
అమ్మో.. బాపుగారి బొమ్మో
కదిరి : సినీనటి ప్రణీత గురువారం కదిరిలో సందడి చేసింది. ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. కదిరి ప్రాంత ప్రజలు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగులో ప్రస్తుతానికి తనకు సినిమాలు లేవని చెప్పారు. తాను హీరోయిన్‌గా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా.. అనే పాట తనకెంతో ఇష్టమన్నారు. అందుకే కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించానని చెప్పారు.