జైపూర్: తోటి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె మంచినీళ్ల బాటిల్లో మూత్రం పోశారు. ఈ ఘటన రాజస్తాన్లోని భిల్వారా జిల్లా లుహారియా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక స్కూలులో చదువుకుంటోంది. శుక్రవారం కొందరు విద్యార్థులు ఆమె మంచి నీళ్ల బాటిల్లో మూత్రం కలిపారు.
ఇది తెలియని బాలిక ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రాగా ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల బ్యాగులో ప్రేమ లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. స్పందించకపోవడంతో కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తహశీల్దారు, పోలీసులకు కూడా వారు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానితుల ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment