YSR District: Father Molestation On his Own Daughter - Sakshi
Sakshi News home page

కుమార్తెతో మద్యం తాగించి లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో

Published Mon, Oct 4 2021 4:38 AM | Last Updated on Mon, Oct 4 2021 3:53 PM

Father Molestation On his own daughter - Sakshi

నిందితుడిని చూపుతున్న డీఎస్పీ కిషోర్‌కుమార్‌

మార్కాపురం: కన్న కుమార్తె పైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో తండ్రి. పైగా బలవంతంగా కుమార్తెతో మద్యం తాగించి.. లైంగిక దాడి వ్యవహారాన్ని తన ప్రియురాలితో వీడియో తీయించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు డీఎస్పీ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌ తెలిపారు. సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వోద్యోగి.. వైఎస్సార్‌ జిల్లాలో పని చేస్తున్నాడు. భార్య, కుమార్తె ఉన్నారు. ఇతను బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఇదిలా ఉండగా ఆ ఉద్యోగి తన 15 ఏళ్ల కుమార్తెను గత నెల 25న తన ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి.. కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు. ఆపై కుమార్తెపై లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో సెల్‌ఫోన్‌తో వీడియో తీయించాడు. ఈ ఘటన గురించి బాధిత బాలిక ఇంటికొచ్చాక తన తల్లితో చెప్పింది.

చదవండి: (ఫేస్‌బుక్‌ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి)

అదే రోజు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో పట్టణ శివారులోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ నాగరాజు చెప్పారు. నిందితుడి వద్ద ఉన్న సెల్‌ ఫోన్, అందులోని వీడియో, ఫొటోలను సీజ్‌ చేసినట్టు తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement