
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాలోని కదిరిలో ఓ మహిళా ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా చేస్తున్న వెంకటపతి.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హోలీ సందర్భంగా అమ్మాయిలను ఎత్తుకుని బురదలో పడేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హోలీ పండుగ పేరుతో అమ్మాయిలతో ఇలా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. ఎంత హోలీ అయితే మాత్రం విద్యార్థినులతో ఆ రకంగా ప్రవర్తించడం కచ్చితంగా మంచి ఆలోచన ధోరణి కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మాయిలను తాకుతూ ఇలా బురదలో పడేయడం కలకలంగా మారింది. ప్రిన్సిపాల్ ప‍్రవర్తనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
