kadiri
-
వైఎస్ జగన్ మీద అసభ్యకరమైన పోస్టులపై YSRCP లీగల్ సెల్ ఫిర్యాదు
-
చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!
చరిత్రలో విషాదకరంగా మిగిలిన ఎన్నోప్రేమ కథలను చూశాం. అయితే అవే కాకుండా మన చుట్టు పక్కలే జరిగిన యదార్థ ప్రేమ సంఘటనలు ప్రాచుర్యం లేక కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని ఒక్కసారి పరికించి తెలుసుకునే యత్నం చేస్తే హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రియల్ లవ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ తరానికి తెలియకుండా మసకబారుతున్న శతాబ్దల నాటి ఆ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.కదిరి నరసింహా దేవాలయంలో చిగురించి ఈ ప్రేమకథ. ఇరాన్ దేశం నుంచి మోహియార్ అనే యువకుడు వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో కదిరి నరసింహ దేశాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగరాయల కూతురైన చంద్రవదన స్వామివారిని దర్శనం కోసం వచ్చింది. అప్పుడు ఆ యువతిని చూసిన మెహియర్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. చంద్రవదన కూడా పేరుకు తగినట్లుగా పున్నమి నాటి చంద్రుడిలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మెహియర్ ఆమెను అనుసరిస్తూ..ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్తుండేవాడు. దీన్ని గమనించిన చంద్రవదన కూడా ఆ యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కదిరి పట్టణం వాసుల గారాల పట్టి కావడంతో ఇరువురు కలుసుకోవడం అత్యంత కష్టంగా ఉండేది. దీంతో ఇద్దరు తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. చివరికి తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తారు. వారి సమ్మతితోనే పెళ్లిచేసుకోవాలనే భావిస్తారు. అందుకు పెద్దలు అంగీకరించారు. పైగా ఆ ప్రేమికులు ఇద్దరిని కలుసుకోనివ్వకుండా కట్టుదిట్టం చేస్తారు. దీంతో విరహవేదనను భరించలేక మెహియర్ పూర్తిగా నిద్రహారాలు మానేస్తాడు. అలా మెహియర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు. తన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడిని తలుచుకుంటూ చంద్రవదన కూడా తుదిశ్వాస విడుస్తుంది. ఈ ఘటనతో కదిరి గ్రామం వాసుల ప్రజలు తామెంతో తప్పు చేశామని బాధపడతారు. కనీసం మరణంలోనైన ఇరువురు కలిసి ఉండాలని భావించి ఇరువురు సమాధులను ఒకచోటే ఏర్పాటు చేస్తారు గ్రామస్తులు. ఈ ప్రాంతంలోని అనేకమంది తమ పిల్లలకు మెహియార్ అనే పేరులు పెట్టుకుని ఆ అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. అంతేగాదు వారి సమాధిని దర్శిస్తే తమ ప్రేమ ఫలిస్తుందనేది ప్రేమికుల నమ్మకం కూడా. దీంతో ఈ సమాధులను దర్శించుకునేందుకు ప్రేమికుల తాకిడి కూడా గట్టిగానే ఉండేది. అయితే రాను రాను తర్వాతి తరాలకు తెలియకుండా మసకబారడం మొదలైంది. దాంతో సందర్శకుల తాకిడి నెమ్మదిగా తగ్గిపోయింది.(చదవండి: 'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
AP: సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం.. టీ కేఫ్‌లో కీలక ఫైళ్లపై సంతకాలు!
సాక్షి, కదిరి: కూటమి సర్కార్ పాలనలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఆఫీసుల్లో చేయాల్సిన పనులు.. టీ షాపుల్లో, కేఫ్‌ల్లో, తమకు నచ్చిన చోట చేస్తున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ఓ టీ కేఫ్‌లో కూర్చొని రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేయడం దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కానీ, శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై చకచకా సంతకాలు చేశారు. ఈ ఫైళ్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అక్కడికి తీసుకెళ్లడం గమనార్హం. అయితే, ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలు పెంచిన నేపథ్యంలో అవి అమల్లోకి రావడానికి ముందు రోజు (శుక్రవారం) భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా సబ్ రిజిస్ట్రార్ ఈ నిర్వాకానికి ఒడిగట్టారు.శుక్రవారం ఉమ్మడి జిల్లాలోనే గరిష్టంగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 139 రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో భారీ మొత్తాలు చేతులు మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. కార్యాలయ సిబ్బందిని అడగ్గా.. సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్నట్లు తెలిపారు. సెలవులో ఉన్నప్పటికీ టీ కేఫ్‌లో కూర్చొని డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కార్యకర్తలకు అండగా ఉంటాం..
-
విషమంగానే ‘నాగరాజు’ పరిస్థితి
సత్యసాయి జిల్లా: కదిరిలో నాగుపాముతో ఆటలాడి.. కాటుకు గురైన యువకుడు నాగరాజు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అతను బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని గురువారం ఉదయం బులిటెన్ ద్వారా ప్రకటించారు. పూటుగా మద్యం సేవించిన నాగరాజు.. రోడ్డు మీద ఓ నాగుపాముతో ఆటలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న నాగరాజు ఆ యువకుడు అక్కడున్న వారు వద్దని చెప్పినా వినిపించుకోలేదు. నాగుపాము తల వద్ద చేయి పెట్టి ఆడుతుండగా అది కాటేసింది. పాము కాటేసినా నాగరాజు దాన్ని వదలలేదు. దాన్ని కాలుతో తొక్కాడు. చివరకు అది పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వాత నాగరాజును బలవంతంగానే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. … pic.twitter.com/cV7yv0iQ2v— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024 -
కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
-
కదిరి టీడీపీ అభ్యర్థి కారులో రూ.2 కోట్ల నగదు
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు చెందిన ఫార్చునర్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మంగళవారం అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. స్థానిక విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా అనంతపురం టూటౌన్ పోలీసులు స్పెషల్ పార్టీ, మొబైల్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 39 ఆర్క్యూ 0999 ఫార్చునర్ వాహనాన్ని తనిఖీ చేశారు. మూడు బ్యాగుల్లో నగదు పట్టుబడింది. దాన్ని లెక్కించి రూ.1,99,97,500 ఉన్నట్టు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి.. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. రామ్‌నగర్ నుంచి తరలిస్తూ.. కందికుంట వెంకటప్రసాద్ కారు డ్రైవర్ సోమవారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తిని పికప్ చేసుకుని అనంతపురం రాజు రోడ్డులోని టీడీపీ నాయకుడికి చెందిన మాసినేని హోటల్లో దించినట్టు సమాచారం. రాత్రి అక్కడే బస చేసిన డ్రైవర్ మంగళవారం ఉదయం అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి మూడు బ్యాగుల్లో నగదు సమకూర్చుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యానగర్ రోడ్డు మీదుగా నేరుగా కదిరికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. తనిఖీలు ఉంటాయనే ఉద్దేశంతో విద్యుత్ నగర్ సర్కిల్ మీదుగా వాహనాన్ని మళ్లించారు. కానీ.. పోలీసులు విద్యుత్ నగర్ సర్కిల్లోనూ వాహన తనిఖీలు చేపట్టడంతో నగదు పట్టుబడింది. కారు కందికుంట పేరుతోనే.. ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబర్ గల ఫార్చునర్ కారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరుతోనే రిజి్రస్టేషన్ అయింది. నగదు పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే వెంకటప్రసాద్ నల్లచెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని కదిరిలోని ఇంటికి వెళ్లిపోయారు. కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు వస్తుండటంతో కందికుంట అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు నగదు ఎర వేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం, ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తెప్పించుకుని కదిరిలో పంచేలా ప్రణాళిక రచించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఆదాయపు పన్ను అధికారుల విచారణ వెంకటప్రసాద్ వాహన డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరిచ్చారు? ఇందుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా నగదు తీసుకెళ్తూ పట్టుబడితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదును తరలించడానికి గల కారణాలు ఏమిటి? బ్లాక్ మనీ కాకపోతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ఎవరి నుంచి తీసుకున్నారు? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో నగదు ఇవ్వాల్సి వచ్చింది? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు. -
కదిరి టీడీపీ అభ్యర్థి.. కోటిన్నర నగదు పట్టివేత
-
కబ్జాల కందికుంట
కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్ అలియాస్ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్ చేయించుకోండని ఖాజామోద్దీన్ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్ మనవడు అమీర్‌ఖాన్ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. -
అభిమానిపై చెయ్యి చేసుకున్న బాలకృష్ణ
-
కదిరిలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఎదురు తిరిగిన టీడీపీ కార్యకర్తలు.. దండం పెట్టి పారిపోయిన లోకేష్
-
Brown Top Millet ఒక్కసారి విత్తితే.. నాలుగు పంటలు!
అండుకొర్ర.. చిన్న చిరుధాన్యా(స్మాల్ మిల్లెట్స్)ల్లో విశిష్టమైన పంట. పంట కాలం 90–100 రోజులు. ధాన్యపు పంట ఏదైనా కోత కోసి, దుక్కి చేసిన తర్వాత మళ్లీ పంట రావాలంటే తిరిగి విత్తనాలు ఎదపెట్టాల్సిందేనని మనకు తెలుసు. అయితే, అండుకొర్ర పంటను రెండేళ్లుగా సాగు చేస్తున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కె. హేమాద్రిరెడ్డి అనుభవం అందుకు భిన్నంగా ఉంది. 2022 జూౖలై లో తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తనం వేసి, అక్టోబర్‌లో పంట కోసుకున్నారు. నవంబర్‌లో దుక్కిచేసి మినుము చల్లి, నీటి తడి పెట్టారు. అండుకొర్ర వత్తుగా మొలవటంతో ఆశ్చర్యం కలిగింది. అండుకొర్ర కోత కోసే సమయంలో రాలిన ధాన్యమే నెల రోజుల తర్వాత దుక్కి చేసి తడి పెట్టగానే మొలిచిందన్నమాట. మినుము మొలకలు కనిపించినా అవి ఎదగలేకపోయాయి. అండుకొర్ర ఏపుగాపెరిగింది. సరే.. ఇదే పంట ఉండనిద్దామని నిర్ణయించుకొని.. ట్రాక్టర్‌తో సాళ్లు తీసి అండుకొర్ర పంటనే కొనసాగించారు. అదే విధంగా మూడు పంటలు పూర్తయ్యాయి. నాలుగో పంట ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందని, ప్రతి పంటలోనూ ఎకరానికి 10 క్వింటాళ్ల అండుకొర్ర దిగుబడి వస్తోందని, పంట పంటకు దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, తక్కువ ఖర్చుతోనే అండుకొర్ర పంట అధికాదాయాన్ని అందిస్తోందని రైతు హేమాద్రి రెడ్డి సంతోషంగా చెప్పారు. అనంతపురంలో ఇటీవల జరిగిన మూడు రోజుల చిరుధాన్యాల సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ‘సాక్షి సాగుబడి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. కదిరికి చెందిన ఎర్త్ 360 సంస్థ వ్యవస్థాపకులు దినేశ్ సూచనలు, సహాలతో చిరుధాన్యాల సాగు చేపట్టానని ఆయన తెలిపారు. కలుపు బాధ లేని అండుకొర్ర పంట 40 ఎకరాల ఆసామి అయిన హేమాద్రిరెడ్డి సాగు భూమిని చాలా కాలంగా కౌలుకు ఇస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం మనుమడి సూచన మేరకు 5 ఎకరాల్లో అండుకొర్ర చిరుధాన్యాల సాగు ్ర΄ారంభించారు. కూలీల కొరతతో ఇబ్బంది అవుతుందని తొలుత సంశయించానని, అయితే అండుకొర్ర పంటకు కలుపు సమస్య లేక΄ోవటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేని చక్కని పంట అండుకొర్ర అన్నారాయన. కలుపు మొక్కల కన్నా అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతుంది. అందువల్ల కలుపు పెరిగే అవకాశమే లేదన్నారు. దీంతో ప్రయాస లేకుండానే పంట చేతికి వస్తోందని, యంత్రంతో కోతలు జరుపుతున్నారు. ఇప్పుడు మొత్తం 20 ఎకరాలకు అండుకొర్ర సాగును విస్తరించారు. మోళ్లు కలియదున్నుతాం.. దుక్కి చేసిన తర్వాత గొర్రెలను పొలంలో నిల్వగడతారు. గొర్రెల మలమూత్రాలు పొలాన్ని సారవంతం చేస్తాయి. ఆ తర్వాత కలియదున్నిన తర్వాత వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే ట్రాక్టర్ గొర్రుతో ఎకరానికి 5 కిలోల అండుకొర్ర విత్తనాలను తొలి ఏడాది విత్తారు. రెండో పంట నుంచి.. పంట కోత తర్వాత మోళ్లను రొటవేటర్‌తో భూమిలో కలియదున్నుతున్నారు. పంట కాలంలో మూడు దఫాలు హంద్రీ నది నుంచి మోటారుతో తోడిన నీటిని పారగడుతున్నారు. నల్లరేగడి నేల కావటంతో ఎక్కువగా తడి ఇవ్వటం లేదని, ఇది మెట్ట పంట కాబట్టి నీరు ఎక్కువ పెడితే రొట్ట పెరుగుతుంది తప్ప దిగుబడి రాదని హేమాద్రి రెడ్డి వివరించారు. గొర్రెలు ఆపటానికి ఎకరానికి రూ. 1,500 ఖర్చవుతోంది. దుక్కి, అంతర సేద్యం అంతా సొంత ట్రాక్టర్‌తోనే చేస్తున్నారు. బయటి ట్రాక్టర్‌తో ఈ పనులు చేస్తే ఎకరానికి పంటకు రూ. 3 వేలు ఖర్చు వస్తుంది. ‘అంతకు మించి చేసేదేమీ లేదు. చీడపీడలు, తెగుళ్ల సమస్య లేదు కాబట్టి పురుగుమందుల పిచికారీ అవసరం రావటం లేద’న్నారాయన. కలుపు, చీడపీడల సమస్యలు లేని, కూలీల అవసరం పెద్దగా లేని అండుకొర్ర పంటను సునాయాసంగా సాగు చేస్తూ.. క్వింటాకు రూ. 9,500 ఆదాయం పొందుతున్నానని హేమాద్రిరెడ్డి తెలిపారు. మిషన్‌తో పంట కోత ఖర్చు, గడ్డి అమ్మితే సరిపోతోందన్నారు. కొర్ర కూడా సాగు చేస్తున్నానని, వచ్చే సీజన్ నుంచి అరికలు కూడా వేద్దామనుకుంటున్నానన్నారు. అండుకొర్ర అద్భుత పంట అద్భుతమైన చిరుధాన్య పంట అండుకొర్ర.. కలుపును ఎదగనివ్వదు. ఈ విత్తనానికి నిద్రావస్థ పెద్దగా ఉండదు. గింజ బాగా తయారైన తర్వాత కోత కోసి నూర్పిడి చేస్తే, వారం రోజుల తర్వాత మొలుస్తుంది. ఒక్కసారి విత్తి వరుసగా నాలుగో పంట తీసుకుంటున్న హేమాద్రిరెడ్డి సాగు అనుభవం రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. పంట కోసిన తర్వాత మోళ్లను భూమిలోకి కలియదున్నటం, గొర్రెలను నిలపటం వల్ల భూమి సారవంతమవుతోంది. మార్కెట్లో అండుకొర్రలు సహా అన్ని చిరుధాన్యాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ధర తగ్గే ప్రమాదం లేదు. దినేశ్ (94408 70875), చిరుధాన్యాల నిపుణుడు, ఎర్త్ 360, కదిరి క్వింటా రూ.9,500 రెండేళ్ల క్రితం తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పంటా ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తొలి పంట క్వింటా రూ. 5 వేలకు అమ్మాను. రెండో పంటను క్వింటా రూ.7,500కు అమ్మాను. గత ఏడాది ఖరీఫ్‌లో మరో 15 ఎకరాల్లో కూడా అండుకొర్ర వేశా. మూడో పంటను క్వింటా రూ. 9,500కు అమ్మాను. నాలుగో పంట కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. రైతులకు విత్తనంగా కూడా ఇస్తున్నాను. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చులు పోగా మంచి నికరాదాయం వస్తోంది. 3 సార్లు నీరు కడుతున్నాం. నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గిపోతుంది. ఒక పొలంలో జనుము సాగు చేసి రొటవేటర్ వేస్తే ఆ తర్వాత అండుకొర్ర దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రయాస లేని పంట అండుకొర్ర. – కె. హేమాద్రిరెడ్డి (92469 22110), అండుకొర్ర రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా -
కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో ఐ-టీడీపీ కార్యకర్త సతీశ్ లైంగిక వేధింపులు
-
బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు హయాంలో ‘తెలుగు తమ్ముళ్లు’ లంచాలు, దౌర్జన్యాలతో పనులు కానిచ్చుకున్నట్లుగానే ఇప్పుడూ బరితెగిస్తున్నారు. తమ పనులు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు డబ్బులు ఎరగా వేసేందుకూ వెనుకాడడంలేదు. ఇందుకు తాజాగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండల రెవెన్యూ అధికారికి లంచం ఇచ్చేందుకు ఏకంగా టీడీపీ మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డే ప్రయత్నించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ వివరాలు.. కదిరిలో పల్లె రఘునాథరెడ్డికి సంబంధించి శ్రీవివేకానంద పేరుతో డిగ్రీ కాలేజీ ఉంది. కాలేజీకి సెక్యూరిటీ కార్పస్ ఫండ్ కోసం సైదాపురం రెవెన్యూ పొలంలో 38/1, 38/2, 38/5, 38/6 సర్వే నంబర్లలోని 4.5 ఎకరాల స్థలాన్ని పూచీగా చూపించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని సుమారు 88 ప్లాట్లుగా విభజించి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎలాంటి హద్దులు చూపకుండానే అమ్మకాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి.. అనుమతుల్లేవని తేల్చారు. ఈ తతంగం చాలారోజుల క్రితమే జరిగింది. ప్రస్తుతం ఈ స్థలానికి అధికారిక అనుమతులివ్వాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, వారు ససేమిరా అన్నారు. చదవండి: బండారూ.. తప్పుడు ప్రచారం మానుకో.. డబ్బు ఎరగా చూపి.. రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి పల్లె రఘునాథరెడ్డిపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అనుమతులివ్వాలని కోరారు. లంచాలు ఇచ్చేందుకూ ప్రయత్నించారు. డబ్బు వద్దని.. నిబంధనల ప్రకారమే పనిచేస్తామని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. తాజాగా.. సోమవారం ఉదయం కూడా కదిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పల్లె రఘునాథరెడ్డి తన చేతిలో ఇలా‘నోట్లు’ పట్టుకుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మోసపూరిత బుద్ధి మానుకుంటే మంచిది : ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అవినీతికి పాల్పడటం, అక్రమాలు చేయడం టీడీపీ నేతలు మానుకుంటే మంచిది. సెక్యూరిటీ కార్పస్ ఫండ్‌కు అనుమతులు తీసుకున్న స్థలంలో ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం సరికాదు. మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ఎలాంటి అనుమతులివ్వడం సాధ్యంకాదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. అయితే.. డబ్బులతో అధికారులకు గాలం వేయాలని పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటు. -
కదిరి కుట్టాగల రైల్వేస్టేషన్ వద్ద ట్రైన్ డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
-
కదిరిలో తప్పిన రైలు ప్రమాదం
-
కదిరి వద్ద తప్పిన రైలు ప్రమాదం
సాక్షి, శ్రీసత్యసాయి: ఓవైపు ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.. వైఫల్యం గురించి చర్చ నడుస్తున్న వేళ.. మరోవైపు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. కదిరిలో రైలు ప్రమాదం తప్పింది. కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యధేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. అటు ఇటు వాహనాలు నిలిపివేశారు. గేటు వేయకపోవడాన్ని గమనించి రైలును ఆపేశాడు ట్రైన్ పైలట్. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): పదోన్నతి పొందిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఈ నెల 24న ఉత్తర్వులు విడుదలయ్యాయి. సవరించిన కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1వ తేదీన వారంతా వేతనాలు అందుకోనున్నారు. దీనికితోడు పదోన్నతి పొందిన నాటి నుంచి వారికి రావాల్సిన వేతన బకాయిలు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో 2,096 మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్ డీఎంలు, 148 మంది గ్రేడ్–1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్–1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్లు, 198 మంది మెకానిక్‌లు, 322 మంది సూపర్వైజర్లు, 44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు. మనసున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా సరే 2,096 మందికి పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం వారికి పే రివిజన్‌ను క్రమబద్ధీకరించారు. మనసున్న సీఎంవైఎస్ జగన్‌కి ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటికీ మద్దతుగా నిలుస్తారు. – చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్ యూనియన్ సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్మికులకు దేవుడయ్యారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి పొందిన మాలాంటి 2,096 మందికి కొత్త పీఆర్సీ అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. సీఎంకు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం జీవితాంతం రుణపడి ఉంటాం. – మోకా హరిమోహన్, అసిస్టెంట్ మేనేజర్, కదిరి డిపో -
కదిరి టీడీపీ ఇన్చార్జ్ ‘కందికుంట’ బరితెగింపు
కదిరి టౌన్: టీడీపీ నేతలు అరాచకాలు పెచ్చుమీరిపోయాయి. కొద్దిరోజుల క్రితం కృష్ణా జిల్లా గన్నవరంలో సీఐపై టీడీపీ నేతల దాడిని మరువకముందే.. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోనూ ఒక సీఐపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ బరితెగించారు. తన అనుచరులతో కలిసి శనివారం రాత్రి ఏకంగా పట్టణ సీఐ మధు ఇంటిపై దాడికి తెగబడ్డారు. దౌర్జన్యాలు, భూ దందాలకు కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ పేరుగాంచారు. కదిరికి సీఐ మధు రాకతో కందికుంట అరాచకాలకు అడ్డుకట్ట పడింది. దీంతో ఆయనపై ఎలాగైనా దాడి చేయాలని కందికుంట కొన్నాళ్లుగా కుట్రపన్నుతున్నారు. ఇప్పటికే ఒకసారి దాడికి ప్రయత్నించారు. అయినా భయపడకుండా సీఐ విధులు నిర్వర్తిస్తుండడంతో ఓర్వలేని కందికుంట.. శనివారం రాత్రి తన అనుచరులతో కలిసి కదిరి ఎన్జీవో కాలనీలో ఉన్న సీఐ నివాసంపైన దాడికి తెగబడ్డారు. ‘రేయ్ సీఐ మధు ఎక్కడరా నువ్వు.. రా తేల్చుకుందాం’ అంటూ నానా దుర్భాషలాడారు. ఆ సమయంలో సీఐ ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకుని వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను పంపించేశారు. అక్కడితో ఆగని కందికుంట... మళ్లీ అనుచరులతో కలిసి సైదాపురం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. మీసాలు మెలేసి తొడకొట్టి హంగామా సృష్టించారు. దీంతో కొన్ని గంటలపాటు వాహనాలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో కొందరు వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. కందికుంటపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
కదిరిలో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు!
సాక్షి, సత్యసాయి: జిల్లాలోని కదిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆక్రమణల తొలగింపు వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. సీఐ మధు ఇంటిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ సందర్బంగా సీఐకి మద్దతుగా వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్లలో విచ్చక్షణా రహితంగా దాడులు చేశారు. కాగా, ఈ దాడులను కదిరి టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రేరేపించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటప్రసాద్.. పోలీసులను దుర్బాషలాడుతూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. -
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
Palle Raghunatha Reddy: పుట్టపర్తిలో ఓటమి భయం.. కదిరిలో టికెట్ కష్టం
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రానున్న ఎన్నికల్లో బరిలే నిలిచేందుకు ఆయన సిద్ధమవుతుండగా, అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. పైగా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై స్పష్టత లేదు. పుట్టపర్తిలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. అందువల్లే కదిరి నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందన్న దానిపై వ్యక్తిగత సర్వే చేపట్టినట్లు సమాచారం. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ మనుగడ కష్టంగా మారింది. రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీలో పని చేసినా.. ప్రస్తుతం తగిన గుర్తింపు లేకపోవడంతో పార్టీలో కొనసాగాలా? వీడాలా? అనే సందిగ్దంలో పడ్డారు. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందో? లేదో? తెలియని పరిస్థితి. దీనికి తోడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా.. గెలుస్తామన్న నమ్మకం లేదు. దీంతో ఆయన అనుచర వర్గం కూడా అయోమయంలో పడిపోయారు. పల్లె వెంట నడవాలా? వద్దా? అనే అనుమానంతో స్తబ్ధతగా ఉండిపోయారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేసేందుకు పల్లె రఘునాథరెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే టీడీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరుతారనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఆయన వెంట నడిచేందుకు టీడీపీ కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. అసమ్మతి నేతల బెడద.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి భారీ వ్యతిరేకత ఉంది. మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న టీడీపీ హయాంలో కూడా పల్లెపై తిరుగుబాటు చేశారు. దీనికి తోడు రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకత ఉంది. నల్లమాడ మండలానికి చెందిన సైకం శ్రీనివాసరెడ్డికి పల్లె రఘునాథరెడ్డికి పడదు. అంతేకాకుండా సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తికి చెందిన పెదరాసు సుబ్రమణ్యం టీడీపీకి అనుకూలంగా ఉన్నా... పల్లెకు వ్యతిరేకం. ఇప్పటికే రెండుసార్లు ప్రెస్మీట్లో తన అసమ్మతి బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ పుట్టపర్తిని వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్వం వైఎస్సార్సీపీ కైవసం.. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ, అమడగూరు మండలాలు గతంలో టీడీపీకి అనుకూలంగా ఉండేవి. అయితే 2019 నుంచి ఈ రెండు మండలాల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. అమడగూరు మండలంలోని పది పంచాయతీ సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిసార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్.. పల్లె రఘునాథరెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన అల్లాబకాష్, ఇస్మాయిల్ కూడా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ‘పల్లె’కు సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ‘పల్లె’ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కదిరి నుంచి పోటీ?.. పుట్టపర్తిని దాదాపుగా వద్దనుకుంటున్న పల్లె రఘునాథరెడ్డి వచ్చే ఎన్నికల్లో కదిరి నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన సొంత మండలం తనకల్లు కావడంతో కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అధిష్టానం కందికుంట వెంకటప్రసాద్‌ను కాదని.. పల్లెకు కదిరి టికెట్ ఇచ్చే సాహసం చేయదు. అందువల్లే ‘పల్లె’నే దీనికి ప్రత్యామ్నాయ మార్గం సూచించినట్లు సమాచారం. కందికుంట వెంకట ప్రసాద్‌ను ధర్మవరం నుంచి బరిలో దింపి.. తనకు కదిరి టికెట్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది. వెంటాడుతున్న ఓటమి భయం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడంతో ఈప్రాంత వాసులంతా వైఎస్సార్ సీసీ వెంట నడుస్తున్నారు. ఇక జాతీయ రహదారి 342కు శ్రీకారం, బెంగళూరు నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి శ్రీకారంతో జనం ఆలోచనా విధానం కూడా మారింది. అభివృద్ధికే పట్టం కట్టాలని వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులనే జెడ్పీటీసీ సభ్యులుగా గెలిపించారు. ప్రజాభిమానంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లోని 15 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో ఓటమి భయం వెంటాడుతుండగా.. పల్లె ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. (క్లిక్ చేయండి: పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?!) -
అతను మృగాడే.. వెలుగులోకి ఇంతియాజ్ ఆగడాలు
సాక్షి, కదిరి(అనంతపురం జిల్లా): రాళ్లపల్లి ఇంతియాజ్. కందికుంట అనుచరుడు. తెలుగు యువత నల్లచెరువు మండల ప్రధాన కార్యదర్శి. మెడలో పసుపు కండువాతో కనిపించే ఇంతియాజ్‌కు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవటం అలవాటు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించడం.. ఆ తర్వాత వారిని లైంగికంగా వేధించడం అతనికి పరిపాటి. ఈ క్రమంలోనే తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణిని వేధించాడు. ‘నన్ను ప్రేమించక పోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతాను’ అంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో తాను ఇంతియాజ్ వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టంగా పేర్కొంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. గతంలోనూ ఓ యువతికి వేధింపులు ఇంతియాజ్ గతంలోనూ నల్లచెరువు మండలంలో ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వేధించాడు. దీంతో సదరు యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన టీడీపీ పెద్దలు దుప్పటి పంచాయితీ చేసి అతనిపై కేసు లేకుండా చేశారు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, ప్రేమలోకి దింపడం, చివరకు బ్లాక్మెయిల్ చేసి కామవాంఛ తీర్చుకోవడం ఇంతియాజ్‌కు అలవాటుగా మారింది. కుటుంబ పరువు బజారున పడుతుందనే భయంతో ఎంతోమంది తమకు జరిగిన అన్యాయాన్ని బయట చెప్పుకోలేక పోయారు. సంధ్యారాణి ఆత్మహత్య ఘటనతో ఇంతియాజ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చంపుతామని సీఐకి బెదిరింపు ఇటీవల కదిరి ఎన్జీఓ కాలనీకి సంబంధించిన భూ వివాదంలో దూరిన కందికుంట, ఆయన అనుచరులు భూ యజమానులపై దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో జేసీబీ అద్దాలు పగలగొట్టడంతో పాటు వారి ఆగడాలను అడ్డుకోవాలని చూసిన పట్టణ సీఐ తమ్మిశెట్టి మధుపై కూడా దాడికి యత్నించారు. వారిలో సంధ్యారాణి మృతికి కారణమైన రాళ్లపల్లి ఇంతియాజ్ కూడా ఉన్నారు. ‘మా అన్న కందికుంటనే అడ్డుకుంటావా? నీకెంత ధైర్యం. నిన్ను నరికి చంపుతాం..’ అంటూ కందికుంట అనుచరుడు మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో బాగా వైరల్ అయింది. అయినా పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందువల్లే పేట్రేగి పోతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో హైడ్రామా కదిరి టౌన్: సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు శుక్రవారం ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకోగా, అతను నాటకానికి తెరలేపాడు. కదిరి కోర్టులో, ప్రభుత్వ ఆస్పత్రిలో తనను పోలీసులు కొట్టారంటూ హంగామా చేశాడు. అంతకుముందు తనకు ఆరోగ్యం సరిగా లేదని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన వైద్యులు అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. దీంతో పోలీసులు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇంతియాజ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
సాక్షి, కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్న టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ తనను లైంగికగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది. చదవండి: డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్ ఫోటోలు ఆన్లైన్లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కదిరి రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. -
శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఎన్జీవో కాలనీలో ప్రజలు కొనుగోలు చేసిన భూమిలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఆ భూమి తమదంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం జేసీబీని ధ్వంసం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చదవండి: (అనంతలో టీడీపీ నేతల దౌర్జన్య కాండ) -
వేరుశనగ నూతన వంగడం @ కదిరి
వేరుశనగ సాగుకు దేశంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా పేరుగాంచింది. కానీ అతివృష్టి, అనావృష్టి, చీడపీడలతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. ఈ క్రమంలోనే కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతుకు అండగా నిలిచారు. పరిశ్రమిస్తూ.. పరిశోధన చేస్తూ నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు తట్టుకునే విత్తనాన్ని ఉత్పత్తి చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. కదిరి: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రం రాష్ట్రానికే తలమానికం. ఇక్కడ ఉత్పత్తి చేసిన వేరుశనగ విత్తన రకాలు దేశ వ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దాదాపు 14 రకాల నూతన వంగడాలను కదిరి పరిశోధన స్థానం ఉత్పత్తి చేసింది. జాతీయ వేరుశనగ ఉత్పత్తిలో 50 శాతం కే–6 వంగడానిదే కావడం గమనార్హం. అనంత నుంచి కదిరికి మార్పు.. 1954లో ప్రాంతీయ నూనె గింజల పరిశోధన కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేశారు. పరిశోధనకు అనువైన వాతావరణ పరిస్థితులు, తగిన నేలకోసం 1959లో కదిరికి తరలించారు. 1982లో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అనుబంధం చేశారు. 1985లో పూర్తిస్థాయి పరిశోధన కేంద్రంగా మారింది. అనేక మంది శాస్త్రవేత్తలు 40 ఎకరాల విస్తీర్ణంలోని పొలాల్లో నిరంతరం శ్రమిస్తుంటారు. ఒక కొత్తరకం వంగడం కనుక్కొని విడుదల చేయడానికి 8 ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూలవిత్తనంపై 50 శాతం సబ్సిడీ.. కదిరి పరిశోధన స్థానం విడుదల చేసిన వేరుశనగ మూల విత్తనాన్ని రైతులకు జగన్ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఈ సబ్సిడీని ఎత్తేశారు. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం రాయితీని తిరిగి పునరుద్ధరించింది. కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మూలవిత్తనం తీసుకెళ్లి పండించిన దిగుబడులను సైతం మళ్లీ రైతులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. మూలవిత్తనం కొనుగోలు సమయంలోనే ఇక్కడి శాస్త్రవేత్తలు దిగుబడుల కొనుగోలుపై రైతులతో ఒప్పందం చేసుకుంటారు. పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు.. కదిరి–1(కె–1), కదిరి–2(కె–2), కదిరి–3(కె–3), వేమన, కదిరి–4(కె–4), కదిరి–5(కె–5), కదిరి–6(కె–6), కదిరి–7(కె–7), కదిరి–8(కె–8), కదిరి–9(కె–9), కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి ఇలా మొత్తం 14 నూతన వంగడాలను కనుగొని మార్కెట్లోకి విడుదల చేశారు. 1971లో మొట్టమొదట కే1 రకం ఇక్కడ విడుదల చేశారు. ప్రస్తుతం అధిక దిగుబడి నిచ్చి, బెట్టను బాగా తట్టుకునే కదిరి–6, కదిరి 7, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి–9, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి(కె1812) రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అధిక దిగుబడినిచ్చే రకాలు.. కదిరి లేపాక్షి (కె1812): ఈ వంగడాన్ని 2020 సంవత్సరంలో విడుదల చేశారు. ఖరీఫ్‌లో హెక్టారుకు 35 క్వింటాళ్లు, రబీలో 45 నుంచి 50 క్వింటాళ్ల దాకా దిగుబడినిస్తుంది. పంట కాలం 112 రోజులు. ఆకుమచ్చ, వైరస్ తెగులు, రసం పీల్చే పచ్చదోమ, తామర వంటి చీడపీడలను బాగా తట్టుకోగలదు. బెట్ట పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. కదిరి అమరావతి: ఈ రకం విత్తనాన్ని 2016లో విడుదల చేశారు. ఇది కె–6, ఎన్సీఏసి 2242 రకాలను సంకరణ చేసి అభివృద్ధి చేసిన గుత్తి రకం. 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికొస్తుంది. హెక్టారుకు 1,705 కిలోల దిగుబడినిస్తుంది. నీటి ఆధారంగా సగటున 2,590 కిలోల దిగుబడి వస్తుంది. మొవ్వకుళ్లు, ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులతో పాటు బెట్టను కూడా బాగా తట్టుకోగలదు. కదిరి–6(కె–6) : ఈ విత్తనం 2002లో విడుదలైంది. గింజ పరిమాణం జేఎల్ 24 కన్నా 5 శాతం పెద్దగా ఉంటుంది. పంట కాలం 110 రోజులు. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి 880, రబీలో 1,600 నుంచి 1,700 కిలోల దిగుబడి నిస్తుంది. ఆకర్షణీయమైన గింజ నాణ్యత వల్ల మన దేశ ఎగుమతిలో 60 శాతం కె–6 రకం ఉంది. దేశ వేరుశనగ విస్తీర్ణంలోనూ 50 శాతం వరకు ఆక్రమించింది. దీన్ని ‘ఫ్రైడ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. కదిరి–7(కె–7): ఇది పెద్ద గుత్తి రకం విత్తనం. పంట కాలం ఖరీఫ్‌లో 120 నుంచి 125 రోజులు, రబీలో 130 నుంచి 135 రోజులు. దీన్ని 2009లో విడుదల చేశారు. ఆకుమచ్చ, తామర పురుగులను బాగా తట్టుకుంటుంది. వంద గింజల బరువు 70 గ్రాముల వరకు ఉంటుంది. 40 రోజుల వరకు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. ఎగుమతికి, పచ్చికాయలకు అధిక గిరాకి ఉండే రకం. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో అయితే 1,800 నుండి 2,000 కిలోల దిగుబడి నిస్తుంది. కదిరి–8(కె–8): ఇది కూడా పెద్ద గుత్తిరకం. దీన్ని 2009లో విడుదల చేశారు. 100 గింజల బరువు 75 గ్రాములు ఉంటుంది. తామర పురుగులను తట్టుకోగలదు. నీటి వసతి, సారవంతమైన భూములకు అనుకూలమైన రకం. పంటకాలం ఖరీఫ్‌లో 120 రోజులు, రబీలో 130 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో 1,800 నుంచి 2,000 కిలోల దిగుబడినిస్తుంది. కదిరి–9(కె–9): ఈ వంగడాన్ని 2009లో విడుదల చేశారు. ఇది చిన్న గుత్తి రకం. 45 రోజుల పాటు వర్షం రాకపోయినా తట్టుకోగలదు. నెల రోజుల పాటు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి∙115 రోజులు, రబీలో 115 నుంచి 120 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి 1,000 కిలోలు, రబీలో అయితే 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడినిస్తుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు, రసంపీల్చే పచ్చదోమ, తామర, ఎర్రనల్లి, నులి పురుగులను తట్టుకునే రకం. కదిరి అనంత: దీన్ని 2010లో విడుదల చేశారు. ఇది కూడా చిన్న గుత్తి రకం. వర్షాభావ పరిస్థితులను బాగు తట్టుకోగలదు. బెట్ట పరిస్థితుల నుంచి∙త్వరగా కోలుకునే రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో అయితే 1400 నుంచి∙1,800 కిలోల దిగుబడి వస్తాయి. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి 110 రోజులు, రబీలో 110 నుంచి 120 రోజులు ఉంటుంది. ఆకుమచ్చ, రసం పీల్చే పురుగులను బాగా తట్టుకోగలదు. కదిరి హరితాంధ్ర: ఈ రకం విత్తనాన్ని కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు 2010లో విడుదల చేశారు. పరిపక్వ దశ వరకు ఆకుపచ్చగా ఉండి ఎక్కువగా పశువుల మేత(కట్టె)నిస్తుంది. ఇది కూడా ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడి నిస్తుంది. బెట్టను, ఆకుమచ్చ, తామర పురుగు, కాళహస్తి తెగుళ్లను బాగ తట్టుకోగలదు. స్థానికంగానే మంచి విత్తనం వ్యవసాయ పరిశోధన కేంద్ర కదిరిలో ఉండటం ఈ ప్రాంత రైతుల అదృష్టం. దీనివల్ల స్థానికంగానే మేలైన విత్తనం లభిస్తోంది. కదిరి రకాలు దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలకు రైతులంతా రుణపడి ఉంటాం. – రైతు జి.గోగురత్నం, వేపమానిపేట, తలుపుల మండలం సందేహాలన్నీ నివృత్తి చేస్తారు కదిరి వేరుశనగ రకాలు దేశంలోనే పేరుగాంచాయి. వేరుశనగ రైతులకు ఏ సందేహాలున్నా కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎంతో ఓపికతో నివృత్తి చేస్తారు. ఏ సమయంలో ఫోన్ చేసినా పలుకుతారు. ఈ ప్రాంత రైతులే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఇక్కడికి వచ్చి మూల విత్తనం తీసుకెళ్తుంటారు. – ఎం.రమణ, సున్నపుగుట్ట తండా, కదిరి మండలం అందరి కృషి ఫలితమే శాస్త్రవేత్తలందరికి కృషి ఫలితంగానే మేలైన రకాలు అందిస్తున్నాం. ఒక కొత్త రకం పరిశోధనకు ఎనిమిదేళ్లు పడుతుంది. పరిశోధన స్థానం ఉత్పత్తి చేసిన మరో రెండు కొత్త రకం వంగడాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కదిరి వేరుశనగ రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయంటే మన రాష్ట్రానికే గర్వకారణం. దేశంలోని ఐదు ముఖ్యమైన పరిశోధన స్థానాల్లో కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం కూడా ఒకటి. – డాక్టర్ సంపత్‌కుమార్, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త, కదిరి -
కదిరి మల్లెల గుబాళింపు.. ఎకరాకు రూ.5 లక్షల ఆదాయం
సాక్షి, సత్యసాయి జిల్లా(కదిరి): కదిరి మల్లెల గుబాళింపునకు దేశంలోనే పేరుంది. ఇక్కడి మల్లెలు వెదజల్లినంతగా ఏప్రాంత మల్లెలు సువాసనలు ఇవ్వలేవన్న పేరు ఉంది. ముఖ్యంగా బ్రహ్మో త్సవాల సమయానికి విరబూసే మల్లెలు మరింత సువాసనలు ఇస్తాయని అంటుంటారు. ఈ ప్రాంతంలోని మల్లెల సౌరభాలు ఖాద్రీశుడికి ఎంతో ప్రీతిపాత్రం. కదిరి మల్లెలకు భలే గిరాకీ కదిరి పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే మల్లెల గుబాళింపు అందరినీ మైమరిపిస్తుంది. ఈ ప్రాంతంలో మల్లె తోటలు ఎక్కువ. దాదాపు 600 ఎకరాలకు పైగా రైతులు మల్లెలు సాగుచేస్తుంటారు. ఇవి ఎందరికో ఉపాధి నిస్తున్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు మల్లెలను వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో మల్లెపూలను విక్రయించేవారు ప్రత్యేకంగా కదిరి మల్లెలని అరుస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. ఈ ప్రాంత నేల స్వభావం కారణంగానే మల్లెలు మంచి సువాసననిస్తుంటాని రైతులు చెబుతున్నారు. ఖాద్రీశుడికి మల్లెపూల ఉత్సవం అలంకార ప్రియుడైన లక్ష్మీ నారసింహ స్వామికి తెల్లని మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ సువాసనలు వెదజల్లే కదిరి మల్లెలంటే మరింత ప్రీతికరం. దీంతో ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ఏటా వైశాఖ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మల్లెపూల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోజు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పట్టణానికి సమీపంలోని మద్దిలేటి ఒడ్డున ఉన్న ఉత్సవ మంటపం వద్ద కొలువుదీర్చి ప్రత్యేకంగా మల్లెపూలతోనే అలంకరిస్తారు. మల్లెపూలను సాగుచేసే రైతులే ఈ ఉత్సవానికి ఉభయదారులుగా వ్యవహరిస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టం హిందువుల ఆరాధ్య దైవం శ్రీమహా విష్ణువుకు మల్లెలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెపూలతో అలంకరిస్తాం. శ్రీవారికి మల్లెపూలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో మోహినీ ఉత్సవం నాడు స్వామివారి కుచ్చుల వాలుజడ కదిర మల్లెలతోనే సిద్దం చేస్తాం. ఏటా మల్లెపూల ఉత్సవాన్ని మరింత శోభాయమానంగా నిర్వహిస్తాం. – నరసింహాచార్యులు, నృసింహాలయ ప్రధాన అర్చకుడు ఎకరాకు రూ.5 లక్షలు వస్తుంది ఎకరం పొలంలో మల్లె తోట సాగు చేస్తే ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించవచ్చు. నాకున్న 72 సెంట్ల స్థలంలో పూర్తిగా మల్లెలే సాగు చేస్తున్నా. వేసవిలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలో మల్లెపూలు రూ.500కు అమ్ముడు పోతుంటాయి. సన్నమల్లెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. – విశ్వనాథ్, మల్లెతోట యజమాని, కదిరి రోజూ రూ.300 సంపాదిస్తా కిలో మల్లెపూలు కోస్తే రూ.75 కూలి చెల్లిస్తారు. ఈ లెక్కన రోజూ రూ.300 వరకు సంపాదిస్తాను. ఈ డబ్బుతోనే నా కుమార్తెను బాగా చదివిస్తున్నా. ఏడాదిలో 8 నుంచి 9 నెలలు పూల కోత పని ఉంటుంది. – ప్రమీలమ్మ, కదిరి -
సత్యసాయి జిల్లా కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్
-
Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్.. ప్రాణాపాయస్థితిలో..
కదిరి టౌన్: నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చాంద్ వర్గీయుడు శ్రీనివాసులు నాయుడిపై కందికుంట వర్గీయులు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. శ్రీనివాసులు నాయుడు ఈసారి తమ నేత చాంద్‌బాషాకే టికెట్ వస్తుందని సోషల్ మీడియాలో శుక్రవారం సాయంత్రం పోస్టు చేశాడు. దీన్ని కందికుంట వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకుని ఇంటి వద్దకు వెళ్లారు. దాడిలో గాయపడిన శ్రీనివాసులు నాయుడు అక్కడ లేకపోవడంతో పట్టణంలో గాలిస్తుండగా.. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చాంద్ లాడ్జీ వద్ద ఆటోలో తారసపడ్డాడు. దీంతో అతనిపై కందికుంట వర్గీయులైన టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, సయ్యద్, ఇమ్రాన్, సోను ఫయాజ్, బాబు, మారుతి, రామాంజనేయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చాంద్ వర్గీయులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. చదవండి: (అక్రమాలు.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ ఇండస్ట్రీపై కేసు..) -
కదిరి లాడ్జి బాగోతంలో.. కథ.. స్క్రీన్‌ప్లే అంతా టీడీపీనే!
కదిరి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రామయ్య లాడ్జి వివాదం ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ప్రత్యర్థి పార్టీని అభాసుపాలు చేయడానికి చేసిందేనని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీలోని రామయ్య ప్రత్యర్థి వర్గీయులు స్పష్టంచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కథ, స్క్రీన్‌ప్లే అంతా ఆయనా, టీడీపీదేనని వారు చెబుతున్నారు. వీరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5, తదితర ఎల్లో మీడియా తోడయ్యాయని.. వీటికి రామయ్య, టీడీపీ బాగోతం కనిపించడంలేదా అని కదిరి ప్రజలు మండిపడుతున్నారు. వివాదం ఏమిటంటే.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తన కుటుంబానికి చెందిన ‘జొన్నా లాడ్జి’ని 2018లో అనంతపురానికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ యజమాని శ్రీధర్‌రెడ్డికి రూ.9.50 కోట్లకు విక్రయించారు. రిజిస్ట్రేషన్ సమయానికి రామయ్య అడ్డం తిరిగాడు. కానీ, మిగిలిన అన్నదమ్ములు మాత్రం తమ వాటా (60 శాతం)ను శ్రీధర్‌రెడ్డికి రిజిస్టర్ చేయించారు. రామయ్య మాత్రం తన 40 శాతం వాటాలో 20 శాతం వాటాను వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి అమ్మేశాడు. చంద్రారెడ్డి దాన్ని తిరిగి శ్రీధర్‌రెడ్డికి విక్రయించాడు. మొత్తమ్మీద 80 శాతం వాటా ఇప్పుడు శ్రీధర్‌రెడ్డిదే. కానీ, నాలుగేళ్లుగా లాడ్జిలో వచ్చిన ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తూ.. దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి అప్పగించకుండా జొన్నా రామయ్య గూండా గిరి చేస్తున్నారు. రామయ్య వైఖరితో అన్నదమ్ముల విభేదం రామయ్య వ్యవహార శైలి నచ్చక సొంత అన్నదమ్ములే ఆయనతో విభేదించారు. ఈ నెల 23న జొన్నా సోదరులంతా కుటుంబ సమేతంగా శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్జి ముందు బండ రాళ్లు వేసి రాకపోకలను స్తంభింపజేశారు. అక్కడే ఉన్న రామయ్యను లాడ్జిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని రామయ్య టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌తోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో శనివారం లాడ్జి ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిజానికి ఈ వ్యవహారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డికి గానీ ఎలాంటి సంబంధమూలేదు. కానీ, రామయ్య వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. అయితే.. వీరి వ్యవహార శైలిని టీడీపీలోనే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మా కుటుంబాన్ని రోడ్డుకీడ్చాడు : జొన్నా సోదరులు ఈ ఘటనపై జొన్నా సోదరులు స్పందిస్తూ.. ‘జొన్నా ఫ్యామిలీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. మా కుటుంబాన్ని ఇప్పుడు బజారుకీడ్చిన మా అన్న రామయ్య కొందరి మాటలు విని, లాడ్జిని స్వాధీనం చేయకుండా జొన్నా కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు’ అని ఆరోపించారు. -
లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా?
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): లాడ్జి విక్రయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ అండతో చెలరేగిపోతున్న రామయ్య తీరును చివరకు ఆయన సోదరులే తప్పుబడుతున్నారు. శనివారం ఈ వివాదం కాస్త తారస్థాయికి చేరుకుంది. వివరాలు.. మూడున్నర సంవత్సరాల క్రితం తన లాడ్జిని రూ.9.50 కోట్లకు కదిరికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య విక్రయించి అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే తమ వాటా కింద ఉన్న 60 శాతాన్ని శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య సోదరులు రిజిస్టర్ చేయించారు. చదవండి👉 అసలైన ఉన్మాది చంద్రబాబే.. అయితే జొన్నా రామయ్యకు చెందిన వాటాను రిజిస్ట్రేషన్ చేయించకుండా అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డిని తిప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాక లాడ్జిని సైతం అప్పగించకుండా ఆదాయాన్ని తానే తీసుకుంటున్నారు. ఇటీవల తన 40 శాతం వాటాలోని 20 శాతాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి జొన్నా రామయ్య విక్రయించారు. ఆ వాటాను కూడా శ్రీధర్‌రెడ్డి కొనుగోలు చేయడంతో దాదాపు 80 శాతం వాటా ఆయనకే చెల్లుబాటైంది. కుటుంబానికి చెడ్డపేరు రాకుండా.. రామయ్య తీరుతో కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సోదరులు శనివారం శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్డి వద్దకు చేరుకుని బండరాళ్లు వేసి రామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ అన్న రామయ్య కారణంగా జొన్నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకుని లాడ్జిని శ్రీధర్‌రెడ్డికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పట్టణ ప్రజలు సైతం రామయ్య తీరును తప్పుబట్టారు. కందికుంట తీరుపై ప్రజల అసహనం లాడ్జి వద్ద వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామయ్యకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేయడంతో కందికుంటపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
Sri Sathya Sai: రేసులో దూసుకెళ్దాం.. చకాచకా ఎస్–3 ట్రాక్ పనులు..
రయ్యిమంటూ ట్రాక్‌పై దూసుకెళ్తూ క్షణాల్లో మాయమయ్యే కార్లు... ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సాగే రేస్‌లో డ్రైవర్ల విన్యాసాలు.. అనుకోని మలుపులు.. ఆపై విజేతల గెలుపు సంబరాలు. టీవీల్లో తప్ప ప్రత్యక్షంగా చూసే భాగ్యం మనకు లేదను కుంటున్నారా..?, వైఎస్ జగన్ సర్కార్ ఆ అవకాశం మనకూ కల్పిస్తోంది. చంద్రబాబు హయాంలో అటకెక్కిన ఫార్ములా–3 కార్ రేస్ ట్రాక్ ప్రాజెక్టుకు ఊపిరి పోసింది. ఫలితంగా తనకల్లు మండలం కోటపల్లి వద్ద పనులు చకచకా సాగుతున్నాయి. సాక్షి, కదిరి: తనకల్లు మండలం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుకు బెంగళూరుకు చెందిన ‘నిధి మార్క్ వన్ మోటార్స్’ ముందుకు వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ కంపెనీతో 2017లో ఒప్పందం కుదుర్చుకుంది. 90 నెలల్లో పనులు పూర్తి చేయాలని అగ్రిమెంట్ రాసుకుంది. అయితే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో బాబు సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కారు రేస్ ట్రాక్ పనులు అటకెక్కాయి. వైఎస్ జగన్ సర్కారు అధికారంలోకి రాగానే ఈ కారు రేస్ ట్రాక్ ఏర్పాటుపై దృష్టి సారించింది. 3.4 కి.మీ ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన 219 ఎకరాల భూమిని సేకరించి ‘నిధి మార్క్ వన్ మోటార్స్’కు అప్పగించడంతో పాటు నిర్వాసిత రైతులకు పరిహారం కూడా చెల్లించింది. దేశంలో మూడోది.. ఏపీలో మొదటిది.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వద్ద ‘బుద్ద ఇంటర్ నేషనల్ సర్క్యూట్’ ఫార్ములా–1 కారు రేస్ ట్రాక్ ఉంది. అలాగే తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని ఇడుంగట్టు కొట్టయ్ వద్ద ఫార్ములా–2 కారు రేస్ ట్రాక్ ఏర్పాటు చేశారు. తాజాగా కదిరి సమీపంలోని కోటపల్లి వద్ద నిర్మిస్తోంది ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్. రేస్ ట్రాక్‌లలో ఇది దేశంలో మూడోది. మన ఏపీలో మొదటిది. దీనికి ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ మోటో సైక్లిజం(ఎఫ్ఐఎం) గుర్తింపు పొందింది. కారు రేసింగ్‌తో పాటు కొత్త కార్ల వేగాన్ని పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్ ఉపయోగ పడుతుంది. కార్ రేస్ వివిధ ఫార్మాట్లు ఇలా... ►ఫార్ములా–1 (ఎఫ్–1): ఈ రేసులో పాల్గొనే కారుకు 1,000 హెచ్‌పీ(హార్స్పవర్) ఇంజిన్ ఉంటుంది. ప్రపంచ చాంపియన్లను దృష్టిలో ఉంచుకొని ట్రాక్‌లను తయారు చేస్తారు. ఈ రేస్‌లో పాల్గొనే కార్లు వివిధ రకాల డిజైన్లలో ఉంటాయి. వారాంతంలో ఒక రోజు చొప్పున మూడు వారాల పాటు పోటీలు నిర్వహిస్తారు. గంటకు 1,000 కి.మీ వేగ పరిమితి ఉంటుంది. ►ఫార్ములా–2 (ఎఫ్–2): ఈ రేసులో పాల్గొనే కార్లకు 500 హెచ్‌పీ ఇంజిన్ ఉంటుంది. కార్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. రేస్ కూడా ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. గంటకు 500 కి.మీ వరకూ వేగ అనుమతి ఉంటుంది. ►ఫార్ములా–3(ఎఫ్–3): ఈ కార్లకు 250 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. ఇది బేసిక్ రేస్. ఇందులో పాల్గొనే కార్లన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఒకే రోజు మూడు గ్రూపులుగా విభజించి... పోటీలు నిర్వహిస్తారు. ఇందులో కార్ల వేగం గంటకు 250 కి.మీ పరిమితి ఉంటుంది. ఎంతోమందికి ఉపాధి.. ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 500 మందికి ఉపాధి దొరుకుతుంది. తొలి దశలో ట్రాక్‌తో పాటు ఆస్పత్రి, అతిథి గృహం ఏర్పాటు చేయనున్నారు. రెండు, మూడవ దశల్లో 40 గదులో పెద్ద రిసార్ట్, అమ్యూజ్మెంట్ పార్కు(వినోద భరిత ఉద్యానవనం), గోల్ఫ్ కోర్సు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లాలో తయారవుతున్న ‘కియా’ కార్లను పరీక్షించేందుకు కూడా ఈ ట్రాక్ ద్వారా అవకాశం కల్పిస్తారు. పర్యాటక హబ్ ఏర్పాటుకు ప్రణాళిక.. కోటపల్లి పార్ములా–3 కారు రేస్ ట్రాక్ బెంగళూరు విమానాశ్రయానికి కేవలం 110 కి.మీ దూరంలో ఉంది. కార్ రేసింగ్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల చెందిన వారు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రాయలసీమలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ యోచిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, లేపాక్షి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, యోగి వేమన సమాధి, తిమ్మమ్మ మర్రిమాను, పెనుకొండ కోట, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుత్తి కోట, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలలోని పలు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ‘రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్’ ఏర్పాటుకు అనుమతివ్వాలని ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. చకాచకా పనులు.. ప్రస్తుతం కోటపల్లి వద్ద ఫార్ములా–3 కారు రేస్ ట్రాక్ పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చుట్టూ ఫెన్సింగ్ పూర్తయ్యింది. రేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స చేసేందుకు అవసరమైన ఆస్పత్రి భవనం దాదాపుగా పూర్తి కావచ్చింది. వెయిటింగ్ హాలు, విశ్రాంతి గదుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇక రేస్ ట్రాక్ కోసం భూమి చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి కార్ రేస్‌లు ఏర్పాటు చేసేలా ‘నిధి మార్క్ వన్ మోటార్స్’ కృషి చేస్తోంది. రెండేళ్లలో పూర్తి చేస్తాం ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక మాకు కోటపల్లి వద్ద భూములు అప్పగించారు. కోవిడ్ కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మళ్లీ పనులు వేగంగా జరుగనున్నాయి. రెండేళ్లలో మొత్తం పనులు పూర్తి చేస్తాం. ఇది బెంగుళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. రేసర్లు, ఔత్సాహికులతో పాటు పర్యాటకులను కూడా బాగా ఆకర్షించనుంది. –గోవింద రాజన్ చక్రవర్తి, నిధి మార్క్ వన్ మోటార్స్, డైరెక్టర్, బెంగళూరు -
కదిరి లక్ష్మి నరసింహస్వామి రథోత్సవం (ఫొటోలు)
-
మొదటి భార్యకు, ప్రమీలకు మధ్య ఆస్తి తగాదాలు.. అంతలోనే..
సాక్షి, కదిరి టౌన్: కదిరిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. కదిరి నివాసి బిల్లూరు ప్రమీల(36) స్థానిక వాణి వీధి (వేమారెడ్డి సర్కిల్) సమీపంలో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తోంది. ఈమె భర్త రంగారెడ్డి ఏడాది క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. సోమవారం ఉదయం ఇంటిలోనే ఆమె విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న డీఎస్పీ భవ్యకిషోర్, సీఐ సత్యబాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్‌తో ఆమె తలపై మోది హతమార్చినట్లు గుర్తించారు. ప్రమీల భర్తకు ఇద్దరు భార్యలని, మొదటి భార్యకు, ప్రమీలకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని ఈ సందర్భంగా పోలీసుల ఎదుట హతురాలి సంబంధీకులు ఆరోపించారు. ఆస్తి కోసమే ఆమెను హతమార్చి ఉంటారని ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..) -
కదిరిలో ‘పచ్చ’ రచ్చ.. తారస్థాయికి వర్గపోరు
కదిరి(అనంతపురం): టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రచ్చ రచ్చగా మారింది. సొంత పార్టీ నాయకుడిపైనే నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు రెచ్చిపోయారు. సోమవారం కదిరి పట్టణంలోని అమృత ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. గ్రూపులు, వర్గ పోరు కారణంగానే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేతిలో వరుసగా రెండు సార్లు ఓడిపోయామని టీడీపీ నాయకుడు మనోహర్ నాయుడు అనడంతో కందికుంట అనుచరులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లారు. ఆయన చేతిలోని మైకు లాక్కొని ‘ఇక్కడ కందికుంట వర్గం తప్ప మరో వర్గానికి తావు లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడితే బాగుండదు’ అని హెచ్చరించారు. అయితే మనోహర్ నాయు డు స్వరం పెంచుతూ.. ‘నేను చెప్పింది అక్షరాలా నిజం. పార్టీ మీద అభిమానం కన్నా కందికుంట భజనపరులే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వ్యక్తుల కన్నా పార్టీనే సుప్రీం. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవడానికి కలిసి కట్టుగా పనిచేద్దాం’ అని చెప్పడంతో వారు మరోమారు దౌర్జన్యానికి దిగారు. చివరకు కందికుంట మైకు అందుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. చాంద్‌బాషా దూరం : టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో పాటు ఆయన వర్గీయులు హాజరు కాలేదు. అది పార్టీ సమావేశం కాదని, కందికుంట భజనపరుల మీటింగ్ అని చాంద్‌బాషా అనుచరులు బాహాటంగానే విమర్శించారు. నకిలీ డీడీల కేసులో కందికుంట మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని, కావున వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ చాంద్‌బాషాకే వస్తుందని వారు అంటున్నారు. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో సైతం కందికుంటకు 35.9 శాతం రాగా.. చాంద్‌బాషాకు 64.1 శాతం మద్దతు లభించిందని చాంద్ అనుచరులు చెబుతున్నారు. ఈ సర్వేపై ఇప్పటికే కందికుంట, చాంద్‌బాషా వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాంద్‌కు అంతసీన్ లేదు : వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అధికారం కోసం అమ్ముడుపోయిన చాంద్‌బాషా ఇకమీదట వార్డు మెంబర్‌గానూ గెలవలేరని, అలాంటి వ్యక్తికి సర్వేలో 64 శాతం వచ్చిందంటే టీడీపీ కార్యకర్తలెవరూ నమ్మరని కందికుంట వర్గీయులు అంటున్నారు. కాగా...రానున్న రోజుల్లో ఇరువురు నాయకుల మధ్య వర్గ పోరు మరింత ముదరడం ఖాయమని, ఇక్కడ మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే ఉంటుందని స్వయానా టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. -
వైభవంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
-
దండుపాళ్యం తరహాలో దొంగతనం, హత్య
అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో సంచలనం రేకెత్తించిన టీచర్ ఉషారాణిని హత్య చేసి.. మరో వివాహిత శివమ్మను తీవ్రంగా గాయపర్చి నగలు, నగదు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. కరుడుగట్టిన దోపిడీ దొంగ షేక్ షఫీవుల్లా అలియాస్ షఫీ (35)ని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.30 లక్షల విలువైన 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్ప బుధవారం వెల్లడించారు. కర్ణాటకలోని దేవనహళ్లికి చెందిన షేక్ షఫీవుల్లా (షఫీ) 2004 నుంచి 2009 వరకు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడ్డాడు. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన నిందితుడు 2010లో జిల్లాలోని ఓబుళాపురానికి చెందిన మహిళను వివాహం చేసుకుని కదిరిలో స్థిరపడ్డాడు. అప్పటి నుంచి వాహనాల్లో పెట్రోల్ దొంగిలిస్తూ.. ఎర్ర చందనం రవాణా వాహనాలకు డ్రైవర్‌గా పని చేసేవాడు. ‘దండుపాళ్యం’ చూసి.. దండుపాళ్యం సినిమా చూసిన తర్వాత అందులో చూపిన తరహాలో ఇళ్లలోకి ప్రవేశించి మహిళలను హతమార్చి చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్టు షఫీ పోలీసులకు తెలిపాడు. హత్యలు చేయడానికి బరువైన రాడ్‌ను తీసుకున్నాడు. 2019 ఆగస్టులో కదిరిలోని హిందూపురం రోడ్డులో నివాసముండే సావిత్రి, 2021లో అదే పట్టణంలోని హరూన్ వీధిలో ఉండే గంగాదేవి అనే మహిళలపై రాడ్‌తో దాడి చేయగా.. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. 2019 జనవరిలోనూ స్థానిక రెవెన్యూ కాలనీలో ఇదే తరహాలో ఒకరిపై దాడి చేశాడు. అదును చూసి మరీ.. గత ఏడాది నవంబర్‌లో కదిరి ఎన్జీవో కాలనీలో దోపిడీకి పాల్పడటానికి ఐదు రోజుల ముందు షఫీ ఆ వీధిలో రెక్కీ నిర్వహించాడు. టీస్టాల్ నిర్వాహకుడు రమణ వేకువజామునే వ్యాపారానికి వెళ్లడం, ఆ ఇంటి పక్కనే ఉండే ఉపాధ్యాయుడు శంకర్‌రెడ్డి మార్నింగ్ వాక్కు వెళ్లడం గమనించాడు. శంకర్‌రెడ్డి వాకింగ్‌కు వెళ్లే ముందు ఇంటి తాళం చెవి షూలో ఉంచేవాడు. దీన్ని గమనించిన షఫీ గతేడాది నవంబర్ 16 తెల్లవారుజామున దొంగతనానికి వెళ్లాడు. మొదట టీస్టాల్ రమణ ఇంటికి వెళ్లి అతని భార్య శివమ్మపై రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఆమె మెడలోని 5 తులాల చైన్, బీరువాలోని రూ.1.50 లక్షల నగదు చోరీ చేశాడు. ఆ తరువాత పక్కనే ఉన్న శంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి షూలో ఉన్న తాళం చెవితో తలుపులు తెరిచి లోనికి ప్రవేశించాడు. నిద్రలో ఉన్న శంకర్‌రెడ్డి భార్య, ప్రభుత్వ ఉపాధ్యాయిని ఉషారాణి తలపై రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని నగలతోపాటు బీరువాలోని నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగివచ్చిన శంకర్‌రెడ్డి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లి చూడగా.. అప్పటికే ఉషారాణి ప్రాణాలొదిలింది. టీ స్టాల్ యజమాని రమణ ఇంట్లోనూ దోపిడీ జరిగినట్టు గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న అతడి భార్య శివమ్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించటంతో ఆమె కోలుకుంది. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 90 రోజుల్లో ఛేదించి షఫీని అరెస్ట్ చేశారు. -
కుప్పకూలిన మూడు భవనాలు
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో శనివారం వేకువజామున మూడు భవనాలు కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ పసికందు సహా ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. మరో నలుగురు ఆస్పత్రి పాలవగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో సైదున్నీసా (2), ఫారున్నీసా (8 నెలలు), యాషికా(3)తోపాటు ఫైరోజా (65), భాను (30), ఫాతిమాబీ (65) ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో జిలాన్ అనే వ్యక్తి తన పాత భవనంపై ఎటువంటి పిల్లర్లు వేయకుండా మరో రెండంతస్తుల నిర్మాణం చేపట్టారు. పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆ భవనంలోని కింది భాగం పాత నిర్మాణం కావడంతో కొత్తగా నిర్మించిన రెండంతస్తుల బరువును మోయలేక శనివారం వేకువజామున 3 గంటల సమయంలో కుప్పకూలింది. దాని శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండంతస్తుల భవనంతో పాటు ఆ పక్కనే ఉన్న ఇంకో భవనంపైనా పడటంతో అవి కూడా నేలమట్టమయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోని కింది పోర్షన్లో నిద్రిస్తున్న ఇంటి యజమాని జిలాన్ తల్లి ఫైరోజా (65), పక్క భవనంలోని మొదటి అంతస్తులో నిద్రిస్తున్న టీవీ చానల్ విలేకరి సోమశేఖర్ సతీమణి భాను (30), వీరి మూడేళ్ల చిన్నారి యాషికా, అత్త ఫాతిమాబీ (65) శిథిలాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోమశేఖర్ ఇంటి కింది పోర్షన్లో కాపురముంటున్న వంట మాస్టర్ రాజు, కదిరి మండలం రామదాసు నాయక్ తండాకు చెందిన ఉదయ్ నాయక్, మీటేనాయక్ తండాకు చెందిన గౌతమ్ నాయక్, చిగురుమాను తండాకు చెందిన డిప్లొమా విద్యార్థి తరుణ్ నాయక్ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరంతా ఓ మూలన ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. తరుణ్ నాయక్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక, 108 సిబ్బంది వారిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే పక్కనే ఉన్న మరో ఇంటిపైనా భవన శిథిలాలు పడటంతో ఆ ఇల్లు కూడా కూలింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న హబీబుల్లా, కలీమున్నీసా, హిదయతుల్లా, దంపతులు కరీముల్లా, హబీబున్నీసా బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. కరీముల్లా దంపతుల రెండేళ్ల చిన్నారి సైదున్నీసా, 8 నెలల చిన్నారి ఫారున్నీసా శిథిలాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో వంట మాస్టర్ రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి ఉదయం నుంచీ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వారికి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..
సాక్షి, కదిరి (అనంతపురం): భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించడం కళ్లారా చూసిన భర్త రగిలిపోయి రోకలిబండతో ఆమె తలపై బాది హతమార్చిన సంఘటన కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28) అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఏడేళ్ల బాలుడు మురళి, ఐదేళ్ల బాలిక కీర్తన ఉన్నారు. చదవండి: (ఏడాది కిందట పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య!) పట్నం గ్రామంలో రామాంజినేయులు అనే వ్యక్తితో హేమలత గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయమై పలుమార్లు పద్దతి మార్చుకోవాలని భార్యను భర్త హెచ్చరించడం జరిగింది. అయినా ఆమె ఖాతరు చేయలేదు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో తన భార్య రామాంజినేయులుతో కలసి ఉండడం కళ్లారా చూసిన శివశంకర్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పక్కనే ఉన్న రోకలి బండతో ఆమె తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) ఇది చూసి భయపడిపోయిన రామాంజినేయులు పారిపోయాడు. ఆ వెంటనే తన మామ (హేమలత తండ్రి) గోపాలప్పకు నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. అందుకే చంపేశానంటూ ఫోన్ చేసి చెప్పాడు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పట్నం ఎస్సై సాగర్ ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. -
బంగారు నగల వ్యాపారి కేసు: మెతక వైఖరే కారణమా?
కదిరి: దోపిడీలు, దొంగతనాలు, గుట్కా, మట్కా, లాటరీ టికెట్ల అమ్మకాలకు తోడు వరుస హత్యలతో కదిరి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కదిరి ఎంజీ రోడ్డులో బంగారు నగల తయారీదారు కిరణ్‌ని హతమార్చారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా నిందితులెవరో అంతు చిక్కడం లేదు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఎన్జీఓ కాలనీలో టీచర్ శంకర్‌రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు చొరబడి, ఆయన భార్య టీచర్ ఉషారాణిని హతమార్చి విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు కాపురముంటున్న ఎన్జీఓ కాలనీలోనే ఈ ఘటన జరిగితే.. ఇక మిగిలిన వీధుల పరిస్థితేంటని జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆయా కేసుల్లో నిందితులను వెంటనే గుర్తించి, శిక్షించి ఉంటే ఈ తరహా ఘటనలకు తావుండేది కాదని అంటున్నారు. కేసుల దర్యాప్తులో పోలీసుల మెతక వైఖరే ఇందుకు కారణంగా విమర్శలు వెల్లువెత్తాయి. భవంతులు సరే.. సీసీ కెమెరాలేవీ? ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నట్లైతే కదిరి ఎన్జీఓ కాలనీలోని రెండిళ్లలో చోరీతో పాటు టీచర్ ఉషారాణి హత్య జరిగేది కాదని పోలీసులు చెబుతున్నారు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చుతో పెద్ద భవంతులు నిర్మించుకుని వాటి ముందు రూ.వేలు విలువ చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడాన్ని ఈ సందర్భంగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత బాధాపడేదానికన్నా.. ముందస్తు జాగ్రత్తగా సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రతి మహిళా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటింటికీ తిరిగి చెబుతున్నా కొందరు మాత్రమే స్పందిస్తున్నారని, మిగిలిన వారు పట్టించుకోవడం లేదని పోలీసులు అంటున్నారు. దర్యాప్తు ముమ్మరం దోపిడీ, మహిళా టీచర్ హత్య (మనీ ఫర్ గెయిన్) కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో నలుగురు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని లాడ్జీలు, రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, హోటళ్లు, పెట్రోలు బంకుల్లో ఆరా తీస్తున్నారు. కదిరి ప్రాంతాన్ని డీఎస్పీ భవ్యకిషోర్ నేతృత్వంలో పోలీసు బృందాలు జల్లెడ పట్టాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్న వారి వేలిముద్రలు సేకరించి, హత్య జరిగిన ప్రాంతంలోని వేలి ముద్రలతో పోల్చి చూస్తున్నారు. కదిరికి చేరుకునే అన్ని మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు ప్రత్యేక బృందాలు అనంతపురం క్రైం: కదిరి ఘటనను జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో బుధవారం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. సీసీఎస్ డీఎస్పీ మహబూబ్‌బాషా, హిందూపురం సీఐ హమీద్‌ఖాన్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఈ బృందాల్లో ఉన్నారు. సాధ్యమైనంత తొందరగా కేసును ఛేదించాలనే ధృడనిశ్చయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ‘మనీ ఫర్ గెయిన్’ పాత కేసుల్లో నిందితులుగా ఉన్న 37 మంది కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే అనంతపురం, పెనుకొండ, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, పుట్టపర్తి, ధర్మవరం సబ్డివిజన్ల పరిధిలో ఆయా డీఎస్పీల పర్యవేక్షణలో దొంగతనాల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శివారు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితులు కన్పిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. -
కదిరి: గవర్నమెంట్ టీచర్ హత్య.. పార్థీ గ్యాంగ్ పనేనా?
అనంతపురం క్రైం/ కదిరి: కదిరి ఎన్జీఓ కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండిళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణతో ఆగకుండా ఉషారాణి (47) అనే టీచర్‌ను హతమార్చి..పక్కింట్లో ఉండే టీస్టాల్ రమణ భార్య శివమ్మనూ తీవ్రంగా గాయపరిచారు. అది కూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ తరహా దొంగతనాలు జిల్లా, అంతర్ జిల్లాల దొంగలు చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్’ పని అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి..పోలీసులకు తగిన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతరత్రా ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కల్గిన పోలీసు అధికారులు, సీసీఎస్ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాల్లో నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి. కదిరి సమీపంలోని టోల్గేట్తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్‌పోస్టులు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకూ బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు చర్యలు చేట్టారు. పార్థీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున మధ్యప్రదేశ్‌కూ ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగానే ఛేదిస్తామని చెప్పారు. లాడ్జీల్లో తనిఖీలు ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరైనా వచ్చి బస చేశారా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 15 లాడ్జీల్లో తనిఖీలు చేయడంతో పాటు సీసీ ఫుటేజీ కూడా పరిశీలించారు. అలాగే పాత నేరస్తులపై నిఘా వేశారు. శోకసంద్రంలో చీకిరేవులపల్లి అమడగూరు : దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని చీకిరేవులపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. శంకర్‌రెడ్డి ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ హైసూ్కల్లో బయోలాజికల్ సైన్స్ టీచర్ కాగా.. ఉషారాణి ఓడీచెరువు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రణీత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... చిన్నకుమారుడు దీక్షిత్‌రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నారు. ఉషారాణి మృతదేహాన్ని కదిరి నుంచి చీకిరేవులపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, తోటి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఎంపీపీ గజ్జల ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కడగుట్ట కవితతో పాటు మండల వైఎస్సార్సీపీ నాయకులు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిశీలించి..కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
-
అనంతపురం జిల్లా కదిరి సబ్ రిజిస్టార్ నాసిర్‌పై సస్పెన్షన్ వేటు
-
కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని కదిరి సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అక్రమాలపై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రే రూ.21.50 లక్షల చలానా డబ్బును ముగ్గురు ఉద్యోగులు జమ చేశారు. దీంతో ఉన్నతాధికారులు నకిలీ చలానాలపై విచారణ చేపట్టారు. రూ.5 వేల చలానాకు రూ.50 వేలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు మార్చారు. సబ్ రిజిస్టర్ నాసీర్, సీనియర్ అసిస్టెంట్ షామిర్ బాషా, జూనియర్ అసిస్టెంట్ హరీష్ ఆరాధ్యలను అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో కలిసి కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడింది. -
వంకలో కొట్టుకుపోయిన కారు: ఇద్దరు గల్లంతు
-
బీఫార్మసీ సర్టిఫికెట్తో వస్తాడనుకుంటే తిరిగిరాని లోకాలకు..
సాక్షి, అనంతపురం: కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి-పులివెందుల మధ్య ఒదులపల్లి వంకలో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్, డ్రైవర్ రఫీ గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షింతగా బయటపడ్డారు. బాబ్జాన్ మృతదేహం లభ్యం కాగా, రఫీ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీఫార్మసీ సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు కదిరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది. కదిరి-పులివెందుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న తమ బిడ్డ ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్టిఫికెట్తో వస్తాడనుకున్న తమ బిడ్డ విగత జీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. యువతికి వేరొకరితో నిశ్చితార్థం.. వాట్సాప్‌లో అశ్లీల ఫొటో -
మైనర్ బాలిక కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
సాక్షి, అనంతపురం: కదిరిలో కలకలం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి ప్రకాష్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బాలికను ప్రకాష్ కిడ్నాప్ చేశాడాని పోలీసులు వెల్లడించారు. ఆరుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులతో పాటు స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .కాగా శుక్రవారం ఉదయం బాలిక తల్లితండ్రులను ఇంట్లో బంధించి ఆరుగురు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. కిలోమీటర్ల పాటు ఛేజింగ్ చేసి తెల్లవారి మూడు గంటల సమయంలో ధర్మవరం సమీపంలో కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి:రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం? -
మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి
కడప అర్బన్: వైఎస్సార్ కడపలో అనంతపురం జిల్లావాసి మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన బుక్కే శీనునాయక్ (45), బుక్కే నీలమ్మ దంపతులు. వీరికి ఇంటర్ చదివే కుమార్తె ఉంది. ఉపాధి కోసం వీరు కొన్నేళ్ల కిందట కడపకు వలస వెళ్లారు. శీనునాయక్ కోటిరెడ్డి సర్కిల్ సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్లో సప్లయర్‌గా పని చేస్తుండేవాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు భార్య నీలమ్మ నెలన్నర కిందట కదిరికి వెళ్లింది. కుమార్తె మదనపల్లెలో ఇంటర్ చదువుతోంది. శీనునాయక్ 20 రోజులుగా పనికి కూడా వెళ్లడం లేదు. రెండువారాల కిందట ఇంటి కరెంట్ బిల్లు తీసుకుని బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లలేదు. బీపీ షుగర్‌తో పాటు ఒక వైపు కన్ను కనిపించని శీనునాయక్ శుక్రవారం సూర్య ఆస్పత్రి సమీపాన మ్యాన్‌హోల్‌లో విగతజీవిగా కనిపించాడు. ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెంది ఉండవచ్చని బంధువులు భావిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్, ఏఎస్ఐ వలి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఆఫీస్‌కు వచ్చి కొడతాను: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట
-
అబ్బాయి అబద్ధం చెప్పాడు.. ‘ఈ పెళ్లి నాకొద్దు’
సాక్షి, కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం(నేడు) తెల్లవారుజామున జరగాల్సిన ఓ వివాహం పెళ్లి కుమార్తె అయిష్టంతో నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువకునికి ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరువైపులా పెళ్లి పత్రికలను బంధువులందరికీ పంచిపెట్టారు. కదిరిలో నృసింహుని సన్నిధిలో 6వ తేదీన చైత్ర బహుళ దశమి గురువారం తెల్లవారు జామున జరగాల్సి ఉంది. ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయం చేరుకున్నారు. ఈలోగా పెళ్లి కుమార్తె తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అబ్బాయి ఐటీఐ చదివి ఎంటెక్ అని అబద్ధం చెప్పాడని, తాను బీటెక్ చదివానని తన మనసులో మాట చెప్పింది. దీనికి తోడు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, పెళ్లి వాయిదా వేసుకుందామని చెప్పినా బలవంతంగా తాళి కడతానని బెదిరిస్తున్నాడని కదిరి పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫి ఎదుట వాపోయింది. పెళ్లి ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని.. తమకు అవమానంగా ఉందని పెళ్లికుమారుడితో పాటు అతని తరపు బంధువులు అన్నారు. పెళ్లి కోసం ముందుగానే రూ.1.50 లక్షలు పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతాకు ఫోన్‌పే ద్వారా జమ చేశానని, ఆ డబ్బు ఇస్తే తన దారిన తాను వెళ్లిపోతానని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని, పెళ్లి కోసం ఇచ్చిన డబ్బులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోండని కదిరి టౌన్ ఎస్ఐ చెప్పడంతో చివరకు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చదవండి: జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు -
నిన్న వలంటీర్.. నేడు సర్పంచ్..
కదిరి అర్బన్: నిన్నటి దాకా ఆమె ఓ వలంటీర్. తన పరిధిలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. అయితే ఇప్పుడు ఆమె వలంటీర్లు, అధికారుల భాగస్వామ్యంతో ఊరు మొత్తానికి సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఊరందరి సహకారంతో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. (చదవండి: తొలి దెబ్బ అదిరింది) వలంటీర్‌గా నారికే శుభలేఖ తన ఉద్యోగాన్ని వదిలి సర్పంచి బరిలో నిలిచారు. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా నామినేషన్లు వేశారు. అయితే శుభలేఖ ఉత్తమ సేవలు అందించి ఉండటం, గ్రామస్తుల నిర్ణయం మేరకు మిగతా ముగ్గురు గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో శుభలేక సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకటసిద్ధారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆమె కలవగా, పూలమాలతో సన్మానించారు.(చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం) -
బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్
అనంతపురం: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరతీశారు. రోడ్ల విస్తరణలో భాగంగా అనంతపురం జిల్లాలోని కదిరి లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగిస్తున్నారంటూ తప్పుడు ట్వీట్ చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాన్ని అనంతపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ డా.సిరి ఖండించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగించే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచన తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. బలిపీఠంపై బీజేపీ నేత చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు. మరోసారి తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరి హెచ్చరించారు. తప్పుడు వార్తల ప్రచారం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారు ఎంతటివారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేసులు కూడా నమోదు చేసి, దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ నేతలను అరెస్టు చేశామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇదివరకే ప్రకటించారు. (చదవండి: ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర) -
ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు
సాక్షి, అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృషితో కదిరి–అనంతపురం–గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ –06340) నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు వారంలో నాలుగు రోజుల పాటు నాగర్ కోయిల్–ఛత్రపతి టెర్మినల్ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్ కోయిల్‌లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్‌లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది. -
కబ్జా పేరు వింటే కందికుంట గుర్తొస్తారు..!
సాక్షి, అనంతపురం (కదిరి): ఇతరుల ఆస్తిని కబ్జా చేయడం టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ విమర్శించారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరిలో కబ్జా పేరు వింటే అందరికీ కందికుంట పేరు గుర్తుకు వస్తుందన్నారు. పట్టణంలో ఎంతో మంది క్రిíస్టియన్ అనాథ పిల్లలు చదువుకునే స్కూల్‌ను కందికుంట కబ్జా చేసి కూల్చేసిన విషయం కదిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో తాను హిందూపురంలో 8 ఎకరాల ఆస్తిని నిబంధనల ప్రకారమే క్రిస్టియన్ పెద్దల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. అందులో 6 ఎకరాలను అప్పట్లోనే తాను సూచించిన వారి పేర్ల మీద రిజిష్టర్ కూడా చేయించారని వివరించారు. మిగిలిన రెండెకరాలు రిజిష్ట్రేషన్ చేయించడం ఆలస్యమైందని, ఆ భూమి విలువ పెరగడంతో రిజిష్ట్రేషన్ విలువ కూడా పెరిగిందన్నారు. అయితే ఆ భూమిని తాను కబ్జా చేసినట్లు ఇటీవల ఓ టీవీ చానల్లో ప్రసారం చేశారని, ఆ చానల్ యాజమాన్యంపై కోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వివరించారు. చదవండి: (మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం) చంపుతామంటే బెదిరేవాన్ని కాదు.. తనను చంపుతానంటే భయపడే వ్యక్తిని కాదని కందికుంటకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పరికి షామీర్ హెచ్చరించారు. బెదిరింపులతో కదిరి ప్రజలను భయపెట్టి రాజకీయం చేయాలని కందికుంట చూస్తున్నారని, ఈ సంస్కృతిని కదిరి ప్రజలు అంగీకరించరన్నారు. డబ్బు ఆశ చూపి కొందరు యువకులను కందికుంట తన వెంట తిప్పుకుంటూ పెడదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. త్యాగరాజుపై పలు కేసులున్నాయి తమపై తప్పుడు కేసు పెట్టిన త్యాగరాజుపై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని షాకీర్, షామీర్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను వారు మీడియాముందుంచారు. సీఅండ్ఐజీ మిషన్ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటూ కందికుంటతో చేతులు కలిపిన త్యాగరాజు తప్పుడు పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. -
అనంతపురం నుంచి స్వస్థలాలకు రాజస్థానీయులు
సాక్షి, అనంతరపురం : అనంతపురం జిల్లా కదిరి షెల్టర్ హోమ్‌లో ఉన్న 36మంది రాజస్థానీయులను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 18న బెంగళూరు నుండి కదిరి మీదుగా వెళ్తున్న 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని షెల్టర్‌హోమ్‌కు తరలించారు. అక్కడే వారికి అన్ని వసతులు కల్పించి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. లాక్డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించడంతో వారందరినీ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్వయంగా దగ్గరుండి వారిని విజయవాడ తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే బస్సులో వారు రాజస్థాన్ వెళ్లనున్నారు. 14 రోజుల పాటు అన్ని వసతులు కల్పించిన అధికారులకు, ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి రాజస్థానీయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
బీజేపీ నేత విష్ణుకు క్వారంటైన్ నోటీసు
సాక్షి, కదిరి: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డిని హోం క్వారంటైన్ చేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఆయన ఇంటికి నోటీసును అతికించారు. నాలుగు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాగా అధికారులు నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో ఉండి కూడా తాను లేనని చెప్పడంతో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని కదిరి తహసీల్దార్ మారుతి తెలిపారు. నోటీసు ధిక్కరించి ఎక్కడికైనా వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయనపై కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు. రెడ్‌జోన్ కర్నూలు నుంచి వచ్చినందున ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. (వెంటాడుతోంది..@30) నోడల్ అధికారికి షోకాజ్ నోటీస్ కరోనా పాజిటివ్ కేసుల వివరాలు అనధికారికంగా బయటకు రావడాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు తీవ్రంగా పరిగణించారు. కోవిడ్–19 కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారిగా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడుకు గురువారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. జిల్లాలో ఒకే రోజు 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, మొత్తంగా జిల్లాలో 44 పాజిటివ్ కేసులున్నాయని పేర్కొంటూ బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ నుంచి ఓ నోట్ అనధికారికంగా బయటకు వచ్చింది. వాస్తవంగా జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా.. కేసుల సంఖ్య 42కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా అనధికారికంగా వివరాలు బయటికి వెల్లడి కావడం.. అది కూడా తప్పుడు సమాచారం కావడంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై సంజాయిషీ కోరుతూ కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!) -
రమణీయం..రథోత్సవం
-
౩౦ ఏళ్ల కల నెరవేరింది
-
అలుపెరుగని ఉద్యమ గురువు రవూఫ్
సాక్షి , కదిరి: ఉద్యమ సహచరులు ‘విశ్వం’ అని పిలిచినా..పీడిత, తాడిత పేదలు రవూఫ్ సార్ అని పిలిచినా..ఉద్యమం వైపు ఆకర్షితులైన యువకులు ‘తాతా’ అని పిలిచినా ఆయనే కామ్రేడ్ రవూఫ్. ఆయన ఉద్యమమే ఊపిరిగా పనిచేశారు.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. నక్సల్బరి ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విస్తరింపజేయడంతో పాటు చైనా దేశీయ కమ్యూనిస్టులను సైతం ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఎప్పుడూ మూసధోరణిలో కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని ఆరోజుల్లోనే ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. ఆయన మాటలను పాటించినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్‌లకు ప్రస్తుత దుస్థితి ఉండేది కాదేమో... షేక్ అబ్దుల్ రవూఫ్ (ఎస్ఏ రవూఫ్) 1924లో కదిరి పట్టణంలోని సాహెబ్బీ, మదార్‌సాబ్ దంపతులకు జని్మంచారు. ఇంటర్ వరకూ కదిరిలో చదివి తర్వాత కర్ణాటకలోని గుల్బర్గాలో న్యాయవాద విద్యనభ్యసించారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్ భావాలకు ఆకర్షితుడైన రవూఫ్ 1964–65 కాలంలో కమ్యూనిస్ట్ పారీ్టలో చేరారు. కొన్ని కారణాల వలన అందులో ఇమడలేక పోయారు. కామ్రేడ్ చార్‌మజుందార్ పిలుపు మేరకు 1967లో న్యాయవాద వృత్తిని సైతం వదులుకొని సీపీఐ (ఎంఎల్)లో పూర్తి స్థాయి కార్యకర్తగా చేరి ఉద్యమ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. 1970లో సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1973లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఆయన జీవితమే మలుపు తిరిగింది. సాయుధ పోరాటానికి కొంతకాలం విరామం ప్రకటిద్దామని సీపీఐ(ఎంఎల్)అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య ప్రతిపాదనను రవూఫ్ తిరస్కరించారు. ‘ఉద్యమంలో విరామం ఉండదు..ఉద్యమం నిరంతర ప్రవాహం లాంటిది’ అంటూ జైలు నుంచే తన నిర్ణయాన్ని కొండపల్లి సీతారామయ్యకు చేరవేశారు. ఉద్యమానికే జీవితం అంకితం.. కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రవూఫ్ కీలక పాత్ర పోషించారు. తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశారు. కదిరి నగర పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన అప్పట్లో పేదలకు పన్ను నుంచి విముక్తి కల్పించారు. 1967లో కదిరి అసెంబ్లీకి సీపీఎం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వివాహానికి, బంధుప్రీతికి దూరంగా ఉండిపోయిన ఆయన..తన చివరి రోజుల్లో కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లలోని ఓ పూరి గుడిసెలో సాదాసీదా జీవితాన్ని గడిపారు. 2014 ఫిబ్రవరి 9న ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి కుటాగుళ్లలోనే అంత్యక్రియలు నిర్వహించి, గుర్తుగా రవూఫ్ స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన పేరిట కదిరి–కుటాగుళ్ల అనంతపురం జాతీయ రహదారిలో ఒక కాలనీ కూడా కుటాగుళ్లకు చెందిన గ్రామస్తులు ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. అంతర్జాతీయ రాజకీయ మార్పులకనుగుణంగా ఉద్యమ పంథా.. రవూఫ్ అభిప్రాయాన్ని కొండపల్లి ఖాతరు చేయలేదు. ఈ సమయంలోనే అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు ప్రభుత్వాల చేత అణచివేయబడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని కాపాడుకునేందుకు చైనాలోని టెంగ్–హువా,ఆల్బేనియన్ పార్టీలు నూతన సిద్ధాంతాన్ని (మావో సేటుంగ్ థాట్)ను ప్రతిపాదించగా కొన్ని మినహా దాదాపు అన్ని కమ్యూనిస్ట్ పారీ్టలు ఆమోదించాయి. ఎమర్జెన్సీ అనంతరం జైలు నుంచి విడుదలైన కామ్రేడ్ రవూఫ్ ఈ సిద్ధాంతాలు కొన్ని మార్పులు చేసి ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీ–సీపీఐ (ఎంఎల్)ను 1979లో స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రాలకు విస్తరింపజేశారు. అంతర్జాతీయ రాజకీయ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ రవూఫ్ వాటికనుగుణంగా ఉద్యమ పంథాలో కూడా మార్పులు చేస్తూ వచ్చారు. 1983లో మరోసారి రవూఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జైలులో ఉన్న సమయంలో 1985లో ఆర్‌ఓసీలో చీలిక ఏర్పడింది. జైలు నుంచి విడులయ్యాక రవూఫ్ 1989లో సీపీఐ (ఎంఎల్) రెడ్ఫ్లాగ్లో చేరి ఉద్యమాన్ని ఆం«ధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరింపజేశారు. 1999లో నక్సల్బరి, సీపీఐ(ఎంల్) విలీనమయ్యాయి. ఆ విలీన పారీ్టకి కామ్రేడ్ రవూఫ్ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. -
అలా వెళ్లాడు.. ఇలా దొరికిపోయాడు
సాక్షి, కదిరిటౌన్: తన వద్దనున్న వేరొకరి బ్యాంకు పాసుపుస్తకం తీసుకుని, ఖాతాదారు సంతకం ఫోర్జరీ చేసి నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మోసగాడిని బ్యాంకు అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కదిరికి చెందిన గంగిశెట్టి 2019 జూన్ 30న స్థానిక ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లాడు. నిరక్షరాస్యుడు కావడంతో బ్యాంకులో చిప్పలమడుగుకు చెందిన శివ అనే వ్యక్తి సహాయంతో విత్‌డ్రా ఫాం పూరించి, అందులో సంతకం చేశాడు. అదే సమయంలో సెల్‌ఫోన్‌కు ఎవరో కాల్ చేయడంతో గంగిశెట్టి మాట్లాడేందుకని విత్డ్రాం ఫాం, బ్యాంకు పాసుపుస్తకం సదరు వ్యక్తి వద్దే ఉంచేసి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. దరఖాస్తు రాసిచ్చిన శివ అనే వ్యక్తికి దురాశ కలిగింది. సంతకం చేసేసి ఉన్న రూ.27వేల విత్ డ్రా ఫాం తీసుకుని కౌంటర్లోకి వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఖాతాదారు ముఖం చూడకుండానే నగదు ఇచ్చేశారు. ఆ తర్వాత నెల రోజులకు గంగిశెట్టి తన పాసుపుస్తకం పోయిందని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన కంప్యూటర్లో పరిశీలించగా ఖాతాలోంచి రూ.27వేలు నగదు డ్రా అయిపోయిన విషయం బయటపడింది. తనకు సహాయం చేసిన వ్యక్తే ఈపని చేసి ఉంటాడని తెలపగా మేనేజర్ కొత్త పాసుపుస్తకం జారీ చేశారు. పాత పుస్తకం ఎవరైనా తీసుకువస్తే స్వాదీనం చేసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు. చదవండి: మైనర్‌పై అత్యాచారం.. 65 ఏళ్ల వృద్ధుడికి మరణ శిక్ష ఈ క్రమంలో శివ శనివారం మరోసారి గంగిశెట్టి ఖాతాలోంచి రూ.2వేలు నగదు డ్రా చేసుకుందామని ఆంధ్రాబ్యాంకుకు వెళ్లాడు. విత్‌డ్రా ఫాం నింపి, పాసుపుస్తకం తీసుకుని కౌంటర్‌కు వెళ్లాడు. అక్కడ నీ పేరేమి అని అడిగితే వాస్తవ ఖాతాదారు పేరు కాకుండా తన పేరు శివ అని చెప్పాడు. మరోసారి అడిగేసరికి పేరు పూర్తిగా చెప్పలేక నీళ్లు నమిలాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
‘మూడు ప్రాంతాల అభివృద్ధికి జైకొడదాం’
కదిరి: కోస్తా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని..ఈ నిర్ణయానికి జై కొడదామని సినీ నటుడు కత్తి మహేష్ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో టీడీపీ పెద్దలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. జనసేనాని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సేనానిలా మారిపోయారని విమర్శించారు. -
కదిరిలో దిశ చట్టం అవగాహనా ర్యాలీ
-
స్కూల్ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: కర్ణాటకలోని ఉడిపి వద్ద అనంతపురం జిల్లా కదిరి స్కూల్‌బస్సుకు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ప్రమాద వివరాలను సీఎంవో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమేఊ సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే గాయపడ్డ వారికి చికిత్స అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. కాగా బస్సు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా కర్ణాటక శివమొగ్గ జోగ్‌ఫాల్స్ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ విద్యార్థులలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల వెంట వెళ్లిన టీచర్, వంట మనిషి కూడా గాయపడినట్లు సమాచారం. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్ఎం రాజేంద్రన్ ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. ఈ నెల 2వ తేదీన కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులతో కలిసి 45మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. శుక్రవారం రోజంతా జోగ్ జలపాతం వద్ద ఆనందంగా గడిపారు. తర్వాత రాత్రిపూట బస చేసేందుకు మురిడి బయలుదేరగా మార్గంమధ్యలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ దారిగుండా వెళుతున్న ఇతర వాహనాల డ్రైవర్లు సమీపంలోని పోలీసులకు తెలియజేయడంతో వారు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యాయేసుబాబుకు సమాచారం ఇచ్చారు. గాయపడినవారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: విద్యార్థుల విహార యాత్ర.. ఘోర రోడ్డు ప్రమాదం -
విద్యార్థుల విహార యాత్ర.. ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, బెంగళూరు : విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు విహార యాత్రకు వెళ్తుండగా ఉడిపి సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి బాబా ఫకృద్దీన్ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు అద్దాలు పగులుగొట్టి కొందరు విద్యార్థులను ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో గాయపడిన వారు ఉడిపి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఆ టీడీపీనేతకు షాక్
సాక్షి, కదిరి: దేవుడి ఆస్తుల జోలికెళితే ఏదో ఒక రూపంలో ఆ దేవుడే శిక్షిస్తారని పెద్దలు చెబుతుంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పట్టణంలోని క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్‌ను కబ్జా చేశారు. తర్వాత దానికి తప్పుడు పత్రాలు సృష్టించి తన బినామీల పేరు మీద రిజిష్రే్టషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత దాన్ని కూల్చేసి అక్కడ ఐదంతస్థుల భవంతిని నిర్మిస్తున్నారు. తప్పుడు పత్రాలు సమరి్పంచి అక్కడ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ సలహాదారు ప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీళ ఆ ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపేయాలని, తదుపరి నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాన్ రద్దు చేయించి బాధిత క్రిస్టియన్లకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు మునుపు క్రిస్టియన్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వందేళ్లుగా బోర్డింగ్ స్కూల్.. కదిరిలో ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో 100 ఏళ్లుగా సీఅండ్ఐజీ మిషన్ చర్చికి సంబంధించిన క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉంది. అక్కడ క్రిస్టియన్ అనాథ ఆడపిల్లలు ఆశ్రయం పొందుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలకు వెళ్లి చదువుకునే వారు. అక్కడ ఆశ్రయం పొంది చదువుకున్న ఎంతో మంది పలు ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. ఆదుకుంటామని చెప్పీ... పట్టణానికి చెందిన కొందరు క్రిస్టియన్ ఆస్తులను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారని, వాటిని తాము కాపాడతామంటూ 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలను నమ్మించారు. చివరికి ఆయనే అప్పటి సీఅండ్ఐజీ మిషన్ చర్చి ఫాదర్‌ను చంపుతామని బెదిరించడంతో పాటు ఆ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని తన బినామీల పేరు మీద రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని సదరు చర్చి ఫాదర్ జిల్లా కోర్టులో కూడా ఒప్పుకున్నారు. చివరికి ఈ మనోవేదనతోనే చర్చి ఫాదర్ తనువు చాలించారు. దీంతో చర్చి ఫాదర్ వాంగ్మూలం మేరకు సదరు తప్పుడు డాక్యుమెంట్లను రద్దు చేసి ఆ బోర్డింగ్ స్కూల్‌ను మళ్లీ క్రిస్టియన్ అనాథ పిల్లలకోసమే ఉపయోగించాలంటూ అప్పట్లో కోర్టు తీర్పునిచ్చింది. సత్యానందాన్ని బెదిరించి.. క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ కరస్పాండెంట్‌గా ఉన్న ఎండీ సత్యానందంను 2018 జూన్ మొదటి వారంలో కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు చంపుతామంటూ బెదిరించి ఆయన దగ్గరున్న బోర్డింగ్ స్కూల్ తాళాలు లాక్కున్నారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని విద్యారి్థనులు రాకనే ఈ బోర్డింగ్ స్కూల్ భవనాన్ని కూల్చేయాలనే ఆలోచనతో జూన్ మొదటి వారంలో తెల్లవారు జామునే ఒక హిటాచీ వాహనంతో పాటు మరో జేసీబీ వాహనాన్ని తీసుకొచ్చి దాన్ని నేలమట్టం చేశారు. దీన్ని అప్పట్లోనే వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డితో పాటు వామపక్ష పారీ్టలు వ్యతిరేకించాయి. తప్పుడు పత్రాలతో అప్రూవల్.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2018లో కందికుంట వెంకట ప్రసాద్ ‘సమైక్య బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ప్లాన్ అప్రూవల్ తీసుకొని కూల్చేసిన క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థానంలో ఐదు అంతస్తుల భవంతిని నిర్మించి అందులోని ప్లాట్ల అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. సీఅండ్ఐజీ మిషన్ అభ్యంతరాలు చెప్పడంతో ఫేక్ డాక్యుమెంట్స్ అని నమ్ముతూ మొదట వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి సరైన సమాధానం రాకపోవడంతో సదరు ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్‌కు డబ్బు ఆశచూపి.. కందికుంట కన్ను రెండోసారి మళ్లీ బోర్డింగ్ స్కూల్ మీదపడింది. సీఅండ్ఐజీ మిషన్ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటున్న త్యాగరాజు ద్వారా రూ.10 కోట్లకు పైగా విలువ చేసే 20 సెంట్ల క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని కందికుంట తన బినామీలైన వెంకటనారాయణ, వెంకటరమణారెడ్డిల పేరు మీద రెండోసారి రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ రిజి్రõÙ్టషన్ చెల్లదని, సీఅండ్ఐజీ మిషన్ చర్చి ఆస్తులు అమ్మడానికి కానీ, కొనడానికి కానీ ఎవరికీ అధికారాలు ఉండవని తానే మిషన్ చైర్మెన్ అంటూ బి.జాన్ డేవిడ్ అప్పట్లోనే పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికీ కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాం గతంలో క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉన్న స్థలాన్ని కూల్చేసి అక్కడ 5 అంతస్తుల భవన నిర్మాణం కోసం బండి వెంకటనారాయణ, ఎ.వెంకటరమణారెడ్డిలు కదిరి మున్సిపాలిటీలో తీసుకున్న ప్లాన్ అప్రూవల్ రద్దు చేసిన మాట వాస్తవమే. మాకు అందిన పక్కా సమాచారం మేరకు న్యాయ సలహా తీసుకొని అవి తప్పుడు పత్రాలని నమ్ముతూ ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాము. ఇక మీదట అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అందులో ఎవరైనా ప్లాట్లు కొన్నా మున్సిపాలిటీ ఎలాంటి బాధ్యత వహించదు. – కె.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, కదిరి అనాథ పిల్లలకే దక్కాలి బోర్డింగ్ స్కూల్ కూల్చేసిన రోజే నేను అక్కడికి వెళ్లి అడ్డుకున్నాను. ఆ స్థలం క్రిస్టియన్ అనాథ పిల్లలకే దక్కాలన్నది నా ప్రధాన డిమాండ్. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. తప్పుడు పత్రాలు చూపి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న వారితో పాటు దీనికి ప్రధాన కారకులైన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే అక్కడ నిర్మించిన భవంతిని సీఅండ్ఐజీ మిషన్‌కు అప్పగించాలి. – డా.పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి -
లైంగిక దాడి కేసులో భర్త, అతని స్నేహితుడి అరెస్ట్
కదిరి అర్బన్: భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి.. అట్ల కాడతో మర్మాంగాలపై వాతలు పెట్టిన కేసులో భర్త, అతని స్నేహితుడిని కదిరి రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరి మండలానికి చెందిన డి.మల్లేశ్వర్ నవంబర్ 29న తన స్నేహితుడు విజయ్‌కుమార్‌తో కలిసి ఇంటికి వెళ్లాడు. భార్య కాళ్లు, చేతులు కట్టేసి స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం అట్ల కాడ కాల్చి మర్మాంగాలపై వాతలు పెట్టాడు. ఈ అమానవీయ ఘటనపై బాధితురాలు మరుసటి రోజు తలుపుల మండలం సిద్దగూరుపల్లిలోని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. వారి సహాయంతో ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన భర్త డి.మల్లేశ్వర్, అతని స్నేహితుడు విజయ్‌కుమార్‌ను మంగళవారం అర్ధరాత్రి కుటాగుళ్ల క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. బాధితురాలు తలుపుల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఘటన జరిగిన ప్రాంతం కదిరి రూరల్ పరిధిలోనిది కావటంతో అక్కడకు వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని డీఎస్పీ పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేయగానే.. తలుపుల ఎస్సై రఫీ ఆమెను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, ఆస్పత్రిలో కదిరి రూరల్ పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకుని కేసు నమోదు చేశారని వివరించారు. -
అవినీతి ఆరోపణలు.. సీఐపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అనంతపురం: కదిరి అర్బన్ సీఐ మల్లికార్జున గుప్తాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ మల్లికార్జున గుప్తాపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపి ఆ నివేదికను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అనంతపురం రేంజ్ డీఐజీకు పంపారు. ఈ నివేదిక ఆధారంగా సీఐను డీఐజీ సస్పెండ్ చేశారు. జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న పోలీసులు ఏ హోదాల్లో ఉన్నా చర్యలు తప్పవని, అలాంటి వారిపై ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. -
స్కూల్లో చిన్నారులను తాళ్లతో కట్టి చిత్రహింసలు
సాక్షి, అనంతపురం: క్లాస్‌లో అల్లరి చేస్తున్నారనే కారణంతో ముగ్గురు విద్యార్థులను తాళ్లతో బంధించిన ఘటన కదిరి మున్సిపల్ స్కూల్లో గురువారం చోటు చేసుకుంది. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ఆదేశాల మేరకు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా నిర్బంధించి ఉంచారు. అయితే అనూహ్యంగా విద్యార్థుల నిర్బంధానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపడంతో.. స్కూల్ హెచ్ఎం శ్రీదేవిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పిల్లలను నిర్బంధం గురించి హైదరాబాద్‌కు చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు(నేషనల్ చైల్డ్ కమిషన్) ఫిర్యాదు చేశారు. -
నళిని ప్రాణాలతో ఉందా.. చంపేశారా..?
నళిని 2017 నుంచి కన్పించడం లేదు. ఆమెను ఆ సీఐ చంపేసి ఆనవాళ్లు కనుక్కోకుండా శవాన్ని కూడా కాల్చేశాడని ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏమైనట్లు.. ప్రాణాలతో ఉందా.. ఉంటే ఎక్కడుంది.. లేదంటే వారు చెప్పినట్లు చంపేశారా? దీనికి కారకుడైన ఆ సీఐకి తెలుగుదేశం పార్టీ పెద్దల అండదండలు ఉండటంతో గత ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసును తొక్కి పెట్టారని వారి ఆరోపణ. ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ఆయనను కలిసి మా గోడు చెప్పుకుటామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా నళినీ... ఏమిటా మిస్టరీ..? సాక్షి, కదిరి: కదిరి పట్టణానికి చెందిన రిటైర్డ్ హెల్త్ ఉద్యోగి కె.శ్రీరాములు భార్య నళిని. వీరికి డిగ్రీ పూర్తి చేసుకున్న సందీప్, అశోక్ అనే ఇద్దరు కుమారులున్నారు. సజావుగా సాగుతున్న వారి కాపురంలో ఆమెకు ఓ సీఐ పరిచయమైన తర్వాత గొడవలు మొదలయ్యాయి. భర్తతో కలిసి ఉన్నప్పుడే ఆమె తన భర్త నుంచి తనకు ప్రతి నెలా భరణం ఇప్పించాలని 2013 నవంబర్‌లో కదిరి కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆమెకు ప్రతి నెలా రూ.3 వేలు ఇవ్వాలని ఆదేశించడంతో అలాగే ఇస్తూ వచ్చాడు. తనతో కలిసి ఉండగానే ఆమె ఇలా చేయడమేంటని ఆయన 2016 ఆగస్టులో పదవీ విరమణ అనంతరం భార్యకు దూరంగా ఉంటూ పెద్ద కుమారుడు సందీప్‌తో కలిసి అనంతపురానికి కాపురం మార్చేశాడు. దీంతో ఆమె తన చిన్న కొడుకు అశోక్‌తో కలిసి కదిరిలోనే ఉండేది. చిన్న కొడుక్కు బెంగుళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. తరచూ వచ్చి తల్లిని చూసి వెళ్లేవాడు. తిరుపతికని వెళ్లి తిరిగి రాలేదు 2017 మార్చి 14న అశోక్‌కు తల్లి నళిని ఫోన్ చేసి ‘నాకు ఆరోగ్యం బాగాలేదు. కిడ్నిలో రాళ్లు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. తిరుపతికి వెళ్లి అక్కడ పెద్ద డాక్టర్ల దగ్గర చూపించుకొని వస్తాను’ అని చెప్పడంతో సరేనన్నాడు. ఆ తర్వాత తల్లి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్లు రాకపోవడంతో కదిరికి వచ్చి వెదికాడు. చేసేది లేక నాన్నతో పాటు అన్న సందీప్‌కు విషయం తెలియజేశాడు. వారు వెంటనే తిరుపతికి వెళ్లి ఆసుపత్రులన్నీ విచారించారు. ఎక్కడా వైద్యం చేయించుకోలేదని నిర్ధారించుకొన్నాక 2017 ఏప్రిల్ 29న అశోక్ తన తల్లి నళిని కన్పించడం లేదంటూ కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు(క్రైం.నెం134/17)నమోదు చేశారు. గంగమ్మ మోరీ వద్ద గుర్తు తెలియని శవం తమ తల్లి ఆచూకీ ఏమైందంటూ అశోక్‌తో పాటు అన్న సందీప్, నాన్న శ్రీరాములు కలిసి ఓ రోజు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడిగారు. దీంతో అక్కడున్న పోలీసు అధికారులు 2017 మార్చి 9వ తేదీన కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద ఓ మహిళను ఎవరో చంపేసి గుర్తు పట్టకుండా శవాన్ని కాల్చేశారని చెప్పారు. ఆమెకు సంబందించిన చెవి కమ్మలు, కాలి గొలుసులు, ఇతర ఆనవాళ్లు చూపెట్టడంతో ఆమె తమ తల్లే అని ఇద్దరు కొడుకులతో పాటు ఆమె భర్త కూడా పోలీసుల ఎదుట పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆమె కుమారుడు అశోక్ బ్లడ్ శాంపిల్స్‌కు అవి సరిపోవడం లేదంటూ డీఎన్ఏ నివేదికలో వచ్చింది. మరి నళిని ఏమైనట్లు..? ఆనవాళ్లను బట్టి గంగమ్మ మోరీ దగ్గర చనిపోయింది తమ తల్లే అని ఆమె కుమారులు చెబుతున్నప్పటికీ డీఎన్ఏ రిపోర్ట్‌లో అందుకు విరుద్ధంగా రావడంతో ఎవరికైనా అనుమానం కలగక తప్పదు. అయితే నళిని భర్త ఓసారి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విచారించగా పోలీసులు పంపిన శరీర భాగాలు మహిళవి కావని, అవి పురుషుడికి సంబంధించినవి కావడంతోనే మీ కుమారుడి రక్త నమూనాలతో సరిపోవడం లేదని అసలు విషయం చెప్పారు. దీంతో ఆయన అనుమానం నిజమైంది. ఆమెకు ఓ సీఐతో వివాహేతర సంబంధం ఉందని, ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి ఒత్తిడి కారణంగా అప్పట్లో ఆ కేసును నీరు గార్చేశారని నళినీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ సీఐ చంపేశాడు చిత్తూరు జిల్లా పుత్తూరు (ప్రస్తుతం తిరుమల సీసీఎస్)సీఐగా ఉండే డి.కొండయ్యకు నా భార్య నళినితో కొనేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె తిరుమల శ్రీవారి సన్నిధిలో సేవ పేరుతో ప్రతి నెలా 10, 15 రోజులు వెళ్లేది. మాకు అప్పుడు అనుమానం రాలేదు. నళినీ 2017 మార్చి 9 నుంచి కన్పించడం లేదు. అదే రోజు కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ మోరీ వద్ద ఓ మహిళను చంపేసి శవాన్ని కూడా కాల్చేశారు. ఆమే నా భార్య అని ఆనవాళ్లను బట్టి నేను గుర్తించాను. అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా 6 నెలల పాటు ఆమె వాడుతున్న ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లో అతను అఫీషియల్ సిమ్ వేసుకొని ఉపయోగించాడు. ఆమె వాడుతున్న బీఎస్ఎన్ఎల్ నెం.94928 92028తో పాటు జియో నెం.83091 45636 నుంచి నా సెల్(నెం.94911 64082)కు 2017 ఏప్రిల్ 22న ఉదయం 10.24 గంటలకు 11 మిస్డ్ కాల్స్ వచ్చాయి. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తే ‘నా పేరు సుధాకర్‌రెడ్డి. మాది పులివెందుల. నేను నీ పెళ్లాం నళినీ పెళ్లి చేసుకొని బెంగుళూరులో కేఆర్ పురంలోని ఐశ్వర్య అపార్ట్మెంట్లో ఉన్నాము. మా కోసం ఆరా తీశావో నీ కొడుకులు ఇద్దరినీ చంపేస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయం అప్పటి జిల్లా ఎస్పీకి 2017 ఏప్రిల్ 24న రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాను. తర్వాత తాను సీఐనని కూడా ఫోన్ చేసి చెబుతూ మళ్లీ బెదిరించాడు. నా భార్య కేసు ఏమైందంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున ఆ సీఐకి ఆ పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి. అందుకే ఆ కేసు ముందుకు సాగలేదని మేము భావిస్తున్నాము. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా బాధ చెప్పుకుంటాం. మాకు న్యాయం చేసి, ఖాకీ ముసుగులో ఉన్న ఆ నేరస్థుడిని పట్టుకొని శిక్షించాలని కోరతాం. – నళినీ భర్త శ్రీరాములు -
సారుకు సగం.. బార్లకు సగం..!
మద్య నిషేధానికి అడుగులు వేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ఓ ఎక్సైజ్ అధికారికి కాసులు కురిపిస్తోంది. మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆయన.. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. మద్యానికి ఆయనే ఓ రేటు నిర్ణయించి ఇష్టానుసారం అమ్మిస్తున్నాడు. ఇక బార్ల నిర్వాహకులతో చేతులు కలిపి మందుబాబులను భారీగా దోచేస్తున్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే కోటీశ్వరుడయ్యారు. ఆయన పేరు ఏమంటే కదిరిలో ఎవరైనా ‘టఖీ’మని చెప్పేస్తారు. సాక్షి, కదిరి: నిరుపేదల రెక్కల కష్టం మద్యం షాపునకు కాకుండా వారి పిల్లల భవిష్యత్‌కు పెట్టుబడి కావాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మద్యనిషేధానికి తొలి అడుగులు వేశారు. ఈ క్రమంలోనే నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా 247 మద్యం దుకాణాలు ఉండగా.. 20 శాతం తగ్గిస్తూ 197కు పరిమితం చేశారు. అంతేకాకుండా సమయాన్ని కూడా తగ్గించేశారు. కానీ మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఓ ఎక్సైజ్ అధికారి నిరుపేదల జేబుకు చిల్లు పెడుతూ తన పర్సు నింపుకుంటున్నారు. ప్రభుత్వ దుకాణంలోనే అదనం కదిరి ఎక్సైజ్ శాఖ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో పనిచేసే సిబ్బందిని ఇటీవల ప్రభుత్వమే నియమించింది. వీటిపై పెత్తనం ఎక్సైజ్ శాఖకు ఉండటంతో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించాలని దుకాణాల్లోని యువకులకు ఆదేశించారు. టిన్ బీర్‌పై ఎంఆర్పీ రూ.100 ఉండగా రూ.130లకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి లిక్కర్‌ను అధిక ధరకు విక్రయిస్తుండగా.. మందుబాబులు లబోదిబోమంటున్నారు. దోపిడీ ‘బార్లా’ తెరిచారు కదిరి పట్టణంలో రెండు బార్లు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో పీవీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఆర్ఎస్ రోడ్లో ఉన్న చందు బార్ అండ్ రెస్టారెంట్లో రోజుకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వ్యాపారం జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పట్టణంలోని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడగానే ఈ బార్లలో మద్యం వ్యాపారం రెట్టింపు అవుతుంది. ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రూ.100 టిన్ బీర్ రూ.150 అమ్ముతారు. రూ.130 ఉన్న నాకౌట్ బీర్ రూ.160 నుంచి రూ.180, కొరియర్ గ్రీన్ విస్కీ క్వాటర్ బాటిల్ రూ.230 ఉంటే రూ.300 అమ్ముతున్నారు. ఇలా ఏ బ్రాండ్ తీసుకున్నా ఫుల్ బాటిల్ మీద రూ.100 నుంచి రూ.300 దాకా అధికంగా వసూలు చేస్తున్నారు. సారుకు సగం.. బార్లకు సగం బార్లలో రాత్రి 8 తర్వాత జరిగే వ్యాపారంలో బార్ల నిర్వాహకులకు సగమైతే.. ఆ మిగిలిన సగం వాటా ఎౖక్సైజ్ సారుకు అందుతోంది. ఆ డబ్బు ఎప్పటికప్పుడు రోజూ ఆయనే స్వయంగా వెళ్లి కలెక్షన్ చేసుకుంటున్నారని సంబంధిత శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఇలా మద్యం దుకాణాల ద్వారా అధిక ధరలకు మద్యం అమ్మినందుకు ఆయనకు రోజుకు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు దాకా వస్తోందని, ఆ రెండు బార్ల ద్వారా రోజూ ఆయనకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా అక్రమ ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఎక్సైజ్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సదరు ఎక్సైజ్ అధికారి అక్రమార్జనకు అడ్డూఅదుపు లేకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. -
కదిరిలో ఖతర్నాక్ ఖాకీ
ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. ఇతరుల వల్ల అన్యాయం జరిగినా.. వెంటనే పరిగెత్తేది పోలీసుస్టేషన్‌కు. బాధితుల ఫిర్యాదు తీసుకుని విచారణ జరిపి నిందితులను కోర్టు మెట్లెక్కించడం పోలీసుల విధి. అలాంటి ఓ పోలీసు దారి తప్పాడు. ఓ సర్కిల్‌కు ఉన్నతాధికారిగా.. తన సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. ఖాకీ ముసుగులో కాసుల వేటలో పడ్డాడు. కేసు ఏదైనా.. బాధితులైనా.. నిందితులైనా డబ్బులిస్తేనే వారికి న్యాయం చేస్తాడనే పేరు ఈయన సొంతం. అడిగినంత ఇవ్వకపోతే బాధితులపైనే రివర్స్ కేసు పెట్టేస్తాడనే అపవాదూ ఉంది. అందుకే కదిరిలో ఆయన పేరు ‘మనీ’కార్జునగా మార్మోగుతోంది. సాక్షి, కదిరి(అనంతపురం): పోలీసు శాఖలో సీఐ అంటే అందరికీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గానే తెలుసు. కానీ కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్త మాత్రం ఆ పదాన్ని కలెక్షన్ ఇన్స్పెక్టర్గా మార్చేశారు. నిందితులతో పాటు బాధితుల దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నాడు. ఎస్పీ సత్యయేసుబాబు ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు కృషి చేస్తుండగా.. కదిరి టౌన్ సీఐ మాత్రం కాసులిస్తేనే ఖాకీ సేవలనేలా వ్యవహరిస్తున్నాడు. బాధితులైనా సరే పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెపితే కానీ న్యాయం చేసే పరిస్థితి లేదు. అందువల్లే ఆయన కదిరికి వచ్చిన 90 రోజుల్లోనే రూ.కోటి దాకా అక్రమంగా సంపాదించాడని పోలీసుల వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. బూటు కాలుతో తంతా... ‘నా అల్లుడు శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీద నెల రోజుల క్రితం మీకు ఫిర్యాదు చేశాం. మీరు ఏ మాత్రం పట్టించుకోలేదు. సీఐకి రూ.50 వేలు ఇచ్చాను. ఆయన నా మాటే మాట్లాడతాడని మా అల్లుడే మాతోనే ఎన్నోసార్లు అన్నాడు. నా కూతురు శైలజకు జరిగిన అన్యాయం నీ కూతురుకు జరిగితే మీరు ఇలాగే వ్యవహరిస్తారా..?’ అని కదిరి పట్టణానికి చెందిన సుజాత అన్నందుకు ‘చెప్పుతో కొడతా లం.., నోటి కొచ్చింది మాట్లాడతావా?’ అంటూ పత్రికలో రాయలేని విధంగా దూషించారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. గత శనివారం సాయంత్రం స్టేషన్ ప్రాంగణంలోనే విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తెలిసిందే. ఈ దృశ్యాన్ని ఆమె బంధువులు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా.. వారిని చితక్కొట్టిన సీఐ మల్లికార్జున గుప్త.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ బాధితులపైనే కేసు నమోదు చేయడం గమనార్హం. ఆయనకు 41 నోటీసు వజ్రాయుధం పలు నేరాల్లో నిందితుడైన హతీక్ అనే వ్యక్తి ఓ మహిళను చీరపట్టి లాగి అందరి ముందూ అవమానించాడు. దీనిపై బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. సీఐ మల్లికార్జున గుప్త నిందితుడి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని అతనికి 41 నోటీసు ఇచ్చి సరిపెట్టారు. అలాగే రెండు రోజుల క్రితం తన అల్లుడు రెండోపెళ్లి చేసుకున్నాడని సూజత అనే మహిళ ఫిర్యాదు చేయగా.. నిందితుడు శ్రీనివాసులు దగ్గర రూ.50 వేలు లంచం తీసుకొని అతనికి కూడా 41 నోటీసు ఇచ్చి చేతులకు దులుపుకున్నాడని బాధితురాలు మీడియా ముందు వాపోయింది. కేసు వస్తే సీఐకి కాసుల పంటే టీడీపీ పట్టణాధ్యక్షుడు అహ్మద్‌వలీ ఇంటి పట్టాల ఇప్పిస్తామని చెప్పి తమవద్ద భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించారని దాదాపు 150 మంది భవన నిర్మాణ కార్మికులు ఫిర్యాదు చేస్తే.. ఆ కేసులో కూడా అహ్మద్ వలి దగ్గర సుమారు రూ.5 లక్షలు దాకా డబ్బు తీసుకొని 41 నోటీసుతో సరిపెట్టాడని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు అడిగితే కేసు నమోదు చేసి నిందితుడికి 41 నోటీసు ఇచ్చామని తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ⇔ రైల్వేస్టేషన్ రోడ్లో ఇటీవల వడ్డే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు ఇంటి విషయంలో తగాదా పడితే పోలీస్ స్టేషన్లోనే దుప్పటి పంచాయతీ చేసి అక్కడే పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ద్వారా రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ⇔ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట అనుచరుడు పాలహరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ పొలాన్ని కబ్జాచేసి తప్పుడు పత్రాలు పుట్టించారని రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఒకరు ఈ మధ్యే కదిరి తహసీల్దార్ మారుతిని కలిసి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన తహసీల్దార్.. బాధితులకు న్యాయం చేస్తూ ఆ పొలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటప్పుడు పోలీసులు అతనికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ కేసులో కూడా పట్టణ సీఐ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులకు ఎలాంటి పోలీసు రక్షణ కల్పించకపోగా... నిందితునికి బదులు బాధితుడినే స్టేషన్‌కు పిలిపించి అతన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడినట్లు తెలుస్తోంది. ⇔ ఇక వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై సీఐగా ఇక్కడికి వచ్చిన మల్లికార్జున అక్కడ ఉన్న తన ఇంటి సామగ్రిని ఓ మినీ లారీలో కదిరికి తెప్పించుకున్నాడు. కదిరికి చెందిన ఆ లారీ యజమాని రహంతుల్లాకు బాడుగ ఇవ్వకుండా.. ఆయన కోరిక మేరకు అతనికి సరిపోని ఇరువురిపై తప్పుడు కేసు నమోదు చేశారు. మొదట రాయించిన కంప్లైంట్ సరిగా లేదంటూ దాన్ని చింపేసి, తమను చంపడానికి వచ్చారంటూ మరో ఫిర్యాదు రాయించుకొని తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫీ చేత బలవంతంగా ఆ కేసు ఫైల్ చేయించినట్లు చర్చ జరుగుతోంది. పైసలిస్తే కేసు క్లోజ్ టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అనుచరుడు నటేష్ ఎంతో మంది రైతులను మోసగించి సుమారు రూ.2 కోట్లకు పైగా ఎగ్గొట్టాడు. దీనిపై బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో ఇక్కడ పని చేసిన సీఐ బీవీ చలపతికి నటేష్ రూ.20 లక్షలు ఆఫర్ చేసి ఆ కేసు మూసివేయాలని కోరితే అందుకు ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుత సీఐ మల్లికార్జున గుప్త ఇంకా ఎక్కువ మొత్తం తీసుకొని బాధితుడు నాయక్ ఒక్కరే అని చూపుతూ లోక్ అదాలత్ ద్వారా ఆ కేసును కొట్టివేయించి మిగిలిన రైతులందరినీ మోసగించారని బాధితులు వాపోతున్నారు. అక్కడ కూడా ఇంతే.. సీఐ మల్లికార్జున గుప్త టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పని చేసేటప్పుడు కూడా టీడీపీ నాయకుల మెప్పుకోసం అక్కడి ఎమ్మెల్యే రోజాపై పలు తప్పుడు కేసులు బనాయించారు. ఇలా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ పేరు డీఎస్పీ పదోన్నతి జాబితాలో ఉందని తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి తక్షణం ఇతన్ని విధుల నుంచి తప్పించి నిష్పక్షపాతంగా ఉన్న ఓ పోలీసు అధికారితో దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కందికుంట.. అక్రమాల పుట్ట!
సాక్షి, కదిరి(అనంతపురం): తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దందాలు, భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి సహకారంతో బాధితులు ఒక్కొక్కరు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి కందికుంటతో పాటు ఆయన అనుచరులపై ఫిర్యాదులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కందికుంట హిందూపురం రోడ్లో వీవర్స్ కాలనీ సమీపంలోని సర్వే నెం.70/3లో ఉన్న 3.04 ఎకరాల తమ భూమిని కాజేసి బినామీ పేర్లమీద తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాదారు పాసుపుస్తకం కూడా చేయించుకున్నాడన్న బాధితురాల ఫిర్యాదుపై స్పందించిన కదిరి ఆర్డీఓ రామసుబ్బయ్య సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేసిన విషయం విదితమే. ఈ వార్త కదిరి ప్రాంతంలో సంచలనంగా మారింది. అలాగే కందికుంట అనుచరుడు, రౌడీషీటర్ అయిన గూడూరు హరినాథ్ అలియాస్ పాల హరి తమ భూమిని కబ్జాచేసి రాతి కప్పులు నాటాడని రిటైర్డ్ డీసీటీఓ నరసింహులు, ఆయన సతీమణి ఆకుల జయమ్మ ఫిర్యాదు చేస్తే కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్ రికార్డులను పరిశీలించి పాలహరి పొందిన పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేయడంతో పాటు బాధితురాలు తన ఆస్థిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆమెకు తగిన రక్షణ కల్పించాలని కూడా తహసీల్దార్ ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా కందికుంట అనుచరుడు, టీడీపీ పట్టణాధ్యక్షుడు అయిన అహ్మద్‌వలీ ఇంటి పట్టాల పేరుతో తమ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి తమను మోసగించారని భవన నిర్మాణ కార్మికులు రెండు రోజుల క్రితం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ 2015 డిసెంబర్ 16న అనారోగ్యంతో మరణించిన తమ తండ్రి డా.ప్రభాకర్ నాయుడు అలియాస్ పాముల డాక్టర్ సంతకాన్ని కందికుంట అనుచరులు ఫోర్జరీ చేసి తమ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేశారని ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తండ్రి చనిపోక ముందే తమకు విక్రయ అగ్రిమెంట్ చేయించారని ఫోర్జరీ సంతకాలతో పత్రాలు పుట్టించి జిల్లా కోర్టులో వ్యాజ్యం(ఓఎస్ నెం.66/2016 ) వేశారని దీనిపై తాము కోర్టుకు వాస్తవాలు తెలియజేయడంతో పాటు వారిపైనే చర్యలు తీసుకోవాలని కోరడంతో వారు ఆ కేసును ఉపసంహరించుకున్నారని ఆ ఫిర్యాదులో తెలియజేశారు. తర్వాత తనతో పాటు తన తల్లిని చంపుతామని బెదిరించి బలవంతంగా తమ దగ్గర సంతకాలు తీసుకొని విక్రయ పత్రాలు సిద్ధం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. తమను బెదిరించి తమ ఆస్థిని కాజేసిన కందికుంట అనుచరులపై తగు చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో బాధితుడు పవన్ పోలీసులను కోరారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డా.ప్రభాకర్ నాయుడు అలియాస్ పాముల డాక్టర్ పొలం ఇదే.. చంపుతామని బెదిరించి.. తనతో పాటు తన తల్లిని చంపుతామని కందికుంట తన అనుచరుల ద్వారా బెదిరించి తమ భూమిని రిజిస్టర్ చేయించుకున్నారని పట్టణంలోని దేవాలయం వీధికి చెందిన దివంగత డా.ప్రభాకర్ నాయకుడు కుమారుడు పి.పవన్‌కుమార్ గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు(క్రైం.నెం225/2019) నమోదు చేశారు. కందికుంట అనుచరులైన టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గూనివాండ్ల వసంత కుమారుడు గూనివాండ్ల చైతన్య, ఎన్పీ కుంట మండలం మేకలచెరువుకు చెందిన రమణ, గాండ్లపెంట మండలం కురుమామిడి ఆర్. శ్రీరాములు, నాగూరుపల్లి రమేష్‌బాబు, పట్టణంలోని సింహకోటకు చెందిన పి.శ్రీనివాసులు, అడపాలవీధికి చెందిన ఎం.రాజశేఖర్‌రెడ్డి, పులివెందులకు చెందిన లింగాల ప్రసాద్‌రెడ్డి, గాండ్లపెంట మండలానికి చెందిన గాజుల సుజన, ఈమె భర్త గాజుల ప్రతాప్‌తో పాటు బెంగుళూరుకు చెందిన దీపక్ కృష్ణమూర్తిలపై ఐపీసీ సెక్షన్ 467, 468, 471, 506(2)తో పాటు రెడ్‌విత్ ఐపీసీ 34 కింద కేసు నమోదు చేశారు. -
విద్యార్థినితో రెండోపెళ్లి, మొదటి భార్య ఫిర్యాదు
సాక్షి, అనంతపురం: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. పాఠాలు బోధించాల్సిన అధ్యాపకుడు...విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడపడమే కాకుండా ఏకంగా రెండోపెళ్లి చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. మొదటి భార్య ఫిర్యాదుతో అయ్యగారి బాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ ప్రవీణ్ కుమార్.. తాను పనిచేసే కళాశాల విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడికి ఇంతకు ముందే త్రివేణి అనే యువతితో వివాహం అయ్యింది. అంతేకాకుండా ఆమెను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. తనకు వివాహం అయిన విషయాన్ని దాచిపెట్టి రెండోపెళ్లి చేసుకున్న ప్రవీణ్‌కుమార్‌పై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు ఏపీఆర్ఎస్ విద్యార్థులపై కేసు.. మరోవైపు విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక దాడికి యత్నించడం, సహకరించకపోవడంతో ఇష్టారాజ్యంగా చితకబాదిన ఘటన మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్ ఎక్సలెంట్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. కాగా గత ఆగస్టు 15న పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నలుగురు ఒకే రూంలో ఉన్నారు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక సహ విద్యార్థిపై మరో ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడికి యత్నించారు. ఆ సమయంలో విద్యార్థి అరవకుండా నోట్లో గుడ్డ కుక్కారు. ఎంతకీ సహకరించకపోవడంతో చితకబాదారు. మరుసటి రోజు హౌస్ ఇన్చార్జ్ సుకన్యకు బాధిత విద్యార్థి విషయం తెలపడంతో వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. అయితే పాఠశాల ప్రిన్సిపాల్ వాసుదేవరెడ్డి గత ఆదివారం రాత్రి బాధిత, బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. బాధ్యులైన ముగ్గురు విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు సిద్ధపడగా, అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదుకు సిద్ధం అయ్యాడు. అయితే రాజీ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ప్రిన్సిపాల్ వాసుదేవరెడ్డి బాధ్యులైన విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించి 16న రాత్రి విద్యార్థులను వారి తల్లిదండ్రులతో పాటు పంపించేశారు. విద్యార్థులపై కేసు నమోదు అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధిత విద్యార్థి తండ్రిని పిలిపించి విచారణ చేపట్టారు. లైంగికంగా వేధించడమే కాకుండా అందుకు సహకరించలేదని చితకబాదిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం పరిగి పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన ముగ్గురు విద్యార్థులను జే–1, జే–2, జే–3గా పరిగణించి బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. -
ఈ పాలకు మస్తు గిరాకి..
సాక్షి, కదిరి(అనంతపురం) : ‘గంగిగోవు పాలు గరిటేడైన చాలు.. ఖరము పాలు కడవడైననేమీ’ అంటూ వేమన చెప్పిన మాటలు ప్రస్తుత రోజుల్లో తిరగబడ్డాయి. గంగి గోవు పాలు సంగతి ఎలా ఉన్నా.. ఖరము (గాడిద)పాలు ఉగ్గేడుంటే చాలు అంటూ పెద్దలు ఎంపర్లాడుతున్నారు. నవజాత శిశువులకు గాడిద పాలు తాపడం ద్వారా ఎలాంటి వ్యాధులు దరిచేరవని, జీర్ణశక్తి మెరుగు పడుతుందని పలువురు విశ్వసిస్తుండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో గాడిద పాలు అమ్మేవారు పది రోజులుగా కదిరి శివారులో మకాం వేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన పది కుటుంబాలు దాదాపు 30కి పైగా గాడిదలను వెంట తెచ్చుకుని ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ఉదయాన్నే గాడిదలను తీసుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పాలను అమ్ముతుంటారు. అయితే ఉగ్గు (దాదాపు 5 ఎంఎల్) గాడిద పాలను రూ.200 చొప్పున విక్రయిస్తుండడం గమనార్హం. -
ప్రభుత్వాస్పత్రిలో టిక్‌టాక్ కలకలం
సాక్షి, కదిరి టౌన్: కదిరి ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం టిక్‌టాక్ వీడియోలు కలకలం రేపాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిపై జిల్లా వైద్య శాఖతో పాటు కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగినితోపాటు సహకరించిన మరో ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. వివరాల్లోకెళితే.. కదిరి ప్రభుత్వాస్పత్రిలో సద్గుణ, శైలజ మెడాల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు ల్యాబ్‌లోనే కాలక్షేపానికి టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరించుకుని పోస్ట్ చేసేవారు. అందులో భాగంగానే శుక్రవారం కూడా వీడియోలు తీశారు. దీంతో ల్యాబ్‌లో పరీక్షల కోసం వచ్చిన కొందరు రోగులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఆయన ముందుగా వారికి మెమో ఇచ్చారు. అనంతరం జిల్లా వైద్యాధికారులు, కలెక్టర్ సత్యనారాయణలు ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వీడియోతో నాకు సంబంధం లేదు టిక్‌టాక్ వీడియోతో తనకు సంబంధమేమీ లేదని ల్యాబ్‌టెక్నీషియన్ సద్గుణ రోదించింది. ఆస్పత్రి క్యాంటీన్లో కావాలనే శైలజ తనను వీడియోలో కనపడేటట్లు చేసిందని తెలిపింది. క్యాంటీన్ వీడియోలో మాత్రమే తానున్నానని, ల్యాబ్‌లో చిత్రీకరించిన వీడియోలో తాను లేనని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరింది. -
ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!
సాక్షి, కదిరి(అనంతపురం) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొర్తికోట త్రిబుల్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్థిక లావాదేవీలతో శివరామిరెడ్డిని హత్య చేసిన దుండగులు ..ఆ ఘాతుకాన్ని చూసిన ఇద్దరు మహిళలనూ అంతమొందించినట్లు భావిస్తున్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు నిందితులు క్షుద్రపూజ డ్రామా ఆడినా.. పోలీసులు మాత్రం కచ్చితమైన ఆధారాలతో ముందుకు సాగుతున్నారు. ఈకేసులో ఇప్పటికే ఇరువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన త్రిబుల్ మర్డర్ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు బృందాలుగా విడిపోయిన పోలీసులు...తీగలాగుతూ డొంక కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు వ్యవహరమే...! కొర్తికోటకు చెందిన శివరామిరెడ్డి(70) కర్నూలు జిల్లా శ్రీశైలంలోని ఐటీఐ కళాశాలలో ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటూ పదవీ విరమణ పొందారు. అనంతరం స్వగ్రామం తనకల్లు మండలం కొర్తికోట చేరుకున్నారు. అక్కడ తమ పూర్వీకులు కట్టించిన శివాలయం బాగోగులు చూసుకుంటున్నాడు. పదవీ విరమణ అనంతరం తనకొచ్చిన డబ్బుతో పాటు ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బు, గుడి నిర్మాణం కోసం వచ్చిన చందాల డబ్బుతో వడ్డీ వ్యాపారం కూడా చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కొంత కటువుగా వ్యవహరించేవారని తెలుస్తోంది. ఈ కారణంగా ఈయనకు శత్రువులు పెరుగుతూ వచ్చారు. వీరిలో కొందరు జట్టుగా ఏర్పడి శివరామిరెడ్డిని హతమార్చాలని పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్లాన్ ప్రకారం గుడిముందు నిద్రిస్తున్న శివరామిరెడ్డిని వేటకొడవళ్లతో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. ఈ క్రమంలో కొంత పెనుగులాట జరగ్గా.. అక్కడే నిద్రిస్తున్న శివరామిరెడ్డి సోదరి కమలమ్మ(75), గ్రామానికే చెందిన సత్య లక్ష్మమ్మ(70) మేల్కొన్నారు. శివరామిరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన వారు గట్టిగా అరిచేందుకు ప్రయత్నించారు. దీంతో దుండగులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిద్దరిని సైతం గొంతుకోసి అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొక్కంటి క్రాస్‌లో మద్యం కొని... కొక్కంటి క్రాస్‌లోని ఓ మద్యం దుకాణంలో హంతకులు మద్యంతో పాటు సమీపంలోని బజ్జీల బండి వద్ద బజ్జీలను కూడా కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. చంపడానికి ముందు అందరూ మద్యం సేవించిన చోటుకు పోలీసు జాగిలాలు వెళ్లినట్లు సమాచారం. అక్కడ పడిన మద్యం బాటిళ్లపై ఉన్న లేబుల్ అధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారనే విషయం పోలీసులు సులభంగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మంగళవారం రాత్రి కొర్తికోట పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. హంతకుల కోసం డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ జాగిలాలు స్థానిక తిమ్మమ్మ మర్రిమాను రోడ్డులో ఉండే ఓ ఇంటి వద్ద ఆగడంతో ఆ ఇంట్లో సోదాలను నిర్వహించి ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇంట్లోనే జింక చర్మం కూడా దొరికినట్లు ప్రచారం ఉంది. హత్యల్లో వీరి పాత్రపై పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో ఒకరు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోటలోని ఆలయంలో గుప్తనిధులు తీస్తుండగా పోలీసులకు పట్టుబడగా... 2015లో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇంకొకరు హత్య జరిగిన శివాలయంలో కొద్దిరోజులు పూజారిగా పనిచేశారు. శివరామిరెడ్డి గుడి వ్యవహారాలను చూడడానికి ఇక్కడి వచ్చేయడంతో అప్పటి నుంచి అతను గుడికి వెళ్లడం మానివేశాడు. వీరిని విచారిస్తే కేసు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులను పక్కదారి పట్టించాలని... శివరామిరెడ్డి, కమలమ్మ, సత్య లక్ష్మమ్మలను హతమార్చిన దుండగులు...పోలీసులను పక్కదారి పట్టించేందుకు మృతుల రక్తంతో ఆలయంలోని శివలింగంతో పాటు గుడి ప్రాంగణంలో ఉన్న పుట్ట మీద కూడా చల్లినట్లు తెలుస్తోంది. అయితే నిజంగా క్షుద్రపూజలు చేసేందుకు దుండగులు వచ్చి ఉంటే ఆలయంలోని విగ్రహాన్ని పెకలించేవారు. గుప్తని«ధుల కోసం తవ్వకాలు చేసేవారు. కానీ అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కన్పించలేదు. అందుకే పోలీసులు ఆర్థిక లావాదేవీల కోణంలోనే తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కటకటాల్లోకి పంపించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఇక్కడ పేకాట మామూలే!
అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో పోలీసుల మెతకవైఖరి సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఎస్పీ, కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. ప్రధానంగా పేకాట క్లబ్‌లపై మెరుపు దాడులు నిర్వహించి వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. దీంతో పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్లో జరుగుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్లబ్లో పేకాట జరగకుండా పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాక్షి, కదిరి(అనంతపురం) : పట్టణంలో సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగానే పెద్దల పేకాట అడ్డా ఉంది. కొన్నేళ్లుగా అక్కడ రిక్రియేషన్ ముసుగులో పేకాట జోరుగా సాగుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన రాజారెడ్డి ఆ పేకాట క్లబ్‌కు అధ్యక్షుడిగా ఉంటూ దాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, జిల్లా ఎస్పీ దానిపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు. పేరుకే రిక్రియేషన్ క్లబ్ కమ్యూనిటి రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) పేరుతో పట్టణ నడిబొడ్డున అది కూడా పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అక్కడ క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడుకోవడానికి గతంలో అనుమతి నిచ్చారు. కేవలం రిక్రియేషన్ మాత్రమే అక్కడ కన్పించాలి. అయితే అందులో ఎక్కడా ఇండోర్ గేమ్స్ కనిపించవు. కింద అంతస్తులోనే కాకుండా పై అంతస్తులో కూడా పేకాట ఆడేందుకు పలు టేబుళ్లు ఏర్పాటు చేశారు. పేకాట రాయుళ్లకు ఉక్కపోత ఉండకూడదని ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్లో ప్రతి ఆటకు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నారు. ఇది ఇక్కడున్న పోలీసు అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే. వారు దీన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పేకాట క్లబ్ వైపు పోలీసులు తొంగి చూసిన పాపాన పోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా అక్కడ ఎలాంటి మార్పు కనబడటం లేదు. ఇక్కడ కందికుంటదే హవా ‘2009 నుంచి ఇప్పటి దాకా ఏటా జనవరి 26న మా నాయకుడు, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాదే ఈ క్లబ్లో జాతీయ జెండా ఎగరేస్తున్నారు. 2014లో చాంద్‌బాషా ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ మాత్రం కందికుంటే ఎమ్మెల్యే. అందుకే మా నాయకుడు కందికుంటే ఇక్కడ జాతీయ జెండాను ఎగరేస్తున్నాడు. ఇక భవిష్యత్‌లో కూడా కందికుంటే ఎగరేస్తాడు. దమ్ముంటే క్లబ్‌ను టచ్ చేసి చూడండి’ అని ఈ క్లబ్లో ఉన్న కొందరు కందికుంట అనుచరులు సవాల్ విసురుతున్నారు. ఇక్కడ పేకాట జరుగుతున్న బహిరంగ రహస్యమని కూడా వారంటున్నారు. క్లబ్ ఫలితంగా ఎన్నో కుటుంబాలు నాశనం సీఆర్సీ క్లబ్లో పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి పట్టణానికి చెందిన రాజారెడ్డి, వెంకటేష్ అనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రామాంజులురెడ్డి అనే మరో ఎల్ఐసీ ఉద్యోగి పేకాటలో భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన భార్య అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఆ కుటుంబం హైదరాబాద్‌కు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. ఆ క్లబ్‌ను ఆనుకునే అమ్మాయిల హాస్టల్ కూడా ఉంది. క్లబ్‌లోని కొందరు సభ్యులు క్లబ్‌లోనే మద్యం సేవించి హాస్టల్ అమ్మాయిలనే వేధించడంతో పాటు హాస్టల్‌ల్లోకి రాళ్లు విసిరిన సంఘటనలు కూడా లేకపోలేదు. దీనిపై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. సభ్యుల మధ్య కూడా పలుమార్లు గొడవలు జరిగి స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. కేవలం కాలక్షేపం కోసం ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అనుమతిస్తే పేకాట రిక్రియేషన్ క్లబ్ కాస్తా పేకాట క్లబ్‌గా మార్చేశారని కొందరు క్లబ్ సభ్యులే వాపోతున్నారు. జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
కొండంత అండ! ‘ఘను’డవే!
అధికారం అండగా టీడీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారు. కొండలు.. గుట్టలు.. దేన్నీ వదల్లేదు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ టీడీపీ నేతకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుమారు రూ.2కోట్ల పెనాల్టీ విధించారు. ఈ వ్యక్తి పైసా చెల్లించకపోవడం చూస్తే ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థమవుతోంది. ఇకపోతే.. గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు(మే 18న) మూడు హెక్టార్లలో కొండను తవ్వుకునేందుకు గనుల శాఖ అధికారులు మళ్లీ అనుమతివ్వడం గమనార్హం. ఈ వ్యవహారంలో రూ.50లక్షల దాకా చేతులు మారినట్లు సమాచారం. సాక్షి, కదిరి: కదిరి పట్టణానికి చెందిన టీడీపీ నేత ఎం.శ్రీకాంత్‌రెడ్డి ఎస్వీ కన్ట్ర్సక్షన్స్ పేరుతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. తాను చేపట్టే పనులకు రోడ్డు మెటల్ కోసం గత ప్రభుత్వం ఈయనకు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.1505లో ఒక హెక్టారు(2.50 ఎకరాలు)లో అనుమతులు పొందాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు ఎక్కడ రోడ్డు పనులు జరిగినా ఆ పనులను ప్రభుత్వం ఈయనకే కట్టబెట్టింది. తనకు అనుమతులిచ్చిన ప్రాంతంలో మెటల్ కోసం కొండను పూర్తిగా తవ్వేశాడు. ఆ తర్వాత దక్కించుకున్న రోడ్డు పనులకు పెద్ద మొత్తంలో మెటల్ అవసరం రావడంతో ఆయన కన్ను ఆ పక్కనే ఉన్న కొండపై పడింది. హద్దులు చెరిపేసి సుమారు మరో రెండెకరాల వరకు కొండను ఆక్రమించి పూర్తిగా తవ్వేశాడు. విజిలెన్స్ దాడులతో వెలుగులోకి.. టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి అక్రమ మైనింగ్ విషయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి రావడంతో 2016లో తనిఖీలు చేసి అక్రమ మైనింగ్ నిజమేనని ధ్రువీకరించారు. ఆ మేరకు అప్పట్లో షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్లీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ మైనింగ్‌ను మరోసారి పరిశీలించి 1966 ఏపీఎంఎంసీ రూల్ 26(2) ప్రకారం ఆయనకు 2017 ఏప్రిల్ 25వ తేదీన రూ.1,76,96,800 పెనాల్టీ విధించారు. కానీ సదరు టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజిలెన్స్ అధికారులు విధించిన పెనాల్టీ సొమ్ములో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెనాల్టీ విధించిన తర్వాత ఇప్పటికీ.. అంటే పది నెలలుగా మైనింగ్ సాగుతూనే ఉంది. ఈ లెక్కన విజిలెన్స్ అధికారులు తిరిగి సర్వే చేస్తే దోపిడీ రూ.10కోట్లకు పైగానే తేలుతుందని అంచనా. కొండను తవ్వేసిన దృశ్యం మరో క్వారీకి అక్రమ అనుమతి ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు ఎగ్గొట్టిన టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి ఈ మధ్యే జిల్లా గనులశాఖ అధికారులు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.294లో 2.910 హెక్టార్లలో కొండను తవ్వుకోవడానికి అక్రమంగా అనుమతులిచ్చారు. అది కూడా గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు.. అంటే మే 18న గనులశాఖ అనుమతినివ్వడం గమనార్హం. వాస్తవంగా ఆ సర్వే నెంబర్లో రోడ్ మెటల్‌కు అనుమతులివ్వకూడదు. ఎందుకంటే కేవలం మినరల్ శాండ్ కోసం గత చంద్రబాబు ప్రభుత్వమే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ నిబంధనలకు తిలోదకాలివ్వడమే కాకుండా కోట్ల రూపాయల పెనాల్టీని ఎగ్గొట్టిన అదే వ్యక్తికి గనులశాఖ అధికారులు అనుమతులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇలాంటి వాటికి మైన్స్ అండ్ జియాలజీ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అనుమతివ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆయనకు బదులు గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి ఇవ్వడం కొసమెరుపు. అనుమతులు రద్దు చేస్తాం టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి కదిరి మండలం సైదాపురం పరిధిలో ఇచ్చిన గనుల లీజును తక్షణం రద్దు చేస్తాం. నేను కూడా రెండు నెలల క్రితమే కొత్త బాధ్యతలు తీసుకున్నా. శ్రీకాంత్‌రెడ్డి గతంలో అక్రమ మైనింగ్ విషయంలో ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు చెల్లించాలనే విషయం నా దృష్టికి రాలేదు. ఆయన కూడా చెప్పలేదు. విషయాన్ని పరిశీలించి కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ, అనంతపురం -
ముస్లింల సొమ్ము మింగేశారు!
సాక్షి, కదిరి: టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు కొందరికి పట్టణంలోని షాదీమహల్ కల్పతరువుగా మారింది. కమిటీ సభ్యుల పేరుతో అక్కడికి ప్రవేశించిన కందికుంట అనుచరులు ముస్లింలకు సంబంధించిన సుమారు రూ.1 కోటి దాకా ఈ ఐదేళ్లలో స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కమిటీ కాలపరిమితి పూర్తయినప్పటికీ వారే కొనసాగుతూ స్వాహా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. పేద ముస్లింలు ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు చేసుకోలేక పోతున్నారన్న ఉద్దేశంతో వైఎస్ సర్కారు పట్టణంలో వారి కోసం ఫంక్షన్ హాల్ నిర్మించింది. కరెంటు బిల్లుతో పాటు వాచ్మెన్ వేతనం కోసం కేవలం రూ.2 వేలు మాత్రమే వసూలు చేసి పెళ్లిళ్లు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అదికారంలోకి రాగానే స్థానిక టీడీపీ ఇన్చార్జ్ కందికుంట తన ముఖ్య అనుచరులకు షాదీమహల్ కమిటీలో చోటు కల్పించారు. దీన్ని అవకాశంగా భావించి కమిటీ సభ్యులు అక్కడే సంపాదనను మొదలెట్టారు. పెళ్ళిళ్ల వివరాలను రికార్డుల్లో నమోదు చేయకుండా కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తూ ఒక్కో పెళ్లికి డిమాండ్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేలు దాకా వసూలు చేస్తున్నారు. ఆశ్చర్యం కల్గించే విషయమేమంటే ఈ ఏడాది ఆఖరు వరకు అక్కడ పెళ్లిళ్లు చేసుకోవడానికి తేదీలు ఖాళీగా లేవని కమిటీ సభ్యులు చెబుతున్నారంటే అక్కడ ఏ విధంగా అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదేళ్లలో అక్కడ సరాసరిన నెలకు సగం రోజులకు పైగానే పెళ్లిళ్లు జరిగాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అయితే అవేవీ రికార్డుల్లో కనబరచలేదు. నిబంధనలకు తూట్లు షాదీమహల్‌లో పెళ్లి చేయాలంటే కమిటీ సభ్యులను కలిసి షాదీమహల్ బుక్ చేసుకోవడానికి బ్యాంకులో చలానా చెల్లించాలి. ఆ చలానాకు సంబంధించిన ఒరిజినల్ కాపీ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ఆ కమిటీ పంపి, జిరాక్స్ కాపీని షాదీమహల్లోని కార్యాలయంలో భద్రపరచాలి. ఇలా చేయకుండా కేవలం ఏడాదికి ఆరేడు పెళ్లిళ్లు మాత్రమే జరిగినట్లు కమిటీ సభ్యులు తమ వద్దనున్న పుస్తకంలో కనబరుస్తున్నారు. అక్కడ వంట సామగ్రితో పాటు డెకరేషన్ ఇలా ప్రతి దాంట్లోనూ వారికి కమీషన్ ఇవ్వాలని ముస్లిం పెద్దలు కొందరు చెబుతున్నారు. గతంలో దాతలు ఇచ్చిన వస్తులన్నింటినీ ఆ కమిటీ మాయం చేసిందని కూడా పేర్కొంటున్నారు. క్యారియర్ బ్యాచ్ షాదీమహల్ కమిటీ సభ్యులు క్యారియర్ బ్యాచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీరు కందికుంటకు అనుచరులుగా ఉంటూ ఆయన తరఫున గొడవలకు దిగుతుంటారు. షాదీమహల్‌లో ఎవరు పెళ్లి జరిపించినా కమిటీ సభ్యులు ఈ బ్యాచ్‌కు విందు భోజనాలు అక్కడి నుంచే పంపుతుంటారు. అందుకే వీరిని పట్టణంలో క్యారియర బ్యాచ్‌గా పిలుస్తుంటారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌ల వద్ద బ్యాచ్ హడావుడి అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉన్న కొందరు అధికారులకు సైతం షాదీమహల్ నుంచే క్యారియర్ పంపుతుంటారని తెలిసింది. చర్యలు తీసుకుంటాం మైనార్టీ షాదీమహల్ కాలపరిమితి మూడేళ్ల క్రితమే ముగిసింది. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్లు దానిపై దృష్టి సారించినట్లు లేరు. అక్కడున్న కమిటీ పెళ్లిళ్లను రికార్డుల్లో నమోదు చేయలేదని నా దృష్టికి కూడా వచ్చింది. పరిశీలించి అవినీతి సొమ్మును కక్కిస్తాం. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ కమిటీని రద్దు చేసి షాదీమహల్‌ను రెవెన్యూ స్వాధీనంలోకి తీసుకుంటాం. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. –ఎస్.మహమ్మద్ ఖాసీం, తహసీల్దార్, కదిరి