48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది | 2 Trekkers Die After Fall In Himachal, Pet Dog Guards Bodies For 48 Hours | Sakshi
Sakshi News home page

48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది

Published Fri, Feb 9 2024 5:19 AM | Last Updated on Fri, Feb 9 2024 5:19 AM

2 Trekkers Die After Fall In Himachal, Pet Dog Guards Bodies For 48 Hours - Sakshi

సిమ్లా: ట్రెక్కింగ్‌లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిర్‌ బిల్లింగ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్‌ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్‌ బిల్లింగ్‌ వద్ద ట్రెక్కింగ్‌కు బయల్దేరారు.

ట్రెక్కింగ్‌ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్‌ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే   సాయం కోసం అరుస్తూ నిల్చుంది.  గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్‌ షెపర్డ్‌ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement