే అంచనాలున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఒక సీటు కాంగ్రెస్‌కు దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల్లో కంగనా విజయపథాన దూసుకుపోతుండటంతో ఆమె ఇంటిలో సంబరాల వాతావరణం నెలకొంది. -
ప్రపంచంలోనే ఎత్తయిన పోలింగ్ స్టేషన్లో ఓట్ల పండుగ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్ హిమాలయాల శిఖరాలపై 15,256 అడుగుల ఎత్తులోని తాషిగ్యాంగ్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు. అయినా ఇక్కడ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని స్పితి వ్యాలీ.. హిమాచల్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది మండీ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై బీజేపీ నుంచి నటి కంగనా రనౌత్ పోటీకి దిగారు.తాషిగ్యాంగ్‌లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్‌లో 62 మంది ఓటు వేయనున్నారు. తాషిగ్యాంగ్‌లో పోలింగ్ నిర్వహించడం ఇది నాలుగోసారి. అదనపు జిల్లా కమిషనర్ జైన్ మాట్లాడుతూ 2022లో విపరీతమైన చలి ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన అర్హులైన ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. -
మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM— ANI (@ANI) June 1, 2024 -
ముగిసిన లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్
Lok Sabha Election 2024 Phase 7 Updates.. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ 58.34 శాతంబీహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 48.86 శాతం పోలింగ్ నమోదుఛండీఘడ్ లో 62.80 శాతం పోలింగ్ నమోదుహిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 66.56 శాతం పోలింగ్ నమోదుజార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 67.95 శాతం పోలింగ్ నమోదుఒడిస్సా లో 6 లోక్ సభ స్థానాల్లో 62.46 శాతం పోలింగ్ నమోదుపంజాబ్ లో 13 స్థానాల్లో 55.20 శాతం పోలింగ్ నమోదుఉత్తరప్రదేశ్ 13 స్థానాల్లో 54. శాతం పోలింగ్ నమోదుపశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 68.98 శాతం పోలింగ్ నమోదు👉 మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.09 శాతం పోలింగ్ నమోదు ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదయిన పోలింగ్ శాతం 40.09బీహార్(8)-35.65ఛండీఘడ్(1)-40.14హిమాచల్ ప్రదేశ్(4)-48.63జార్ఖండ్(3)-46.80ఒడిస్సా(6)-37.64పంజాబ్(13)-37.80ఉత్తరప్రదేశ్ (13)- 39.31పశ్చిమ బెంగాల్( 9)-45.07 👉ఓటు వేసిన నటి, టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి. కోల్‌కత్తాలోని పోలింగ్ బూత్ ఓటు వేసిన మిమీ చక్రవర్తి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసి నా బాధ్యత తీర్చుకున్నాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. #WATCH | West Bengal: Actor and former TMC MP Mimi Chakraborty casts her vote at a polling booth in Kolkata. #LokSabhaElections2024 pic.twitter.com/lt8L6GSZJO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల వేళ విషాదం.. మనోరంజన్ సాహో మృతిఓడిషాలో బింజర్‌హర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-157లో బూత్ లెవన్ ఆఫీసర్ మనోరంజన్ సాహో మృతిచెందారు. ఎన్నికల విధుల్లోనే ఆయన మరణించినట్టు కలెక్టర్ నిఖిల్ పవన్ కల్యాణ్ తెలిపారు. Odisha | One BLO (Block Level Officer), Manoranjan Sahoo (58) of booth no-157 under Binjharpur Assembly Constituency of Jajpur district died while on election duty: Collector & DM cum DEO, Nikhil Pavan Kalyan#LokSabhaElections2024— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన నటుడు ఆయూష్మాన్ ఖురానా. ఛండీగఢ్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.#WATCH | Actor Ayushmann Khurrana shows the indelible ink mark on his finger after voting at a polling booth in Chandigarh.He says, "I came back to my city to cast my vote and exercise my right...Mumbai recorded a very low voter turnout this time but we should cast our… pic.twitter.com/7UTPNGCMl1— ANI (@ANI) June 1, 2024 👉ఓటుపై అవగాహన కోసం వినూత్న ప్రయోగం.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంపై కుషీనగర్ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను 2012 నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా గుర్రంపై వచ్చి ఓటు వేస్తున్నట్టు తెలిపాడు. #WATCH | To create voter awareness, a man arrives on a horse at a polling station to cast his vote in Kushinagar, Uttar PradeshHe says, "In the 2012, 2017 & 2022 Assembly elections and 2014 & 2019 Lok Sabha polls also I had arrived on horse to cast my vote." pic.twitter.com/Qw2vlivoM1— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్.#WATCH | On clash during Lok Sabha elections in West Bengal today, BJP leader & MP Dilip Ghosh says, "...TMC is doing al this due to fear of losing, but voting will be completed." pic.twitter.com/VNFPikOiGR— ANI (@ANI) June 1, 2024👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ నేత బిక్రమ్ సింగ్ మజితియా. 👉 ఓటు హక్కు వినియోగించుకున్న రేఖా పాత. బసిర్‌హట్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రేఖా. #WATCH | North 24 Parganas, West Bengal: BJP Lok Sabha Candidate from Basirhat, Rekha Patra shows her inked finger after casting her vote for #LokSabhaElections2024TMC has fielded Haji Nurul Islam from Basirhat. pic.twitter.com/eNN5bg4OkI— ANI (@ANI) June 1, 2024 👉 11 గంటల వరకు 26.30 పోలింగ్ శాతం నమోదు. ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 26.30బీహార్(8)-24.25ఛండీఘడ్(1)-25.03హిమాచల్ ప్రదేశ్(4)-31.92జార్ఖండ్(3)-29.50ఒడిస్సా(6)-22.64పంజాబ్(13)-23.91ఉత్తరప్రదేశ్ (13)- 28.02పశ్చిమ బెంగాల్( 9)-28.10 👉ఓటు వేసిన హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ. హర్మీర్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu casts his vote at a polling station in Hamirpur for the seventh phase of #LokSabhaElections2024 pic.twitter.com/c7zzjs6SnO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్ సీఎం నితిశ్ కుమార్. భక్తియార్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన వేశారు.#WATCH | Bihar CM Nitish Kumar leaves after casting his vote at a polling booth in Bakhtiyarpur. #LokSabhaElections2024 pic.twitter.com/2qogPy72zU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీలోని గాజీపూర్‌లో వేశారు. #WATCH | Uttar Pradesh | Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha casts his vote for #LokSabhaElections2024 in Mohanpura village, Ghazipur. pic.twitter.com/LV5N4AoNjU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్ ప్రెసిడెంట్ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఎస్ఏడీ నేత హర్సిమ్రత్ కౌర్. ఫిరోజ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో వీరు ఓటు వేశారు. #WATCH | Sri Muktsar Sahib, Punjab: Shiromani Akali Dal (SAD) leader Harsimrat Kaur Badal casts her vote at a polling booth in Badal village under the Firozpur Lok Sabha constituency SAD has fielded Nardev Singh Bobby Mann from this seat. BJP has fielded Gurmit Singh Sodhi,… https://t.co/BhwLlKUElF pic.twitter.com/FGxN45jioQ— ANI (@ANI) June 1, 2024 👉పోలింగ్ వేళ బెంగాల్లో ఉద్రిక్తతలు..సౌత్ పరగాణా-24లో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్. VIDEO | Lok Sabha Elections 2024: Punjab CM Bhagwant Mann interacts with media after casting vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/1YxNaPwBQ5— Press Trust of India (@PTI_News) June 1, 2024 VIDEO | Lok Sabha Elections 2024: "I hope there will be record voting. I am confident that the excitement in the seventh phase will be more that what we have witnessed in the last six phases of elections. There will be bumper voting and then later bumper victory," says Anurag… pic.twitter.com/RbDCOPjfY4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.VIDEO | Lok Sabha Election 2024: "I want to appeal to everyone to exercise their Constitutional rights and participate in this festival of democracy," says actor and BJP candidate from Himachal Pradesh's Mandi seat Kangana Ranaut (@KanganaTeam) after casting vote.… pic.twitter.com/7womwYt3xV— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్‌చుగ్. పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. VIDEO | Lok Sabha Elections 2024: "We have been given the right by the Constitution to choose who will rule for the next five years and who will decide the country's strategies. We should all exercise this right. I am feeling very proud and happy that I have come here along with… pic.twitter.com/zSElxK3PEd— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్ నమోదు.. ఢిల్లీ:చివరి విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31బీహార్(8)-10.58ఛండీఘడ్(1)-11.64హిమాచల్ ప్రదేశ్(4)-14.35జార్ఖండ్(3)-12.15ఒడిస్సా(6)- 7.69పంజాబ్(13)-9.64ఉత్తరప్రదేశ్ (13)- 12.94పశ్చిమ బెంగాల్( 9)- 12.63 👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. గోరఖ్‌పూర్‌లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Uttar Pradesh: After casting his vote in Gorakhpur, Himachal Pradesh Governor Shiv Pratap Shukla says, "I have cast my vote today. All the voters should cast their votes today and vote for a government that can carry forward development work..."#LokSabhaElections2024 pic.twitter.com/WFVlID9xh3— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. #WATCH | Bihar: RJD chief Lalu Prasad Yadav, Rabri Devi and their daughter & party candidate from Saran Lok Sabha seat Rohini Acharya leave from a polling booth in Patna after casting their vote. #LokSabhaElections2024 pic.twitter.com/LTmGnXM4BH— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్‌నగర్‌లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Uttar Pradesh | Sikkim Governor Lakshman Prasad Acharya says, "I am happy to take part in this festival of democracy. I think that voting is a duty along with being a constitutional right and everyone should perform their duty and exercise their right..." https://t.co/qwNLm28hP9 pic.twitter.com/V2EMlKNxMu— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్. జలంధర్‌లోని పోలింగ్ బూత్ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్ చేశారు. #WATCH | Punjab: Former Indian cricketer and AAP Rajya Sabha MP Harbhajan Singh casts his vote at a polling booth in Jalandhar#LokSabhaElections2024 pic.twitter.com/Ph55BxqFbp— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ వేసిన రవి కిషన్, ఆయన కుటుంబ సభ్యులు. #WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan & his wife Preeti Kishan cast their votes at a polling booth in the constituency. The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf.#LokSabhaElections2024 pic.twitter.com/bTC51NMa3E— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన యోగి. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్. #WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at a polling booth in Gorakhnath, Gorakhpur.The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf. #LokSabhaElections2024 pic.twitter.com/2Ao7uC7slU— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా #WATCH | BJP national president JP Nadda cast his vote at a polling booth in Bilaspur, Himachal Pradesh. His wife Mallika Nadda also cast her vote here. #LokSabhaElections2024 pic.twitter.com/7XZC3pU2zw— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా..👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్ చద్దా.. #WATCH | After casting his vote for the seventh phase of #LokSabhaElections2024, AAP MP Raghav Chadha says, "Today is the grand festival of India...Every vote by the citizen will decide the direction & condition of the country...I request everyone to exercise their right to… pic.twitter.com/tBqPTEdBci— ANI (@ANI) June 1, 2024 👉 చివరి దశలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. Voting for the seventh - the last - phase of #LokSabhaElections2024 begins. Polling being held in 57 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC— ANI (@ANI) June 1, 2024 👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. 👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.👉 చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
కాంగ్రెస్ రెబల్‌కు బీజేపీ టికెట్.. మాజీ మంత్రి రాజీనామా
హిమాచల్‌ప్రదేశ్ మాజీ మంత్రి, లాహౌల్ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్‌లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్ రెబల్‌కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్ లాల్ మార్కండ వైదొలిగారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్‌లాల్ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్ లాల్ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న ఠాకూర్ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్ లాల్ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలైన హమీర్పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్‌తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్‌పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. -
సీఎం సీటుకు ఎసరు.. లోక్‌సభ ఎన్నికల వరకే ఆయన పదవి
లోక్‌సభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం సుఖ్వీందర్ సుకును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం స్థానాన్ని భర్తీ చేస్తుందా? అంటే అవుననే అంటున్నారు. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జైరామ్ ఠాకూర్. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందనే అనుమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం స్థానాల్ని గెలుపొందేలా పావులు కదుపుతున్న పార్టీ అధిష్టానం ఇప్పుడు వారినే ప్రలోభాలకు గురి చేస్తుందంటూ ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జై రామ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సంక్షోభం.. ఎమ్మెల్యేల తిరుగు బావుటా ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయం సంక్షోభం నెలకొంది. గత కొంత కాలంగా సీఎం సుఖ్వీందర్ సుకు తీరుపై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీకి కాంగ్రెస్‌కు చెందిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్ధికి క్రాస్ ఓటు వేశారు. ఈ అనూహ్య పరిణామాలతో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపించడంతో ఎమ్మెల్యేలపై రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్ధులుగా కొనసాగుతున్నారు. ఈ వరుస పరిణామాలపై జై రామ్ ఠాకూర్ స్పందించారు. సీఎం పదవి లోక్‌సభ ఎన్నికల వరకే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం లేదని తెలిపారు. అందుకు మండి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీపై ఓటర్ల వ్యతిరేకత, ప్రతిభా సింగ్‌పై పార్టీ కార్యకర్తల అసమ్మతే కారణమని అన్నారు. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం సుఖ్విందర్ సుఖ్‌ను భర్తీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష నాయకుడు పేర్కొన్నారు. రెబల్స్‌కు ఆఫర్లు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరుగురు రెబల్స్‌ను ప్రలోభాలకు గురి చేస్తుందని అన్నారు. పార్టీలోకి ఆహ్వానించి వారు కోరుకున్న పదవులతో పాటు పార్టీ టిక్కెట్లు కూడా ఆఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకు ఒప్పుకోకపోతే దాడులు తెగబడుతుందని మండి పడ్డారు. కేజ్రీవాల్ అవినీతిపై ఢిల్లీ సీఎం అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆప్ చేస్తున్న ఆందోళనలపై ఠాకూర్ స్పందించారు. తనకు తానుగా అత్యంత నిజాయితీపరుడినని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ అవినీతి బహిర్గతమైందని, అలాంటప్పుడు ఆప్ నేతలు నిరసనలు చేసి ప్రయోజనం ఏముంటుందని బీజేపీ సీనియర్ నేత జైరామ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్‌పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్శర్మ, ఇందర్ దత్ లఖాన్‌పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్‌లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్‌లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్‌లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్‌లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్‌కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి
దేశ రాజధాని ఢిల్లీలో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి ప్రస్తుత జనవరిలో నమోదైంది. ఈ నెల మొత్తంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీలుగా నమోదుకాగా, కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఈసారి చలిగాలుల ప్రభావం ఢిల్లీలో గరిష్టంగా ఐదు రోజుల పాటు కనిపించింది. జనవరి 30 వరకు నమోదైన డేటా ప్రకారం ఢిల్లీలో గత 12 ఏళ్లలో సగటున ఈ నెలలోనే చలి అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారి ఆర్కే జెనామణి తెలిపారు. జనవరిలో గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యింది. 2012 నుంచి 2024 వరకు ఢిల్లీలో ఇంత తక్కువ సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎన్నడూ నమోదు కాలేదు. అయితే కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలుగా నమోదయ్యింది. అంతకుముందు జనవరి 2013లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలుగా నమోదైంది. 2015లో గరిష్ట సగటు ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలు కాగా, 2022లో 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మంగళవారం దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది. కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత సూచిక 364 (చాలా పేలవమైన విభాగంలో) నమోదైంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నేటి ఉదయం పొగమంచు కమ్మేయనుంది. బుధవారం నుండి ఫిబ్రవరి 4 వరకు లడఖ్, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. -
‘పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయం’.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్‌లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్‌లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్‌లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ఈ నిర్ణయం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు 2733గా ఉందని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్‌ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్యూవీ కార్‌ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్ వెహికిల్ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్ చౌదరి తెలిపారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్లతో పోలీసులు ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Challan issued after a video of driving a Thar in Chandra River of Lahaul and Spiti went viral on social media. SP Mayank Chaudhry said, "Recently, a video went viral in which a Thar is crossing the river Chandra in District Lahaul Spiti. The said… pic.twitter.com/V0a4J1sgxv — ANI (@ANI) December 25, 2023 ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
Christmas Celebrations: హిమాచల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సిమ్లా: క్రిస్మస్ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనాలి-రోహ్తంగ్ హైవేపై అటల్ టన్నెల్ వైపు వెళ్లే మార్గాలు కార్లతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో పోలీసులు డ్రోన్‌తో నిఘా పెట్టారు. సరిపడా పార్కింగ్ సౌకర్యాలు లేకపోవటం, వాహనాల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా మంది పర్యాటకులు పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో ప్రయాణం.. ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తి లాహౌల్‌లో రోడ్డు మార్గం కాకుండా నది గుండా కారులో ప్రయాణించాడు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Video of tourist driving car in Chandra river in #Lahaul, Himachal goes viral, please do not expose yourself by doing such useless act. pic.twitter.com/kgLsbvnp3s — Nikhil Choudhary (@NikhilCh_) December 25, 2023 సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదీ చదవండి: యేసుక్రీస్తు బోధనలు దేశాభివృద్ధికి మార్గనిర్దేశం: ప్రధాని మోదీ -
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?
దేశంలోని పలు నగరాల తళుకుబెళుకులను మన చూసేవుంటాం. కానీ దేశంలోని అత్యంత అందమైన గ్రామాలను చూసివుండం. ఇప్పుడు మన దేశంలోని అందమైన గ్రామాలను దర్శిద్దాం. కల్ప (హిమాచల్‌ప్రదేశ్) కల్ప.. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న ఒక రహస్య గ్రామం. ఇది హైవే నుంచి అస్సలు కనిపించదు. అయితే ఈ గ్రామం అందం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. గ్రామం చుట్టూ యాపిల్ తోటలు కనిపిస్తాయి. ఇక్కడ నుండి కైలాస పర్వత మంచు శిఖరాలు చూడవచ్చు. ఇక్కడ కనిపించినట్లు ఆ శిఖరాలు మరెక్కడా అంత స్పష్టంగా కనిపించవు. మవ్లిన్నోంగ్ (మేఘాలయ) మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉన్న మావ్లిన్నోంగ్.. ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం. దీనిని దేవుడి తోట అని కూడా పిలుస్తారంటే దీని అందాలను అంచనా వేయవచ్చు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం ఉండదు. వెదురుతో చేసిన డస్ట్బిన్లను ఇక్కడ ఉపయోగిస్తారు. ఖిమ్సర్ (రాజస్థాన్) చుట్టూ స్వచ్ఛమైన గాలి, ఇసుకతో కూడిన గ్రామం ఇది. ఊరి మధ్యలో సరస్సు కనిపిస్తుంది. గ్రామ సమీపంలో అందమైన చెట్లు ఉంటాయి. అందమైన గుడిసెలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని ఈ గ్రామాన్ని ఇసుక దిబ్బల గ్రామం అని కూడా అంటారు. ఈ గ్రామం అందమైన రిసార్ట్‌ను తలపిస్తుంది. ఇక్కడ దాదాపు 300 నుంచి 400 అడుగుల ఎత్తులోని భారీ మట్టి దిబ్బలు ఉన్నాయి. పూవార్ (కేరళ) తిరువనంతపురానికి దక్షిణ తీరాన ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. ఇక్కడి పరిశుభ్రమైన, అందమైన బీచ్‌లు పర్యాటకులను ఇంకొన్ని రోజుల ఇక్కడ గడిపేలా చేస్తాయి. అక్టోబర్- ఫిబ్రవరి మధ్య కాలం ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. కొల్లెంగోడ్ (కేరళ) పచ్చదనం, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ చిన్న గ్రామం ఎంతో శుభ్రంగా ఉంటుంది. సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన కొల్లెంగోడ్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. జిరాంగ్ (ఒడిశా) స్వచ్ఛమైన గ్రామీణ జీవితాన్ని చవిచూసేందుకు చంద్రగిరి ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడి జిరాంగ్ లోయ, బౌద్ధ దేవాలయాలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ గ్రామం పరిశుభ్రతకు పెట్టిందిపేరుగా నిలుస్తుంది. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
మహిళా అధికారులు.. వరదలకు ఎదురు నిలిచి ధీరత్వం ప్రదర్శించారు
పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు మహిళా ఆఫీసర్ల ధైర్యగాధలు మార్మోగుతున్నాయి. ఇటీవలి పెను వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటంలో మహిళా కలెక్టర్లు, ఎస్పిలు రేయింబవళ్లు కష్టపడి ధీరత్వాన్ని ప్రదర్శించారు. చంటి పిల్లల్ని ఇళ్లల్లో వదిలి ప్రజల కోసం రోజుల తరబడి పని చేసిన ఈ ఆఫీసర్ల పరిచయం... ఉత్తర భారతాన్ని వానలు, వరదలు చుట్టుముట్టాయి. పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకూ కుంభవృష్టి ముంచెత్తింది. నదులు వెర్రెత్తి ఫ్రవహించాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. గిరి వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుని వరదనీటిలో అడ్డొచ్చినవాటిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగాయి. కార్లు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురయ్యాయి. ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఏర్పడింది. ఇలాంటి సమయాల్లో బయటకు అడుగు పెట్టడమే కష్టం. కాని ఈ సందర్భాలను సమర్థంగా ఎదుర్కొని ప్రశంసలు పొందారు మహిళా అధికారులు. ప్రకృతి విసిరే సవాళ్లకు తాము జవాబు చెప్పగలమని నిరూపించారు. సహాయక బృందాలను సమాయత్త పరచడం, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తరలించడం ఈ పనుల్లో స్వయంగా పాల్గొంటూ రేయింబవళ్లు పని చేశారు. అందుకే వారిని జనం మెచ్చుకుంటున్నారు. కృతజ్ఞతలు చెబుతున్నారు. పాటియాలా కలెక్టర్ ఉత్తర భారతానికి పెను వర్షగండం ఉందని వార్తలొచ్చాక ఆ గండం పంజాబ్‌లో పాటియాలా జిల్లాకు కూడా వచ్చింది. జూలై 9, 10 తేదీల్లో పాటియాలా జిల్లా వరదల్లో చిక్కుకుంది. ఆ జిల్లా కలెక్టర్ సాక్షి సహానె వెంటనే రంగంలో దిగింది. ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె బాగోగులు తన తల్లిదండ్రులకు అప్పజెప్పి దాదాపు 7 రోజులు ఇంటికే వెళ్లకుండా జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలను కాపాడింది సాక్షి సహానె. ముఖ్యంగా ఎగువన ఉన్న మొహాలీ జిల్లా నుంచి వరద నీరు పాటియాలాలోని సట్లజ్ యమున లింక్ కెనాల్‌కి చేరడంతో ఒక్కసారిగా వరద చండీగడ్–పాటియాలా హైవేపై ఉన్న రాజ్‌పుర ప్రాంతానికి వచ్చేసింది. అక్కడే చిత్కారా యూనివర్సిటీ, నీలమ్ హాస్పిటల్ ఉన్నాయి. రెండూ వరదలో చిక్కుకున్నాయి. ‘నీలమ్ హాస్పిటల్లో ఉన్న అందరు పేషెంట్లను, 14 మంది ఐసియు పేషెంట్లను విజయవంతంగా తరలించ గలిగాం’ అని సహానె తెలిపింది. అలాగే చిత్కారా యూనివర్సిటీలో విద్యార్థులందరూ బయటకు రాలేనంతగా వరద నీటిలో చిక్కుకున్నారు. సహానె స్వయంగా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లి ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ దళాల సహాయంతో ఆ విద్యార్థులను బయటకు తరలించారు. ‘సులూర్ అనే గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఆహారం కోసం జనం అల్లాడుతున్నారని నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. వెంటనే ఆహారం తీసుకుని ఆ వానలో వరదలో బయలుదేరాను. కారులో కూచుని ఉంటే వరద నీరు నా అద్దాల వరకూ చేరుకుంది. భయమూ తెగింపు కలిగాయి. అలాగే ముందుకు వెళ్లి ఆహారం అందించగలిగాను’ అంది సాక్షి సహానె. 2014 ఐ.ఏ.ఎస్ బ్యాచ్‌కు చెందిన సహానె తన చొరవ, చురుకుదనంతో పాటియాలా జిల్లా ప్రజల అభిమానం గెలుచుకుంది. కుల్లు ఎస్.పి. హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లా ఎస్.పి 28 సంవత్సరాల సాక్షి వర్మను అందరూ ‘లేడీ సింగం’ అంటారు. సిమ్లా జిల్లాలో ఆమె పని చేసినప్పుడు బ్రౌన్‌షుగర్ సరఫరా చేసే ముఠాలను పట్టుకుంది. అలాగే పేరు మోసిన దొంగలను జైలు పాలు చేసింది. స్త్రీల రక్షణ కోసం ‘గుడియా హెల్ప్‌లైన్’, ‘శక్తి బటన్’, ‘హోషియార్ సింగ్’ అనే హెల్ప్లైన్లు ప్రారంభించింది. దాంతో జనం ఆదరణ పొందింది. కుల్లు ఎస్.పిగా చార్జ్ తీసుకున్నాక వచ్చిన తీవ్ర వరదలను సాక్షి వర్మ సమర్థంగా ఎదుర్కొంది. ‘ఈ వరదల్లో నాకు ఎదురైన పెద్ద సవాలు ఏమిటంటే మా జిల్లాలో ఉన్న పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్స్ మనాలి కావచ్చు, తీర్థన్ కావచ్చు... వీటన్నింటితో కమ్యునికేషన్ కోల్పోవడం. మొబైల్స్ పని చేయలేదు. మా పోలీసు శాఖ వైర్లెస్ ఫోన్లు కొన్ని చోట్ల మాత్రమే పని చేశాయి. మిగిలిన ప్రాంతాలకు శాటిలైట్ ఫోన్లు పంపి అక్కడి నుంచి సమాచారం తెప్పించాను. కాని శాటిలైట్ ఫోన్లు చేర్చడం కూడా పెద్ద సవాలైంది. అలాగే రోడ్లు ధ్వంసం కావడం వల్ల సహాయక బృందాలు చేరలేకపోయాయి. అయినా సరే మేమందరం సమర్థంగా సహాయక చర్యలు చేపట్టాము. పని చేసేటప్పుడు నేను స్త్రీనా, పురుషుడినా అనేది నాకు గుర్తు ఉండదు. ఒక ఆఫీసర్‌గా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను’ అని తెలిపింది సాక్షి వర్మ– 2014 ఐపిఎస్ బ్యాచ్ ఆఫీసర్. మండి ఎస్.పి. కుల్లు జిల్లా పక్కనే ఉంటుంది మండి జిల్లా. రెంటికీ రెండు గంటల దూరం. ఈ జిల్లా కూడా తీవ్రంగా వరద బారిన పడింది. వంతెనలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చివరకు పోలీస్ స్టేషన్లకు బిఎస్ఎఫ్ దళాలకు కూడా కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి సమయంలో గొప్ప సమర్థతతో పని చేసింది మండి ఎస్.పి సౌమ్య సాంబశివన్. 2010 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ ఆఫీసర్ బియాస్ నది ఒడ్డున ఉన్న స్లమ్స్ చిక్కుకున్న 80 మందిని కాపాడగలగడంతో మొదటి ప్రశంస పొందింది. టూరిస్ట్ ప్రాంతం కాబట్టి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అక్కడికి వచ్చిన టూరిస్ట్‌లు ఎలా ఉన్నారంటూ ఫోన్ల వరద మొదలైంది. టూరిస్ట్‌లను సురక్షితంగా ఉంచడం సౌమ్యకు ఎదురైన పెద్ద సవాలు. ‘వారందరిని వెతికి స్థానిక సత్రాల్లో, గురుద్వారాల్లో చేర్చడం చాలా వొత్తిడి కలిగించింది. అలాగే ఇళ్లు విడిచి రావడానికి చాలామంది ఇష్టపడలేదు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులను వదిలి రావడం ఎవరికైనా బాధే. వారు అలాగే ఉంటే చనిపోతారు. ఎంతో ఒప్పించి వారిని ఖాళీ చేయించాను’ అందామె. సౌమ్య సాంబశివన్ కింద మొత్తం 1200 మంది సహాయక సిబ్బంది పని చేసి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. -
జలప్రళయం.. హిమాచల్ కకావికలం
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రమంతటా రోడ్లు కొట్టుకుపోయిన కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారు. రూ.4000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 1300 రోడ్లు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఛండీగఢ్-మనాలీ, సిమ్లా-కాల్కా జాతీయ రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. మనాలీలో చిక్కిన 1000 మంది పర్యటకుల వాహనాలను తరలించడానికి అర్ధరాత్రి పూట వన్‌వే ట్రాఫిక్‌ను తెరిచినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటకులు చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. More Scary visuals from Thunag area of Mandi, Himachal#Thunag #Mandi #HimachalPradesh #Manali #Kullu pic.twitter.com/qtyyo3OHcD — Anil Thakur (@Ani_iTV) July 9, 2023 ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జులై 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 20,000లకు పైనే ప్రజలను పునరావాస ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడి, వరదలతో భారీ నష్టం జరిగిన కులూ ప్రాంతాల్లో రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ పర్యటించారు. పరిస్థితిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. నష్టాన్ని పూరించడానికి చేయాల్సిన పని చాలా ఉందని అన్నారు. This is Temple in Sirmaur Himachal Pradesh under flood pic.twitter.com/PI3IIibmzp — Go Himachal (@GoHimachal_) July 11, 2023 గత నాలుగు రోజులుగా ఉత్తర భారతం భారీ వర్షాలతో వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు సంభవిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లింది. 80 Killed, ₹ 3,000 Crore Damage: Himachal Rain Devastation In Numbers https://t.co/7xnflWjHa5 pic.twitter.com/FFgvfMddRA — NDTV (@ndtv) July 12, 2023 కాగా.. రానున్న 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో రెడ్ అలర్ట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
దయచేసి అక్కడికి వెళ్లకండి.. మీకు గుండెపోటు ఖాయం: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే తన సొంత బ్యానర్‌పై టికూ వెడ్స్ షేరూ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించారు. అయితే తాజాగా కంగనా రనౌత్ ప్రజలతో పాటు తన ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!) ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కంగనా తన అభిమానులను, ప్రజలను హెచ్చరించింది. దయచేసి ఈ సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. రాబోయే రోజుల్లో వర్షం ఆగిపోయినా కొండచరియలు విరిగిపడే అవకాశముందని హెచ్చరించింది. కాగా.. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి జిల్లాలో జన్మించింది. కంగనా ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ..' ప్రస్తుతం హిమాచల్‌లో పరిస్థితి బాగాలేదు. అయినప్పటికీ అసాధారణమైనది ఏమీ లేదు. వర్షాకాలం హిమాలయాలంటే జోక్ కాదు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. దయచేసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. వాటికి ఇది మంచి సమయం కాదు. బియాస్ నది ఉప్పొంగి గర్జించే స్థితిలో ఉంది. ఆ నది శబ్దాలకు మీకు గుండెపోటు వస్తుంది.' అని వార్నింగ్ ఇచ్చింది. (ఇది చదవండి: 'బేబీ'సినిమా.. హీరో విరాజ్ ఫుల్ కాన్ఫిడెన్స్!)