
హైదరాబాద్ : కట్టు కున్న భార్యే ప్రియుడి తో కలసి భర్త హత్యలో భాగమైన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. రూరల్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇస్మాయిల్ కు హైదరాబాద్ లోని కిషన్ బాగ్ కు చెందిన అనిస్ భేగం తో ఏడాది క్రితం వివాహం జరిగింది. కాగా అనిస్.. కిషన్ బాగ్ కు చెందిన సయ్యుద్ జహీర్ తో వివాహం కంటే ముందు నుండి అక్రమ సంబంధం కొనసాగించిందని సీఐ తెలిపారు. ఇస్మాయిల్ హత్య చేయడానికి నెల రోజుల నుంచే అతని మిత్రుడి తో కలసి రెక్కీ నిర్వహించారని అందులో భాగంగానే ఈనెల 16న మద్యం తాగించి క్రికెట్ బ్యాట్ తో తలపై కొట్టి చంపారని ఆయన తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకులను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. హత్య జరిగిన వారం రోజులలోనే హంతకులను పట్టుకోవడంతో ఏసీపీ సురేందర్ సిబ్బందిని అభినదించారు. హంతకులు వాడిన బ్యాట్‌తో పాటు రెండు సెల్ ఫోన్లు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.