అఫ్గాన్ మహిళలకు తాలిబాన్ల హెచ్చరిక
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్‌జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్‌లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు.
‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్‌జాదా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment