Extramarital affairs
-
ప్రాణం తీస్తున్న ప్రేమ
ప్రేమ, దాని కారణంగా వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. హత్యలు,ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కిడ్నాపులకు దారితీస్తున్నాయి. ప్రేమ కారణంగా గత పదేళ్లలో లక్షకుపైగా హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి.⇒ దేశంలో ప్రేమ, తత్సంబంధ కారణాల వల్ల 201322 మధ్య ఆత్మహత్య చేసుకున్నవారు 74,180⇒ మొత్తం ఆత్మహత్యల్లో ప్రేమ కారణంగా జరిగినవి 76.1%⇒ వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఆత్మహత్యలు 13.3% ⇒ ప్రేమ కారణంగా హత్యకు గురైనవారు 30,012⇒ మొత్తం హత్యల్లో అక్రమ సంబంధాల కారణంగా జరిగినవి 46.6%⇒ పెళ్లిళ్ల కోసం చేసిన కిడ్నాపులు 2.8 లక్షలు⇒ పరువు హత్యలు 517ఆధారం: నేషనల్ర్ కైమ్ రికార్డ్స్ బ్యూరో -
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్‌జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్‌జాదా హెచ్చరించారు. -
మరిదితో వివాహేతర సంబంధం... మరికొందరితో చనువుగా ఉంటోందని....
పోలవరం రూరల్: కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రంలో మేడూరి దుర్గ (28) అనే వివాహిత హత్య కేసులో నిందితుడిని మంగళవారం పోలవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలవరం డీఎస్పీ కార్యాలయంలో హత్యకు సంబంధించిన కారణాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.సురేష్‌కుమార్ రెడ్డి వివరించారు. కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రం ప్రాంతానికి చెందిన మేడూరి దుర్గ (28)కు, సమీప బంధువు, వరుసకు మరిది అయిన మేడూరి ప్రసాద్ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే నెల రోజుల నుంచి దుర్గ వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానంతో ప్రసాద్ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఆదివారం రాత్రి ప్రసాద్ దుర్గకు అనేకమార్లు ఫోన్ చేయగా, దుర్గ వేరే వారితో మాట్లాడుతుడంతో ఫోన్ కలవలేదు. ఫోన్ తీయడం లేదనే కోపంతో ప్రసాద్ దుర్గ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. వెంటనే ప్రసాద్ తన వెంట తెచ్చుకున్న చాకుతో దుర్గ కంఠం కోసి, ఇంటి వెనుక వైపున మామిడి తోట నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే గాయం తీవ్రంగా కావడంతో దుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్ హత్య చేసిన అనంతరం దుర్గ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. సమీపంలోని మొక్కజొన్న చేలో ప్రసాద్ బట్టలు, ఫోన్, చాకు దాచి ఉంచాడు. ఘటన జరిగిన వెంటనే పోలవరం సీఐ కె.మధు బాబు, ఎస్సై ఎస్ఎస్ పవన్‌కుమార్, సిబ్బంది సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో పరిశీలించారు. మృతురాలి ఫోన్ కనబడకపోవడంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు తెలిశాయన్నారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేయడంపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించినట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నందుకు రివార్డులు కూడా ప్రకటిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ఇంకోసారి నా భర్తతో కనిపిస్తే..
యశవంతపుర: భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికెళ్లిన భార్య, ఆమె బంధువులు గొడవకు దిగారు. బెంగళూరులో మారుతీ లేఔట్ దొడ్డగుబ్బి మెయిన్‌రోడ్డులో ఈ ఘటన జరిగింది. వివరాలు.. ఓ మహిళ ఇంటి నిర్మాణానికి కంకర, ఇసుకను శరణ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసింది. ఈ సమయంలో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి శరణ్ భార్య సుమంత ఆ మహిళను మందలించడంతో ఆమె శరణ్‌తో మాట్లాడటం మానేసింది. అయితే కొంతకాలంగా ఇద్దరూ తిరిగి దగ్గరయ్యారు. ఒక మాల్‌కు వెళ్లారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న రాత్రి 11:30 గంటలకు కెంపరాజు, శరత్‌లతో కలిసి సుమంత, ఆ మహిళ ఇంటికి వెళ్లి కిటికీ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మరోసారి తన భర్తతో కనిపిస్తే బాగుండదని హెచ్చరించింది. వారి దాడి వల్ల తనకు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు మహిళ కొత్తనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె ఆరోపించింది. గొడవ చేసిన వీడియోలను సాక్ష్యంగా ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. -
మహిళా కానిస్టేబుల్‌తో పోలీసు ప్రేమాయణం.. వివాహేతర బంధం చివరకు..
సాక్షి, చైన్నె : వివాహేతర సంబంధం ఇద్దరు పోలీసులను బలిగొంది. తనను విస్మరిస్తున్నాడన్న ఆగ్రహంతో ప్రియుడైన పోలీసుపై ఆగ్రహంతో మహిళా కానిస్టేబుల్ తన ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడింది. విచారణకు భయపడి ఆ పోలీసు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మదురై సమీపంలోని తిరుపాలైకు చెందిన సుబ్బురాజ్ (40)కు తూత్తుకుడికి విలాతి కులం చెందిన జయలక్ష్మి(37)తో వివాహమైంది. వీరికి పవిత్ర(11), కాళి ముత్తు(9) పిల్లలు. జయలక్ష్మి మదురైలో రైల్వేలో పోలీసుగా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న కానిస్టేబుల్ చొక్కలింగం(47)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసి జయలక్ష్మికి సుబ్బురాజ్ విడాకులు ఇచ్చేశాడు. చొక్కలింగం భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా ఆరు సంవత్సరాలుగా జయలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో జయలక్ష్మిని తిరుచ్చికి, చొక్కలింగంను సెంగోట్టైకి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. సెంగోట్టైకి వెళ్లిన తర్వాత చొక్కలింగం ముఖం చాటేశాడు. దీంతో మనస్తాపానికి గురైన జయలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం సాయంత్రం మదురై– తిరుచ్చి ఇంటర్ సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో చొక్కలింగం చైన్నె – తిరుచెందూరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు
తమిళనాడు: ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని సిత్తేరి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ (24) శ్రీపెరంబుదూరు సమీపంలోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య యామిని (22). ఆదివారం రాత్రి ఇంటిలో నుంచి బయటకు వెళ్లిన విఘ్నేష్ సోమవారం ఉదయం సిత్తేరి మామిడి తోట సమీపంలో హత్యకు గురయ్యాడు. అరక్కోణం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో విఘ్నేష్ బంధువైన తండలం ప్రాంతానికి చెందిన సతీష్ (24) ప్రమేయం ఉన్నట్లు తేలింది. విఘ్నేష్ ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో యామినితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో అడ్డు తొలగించుకునేందుకే విఘ్నేష్‌ను హత్య చేసినట్లు సతీష్ తెలిపాడు. కాగా సతీష్‌కు సహకరించిన యామిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
వీడిన మర్డర్ మిస్టరీ
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళంలోని ఓ వైద్యుని ఇంటిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఓ కొలిక్కి తెచ్చారు. తన వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తోందని, ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఆ ఇంటి పనిమనిషి కొట్టు చిట్టెమ్మ ఈ నెల 14న అర్ధరాత్రి తోటి పనిమనిషి తాళ్లవలస రాజును హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. దీనికి సంబంధించిన విషయాలను టౌన్ సీఐ సన్యాసినాయుడు శుక్రవారం విలేకరులకు వివరాలు వివరించారు. ఆ మేరకు.. విశ్రాంత వైద్యుడు గొల్ల జగన్నాథం గత నాలుగేళ్లుగా విశాఖపట్నంలోనే కుటుంబంతో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళంలోని పెదపాడు వీరన్నషెడ్ వద్ద ఉన్న ఇల్లు ఖాళీగా ఉంచకూడదని ఎంతో నమ్మకంగా తన వద్ద ఉన్న పనిమనుషులు చిట్టెమ్మ, రాజులను అక్కడే ఉంచి ఇంటి బాగోగులు వారికే అ ప్ప గించారు. వీరిలో చిట్టెమ్మ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉండేదని, దీంతో రాజు ఆమెను పలుమార్లు మందలించేదని పోలీసులు తెలిపారు. గడిచిన ఆది వారం ఇలిసిపురంలో గల తన బంధువుల ఇంటికి వెళ్లిన రాజు సోమవారం సాయంత్రానికి ఆ ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి భోజనాలు అనంతరం మరోసారి చిట్టెమ్మతో వివాహేతర సంబంధాలపై ఇద్దరూ గొడవ పడ్డారు. ప్రతి విషయానికి నన్ను బెదిరిస్తావా అంటూ కోపోద్రిక్తమైన చిట్టెమ్మ అక్కడే ఉన్న చెక్క పేడుతో రాజు తలపై బలంగా మోదింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చిట్టెమ్మ తన బట్టలకు అంటిన రక్తం, చెక్కపేడును ఎవ్వరికీ కనిపించకుండా వేరే ప్రదేశంలో పడేసి అదే రోజు పరారైనట్లు సీఐ తెలిపారు. క్లూస్‌టీం పరిశీలన అనంతరం చిట్టెమ్మను నగర శివారు ప్రాంతంలో రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
వివాహేతర సంబంధం.. ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష
వరంగల్ లీగల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త అడ్డు తొలగించేందుకు హత్యా యత్నానికి పాల్పడిన మహిళకు జైలు శిక్ష పడింది. భర్తపై హత్యాయత్నం నేరంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఇల్లందుల ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసులు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన ఇల్లందుల చొక్కయ్య, ప్రేమలత దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రేమలత అదే గ్రామానికి చెందిన కడారి వీరభద్రయ్యతో కలిసి తిరుగుతోందని, ఇది సరైంది కాదని చొక్కయ్య ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దమనుషులు ప్రేమలతను మందలించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. పైగా తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేమలత ప్రణాళిక వేసుకుంది. ఏప్రిల్ 24, 2014 అర్ధరాత్రి నిద్రిస్తున్న చొక్కయ్యపై గొడ్డలితో దాడి చేసింది. తలకు, చేతులకు, ఛాతిపై గాయాలై విపరీతంగా రక్తం కారుతుండగా... చొక్కయ్య గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు రావడంతో ప్రేమలత పారిపోయింది. క్షతగాత్రుడిని స్థానికులు అర్ధరాత్రి ముల్కనూరులోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలిసి ముల్క నూరులో ఉన్న చొక్కయ్య సోదరి పుల్ల స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు నేరం రుజువుకావడంతో ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీనివాసులు తీర్పు వెల్లడించారు. కేసును పోలీసు అధికారులు సతీశ్‌కుమార్, ఎం.మహేందర్ పరిశోధించగా.. లైజన్ ఆఫీసర్ డి.వెంకటేశ్వర్లు విచారణ పర్యవేక్షించారు. సాక్షు్యలను కానిస్టేబుల్ ఎ.రవి కోర్టులో ప్రవేశపెట్టగా.. ప్రాసిక్యూషన్ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.భద్రాద్రి కేసు వాదించారు. -
వివాహేతర సంబంధాలకు అసలు కారణాలు ఇవే..
సాక్షి, గుంటూరు డెస్క్: భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయి. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఇరు కుటుంబాల పెద్దలు సర్ది చెప్పడంతో కొద్దికాలంగా దంపతులు కలిసే కాపురం చేస్తున్నారు. పుట్టింటి వద్ద ఉన్న రెండేళ్ల కాలంలో ఓ యువకుడితో ఆమెకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువకుడు ఇంటికి వచ్చిపోతుండటం, భార్య తరచూ ఎక్కడికో వెళ్లి వస్తుండటంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను పద్ధతి మార్చకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. అనుమానమే పెనుభూతమై.. ఉపాధి కోసం ముగ్గురు పిల్లలతో పట్టణానికి వచ్చారు ఆ దంపతులు. ఇద్దరూ రోజువారీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అధిక సంతానానికి తోడు భర్త మద్యానికి బానిస కావడంతో ఖర్చులు పెరిగాయి. వీరుంటున్న ఇంటి పక్కనే భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరి ఇబ్బందుల్ని గుర్తించి ఆమె పలుమార్లు డబ్బుసాయం అందించింది. దీంతో ఎక్కువసార్లు భార్య ఆ ఇంటికి వెళ్లేది. ఇది గమనించిన భర్త తన భార్య కూడా తప్పు చేస్తోందనే అనుమానం పెంచుకున్నాడు. నిజం చెప్పాలంటూ భార్యను పలుమార్లు బెదిరించాడు. చివరకు మద్యంలో విషం కలుపుకుని తాగి చనిపోయాడు. ఫలితంగా భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. వివాహేతర సంబంధంతో అలజడి భార్యను దూరం పెట్టిన ఓ భర్త సహ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రహస్యంగా ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం సహజీవనం చేస్తున్న యువతి ప్రియుడికి తెలిసింది. తాను ప్రేమించిన యువతి డబ్బు మోజులో తనను మోసం చేసిందని స్నేహితులకు చెప్పుకుని ఏడ్చాడు. మిత్రుడి బాధను చూసి అంతా కలిసి స్కెచ్ వేశారు. ఉద్యోగిని మందు పార్టీకని పిలిచి అందులో విషం ఇచ్చి చంపేశారు. పోస్టుమార్టంలో అసలు నిజం వెలుగుచూసి వారందరూ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ మృతుడి భార్య ఒంటరిదై పోయింది. ప్రేమించిన యువతి మోసంతో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఇవి మానవ సంబంధాల్ని దెబ్బతీస్తున్న కొన్ని ఘటనలు. మన మధ్యే జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు వెనుక ఉన్న యథార్థ గాథలు..! సమాజంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. కొన్ని సందర్భాల్లో అత్యాశ, అనుమానం, వ్యామోహం ఈ విలువలను దిగజార్చేలా చేస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు, కొన్నిచోట్ల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సైతం వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమవుతున్నాయి. హద్దులు దాటాక ఊహించని పరిణామాలు జరిగి వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రస్తుతం కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్రమ సంబంధాలు, ఆస్తికోసం అడ్డు వస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రపంచంలోనే ఆదర్శ కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం మనది. నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించి చేసుకున్న పెళ్లినాటి ప్రమాణాలు పటాపంచలవుతున్నాయి. ఫలితంగా ప్రాణంగా ప్రేమించిన వారు.. జీవితాంతం తోడుండాల్సిన వారే తోడేళ్లవుతున్నారు. బంధం బలపడాలంటే.. ♦దాంపత్యంలో దాపరికాలు ఉండకుండా చూసుకోవాలి. ♦పొరపాట్లు జరిగినా.. అనుమానాలు.. అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. ♦భార్యాభర్తలు ప్రతిరోజు కొంత సమయం ఒకరికొకరు కేటాయించుకోవాలి. ♦ బాధ్యతల్లో పడి ప్రేమించే వారిని ఒంటరిగా వదిలేయకూడదు. ♦మనస్పర్థలు వచ్చినా కూర్చుని మాట్లాడుకోవాలి. ♦ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా అపోహలు తొలిగే ప్రయత్నం రెండువైపులా జరగాలి. ♦ఎవరి తప్పు ఉందో తెలుసుకుని సున్నితంగా పరిష్కరించుకోవాలి. ♦మరోమారు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. ♦పిల్లల ముందు అస్సలు గొడవ పడరాదు. ♦ఎవరైనా మనసును ప్రభావితం చేస్తుంటే సున్నితంగా తిరస్కరించాలి. ♦తనకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యత ఉందని గుర్తెరగాలి. ♦వివాహేతర సంబంధాలు ఆర్థిక, సామాజిక, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని గమనించాలి. చదవండి: యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఆదర్శమైన ఆ ఐదుగురు దంపతులు... గుండె గుడిలో లక్ష్మీదేవి నిండిపోయి ఉంటుందని చాటుతూ వక్షస్థలంపై చోటిచ్చిన లక్ష్మీనారాయణుల్లా.. దేహంలో సగభాగం పార్వతీ అంటూ అర్ధనారీశ్వురుడైన గౌరీశంకరుల్లా.. దంపతుల ఇద్దరి మాట ఒకటేనంటూ సతీ సరస్వతిని నాలుకపై నిలిపిన బ్రహ్మదీసరస్వతుల్లా.. జీవకోటిని మేల్కొపుతూ పరుగులు పెట్టే భర్తను అనుసరించే భార్య ఛాయాదేవి, సూర్యుడిలా.. సర్దుకుపోయేతత్వం ఉన్న రోహిణిచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని అందంగా, ఆనందంగా తీర్చుదిద్దుకోవాలి. మొత్తం మీద భార్య నుంచి భర్తకు కావాల్సింది ఉపశమనం, సాంత్వన, పోషణ, కాని భార్యకు భర్త నుంచి కావాల్సింది అనుక్షణం సం‘రక్షణ’ ఒక్కటే. పెళ్లినాటి ప్రమాణాలు, నియమాలు, ఒప్పందాలను మర్చిపోకుండా మంచి సమాజం కోసం కుటుంబాన్ని ఆదర్శవంతంగా కొనసాగించినపుడే ఆ దాంపత్యంలో ఆనందం చిరస్థాయిగా ఉంటుంది. నమ్మకంతో మెలగాలి దంపతులు ఒకరిపై మరొకరు నమ్మకంతో మెలగాలి. దంపతుల మధ్య దాపరికాలు ఉండకూడదు. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. వృత్తికి, కుటుంబానికి సమపాళ్లలో సమయం కేటాయించాలి. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామం, భోజనం, అల్పాహారం కలిసి చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. పండుగలు, వారంతపు సెలవుల్లో ఒక రోజు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు కేటాయించడం ద్వారా అంతరాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. -డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసిక వ్యాధి వైద్య నిపుణుడు, జీజీహెచ్, గుంటూరు -
చంపుతాడని చంపేశాడు
నిజాంసాగర్: అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బయటికి తెలియడంతో తనను ఎక్కడ చంపేస్తాడోనన్న భయంతో అన్ననే మట్టుపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని అంతాపూర్లో జరిగింది. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి శనివారం తెలిపిన వివరాలిలా.. అంతాపూర్ గ్రామనికి చెందిన మక్కల్ వాడి గంగాధర్(27).. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్నమ్మ వద్దనే పెరిగాడు. చిన్నమ్మ కుమారుడు గంగాధర్, మక్కల్‌వాడి గంగాధర్ సొంత అన్నదమ్ముళ్లలా పెరిగారు. మక్కల్‌వాడి గంగాధర్‌కు వివాహమైంది. భార్య రేణు, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతను కూలి పనుల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో వరుసకు వదిన అయిన రేణుతో గంగాధర్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం క్రితం ఇంటికి వచ్చిన మక్కల్‌వాడి గంగాధర్.. ఇది గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తనను అన్న చంపేస్తాడేమోనని భయపడి ముందుగా అతడినే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు మక్కల్‌వాడి గంగాధర్ వంట చెరుకు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. తమ్ముడు గంగాధర్ బైక్‌పై అతడి వద్దకు వచ్చి, పొలానికి వెళ్దామని చెప్పాడు. జుక్కల్ మండలంలోని హంగర్గ శివారులోగల కర్ణం గుట్టకు తీసుకువెళ్లాడు. అక్కడ మాటు వేసి ఉన్న తన మిత్రులు అశోక్, బాలాజీలు మక్కల్‌వాడి గంగాధర్‌పై బండరాళ్లతో దాడి చేశారు. కుప్పకూలిన అతని తలపై ముగ్గురూ కలిసి రాళ్లతో కొట్టి చంపి నీటి గుంటలోకి తోసివేసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం వేళ అన్న కనిపించడం లేదంటూ గంగాధర్ గ్రామస్తులకు తెలిపాడు. హంగర్గ శివారు ప్రాంతానికి వెళ్లినవారికి నీటి గుంటలో మక్కల్‌వాడి గంగాధర్ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. బిచ్కుంద సీఐ కృష్ణ, జుక్కల్ ఎస్సై మురళి ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ జరిపారు. గంగాధర్‌పై అనుమానంతో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు
దొర్నిపాడుకు చెందిన ఓ మహిళను వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భర్త వేధింపులు తాళలేక పిల్లలతో వచ్చి పుట్టినింట్లో జీవనం సాగిస్తున్న ఆమె మరో వ్యక్తితో తప్పటడుగులు వేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వందేళ్ల జీవితానికి 25 ఏళ్లకే ముగింపు పలికింది. ఫలితంగా ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. ఇటీవల ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురానికి చెందిన ఓ వివాహిత ప్రియు డి మోజులో పడి భర్తను హత్య చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు నగరం బంగారుపేటలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కొంతకాలంగా మధనపడుతుండేది. భర్తలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వేరే మహిళ మాయలో పడటం..తల్లి బలవన్మరణం చెందడంతో వారి ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. ఒక్కోసారి జీవితాలను అర్ధంతరంగా చాలిస్తూ అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలను చేసి వెళ్తున్నారు. కృష్ణగిరి(కర్నూలు జిల్లా): క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల వారి జీవితాలు నాశనమవుతుండగా వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి. ఇవి ఒక్కోసారి కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దారి తీసి భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్లతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది. వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట విషపు గుళికలా ఇలాంటి వివాహేతర సంబంధాలు తారస పడుతున్నాయి. ఒక్కసారి పట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు వివాహేతర సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలుకు వెళ్లడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతోంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాలకు కారణాలు ♦సంపాదనే ధ్యేయంగా చూసుకుని సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం ♦దంపతుల మధ్య తరచూ పడే చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం ♦భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం ♦బయటవారితో కేటాయించిన సమయం.. లైఫ్‌పార్టనర్‌తో గడపకపోవడం ♦పెచ్చుమీరిన ఆన్లైన్ స్నేహాలు ♦చెడు వ్యసనాలకు బానిస కావడం ♦బలహీన మనస్తత్వాలు తప్పనిసరిగా పాటించాల్సినవి ♦దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి ♦బకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ♦ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని గ్రహించాలి ♦నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి ♦దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే.. చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్ ద్వారా చాలామంది దంపతులు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉంటున్నారు. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. – కల్లా మహేశ్వరరెడ్డి, డోన్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిల్లలపై ఎక్కువ ప్రభావం వివాహేతర సంబంధాల వల్ల కలిగే దుష్ఫరిణామాలు పిల్లలపైనే ఎక్కువ ప్రభావితం చూపుతాయి. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. – మహేశ్వరప్రసాద్, వైద్యాధికారి, కృష్ణగిరి జీవితాలను నాశనం చేసుకోవద్దు మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదముంది. వ్యామోహం సరదాగా ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. మా వద్దకు వచ్చే భార్య, భర్తల తగాదాల్లో అధికశాతం ఇలాంటి కేసులే. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సెలింగ్ చేసి జీవితాలను నిలబెట్టాం. – యుగంధర్, సీఐ, వెల్దుర్తి -
ఐటీ సిటీలో అతి పెద్ద సమస్య .. అక్రమసంబంధాలతో 981 జంటలు..
ఇది సంపన్నుల నుంచి కూలీ కుటుంబాలకు వరకూ వేధిస్తున్న సమస్య. మూడో వ్యక్తి ప్రవేశం కాపురాల్లో చిచ్చు రేపుతోంది. ఇది దాడులకు, తీవ్ర నేరాలకు దారి తీస్తోంది. ఫలితంగా తల్లీతండ్రి విడిపోతే పిల్లలు అనాథలు కావడం మరింత విషాదమవుతోంది. నేటి ఆధునిక సమాజంలో సోషల్ మీడియా ద్వారా దాంపత్య బంధానికి తీవ్ర ప్రమాదం ఎదురవుతోంది. సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, ప్రతిష్టకు పోయి విడాకులు తీసుకోవడంతో పాటు మరో ప్రధాన సమస్య సంసారాలను కకావికలం చేస్తోంది. వివాహేతర సంబంధాలు పచ్చని బంధాలను విచ్ఛిన్నం చేయడం వల్ల కుటుంబాల్లో అశాంతి ప్రబలుతోంది. తద్వారా విడాకులకు దారితీస్తున్న కేసులు నగరంలో రోజురోజుకు తీవ్రతరమౌతున్నాయి. సోషల్ మీడియా ఆజ్యం అక్రమ సంబంధాలకు అతిగా సోషల్ మీడియా వినియోగమే కారణమనేది రూఢీ అవుతోంది. ఇందులో ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో పాత మిత్రులు, గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని దగ్గర కావడం వల్ల కాపురాలు ఇట్టే కూలిపోవడం పెరిగింది. దంపతుల మధ్య సఖ్యత లోపించడం, కొన్ని వ్యక్తిగత సమస్యలతో మూడో వ్యక్తితో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల చివరికి నష్టమే జరుగుతోంది. వనితావాణికి తాకిడి బెంగళూరులో గత మూడున్నర ఏళ్లలో అక్రమ సంబంధాల వల్ల విడాకుల దశకు చేరుకున్న 981 జంటలు వనితా సహాయవాణి కేంద్రాన్ని ఆశ్రయించాయి. వివాహానికి ముందు, తరువాత అక్రమ సంబంధం ఉందని తెలిసి దంపతులు విడిపోతున్న ఉదంతాలు ఎక్కువైయ్యాయి. కోర్టులో విచారణ దశలో ఉన్న వేలాది విడాకుల కేసుల్లో 50 శాతానికి పైగా మూడో వ్యక్తి ప్రమేయమే కారణమని మహిళా సహాయవాణి కౌన్సిలర్ ఒకరు తెలిపారు. స్కూల్ మీటింగ్ అని గోవాకు బెంగళూరులో వివాహిత ఉపాధ్యాయురాలు ఫేస్బుక్లో పరిచయమైన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తితో స్నేహంగా ఉంటోంది. అతను టికెట్ పంపండంతో ఆమె విమానంలో గోవాకు వెళ్లింది. మూడురోజులపాటు స్కూల్ మీటింగ్ అని చెప్పి వెళ్లిన భార్యపై అనుమానంతో భర్త స్కూల్‌కి వెళ్లి ఆరా తీశాడు. అసలు గుట్టు బయటపడింది. భర్త విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. చదవండి: (400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్‌తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?) ప్రశ్నించిన భార్యపై దాడి కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగి ఒకరు 34 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ కార్యక్రమంలో పరిచయమైన మరో మహిళతో అతడు సంబంధం నెరపసాగాడు. ఇది తెలిసి భార్య ప్రశ్నించడంతో విచక్షణారహితంగా దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆమె మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కుటుంబాన్ని ముక్కలు చేసుకోవద్దు 2019 నుంచి 2022 జూలై వరకు 638 మంది జంటలు న్యాయ కోసం వనితా సహాయవాణి గడపతొక్కాయి. పెళ్లికి ముందే మరొకరితో సంబంధం ఉందని మరో 323 మంది ఫిర్యాదు చేశారు. గత ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు నెలల్లో 86 మంది దంపతుల సమస్య పరిష్కారానికి సహాయవాణిని ఆశ్రయించినట్లు కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. విలువైన కుటుంబ సంబంధాలను ముక్కలు చేసుకోవద్దని ఆమె జంటలకు సూచించారు. ఉన్నతాధికారి బండారం ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తోటి మహిళా అధికారితో వివాహేతర సంబందం కలిగి ఉన్నారు. నిత్యం మొబైల్లో చాటింగ్ చేసేవాడు. అనుమానం వచ్చిన భార్య అతను నిద్రలోకి జారుకున్న అనంతరం మొబైల్‌ను పరిశీలించగా బండారం వెలుగుచూసింది. దీంతో ఆ భర్తతో ఉండలేనంటూ ఆమె విడాకులు ఇవ్వడానికి కోర్టును ఆశ్రయించింది. -
ఛీ..ఛీ.. పాడు బుద్ధి.. వివాహేతర సంబంధాల మోజులో..
కొందరు తల్లిదండ్రులు వక్రబుద్ధితో వివాహేతర సంబంధాలు నెరపుతున్నారు. ఆకర్షణకులోనై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కటకటాల్లోకి వెళ్తున్నారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పిల్లలను అనాథులుగా మార్చుతున్నారు. కష్టాలకొలిమిలోకి నెట్టేస్తున్నారు. భవిష్యత్‌ను అంధకారంగా మార్చుతున్నారు. మేమేమి చేశాం పాపం అంటూ పిల్లలు గోడువెళ్లబోస్తున్నారు. దీనికి ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనం. విజయనగరం క్రైమ్: డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పదేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. భార్య ఇటీవల ఓ ఫార్మాకంపెనీలో హెల్పర్‌గా చేరినప్పటి నుంచి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. విషయం భర్తకు తెలిసింది. నిలదీయడంతో భర్తను హతమార్చేందుకు పూనుకుంది. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మట్టుబెట్టింది. దీనిని ఆటో ప్రమాదంగా చిత్రీకరించింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయాన్ని అంగీకరించింది. ఆమె జైలుకెళ్లింది. తండ్రి హత్యకు గురయ్యారు. వీరి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అనాథులుగా మారారు.’ ‘నెల్లిమర్ల మిమ్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్న భర్తను ప్రియుడి మోజులో పడిన భార్య మట్టుబెట్టేందుకు స్కెచ్ గీశారు. ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి హతమార్చారు. మృతదేహాన్ని రైలుపట్టాల మధ్యన పడేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో అల్లుడ్ని చంపేందుకు అత్త కూడా రూ.40వేలు కిరాయిలో తనవంతు రూ. 20వేలు ఇచ్చేందుకు సహకరించడం విశేషం. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. తల్లి, అమ్మమ్మ జైలు పాలయ్యారు. చిన్నవయసులోనే పిల్లల పరిస్థితిని తలచుకున్నవారికి కన్నీరు ఉబుకుతోంది.’ వివాహేతర సంబంధాలు ఉసురు తీస్తున్నాయి. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో హత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అడ్డుతొలగించుకుంటే అంతా మనమేనన్న భ్రమను కల్పిస్తున్నాయి. చివరకు కుటుంబంలో ఒకరిని పొట్టనపెట్టుకుంటున్నాయి. పోలీసుల విచారణలో దొరికి, చివరకు జైలు గోడల మధ్యన నలిగిపోయేలా చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే కడుపున పుట్టిన పదేళ్లలోపు చిన్నారులు అనాథలైపోతున్నారు. ఆప్యాయంగా పిలవడానికి నాన్న ఉండడు. అన్నం పెట్టేందుకు అమ్మ దొరకదు. రక్తకన్నీరు కారుస్తూ, చిరుప్రాయంలోనే మనసులో బలమైన గాయాలు తగిలి, నలిగిపోతున్నారు. ఏం చేయాలో తెలియని స్ధితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబ బాంధవ్యాలను నాశనం చేస్తున్నాయి. ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు జిల్లాలో వరసగా చోటుచేసుకోవడంతో జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. ఇటువంటి విషసంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబాలను అనాథలను చేయకండి వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోతుందన్నది అందరికీ తెలిసిందే. తెలిసి తప్పుచేస్తే ఆ కుటుంబ పెద్దలపై ఆధారపడిన పిల్లలు, వృద్ధులు అనాథలైపోతారన్న విషయాన్ని గుర్తెరగాలి. వివాహేతర సంబంధాల పేరుతో హత్యలకు పాల్పడితే సహించేది లేదు. తీవ్రమైన చర్యలు ఉంటాయన్నది వాస్తవం. – ఎం.దీపిక, ఎస్పీ, విజయనగరం ఇదొక మానసిక రుగ్మత వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమనేది మానసిక రుగ్మత. చట్టబద్ధమైన వైవాహిక జీవితం మాత్రమే ఆచరించాలి. క్షణిక ఆకర్షణకు, విపరీత ధోరణుల వైపు మరలడం వల్ల వారి జీవితం పాడవ్వడమే కాకుండా, ఇరువురి కుటుంబాలు సమస్యల్లో చిక్కుకుంటాయి. సెల్, ఇంటర్నెట్ వాడకం పెరిగింది. కొత్త స్నేహాలు, అర్ధరాత్రుల వరకూ చాటింగ్‌లు, పరిచయాలు.. ప్రేమ ముసుగులో వివాహేతర సంబంధాలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు కలిసి ఉండాల్సిన జీవితాలను కడతేర్చుకుంటున్నారు. చెడుస్నేహాలు, వ్యామోహాలు తగ్గించుకోవాలి. లేకుంటే కుటుంబం నడిసంద్రంలో నావలా తయారవుతుంది. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం -
వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..!
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఇటీవల జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. దానికి సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. వివరాలు: జిల్లాలోని చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ, తన కూతురు సంతోష కలిసి ఏప్రిల్ 10న చేగుంటకు వెళ్లారు. కానీ వారు తిరిగి ఇంటికి రాలేదు. సన్నిహితులు, బంధువులను సంప్రదించినా వారి ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో యాదమ్మ భర్త దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. కాగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వడియారం అటవీ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని డెడ్ బాడీలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. ఇక దాంతో పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకునారు. ఆ డెడ్ బాడీలను యాదమ్మ, సంతోషగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వడియారం గ్రామానికే చెందిన నగేశ్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో నగేశ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమ శైలిలో విచారించగా ఆ ఇద్దరు తల్లీకూతుళ్లను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు గల కారణాలు: కొన్నాళ్ల క్రితం నగేశ్‌కు తల్లీ కూతుళ్లతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ఈ క్రమంలో వారు నగేశ్‌ను తరచూ డబ్బులు ఇవ్వాలని వేధించసాగారు. తాము అడిగినంత ఇవ్వకపోతే తనపై కేసు కూడా పెడతామని బెదిరించారు. అయితే నగేశ్ మాత్రం ఎలాగైనా వారి పీడ తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం యాదమ్మతో పాటు తన కుమార్తె సంతోషను వడియారం అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. తల్లీ కూతుళ్లు అక్కడికి వెల్లి నిందితుడితో కలిసి మద్యం సేవించారు. ఇక ఆ మత్తులోనే నగేశ్ తల్లీ కూతుళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..
గొల్లపల్లి (కరీంనగర్ ): ఓ వివాహిత మరొకరితో వివా హేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. భార్య చేసిన మోసం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆమె వివాహిత ప్రియుడు, కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి, గొడవ చేయడంతో ఇక బతకొద్దని నిర్ణయించుకొని, తనువు చాలించాడు. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన జేరిపోతుల హన్మాండ్లు–దేవమ్మ దంప తులకు ముగ్గురు కుమారులు. వీరి చిన్న వయసు లోనే తండ్రి చనిపోయాడు. తల్లి దేవమ్మే పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు గంగాధర్(35)కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో పెళ్లి జరిపించింది . వీరికి ప్రమోద్ సంతానం. కాగా తిరుపతమ్మ పెళ్లయిన రెండేళ్లకే అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత గంగాధర్ పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన మమతను రెండో వివాహం చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ, సామాజిక కా ర్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్నా డు. కానీ పెళ్లి జరిగి, ఆరేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మమత జేరిపోతుల అభిషేక్ అనే ఎదురింటి యువకుడితో వివా హేతరం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలి సిన భర్త పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమె ను హెచ్చరించాడు. అయినా మమత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అభిషేక్‌తోపాటు అతని కు టుంబసభ్యులను మందలించాడు. ఈ నెల 11న మమత తన ప్రియుడితో కలిసి గంగాధర్‌కు పట్టుబడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరి గింది. గత శనివారం రాత్రి అభిషేక్, అతని కుటుంబసభ్యులు గంగాధర్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి,∙తల్లి దేవమ్మ బోరున విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు మందలించినా కోడలు వినలేదని తెలిపింది. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యులు తమను చంపేస్తామని బెదించారని, అందువల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మమత, అభిషేక్‌లపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే దేవమ్మ తన కుమారుడి మృతికి అభిషేక్ తల్లి లక్ష్మి, తండ్రి కిష్ఠయ్య, జేరిపోతుల రాకేశ్, మహేశ్, శంకర్, అతని భార్య అమ్మాయిలు కూడా కారణమని చెప్పిందన్నారు. విచారణలో నిజమని తేలితే అందరిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ ప్రకాశ్ బాధితుల ఇంటికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్, డీసీసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. -
వివాహేతర సంబంధం.. ఉదయం 5 గంటలకు దారికాచి
సాక్షి, సారంగాపూర్(కరీంనగర్): జిల్లాలో మరో హత్య జరిగింది. మూఢనమ్మకాలు, పాతకక్షల నేపథ్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా చంపిన ఘటనను మరువక ముందే ఈ హత్య జరగడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో లచ్చనాయక్ తండాకు చెందిన భూక్య లక్ష్మణ్ (24) చనిపోయాడు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ కథనం ప్రకారం.. లక్ష్మణ్ గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు సేవాలాల్ భవనంలో మైక్ ఆన్ చేసేందుకు బయలు దేరాడు. తన ఇంటి ఎదుట నుంచి వెళ్తున్న లక్ష్మణ్‌పై భూక్య సురేందర్ రాడ్డుతో దాడి చేశాడు. తలపై బలంగా బాదడంతో లక్ష్మణ్ కుప్పకూలి, అక్కడికక్కడే మృతిచెందాడు. రక్తం చిమ్మి సమీప ఇంటిగోడలపై పడింది. తనకు రామ్, లక్ష్మణ్ కవల పిల్లలని, ఇద్దరికీ వివాహాలు చేయాలని అనుకుంటున్న తరుణంలో ఇలా హత్యకు గురయ్యాడని మృతుడి తల్లి అమ్మి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సమాచారం. నిందితుడితోపాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చదవండిః కామాంధుడిని ఎన్కౌంటర్ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు -
మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని..
సాక్షి, చెన్నై(తమిళనాడు): తనను అనుమానించిన మూడో భర్త ముందు తాను పతివ్రతనే అని నిరూపించుకునేందుకు ఓ తల్లి కసాయిగా మారింది. తన రెండో భర్తకు పుట్టిన ఆడబిడ్డను కడతేర్చింది. చెన్నైలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరిచింది. వివరాలు.. తూత్తుకూడికి చెందిన పాల్ వణ్ణన్ కొన్నేళ్ల క్రితం భార్య జయలక్ష్మితో చెన్నైకు వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది. కొన్నాళ్ల అనంతరం భర్త, కుమార్తెను వదిలిపెట్టి మరిది దురైరాజ్‌తో జయలక్ష్మి ముంబైకు పారిపోయింది. అక్కడ పెళ్లి చేసుకున్న వీరికి పవిత్ర(10) కుమార్తె ఉంది. ఏడేళ్ల క్రితం జయలక్ష్మిని వదిలిపెట్టి దురైరాజ్ పత్తాలేకుండా పోయాడు. తర్వాత కొద్ది రోజులు ముంబైలో ఉన్న జయలక్ష్మి కుమార్తె పవిత్రతో కలిసి చెన్నై తిరువొత్తియూరుకు వచ్చేసింది. ఇక్కడ ఓ లారీడ్రైవర్‌ను మూడో వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె భానుప్రియ(06), కుమారుడు భూపాలన్(05) ఉన్నారు. కాగా ఇటీవల మూడో భర్త పద్మనాభన్ జయలక్ష్మిపై అనుమానంతో గొడవపడే వాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి భర్తతో గొడవపడి, అతడి ఆదేశాల మేరకు నిద్రలో ఉన్న రెండో భర్త దురైరాజ్‌కు పుట్టిన పవిత్రపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. తాను ఏ తప్పు చేయలేదంటూ ప్రతిజ్ఞ చేసింది. ఆతర్వాత కాసేపటికి మేల్కొన్న ఈ కసాయి తల్లి మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది. స్థానికులతో కలసి కీల్పాకం ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. సోమవారం పోలీసుల దర్యాప్తులో జయలక్ష్మి మూడు పెళ్లిల భాగోతం వెలుగు చూసింది. దీంతో ఆమెను, మూడో భర్తను అరెస్టు చేశారు. కాగా వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలుగా రోడ్డున పడ్డారు. భార్యను హత్య చేసిన భర్త తిరువొత్తియూరుః ఇంటిని తన పేర రాసి ఇవ్వమంటూ గొడవ చేయడంతో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. వివరాలు.. చెన్నై తండయార్ పేటకు చెందిన దళపతి (52). ఇతను నౌకలోపని చేస్తూ ఉన్నాడు. అతని భార్య షణ్ముఖప్రియ (49). వీరి కుమారుడు ఇలంపరిధి (28). విదేశాల్లో నౌకలో పని చేస్తూ ఉన్నాడు. మరో కుమారుడు అరుణ్ (26) ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. కుమార్తె అనిత (26)కు వివాహమై భర్తతో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దళపతి, షణ్ముఖ ప్రియా మధ్య గొడవ ఏర్పడింది. ఆ సమయంలో షణ్ముఖ ప్రియా భర్త పేరులో ఉన్న ఇంటిని తనకు రాసివ్వాలని కోరింది. ఆగ్రహం చెందిన దళపతి వంట గదిలో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన షణ్ముఖప్రియను ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు దళపతి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. -
వివాహేతర సంబంధమే కారణమా? భర్త మెడకు చున్నీ బిగించి..
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజాంపుర కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. తాగి వచ్చి వేధిస్తుండడంతో తానే చంపేశానని భార్య చెబుతుండగా, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అజాంపుర కాలనీలో నివాసముండే అఫ్రోజ్ ఖాన్ (37)కు భార్య ఫర్జానా బేగం, కుమారుడు ఉన్నారు. ఫర్జానా మొదటి భర్తను వదిలేసి, అఫ్రోజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అఫ్రోజ్ ఖాన్ గతంలో ఆటో నడిపే వాడు. కొద్ది రోజుల నుంచి అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. విసిగి పోయిన ఫర్జానా సోమవారం అర్ధరాత్రి సమయంలో భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, ఎస్‌హెచ్‌వో మధుసూదన్ పరిశీలించారు. రోజు మద్యం సేవించి తనను వేధించడంతోనే హత్యకు పాల్పడినట్లు ఫర్జానా చెబుతోంది. అయి తే, వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతోనే హత్చ చేసినట్లు అఫ్రోజ్ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య ఒక్కరే హత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సోమనాథం తెలిపారు. చదవండి: యువతి ఫొటోలతో న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ.. -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను
సాక్షి, హన్వాడ(మహబూబ్‌నగర్): భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి నిలదీయడంతో, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన సంఘటన సోమవారం ఉద యం మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన మొద్దు వెంకటేష్(37)కు బుద్దారం గ్రామానికి చెందిన మాధవితో పదేళ్ల క్రి తం వివాహం జరిగింది. కాగా భార్య నాగర్‌కర్నూల్‌కు చెందిన జంగం రమేష్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన భర్త వెంకటేష్ మందలించాడు. దీంతో భార్య భర్తను ఎలాగైనా అంతమొందించాలనే నిశ్చయించుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన భర్త ఆదివారం రాత్రి ఎప్పటిలా భోజ నం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే ప్రణాళిక రచించిన భార్య మాధవి రమేష్‌తో కలి సి భర్త వెంకటేష్ గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి నాయినోనిపల్లి శివారులో ప్రధాన రహదారిపై వేసి రోడ్డు ప్రమాద ంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమ ంలో పెట్రోలింగ్‌లో ఉన్న హన్వాడ పోలీసులు ప్ర ధాన రహదారిపై వారిని గుర్తించారు. మృతదేహా న్ని వదిలి పారిపోతుండగా వెంబడించి పట్టు కుని ఠాణాకు తరలించారు. వెంకటేష్‌కు భార్యతోపాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఈ ఘటనపై వెంకటేష్ తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి
సాక్షి, మహదేవపూర్(వరంగల్): అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చేలా చేసింది. మండంలంలోని కాళేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 8న అన్నారం గ్రావిటీ కెనాల్లో లభ్యమైన గుర్తుతెలియని మహిళా శవం కేసును ఛేదించినట్లు జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. అయితే, అంతకుముందే కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో మహిళ అదృశ్యమైన కేసు ఉంది. ఆ దిశగా పోలీస్‌లు విచారణ చేపట్టగా గురువారం ఉదయం మహదేవపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామశివారులో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాళేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన రేగుల సౌజన్యతో భర్త రేగుల తిరుపతి భూపాలపల్లికి వెళ్లడానికి ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మైదబండాకు చెందిన తన బావమరిది ఎర్రం సురేష్ కారు అద్దెకు తీసుకుని వెళ్తూ మార్గమధ్యలో సౌజన్య స్నేహితురాలైన వెంకటేశ్వరిని కారులో ఎక్కించుకుని వెళ్లారు. అయితే తిరుపతికి భార్య సౌజన్యపై అనుమానం ఉండడంతో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం తిరుగు ప్రయాణంలో మెడిపల్లి అటవీ ప్రాంతంలో భార్య సౌజన్యను వివస్త్రను చేసి ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని అన్నారం గ్రావిటీ కాల్వలో పడేసి ఆమె దుస్తులు మంథని శివారు ప్రాంతం భట్టుపల్లి వద్ద దహనం చేసి పారిపోయినట్లు నేరం ఒప్పుకున్నారు. మృతురాలికి పాప, బాబు ఉన్నారు. ఇదివరకే తిరుపతిపై వరకట్నం కేసు, మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు పేరుతో డబ్బులు సంపాదించిన కేసులు ఉన్నాయని ఏఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ సమీక్షలో మహదేవపూర్ డీఎస్పీ బోనాల కిషన్, సీఐ కిరణ్, ఎస్సై రాజ్‌కుమార్, కాళేశ్వరం ఎస్సై ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. చదవండి: మరదలిని లోబర్చుకుని.. భార్యకు పిల్లలు పుట్టకుండా చేసి -
మరదలిని లోబర్చుకుని.. భార్యకు పిల్లలు పుట్టకుండా చేసి
సాక్షి, నల్లగొండ: మహిళను వేధింపులకు గురిచేసిన ఐదుగురిపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మహేశ్వరం సువర్ణను హైదరాబాద్‌లోని మీర్‌పేటకు చెందిన సంపూర్ణచారికి ఇచ్చి 30 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కట్నంగా ప్లాటు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వివాహమైన తర్వాత మూడేళ్ల వరకు వారి సంసారం సాఫీగా జరిగింది. ఈ క్రమంలో జీవనోపాధి కోసం సంపూర్ణచారి అనంతారం అత్తగారింటికి వచ్చి సువర్ణ సోదరి సరస్వతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పథకం ప్రకారం సంపూర్ణచారి సువర్ణను ఇబ్బందులకు గురి చేస్తూ గర్భం దాల్చకుండా చేసి పిల్లలు పుట్టరనే నెపంతో ఇద్దరితో కలిసి ఉంటానని నమ్మించి సరస్వతిని పెళ్లిచేసుకున్నాడు. తనను మంచిగా చూసుకుంటానని మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకోవాలని తనపై పలుమార్లు దాడి చేశారని భర్త సంపూర్ణచారిపై సువర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. చదవండి: రహస్యంగా ఫోన్‌కాల్స్.. ఎన్నిసార్లు చెప్పినా మారని కోడలు.. చివరకు -
ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి..
సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షునితో పాటు మరో మహిళ హత్యకు గురయ్యారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకా చందాపురలోని రామయ్య లేఔట్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హతులను నారాయణస్వామి (42), కావ్య (32)గా గుర్తించారు. వీరిద్దరూ సమీపంలోని చిక్కహాగడె గ్రామానికి చెందినవారు. భర్తకు విషయం తెలిసి.. నారాయణ స్వామి కావ్య ఇంటికి వచ్చి ఉండగా, కావ్య భర్తకు ఈ విషయం తెలిసింది. ఆవేశం పట్టలేక ఇంటికి చేరుకొని ఇంటి ముందు నారాయణ స్వామిని, ఇంటిలో ఉన్న కావ్యను కత్తితో నరికి చంపి పరారయ్యాడు. అతనితో పాటు ఆటోలో వచ్చిన మరో ముగ్గురు కూడా ఈ హత్యాకాండలో పాల్గొన్నట్లు సూర్యనగర పోలీసులు తెలిపారు. కావ్య తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా చేరుకుని పరిశీలించారు. పాత కక్షలా, లేక ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? అని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న భర్త, ఇతరుల కోసం గాలిస్తున్నారు. చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు -
పక్కా ప్లాన్.. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. ముగ్గురు ప్రియులతో కలిసి..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ముగ్గురు ప్రియులతో కలిసి పథకం ప్రకారం భర్తను భార్య చంపేసినట్టు ఎనిమిది నెలల తర్వాత బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన చెరువుమీది పర్వతాలు (27) కు ఉదండాపూర్‌లోని యాదమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్య పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగించేది. ఈ క్రమంలో భర్త ఓ ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయి ఇంట్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి ప్రియులతో కలిసి హత్య చేసేందుకు యాదమ్మ పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి ముగ్గురు ప్రియులతో కలిసి భర్త పర్వతాలుకు ఆమె అతిగా మద్యం తాపించింది. అపస్మారక స్థితికి చేరుకున్నాక చున్నీతో గొంతును బిగించి చంపేశారు. ఏమీ తెలియనట్టు లబోదిబోమంటూ మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు యాదమ్మతో పాటు పోలేపల్లికి చెందిన ఎన్నన్‌గండ్ల శివలింగం, ఎన్నన్‌గండ్ల మల్లేష్, గడ్డపు నాగరాజులను నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు నలుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి మొబైల్ ఫోన్ల్‌ను కోర్టుకు స్వాధీనం చేసినట్టు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. (చదవండి: మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్..) -
టీడీపీ నేత ‘సంబంధం’ బట్టబయలయిందని...
తాడేపల్లిరూరల్: తన వివాహేతర సంబంధం బట్టబయలయిందని ఆగ్రహించిన ఓ టీడీపీ నాయకుడు మరో ఇద్దరితో కలసి మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాంబాబు శనివారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామానికి చెందిన కూరపాటి శేషుకు మతిస్థిమితం లేదు. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్లో నిర్మించిన ఓ కొత్త భవనంలో ఎవరూ లేకపోవడంతో అక్కడే నివాసముంటున్నాడు. హైదరాబాద్‌లో ఉండే ఇంటి యజమాని రెండు ఫ్లోర్లు కలిగిన ఆ నివాసాన్ని తెనాలి మండలానికి చెందిన తెలుగు యువత మాజీ అధ్యక్షుడు శాఖమూరు బాబూ సురేంద్రకు అద్దెకు ఇచ్చాడు. ఆయన రెండో ఫ్లోర్‌ను శ్రీకాంత్ అనే మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. పెంట్‌హౌస్‌ను లక్ష్మీకాంత్‌రెడ్డికి అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజు శాఖమూరు బాబూ సురేంద్ర తన గర్ల్ ఫ్రెండ్‌ను గదికి తీసుకొచ్చాడు. ఆ సమీపంలోనే ఉన్న కూరపాటి శేషు గమనించి గది బయట గడియ పెట్టి పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలకొట్టి కేకలు వేశాడు. దాంతో చుట్టుపక్కల వారు వచ్చి శాఖమూరు బాబూ సురేంద్ర రోజుకొక అమ్మాయిని తీసుకొస్తున్నాడని ఇంటి యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో పైముగ్గురూ శేషుకుమార్‌ను విచక్షణా రహితంగా రాడ్‌తో కొట్టి చంపి సురేంద్ర ఇన్నోవా కారులో వారు నివాసముంటున్న ఇన్నర్ రింగ్‌రోడ్ దగ్గర నుంచి 6 కిలోమీటర్లు తీసుకొచ్చి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అయితే శేషుకుమార్ వివరాలు తెలియక తికమకపడుతున్న పోలీసులకు.. ఓ వలంటీర్ అతని వివరాలను అందజేశాడు. ఇద్దరు నిందితులతో నార్త్‌జోన్ డీఎస్పీ రాంబాబు ఆ దిశగా విచారణ ప్రారంభించిన పోలీసులు వీరు ముగ్గురే చంపారని నిర్ధారణ కావడంతో లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్‌ను ఇన్నర్ రింగ్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శాఖమూరు బాబూ సురేంద్ర పరారీలో ఉన్నాడు. అమర్తలూరులో అతని కారును, వేరే వ్యక్తి వద్ద ఉంచిన అతని సెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాబూ సురేంద్ర తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ముఖ్య అనుచరుడు కావడంతో అతడ్ని కేసులో నుంచి తప్పించేందుకు మంగళగిరి, తెనాలి టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పోలీసులు ప్రలోభాలకు లొంగకుండా బాబూ సురేంద్రను నిందితుడిగా చేర్చి గాలింపు చర్యలు చేపట్టారు. -
వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరు బనశంకరిలోని యారబ్‌నగరలో మహిళా టైలర్ అఫ్రినా ఖానం (28) హత్య కేసు మిస్టరీ వీడింది. మంగళవారం ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తెరతో పొడిచి చంపి, మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యాడు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి. ఆమె బంధువైన పీయూసీ విద్యార్థే (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే నిందితుని కుటుంబం కొత్త ఇల్లు కడుతోంది. అబ్బాయి ఆమె ఇంటికి వచ్చి వెళ్తూండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దామని హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా, అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బు ఇవ్వాలని ఆమెను అతడు పీడించాడు. దీంతో గొడవ జరిగింది, అబ్బాయి కత్తెర తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. చదవండి: Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను..