stone attack
-
పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణుల వీరంగం
సాక్షి, అమరావతి/గుడివాడటౌన్/తాడేపల్లి/నెహ్రూనగర్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రవి కిరణ్‌కు బెయిల్ ఇచ్చి విడుదల చేయించేందుకు పేర్ని నాని, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో రవికిరణ్‌కు బెయిల్ ఇప్పించిన అనంతరం పేర్ని నాని ఆయన అనుచరులతో కలిసి రాజేంద్రనగర్‌లోని వైఎస్సార్సీపీకి చెందిన తోట శివాజీ ఇంటికి వెళ్లారు. పేర్ని నాని పట్టణానికి వచ్చిన సమాచారం అందుకున్న జనసేన, టీడీపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు.తోట శివాజీ ఇంటి వద్దకు చేరుకుని పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కావడం, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో కార్యకర్తలు భారీగా గుమికూడారు. ఇంటిబైట ఉన్న నాని కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని.. జనసేన నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుమారు రెండు గంటలు పైబడి పేర్ని నానికి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం, దాడులు కొనసాగాయి. దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారుతో పేర్ని నాని డ్రైవర్ సిద్ధంగా ఉండగా.. అక్కడకూ వెళ్లి ఆ కారుపైనా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అనంతరం పోలీసులు జనసేన శ్రేణులను అక్కడ నుంచి పంపించి.. పేర్ని నానిని పట్టణం దాటించారు. కాగా, పేర్ని నానిపై టీడీపీ, జనసేన నేతల దాడిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ అరెస్టును ఆ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఖండించారు. -
గుడివాడలో పేర్నినాని కారుపై రాళ్ల దాడి
సాక్షి,అమరావతి : గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి కలకలం రేపుతుంది. వైఎస్సార్సీపీ నేత వైసీపీ నేత తోట శివాజీ మాజీ మంత్రి పేర్ని నాని,మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వెళ్లారు. ఆ ఇద్దరు నేతలు శివాజీ ఇంట్లో ఉన్న సమయంలో.. ఇంటి బయటే టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దూషిస్తూ.. తాము దాడి చేసేందుకు వచ్చామంటూ హెచ్చరికలు జారీ చేశారు.టీడీపీ, జనసేన నేతల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ వారిని నిలురించే ప్రయత్నం చేయలేదు. సుమారు రెండు గంటలకు పైగా పేర్నినాని శివాజీ ఇంట్లోనే ఉన్నారు.ఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్ రాజ్యాంగంఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్‌జ్యాంగం కొనసాగుతోంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. కారుపై దాడిచేసి అద్ధాలు పగలగొట్టారు టీడీపీ, జనసేన నాయకులు. పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడ్డారు.సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు అండగా ఉండేందుకు న్యాయ సహాయం కోసం పేర్ని నాని, కైలే అనిల్‌లు గుడివాడ వెళ్లారు. ఈ క్రమంలోనే పేర్ని నాని కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు కూటమి నేతలు. టిడ్కో గృహాల వద్ద మరో కారును పేర్ని నాని డ్రైవర్ ఉంచగా. అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడికి పాల్పడ్డారు. -
కార్ ఆసుపత్రిలో విధ్వంసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. యువ వైద్యురాలు శవమై కనిపించిన ప్రభుత్వ ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో దుండగులు వీరంగం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన నర్సులను నెట్టేశారు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో వార్డుల్లో విధ్వంసానికి దిగారు. ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్స్ వార్డులు, నర్సింగ్ స్టేషన్, మెడిసిన్ స్టోర్‌లో పరికరాలు, ఔషధాలను చిందరవందర చేశారు. హత్య కేసు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయతి్నంచారు. సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న వేదికను సైతం ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు పరిమిత సంఖ్యలోనే ఉండడంతో విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. పై అధికారులకు సమాచారం చేరవేయడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసుల రాకను గమనించిన దుండగులు రాళ్లు విసిరారు. దాంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. 40 మందికిపైగా దుండగులు నిరసనకారుల రూపంలో ఆసుపత్రిలోకి ప్రవేశించారని పోలీసు అధికారులు చెప్పారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనంతోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. కొందరు పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. ఇప్పటిదాకా 12 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రోగుల హాహాకారాలు ఆసుపత్రి వార్డుల్లో దుండగులు వీరవిహారం చేస్తుండడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. చికిత్స పొందకుండానే కొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. విలువైన వైద్య పరికరాలు, ఔషధాలను దండుగులు ఎత్తుకుపోయినట్లు తెలిసింది. విధ్వంసం జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న పోలీసులు చేతులెత్తేశారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. నర్సులకు కేటాయించిన వార్డుల్లో ఆశ్రయం పొందారు. తమను దాచిపెట్టండి అంటూ ఇద్దరు పోలీసులు వేడుకున్నారని ఓ నర్సు చెప్పారు.నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు, నర్సులు ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుల వీరంగం పట్ల డాక్టర్లు, నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. తమకు భద్రత కలి్పంచాలని డిమాండ్ చేశారు. తమపై దాడులను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. పోలీసుల సమక్షంలోనే దుండగులు రెచ్చిపోయారని, తమపై చెయ్యి చేసుకున్నారని ఆరోపించారు. తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఉద్యమాన్ని విరమించుకొనేలా చేయాలన్నదే వారి ప్రయత్నమని చెప్పారు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.దుమ్మెత్తిపోసుకున్న మమత, బీజేపీఆస్పత్రి విధ్వంసంపై మమత, బెంగాల్ బీజేపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సీపీఎం, బీజేపీ కార్యకర్తలే విధ్వంసానికి పాల్పడ్డారని మమత ఆరోపించగా, అది ఆమె పంపిన తృణమూల్ గూండాల పనేనని బీజేపీ తిప్పికొట్టింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆస్పత్రి విధ్వంస ఘటన పౌర సమాజానికి సిగ్గుచేటని బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించారు.రేపు వైద్యుల దేశవ్యాప్త సమ్మెవైద్యురాలి హత్యకు నిరసనగా శనివారం వైద్యుల దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచి్చంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. మరోవైపు దీనిపై నిరసనలు కొనసాగించాలని ఫోర్డా నిర్ణయించింది. తమ డిమాండ్లను పరిష్కారంపై కేంద్ర మంత్రి నుంచి జేపీ నడ్డా లిఖితపూర్వక హామీ ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.సీబీఐ దర్యాప్తు వేగవంతం వైద్యురాలి కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. గురువారం బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి హత్యపై వివరాలు సేకరించారు. ఆమె స్నేహితుల గురించి ఆరా తీశారు. కార్ ఆసుపత్రి వైద్యులతోనూ మాట్లాడారు. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, ఛెస్ట్ డిపార్టుమెంట్ చీఫ్‌ను విచారించారు. -
ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం
సాక్షి నెట్వర్క్: టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాల వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం విధులకు హాజరైన సచివాలయ సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు. నూజివీడులో శిలాఫలకం కూల్చివేత ఏలూరు జిల్లా నూజివీడు నెహ్రూ పేటలో శనివారం తెల్లవారుజామున ఒక శిలాఫలకాన్ని కూల్చివేశారు. వారం రోజుల క్రితం చాట్రాయి మండలం పోలవరంలో నాలుగు శిలాఫలకాలను ధ్వంసం చేయగా.. ఈ నెల 11న రాత్రి నూజివీడు మండలం బోర్వంచలో గ్రామ సచివాలయ భవనం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఎంఎన్‌పాలెంలో రెండు శిలాఫలకాలను, సీతారామపురంలో ఒక శిలాఫలకాన్ని, తూర్పుదిగవల్లిలో గ్రామ సచివాలయం బోర్డును ధ్వంసం చేశారు. సచివాలయంపై టీడీపీ జెండా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారం¿ోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్ ధ్వంసం చేశారు. సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనం వద్ద ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంపై టీడీపీ జెండా పెట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్లు పెట్టారు. ధ్వంసం చేసిన శిలాఫలకాల బోర్డులను, సచివాలయ భవనాలను శనివారం వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్ వడ్లమూడి మురళీమోహన్, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి నాగార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మాధవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్ఐ చెప్పారు. వైఎస్సార్ పేరు తొలగింపు ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని నూతన మునిసిపల్ కార్యాలయంపై గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు, కార్యాలయం ప్రవేశ ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేర్లను టీడీపీ నాయకులు శనివారం తొలగించారు. మునిసిపల్ కార్యాలయం 6 నెలల క్రితం ప్రారంభం కాగా.. ఆర్చిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. వీటితో పాటు చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి ప్రవేశ ద్వారం ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ పేర్లను కూడా తొలగించారు. ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్ సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, ఆముదాలపల్లి రామబ్రహ్మం తదితరులు సీఐని కలిసి వినతిపత్రం అందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్‌కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
ఏర్పేడులో ఆర్. కృష్ణయ్యపై రాయితో దాడి
సాక్షి, తిరుపతి: బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పేడు మండల కేంద్రంలో కృష్ణయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఓ అగంతకుడు వెనుక నుంచి రాయి విసరడంతో ఆయన వీపునకు తగిలి గాయమైంది. తృటిలో ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ.. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ జగన్ వైపు ఉన్నారని తెలిపారు. పేదలకు మేలు చేస్తున్న జగన్‌కు బీసీలు అండగా నిలుద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో ‘మేమంతా సిద్ధం’ యాత్ర నిర్వహిస్తుండగా పదునైన రాయితో ఆయనపై దాడి చేసిన అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ డాబా కొట్ల జంక్షన్ వద్ద వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి పదునైన రాయితో సీఎం జగన్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఐపీసీ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజిలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్ సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. వారిలో నేర చరితులు, అసాంఘిక శక్తులు, ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే ముఠాల సభ్యులు, వ్యసనపరులైన అసాంఘిక శక్తుల చేతుల్లో కీలు»ొమ్మలుగా మారిన యువత వంటి వారు ఉన్నారు. అనుమానితులను విడివిడిగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన రోజుకు (శనివారానికి) రెండు రోజుల ముందు నుంచి వారు ఎక్కడెక్కడ సంచరించారో వివరాలు సేకరించారు. వారు చెప్పిన సమాచారాన్ని కాల్ డేటా, సీసీ కెమెరాల వీడియో ఫుటేజిలతో పోల్చి చూశారు. సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా కొందరు యువకులపై పోలీసులకు సందేహం కలిగింది. వారిని మరింత లోతుగా విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ యువకుల గుంపే హత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వారిలో ఒకరు ప్రధాన నిందితుడిగా, మిగిలినవారు అతనికి సహకరించినట్లు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేదు. తొందరపడకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని భావిస్తున్నారు. కాగా హత్యాయత్నానికి పాల్పడినవారిని గుర్తించడంపై మంగళవారం వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసిన వార్తలను పోలీసులు నిర్ధారించలేదు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. ఏదైనా విషయాన్ని తాము అధికారికంగా ప్రకటించేంతవరకు నమ్మవద్దని కోరారు. అప్పటివరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప నిందితులుగా భావించవద్దని చెప్పారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసువర్గాలు తెలిపాయి. -
ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుంచి తప్పించుకోగలిగానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైద్యులు విశ్రాంతి సూచించడంతో ఒక్కరోజు విరామం అనంతరం.. సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించారాయన. అయితే యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిసి పరామర్శించారు. ‘‘ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి. ధైర్యంగా అడుగులు ముందుకు వేద్ధాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదం నుంచే దాడి నుంచి తప్పించుకున్నా. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవు’’ అని సీఎం జగన్, పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని సీఎం జగన్ దృష్టికి వైఎస్సార్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చిన నేతలందరినీ అందరినీ చిరునవ్వుతో పలకరించిన సీఎం జగన్.. ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు. 👉: గాయంతోనే మేమంతా సిద్ధం యాత్రకు సీఎం జగన్ (ఫొటోలు) -
సీఎం జగన్ కు భద్రతా పెంపు
-
‘చంద్రబాబూ.. రాళ్లు వేయించుకుంటే ఓట్లు పడవు’
తిరుపతి, సాక్షి: సీఎం జగన్‌పై దాడి కేసులో చంద్రబాబు, లోకేష్ నీచంగా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జనాల్లో సీఎం జగన్‌పై సింపథీ ఎక్కడ పెరిగిపోతుందో అనే ఆందోళన టీడీపీలో మొదలైందని.. కానీ, సింపథీతో జనాలు ఓట్లేయరని విషయం అనుభవపూర్వకంగా చంద్రబాబుకు తెలుసంటూ చురకలంటించారాయన. తిరుపతిలో సోమవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు తన మీద రాళ్లు వేయించుకుని సింపథీతో గెలుద్దామని అనుకుంటున్నారు. కానీ, సింపథీతో ఓట్లు రావనే విషయం ఆయనకు తెలుసు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశారు. చంద్రబాబు పై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజలు చిత్తుగా ఓడించారు. ఆ గతాన్ని బాబు గుర్తు తెచ్చుకోవాలి. ఇదీ చదవండి: మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర ..రాళ్ల దాడిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయం అయ్యింది. కానీ, చంద్రబాబుకు ఇవేం కనిపించడం లేదా?. అయినా కూడా నాపై రాళ్ళ దాడి జరిగింది అంటూ చంద్రబాబు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అసలు చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడటం లేదు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి. కానీ, చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టండి అంటూ చంద్రబాబే పిలుపు ఇచ్చారు. చంద్రబాబు దగ్గర మంచి పేరు కోసం టీడీపీ వాళ్లే సీఎం జగన్‌పైకి రాళ్లు విసిరాయి. చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయాల్ని ఏపీ ప్రజలంతా గమనిస్తున్నారు. .. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందిస్తూ అండగా ఉంటే.. ప్రజలు నేతలపై నమ్మకం ఉంచుతారు. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటనను ఇప్పుడు ప్రజలంతా ఖండిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే కనీసం పరామర్శకు రావాల్సింది పోయి చంద్రబాబు ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. -
సీఎం జగన్ పై దాడి కేసు విచారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్
-
జనం మధ్య జగన్ ను అంతం చేసే ప్లాన్...దుర్గమ్మ సాక్షిగా దుష్టపన్నాగం..!
-
జగన్ మామ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి
-
ఇది ఆకతాయిలు చేసిన పనికాదు..పక్కా ప్లాన్ తో చేసారు
-
సీఎం జగన్ పై దాడి...రాష్ట్రమంతా నిరసన
-
చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
-
దాడి ఎలా జరిగిందంటే..
-
సీఎం జగన్ పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి
-
పథకం ప్రకారమే సీఎం జగన్ పై దాడి: వైవీ సుబ్బారెడ్డి
-
కుట్రపూరితంగానే దాడి...పోలీసుల నిర్ధారణ..
-
సీఎం జగన్ దాడిపై పోతిన మహేష్ రియాక్షన్...
-
సీఎం జగన్ దాడిపై బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమోషనల్..
-
ఓటమి భయంతో పిరికిపందలు చేసే పని...
-
ఇక్కడి నుండే సీఎం జగన్ పై దాడి..!
-
సీఎం జగన్ దాడిపై డాక్టర్ సంచలన విషయాలు
-
సీఎం జగన్ పై దాడిని ఖండించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
కూటమి కుట్రే: చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
-
నిరసన జ్వాలలు: సీఎం జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
-
స్కూల్ నుంచే దాడి ?..అడుగుల దూరం..
-
సీఎం జగన్ పై దాడి...కేశినేని నాని క్లారిటీ..
-
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్‌జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్‌జాదా హెచ్చరించారు. -
గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి.. ఇద్దరు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్‌లోని ఎ–బ్లాక్ హాస్టల్లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. -
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థులు
జైపూర్: తోటి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె మంచినీళ్ల బాటిల్లో మూత్రం పోశారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లా లుహారియా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక స్కూలులో చదువుకుంటోంది. శుక్రవారం కొందరు విద్యార్థులు ఆమె మంచి నీళ్ల బాటిల్లో మూత్రం కలిపారు. ఇది తెలియని బాలిక ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రాగా ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల బ్యాగులో ప్రేమ లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. స్పందించకపోవడంతో కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తహశీల్దారు, పోలీసులకు కూడా వారు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానితుల ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు. -
విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఆలస్యం.. కారణం ఏంటంటే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఖమ్మం వద్ద రైలు భోగి సి-12 కోచ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో పగిలిపోయింది. ఆ కోచ్ అద్దాలను మార్చడంతో రైలు బయలుదేరడం ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. రైలు కోచ్ సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. వాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. Modi sir,Indian Railway ,I have planned my journey in #VandeBharatexpress Train need to start at vijayawada @10.05 AM but train is delayed is by above 3 hours late..its not about speed...Indian Railways needs to respect piblic time also #PMOIndia #NarendraModi #IndianRailways — raf (@Hampi786) February 4, 2023 -
Visakhapatnam: వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. బోగీల అద్దాలు ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం: వందేభారత్ రైలు బోగీలపై గుర్తు తెలియని ఆగంతకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కంచరపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించాల్సి ఉంది. అందులో భాగంగానే ట్రయల్ కోసం చెన్నై నుంచి విశాఖ వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డీఆర్ఎం అనూప్ సత్పతి ఘటనపై విచారణకు ఆదేశించారు. రాళ్లదాడిని వాల్తేరు డివిజన్ అధికారులు నిర్ధారించారు. చదవండి: (మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. చరిత్ర అంతా చిక్కడు దొరకడు..!) -
కటకటాల రాథోడ్.. అప్పుడు షూ.. ఇప్పుడు రాయి!
క్రైమ్: నేరస్తుల్లో మార్పు రావాలనే శిక్షలు విధిస్తుంది న్యాయస్థానం. కానీ, మార్పు రాకపోగా మరింత మూర్ఖంగా తయారయ్యే వాళ్లు లేకపోలేదు. అలాంటోడే ధర్మేష్ రాథోడ్. అటెంప్ట్ టూ మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ధర్మేష్ రాథోడ్ అనే ఖైదీ.. శుక్రవారం గుజరాత్ నవ్‌సరి కోర్టులో సెషన్స్ జడ్జి మీదకు రాయిని విసిరాడు. అదృష్టం కొద్ది జడ్జి ఏఆర దేశాయ్ పక్కకు తప్పుకోవడంతో ఆ రాయి వెనకాల ఉన్న గోడను తాకింది. అంత రాయి అతనికి దగ్గరకు ఎలా వచ్చిందని దర్యాప్తు చేపట్టిన పోలీస్ శాఖ.. అతనిని కోర్టుకు తీసుకెళ్లిన లాజ్‌పోర్ జైలులోని ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక జడ్జి మీదకు రాయి విసిరి దాడి చేయాలనుకున్న నేరానికి రాథోడ్‌పై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక రాథోడ్ ఇంతకు ముందు కూడా ఇలానే చేశాడట. ఓ న్యాయమూర్తిపైకి ఏకంగా షూని విసిరాడట. దీంతో అతన్ని ఆ తర్వాత కాలి కాళ్లతో కోర్టుకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహారించాలని పోలీసులను పలువురు న్యాయవాదలు సూచిస్తున్నారు. -
బెడిసికొట్టిన చంద్రబాబు పన్నాగం..
-
డామిట్.. రాయి ఎదురు తిరిగింది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్నప్పటికీ ఒక్కోసారి నటుడి పొరపాట్ల కారణంగా కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద చతికిల పడుతుంటాయి. మొన్నటి చంద్రబాబు రోడ్‌షోలోనూ అచ్చంగా ఇదే జరిగింది. చంద్రబాబు అద్భుత నటుడే కానీ, ఎందుకో.. ఏమో ఆ రోజు ఓ పొరపాటు చేసేశారు. ఆ పొరపాటే ఇప్పుడు ఆయన్ను చులకన చేసింది. ఆ ఎపిసోడ్ అంతా ఉత్తుత్తేనని తేల్చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకూ పట్టుకోల్పోతున్న టీడీపీని గట్టెక్కించేందుకు చంద్రబాబు ఓ పన్నాగం పన్నారు. ఇటీవల నందిగామ పర్యటనలో.. తనపైకి ఎవరో రాయి విసిరారని.. అది అధికార పార్టీ వారి పనేనని రచ్చ రచ్చ చేశారు. అది గురితప్పి తన భద్రతా«ధికారికి తగిలిందంటూ.. చిన్నపాటి గాయాన్ని చూపించారు. అయితే ఇదంతా పక్కాగా ముందస్తు ప్రణాళికతో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో తమపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు చేయడానికి ముందుగానే తగిన కసరత్తు చేశారని స్పష్టం అవుతోంది.ఆరోజు చంద్రబాబు భద్రతాధికారి మధుబాబు తనకు గాయం అయ్యిందని, దానిపై తెల్లటి రుమాలు పెట్టుకుని వాహనంపై ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. ఆ వెంటనే ఆయనపై దాడి జరిగిందని చంద్రబాబు ప్రకటించేశారు. ఇక ఆ తర్వాత నుంచి చంద్రబాబు అండ్ టీడీపీ గ్యాంగ్ ఆ డ్రామాను రక్తి కట్టించేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? ► ఎవరిపై అయినా దాడి జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేస్తారు. డీఎస్పీ హోదాలో ఉన్న మధుబాబుకు ఆ మాత్రం తెలీదా? అనే చర్చ మొదలైంది. దీంతో ఆ మరుసటి రోజు కానిస్టేబుల్‌తో ఆయన ఫిర్యాదు పంపారు. పోలీసులు మెడికల్ టెస్ట్‌కు రమ్మని పిలిచినా రాకుండా హైదరాబాద్‌లోనే ఎందుకు ఉండిపోయారు? ఈరోజు, రేపు అంటూ ఇప్పటికీ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ► ఎవరైనా రాయితో దాడి చేస్తే, ఆ రాయిని చూపిస్తూ మాట్లాడతారు. మరి ఆ రోజు ఆ రాయిని చంద్రబాబు ఎందుకు చూపలేదు? ఇక్కడే చంద్రబాబు రాయిని చూపకుండా పొరపాటు చేశారు. ఓ రాయిని ముందే సిద్ధం చేసుకుని ఉండటం మరిచారు కాబోలు! లేదా ఆ రాయి వెంటనే మాయమై పోయిందేమో! మామూలుగా రాయి తగిలితే, తగిలిన చోట వాపు వస్తుంది. మధుబాబుకు అయిన గాయం వద్ద అలాంటి వాపు కనిపించ లేదు. ► ఘటన జరిగినప్పుడు చంద్రబాబు రక్తం అంటిన తెల్ల రుమాలు మాత్రమే చూపారు. రాయి ఎందుకు చూపలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అది రాయి దాడి కాదని తేటతెల్లం అయ్యింది. ► రోడ్డుషోలో పొరపాటున చెట్టు కొమ్మ కానీ, చైతన్య రథంకు సంబంధించిన పైపులు, బోల్టో, జెండా కర్రో తగిలి రాసుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. జనాలు విచ్చల విడిగా పూలు చల్లారు. ఆ పూలలో నుంచి ఏదైనా వస్తువు పొరపాటున వచ్చి తగిలుండొచ్చనే అనుమానాన్ని టీడీపీలోని కొంత మంది నాయకులే వ్యక్తం చేస్తున్నారు. ఒక్క విజువల్ లేదే! ► రోడ్డుషోను ఆద్యంతం ఇటు పోలీసు వర్గాలు, అటు టీడీపీ వర్గాలు చిత్రీకరించాయి. అలాంటప్పుడు రాయి దాడికి సంబంధించిన ఆధారాలు, వీడియో ఫుటేజీని వారు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? పోలీసులు తీసిన, చిత్రీకరించిన కెమెరా ఫుటేజీ, డ్రోన్ విజువల్స్‌ను ఇప్పటికే పలుమార్లు పరిశీలించారు. వాటిలో ఎక్కడా రాయి విసిరిన దృశ్యాలు కనిపించలేదు. ► వెంటనే ఫిర్యాదు అందకపోయినా, బాధ్యతాయుతంగా స్పందించి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఘటన ప్రాంతానికి పంపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను నియమించారు. అందిన ఫిర్యాదు మేరకు లీగల్ ఓపీనియన్ తీసుకొని పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ► దీంతో తమ ఎత్తుగడ ఫలించలేదని భావించిన చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారు. ‘పెట్టి’ కేసు లాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, హత్యాయత్నంకు సంబంధించిన సెక్షన్లకు మార్చాలంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలను గవర్నర్ వద్దకు పంపారు. ► ఇంతటితో ఆగకుండా మంగళవారం నందిగామలో టీడీపీ నేతలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, అక్కడే నిరాహార దీక్ష చేయడం.. సాయంత్రానికి మళ్లీ కొంత మంది నాయకులు వచ్చి దీక్ష విరమింపజేయడం చూస్తుంటే ఈ అంశాన్ని ఎలాగైనా లైవ్‌లో ఉంచి లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యంగా తెలుస్తోంది. ► ఎవరైనా నిజంగా రాయి విసిరివుంటే పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ క్యాడర్ చూస్తూ ఊరుకునేదా? అతన్ని పట్టుకుని చితకబాదేవారు కాదా? అనే ప్రశ్నకు టీడీపీ నేతలు ఏమని బదులిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమపై పడ్డ రాయి ఆ రోజు కనిపించలేదని, ఇప్పుడు దొరికిందని వేరే రాయిని తీసుకొచ్చి చూపినా ఆశ్చర్యం లేదని బాబు తత్వం తెలిసిన ఓ నేత వ్యాఖ్యానించారు. -
స్టోన్ క్రషర్లో భారీ పేలుడు
మాలూరు / కోలారు: మాలూరు తాలూకాలోని టీకల్ ఫిర్కా కొమ్మనహళ్లి గ్రామం వద్ద మంజునాథ్‌కు చెందిన స్టోన్ క్రషర్లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఘటనలో బిహార్‌కు చెందిన కార్మికుడు రాకేష్ సాణి(34) దుర్మరణం పాలయ్యాడు. అయితే మాస్తి సీఐ వసంత్ రాత్రికి రాత్రే రాకేష్ సాణి మృతదేహాన్ని మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి టిప్పర్ ఢీకొని మరణించినట్లుగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. మృతుడి శరీరం కాలిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. శుక్రవారం ఉదయం కేంద్ర వలయ ఐజీపీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉన్నతాధికారుల దృష్టికి తేకుండా పోస్టుమార్టం ఎందుకు చేయించారనే ప్రశ్నలు తలెత్తాయి. ఘటనపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో మాస్తి సీఐ వసంత్‌ను సస్పెండు చేశారు. మృతదేహాన్ని కోలారు జిల్లా ఆస్పత్రికి తరలించారు. రీ పోస్టుమార్టం చేయిస్తాం– మంత్రి మునిరత్న మంత్రి మునిరత్న శుక్రవారం కోలారు జిల్లా ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్టోన్ క్రషర్ బ్లాస్ట్‌కు సంబంధించి పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుడి మృతదేహాన్ని బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి పంపి రీ పోస్టుమార్టం చేయిస్తామన్నారు. మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్‌కు సూచించానన్నారు. పోలీసుల తప్పు కనిపిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. (చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!) -
పోసానిని దుర్భాషలాడుతూ దుండగుల వీరంగం
-
ఆ సమయంలో పోసాని ఇంట్లో లేరు: డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
-
జనసేన కార్యకర్తల వీరంగం
-
రెచ్చిపోయిన నిరసనకారులు: కెనడా ప్రధానిపై రాళ్ల దాడి
ఒట్టావా: కెనడాలో నిరసనకారులు రెచ్చిపోయారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై రాళ్ల దాడి చేశారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధానిపై నిరసన వ్యక్తం చేస్తూ కొందరు రాళ్లు విసిరారు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో ప్రధానికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటన కెనడాలోని ఒంటారియాలో చోటుచేసుకుంది. కెనడాలో వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేశారు. అయితే ఆ దేశంలో వ్యాక్సిన్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. చదవండి: జైలులో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి ఈ క్రమంలో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఒంటారియోలో ఎన్నికల సభకు పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో వ్యాక్సిన్ వ్యతిరేకులు ప్రధాని కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. ఈ సమయంలో రెచ్చిపోయి చిన్న చిన్న రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే ప్రధాని సురక్షితంగా బయటపడగా ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడిపై ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. ‘నా భుజంపై కొన్ని చిన్న రాళ్లు తగిలాయి. అయితే ఈ దాడితో నేను బెదరడం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ దాడిపై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించి ప్రధానిపై దాడిని ఖండించారు. అయితే దాడికి పాల్పడడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని నిబంధన విధించడమేగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ వ్యాక్సిన్ కచ్చితంగా వేసుకోవాలని ప్రధాని ట్రూడో ఆందక్షలు విధించారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా తప్పనిసరి చేశారు. అయితే దీనికి కొందరు ‘యాంటీ వ్యాక్సిన్’ ఉద్యమం లేవనెత్తారు. ఆందోళనకారులు వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రధానిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది. సెప్టెంబర్ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ట్రూడో పార్టీకి ప్రతికూల ప్రభావం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. -
ఆ రాయి ఎలా వచ్చింది?
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీ పరిశీలించగా, సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదనని డీఐజీ కాంతిరాణ టాటా వెల్లడించారు. గాయపడ్డారని చెబుతున్న వారి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు చూపిన రాయి అసలు ఆ ప్రాంతంలో ఉన్నది కాదని నిర్ధారణ అయ్యింది. అయితే ఆ రాయి సభలోకి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. చంద్రబాబు కట్టు కథే తిరుపతిలో సోమవారం సాయంత్రం 5.40 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రబాబు రోడ్డు షో నిర్వహించి కృష్ణాపురం ఠాణా వద్ద స్థానికుల నుద్దేశించి ప్రసంగించారు. ఉప ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనతో ఓ కార్యకర్తపై రాయి పడిందంటూ అప్పటికప్పుడు సభలో చంద్రబాబు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేదు. తనను టార్గెట్ చేసుకుని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాళ్ల దాడి చేయించిందని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు. టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు సభలో రాళ్లు వేశారని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు వాహనంపై నుంచి మట్లాడుతున్న సమయంలో పై నుండి ఒకరాయి వచ్చి పడిందని మాత్రమే చెప్పింది. ఇది హైడ్రామా కాదా? ఎవరో కార్యకర్తపై రాయి వేశారని, ఆ రాయిని తెప్పించుకుని అందరికీ చూపించి తనపైనే రాళ్లదాడి జరిగినట్లుగా చంద్రబాబు సీన్ క్రియేట్ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వద్దకు నడిచి వెళ్లటం.. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు వార్నింగ్‌లు ఇవ్వడం చూస్తుంటే ముమ్మాటికీ ఇది చంద్రబాబు హైడ్రామానే అని స్పష్టం అవుతోందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయాల్సినంత అవసరం ఎవరికుంది? తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో టీడీపీకి గెలుపు అవకాశాలు దాదాపుగా లేవని, ఈ నేపథ్యంలో రాళ్లదాడి చేయించాల్సిన అవసరమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలే లేదని అందరికీ తెలుసు. ఈ దృష్ట్యా ఉప ఎన్నికల్లో ద్వితీయ స్థానం కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే రాళ్ల దాడి నాటకానికి తెర తీశారని, తద్వారా ప్రజలు జాలి కురిపించి ఓట్లు వేస్తారన్నది ఆయన ఆశ అంటున్నారు. ఎవరైనా రాళ్లు వేస్తుంటే నిఘా విభాగాల సంగతి అటుంచితే, టీడీపీ కార్యకర్తలు ఒక్కరైనా సెల్లో బంధించే వారు కదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్లాన్ మేరకు టీడీపీ కార్యకర్తలే ఆ రాళ్లు జేబులో పెట్టుకుని, తీసుకువచ్చి చంద్రబాబు చేతికి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుపై పూలు చల్లే క్రమంలో అందులో పొరపాటున రాయి ఉండి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. రాళ్ల దాడి జరిగినట్లు ఆధారాలు లేవు చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగినట్లు ఆధారాలు లేవు. ప్రచారంలో ఎక్కడా అంతరాయం జరగలేదని సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పష్టం చేశారు. పోలీసులతో పాటు.. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ, ఎన్ఎస్జీ, ఐఎస్డబ్లు్య సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. రాళ్ల దాడి విషయంపై సీసీ కెమెరాలు పరిశీలించాం. చంద్రబాబు పర్యటించిన ప్రాంత పరిధిలోని స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు సెక్యూరిటీ, సౌండ్ సిస్టమ్స్ సిబ్బంది, డ్రైవర్లు ఇలాఅందరినీ విచారించాం. పోలీసులపై నిందలు వేయటం తగదు. ఆధారాలు ఉంటే ఇవ్వండి. – కాంతిరాణ టాటా, డీఐజీ -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల రాళ్ల దాడి
వినుకొండ: గుంటూరు జిల్లాలో సర్పంచ్ల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారు. జిల్లాలోని వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బొగిరి చినకోటేశ్వరరావు సర్పంచ్‌గా ఎన్నికైన తన వదిన ప్రమాణస్వీకారం సందర్భంగా గ్రామంలోని ప్రధాన సెంటర్‌కు రాగా, ఆయనపై టీడీపీ వర్గీయులైన పూర్ణి చినలింగారావు, నంబుల ఆదినారాయణ, శ్రీను, యరబోతుల శివ, సత్యం దాడి చేశారు. వీరిని అడ్డుకున్న పోగుల కోటయ్యపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. దీంతో వారు ప్రాణభయంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బెల్లం శివ ఇంటి వద్దకు వెళ్లగా, టీడీపీ వర్గీయులు ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై కూడా రాళ్ల దాడి చేశారు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు రావడంతో టీడీపీ వర్గీయులు పరారయ్యారు. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ గూండాలు నన్ను టార్గెట్ చేశారు: రజని
-
ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై రాళ్లదాడి
-
బస్సుల పై రాళ్లతో దాడి
-
బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!
సాక్షి, మైలవరం: కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. బంధాలు భారమవుతున్నాయి..క్షణికావేశంలో బంధాలు తెంచుకుంటున్నారు.. చిన్నచిన్న విషయంలో పట్టింపులకు పోతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు వెనకడం లేదు.అన్నపై దాడి చేస్తున్నాడని ప్రశ్నించిన పాపానికి బాబాయిని అన్న కొడుకు కొట్టిచంపిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రీకొడుకులు గొడవ పడుతున్న నేపథ్యంలో అడ్డుగా వెళ్లిన వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన చెర్వుమాధవరం గ్రామంలో బుధవారం తెల్ల్లవారుజామున చోటుచేసుకొంది. ఎస్ఐ రాంబాబు అందించిన వివరాలు... జి.కొండూరు మండల పరిధిలోని చెర్వుమాధవరం గ్రామానికి చెందిన ఓర్సు బాబు, కొడుకు నాగరాజుకి జీవనోపాధి కోసం ఆటో కొని ఇచ్చాడు. అయితే మద్యానికి బానిసైన నాగరాజు ఆటోని సక్రమంగా నడపకుండా అప్పులు చేస్తుండడంతో తండ్రి మందలించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగరాజు తండ్రిని కొట్టాడు. ఇది గమనించి బాబు తమ్ముడు ఓర్సు నరసింహారావు(37) అడ్డుగా వెళ్లాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు బండరాయి తీసుకొని బాబాయి నరసింహారావు తలపై మోదాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కుటుంబ సభ్యులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ శ్రీను, ఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అది ఆకతాయిల పనే!
సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుని నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి సమీప బంధువు కారు అద్దాల ధ్వంసం కేసు కొలిక్కి వచ్చింది. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్ర లేదని, వాస్తవానికి అది పథకం ప్రకారం చేసిన దాడి కాదని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నిర్ధారించారు. ఈ పని చేసిన నలుగురు ఆకతాయి బాలలను మలక్‌పేట పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. కిషన్‌రెడ్డి సమీప బంధువైన శ్రీనివాసరెడ్డి సచివాలయంలో అధికారిగా పని చేస్తూ మలక్‌పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్ బి–బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అతని కారు అద్దాలు, బైక్ ధ్వంసం చేశారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా భావించిన ఆయన మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కిషన్‌రెడ్డి సీపీతో పాటు రాష్ట్ర డీజీపీని కలిశారు. సున్నితమైన ఈ అంశానికి సంబంధించిన చిక్కుముడి విప్పడానికి కీలక ప్రాధాన్యం ఇచ్చిన ఉన్నతా«ధికారులు ఆ బాధ్యతలు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరా పుటేజీని అధ్యయనం చేసిన పోలీసులు అదే సమయంలో నలుగురు బాలలు ఆ ప్రాంతాల్లో తచ్చాడినట్లు గుర్తించారు. ఈ ఆధారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం మలక్‌పేట అధికారుల సాయంతో ముమ్మరంగా గాలించారు. ఫలితంగా బాధ్యులైన నలుగురు మైనర్లను మంగళవారం పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలోనే ఈ ఉదంతం వెనుక ఎలాంటి కుట్ర, రాజకీయ కోణాలు లేవని తేలింది. కేవలం ఆకతాయితనంతోనే వీరు కారు అద్దాలు, ఓ బైక్‌ను ధ్వంసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఆదివాసీ-లంబాడీల వివాదం హింసాత్మకం
-
ఆదివాసీల ఆందోళన హింసాత్మకం
సాక్షి, భూపాలపల్లి : ఆదివాసీ- లంబాడీల వివాదం హింసాత్మకంగా మారింది. మేడారం జాతర ట్రస్టు బోర్డులో ఉన్న ఇద్దరు లంబాడీ సభ్యులను తొలగించాలని గత కొద్ది రోజులుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. జాతర కోసం తెలంగాణ సర్కార్ నియమించిన 11 మంది సభ్యులు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసేందుకు మేడారం దేవాదాయ కార్యాలయానికి వెళుతుండగా ఆదివాసీలు వారిని అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేశారు. ప్రమాణ స్వీకారానికి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు ఒక్కసారిగా వాహనాలను అడ్డుకోవడంతో పాటు రాళ్లు విసురుతూ వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే మేడారంలోని ఐటీడీఏ కార్యాలయానికి కొంతమంది ఆందోంళనకారులు నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. కార్యాలయంలో ఫర్నీచర్, రికార్డులు దగ్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో చర్చలు జరుపుతున్నారు. -
ఆసీస్ టీం బస్సుపై దాడి.. నిందితుల అరెస్టు
సాక్షి, గువాహటి: భారత్‌తో రెండో టీ 20 విజయానంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు హోటల్ కు వెళ్లే సమయంలో వారి బస్సుపై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని నలుగురు యువకులు తాగిన మైకంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అస్సాం డీజీపీ ముఖేష్ సాహయ్ మీడియాకు తెలిపారు. వీరి పూర్తి వివరాలను బయటపెట్టిన పోలీసులు వీరిలో ఇద్దరు మాత్రం 12వతరగతి చదువుతన్నట్లు, మరో ఇద్దరు షాప్‌లలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్టేడియం సమీప ప్రాంతంలో నివసించే ఈ నలుగురు మైనర్లేనని, ఆరోజు మ్యాచ్‌ను మొబైల్ ఫోన్లో చూశారన్నారు. ఓటమిని తట్టుకోలేక అటువైపు వస్తున్న ఆసీస్ టీం బస్సుపై నలుగురు రాయి విసిరారని, ఒక రాయి మాత్రం బస్సుకు తగిలినట్లు తమ విచారణలో వెల్లడైందని డీజీపీ తెలిపారు. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా చర్చజరగడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అస్సాం పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. అయితే ఈ విషయాన్ని తొలుత ఆసీస్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ క్రీడా అభిమానులు షాక్ గురయ్యారు. ఇలాంటి ఘటనలతో దేశ పరువు తీయవద్దని సోషల్ మీడియావేదికగా ఘాటుగానే స్పందించారు. అయితే ఈ ఘటనను ఆసరా చేసుకున్న పాక్ అభిమానులు భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కారు. ఏకంగా భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిషేదించాలని ఐసీసీకి సూచించారు. -
హైస్కూల్లో విద్యార్థుల ఘర్షణ
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో పదో తరగతి చదివే అనిల్ అనే వేములపాడుకు చెందిన విద్యార్థి, పిన్నేపల్లికి చెందిన రవి అనే విద్యార్థి ఘర్షణ పడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనలో రవి అనే విద్యార్థి రాయితో దాడి చేయడంతో అనిల్ తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. వెంటనే గాయపడ్డ అనిల్‌ను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మూడు కుట్లు పడ్డాయని చెప్పారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ఎస్ఐ కత్తి శ్రీనివాసులు స్పందిస్తూ... తమకు రాతమూలకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
హైస్కూల్లో విద్యార్థుల ఘర్షణ
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో పదో తరగతి చదివే అనిల్ అనే వేములపాడుకు చెందిన విద్యార్థి, పిన్నేపల్లికి చెందిన రవి అనే విద్యార్థి ఘర్షణ పడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనలో రవి అనే విద్యార్థి రాయితో దాడి చేయడంతో అనిల్ తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. వెంటనే గాయపడ్డ అనిల్‌ను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మూడు కుట్లు పడ్డాయని చెప్పారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ఎస్ఐ కత్తి శ్రీనివాసులు స్పందిస్తూ... తమకు రాతమూలకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
పోలీసులపై రాళ్లతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని కొమరంభీం నగర్లో పోలీసులపై రాళ్ల దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి సర్వే నెంబర్ 169లో పేదల ఆక్రమిత గుడిసెలను తొలగించేందుకు మంగళవారం ఉదయం ఆర్డీవో యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. అయితే, స్థానికులు వారిని రానీయకుండా అడ్డుకున్నారు. కొందరు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు జల ఫిరంగులను ఉపయోగించారు. సర్వే నెంబర్ 169లోని 32 ఎకరాలను 2007లో ప్రభుత్వం హౌసింగ్‌బోర్డ్‌కు కేటాయించింది. అయితే ఈ భూమిలో 2011లో పేదలు సుమారు రెండు వేల గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. గతంలో రెండు సార్లు వీటిని తొలగించినప్పటికీ తిరిగి మళ్లీ వారు గుడిసెలను నిర్మించుకున్నారు. దీంతో వాటిని తొలగించేందుకు అధికారులు మరోసారి యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి... ఇద్దరికి గాయాలు
భువనగరి (నల్లగొండ): ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సమయంలో నడుస్తున్న ఓ ఆర్టీసీ బస్సుపై నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో బస్సు అద్దాల పగిలి ఓ ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంత వాసులని సమాచారం.