girl student
-
తల్లి సెల్‌ఫోన్ ఇవ్వలేదని కూతురు..
కౌటాల(సిర్పూర్): తల్లి తనకు సెల్‌ఫోన్ ఇవ్వలేదని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై మధుకర్ కథనం ప్రకా రం.. కౌటాలలోని ప్రగతి కాల నీకి చెందిన బొమ్మకంటి సదానందం, రమాదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె స్ఫూర్తి (16) ఉన్నారు. స్ఫూర్తి స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. శనివారం మధ్యాహ్నం కాగజ్‌నగర్ నవోదయలో నిర్వహించిన ఇంటర్ ప్రవేశ పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తండ్రి సదానందం స్ఫూర్తిని ఇంటివద్ద దించి బయ టకు వెళ్లాడు. కాగా, పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను చూసుకోవడానికి సెల్‌ఫోన్ ఇవ్వాలని స్ఫూర్తి తన తల్లి రమాదేవిని కోరింది. అయితే సెల్‌ఫోన్ ఇస్తే గేమ్స్ ఆడి సమయం వృథా చేస్తావని, మెటీరియల్‌ను జిరాక్స్ తీసుకు వస్తానని ఆమె తెలిపింది. కాసేపటి తర్వాత తల్లి జిరాక్స్ సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి తనకు సెల్‌ఫోన్ ఇవ్వ లేదని మనస్తాపం చెందిన స్ఫూర్తి.. ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జిరాక్స్ పత్రాలతో ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తె ఉరి వేసుకుని ఉండడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన అతను కుమార్తెను కిందకు దింపి కౌటాల పీహెచ్‌సీకి తరలించాడు. వైద్యులు పరీక్షించి సిర్పూర్(టీ) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి బాలికను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్ఫూర్తి మృతదేహాన్ని ఎస్సై మధుకర్ పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు.. ఏం చేయాలో తెలియక
కౌడిపల్లి(నర్సాపూర్): కూలి పనులు చేస్తేనే కూడు దొరకని కుటుంబం.. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అయితేనేం ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు చదువులో మేటిగా ఉన్నారు. ఇప్పుడా దంపతుల రెండో కుమార్తెకు ఎంబీబీఎస్ సీటొచ్చినా.. డబ్బుల్లేక కూలి పనులకు వెళ్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.పెద్ద కొడుకు విజయ్‌కుమార్ కాకినాడలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం.. పెద్దకూతురు అనిత సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు రాహుల్ ఖమ్మం ఎస్టీ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కూతురు కాట్రోత్ సుమలత సిద్దిపేటలోని సురభి ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. కానీ ప్రైవేట్ కళాశాల కావడంతో ఏటా సుమారు రూ 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న పొలం తాకట్టుపెట్టి రూ.లక్షన్నర చెల్లించింది. ఇంకా హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు రూ.లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక సుమలత ఆవేదన చెందుతోంది. పెద్ద మనుసున్న దాతలు 77801 06423 ఫోన్ నంబర్‌కు తోచిన సాయం చేయాలని కోరుతోంది.మెడికల్ సీటు సాధించిన పేద విద్యార్థినికి పొన్నం భరోసా హుస్నాబాద్ రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన పేద విద్యార్థిని లావుడ్య దేవి ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తోంది. దీనిపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘డాక్టర్ చదువుకు డబ్బుల్లేక కూలి పనులకు..’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన విద్యార్థి కుటుంబం గురించి స్థానిక నాయకులతో అరా తీశారు. మంగళవారం హుస్నాబాద్‌కు వచ్చిన మంత్రి.. గిరిజన విద్యార్థిని అభినందించారు. ఆమె కాలేజీ ఫీజుకు ఆర్థిక సాయంతో చేయడంతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాదికి కూడా కాలేజీ ఫీజుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. జెన్కో ఇంజనీర్లకు పోస్టింగ్‌లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో భారీ సంఖ్యలో ఈ నెల 9న అడ్హాక్ (తాత్కాలిక) పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు ఎట్టకేలకు కొత్త పోస్టింగ్స్ కేటాయిస్తూ సోమవారం సంస్థ సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లోని 203 మంది ఏడీఈలు, ఎలక్ట్రికల్ విభాగంలో 34 మంది డీఈలు, ఏడుగురు ఎస్ఈలు, ఇద్దరు సీఈలతో పాటు మెకానికల్ విభాగంలో 12 మంది డీఈలు, ఎస్ఈలు.. సివిల్ విభాగంలో ఐదుగురు ఏఈఈలుగా, ఇద్దరు ఈఈలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు. చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త -
గండం గడిచింది అనుకునే లోపే.. అక్కడున్నవారందరికీ షాకిచ్చింది!
క్షణికావేశంలోనో, జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్‌లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.వివరాలను పరిశీలిస్తే బిహార్‌లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర పట్టాలపై పడుకుంది. ఇది గమనించిన రైలు డ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. (ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు) A girl reached Motihari's Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl's life by applying emergency brakes, Bihar pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024 కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది. కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా? లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. -
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థులు
జైపూర్: తోటి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె మంచినీళ్ల బాటిల్లో మూత్రం పోశారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లా లుహారియా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక స్కూలులో చదువుకుంటోంది. శుక్రవారం కొందరు విద్యార్థులు ఆమె మంచి నీళ్ల బాటిల్లో మూత్రం కలిపారు. ఇది తెలియని బాలిక ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రాగా ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల బ్యాగులో ప్రేమ లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. స్పందించకపోవడంతో కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తహశీల్దారు, పోలీసులకు కూడా వారు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానితుల ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు. -
స్నేహానికి సిసలైన చిరునామా.. సలాం చేయాల్సిందే మనమంతా!
కల్మషం లేనిది.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచేది.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెన్నంటే ఉండేది.. ఆనందంలోనూ ఆత్మీయత పంచేది.. జీవిత చరమాంకందాకా తోడుగా నిలిచేది.. స్నేహం ఒక్కటే..! ఒక్కసారి చిగురిస్తే ఆజన్మాంతం గుర్తుండిపోతుంది. పరిస్థితులు ఏవైనా నేనున్నాననే ధైర్యం ఇస్తుంది. తప్పుచేస్తే దండిస్తుంది.. కష్టమొస్తే కుంగిపోతుంది.. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలంలో వెలుగుచూసింది. విధి ఆడిన వింతనాటకంలో రెండుకాళ్లు చచ్చుబడి లేవలేని స్థితిలో ఉన్న తోటి విద్యార్థినికి స్నేహితులే అండగా ఉంటూ అక్షరాల వైపు నడిపిస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని బడికి నిత్యం వీల్ చైర్‌పై తీసుకెళ్తూ.. పాఠశాలలో సపర్యలు చేస్తూ.. వైకల్యాన్ని జయించేలా చేస్తున్నారు. చదువుల తల్లికి తోడుగా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వారి ఆదర్శానికి అధికారులు సైతం సలాం చేస్తున్నారు. అసలు ఆ కథేంటో.. ఆ స్నేహితుల విలువేంటో మీరే చదవండి.. కేవీబీపురం(తిరుపతి జిల్లా): విధి విసిరిన బాణానికి రెండుకాళ్లు చచ్చుబడినా కుంగిపోలేదు. మనోధైర్యంతో గుండె నిబ్బరం చేసుకుంది. ఒంట్లో సత్తువ లేకపోయినా తోటి స్నేహితుల సాయంతో బడిబాట పట్టింది. చదువుల్లో రాణిస్తూ లక్ష్యం వైపు దూసుకుపోతోంది.. కేవీబీపురం మండలానికి చెందిన జూయిస్. నాలుగేళ్ల పాటు బడికి దూరమైనా స్నేహితురాళ్ల సాయంతో మళ్లీ పెన్ను, పుస్తకం పట్టింది. ప్రభుత్వ సాయంతోపాటు స్నేహితుల సహకారంతో ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన వెట్టి. ఇజ్రాయిల్, కన్నెమ్మ దంపతులకు దావిద్, జూయిస్ సంతానం. ఇజ్రాయిల్ నగిరి పోస్ట్ ఆఫీస్‌లో చిరు ఉద్యోగి. కన్నెమ్మ రోజువారి కూలీ. కుమార్తె జాయిస్ (14) 2012లో బంధువుల ఇంట్లో ఆడుకుంటూ టైల్స్‌పై జారిపడింది. అప్పట్లో కాలు విరిగినట్లు ధ్రువీకరించి వైద్యులు కట్టుకట్టి పంపించేశారు. క్రమేణా చిన్నారి కాళ్లు చచ్చు బడుతూ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఉన్న రెండెకరాల పొలంతో పాటు సొంత్త ఇంటినీ తెగనమ్మి బిడ్డకు మూడు ఆపరేషన్లు చేయించారు. కానీ ఫలితం లేదు. చిన్నారి రెండు కాళ్ల చచ్చుబడ్డాయి. నడవలేని స్థితికి చేరింది. 3వ తరగతి నుంచి ఇంటి వద్దే ఉండిపోయింది. పాఠశాలకు వెళ్లివచ్చే స్నేహితులకు టాటా చెబుతూ సంబరపడేది. రెండేళ్ల క్రితం వారితోపాటు బడికి వెళ్లాలని నిశ్చయించుకుంది. వీల్‌చైర్ కొనిస్తే అన్నతో కలిసి బడికి పోతానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వీల్ చైర్ కొనిచ్చారు. దీనికితోడు అమ్మఒడి, పింఛన్ పథకాలు మంజూరు కావడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని రాగిగుంట ఉన్నత పాఠశాలకు తోటి స్నేహితులతో పంపడానికి సమ్మతించారు. ఉపాధ్యాయుల ఉదారత జాయిస్ మూడో తరగతిలోనే బడికి దూరమైంది. కాళ్లు రెండూ చచ్చుబడడంతో ఇక బడికి వెళ్లలేనని భావించింది. కానీ చదువుపై ఆ విద్యార్థినికి ఉన్న మక్కువను చూసి ఉపాధ్యాయులే హాజరు వేసి.. హోంవర్క్‌లు ఇచ్చి పై తరగతులకు ప్రమోట్ చేశారు. అలా మూడేళ్లు అంటే ఆరో తరగతి వరకు నెట్టుకొచ్చారు. ఆ తర్వాత బాలికే స్వయంగా బడికిరావడంతో సంబరపడ్డారు. చిట్టి నేస్తాలు.. పెద్ద సాయం జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకున్న తన స్నేహితురాళ్లు శ్రుతి, మానస, మౌనిక, లావణ్య, భూమిక ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు, పక్క గ్రామంలో ఉన్న ట్యూషన్‌కు నిత్యం తీసుకెళ్లడం.. తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలిపెట్టడం బాధ్యతగా తీసుకున్నారు. గ్రామస్తులు, తోటి విద్యార్థినీ, విద్యార్థులు కూడా పాఠశాలలో సపర్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఎలాంటి బిడియం లేకుండా కాలకృత్యాలకు తీసుకెళ్లడం.. మళ్లీ తీసుకొచ్చి క్లాసురూమ్‌లో కూర్చోబెట్టడం లాంటివి చేస్తుండడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. డాక్టర్ అవుతా మా అమ్మానాన్నా, అన్నయ్య ఎంతో కష్టపడి నన్ను కాపాడారు. కంటికిరెప్పలా పెంచారు. ఇప్పటికే మా పరిస్థితి దారుణంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వలేక.. సరైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నాకు కృత్రిమ కాళ్లతో పాటు, ప్రభుత్వం, దాతలు మరింత సాయం అందిస్తే బాగా చదువుకుంటా. డాక్టర్ని అయ్యి ప్రతి ఒక్కరికీ నా వంతు సహకారం అందిస్తా. – జాయిస్ , విద్యార్థిని తనకోసం తరగతి గదినే కిందకు మార్చాం జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకుని తొమ్మిదో తరగతి గదిని మిద్దెమీద లేకుండా కిందకు మార్చాం. చదువులో చురుగ్గా ఉంటోంది. కేవీబీపురం దివ్యాంగుల పాఠశాల నుంచి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరాం. జాయిస్ పరిస్థితి తెలుసుకుని తోటి విద్యార్థులే బాధ్యత తీసుకుని అన్నీ చేస్తుండడం గొప్ప విషయం. – నారాయణమ్మ, రాగిగుంఠ ఉన్నత పాఠశాల, హెచ్ఎం స్నేహితులే అక్కున చేర్చుకున్నారు జాయిస్ మూడో తరగతి చదువుతున్నపుడు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి మూడేళ్లు బడికి దూరమైంది. తిరిగి రెండేళ్లుగా తన స్నేహితుల సాయంతో బడికి వెళ్తోంది. స్నేహితురాళ్లే బడికి తీసుకెళ్లి, మళ్లీ ఇంటికి తీసుకొస్తున్నారు. తన అవసరాలు కూడా వాళ్లే తీరుస్తున్నారు. వారి పెద్ద మనసుకు దండం పెట్టాలనిపిస్తుంది. – కన్నెమ్మ, (జాయిస్) తల్లి ఏమాత్రం కష్టం అనిపించదు జాయిస్ పరిస్థితి మాకు తెలుసు. అందుకే తనని మా కాళ్లతో నడిపిస్తున్నాం. బడికి, ట్యూషన్‌కి మేమే తీసుకెళ్తాం. అందరం కలిసే భోంచేస్తాం. మా స్నేహితురాలిని మేమే చూసుకుంటాం. తనకి సేవ చేస్తుంటే ఏమాత్రం కష్టం అనిపించదు. జాయిస్ బాగా చదువుతుంది. చదువుల్లో రాణిస్తుంది. మాకు మంచి సలహాలు ఇస్తుంది. – చందు, (జాయిస్) స్నేహితురాలు మనోధైర్యానికి సలాం ఆ వయసు చిన్నారులు పరిస్థితులను అంత సులువుగా అర్థం చేసుకోలేరు. అయితే జాయిస్ మాత్రం తనంతటతానే మనోధైర్యాన్ని నింపుకుని మళ్లీ అక్షరాలకు చేరువైంది. చదువుపై ఎంతో మమకారం ఉన్న జాయిస్‌ను మరింత ప్రోత్సహిస్తాం. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపడుతాం. – లక్ష్మీపతి, ఎంఈఓ కేవీబీపురం -
కీచక ఉపాధ్యాయుడు.. ప్రత్యేక తరగతులని చెప్పి విద్యార్థినిని..
సాక్షి, హుస్నాబాద్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన ఏనుగు రవి ఈనెల 20న బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక తరగతులు ఉన్నాయని, కాలేజీకి రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన సోదరుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వచ్చింది. ఆదివారం కావడం, కళాశాల మూసి ఉండడంతో వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది. తాను నర్మెట్ట నుంచి వస్తున్నాని, లద్నూరు వరకు రావాలని విద్యార్థినికి సూచించాడు. యువతి తన సోదరుడితో కలిసి లద్నూరుకు వెళ్లింది. ఉపాధ్యాయుడు చెప్పిన చోటుకు నడుచుకుంటూ వెళ్లగా, అతడు తన బైక్‌పై ఎక్కించుకొని లద్నూరు రిజర్వాయర్ పైకి తీసుకువెళ్లాడు. గమనించిన యువతి సోదరుడు మరికొంత మందితో కలిసి ఉపాధ్యాయుడిని వెంబడించి పట్టుకున్నారు. ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థిని ఎక్కడి తీసుకువెళుతున్నావని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి సోదరుడు, మరికొంత మంది కలిసి ఉపాధ్యాయుడు రవికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై ఎస్ఐ నారాయణను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
స్కూల్ కరస్పాండెంట్ పాడుపని.. బాలికకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి..
కాకినాడ సిటీ: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో హెల్పింగ్ హ్యాండ్స్ పాఠశాల కరస్పాండెంట్ అరవై ఏళ్ల విజయకుమార్‌ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సుంకర మురళీమోహన్ వివరించారు. ఆదివారం స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్కూల్ కరస్పాండెంట్ విజయకుమార్ అదే స్కూల్ వసతి గృహంలో ఉండే 9వ తరగతి విద్యార్థిని (14)కి మత్తు టాబ్లెట్లు ఇచ్చి నాలుగు నెలలుగా పలుమార్లు లైంగిక దాడి చేశాడు. చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి.. ఆ బాలిక గర్భం దాల్చింది. వేసవి సెలవులు కావడంతో గొడారిగుంటలోని తన ఇంటికి ఆమె వెళ్లింది. రెండు రోజులుగా బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె తల్లికి విషయం చెప్పింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు విజయకుమార్‌ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. ఇదే స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారని, స్కూల్‌కు సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతుందని వివరించారు. -
బాలికతో పరీక్ష రాయించిన ‘దిశ’
రామాపురం: పదో తరగతి పరీక్షలు రాయనీయకుండా నిర్బంధించిన తండ్రిపై ఓ బాలిక దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను పరీక్ష కేంద్రంలో హాజరుపర్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కల్పనాయునిచెరువు పంచాయతీ మూగిరెడ్డిగారిపల్లెకు చెందిన బాలిక నీలకంట్రావుపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది. మూడు పరీక్షలు రాశాక.. పరీక్షలకు వెళ్లొద్దంటూ తండ్రి సోమవారం ఇంట్లో నిర్బంధించాడు. దీంతో ఆ బాలిక దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్ వచ్చి బాలికతో పరీక్ష రాయించారు. -
పాఠశాలలో సెల్‌ఫోన్ లొల్లి.. విద్యార్థినిపై నింద.. చివరికి!
సాక్షి, వికారాబాద్: పాఠశాలలో సెల్‌ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు ఉపాధ్యాయులు యథేచ్ఛగా వినియోగిస్తుండగా విద్యార్థులు సైతం బడికి తీసుకొస్తున్నారు. సెల్‌ఫోన్ తెచ్చిన వివాదంతో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. బాలిక ఫోన్ ఆపహరించిందని ఉపాధ్యాయులు నిందించడంతో మనోవేదనకు గురై అదృశ్యమైంది. ఆమె ఇల్లు విడిచి వెళ్లి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జాడ లేకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలి తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో నివాసం ఉంటున్న రమేష్ కూతురు సాయిపూర్ ప్రాంతంలోని నెంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలలో సెల్‌ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులు సైతం కొంతకాలంగా సెల్ఫోన్లు బడికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో గత నెల 25న ప్రభుత్వ నెంబర్– 1 పాఠశాలలో ఓ విద్యార్థి సెల్‌ఫోన్ తీసుకొచ్చింది. అది పోయింది. ఈ విషయమై బాలిక ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయులు 9వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో విచారించారు. ఫోన్ ఎవరు తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు గాలించగా సెల్‌ఫోన్ బాత్రూంలో లభించింది. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌ను ఓ బాలిక దొంగిలించిందని ఆమెపై చోరీ నింద వేశారు. విద్యార్థుల ఎదుటే ఆమెకు చివాట్లు పెట్టారు. అనంతరం సదరు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చోరీ విషయం చెప్పారు. అనంతరం ఇంటికెళ్లిన బాలికను తల్లిదండ్రులు దండించారు. తాను దొంగతనం చేయలేదని బాలిక చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం రెండు రోజుల పాటు కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు.. ప్రభుత్వ నంబర్– 1 పాఠశాలలో జరిగిన సెల్‌ఫోన్ చోరీ వివాదం బాలిక కనిపించకుండా పోయేందుకు కారణమైంది. బాలిక తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ బాలిక మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించాలని పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. బాలిక ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకుందా.. లేదా ఇతర ప్రాంతాలకు రైలులో ఏమైనా వెళ్లిందా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
Tamil Nadu: విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న వారంరోజులకు టీచర్ మృతి.. అసలేంజరిగింది?
లైంగిక వేధింపుల కారణంగా ఓ ఇంటర్ విద్యార్థిని వారం క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఐతే సూసైడ్ నోట్లో అందుకు కారణమైన వారి పేరును బాలిక ప్రస్తావించలేదు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అదే స్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు ఉరేసుని ఆహ్మహత్యకు పాల్పడ్డాడు. ఈ జంట మరణాలు స్థానికంగా కలకలం రేపాయి. అసలేంజరిగిందంటే.. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని లైంగిక వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు తెలుపుతూ సూసైడ్ నోట్‌రాసి గతవారం ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా తన సూసైడ్ నోట్లో ‘లైంగిక వేధింపుల కారణంగా కరూర్‌లో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పడానికి భయపడుతున్నాను. . నేను ఈ భూమిపై చాలా కాలం జీవించాలని, ఇతరులకు సహాయం చేయాలని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంద’ని తెల్పింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణలో భాగంగా విద్యార్ధిని చదివే పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రశ్నించారు. అందులో భాగంగా ఐతే అదే స్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శరవణన్ (42)ను కూడా ప్రశ్నించారు. మ్యాథ్స్ టీచర్‌పై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసు అధికారులు నిర్ధారించారు. చదవండి: మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! ఐతే ఈ సంఘటన చోటుచేసుకున్న వారం రోజుల తర్వాత గణిత ఉపాధ్యాయుడు శరవణన్ తన సూసైడ్ నోట్లో బాలిక మరణంపై విద్యార్థులు తనను ఆటపట్టించడంతో ఇబ్బందిపడ్డానని, బాలిక తన నోట్లో ఎవరి పేరు చెప్పనప్పటికీ అతనిపై అనుమానాలు తలెత్తాయని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ సంఘనపై ఒక పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుడి మరణం వెనుక ఉన్న కారణం మాకు ఖచ్చితంగా తెలియరాలేదు. సమగ్ర విచారణ తర్వాత కారణాలు తెలియజేస్తామని అన్నారు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
ఎంపీపీ పీఠంపై వలంటీర్.. వైస్ ఎంపీపీగా విద్యార్థిని
పశ్చిమగోదావరి: వలంటీర్లు కొందరు సర్పంచ్‌లయ్యారు.. మరికొందరు ఎంపీటీసీ సభ్యులయ్యారు. కానీ వలంటీర్‌గా సేవలందిస్తున్న ఓ గిరిజన మహిళ అతి చిన్న వయసులోనే ఎంపీపీగా ఎన్నికైంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడేనికి చెందిన 24 ఏళ్ల కారం శాంతి ఇంటర్ వరకూ చదువుకున్నారు. గృహిణిగా ఉన్న శాంతి ఆ తర్వాత వలంటీర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆమెను దొరమామిడి–2 ఎంపీటీసీ అభ్యరి్థగా నిలబటెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాల్లో 2 ఏకగ్రీవం కాగా, రెండింటిలో ఇది ఒకటి. మిగిలిన 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కారం శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. – బుట్టాయగూడెం అతి చిన్న వయసులో ఓ యువతి మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో.. ఇంకా విద్యార్థినిగా ఉండగానే ఆమె ఎన్నికవడం విశేషం. మండలంలోని బొమ్మిడి గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన మేడవరపు విద్యాలక్ష్మి వయసు 22 ఏళ్లు. విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ సైన్సెస్ కళాశాలలో ఫార్మా–డి కోర్సు ఐదో సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లి మేడవరపు సుష్మ బొమ్మిడి మాజీ సర్పంచ్. తండ్రి కిరణ్ వైఎస్సార్సీపీ నేత. – ఉంగుటూరు చదవండి: ఆ సామాజికవర్గంలో ఆమె మొట్టమొదటి ఎంపీపీ -
విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద హాస్పిటల్ తరలింపుకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. యునానీ వారే కావాలని హాస్పిటల్‌ను అక్కడి నుంచి ఎర్రగడ్డకు తరలిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా చార్మినార్ ఎదుట విద్యార్థులు, టీచర్లు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను, లెక్చరర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు మాత్రం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెచ్చిపోయిన మానవమృగం.. ధర్నా చేస్తున్న విద్యార్థినిలను మహిళ పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట తాకడమే కాకుండా.. గట్టిగా గిల్లాడు. దీంతో సదురు విద్యార్థిని నొప్పి భరించలేక గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని ఓ పోలీసు కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
అదరగొడుతున్న చిన్నారి రిపోర్టర్
చండీగఢ్: మీడియా రంగంలో రిపోర్టింగ్‌కు ఉండే క్రేజే వేరు. ఈ ఫీల్డులోకి అడుగుపెట్టాలని భావించే వారి ప్రథమ ప్రధాన్యం రిపోర్టింగే. అయితే అనుకున్నంత సులువు కాదు రిపోర్టింగ్. ఏళ్లుగా అనుభవం ఉన్నవారు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ చిన్నారి ఏమాత్రం తడబాటు లేకుండా.. సమస్యల గురించి రిపోర్ట్ చేస్తోన్న పద్దతికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వివరాలు.. గత కొద్ది రోజులుగా హరియాణలో కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మ్యాన్‌హోల్స్ సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయి.. చిన్న సైజు తటకాలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కురుక్షేత్రకు చెందిన ఓ చిన్నారి ఈ సమస్య గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. తన ఇంటి చుట్టపక్కల వర్షపు నీరు నిలిచి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. నీరు నిలిచిపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అన్నది. ఈ నీరు ఇళ్లలోకి ప్రవేశించకుండా ఉండటానికి కొందరు ఇంటి ముందు సిమెంట్ బస్తాలతో అడ్డు కట్టలు వేస్తున్నారన్నది. వెంటనే ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది. దీన్నంతా వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. చిన్నారి ఏమాత్రం తడబాటు లేకుండా సమస్య గురించి రిపోర్ట్ చేయడంతో నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. In Haryana school girl from #Kurukshetra is reporting live during rainfall from her neighbourhood about the water logging problem. I hope her voice will reach to the authorities @cmohry @mlkhattar .No doubt she has outsmarted all TV journalists in her stint ! pic.twitter.com/5QE82hjkQU — Chiguru Prashanth (@prashantchiguru) July 20, 2019 -
గురుకులం విద్యార్థిని పరార్
సాక్షి, ధర్మపురి: మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి ఓ విద్యార్థిని పరారైన సంఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురి మండలం మగ్గిడిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఇటీవల ధర్మపురి పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ స్తంభంకాడి మోహన్ పర్యవేక్షణలో సుమారు 260కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ధర్మపురికి చెందిన అశ్వియా సోహాన్ అనే 7వ తరగతి విద్యార్థిని పాఠశాల వెనుక గేట్ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. రాత్రిపూట కూతురు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు హాసియా, అలీపాషాతో పాటు మాజీ వైస్ ఎంపీపీ అయ్యోరి రాజేశ్, ముస్లీం నాయకులు ప్రిన్సిపాల్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా పాఠశాల నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించకపోవడం ఏంటని సిబ్బంది తీరుపై ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఇటీవల ఇక్కడ చదివే ఇద్దరు విద్యార్థినులు ఇదే విధంగా పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లగా ఆ విషయాన్ని కప్పిపుచ్చారంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో శాంతించారు. -
11 ఏళ్ల విద్యార్థినిపై దారుణం
పాట్నా : ఐదో తరగతి విద్యార్థినిపై అరాచకానికి పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని, అతనికి సహకరించిన గుమస్తాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. పాట్నాకు చెందిన పదకొండేళ్ల చిన్నారి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోక ఆ దృశ్యాలను వీడియో తీసి ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బయటపెడతాను.. చంపేస్తాను అని బెదిరించాడు. ఇలా నెల రోజుల పాటు ఈ దారుణం కొనసాగింది. ఈ క్రమంలో సదరు బాలిక కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారిని గర్భవతిగా నిర్ధారించారు. విస్తుపోయిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారించగా సదరు ప్రిన్సిపాల్ హోం వర్క్ చెక్ చేసే నేపంతో బాలికను తన గదికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఇందుకు పాఠశాలలో పనిచేస్తోన్న కర్ల్క్ సాయం చేసేవాడని తేలింది. అంతేకాక ప్రిన్సిపాల్ ఫోన్లో బాలికకు సంబధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో పోలీసులు ప్రధానోపాధ్యాయున్ని, క్లర్క్‌ని అదుపులోకి తీసుకుని, స్కూల్‌ని సీజ్ చేశారు. కేవలం 1 - 5 వరకే ఉన్న ఈ పాఠశాలలో 90 మంది విద్యార్ధులు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు
-
హాస్టల్లోనే ఎన్నోసార్లు నాపై దారుణం!
సాక్షి, కాన్పూర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కల్యాన్పూర్ సీఐ నవీన్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐఐటీ కాన్పూర్ విద్యార్థినికి ఐఏఎఫ్ అధికారి సితాన్షుతో సోషల్ మీడియాలో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అతడు తరచుగా గర్ల్స్ క్యాంపస్‌కు వచ్చేవాడు. పరిచయంతో లొంగదీసుకున్న అధికారి పెళ్లి చేసుకుంటానని విద్యార్థినిని నమ్మించాడు. కొన్నిసార్లు హాస్టల్లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలిపారు. బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన సితాన్షు తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడని బాధితురాలు చెబుతోంది. ఆపై పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఆ విద్యార్థిని వాపోయింది. నిందితుడితో పాటు అతడి సోదరి, బామ్మర్ది, ఓ స్నేహితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
అసభ్య ప్రవర్తన.. పీఈటీకి దేహశుద్ధి
కరీంనగర్: అభం శుభం తెలియని చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీకి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నగరంలోని శ్రీకృష్ణానగర్‌లో గురువారం వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానికంగా ఉన్న శ్రీసాయి హై స్కూల్లో మూడో తరగతి చదువుతున్న చిన్నారితో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గోపి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని బాధితురాలి తల్లదండ్రులు చేసిన ఫిర్యాదును పాఠశాల యాజమాన్యం పెడచెవిన పెట్టింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధవులు గురువారం పాఠశాలకు వచ్చి పీఈటీ గోపికి దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. -
పాస్ చేయండి సార్.. పెళ్లికి రెడీగా ఉన్నాను!
లక్నో: గతేడాది తరహాలో పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవడంతో ఓ విద్యార్థిని వినూత్నంగా తనను పాస్ చేయాలని కోరింది. యూపీ బోర్డు ఎగ్జామ్స్ కు హాజరైన ఓ విద్యార్థిని తన ఆన్సర్ షీటులో పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ‘ సార్.. నేను ఓ అమ్మాయిని. వచ్చే జూన్ 28న నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండి. నేను ఫెయిల్ అయితే మా ఫ్యామిలీ చాలా బాధ పడుతుంది. నా పరిస్థితి అర్థం చేసుకోండి’ అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్స్ లో ఓ విద్యార్థిని రాసుకొచ్చింది. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్న సమయంలో పరీక్షలో ఫెయిల్ అయితే చిన్నచూపుగా ఉంటుందని చెబితే పాస్ చేస్తారని తన తెలివితేటలు చూపించింది. చదవకున్నా ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ బోర్డుకు ప్రతి ఏడాది ఇలాంటి సమాధాన పత్రాలు వేలాదిగా వస్తుంటాయని పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులైతే నేరుగా 50, 100, 500 నోట్లను ఆన్సర్ షీటుకు జతచేసి లంచం ఇవ్వజూపే వారని చెప్పారు. అయితే గతేడాది తరహా పరిస్థితి ఇప్పుడు లేదని, చదువుకుంటూనే పాస్ అవుతారని, లంచం ఇవ్వచూపాలని చూసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓ ఉన్నతాధికారి విద్యార్థులకు సూచించారు. వీరిని పాస్ చేసినా ఏ సబ్జెక్ట్ లేని కారణంగా ఉద్యోగాల వేటలోనూ వెనుకంజలో ఉండాల్సి వస్తుందన్నారు. -
కీచకుడిపై అపరకాళికలా మారిపోయి!
-
కీచకుడిపై అపరకాళికలా మారిపోయి!
భువనేశ్వర్: తనను వేధిస్తున్న కీచకుడికి చేతలతో సమాధానం చెప్పింది.. అందరితో శెభాష్ అనిపించుకుంది ఒడిషా జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని. అంతటితో ఆగకుండా తనపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిని చితకబాదడంతో పాటు వీడియో తీసింది. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి తనపై వేధింపులు మొదలుపెట్టి, కొద్ది సమయం తర్వాత తనపై లైంగిక దాడికి యత్నించాడని విద్యార్థిని చెప్పింది. ప్రతిరోజు తన ఫ్రెండ్స్‌ను ఇలాగే వేధిస్తుంటారని అందుకే అతడికి బుద్ధి చెప్పాలని భావించి, అపరకాళికలా తిరగబడింది. ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఓ సెంటర్‌కు వచ్చాక ఎవరిదారిన వారు వెళ్తున్నారు. ఇంతలో స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, హెచ్చరించినా పట్టించుకోలేదట. ఇక తనను తాను రక్షించుకోవాలని భావించి గట్టిగా అరుస్తూ అతడిని కొట్టడం మొదలుపెట్టింది. వెంటనే అక్కడికి చాలా మందితో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక చూడండీ.. అందరూ కలిసి అతడి చెంపలు వాయిస్తుండటంతో 'నన్ను క్షమించండీ.. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను' అని అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఆ అమ్మాయిలను వేడుకున్నాడు. వారు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా విపరీతంగా షేర్ అవుతోంది. విద్యార్థిని చర్యను అందరూ మెచ్చుకుంటున్నారు. -
జీజీహెచ్‌లో విద్యార్థిని మృతిపై విచారణ
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈనెల 14వ తేదీన చికిత్స పొందుతూ కూరపాటి ప్రణతి (16) అనే విద్యార్థిని మతిచెందిన వైనంపై ఫిర్యాదులు రావటంతో మంగళవారం ఐదు గంటలపాటు విచారణ జరిగింది. జీజీహెచ్ డెప్యూటీ సూపరింటెండెంట్, విచారణ కమిటీ అధికారి డాక్టర్ పెనుగొండ యశోధర వైద్యులు, వైద్య సిబ్బందిని విచారించారు. జ్వరంతో వచ్చిన విద్యార్థినిని వైద్యులు పట్టించుకోకపోవటం వల్లే ప్రణతి మృతి చెందిందని తల్లిదండ్రులు నాగరాజు, సుజాతలు ఆస్పత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన రోజు∙ కుటుంబ సభ్యులు సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయటంతో సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడుడాక్టర్ విద్యార్థిని మృతిపై విచారణ చేయాల్సిందిగా యశోధరను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు మంగళవారం విచారణ జరిగింది. -
జీజీహెచ్‌లో విద్యార్థిని మృతి
గుంటూరు ఈస్ట్: జ్వరంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పైగా మతిచెందిన తర్వాత కూడా ఐసీయూలోకి తీసుకువెళ్లి ప్రత్యేక వైద్యం అందించినట్టు వైద్యులు నాటకాలాడారని బంధువులు ఆరోపించడం జీజీహెచ్‌లో కలకలం రేపింది. మృతురాలి మేనమామ గోరంట్ల సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాడికొండ మండలం బైజోత్పురంలో నివసించే కూరపాటి నాగరాజు,సుజాతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రణతి (16) తెనాలిలోని జేఎమ్‌జే కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు గుంటూరు స్వర్ణభారతి నగర్‌లోని తన అమ్మమ్మ గోరంట్ల మేరీ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం నుంచి జ్వరంగా ఉండడంతో పాటు సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం 103 వార్డుకు తరలించారు. అర్ధరాత్రిలో ప్రణతి కడుపునొప్పితో మెలికలు తిరిగి వాంతి చేసుకుంది. ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని డ్యూటీలో ఉన్న డాక్టర్లకు తెలియచేసినా వారు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. డ్యూటీలో లేని మరో వైద్యుడు ప్రణతి మృతి చెందిన విషయాన్ని బంధువుల చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న వైద్యులు హడావుడిగా విద్యార్థినిని ఐసీయూకి తరలించారు. కొంతసేపు ప్రత్యేక వైద్యం చేసి ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగానే ప్రణతి మృతి చెందిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని ఆర్ఎమ్వో డాక్టర్ రమేష్ హామీ ఇచ్చినా బంధువులు ఆందోళన కొన సాగించారు. -
డయేరియాతో పాఠశాల విద్యార్థిని మృతి
నార్నూర్ (ఆదిలాబాద్) : జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ముకాడె జ్యోతి(7) డయేరియాతో సోమవారం మృతిచెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెరమెరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన గిరిజన దంపతులు దుర్పతబాయి, చంపత్రావుల కూతురు జ్యోతి ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అయితే ఆమెకు శనివారం రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తగ్గకపోవడంతో ఆదివారం ఉదయం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్యం అందించగా.. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. శనివారం రాత్రి వైద్యం అందించి ఉంటే పాప బతికేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆరోపించారు. పాఠశాల వద్ద విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు. -
విద్యార్థిని అదృశ్యం
బంజారాహిల్స్ : స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌లో నివసించే కె.సౌజన్య(12) సమీపంలోని ఎస్జీబీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నది. ఈ నెల 20వ తేదీన ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా రాత్రి గడిచినా రాలేదు. స్వగ్రామం, బంధుమిత్రుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో.. కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్ కోసం వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
బోడుప్పల్: హాస్టల్ తెరిచారో లేదో తెలుసుకోవడం కోసం వెళ్లిన ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన బుధవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ శ్రీరాంనగర్ కాలనీలో నివసించే బూడిద మల్లయ్య కుమార్తె రోజ(17) నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలేజీ హాస్టల్ తెరిచారో లేదా తెలుసుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాజుద్దీన్ వివరించారు. -
విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం
బీజింగ్: చైనాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ధి పెడదోవ పట్టింది. పట్టపగలే పాఠశాలలో అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలోని లింగ్షాన్ కౌంటీలోని ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామంతో ఆందోళనకు గురయ్యారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే నిందితుడు హూ అనే టీచర్ గతంలో మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 2011 చికిత్స తీసుకున్నాడు. రెండేళ్ల తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తేలిన అనంతరం ఇటీవలే విధుల్లో చేరాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మహిళా టీచర్ ఉపాద్యాయుడి దుర్మార్గాన్ని పసిగట్టారు. వెంటనే ఇతర ఉపాధ్యాయులను అప్రమత్తం చేశారు. ఆ యువతిని అతడి బారినుంచి రక్షించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను అక్కడి ప్రభుత్వ విభాగం ధ్రువీకరించింది. గత ఐదేళ్లుగా అతడిని పాఠశాలలో క్లాసులు చెప్పేందుకు అనుమతించలేదని, కేవలం లైబ్రరీలో పనిచేసేలా ఏర్పాటు చేశామంది. గత ఐదేళ్లుగా అతని ప్రవర్తన బాగానే ఉందని కానీ, మార్చి 28న ఓ విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడని పేర్కొంది. సదరు యువతికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. -
పట్టపగలే గురుకులంలో బాలికపై హత్యాయత్నం!
శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై ఆదివారం గుర్తు తెలియని దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన మరో ఇద్దరు విద్యార్థినులు కేకలు వేయడంతో పారిపోయాడు. వివరాలు... పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఉంది. ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 602 వుంది బాలికలు చదువుతున్నారు. ఆదివారం ఉదయం 9.20 గంటల సవుయుంలో విద్యార్థినులు టిఫిన్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న కోవనూరుకు చెందిన లోకేశ్వరి(11) తొందరగా టిఫిన్ తిని వచ్చి హోంవర్క్ చేసుకుంటోంది. గుర్తు తెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోపలికి చొరబడ్డాడు. బాలిక వద్దకు చేరుకుని అమాంతం గొంతునులిమాడు. బాలిక అక్కడే స్ఫృహ కోల్పోయింది. దీన్ని గమనించిన మరో ఇద్దరు విద్యార్థినులు కేకలు వేయడంతో ఆ దుండగుడు పారిపోయాడు. బాధిత బాలికను ప్రిన్సిపాల్ ద్వారకానాథ్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు. పోలీసులతోపాటు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. రెండు గంటల తర్వాత కోలుకున్న ఆ బాలికను తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు. అప్పటికే విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ తమ పిల్లలకు భద్రత లేదని, ఇంటికి పంపేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టూటౌన్ సీఐ వేణుగోపాల్, ఎమ్మార్వో చంద్రమోహన్, ఎంఈవో బాలయ్యు పాఠశాలకు వెళ్లి బాలికను విచారించారు. ఈ సందర్భంగా సీఐ వేణుగోపాల్ వూట్లాడుతూ... 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పాఠశాలలో భద్రత కరువైందని తల్లిదండ్రులు ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లారు. -
తల్లిదండ్రులు మందలించారని..
మాదాపూర్ (హైదరాబాద్) : తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. మాదాపూర్‌లోని కావూరిహిల్స్ ప్లాట్నెం 101 లో కుటుంబ సభ్యులతో నివాసముంటున్న హన్సిప్రియ(13) 8వ తరగతి చదువుతోంది. అయితే ఇంటి పక్కనే ఉన్న వాచ్‌మెన్‌తో తరచూ మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు మాట్లాడవద్దని ఆమెను మందలించారు. దీంతో ఈనెల 3 వ తేదీన సాయంత్రం 7గంటల ప్రాంతంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 4వ తేదీ రాత్రి మృతిచెందింది. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో పడి విద్యార్థిని గల్లంతు
బెరైడ్డిపల్లి (చిత్తూరు) : జలకళతో నిండుకుండలా ఉన్న చెరువును చూడటానికి వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడి గల్లంతయ్యింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం గొల్లచేమనపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన లీనా(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గ్రామ చెరువు నిండటంతో స్నేహితులతో కలిసి చూడటానికి వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాలు జారి చెరువులో పడి గల్లంతైంది. సమాచారం అందుకున్న గ్రామస్థులు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఆ ముసుగులో కోరికలు తీర్చుకుంటున్నాడు!
ఫేస్బుక్ ఫ్రెండ్ ముసుగులో అమ్మాయిలను లొంగదీసుకుని కోరికలు తీర్చుకుంటున్న కేటుగాడి ఉదంతం బట్టబయలైంది. హైదరాబాద్‌లో శుక్రవారం బట్టబయలైన ఫేస్బుక్ క్రిమినల్ మాజీద్ లాంటి కేసే మరొకటి రాజమండ్రిలోనూ వెలుగు చూసింది. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, వారికి దగ్గరై ఆ తరువాత వారిని లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్న బొబ్బా హరిశ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో మంది అమ్మాయిలు వీడిబారిన పడగా ఒకరు మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లైంగికంగా వేధించడంతోపాటు... మోసం చేశాడని ఆరోపిస్తూ కేశవరానికి చెందిన ఓ కాలేజీ విద్యార్ధిని తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హరీశ్.. తనతో స్నేహం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడని, ఆ తరువా మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు బొబ్బా హరిష్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. -
విద్యార్థినికి లైంగిక వేధింపులు!
-
హైదరాబాద్‌లో సైకో సూదిగాడు కలకలం
-
హైదరాబాద్‌లో సైకో సూదిగాడు
-
హైదరాబాద్‌లో సైకో సూదిగాడు...
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా వాసులను వణికిస్తున్న ఇంజక్షన్ దాడులు హైదరాబాద్ కూ పాకాయి. మల్కాజ్‌గిరిలో నాలుగో తరగతి విద్యార్థిని రమ్యపై ఇంజక్షన్ దాడి జరిగింది. శనివారం ఉదయం రమ్య స్కూల్‌కి వెళ్తున్న సమయంలో... బైక్‌పై వచ్చిన ఆగంతకుడు ఆమెకు ఇంజక్షన్ గుచ్చి పరారయ్యాడు. బాధితురాలు లిల్లీపుట్ మోడల్ స్కూల్లో చదువుతోంది. రమ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కాగా ఇంజక్షన్ దాడులు ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాను వణికిస్తున్నాయి. ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేసిన ఫలితం శూన్యం. ఇప్పటి వరకూ ఆగంతకుడిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఇంజక్షన్ దాడి స్థానికంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కీచక ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్
తిరుమలాయపాలెం: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా విద్యార్థినిని లొంగదీసుకుని, ఆమె జీవితంతో ఆటలాడుకున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ ఉపాధ్యాడు హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో ఉండగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేసినట్లు తిరుమలాయపాలెం పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాడిగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి.. గతంలో ఇదే జిల్లాలోని తిరుమలాయపాలెం పాఠశాలలో పనిచేసినప్పుడు ఎనిమిదో తరగతి విద్యార్థినితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఆ తరువాత విద్యార్థినిపై చదువుల కోసం సహకరిస్తున్నట్లు నటించాడు. పదోతరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించి హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో చేర్పించాడు. ఓ గది అద్దెకు తీసుకుని ఆమెను అక్కడే ఉంచి, కావాల్సినవన్నీ కొనిస్తూ శారీరకంగా లొంగదీసుకున్నాడు. తరచూ హైదరాబాద్ వచ్చిపోతూ ఆమెపై అఘాయిత్యం చేసేవాడు. చదువు పూర్తి చేసుకుని ఆ యువతి ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. అయితే, శంకర్‌రెడ్డి ఆమెను కనీసం తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వకుండా, ఆమెపై లైంగిక దాడి కొనసాగిస్తూ ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తుండడంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలసి వారం క్రితం తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. -
పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి
నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా సైకో సూది బాబు మరోసారి రెచ్చిపోయాడు. నర్సాపురం పట్టణంలోని శుక్రవారం ఓ విద్యార్థినిపై దాడి చేశాడు. బైక్‌పై వచ్చిన సైకో స్థానిక జగన్నాథస్వామి ఆలయం సమీపంలోని మున్సిపల్ స్కూల్ లోపలికి వెళ్తున్న పల్లా కరుణ అనే విద్యార్థిని చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. దాంతో అక్కడే ఉన్న స్థానికులు సైకోను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే బాలికును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక స్వల్పంగా గాయపడ్డిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సైకో కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలను పోలీసులు అప్రమత్తం చేశారు. అతడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. -
ప్రేమించకుంటే..చంపేస్తానన్నాడు..
బొమ్మలరామారం: ‘ప్రేమిస్తున్నా... పెళ్లికి ఓకే చెప్పకుంటే చంపేస్తా...’నని బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం రాంలిగంపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని రాంలింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి తన అమ్మమ్మ గారి ఊరైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో చదువుకునే క్రమంలో గత కొంత కాలంగా అక్కడే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన గుర్రం కర్ణాకర్ బాధితురాలికి ట్యూషన్చేప్పేవాడు. ఆ సమయంలో సాన్నిహిత్యం పెంచుకున్న కర్ణాకర్ ప్రేమ పేరుతో వేధిండం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతిని స్వగ్రామమైన రాంలింగంపల్లికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో గత నెల 29న రాంలింగంపల్లి గ్రామానికి కర్ణాకర్ వచ్చాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్ణాకర్ మద్యం తాగి వచ్చి, తనను పెళ్లి చేసుకోకుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి యువతి శనివారం ఫిర్యాదు చేయడంతో కర్ణాకర్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. కాగా, గత నెల 29న రాంలిగంపల్లిలో టీకొట్టు దగ్గర ఉండగా యువతి బంధువులు తనపై దాడి చేసి గాయపరిచారని కర్ణాకర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
విద్యార్థినిపై కొడవలితో దాడి
బెంగళూరు :ఓ విద్యార్థినిపై సహ విద్యార్థి కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన బెంగళూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... కుంబళగూడుకు చెందిన ఓ విద్యార్థిని(21) సుంకదకట్టలోని పాలిటెక్నిక్ కళాశాలలో చివరి ఏడాది చదువుతోంది. రాజగోపాల్ నగర్‌కు చెందిన యోగేష్(21) అనే విద్యార్థి కూడా అదే కళాశాలలో చివరి ఏడాది చదువుతున్నాడు. అయితే శనివారం ఉదయం 9గంటలకు విద్యార్థిని కళాశాలకు రాగా, అప్పటికే అక్కడ వేచి ఉన్న యోగేష్ ఒక్కసారిగా ఆమెపై విచక్షణారహితంగా కొడవలితో దాడి చేసి పరారయ్యాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే బాధిత విద్యార్థినిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి బాధిత విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. కాగా నిందితుడు యోగేష్‌ను పోలీసులు మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ప్రేమ విఫలమై.. విద్యార్థిని ఆత్మహత్య
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ప్రేమ విఫలం కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది! ఈ ఘటన నగరంలోని హిమాయత్‌నగర్ ప్రాంతంలో బుధవారం జరిగింది. నిజామాబాద్‌కు చెందిన భ్రమరాంబిక (20) హిమాయత్‌నగరలోని హమ్స్టెక్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. స్థానికంగా హోండా షోరూమ్ పక్కనే ఓ హాస్టల్లో నివాసం ఉంటోంది. బుధవారం సాయంత్రం హాస్టల్లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో నారాయణగూడ పోలీసులు అక్కడకు చేరుకుని భ్రమరాంబికను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మృతురాలి సోదరుడు జర్మన్లో ఉంటున్నాడు. భ్రమరాంబిక కూడా ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి అయిన తర్వాత జర్మనీ వెళ్లాల్సి ఉందని ఆమె స్నేహితులు తెలిపారు. -
మద్యం మత్తులో విద్యార్థిని వేధించిన మహిళా వార్డెన్
నారాయణఖేడ్ (మెదక్): బాధ్యత మరిచిన ఓ మహిళా వార్డెన్ మద్యం మత్తులో ఓ విద్యార్థినిని వేధించిన ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ బాలల సదనంలో వెలుగు చూసింది. పోలీసులు, విద్యార్థినుల కథనం ప్రకారం... మనూర్ మండలం ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని నారాయణఖేడ్‌లోని మహిళావృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలల సదనంలో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఇక్కడి వసతిగృహం వార్డెన్‌గా పనిచేస్తున్న చంద్రకళ తన భర్త జగదీశ్వర్, ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే మరో వ్యక్తితో కలసి వసతి గృహానికి వచ్చి అక్కడే మద్యం తీసుకోవడం మూడు నెలలుగా జరుగుతోంది. మద్యం మత్తులో రామకృష్ణను పెళ్లి చేసుకోవాలంటూ వార్డెన్ చంద్రకళ సదరు విద్యార్థిని వేధిస్తోంది. దీనిపై విద్యార్థినులు ఏఐఎస్ఎఫ్ నాయకులకు తెలుపడంతో వారు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాధిత విద్యార్థిని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. -
బస్సు ఢీకొన్న విద్యార్థిని పరిస్థితి విషమం
మెదక్: జిల్లాలోని జహీరాబాద్ శనివారం ఓ ప్రైవేటు బస్సు ఢీకొని మహిళా విద్యార్థి తీవ్రంగా గాయపడింది. దీంతో తీవ్రంగా గాయాలు పాలైన ఆమెను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా బస్సును నడపటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయవాడలో కిడ్నాప్ కలకలం
విజయవాడ : నగర శివారులోని ఎనికేపాడులో ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేశారంటూ శనివారం గ్రామంలో కలకలం రేగింది. బాలిక మేనమామ తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపాడులో శివప్రసాద్, చాముండేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారై వాసవి ఆరో తరగతి చదువుతోంది. బాలిక శనివారం ఉదయం పాఠశాలకు వెళుతున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు మినీ వ్యాన్‌లో బలవంతంగా ఎక్కించుకున్నారు. వాసవి అరవకుండా నోటికి చేతులు అడ్డుపెట్టి మత్తు ఇంజక్షన్ చేశారు. అపస్మారకస్థితికి చేరుకున్న బాలికను ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం వెనుక వీధిలోని ఓ ఇంట్లో బంధించారు. మెళకువ వచ్చి చూసేసరికి గదిలో ఎవరూ లేరు. బయట నుండి గడియ పెట్టి ఉంది. దీంతో బాలిక గది వెనుక ఉన్న చిన్న రంధ్రం నుంచి బయట పడింది. ఏడుస్తూ రోడ్డు మీద వెళుతుండగా ఓ మహిళ చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. చేతులకు గాయలై రక్తం కారుతుండడంతో శుభ్రం చేసి ప్రాథమిక చికిత్స చేసింది. అనంతరం వాసవి తల్లి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. జరిగిన సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా బాలికను పోలీసులు వాహనంలో ఎక్కించుకుని కిడ్నాపర్లను గుర్తుపట్టేందుకు ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల్లో వెదికారు. తనను బంధించిన గదిని ఎక్కడనేది గుర్తించలేకపోవడం తో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు కోమరవల్లి కిషోర్.. వాసవి తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ప్రేమ పేరుతో వంచించిన టీచర్
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారితప్పి ప్రవర్తించాడు. చదువు చెప్పడం మాని ప్రేమ పాఠాలు బోధించాడు. కీచక టీచర్ మాటలను నమ్మి ఓ విద్యార్థిని మోసపోయింది. వరంగల్ జిల్లాలోని చేర్యాలలో ఓ కీచక టీచర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించి మోసానికి పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ డిగ్రీ కాలేజీ లెక్చరర్ రామకృష్ణారెడ్డిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భీమవరంలో 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఊరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో సోమవారం చోటుచేసుకుంది. హాస్టల్ రూం నుంచి విద్యార్థిని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దాంతో హాస్టల్ యాజమాన్యం హాస్టల్ రూం తలుపు పగలగొట్టారు. ఊరేసుకుని కనిపించిన విద్యార్థిని మృతదేహాన్ని చూసి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని బీహార్‌కు చెందిన కీర్తికుమారిగా గుర్తించారు. అయితే కీర్తి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థినిపై వేధింపులు: టీచర్‌కి దేహశుద్ధి
-
విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారి 9వ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దాంతో సదరు విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని తల్లిదండ్రులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో స్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిని స్కూల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన శుక్రవారం అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కేంద్రంలోని వివేకానంద జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. -
విద్యార్థినిపై టీచర్ అత్యాచారయత్నం
విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 40 ఏళ్ల పర్వేజ్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు తన దగ్గరకు ప్రైవేట్ ట్యూషన్ కోసం వచ్చిన ఓ బాలికపై ఆగయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ఆధారాల్ని సేకరించారు. సర్దార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి శనివారం ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
అలిగి వెళ్లి.. శవమై తేలింది
కంభం రూరల్, న్యూస్‌లైన్ : పరీక్ష పేపర్ ఆలస్యంగా ఇవ్వబోగా లెక్చరర్ మందలించడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిన విద్యార్థిని ఆదివారం శవమై తేలింది. వివరాలు.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రవళి గత శుక్రవారం జరిగిన యూనిట్ పరీక్షలో పేపర్ సమయానికి ఇవ్వలేదు. రవళిని మందలించిన లెక్చరర్.. ఆమె రాసిన పేపర్ తీసుకోకుండానే వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన రవళి (16) మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్లింది. తన వద్ద ఉన్న విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి నేరుగా కంభం చెరువు కట్టకు వెళ్లింది. ఎవరూ గమనించని సమయంలో పెద్దకంభం తూము వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియని రవళి తల్లిదండ్రులు కుమార్తె కోసం తెలిసిన చోటల్లా వెతికారు. బంధువులను వాకబు చేసినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో రవళి బంధువులు శనివారం కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్, లెక్చరర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడానికి లెక్చరరే కారణమని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచారు. రవళి ఆచూకీ తెలిసేంత వరకూ ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కంభ చెరువులో ఎవరిదో మృతదేహం ఉందని ఆదివారం ఉదయం ప్రచారం జరిగింది. బంధువులు వెళ్లి మృతదేహాన్ని చూసి రవళిదిగా గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఎస్సై రామకోటయ్య సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణం తీసింది. ఓ కన్నతల్లికి కడుపుకోతను మిగిల్చింది. పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన సంఘటన ఇక్కడి నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మల్లాపూర్ గోకుల్ నగర్లో నివాసముండే బి.సూర్యకాంత్, యశోద దంపతుల చిన్నకుమార్తె శాంతి(7) మల్లాపూర్‌లోని శ్రీవాగ్దేవి పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. పాఠశాలకు చెందిన బస్సులో రోజూ స్కూల్‌కు వెళుతుంది. రోజులాగే బుధవారం సాయంత్రం బస్సు దిగి ఇంటికెళ్లేందుకు స్కూల్ బస్సును ముందు నుంచి క్రాస్ చేసేందుకు శాంతి ప్రయత్నించింది. ఆమెను గమనించని డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు కదిలించాడు. దీంతో బస్సు శాంతిపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ పారిపోయాడు. శాంతి తల్లిదండ్రులు సంఘటనాస్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించడం అందర్నీ కలచివేసింది.