praneetha
-
బుంగమూతితో క్యూట్‌గా ఉప్పెన భామ.. నా సామిరంగ హీరోయిన్ నాటీ లుక్స్!
నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్..సెల్ఫీలవ్ అంటోన్న సారా అలీఖాన్..నవంబర్ మెమొరీస్ షేర్ చేసిన శ్రద్ధాదాస్..బంగారం లాంటి శారీలో అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత..బుంగమూతితో మరింత క్యూట్‌గా ఉప్పెన భామ కృతిశెట్టి.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
మళ్లీ తల్లి కాబోతున్నాను
‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘బావ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో నటించిన ప్రణీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. 2022 జూన్‌లో ప్రణీత ఓ పాపకు జన్మనిచ్చారు.కొన్ని నెలలు సినిమాలకు విరామం తీసుకున్నాక ఆమె కన్నడలో చేసిన ఒక సినిమా, మలయాళంలో చేసిన ఒక సినిమా ఈ ఏడాది విడుదలయ్యాయి. కాగా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు పేర్కొన్నారు. ‘రౌండ్ 2.. ఇప్పటి వరకూ నేను వాడిన పాంట్స్ ఇక నాకు ఫిట్ కావు’’ అంటూ బేబీ బంప్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రణీత. -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్‌లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్‌కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
శారీలో నమ్రతా శిరోద్కర్.. దేవకన్యలా దివి.. నదిలో మాళవిక!
►శారీలో నమ్రతా శిరోద్కర్ హోయలు ►వైట్ డ్రెస్సులో దేవకన్యలా దిగొచ్చిన దివి ►నదిలో చిల్ అవుతోన్న మాళవిక మోహనన్ ►గ్రీన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా పోజులు ►సంప్రదాయంగా ముస్తాబైన అత్తారింటికీ దారేది భామ ►ది కేరళ స్టోరీ భామ ఆదా శర్మ అదిరిపోయే లుక్స్ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
అలాంటి లింకులు ఏమి లేవు..!
-
సింగపూర్‌లో యషికా ఆనంద్ హోయలు.. మాళవిక మోహనన్ గ్లామర్ స్టిల్స్!
►సింగపూర్‌లో యషికా ఆనంద్ హోయలు! ►వైట్ డ్రెస్‌లో పూనమ్ బజ్వా హాట్ లుక్స్! ►ధగధగ మెరిసిపోతున్న ప్రణీత ! ►మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ స్టిల్స్! ►అందంతో మతిపోగొడుతున్న కేతిక శర్మ! View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) -
గోవాలో భూమి ఫడ్నేకర్.. రిషికేశ్‌లో యషికా ఆనంద్ ఫోజులు
►కలర్‌ఫుల్ దుస్తుల్లో ప్రణీత ఫోజులు ►రకుల్ ప్రీత్ సింగ్ స్మైలీ పిక్స్ ►గోవాలో బిజినెస్ స్టార్ట్ చేసిన భూమి ఫడ్నేకర్ ►రిషికేశ్‌లో యషికా ఆనంద్ గ్లామర్ లుక్స్ ►జిమ్‌లో కూతురితో మెగా డాటర్ శ్రీజ కసరత్తులు View this post on Instagram A post shared by Bhumi 🌏 (@bhumipednekar) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
లెహంగాలో కృతి శెట్టి, చీరలో ప్రణీత..అందాల తారల హాట్ పోజులు
►పెళ్లి సంబరాలు అంటూ పెళ్లి కూతురిలా ముస్తాబైన ఫోటోలను షేర్ చేసింది హీరోయిన్ ప్రణీత ►ఎర్ర చీరలో ఆహా అనిపిస్తున్న అషురెడ్డి ►లెహంగాలో కృతిశెట్టి పరువాల విందు ► అనుపమ ఆవకాయ పెట్టింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ► దుబాయ్ టూర్లో ఎంజాయ్ చేస్తుంది ఫరియా అబ్దుల్లా View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
Movie News: మాలీ కాలింగ్
తెలుగులో తెలుగు అమ్మాయిలు తప్ప ఇతర భాషల బ్యూటీలు ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా అటు ముంబై ఇటు కేరళ భామల హవా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుగులో బాగా పాపులార్టీ తెచ్చుకున్న నాయికలు ఇప్పుడు మలయాళంకి వెళుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు, ఒక యువ హీరోయిన్‌కు మాలీవుడ్ నుంచి కాల్ వెళ్లింది. మలయాళంలో ఈ ముగ్గురి తొలి చిత్రం గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్నా. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన తమన్నా వీలైనప్పుడు కన్నడ తెరపైనా మెరిశారు. అయితే మలయాళ వెండితెరపై మాత్రం కనిపించలేదు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్ల తర్వాత తమన్నా ఫస్ట్ టైమ్ ఓ మాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిలీప్ హీరోగా అరుణ్ గోపీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాంద్రా’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ఈ సినిమాలో తమన్నా మహారాణి పాత్రలో కనిపించనున్నారట. సో.. మాలీవుడ్‌కి రాణిలా ఎంటర్ అవుతున్నారన్న మాట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా దిలీప్ హీరోగా నటిస్తున్న మరో సినిమాతో టాలీవుడ్ బాపు బొమ్మగా ప్రేక్షకులు చెప్పుకునే కన్నడ భామ ప్రణీత కూడా మాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాకు రతీష్ రఘునందన్ దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ పాత్రల్లోనే కనిపించిన ప్రణీత ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్‌గా కనిపించనున్నారట. క్యారెక్టర్ దృష్ట్యా ప్రణీత పాత్రకు కాస్త అహంకారం ఉంటుందట. సో.. ప్రణీత మాలీవుడ్ ఎంట్రీ మమమ్మాస్ అన్నమాట. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఓ బిడ్డకు (కుమార్తె ఆర్నా) జన్మనిచ్చిన తర్వాత ప్రణీత ఒప్పుకున్న తొలి సినిమా ఇదే. మరోవైపు టాలీవుడ్ బేబమ్మ (‘ఉప్పెన’లో కృతీ శెట్టి పేరు), యంగ్ బ్యూటీ కృతీ శెట్టికి కూడా మాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘అజయంటే రందం మోషణం’లో కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తుండగా, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఆ రిస్క్ చేయను: హీరోయిన్ ప్రణీత
‘‘మనందరం ఎంతో కొంత సాయం చేయాల్సిన తరుణం ఇది. ప్రతి ఒక్కరికీ మనం సాయం చేయలేకపోవచ్చు. కానీ మన సహాయం కొద్దిమందికి ఉపయోగపడినా చాలు’’ అంటున్నారు హీరోయిన్ ప్రణీత. ఈ విషయం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మా ఫౌండేషన్ తరఫున చాలామంది కరోనా బాధితులకు అన్నదానం చేశాం. ఇటీవల కూడా కొంత మొత్తాన్ని సేకరించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను కోవిడ్ ఆస్పత్రులకు ఇచ్చాం’’ అన్నారు. ఇంకా కరోనా జాగ్రత్తల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు. నేనైతే వీలు కుదిరినంతవరకు కాలు బయటపెట్టడంలేదు. బయటకు వెళ్లి నాతో పాటు నా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టలేను. అందుకే ఇంట్లో నుంచే సాయం చేయాలనుకున్నాను. నా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కోవిడ్ బాధితులకు అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. ఇది కొందరికి ఉపయోగపడినా చాలు. నేనే కాదు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సహాయం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రణీత. -
రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
ముంబయి: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ నాయకులతో పాటు, పలువురు సెలెబ్రిటీలు కూడా తమ వంతు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి సహకారం అందించాలని అభిమానులు, అనుచరులను కోరుతూ నటుడు అక్షయ్ కుమార్ ఒక వీడియోను పంచుకున్నారు. తన వంతు కర్తవ్యంగా కొత్త మొత్తాన్ని అందించినట్లు వీడియోలో పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంకు తమకు తోచినంత సహాయం అందించాలని పేర్కొన్నాడు.(చదవండి: నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత) ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆలయ నిర్మాణానికి రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు బృందాన్ని కలిసి 5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు చెక్ ను ఆ బృందానికి అందజేశారు. హీరోయిన్ ప్రణీత కూడా రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. దేశీయ విరాళాల ద్వారానే రామ్ మందిర్ నిర్మాణం పూర్తవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. దేశంలోని 5,25,000 గ్రామాలలో నిధుల సేకరణ ప్రచారం జరగనుంది. సేకరించిన డబ్బును 48 గంటలలోపు బ్యాంకుల్లో జమ చేయాలి. ఈ కలెక్షన్ డ్రైవ్ జనవరి 15న నుంచి ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. రామమందిరం నిర్మాణం 36 నెలల నుంచి 40 నెలల సమయంలో పూర్తవుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. -
స్కూబా టెస్ట్ పాసయ్యా!
కొత్త విషయాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తున్నారు ప్రణీతా సుభాష్. ఇటీవలే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఇప్పుడు స్కూబా డైవింగ్‌లో సర్టిఫికేట్ పొందారు. కొన్ని రోజులుగా మాల్డీవుల్లో విహార యాత్రలో ఉన్నారు ప్రణీత. బీచ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారామె. స్కూబా డైవింగ్ కూడా చేస్తూ కనిపించారు. అయితే స్కూబా డైవింగ్‌ను సరదాగా కాదు... సీరియస్‌గా చేయాలనుకున్నారు. అందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుని స్కూబా డైవింగ్‌లో సర్టిఫికెట్ కూడా పొందారామె. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించి, స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. -
2020లో 10 పూర్తి
ఇండస్ట్రీకి ప్రతి ఏడాది కొత్త ముఖాలు వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకునేలోపే చాలా వరకు మాయమవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు.. హీరోయిన్లకు ఇండస్ట్రీలో కెరీర్ స్పాన్ తక్కువ. ఎంత మంది వచ్చినా కొందరికి మాత్రమే టాప్‌లీగ్ లో చోటు దక్కుతుంది. అలాంటి హీరోయిన్లను ఎన్ని ఏళ్లు చూసినా బోర్ కొట్టదంటారు ప్రేక్షకులు. ఆ నాయికలు పరిచయం అయి పదేళ్లయినా అదే ఫాలోయింగ్‌ని ఎంజాయ్ చేస్తారు. సమంత, శ్రుతీ హాసన్, తాప్సీ, ప్రణీత... ఈ నలుగురూ ఇండస్ట్రీకి వచ్చి 2020తో పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వీళ్ల కెరీర్‌పై స్పెషల్ రౌండప్. జోరుగా.. హుషారుగా ‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమయింది తాప్సీ. ‘మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, కాంచన’ వంటి హిట్ సినిమాల్లో నటించి, తెలుగు లో స్టార్ హీరోయిన్ల జాబితా లో చేరిందీ బ్యూటీ. కానీ వరుస సినిమాలు చేస్తున్నా వరుస హిట్స్ అందుకోలేకపోయింది. అయితే తాప్సీ సౌత్ కంటే నార్త్ లో ఎక్కువ సక్సెస్‌లు చూస్తోంది. హిందీలో చేసిన ‘పింక్’ సినిమా తాప్సీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలను వరుసగా ఎంపిక చేసుకుంటూ హిందీలో స్టార్ అయింది. బాలీవుడ్లో తాప్సీ చేసిన ‘సూర్మ, ముల్క్, బద్లా, సాంద్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్, థప్పడ్’ వంటి సిని మాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అలాగే సౌత్‌లోనూ ఈ మధ్య ఆ జోష్ని కొనసాగించింది. తమిళంలో ‘గేమ్ ఓవర్’, తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ వంటి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు సైన్ చేసి జోరుగా హుషారుగా ఉంది తాప్సీ. శ్రుతి నచ్చింది కమల్ హాసన్ కుమార్తె అంటే అడగకుండానే పాపులారిటీ వస్తుంది. దాని వెనకే ప్రెషర్ కూడా ఉంటుంది. అడుగు తీసి అడుగేస్తే కమల్‌తోనే పోలుస్తారు. శ్రుతికి ఎంట్రీ సులువుగా లభించినా హిట్ అంత త్వరగా రాలేదు. ఐరన్ లెగ్ అని బ్రాండ్ పడింది. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించింది శ్రుతి. దాంతో ఐరన్ లెగ్ ముద్ర పోయింది. ప్రేక్షకులకు శ్రుతి నచ్చింది. కేవలం నటిగానే భేష్ అనిపించుకోవడమే కాదు.. గాయనిగా పలు హిట్ సాంగ్స్ పాడి శభాష్ అనిపించుకుంది. ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (ఓ మై ఫ్రెండ్), కన్నులదా (3), డౌన్ డౌన్ డౌన్ (రేసుగుర్రం)’ వంటి పాటలు పాడింది. మ్యూజిక్ మీద దృష్టిపెడుతూ ఆ మధ్య యాక్టింగ్ కెరీర్‌కి చిన్న గ్యాప్ ఇచ్చింది. మూడేళ్ల విరామం తర్వాత తమిళంలో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ‘క్రాక్’ సినిమా చేస్తోంది శ్రుతీహాసన్. ‘యాక్టర్‌గా 11ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉంది. మీ అందరి అభిమానానికి, ప్రేమకి ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపింది శ్రుతి. మాయ చేసింది ‘ఏ మాయ చేసావే’తో హీరోయిన్గా పరిచయమయింది సమంత. అందులో స్యామ్ చేసిన జెస్సీ పాత్ర యూత్ అందర్నీ మాయలో పడేసింది. ఆ తర్వాత సమంత ఏ సినిమా చేసినా థియేటర్స్‌కి వెళ్లేలా చేసింది. టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూనే, పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ అయింది. ‘బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మహానటి, యూ టర్న్, మజిలీ, ఓ బేబి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు స్యామ్ కెరీర్లో ఉన్నాయి. హిట్ సినిమాలో భాగమవ్వడమే కాదు, తను భాగమవ్వడం వల్ల హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. పెళ్లి అయితే పెద్దగా సినిమాల్లో కనిపించదు అనే అపోహను కూడా బ్రేక్ చేసింది ఈ అక్కినేని కోడలు. పై లిస్ట్‌లో చివరి ఐదు సినిమాలు పెళ్లి తర్వాత చేసినవే. తెలుగులోనే కాదు తమిళంలోనూ ‘కత్తి, తేరీ, ఇరుంబు దురై’ వంటి హిట్ సినిమాలు చేసింది సమంత. ‘‘ఇదో బెస్ట్ జర్నీ. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలున్నాయి. సంతోషాలు, బాధలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో నాతో నిలబడిన అందరికీ థ్యాంక్స్’’ అంటోంది సమంత. అన్నట్లు.. నటిగా పదకొండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సమంత తన ఇన్ స్ట్రాగామ్‌లో 11 మిలియన్ (కోటీ 10 లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించిన విషయాన్ని చెప్పి ఆనందం వ్యక్తం చేసింది. హిందీ జర్నీ ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయింది బెంగళూర్ బ్యూటీ ప్రణీతా సుబాష్. పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’, ఎన్టీఆర్‌తో ‘రభస’, మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించింది ప్రణీత. ఈ మధ్యే రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించింది. సౌత్‌లో నాయికగా పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రణీత ఇప్పుడు హిందీలో కూడా జర్నీ మొదలుపెట్టింది. అజయ్ దేవగన్ ‘భూజ్’లో కీలక పాత్రలో కనిపించనుందామె. అలాగే ‘హంగామా’ అనే సినిమాలోనూ నటిస్తోంది ప్రణీత. -
నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు!
నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని నటి ప్రణీత పేర్కొంది. కోలీవుడ్‌లో ఉదయన్, శకుని చిత్రాల్లో నటించిన కన్నడ భామ ప్రణీత. మాతృభాషతో పాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మంచి స్థానం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో ప్రణీత కనిపించి చాలా కాలమైంది. ఇకపోతే కరోనా వైరస్ గురించి అందరూ గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. దాని నుంచి ఎలా కాపాడుకోవాలని ప్రభుత్వం, ప్రజలు పాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి ప్రణీత ఆలోచన మాత్రం వేరేగా ఉంది. అదేంటో మీరే చూడండి. హిందువులు రెండు చేతులతో నమస్కరించడాన్ని ఇతరులు నవ్వుకున్నారు. బయట నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్లేముందు చేతులు, కాళ్లు కడుక్కోవడం చూసి నవ్వుకున్నారు. జంతువులను పూజించడం చేసి నవ్వుకున్నారు. మొక్కలకు, వనాలకు ప్రణమిల్లడాన్ని నవ్వుకున్నారు. హిందువులు శాఖాహారాన్ని భుజించడం చూసి నవ్వుకున్నారు. యోగా చేయడం చూసి నవ్వుకున్నారు. మరణించిన వారి భౌతికకాయాలను దహనం చేయడాన్ని చూసి నవ్వుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన వారు తరువాత తలారా స్నానం చేయడాన్ని నవ్వుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఎవరూ నవ్వడం లేదు. అందుకు బదులుగా ఆలోచిస్తున్నారు. ఈ అలవాట్లే కరోనాను వ్యాప్తి చెందకుండా చేస్తోంది. ఇది మతం కాదు. జీవన బాట. అని నటి ప్రణీత తన ట్విట్టర్లో పేర్కొంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరిపై దండయాత్ర చేసిందో అర్థమైందా? హిందూయేతరుల గురించా, లేక పాశ్చాత్య దేశాల గురించా ఎవరికెలా అర్థమ అయితే అలా తీసుకోండి. అయితే అంతా లైట్‌గా తీసుకోండి. ప్రస్తుతం ప్రణీత చేతిలో తమిళంలో గానీ, తెలుగులో గానీ అవకాశాలు లేవు. ఇలాంటి ట్వీట్లతో వార్తల్లో ఉండే ప్రయత్నం అని అనుకున్నా, అభ్యంతరం లేదు. -
రెండింతల హంగామా
అయోమయంలో కొందర్ని అపార్థం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పుడామె కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. తన తెలివితేటలతో ఆ సమస్యలను ఎలా పరిష్కరించారు అనే కథాంశంతో ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘హంగామా’కు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి కూడా ప్రియదర్శనే దర్శకుడు కావడం విశేషం. ‘హంగామా 2’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో శిల్పాశెట్టి ప్రధాన పాత్రధారి. పరేష్ రావల్, మీజాన్ జఫేరి, ప్రణీత కీలక పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు డెహ్రాడూన్‌లో జరుగుతున్నాయని తెలిసింది. 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా ‘నికమ్మా’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇçస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ మీద ఉన్నప్పుడే ‘హంగామా 2’ చిత్రానికి సైన్ చేశారు. 2007లో ‘అప్నే’లో కథానాయికగా నటించిన తర్వాత ‘ఓం శాంతి’, ‘దోస్తానా’, ‘డిష్కియూన్’ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు శిల్పా. మళ్లీ కథానాయికగా కనిపించబోతున్నది ‘నికమ్మా’, ‘హంగామా 2’లోనే. -
ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది!
‘‘దిల్’ రాజు మా కుటుంబ సభ్యుడు. కథని నమ్ముకుని ప్రయాణం చేసే అతి తక్కువ మంది నిర్మాతల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. రామ్ స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదాగా ఉంటాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో రామ్‌తో సెటిల్డ్‌గా చేయించారు త్రినాథరావు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు హర్షిత్ నా వద్ద పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నేను తీసిన ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే’ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఓ డైరెక్టర్‌గా ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది.ఈ మధ్య కాలంలో ప్రకాశ్‌రాజ్‌గారితో చాలా ఎక్కువ రోజులు పనిచేసిన యూనిట్ మాదే. మా సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ దసరాకి ప్రేక్షకులు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు హ్యాపీ. చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. త్రినాథ్రావుగారు చాలా ఎంటర్టైనింగ్ డైరెక్టర్’’ అన్నారు రామ్. ‘‘డైరెక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా 34 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నా. త్రినాథరావుని చూస్తే.. ఏ కోశానా డైరెక్టర్ లుక్‌లో కనపడడు. కానీ, సినిమాను కంఫర్ట్‌బుల్‌గా తీస్తాడు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ఈ సమావేశంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, రచయితలు సాయికృష్ణ, ప్రసన్న కుమార్, నిర్మాత హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయన మాటలే స్ఫూర్తి
‘‘జీవితంలో మనం చాలా చూస్తుంటాం. గెలుపు, ఓటములు సహజం. అది క్రీడల్లో అయినా, రాజకీయాల్లో అయినా. మా సినిమా వాళ్ల విషయానికి వస్తే సక్సెస్, ఫెయిల్యూర్స్ వచ్చినా సినిమా తీయాలనే ప్యాషన్‌తో ఇక్కడే ఉంటూ.. సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటారు’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘స్రవంతి’ రవికిషోర్‌గారు 30 ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 2002 ఫిబ్రవరి 16న ‘అమృత’ సినిమాని విడుదల చేయడానికి తీసుకున్నాం. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్‌గా నిన్ను చూస్తాను’ అని రవికిషోర్‌గారు అనడంతో సోప్ వేస్తున్నాడనుకున్నాను. ‘బొమ్మరిల్లు’ సక్సెస్‌మీట్‌లో ఆయన గుర్తు చేసే వరకు నాకు గుర్తుకులేదు. నాలో ఏం చూసి ఆయన ఆ మాట అన్నారో తెలియదు. ఇప్పుడు ఏ సినిమా అయినా సక్సెస్ కాకపోతే.. ‘సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. మనం ముందుకెళుతుండాలి’ అని ఆయన చెప్పిన మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయనకు థ్యాంక్స్. ప్రసన్న చెప్పిన కథలోని ఓ పాయింట్‌కి నేను, రామ్, దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌గారు కనెక్ట్ అయ్యాం. ఇది హిలేరియస్ మూవీ.. ఓ అద్భుతమైన పాయింట్‌ని సినిమాలో చూస్తారు’’ అన్నారు. ‘‘రాజుగారి లైఫ్‌లో ప్రేమకథలు ఉన్నాయో లేదో కానీ ప్రతి సినిమాను ఎంతగానో ప్రేమించేస్తారు. త్రినాథరావుగారితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ముందు ప్రేక్షకుడు, ఆ తర్వాతే డైరెక్టర్. ప్రకాశ్‌రాజ్‌గారితో పనిచేయడం గౌరవంగా ఉంటుంది’’ అన్నారు రామ్. ‘‘104 డిగ్రీల జ్వరం ఉన్నా రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. రామ్, ప్రకాశ్‌రాజ్‌గారు పాటను చాలా చక్కగా పాడారు’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా పాటలను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. అనుపమా పరమేశ్వరన్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, పాటల రచయిత శ్రీమణి, నటుడు ప్రవీణ్, రచయిత ప్రసన్నకుమార్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
మరదలు దొరికింది
అత్తారింటికి దారి కనుక్కునే పనిలో తమిళ హీరో శింబు బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయనతో ప్రయాణానికి కేథరిన్ కూడా తోడయ్యారట. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాశ్ ఓ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేథరిన్ థెరీసా కూడా తోడయ్యారు. దీంతో బావకు ఇద్దరు మరదళ్లు దొరికారు. తెలుగులో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. మరి.. మేఘా, కేథరిన్ ఏయే పాత్రలు చేస్తారన్నది ఇంకా బయటకు రాలేదు. అలాగే శింబుకు అత్తగా ఎవరు నటిస్తారన్నది కూడా చిత్ర బృందం వెల్లడించలేదు. ఖుష్బూ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
స్క్రీన్ టెస్ట్
1. కృష్ణ నటించిన ‘కిలాడి కృష్ణుడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ నటి ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) రాధ డి) రాధిక 2. ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) రామ్ చరణ్ సి) ఎన్టీఆర్ డి) అల్లు అర్జున్ 3. మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రం ‘బిందాస్’. ఈ చిత్రంలో ముద్దుకృష్ణ పాత్రలో నవ్వులు పండించిన హాస్య నటుడెవరు? ఎ) బ్రహ్మానందం బి) శ్రీనివాసరెడ్డి సి) యం.యస్. నారాయణ డి) ‘వెన్నెల’ కిశోర్ 4.‘స్నేహగీతం’ చిత్రంలోని ముగ్గురు హీరోలలో ఓ హీరోగా నటించిన నటుడు ఇప్పుడు దర్శకుడు. ఎవరా దర్శకుడు? ఎ) సందీప్ కిషన్ బి) వెంకీ అట్లూరి సి) రాహుల్ రవీంద్రన్ డి) వరుణ్ సందేశ్ 5. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’లో దుల్కర్ సరసన నటించిన ఆ బంగారం ఎవరు? ఎ) అదితీరావు బి) తులసీ నాయర్ సి) నిత్యామీనన్ డి) కార్తీకా నాయర్ 6. రామ్ హీరోగా నటించి విజయం సాధించిన ‘నేను ౖÔð లజ’ చిత్రంలో శైలజ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) సమంత బి) శ్రుతీ హాసన్ సి) కీర్తీ సురేశ్ డి) రాశీ ఖన్నా 7. మొదటి సినిమాతోనే పాటల రచయితగా నంది అవార్డు అందుకున్న రచయిత ఎవరో కనుక్కోండి? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సి) శ్రీమణి డి) చంద్రబోస్ 8. శర్వానంద్, ‘అల్లరి’ నరేశ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గమ్యం’. ఆ చిత్రదర్శకుడెవరు? ఎ) క్రిష్ జాగర్లమూడి బి) భాస్కర్ సి) జి. నాగేశ్వర్ రెడ్డి డి) పరశురామ్ 9. ‘ముద్దబంతి పూవులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు...’ ‘అల్లుడుగారు’ చిత్రంలోని ఈ పాటకు స్వరకర్త ఎవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) కోటి సి) కేవీ మహ దేవన్ డి) మణిశర్మ 10. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ్ రీమేక్‌లో నటిస్తున్న హీరో పేరు ధ్రువ్. ఆయన ఏ ప్రముఖ నటుని కుమారుడో తెలుసా? ఎ) కార్తీక్ బి) విక్రమ్ సి) మురళీ డి) ప్రభు 11. తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఏ చిత్రంలో హీరోయిన్ సదా నటించారో చూడండి? ఎ) శివాజీ బి) బాయ్స్ సి) అపరిచితుడు డి) రోబో 12.‘నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్’ అవార్డును సాధించిన నటునికి భారత ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎంతో తెలుసా? ఎ) 50000 బి) 100000 సి) 25000 డి) 75000 13. రీమా లంబా ఈ నటి అసలు పేరు. ఈ బాలీవుడ్ బ్యూటీ స్క్రీన్ పేరేంటి? ఎ) పూజాభట్ బి) రవీనా టాండన్ సి) సోనాలీ బింద్రే డి) మల్లికా శెరావత్ 14. సుధీర్‌బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘శివ మనసులో శ్రుతి’. ఆ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కథానాయిక ఎవరు? ఎ) ప్రణీత బి) రెజీనా సి) క్యాథరిన్ థెరిస్సా డి) లావణ్యా త్రిపాఠి 15. హను రాఘవపూడి దర్శకత్వంలో తయారవుతున్న నూతన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఆ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నితిన్ డి) నాని 16. ముంబై మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్‌కు ఓనర్స్‌లో ఒకరు సునీల్ గవాస్కర్. మరో ఓనర్ ఈ ప్రముఖ హీరో. ఎవరతను? ఎ) వెంకటేశ్ బి) రానా సి) చిరంజీవి డి) నాగార్జున 17.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘గ్రహణం’. ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన నటి ఎవరు? ఎ) ప్రగతి బి) రేవతి సి) లక్ష్మీ డి) జయలలిత 18.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంలో ఓ హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) నివేథా థామస్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ 19.ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) కీర్తి చావ్లా బి) గజాలా సి) జెనీలియా డి) అంకిత 20. కింది ఫొటోలోని చిన్నారి ఎవరు? చిన్న క్లూ: తను మలయాళ హీరోయిన్ ఎ) నిత్యామీనన్ బి) సాయి పల్లవి సి) అనుపమ డి) నజ్రియా నజీమ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) ఎ 2) ఎ 3) డి 4) బి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) బి 11) సి 12) ఎ 13) డి 14) బి 15) బి 16) డి 17) డి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
ప్రణీత డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో జి. ప్రణీత రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదిలాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ భవన్ కలెక్టర్ చౌక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె యూత్ బాలికల, మహిళల కేటగిరీల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన యూత్ బాలికల ఫైనల్లో ప్రణీత (హెచ్‌వీఎస్) 11–2, 10–12, 11–5, 11–9, 10–12, 11–7తో అంజలి (జీఎస్ఎం)పై విజయం సాధించింది. మహిళల తుదిపోరులో ప్రణీత 11–2, 10–12, 11–5, 10– 12, 11–5, 8–11, 11–6తో మౌనిక (జీఎస్ఎం)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. -
హృదయానికి రెక్కలొచ్చె
హీరో రామ్ మనసు గాలిలో తేలిపోతోంది. ఆయన ప్రేమలో పడటమే ఇందుకు కారణం. మరి.. సక్సెస్ కావడానికి ఆ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందో వెండితెరపై చూడాల్సిందే. రామ్ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే..’. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్‌కు మామయ్య పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. రీసెంట్గా ‘మై హార్ట్ ఈజ్ ఫ్లైయింగ్’ అనే సాంగ్‌ను షూట్ చేశారట. ఈ సినిమాను దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు. -
హలో..ట్రైన్లో చలో!
ట్రైన్లో కూర్చుని ఫ్యాన్ గాలితో కూల్ అవుతున్నారు కథానాయిక అనుపమా పరమేశ్వరన్. ఆమె ఎక్కడికైనా వెళ్తున్నారా? లేక ఎక్కడినుంచైనా వస్తున్నారా? అని అడక్కండి. ఆ విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ డీటైల్స్ని సినిమాలో కలెక్ట్ చేసుకోండి. రామ్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే’. ఇందులో అనుపమా పరమేశ్వర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రణీత మరో కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ట్రైన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్స్‌లో హీరో రామ్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: విజయ్ కె. చక్రవర్తి. -
హాలో పాటలు గురూ
గుండెల్లో ఉన్న ప్రేమను మాటల్లో కంటే పాటల రూపంలో చెబితే మరింత ఎఫెక్ట్‌గా ఉంటుంది. అందుకే లవ్ సినిమాకు ఈ ఎఫెక్ట్‌ను యాడ్ చేయడానికి మ్యూజిక్ సిట్టింగ్స్‌ను స్టార్ట్ చేశారు ‘హలో గురు ప్రేమకోసమే’ టీమ్. రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘హలో గురు ప్రేమకోసమే’. ఇందులో అనూపమ పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలు. మామ– అల్లుళ్ల కథ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ మావయ్య పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ రామ్, దేవీ కాంబోలో వచ్చిన ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల పాటలు బాగా ఆకట్టుకోవడంతో తాజా సినిమా పాటలపై ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. -
ఫర్ ఎ చేంజ్...
‘‘నేను చూజ్ చేసుకుంటున్న రోల్స్ వల్ల నన్ను అందరూ తెలుగు అమ్మాయే అనుకుంటున్నారు’’ అన్నారు హీరోయిన్ ప్రణీత. ‘బావ, రభస, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం’ తదితర సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్. ప్రస్తుతం రామ్ హీరోగా చేస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో ప్రణీత ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో నేనో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. ఇది వరకు నేను చేసిన క్యారెక్టర్లా ఉండదు. అర్బన్ అమ్మాయిగా, కొంచెం గ్లామరస్‌గా నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నా ఇమేజ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తుందనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను అన్నీ హోమ్లీ టైప్ క్యారెక్టర్స్ ప్లే చేశాను. అన్నీ ట్రెడిషనల్ రోల్స్ ప్లే చేయడంతో ఎక్కువగా శారీల, జ్యువెలరీ యాడ్స్ వస్తుండేవి. ఆడియన్స్ ఎక్కడైనా కలసినా కూడా తెలుగులో మాట్లాడుతుంటారు. తెలుగమ్మాయిలా వాళ్లు నన్ను దగ్గర చేసుకున్నారు’’ అని పేర్కొన్నారామె. -
స్క్రీన్ టెస్ట్
► భూమిక చావ్లాతో నటించిన మొదటి తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) యన్టీఆర్ బి) మహేశ్ బాబు సి) సుమంత్ డి) వెంకటేశ్ ► ‘మిస్టర్’ సినిమా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ ఎవరు? ఎ) హెబ్బా పటేల్ బి) ప్రణీత సి) అమలాపాల్ డి) ఆండ్రియా ► నాగార్జున నటించిన ‘శివ’ సినిమాకు మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) యం.వీ.యస్.హరనాథరావు బి) శివనాగేశ్వరరావు సి) తనికెళ్ల భరణి డి) సుద్దాల అశోక్‌తేజ ► బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి ఈ సౌత్ హీరోయిన్ దగ్గరి బంధువు. ఎవరామె? ఎ) ప్రియమణి బి) లక్ష్మీరాయ్ సి) అంజలి డి) గౌతమి ► వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) త్రివిక్రమ్ శ్రీనివాస్ బి) కె. విజయభాస్కర్ సి) పి.వాసు డి) సురేశ్‌కృష్ణ ► నటి చార్మి ప్రస్తుతం హీరోయిన్గా కాకుండా ఓ ప్రముఖ దర్శకునితో కలిసి సినిమా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరేంటి? ఎ) పూరిచార్మి క్రియేటివ్స్ బి) పూరి కనెక్ట్స్ సి) పీసీ కనెక్ట్స్ డి) పీసీ క్రియేట్స్ ► ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా 2015 డిసెంబర్లో రిలీజైంది. మోహన్‌బాబు 23 సంవత్సరాల క్రితం నటించిన ఓ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏ చిత్రానికి ఈ సినిమా సీక్వెలో చెప్పగలరా ? ఎ) అల్లుడుగారు బి) అసెంబ్లీ రౌడి సి) అల్లరి మొగుడు డి) రౌడీగారి పెళ్లాం ► ప్రముఖ యాంకర్ సుమ గతంలో ఓ ప్రముఖ దర్శకుని చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఎవరా దర్శకుడు? ఎ) కె.రాఘవేంద్రరావు బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) ఎ. కోదండరామిరెడ్డి ► శ్రీదేవి, కమల్‌హాసన్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 27 ► ప్రభాస్–అనుష్కల కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ఎ) 7 బి) 3 సి) 5 డి) 4 ► హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది నీ చుట్టునే తిరుగుతున్నది... అనే పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవా బి) హారిస్ జయరాజ్ సి) యువన్ శంకర్ రాజా డి) విశాల్ శేఖర్ ► హీరోలు రానా, శర్వానంద్‌లకు ఈ ప్రముఖ హీరో స్కూల్‌మేట్. ఎవరా హీరో? కనుక్కోండి చూద్దాం? ఎ) యన్టీఆర్ బి) రామ్‌చరణ్ సి) విజయ్ దేవరకొండ డి) అల్లరి నరేశ్ ► అంతకుముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న నటి ఎవరు? ఎ) అవికా గోర్ బి) తేజస్విని మడివాడ సి) శ్రీముఖి డి) ఈషా రెబ్బా ► అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దసరాబుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు? ఎ) వి.మధుసూదనరావు బి) కె.వి.రెడ్డి సి) వి.బి.రాజేంద్రప్రసాద్ డి) కె.విశ్వనాథ్ ► నాగార్జున ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి ? ఎ) ఐయామ్ నాగార్జున బి) నాగార్జున సి) దిస్ ఈజ్ నాగార్జున డి) ఐయామ్ నాగ్ ► ఈ నటి అసలు పేరు సుజాత. అప్పటికే ఆ పేరుతో ఓ నటి ఉండటం వల్ల ఆమె స్క్రీన్ నేమ్ మారిపోయింది . ఆ నటి ఎవరో తెలుసా? ఎ) జయసుధ బి) జయప్రద సి) దివ్యవాణి డి) రంభ ► తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ‘నంది’ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుంyì ప్రారంభించిందో తెలుసా? ఎ) 1975 బి) 1964 సి) 1979 డి) 1993 ► చిరంజీవి నటించిన ‘పసివాడిప్రాణం’ చిత్రంలో ‘పదహారేళ్ల వయసు పడిపడిలేచె మనసు’ అనే పాట ఉంటుంది. ఇప్పుడు ‘పడిపడి లేచె మనసు’ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా హీరో ఎవరు? ఎ) నాని బి) నిఖిల్ సి) నాగచైతన్య డి) శర్వానంద్ ► ఈ ఫోటోలోని ఇప్పటి హీరో ఎవరో కనుక్కోండి? ఎ) శర్వానంద్ బి) కల్యాణ్‌రామ్ సి) అజిత్ డి) మాధవన్ ► అక్కినేని, సావిత్రి నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) మనుషులు మమతలు బి) మిస్సమ్మ సి) గుండమ్మకథ డి) డాక్టర్ చక్రవర్తి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) బి 6) సి 7) సి 8) బి 9) డి 10) డి 11) బి 12) బి 13) బి 14) సి 15) ఎ 16) ఎ) 17) బి 18) డి) 19) ఎ 20) ఎ నిర్వహణ శివ మల్లాల