
సాక్షి, అనంతపురం : కదిరిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కదిరి-అనంతపురం మార్గంలో భారత్ ఐటీఐ కాలేజీ సమీపంలో నారాయణస్వామి నాయక్(45)ను గర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కాలేజీ సమీపంలో కారును రిపేరు చేయించుకుంటున్న సమయంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు, వేట కొడవళ్లతో నారాయణ స్వామిని దారుణంగా నరికి చంపారు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. హత్య చేసి పారిపోయే ప్రయత్నంలో సంఘటనాస్థలంలో ఓ బైక్‌ను దుండగులు వదిలిపెట్టినట్లు తెలిసింది. నారాయణస్వామి స్వగ్రామం కదిరి మండలం కుటాగుల. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.